
రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముఖేష్ ,నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఒక ఆశ్యర్యకరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భార్య పెండెంట్‌ను కోల్పోయిందట. దీంతో సోషల్ మీడియా సంస్థలు ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌కి ఇదే కారణమంటున్న నెటిజన్లు ఛలోక్తులు వైరల్‌గా మారాయి.
గుజరాత్‌లోని జామ్ నగర్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్, క్రీడారంగ సెలబ్రిటీలతోపాటు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ , భార్య న్, బిల్ గేట్స్ ఆయన భార్య, గ్లోబల్ పాప్ ఐకాన్, రిహన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం మార్క్ భార్యప్రిస్సిల్లా చాన్ లాకెట్ మిస్ అయింది. దీంతో భారీ గందరగోళం ఏర్పడి, జుకర్‌బర్గ్ దంపతులతో పాటు అతిథులంతా మూడున్నర గంటలపాటు లాకెట్టు కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఈ ఘటనపై రెడిట్‌యూజర్ వెల్లడించడంతో నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేశారు.
అందుకే ఫేస్‌బుక్, ఇన్‌స్టా పనిచేయ లేదంటూ కమెంట్ చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే చాన్ లాకెట్టు నిజంగానే పోయిందా? ఒక వేళ పోతే మళ్లీ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
కాగా మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్‌లు నాలుగు రోజుల క్రితం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment