న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు.
స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్‌సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు.
చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment