Army officer
-
కన్న తల్లికి జవాన్ సర్ ప్రైజ్
-
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్‌ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
ఆర్మీ అధికారి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు
భువనేశ్వర్: భారత ఆర్మీకి చెందిన అధికారికి కాబోయే భార్యపై పోలీసుల దాడి ఘటన ఒడిషాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అలాగే, జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి బాధితురాలు తన రెస్టారెంట్‌ను మూసివేసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో కొంత మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేశారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. అనంతరం, ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆమె భరత్పూర్ పోలీసు స్టేషన్ వెళ్లారు. ఈ సందర్బంగా పీఎస్ కేవలం ఒక్క మహిళా కానిస్టేబుల్ మాత్రమే సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. జరిగిన విషయం చెప్పి కేసు నమోదు చేయాలని కోరగా అందుకు కానిస్టేబుల్ నిరాకరించింది. కాసేపటి తర్వాత కొందరు పోలీసులు స్టేషన్‌కు వచ్చారు.Army officer’s fiance alleges sexual assault in #Odisha. The woman spoke about the #attack on her and her fiance, an army officer, on Thursday after being discharged from #AIIMS #Bhubaneswar pic.twitter.com/xfQ7HmIz65— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) September 20, 2024ఈ సందర్భంగా తనపై దాడికి సంబంధించిన ఘటనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు మహిళా పోలీసులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను లాకప్‌లో వేసి దారుణంగా హింసించారు. ఇన్స్‌స్పెక్టర్ ర్యాంక్ ఉన్న పోలీసు, మరో నలుగురు ఆమె వద్దకు వెళ్లి బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దారుణంగా సైగలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల దెబ్బల కారణంగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తర్వాత ఆమె ఎయిమ్స్ చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో తనతో పోలీసులు ప్రవర్తించిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు.ఇక, ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా పోలీసులతో పాటు, మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆమెకు కాబోయే భర్త కోల్‌కతాలోని 22 సిక్కు రెజిమెంట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు -
Alma Cooper: మిస్ యూనివర్స్ బరిలో.. యువ ఆర్మీ ఆఫీసర్!
‘మిస్ మిచిగాన్’గా సుపరిచితురాలైన అల్మా కూపర్ ‘మిస్ యూఎస్ఏ 2024’ కిరీటాన్ని గెలుచుకుంది. నవంబర్‌లో జరగనున్న ‘2024 మిస్ యూనివర్స్’పోటీ కోసం సన్నద్ధమవుతోంది. ‘యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ’లో గ్రాడ్యుయేట్ అయిన కూపర్ ‘మిస్ మిచిగాన్ యూఎస్’ కిరీటం దక్కించుకున్న తొలి యాక్టివ్ డ్యూటీ ఆర్మీ ఆఫీసర్.వలస కార్మికురాలి కుమార్తె అయిన అల్మా కూపర్ కష్టపడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్మీ ఆఫీసర్ అయింది. అందాలపోటీలపై ఆసక్తి ఉన్న కూపర్‌కు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ‘ఆహార అభద్రత సమస్యను పరిష్కరించడానికి, ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టే కార్యక్రమాలలో క్రియాశీలంగా ΄ాల్గొంటాను’ అని చెబుతుంది 22 ఏళ్ల అల్మా కూపర్. -
సియాచిన్ పైకి మహిళా సేనాని!
‘‘సియాచిన్ మాది’’ అంటోంది పాకిస్థాన్. ‘‘కాదు, మాది’’ అంటోంది భారత్. ప్రపంచంలోనే అతి ఎత్తైయిన ఈ యుద్ధక్రేత్రంలో రెండు దేశాల సైన్యాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి. భారత్ నలభై ఏళ్ల క్రితమే ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో సైనిక చర్య జరిపి సియాచిన్‌పై నియంత్రణ సాధించినా..పాక్ తన పట్టు వీడటం లేదు. ఈ పరిస్థితిని ‘‘చక్కబరచటానికి’’ భారత సైన్యం ఇటీవలే సియాచిన్ డ్యూటీకి ప్రత్యేకంగా ఒక ఆర్మీ ఆఫీసర్నుపంపింది. ఆ ఆఫీసరే.. సుప్రీత. కెప్టెన్ సుప్రీత. సియాచిన్‌పైకి వెళ్లిన తొలి మహిళా సేనాని!భారత సైన్యంలో 40 విభాగాలు ఉంటాయి. 14 ప్రధాన ఉప–విభాగాలు ఉంటాయి. ఈ ఉప విభాగాలను ‘కోర్స్’ అంటారు. వాటిల్లో ఒకటి ‘కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’. అందులో సైనికాధికారిగా విధులు నిర్వర్తిస్తుంటారు కెప్టెన్ సుప్రీత. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున, హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంటుంది సియాచిన్ గ్లేసియర్. నది గడ్డ కట్టినట్లుగా ఉండే ఆ ్ర΄ాంతంలో కెప్టెన్ సుప్రీతకు డ్యూటీ పడింది! ఈ నెల 18నే.. వెళ్లి చేరారు. సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి ఉమన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో.. ఒక అరుదైన విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కొత్తగా పెళ్లయిన ఒక యువ జంటలో – భర్త ఒక సైనిక దళానికి, భార్య మరొక దళానికి నేతృత్వం వహించారు! భర్తది తమిళనాడు. భార్యది కర్ణాటక. అనుకోకుండా ఇద్దరికీ ఢిల్లీ వేడుకల్లో దళాలను పరేడ్ చేయించే అవకాశం వచ్చింది. ఆ భర్త.. మేజర్ జెర్రీ బ్లైజ్. ఆ భార్య.. కెప్టెన్ సుప్రీత. అసలు మహిళలు ఆర్మీలోకి రావటమే గొప్ప సంగతైతే, సుప్రీత అక్కడి నుంచి సియాచిన్ వరకు ‘ఎదగటం’ చెప్పుకోదగ్గ విశేషం. భారత సైన్యంలో ఆమె కెరీర్ 2021లో లెఫ్ట్‌నెంట్‌గా మొదలైంది. చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒ.టి.ఎ.)లో ఆమె శిక్షణ ΄పోందారు. కాలేజ్‌లో ఎస్సీసీతో మొదలైన ఆమె దేశ రక్షణ దళ ప్రయాణం.. ముందు వరుస యుద్ధక్షేత్రం వరకు దృఢచిత్తంతో ముందుకు సాగింది.సుప్రీత మైసూర్ అమ్మాయి. అక్కడి కృష్ణరాజనగరంలోని సెయిట్ జోసెఫ్ స్కూల్లో చదివారు. మైసూరులోనే మరిమల్లప్ప ప్రీ–యూనివర్శిటీ కాలేజ్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవటానికి ముందు, జె.ఎస్.ఎస్. లా కాలేజ్‌లో డిగ్రీ చేశారు. ఆమె తండ్రి తిరుమల్లేశ్ మైసూరు దగ్గరి తలాకాడులోపోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. తల్లి నిర్మల గృహిణి. ఆర్మీపై తనకున్న ఇష్టాన్ని గౌరవించిన తన తల్లిదండ్రుల ్ర΄ోత్సాహంతో సుప్రీత ఎన్సీసీలో ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్ సాధించారు. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (రాజ్‌పథ్)లో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్ణాటక–గోవా నడిపించారు. 2016లో ఆలిండియా వాయు సైనిక్ క్యాంప్‌లో కర్ణాటకకు ్ర΄ాతినిధ్యం వహించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ అయ్యాక సియాచిన్‌ను అధిరోహించటానికి మళ్లీ ఓ.టి.ఎ.లో చేరారు. శిక్షణలో భాగంగా ఆమెను వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన అనంత్‌నాగ్, జబల్పూర్, లేహ్ ్ర΄ాంతాలకు పంపించారు. ఆ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు సుప్రీత. సుప్రీత, బ్లేజ్‌ల వివాహం గత ఏడాదే జరిగింది. సుప్రీత మామ గారు రిటైర్డ్ కల్నల్ రిచర్డ్ బ్లెయిజ్. సుప్రీత అత్తగారు లెఫ్ట్‌నెంట్ కల్నల్ విజయలక్ష్మి. పుట్టినింటి, మెట్టినింటి రెండూ ్ర΄ోత్సాహాలు సుప్రీత కెరీర్‌కు కలిసి వచ్చాయనే అనుకోవాలి. అంతకంటే కూడా ఆమె దీక్ష, పట్టుదల. -
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పెన్షన్, పీఎఫ్‌పై వివాదం.. స్పందించిన ఆర్మీ
అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన అన్షుమాన్ సింగ్‌కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసిందిఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.అయితే కోడలు స్మృతి సింగ్‌పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA— The Hindu (@the_hindu) July 14, 2024 వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు. -
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
ఆర్మీ ఆఫీసర్ ఏకబిగిన 25 పుల్-అప్లు : నెటిజన్లు ఫిదా
మంచి రోగ నిరోధక శక్తి, శారీరక దృఢత్వం కావాలంటే నిరంతర వ్యాయాయం చాలా కీలకం. దీనికి వయసుతో సంబంధంలేదు. అందులోనూ సైన్యంలో పనిచేసేవాళ్లకి ఫిట్నెస్ చాలా అవసరం. భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ప్రసన్న జోషి ఇదే నిరూపించారు. ఈయన్ ఫిట్‌నెస్‌కు ముగ్ధుడైన మాజీ సైనికాధికారి ఎక్స్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.మేజర్ జనరల్ ప్రసన్న జోషి 56 ఏళ్ల వయసులో ఏకబిగిన 25 పుల్-అప్లు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ జేఎస్ సోధి షేర్ చేశారు. ‘ఆయన ఫిట్నెస్కి సెల్యూట్..2022, అక్టోబరులో భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట శక్తిగా జర్మన్ ప్రచురణ స్టాటిస్టా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు. భారత సైన్యానికి గర్వకారణం... జై హింద్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ చేశారు. దీంతో యువ ఆర్మీ అధికారులు, నెటిజన్లు జోషి ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించారు. ‘సిగ్గు పడుతున్నాను.. ఈ వీడియో జిమ్‌కు వెళ్లేలా ప్రేరేపించింది’ అంటూ భారతీయ వైమానిక దళ అనుభవజ్ఞుడు వినోద్ కుమార్ తెలిపారు. ప్రసన్న జోషి శారీరక దృఢత్వం భారత సైన్యం అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబం. ఆయన అంకితభావం, దేశానికి చేసిన సేవకు వందనం చేస్తున్నామంటూ మరో యూజర్ రాహుల్ థాపా పేర్కొన్నారు.Salute and respect to the physical fitness of Major General Prasanna Joshi of the Indian Army. No wonder the Indian Army has been rated as the finest fighting force in the world by the German publication Statista in October 2022. Proud of the Indian Army. Jai Hind🇮🇳 #IndianArmy… pic.twitter.com/xuCPTcHqfh— Lt Col JS Sodhi (Retd) (@JassiSodhi24) June 29, 2024 -
ప్రాణం తీసిన చైనా మాంజా!
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: హైదరాబాద్‌కు అక్రమంగా దిగుమతి అయిన చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో ఉన్న మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య ప్రత్యూష, రెండేళ్ల కుమార్తెతో కలిసి బాపునగర్‌లో నివసిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై బాపునగర్ నుంచి లంగర్‌హౌస్ వైపు వస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఆయన మెడకు ఎగురుకుంటూ వచ్చి న పతంగికు కట్టిఉన్న చైనా మాంజా చుట్టుకుంది. ఆయన అప్రమత్తమయ్యేలోపే మాంజా గొంతుకు బిగుసుకుని కోసుకుపోయింది. దీంతో గొంతుపై తీవ్రగాయమై కోటేశ్వర్‌రెడ్డి వాహనంపైనుంచి కింద పడిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం ఆయన పనిచేసే మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. కోటేశ్వర్‌రెడ్డి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.30 సమయంలో కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కట్టడి చేసినా.. విచ్చలవిడిగా... మనుషులతో పాటు పక్షులు, ఇతర ప్రాణులకు ముప్పు కలిగించే చైనా మాంజాను కట్టడి చేయా లని నగర పోలీసులు గత నెల నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మాంజా రవాణా, నిల్వ, విక్రయంపై నిఘా ఉంచి అనేక కేసులు నమోదు చేశా రు. అయినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా అనేక మంది వ్యాపారులు చైనా మాంజాను అక్రమంగా తీసుకువచ్చి విక్రయించారు. శని, ఆదివారాల్లో ఈ మాంజా ప్రభావం నగరవ్యాప్తంగా కనిపించింది. అనేక మంది వాహనచోదకులు దీని బారినపడి గాయప డ్డారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో పక్షులు ఈ మాంజా కారణంగా తీవ్రంగా గాయపడటం, చనిపోవడం కనిపించింది. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లు ‘డేంజర్ జోన్లు’గా మారాయి. మాంజా కారణంగా వాహనాలు సడన్‌గా వేగాన్ని తగ్గించడం.. వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను సీనియర్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
పౌల్ట్రీ రంగంలో లాభాలతో దూసుకుపోతున్న రిటైర్ ఆర్మీ ఉద్యోగి
-
తప్పిదాలను సరిచేసుకుంటున్నాం
న్యూఢిల్లీ: ‘‘గుర్తింపుకు నోచుకోని యోధులను, అమర వీరులను భారత్ ఇప్పుడు స్మరించుకుంటోంది. తద్వారా పాత తప్పిదాలను సరి చేసుకుంటోంది. తన ఘన వారసత్వాన్ని పండుగలా జరుపుకుంటోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వలస పాలనలో రచించిన కుట్రపూరిత చరిత్ర వల్ల మన యోధులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. 1670ల్లో మొఘల్ సైన్యంపై పోరాడిన అహోం (అస్సాం) సైనికాధికారి లచిత్ బర్ఫూకన్ 400వ జయంతి వేడుకలు శుక్రవారం ఢిల్లీలో జరిగాయి. వాటిలో మోదీ ప్రసంగించారు. ‘‘దేశ చరిత్రంటే కేవలం బానిసత్వం గురించే కాదు. వీర సైనికుల పోరాటాలు, త్యాగాలు కూడా. చరిత్రంటే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల పరిణామాలు మాత్రమే కాదు. నిరంకుశత్వం, దౌర్జన్యాలపై అసమాన ధైర్య సాహసాలతో జరిపిన పోరాటమే మన చరిత్ర’’ అన్నారు. దేశం కంటే ఏ బంధమూ గొప్ప కాదు స్వాతంత్య్రానంతరం కూడా వలసవాద భావజాలం కొనసాగిందని, చరిత్రను కుట్రపూరితంగా లిఖించడం దురదృష్టకరమని మోదీ అన్నారు. ‘‘రక్త సంబంధం కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యమని లచిత్ భావించారు. తప్పు చేస్తే దగ్గరి బంధువులనూ శిక్షించారు. కుటుంబాన్ని, కుటుంబ వారసత్వాన్ని పక్కనపెట్టి దేశం కోసం నిస్వార్థంగా పని చేయాలని గొప్ప సందేశమిచ్చారు. దేశ ప్రయోజనాల కంటే ఏ బంధమూ గొప్ప కాదని ఆయన జీవితం బోధిస్తోంది’’ అన్నారు. చిన్నారులతో ప్రచారం మోదీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చిన్న పిల్లలను వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నట్లున్న ఓ చిన్నారి వీడియోను ప్రధానితోపాటు, కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై పార్టీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. ‘‘ఇది పిల్లల హక్కులకు భంగం కలిగించడమే. తీవ్రమైన అంశమైనందున బాధ్యులపై చర్యలు తీసుకోండి’’ అ ని కోరింది. -
హాట్ టాపిక్‌గా పుతిన్ ఆరోగ్యం.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దిగినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలన్ని పుతిన్ ఆరోగ్యంపై దృష్టి సారించాయి. పుతిన్ ఆరోగ్యం విషమంగా ఉందని ఇక ఆయన ఎన్నోరోజులు బతకరు అంటూ పలు వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత యూకే ఇంటెలిజెన్స్ పుతిన్‌కి క్యాన్సర్ అంటూ ఒక నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత గతేడాది మార్చిలో ఆయనపై హత్యయత్నం జరిగిందని త్రుటిలో తప్పించుకున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పడు మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గుప్పుమంటున్నాయి. పుతిన్ ఆరోగ్యం బాగోలేదంటూ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పుతిన్ శరీరం రంగుమారిందని, వింత వింత గుర్తులు ఉన్నాయంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక రిటైర్డ్ బ్రిటీష్ ఆర్మీ అధికారి, హౌస్ లార్డ్స్ సభ్యుడు రిచర్డ్ డానాట్ ఒక మీడియా సమావేశంలో పుతిన్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. పుతిన్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. అతని చేతులు ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉన్నాయని, ఇలా ఏవైనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడూ శరీరం కమిలి ఇలా రంగు మారుతుందని తెలిపారు. ఇతర భాగాల నుంచి ఇంజెక్షన్ తీసుకోలేనప్పుడూ ఇలా జరుగుతుందని చెబుతున్నారు. నిపుణులు కూడా పుతిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సంకేతం అని తేల్చి చెప్పారు. పుతిన్ ఇటీవలె 70 ఏళ్ల వయసులో అడుగుపెట్టారు. వయసు రీత్యా సమస్యలు ఉండటం అత్యంత సహజం. గానీ ఈ రష్యా ఏ ముహర్తానా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిందో అప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం పెద్ద హాట్‌టాపిగా మారిపోయింది. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
టు లెట్.. టేక్ కేర్
హిమాయత్‌నగర్: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్ నంబర్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్సైట్లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్‌కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్ ముందుగానే మీ అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు. అవి పంపినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు. (చదవండి: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి) -
Army Officer: తల్లికి తగ్గ తనయుడు
చెన్నై: తన తల్లి అడుగుజాడల్లో నడిచి తాను అనుకున్నది సాధించాడు ఓ యువకుడు. తల్లికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. తల్లి ఎక్కడైతే శిక్షణ తీసుకుని ఆర్మీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్చించారో అదే అకాడమీ నుంచి 27 ఏళ్ల తర్వాత ఆర్మీ ఆఫీసర్‌గా ఎదిగాడు రిటైర్డ్ మేజర్ స్మితా చతుర్వేది కుమారుడు. తల్లీకుమారుల ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది భారత రక్షణ శాఖ. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇటీవలే వేడుకలు నిర్వహించారు. మాల్దీవులకు చెందిన సైన్యాధినేత మేజర్ జెనరల్ అబ్దుల్లా శామాల్ హాజరయ్యారు. ఆ ప్రత్యేక రోజున రిటైర్డ్ మేజర్ స్మితా, ఆమె కుమారుడు ఉన్న ఫోటోను రక్షణ శాఖ చెన్నై అకాడమీ ప్రతినిధి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘27 ఏళ్ల క్రితం 1995లో రిటైర్డ్ మేజర్ స్మితా చతుర్వేది చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీ నుంచే సైన్యంలో చేరారు. అదే అకాడమీ నుంచి అదే రీతిలో ఆమె కుమారుడు సైతం సైన్యంలోకి వచ్చారు.’ అని రాసుకొచ్చారు. A rare euphoric moment for a Lady Officer: Major Smita Chaturvedi (Retd) Commissioned from Officers Training Academy, Chennai before 27 years in 1995, saw her son getting Commissioned in the same manner in the same Academy today. @artrac_ia @SpokespersonMoD @DefenceMinIndia pic.twitter.com/hGRaAbQS0k — Defence PRO Chennai (@Def_PRO_Chennai) July 30, 2022 ఇదీ చదవండి: రాకెట్ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్ ఆఫర్ -
హనీట్రాప్‌లో డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్/ పహాడీషరీఫ్: హనీట్రాప్‌లో పడి దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు చేరవేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), బాలాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన దుక్కా మల్లికార్జున్‌రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టు (29) ఇంజనీరింగ్ పూర్తయ్యాక స్థానికంగా ఓ కంపెనీలో పనిచేసి 2018లో పటాన్‌చెరులోని క్వెస్ట్ కంపెనీలో చేరాడు. ఈ సమయంలో క్వెస్ట్ కి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్డీఎల్) నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మీద మల్లికార్జున్‌రెడ్డి 2020 జనవరి వరకు పని చేశాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ఫిబ్రవరిలో మల్లికార్జున్‌రెడ్డి నేరుగా డీఆర్డీఎల్ అధికారులను సంప్రదించి.. అడ్వాన్స్డ్ నావెల్ సర్వీస్ ప్రొవైడర్ (ఏఎన్ఎస్పీ) ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు. ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి..: ఈక్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తాను డీఆర్డీఎల్లో పనిచేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రొఫైల్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. 2020 మార్చిలో మల్లికార్జున్‌కు పాకిస్తా న్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం ప నిచేస్తున్న నటాషారావు అలియా స్ సిమ్రన్ చోప్రా అనే మహిళ నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావటంతో యాక్సెప్ట్ చేశాడు. అలా స్నేహం పెంచుకున్న నటాషారావు, మల్లికార్జున్ చేస్తున్న వృత్తి, పని ప్రదేశం, కంపెనీ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. మల్లికార్జున్ రహస్య సమాచారాన్ని కూడా నటాషారావుకు చేరవేశాడు. అంతేకాకుండా మల్లికార్జున్ తన బ్యాంక్ ఖాతా నంబర్, ఇతరత్రా వివరాలను నటాషాకు పంపించాడు. ఈ నేపథ్యంలో డీఆర్డీఎల్ రహస్యాలు లీకవుతున్నాయని సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, బాలాపూర్ పోలీసులు మల్లికార్జున్‌ను మీర్పేట్ త్రివేణినగర్‌లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, సిమ్‌కార్డ్, లాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!
British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్‌లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్‌లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. (చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!) అయితే ఆమె జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది. అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్‌లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్ ప్రీతీ" క్యాప్షన్‌ని జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ మేరకు బ్రిటీష్ సైన్యం ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు. (చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు) View this post on Instagram A post shared by Preet Chandi (@polarpreet) -
ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు
చెన్నై: ఎంతటి వాడైన, ఎన్ని తప్పులు చేసిన ఏదో ఒక రోజు చేసిన నేరాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలా వంద మందిపైగా మహిళలను వేధించిన సైకోకి చెన్నై పోలీసులు చెక్ పెట్టారు. నార్త్ జగన్నాధన్నగర్కు చెందిన దినేష్ కుమార్ ఇటీవల ఓ రోజు ఆర్మీ అధికారి కూతురును వేధించడంతో దినేష్ బండారం మొత్తం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని క్యాటరింగ్ కళాశాలలో చదువుతున్న దినేష్ కుమార్, కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులలో పాల్గొంటూ, చెన్నై ఎగ్మోర్ పరిసరాల్లోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే అతను రాత్రి లేదా ఉదయాన్నే ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించేవాడు. ఈ క్రమంలో గత వారం ఓ యువతి తన సోదరి, తండ్రి ఆర్మీ ఆఫీసర్‌తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా, ఆ సమయంలోనే దినేష్ ఉద్యోగానికి పోతున్నాడు. అయితే ఆ యువతి తన ఇద్దరు కుటుంబ సభ్యుల వెనుక నడుస్తోంది. (చదవండి: Drown In Pond:‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’.. ) దీంతో తను ఒంటరిగా ఉందని భావించి తనతో ఆసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన మహిళ తండ్రి దినేష్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పటికే అతను బైకు మీద ఉడాయించాడు. ఆర్మీ ఆఫీసర్ అతని బండి నంబర్ని నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని బైకు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అతని బండిని ట్రాక్ చేయడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీని పరీశిలించారు. చివరికి అతని ఆచూకి కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఇప్పటివరకూ 100 మంది మహిళలను వేధించానని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘ -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో అమరుడైన ఆర్మీ జేసీఓ
శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) అమరుడైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రాజౌరీలోని తనమండి బెల్ట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు తిప్పికొట్టాయని పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూ డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మాట్లాడుతూ...ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన అమరుడయ్యారని తెలిపారు. -
డెత్ సర్టిఫికెట్ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం, సైన్యంలోనే కల్నల్ హోదాలో పనిచేస్తున్న ఆయన కుమారుడు జీహెచ్ఎంసీతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు మంత్రి కేటీఆర్ స్పందించడంతో సమస్య పరిష్కారమైంది. సైన్యంలో పనిచేసి పదవీ విరమణ అనంతరం సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో నివసిస్తున్న సత్యబ్రత దాస్‌గుప్తా (84)ఈ నెల 9వ తేదీన మృతి చెందారు. ఆయన కుమారుడు కల్నల్ జాయ్ దాస్‌గుప్తా కూడా ఒక బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న జాయ్, తండ్రి మరణవార్త తెలుసుకుని నగరానికి వచ్చారు. ఎన్నో ఇబ్బందుల మధ్య నేరేడ్మెట్ శ్మశానవాటికలో తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. తిరిగి విధుల్లో చేరాల్సి ఉండటంతో, తండ్రి డెత్ సర్టి ఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీన శ్మశానవాటికకు వెళ్లారు. అయితే శ్మశాన వాటిక నిర్వాహకులు అంత్యక్రియలకు సంబంధించిన రశీదు ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో మరణాలు పెరిగి, రశీదు పుస్తకాలు అయిపోయాయని, జీహెచ్ఎంసీ నుంచి కొత్త పుస్తకాలు రాలేదని వారు తెలిపారు. విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు కల్నల్ జాయ్ జీహెచ్ఎంసీ యాప్‌లో ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినా సమస్య పరిష్కారం కాలేదు. జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా వారు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పనిచేస్తున్న ఒకరు, దాస్‌గుప్తా పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్‌కు ఈ నెల 13వ తేదీన ట్వీట్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి, అధికారులతో మాట్లాడి సోమవారం డెత్ సర్టిఫికెట్ జారీ చేయించారు. ఇకముందు ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్ సూచించారు. -
Salaar: ప్రభాస్ డబుల్ యాక్షన్!
హీరో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా మారారు. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రం రూపొందుతోంది కదా. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్ పాత్ర అని ఫిల్మ్‌నగర్ టాక్. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయట. మరి... ప్రభాస్ ఇందులో రెండు పాత్రలు చేస్తున్నది నిజమే అయితే ఇంకో పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘సలార్’ షూటింగ్‌కి బ్రేక్ పడింది. కోవిడ్ వ్యాప్తి తగ్గిన తర్వాత తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. చదవండి: విషాదం: నటుడు కుట్టి రమేష్ కన్నుమూత -
ఆర్మీ అధికారి భార్య, కూతురు ఆత్మహత్య
వేలూరు: రైలు కిందపడి తల్లీకుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వేలూరు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు సమీపంలోని విరింజిపురం గ్రామానికి చెందిన రాజేశ్‌కుమార్ మేఘాలయలో ఆర్మీ అధికారి. ఇతని భార్య జయంతి(29), కుమార్తె నందిత(4) సొంత గ్రామంలో ఉంటున్నారు. రాజేశ్‌కుమార్ 20 రోజుల క్రితం సెలవుపై వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య శనివారం రాత్రి గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపం చెంది జయంతి ఆదివారం ఉదయం కుమార్తె నందితతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తల్లి, కుమార్తె ఇద్దరూ కలిసి విరింజిపురం వద్ద రైలు వచ్చే సమయంలో రైలు పట్టాలపై నిలబడ్డారు. రైలు ఢీకొని తల్లీ కుమార్తె ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చెరువులో మునిగి పిల్లలు సహా తండ్రి మృతి సాక్షి, చెన్నై:సెంబరంబాక్కం చెరువుకు వెళ్లిన తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతిచెందారు. కుండ్రత్తూరు సమీపంలోని తిరువళ్లువర్ నగర్‌కు చెందిన ఉస్మాన్ ఆదివారం సెలవు దినం కావడంతో కుమారుడు, కుమార్తెతో సమీపంలోని సెంబరంబాక్కం చెరువును చూసేందుకు వెళ్లారు. తండ్రితో కలిసి సరదాగా ఆడుకుంటూ, అక్కడున్న గోపురం వద్దకు పిల్లలు వెళ్లారు. అక్కడి నుంచి నీటిని చూస్తుండగా ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత మరొకరు పిల్లలు పడిపోయారు. దీనిని గుర్తించిన ఉస్మాన్ పిల్లల్ని రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. సమీపంలో ఉన్న వాళ్లు సైతం నీళ్లలోకి దూకి రక్షించే యత్నం చేశారు. ఉస్మాన్‌ను బయటకు తీసుకు రాగా, ఆయన మృతిచెందాడు. అయితే, ఇద్దరు పిల్లలు చెరువు బురదలో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి ఆ పిల్లల మృతదేహాల కోసంగా లిస్తున్నారు. చదవండి: విషాదం: 20 అడుగుల ఎత్తుకు ఎగిరి.. -
దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు!
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దిశా ఫ్యామిలీకి చెందిన ఓ న్యూస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. దిశాకు సోదరి ఖుష్బూ, సోదరుడు సూర్యన్ష్ పటాని ఉన్నారు. సినిమా రంగంలో దూసుకుపోతున్న దిశాపటాని గురించి అందరికి తెలుసు కానీ ఆమె సోదరి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. దిశా సోదరి ఖుష్బూ ఏ వృత్తిలో ఉందో తెలుసా. ఆమె ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్నెస్ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్, వర్కౌట్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఖుష్బూ వృత్తి తెలిసిన వారందరూ ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. కదన రంగంలో సేవలందిస్తున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆర్మీ ట్రైనింగ్‌లో ఉన్న ఖుష్బూ ఫోటోలు, ఇద్దరు సోదరీమణులు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఇద్దరు సోదరీమణులు విభిన్నరంగాలు ఎంచుకొని ఎవరి రంగంలో వారు విజయం సాధించడం గొప్ప విషయంగా ఫాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోలు హీరోయిన్లలో ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన వారు చాలామందే ఉన్నారు. అక్షయ్ కుమార్ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఇక హీరోయిన్లలో ప్రీతీ జింటా.. ప్రియాంక చోప్రా.. అనుష్క శర్మ లాంటి వారు ఆర్మీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే. -
ఆర్మీ అధికారి చనిపోతే ఇంత ఘోరమా?
బెంగళూరు: ఆర్మీ అధికారిగా సేవలందిస్తోన్న తన కుమారుడిని కడచూపు చూడాలని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అందుకోసం ఏకంగా 2,600 కి.మీ ప్రయాణించారు. వివరాలు.. ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పురస్కార గ్రహీత నవజోత్ సింగ్ ఆర్మీ ప్రత్యేక దళాల విభాగంలో పని చేస్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గురువారం బెంగుళూరులో కన్నుమూశారు. అయితే ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న తమ తల్లిదండ్రులు బెంగళూరు రావడానికి ఏర్పాట్లు చేయాలని ఆ అధికారి సోదరుడు నవతేజ్ సింగ్ బాల్ కోరారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందును తాము రావడానికి ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. (కరోనా మిస్టరీలు) అయితే దీనికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో తాము ఎలాంటి సహాయం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో చేసేదేం లేక కల్నల్ కుటుంబ సభ్యులు రోడ్డు మార్గంలో కారులో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలను కల్నల్ సోదరుడు నవతేజ్ సింగ్ సోషల్ మీడియాలో వివరిస్తూ వచ్చారు. ఈ విషయం గురించి మాజీ ఆర్మీ అధికారి వీపీ జనరల్ ట్విటర్లో స్పందిస్తూ.. "నా ప్రగాఢ సానుభూతి. క్షేమంగా ప్రయాణించండి. దీనికి భారత ప్రభుత్వ అధికారులు మీకు ఎలాంటి సహాయం చేయకపోవడం విచారకరం. చట్టాలేవీ బండరాళ్లపై రాయరు కదా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని మార్చుకోవాలి" అని ఘాటుగా కామెంట్ చేశారు. మరొకవైపు ఎలాంటి సహాయం చేయకుండా ఆ కుటుంబాన్ని అవమానించారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి(చెట్టంత కొడుకే పోయాడు.. ఆ బూడిదతో ఏం పని?)