
అదృశ్యమైన ఆర్మీ అధికారి యూపీలో తేలాడు
ఫైజాబాద్: అదృశ్యమైన ఆర్మీ అధికారి కెప్టెన్ శిఖర్ దీప్ ఆచూకీ లభ్యమైంది. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో ఆయన ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని శిఖర్ దీప్ తండ్రి ధ్రువీకరించారు. శనివారం ఉదయం తనతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు. బిహార్కు చెందిన శిఖర్ దీప్ జమ్ము కశ్మీర్లో సైన్యంలో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ అనంత కుమార్ కూడా సైన్యంలో పనిచేస్తున్నారు.
ఈ నెల 6న బిహార్ నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్తుండగా శిఖర్ దీప్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా ఆయన లగేజీ, ఫోన్ బోగీలోనే ఉన్నాయి. ఆ మరుసటి రోజు ఢిల్లీలో శిఖర్ దీప్ బంధువు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఉగ్రవాదులు ఎవరైనా శిఖర్ను కిడ్నాప్ చేసి ఉంటారా అనే అనుమానాలను ఆయన తండ్రి వ్యక్తం చేశారు. శిఖర్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శిఖర్ గమ్యస్థానానికి చేరకుండా అదృశ్యంకావడం, ఆయన ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారన్న విషయాలు తేలాల్సివుంది.