
‘మిస్ మిచిగాన్’గా సుపరిచితురాలైన అల్మా కూపర్ ‘మిస్ యూఎస్‌ఏ 2024’ కిరీటాన్ని గెలుచుకుంది. నవంబర్‌లో జరగనున్న ‘2024 మిస్ యూనివర్స్’పోటీ కోసం సన్నద్ధమవుతోంది. ‘యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ’లో గ్రాడ్యుయేట్ అయిన కూపర్ ‘మిస్ మిచిగాన్ యూఎస్’ కిరీటం దక్కించుకున్న తొలి యాక్టివ్ డ్యూటీ ఆర్మీ ఆఫీసర్.
వలస కార్మికురాలి కుమార్తె అయిన అల్మా కూపర్ కష్టపడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్మీ ఆఫీసర్ అయింది. అందాలపోటీలపై ఆసక్తి ఉన్న కూపర్‌కు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ‘ఆహార అభద్రత సమస్యను పరిష్కరించడానికి, ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టే కార్యక్రమాలలో క్రియాశీలంగా ΄ాల్గొంటాను’ అని చెబుతుంది 22 ఏళ్ల అల్మా కూపర్.
Comments
Please login to add a commentAdd a comment