ఆశా నేగీ.. హిందీ ‘బిగ్ బాస్’, ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోస్ చూసేవారికి బాగా తెలిసిన పేరు. ఒక షోలో ఆమె పార్టిసిపెంట్, మరొక షోకి ఆమె హోస్ట్. రియాలిటీ షోసే కాదు సీరియల్స్, స్పోర్ట్స్, మూవీస్, సిరీస్.. ఇలా చాలా క్రెడిట్సే ఉన్నాయి ఆమెకు!
– ఆశా పుట్టిపెరిగింది ఉత్తరాఖండ్ రాజధాని డెహరాడూన్‌లో. అక్కడి డీఏవీ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ టైమ్‌లోనే అందాల పోటీలో పాల్గొని ‘మిస్ ఉత్తరాఖండ్’ క్రౌన్ గెలుచుకుంది.
– గ్రాడ్యుయేషన్ తర్వాత ఆశాకు బెంగళూరులోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్సల్టన్సీలో ఉద్యోగం వచ్చింది. అందులో కొన్నాళ్లు వర్క్ చేశాక కాల్ సెంటర్‌కి మారింది.
– తను చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగాలేవీ నచ్చకపోవడంతో గ్లామర్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుని ముంబైకి మకాం మార్చింది. ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా వెళ్లి అటెండ్ అవసాగింది. ఆ ప్రయత్నాల్లోనే ‘సప్నోం సే భరే నైనా’ అనే టీవీ సీరియల్‌లో అవకాశం వచ్చింది. కానీ అది ఆమెకు అంతగా గుర్తింపునివ్వలేదు.
తర్వాత ‘పవిత్ర్ రిశ్తా’ అనే సీరియల్‌లో నటించింది. దాంతో ఆశాకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆ పాపులారిటీనే ఆమెకు ‘బిగ్ బాస్’ (సీజన్ 6) హౌస్‌కి వెళ్లే చాన్స్‌ను తెచ్చింది. ‘నచ్ బలియే’ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీనీ ఇచ్చింది.
ఆశాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చక్కగా ఆడుతుంది. అందుకు స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ రెండు సీజన్లే ఉదాహరణలు. సీజన్ 1 ఢిల్లీ డ్రాగన్స్ తరఫున, సీజన్ 2లో కోల్‌కతా బాబూ మోశాయ్స్ తరఫున ఆడింది.
సాహసాలకూ ఆమె వెనుకాడదు. ఆ ముచ్చట తీర్చుకోవడానికి ‘ఖత్రోంకే ఖిలాడీ’ సీజన్ 6లో పాల్గొని సెమీఫైనల్ దాకా వెళ్లింది.
ఆశా యాక్టింగ్ టాలెంట్ చూసి అనురాగ్ బసు తన ‘లూడో’ సినిమాలో వేషం ఇచ్చాడు. తన పాత్ర పరిధిలో చక్కగా అభినయించింది. తర్వాత ‘కాలర్ బాంబ్’ అనే సినిమాలోనూ నటించింది.
సీరియల్, సినిమా, సిరీస్.. ఏదైనా సరే.. నటనకు అవకాశం ఉంటే చాలు అనుకునే ఆశా అందుకు తగ్గట్టుగానే ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది.. ‘బారిష్’ అనే సిరీస్‌తో. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇండస్ట్రీ’తో వీక్షకులను అలరిస్తోంది.
"పేరుకు తగ్గట్టే నేను ఆశా జీవిని. ఆ తత్వమే ఇండస్ట్రీలో నన్ను లైవ్‌గా ఉంచుతోంది." – ఆశా నేగీ
ఇవి చదవండి: Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్!
Comments
Please login to add a commentAdd a comment