
ఇటీవల బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీలుగా నిలిచినవి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ పుష్ఫ2, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఛావా మూవీలు. ఈ రెండు మూవీల్లో హీరోలిద్దరివి ఓ డిఫరెంట్ లుక్. అదికూడా సహజసిద్ధంగా ఆయా పాత్రలో హీరోలు ఒదిగిపోయూలా చూపించాలి. అలా తెరపై కనిపించేలా చేసే మహిళా మేకప్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?. అది అలాంటి ఇలాంటి మేకప్ కాదు. అత్యంత విలక్షణమైన మేకప్‌ని వేస్తుందామె. అసలు ఆమెలాంటి మేకప్ ఆర్టిస్టులు దొరకడం కూడా అరుదు..
ఆమెనే ప్రఖ్యాత మహిళా మేకప్ అండ్ ప్రోస్థటిక్ ఆర్టిస్ట్ ప్రీతిషీల్ సింగ్ డిసౌజా. పుష్ప, చావా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, పుష్ప: ది రైజ్, మామ్, బాలా, ముల్క్, అంధాధున్, హైదర్, రంగూన్, రోమియో అక్బర్ వాల్టర్, బచ్చన్ పాండే, బంటీ ఔర్ బాబ్లి 2, చుప్ వంటి మూవీలలోని హీరోలందరికి మంచి లుక్ ఇచ్చింది ఆమెనే.
ఆ మూవీలలో హీరోల పాత్ర చాలా విలక్షణమైనది అందుకు తగ్గట్టుగా ఆ రోల్‌లో వాళ్లు ఒదిగిపోయినట్లుగా సహజసిద్ధంగా కనిపించడం వెనుక ఆమె ప్రొస్థటిక్ మేకప్ నైపుణ్యం ఎంతో ఉంది. అంతేగాదు ఆమె ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డుని అందుకుంది కూడా. ఆమె అందిరిలా మేకప్ వేయడం కాకుండా విలక్షణమైన ప్రొస్థటిక్ మేకప్‌లో ప్రావీణ్యం సంపాదించింది.
ఇదేంటంటే సహజసిద్ధమైన బట్టతల, గాయాలు, అలాగే ఏజ్‌ని తక్కువ చేసి చూపించే మేకప్ నైపుణ్యం ఇది. ఈ నైపుణ్యం పదిమందికి నేర్పేలా తన భర్త డిసౌజాతో కలిసి తొలి మేకప్ అండ్ ప్రోస్థటిక్ స్టూడియో స్కూల్‌ని ప్రారంభించి వర్క్‌షాప్‌లు నిర్వహించింది.
ఈ మేకప్‌లో ప్రోస్థటిక్ ముక్కలతో సహజత్వం ఉట్టిపడేలా చేస్తారు. ఇది విగ్ మేకింగ్ నుంచి బట్టతల క్యాప్స్, వృద్ధాప్యం, క్యారెక్టర్ మేకప్, కాలిన గాయలు, మచ్చలతో కూడిన ముఖం వరకు తదితరాలన్ని నిజంగానే వచ్చాయనే ఒరిజినాలిటిని ఉట్టిపడేలా చేస్తుంది ఈ మేకప్.
ఈ నైపుణ్యాన్ని తస స్టూడియో ద్వారా ఔత్సాహిక విద్యార్థులకు నేర్పిస్తోంది. ఆచరణాత్మక శిక్షణను ఇస్తోంది ప్రీతిషీల్. నిజానికి ఆమె స్టార్ చేసిన ఈ వర్క్ షాప్ విజయవంతమైంది. ఈ కళను నేర్చుకునేందుకు దేశంలోని వివిధప్రాంతాల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. అంతేగాదు ఆమె తన వర్క్‌షాప్‌కి ఇంతలా అనూహ్య స్పందన వస్తుందని ఊహించలేదని సంతోషంగా చెబుతోంది.
తన కళ వాస్తవికతను తలపించే నైపుణ్యం అని, ఈ అపారమయైన జ్ఞానం, స్కిల్స్‌ని నలుగురికి అందించడమే తన లక్ష్యం అని అంటోంది. ఈ కళను ప్రపంచస్థాయికి తీసుకురావాలనేది తన ఆకాంక్ష అని చెబుతోంది. తన మేకప్ స్కూల్‌లో అత్యాధునిక సౌకర్యాల తోపాటు అనుభవజ్ఞులైన మేకప్ నిపుణలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించింది.
(చదవండి: వర్క్ షేరింగ్‌తో ఆమె ముఖంలో చిరునవ్వులు తెప్పిద్దామిలా..!)
Comments
Please login to add a commentAdd a comment