సంవత్సరమంతా జంట స్వరంగా... | inspire success story about tollywood serial actors couples | Sakshi
Sakshi News home page

సంవత్సరమంతా జంట స్వరంగా...

Published Tue, Dec 31 2024 12:32 AM | Last Updated on Tue, Dec 31 2024 7:12 AM

inspire success story about tollywood serial actors couples

కలసి పాడుదాం బతుకు పాట... కలసి సాగుదాం వెలుగు బాట... అన్నట్టు ప్రతి దంపతులు ఒకరికి ఒకరై ముందుకు సాగితే  ఏ కాలమైనా మంచికాలంగానే ఉంటుంది. భార్య భర్త జీవననౌకకు ఉమ్మడి చుక్కానిగా మారాలి.  కలతలు చిన్నవయ్యి ఆనందాలు పెద్దవవ్వాలి. కుటుంబం బాగుంటే సమాజం, దేశం బాగుంటాయి. మనకు తెలిసిన ఈ సెలబ్రిటీ జంటలు ఆ మాటే చెబుతున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.

మనవాళ్లెవ్వరో తెలిసింది
ప్రభాకర్‌: మాకు పెళ్లై 25 ఏళ్లయింది. ఎవరి ఫ్యామిలీ లైఫ్‌ అయినా బాగుండాలంటే భార్య సహకారం, తను అర్థం చేసుకునే విధానం మీదనే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో మా ఆవిడకి సహనం, ఓపిక చాలా ఎక్కువ. మమ్మల్ని చాలా బాగా కేర్‌ చేస్తుంది. జనరల్‌గా మగవాళ్లకి చాలా ప్రపంచాలుంటాయి. ప్రొఫెషన్, మదర్స్‌ ఫ్యామిలీ, బిజినెస్, కెరీర్‌... ఇలా. కానీ భార్యకు మాత్రం ఎప్పుడూ ఒకే ఒక ఆలోచన మా ఆయన తిన్నారా? నా పిల్లలు టైమ్‌కి తిన్నారా? అందర్నీ ఆరోగ్యంగా చూసుకుంటున్నానా? అని! ఆ విషయంలో మేము రియల్లీ బ్లెస్డ్‌. 2025కి నావి రెండు ప్రాజెక్ట్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. ఆ రెండు సీరియల్స్‌తో నేను బిజీగా ఉన్నాను. ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సూపర్‌ సీరియల్‌ ఇప్పటికే లీడ్‌లో ఉంది. అలాగే ‘చామంతి’ అనే మరో సీరియల్‌లో చేస్తున్నాను. మా మలయజ కూడా 2024లో వెబ్‌ సిరీస్‌తో పాటు రెండు సినిమాల్లో నటించింది.

మా అబ్బాయి చంద్రహాస్‌ ‘రామ్‌నగర్‌ బన్నీ’ కోసం చాలా ఎఫర్ట్స్‌ పెట్టి బాగా నటించాడు. అది మేం కళ్లారా చూశాం కాబట్టే మా స్థాయికి మించి ఆ సినిమా కోసం పెట్టుబడి పెట్టాం. మా అబ్బాయి సంతోషం కోసం ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. ఆప్రాసెస్‌లో డబ్బుల గురించి ఎక్కడా ఆలోచించలేదు. ‘రామ్‌నగర్‌ బన్నీ’తో చంద్రహాస్‌ తనని తాను నిరూపించుకున్నాడు.  మా అమ్మాయి దివిజ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. లండన్‌ వెళ్లి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ చేయాలని, ఒక వ్యాపారవేత్తగా ఉండాలన్నది తన కల. తను ఇప్పటికే బాల నటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండూ పూర్తయ్యాక తను ఎలా సెటిల్‌ అవ్వాలనుంటే అలా మేం సంతోషంగా సపోర్ట్‌ చేస్తాం.  

→ మలయజ: 2024లో నేను నిర్మాతగా షూటింగ్‌ లొకేషన్‌కి రావటం, మా అబ్బాయి చంద్రహాస్‌ మూవీ (రామ్‌నగర్‌ బన్నీ) కోసం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ అన్నీ చూసుకోవడం ఒక కొత్త అనుభవం అని చెప్పగలను. కానీ, ఈ ఏడాది చాలా నేర్చుకున్నాను మా అబ్బాయి మూవీ ‘రామ్‌నగర్‌ బన్నీ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ అవుతున్న సమయంలో డబ్బులు అయిపోయి, మేం ఎదుర్కొన్న సవాళ్లలో ఎవరు మనవాళ్లో, ఎవరు కాదో అనేది తెలుసుకున్నాం. మనకేదైనా అవసరం వస్తే మనకంటూ తోడుగా వీళ్లందరూ ఉన్నారని అని కొంతమంది గురించి ఒక తప్పుడు అంచనాలతో ఉంటాం. కానీ, అది నిజం కాదు. ఈ సంవత్సరం మేం నేర్చుకున్న గుణపాఠం ఇది. అయితే అదే సమయంలో మేం ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా కొత్తవాళ్లు కొంతమంది సమయానికి సహాయం చేశారు.  మా అబ్బాయి నటించిన ‘బరాబర్‌ ప్రేమిస్తా’  అనే సినిమా 2025లో రిలీజ్‌ అవుతుంది. అలాగే ఇంకో సినిమా షూటింగ్‌ చేస్తున్నాడు. అలాగే మా అమ్మాయి దివిజ కూడా రెండు సినిమాలు సైన్‌ చేసింది. చాలా మంచిప్రాజెక్ట్స్‌ అవి. వాటి షూటింగ్స్‌ కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటి బ్రహ్మానందంగారి సినిమాలో ఆయన కూతురుగా, హీరో చెల్లెలిగా మంచి పాత్ర వచ్చింది. అలాగే ఇంకో సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. అలా మా అమ్మాయి కెరీర్‌ పరంగా కూడా బీజం పడింది 2024లోనే.    

‘మనుషులను’సంపాదించుకున్నాం
→ రాకేష్‌: 2024 విషయానికి వస్తే ఈ సంవత్సరం మా ఇద్దరికీ చాలా బ్యూటిఫుల్‌ ఇయర్‌. మేం సొంతంగా సినిమా (‘కేసీఆర్‌’లో రాకేశ్‌ నటించి, నిర్మించారు) ఆరంభించాం. ఎన్నో సంవత్సరాలుగా నా డ్రీమ్‌ అది. 2023లోనే మేం ‘కేసిఆర్‌’ సినిమా అనుకొని షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. మేం తీసుకున్న మూవీ టైటిల్‌ కన్‌ఫర్‌మేషన్, కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇంత కష్టపడి,ప్రాణం పెట్టి చేసిన సినిమా ఎందుకు ఇలా ఆగిపోయిందో అని చాలా నిరుత్సాహంలో ఉన్న సంవత్సరం అది. కానీ 2024, ఆగస్ట్‌ 1న నా బంగారు తల్లి పుట్టింది. నిజంగానే మా అన్ని టెన్షన్‌లకీ, కష్టాలకీ ఫుల్‌స్టాప్‌ పడ్డట్లు, ప్రత్యక్షంగా లక్ష్మీదేవి మా జీవితాల్లో అడుగు పెట్టినట్లు అయింది. సినిమా రిలీజైంది. ‘దైవం మానుష రూపేణ’ అని నేను నమ్ముతాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా కోసమే అనే భావనతో మనుషుల్ని సంపాదించుకుంటూ, వాళ్లని కాపాడుకునేందుకై కష్టపడుతున్నాను. దీపా ఆర్ట్స్‌ శ్రీనివాస్‌గారు ఈ సంవత్సరం ఆహాలో మా మూవీని రిలీజ్‌ చేసి ఈ సంవత్సరానికి మమ్మల్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించి, ఈ ఇయర్‌ ఎండ్‌ గిఫ్ట్‌గా  ఇచ్చారు.

→ అంతా బాగుండి మనం నడుస్తున్నప్పుడు మన వెనక చాలామంది వస్తారు. ఒకసారి కిందపడితేనే తెలుస్తుంది మనకి చెయ్యి అందించి పైకి లేపేది ఎవరు, మనల్ని చూసి ఎగతాళిగా నవ్వేది ఎవరు అనేది క్లియర్‌గా తెలుసుకున్నాం. అన్నీ సక్రమంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ మూవీ రిలీజ్‌ అయ్యి, సక్సెస్‌ అయ్యి మంచి గుర్తింపుతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక సమయంలో హెక్టిక్‌ అయిపోయి తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో మా సుజాత నన్ను  బిడ్డలాగా తోడు నీడగా ఉండి చాలా స్ట్రెంత్‌ను ఇచ్చింది. 2025లో ఇంకో న్యూప్రాజెక్ట్‌తో రాబోతున్నాం. మా సుజాతది కూడా 2025లో ‘సేవ్‌ ది టైగర్‌–3’ వెబ్‌ సిరీస్‌  రాబోతోంది. వర్క్‌లో,ప్రొఫెషన్‌లో ఇంకా ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాం.

→ సుజాత: నాకు 2023 డిసెంబర్‌లో ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్‌ అయింది. 2024 జనవరి నుంచిప్రొఫెషన్‌ పరంగా ఎన్నో టెన్షన్స్‌తో ఉన్నా రాకేష్‌గారు నన్ను చాలా కేర్‌ తీసుకుంటూ, హాస్పిటల్‌కి తీసుకెళ్లి రెగ్యులర్‌ చెకప్‌లు చేయిస్తూ, చివరికి నా డెలివరీ రూమ్‌లో బేబీని తన చేతులలో బయటికి తీసి బొడ్డు కోసే వరకు, స్పెసిమెన్‌ శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసే వరకు కూడా అన్నీ ఆయన చేతుల్లోనే జరిగాయి.

మేము ముగ్గురం అక్కా, చెల్లెళ్ల్లం కాబట్టి నాకు బాబు పుడితే బాగుండు అని ఉంది. కానీ మా ఆయన మాత్రం ఎవరైనా ఒకటే అనేవారు. ఫైనల్‌గా మా పాపాయి ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పటివరకు ఆగిపోయిన సినిమాకు ఉన్న అడ్డంకులు అన్నీ వాటంతట అవే క్లీయర్‌ అయిపోయి, మూవీ రిలీజ్‌ అయిపోయింది. మా పాప పుట్టుకతో మా ఆయన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లు మేము ఫీలవుతున్నాం. అందుకే మా పాప పేరు కూడా ‘ఖ్యాతిక’ అని పెట్టుకున్నాం. ఆ పేరు కూడా బాగా కలిసొచ్చింది. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. 

మా రాకేష్‌ చాలా కష్టపడుతున్నాడు, మనవాడి కోసం మనం కూడా ఏదైనా చేయాలని స్వచ్ఛందంగా వచ్చి సినిమాలో పని చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే మేం డబ్బు కంటే కూడా మనుషులను ఎక్కువగా సంపాదించుకున్నాం అనే తృప్తి 2024లో మాకు చాలా ఉంది.

కామెంట్లు చేసినా కామ్‌గా ఎదిగాం

ఇంద్ర నీల్‌: ‘కాలచక్రం’ అనే సీరియల్‌లో మేఘన, నేను కలిసి నటించాం. మా ఫ్రెండ్‌షిప్‌తో కలిపి మా రిలేషన్‌షిప్‌కు 25 ఏళ్లు. మా పెళ్లి జరిగి 19 ఏళ్లవుతోంది. మా ఇద్దరి లైఫ్‌లో జరిగిన బెస్ట్‌ థింగ్‌ ఏంటి? అని చె΄్పాలంటే మా మ్యారేజ్‌ అనే చె΄్తాను. 2005 మే 26న ‘చక్రవాకం’ సీరియల్‌ చేస్తున్నప్పుడు నాకు అత్త రోల్‌ చేశారు మేఘన. ఆ సీరియల్‌లో అత్తను ప్రేమించే క్యారెక్టర్‌ నాది..సో... రియల్‌ లైఫ్‌లో కూడా తనని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. చాలా కష్టపడి, పెద్దల్ని ఒప్పించి, పెళ్లికి వచ్చేలా చేసుకుని, మా ఇద్దరి డబ్బుల్తోనే జూబ్లీ హిల్స్‌ పెద్దమ్మ టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నాం. అది మాకు ఎప్పటికీ తీయని గుర్తు. 

→ నాకైతే 2024 గురించి చిన్న పశ్చాత్తాపం ఉంది. మా నాన్నకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పి షోల కోసం అమెరికా వెళ్లాను. నేను వర్క్‌ చేయడానికి ఎక్కడికైనా వెళ్లి, కష్టపడుతుంటే నాన్నకు కూడా చాలా ఇష్టం. నేనున్నాను కదా... నువ్వు వెళ్లు అని  ధైర్యం చెప్పి పంపారు. కానీ నేను ఇండియాకి తిరిగి వచ్చేసరికి, నా ధైర్యం అయిన ఆయనే మాకు దూరం అయిపోయారు. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ రోజు ఆయన మాతో భౌతికంగా లేకపోవడం మాకు చాలా పెద్ద లాస్‌. 

∙2025 పై మాకు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. మా ఇద్దరికీ ఒక మంచి ΄్లాన్‌ కూడా ఉంది. మంచి బిజినెస్‌ ΄్లాన్స్‌తో పాటుగా కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రివీల్‌ చేస్తే సర్‌ప్రైజ్‌ అంతా పోతుందని చెప్పడంలేదు.ట్రిప్స్‌ అయితే చాలానే ΄్లాన్‌ చేస్తున్నాం. మేం ఇద్దరం ఎక్కువగా రోడ్‌ ట్రిప్స్‌కి వెళ్లడానికే ఇష్టపడతాం. అయితే అన్నీ అన్‌΄్లాన్డ్‌ ట్రిప్సే ఉంటాయి. అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. 

మేఘన రామి: జీవితంలో ఓ మంచి పార్టనర్‌ దొరకడం అనేది చాలా ముఖ్యం. అప్పుడున్న ఆ ఏజ్‌లో అది కరెక్టో, కాదో అనేది పక్కన పెడితే... ఇప్పుడు మా 19 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత అనిపిస్తోంది.... అప్పుడు మేం తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని. ‘ఏంటి, వాళ్లు ఇలా పెళ్లి చేసుకున్నారు?’ అని వ్యతిరేకంగా మాట్లాడుకున్నవాళ్లూ కూడా ఉన్నారు. కానీ మేం తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మా లైఫ్‌ అప్పట్నుంచి చేంజ్‌ కావడం ఆరంభమైంది. 
    
ఇక నా ఫుడ్‌ బిజినెస్‌లో నీల్‌ సపోర్ట్‌ చాలా చాలా ఉంది. లేదంటే... ఈ రోజు ఈ బిజినెస్‌ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇంత దూరం రానే రాదు. వైఫ్‌తో పచ్చళ్లు అమ్మిస్తున్నాడనీ, ఇండస్ట్రీలో వర్క్‌ లేక పచ్చళ్లు అమ్ముకుంటున్నారనీ, బతుకుతెరువు కోసం ఇలా చేస్తున్నారనీ చాలామంది నెగటివ్‌ కామెంట్స్‌ చేశారు. కానీ మేం ఇద్దరం చాలా చాలా మెమొరీస్‌ని బిల్డ్‌ చేసుకోగలిగాం. మంచి లైఫ్‌ని లీడ్‌ చేస్తూ, ఎంజాయ్‌ చేస్తున్నాం. ఇంకా 2025లో మా రిలేషన్‌షిప్‌కి సంబంధించి 25 సంవత్సరాల సిల్వర్‌ జూబ్లీని సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాం. 
    
ఇక 2025 రిజల్యూషన్స్‌ అంటే... ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలని ఫిక్స్‌ అయ్యాను. అందుకే న్యూ ఇయర్‌ రావడానికి రెండు వారాల ముందే యోగా సభ్యత్వం తీసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. 
    అందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌.  
ఇంటర్వ్యూలు: శిరీష చల్లపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement