Prabhakar
-
చిల్లర చోరీల నుంచి భారీ దోపిడీలకు..
గచ్చిబౌలి: పోలీసులపై కాల్పులు జరిపిన కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ (28) త్వరలో మరో రెండు భారీ దోపిడీలకు ప్రణాళిక వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో అతడు ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో శనివారం రాత్రి సీసీఎస్ కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపిన అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి మూడు దేశీయంగా తయారైన పిస్టళ్లు, 451 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నర్సింహ తెలిపారు. ఆదివారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్‌కు శనివారం రాత్రి 7.30 గంటలకు వచ్చినట్లు సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్ రెడ్డి, వీరస్వామి, ప్రదీప్‌రెడ్డిలు అక్కడికి వెళ్లి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతలోనే ప్రభాకర్ తన జేబులోని పిస్టల్ తీసి రెండు రౌండ్లు కాల్పులు జరపగా, వెంకట్‌రెడ్డి పాదానికి బుల్లెట్ గాయమైంది. ప్రభాకర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ప్రదీప్‌రెడ్డి, వీరస్వామిలతోపాటు పబ్ బౌన్సర్లు కలిసి అతి కష్టంమీద పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి నుంచి రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నార్సింగిలోని అతడి నివాసం నుంచి మరో కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు 7.6 ఎంఎం 451 బుల్లెట్లు, రూ.62 వేల నగదు, సెల్ ఫోన్, దోపిడీకి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నాం’ అని వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీలలోనే చోరీలు ఏపీలోని పశ్చిమగోదావరి, వైజాగ్ ప్రాంతాలలో 2013 నుంచి ప్రభాకర్ చోరీలు చేస్తుండేవాడు. 66 కేసుల్లో జైలుకు వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 23 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. 21 చోరీల్లో రూ.2.5 కోట్లు కొల్లగొట్టాడు. జైలు నుంచి వచ్చిన తరువాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే చోరీ చేస్తున్నాడు. గత డిసెంబర్లో మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కేజీ ఇంజనీరింగ్ కాలేజీలో రూ.8 లక్షలు చోరీ చేశాడు. జనవరిలో వీజేఐటీలో రూ.16 లక్షలు దోచుకున్నాడు అని పోలీసులు తెలిపారు. శత్రువును చంపేందుకు పిస్టల్స్ కొనుగోలువైజాగ్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఓ ఖైదీ బత్తుల ప్రభాకర్‌ను అవమానించటంతో అతడిని చంపేందుకు పిస్టల్స్‌ను కొన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు త్వరలో రెండు పెద్ద దోపిడీలు చేసే ప్లాన్‌లో ఉన్నాడని చెప్పారు. బిహార్‌కు చెందిన అన్షు అనే వ్యక్తి ద్వారా పిస్టళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుళ్లను డీసీపీలు అభినందించారు. ప్రభాకర్‌కు సహకరించినవారి కోసం గాలిస్తున్నారు. -
అచ్చెన్న అన్నకు కీలకమైన పోస్టు
సాక్షి, అమరావతి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్‌కు రెడ్ బుక్ రాజ్యాంగం కీలకమైన పోస్టింగ్ ఇచ్చింది. అదీ నిబంధనలకు విరుద్ధంగా విశాఖలోనే పోస్టింగ్ వచ్చేసింది. వడ్డించేవాడు మనవాడే కాబట్టి నిబంధనలు అంగీకరించకపోయినా పోస్టింగు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో డీఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న కింజరాపు ప్రభాకర్‌కు ఆయన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించింది. అంటే డీఎస్పీకంటే పెద్ద స్థాయిలో మరునాడే రిటైరయ్యారు. రిటైరైన తరువాత ఆయనకు ప్రభుత్వం విజిలెన్స్ – ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా ఇటీవల పోస్టింగు ఇచ్చింది. ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో అసలు కుట్ర బయటపడింది. అచ్చెన్నాయుడు అన్నకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టు కట్టబెట్టింది. సాధారణంగా ఓఎస్డీ అంటే ప్రధాన కార్యాలయంలో శాఖాధిపతి వద్ద పోస్టింగు ఇస్తారు. శాఖాధిపతి పనుల ఒత్తిడిని తగ్గించేందుకు ఇలా ఎవర్నైనా ప్రత్యేకంగా నియమిస్తారు. కానీ కింజరాపు ప్రభాకర్‌కు మాత్రం విజయవాడలోని విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేంద్ర కార్యాలయంలో పోస్టింగు ఇవ్వలేదు. ఏకంగా విశాఖపట్నం ప్రాంతీయ విజిలెన్స్ – ఎన్పోర్స్మెంట్ అధికారి (ఆర్వీఈవో)గా పోస్టింగు ఇచ్చింది. విశాఖపట్నం ఆర్వీఈవోగా ఉన్న జి.శ్రీనివాసరావును ఒంగోలు ఆర్‌ఈవీవోగా బదిలీ చేసింది. ఒంగోలు ఆర్వీఈవోగా ఉన్న జె. కులశేఖర్‌ను ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆర్వీఈవో పోస్టుల్లో సర్వీసులో ఉన్న అదనపు ఎస్పీ స్థాయి అధికారులనే నియమిస్తూ వచ్చారు. అందుకు విరుద్ధంగా రిటైరైన అధికారిని టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించడం గమనార్హం. కేవలం చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపు చర్యలను వేగవంతం చేసేందుకు కింజరాపు ప్రభాకర్‌ను విశాఖపట్నం ఆర్వీఈవోగా నియమించినట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలో అధికార పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకున్న రాజకీయ ప్రత్యర్థుల వ్యాపార సంస్థలపై విజిలెన్స్ శాఖ ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ప్రభుత్వ ఉద్దేశమని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకోసమే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడైన ప్రభాకర్‌కు ప్రత్యేకంగా పోస్టింగు ఇచ్చినట్టు ఆ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్!
యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
సంవత్సరమంతా జంట స్వరంగా...
కలసి పాడుదాం బతుకు పాట... కలసి సాగుదాం వెలుగు బాట... అన్నట్టు ప్రతి దంపతులు ఒకరికి ఒకరై ముందుకు సాగితే ఏ కాలమైనా మంచికాలంగానే ఉంటుంది. భార్య భర్త జీవననౌకకు ఉమ్మడి చుక్కానిగా మారాలి. కలతలు చిన్నవయ్యి ఆనందాలు పెద్దవవ్వాలి. కుటుంబం బాగుంటే సమాజం, దేశం బాగుంటాయి. మనకు తెలిసిన ఈ సెలబ్రిటీ జంటలు ఆ మాటే చెబుతున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.మనవాళ్లెవ్వరో తెలిసింది→ ప్రభాకర్: మాకు పెళ్లై 25 ఏళ్లయింది. ఎవరి ఫ్యామిలీ లైఫ్ అయినా బాగుండాలంటే భార్య సహకారం, తను అర్థం చేసుకునే విధానం మీదనే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో మా ఆవిడకి సహనం, ఓపిక చాలా ఎక్కువ. మమ్మల్ని చాలా బాగా కేర్ చేస్తుంది. జనరల్‌గా మగవాళ్లకి చాలా ప్రపంచాలుంటాయి. ప్రొఫెషన్, మదర్స్ ఫ్యామిలీ, బిజినెస్, కెరీర్... ఇలా. కానీ భార్యకు మాత్రం ఎప్పుడూ ఒకే ఒక ఆలోచన మా ఆయన తిన్నారా? నా పిల్లలు టైమ్‌కి తిన్నారా? అందర్నీ ఆరోగ్యంగా చూసుకుంటున్నానా? అని! ఆ విషయంలో మేము రియల్లీ బ్లెస్డ్. 2025కి నావి రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రెండు సీరియల్స్‌తో నేను బిజీగా ఉన్నాను. ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సూపర్ సీరియల్ ఇప్పటికే లీడ్‌లో ఉంది. అలాగే ‘చామంతి’ అనే మరో సీరియల్లో చేస్తున్నాను. మా మలయజ కూడా 2024లో వెబ్ సిరీస్‌తో పాటు రెండు సినిమాల్లో నటించింది.మా అబ్బాయి చంద్రహాస్ ‘రామ్‌నగర్ బన్నీ’ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి బాగా నటించాడు. అది మేం కళ్లారా చూశాం కాబట్టే మా స్థాయికి మించి ఆ సినిమా కోసం పెట్టుబడి పెట్టాం. మా అబ్బాయి సంతోషం కోసం ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆప్రాసెస్లో డబ్బుల గురించి ఎక్కడా ఆలోచించలేదు. ‘రామ్‌నగర్ బన్నీ’తో చంద్రహాస్ తనని తాను నిరూపించుకున్నాడు. మా అమ్మాయి దివిజ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. లండన్ వెళ్లి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని, ఒక వ్యాపారవేత్తగా ఉండాలన్నది తన కల. తను ఇప్పటికే బాల నటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండూ పూర్తయ్యాక తను ఎలా సెటిల్ అవ్వాలనుంటే అలా మేం సంతోషంగా సపోర్ట్ చేస్తాం. → మలయజ: 2024లో నేను నిర్మాతగా షూటింగ్ లొకేషన్‌కి రావటం, మా అబ్బాయి చంద్రహాస్ మూవీ (రామ్‌నగర్ బన్నీ) కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చూసుకోవడం ఒక కొత్త అనుభవం అని చెప్పగలను. కానీ, ఈ ఏడాది చాలా నేర్చుకున్నాను మా అబ్బాయి మూవీ ‘రామ్‌నగర్ బన్నీ’ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్న సమయంలో డబ్బులు అయిపోయి, మేం ఎదుర్కొన్న సవాళ్లలో ఎవరు మనవాళ్లో, ఎవరు కాదో అనేది తెలుసుకున్నాం. మనకేదైనా అవసరం వస్తే మనకంటూ తోడుగా వీళ్లందరూ ఉన్నారని అని కొంతమంది గురించి ఒక తప్పుడు అంచనాలతో ఉంటాం. కానీ, అది నిజం కాదు. ఈ సంవత్సరం మేం నేర్చుకున్న గుణపాఠం ఇది. అయితే అదే సమయంలో మేం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొత్తవాళ్లు కొంతమంది సమయానికి సహాయం చేశారు. మా అబ్బాయి నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమా 2025లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకో సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అలాగే మా అమ్మాయి దివిజ కూడా రెండు సినిమాలు సైన్ చేసింది. చాలా మంచిప్రాజెక్ట్స్ అవి. వాటి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటి బ్రహ్మానందంగారి సినిమాలో ఆయన కూతురుగా, హీరో చెల్లెలిగా మంచి పాత్ర వచ్చింది. అలాగే ఇంకో సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. అలా మా అమ్మాయి కెరీర్ పరంగా కూడా బీజం పడింది 2024లోనే. ‘మనుషులను’సంపాదించుకున్నాం→ రాకేష్: 2024 విషయానికి వస్తే ఈ సంవత్సరం మా ఇద్దరికీ చాలా బ్యూటిఫుల్ ఇయర్. మేం సొంతంగా సినిమా (‘కేసీఆర్’లో రాకేశ్ నటించి, నిర్మించారు) ఆరంభించాం. ఎన్నో సంవత్సరాలుగా నా డ్రీమ్ అది. 2023లోనే మేం ‘కేసిఆర్’ సినిమా అనుకొని షూటింగ్ స్టార్ట్ చేశాం. మేం తీసుకున్న మూవీ టైటిల్ కన్ఫర్మేషన్, కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇంత కష్టపడి,ప్రాణం పెట్టి చేసిన సినిమా ఎందుకు ఇలా ఆగిపోయిందో అని చాలా నిరుత్సాహంలో ఉన్న సంవత్సరం అది. కానీ 2024, ఆగస్ట్ 1న నా బంగారు తల్లి పుట్టింది. నిజంగానే మా అన్ని టెన్షన్లకీ, కష్టాలకీ ఫుల్స్టాప్ పడ్డట్లు, ప్రత్యక్షంగా లక్ష్మీదేవి మా జీవితాల్లో అడుగు పెట్టినట్లు అయింది. సినిమా రిలీజైంది. ‘దైవం మానుష రూపేణ’ అని నేను నమ్ముతాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా కోసమే అనే భావనతో మనుషుల్ని సంపాదించుకుంటూ, వాళ్లని కాపాడుకునేందుకై కష్టపడుతున్నాను. దీపా ఆర్ట్స్ శ్రీనివాస్‌గారు ఈ సంవత్సరం ఆహాలో మా మూవీని రిలీజ్ చేసి ఈ సంవత్సరానికి మమ్మల్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించి, ఈ ఇయర్ ఎండ్ గిఫ్ట్‌గా ఇచ్చారు.→ అంతా బాగుండి మనం నడుస్తున్నప్పుడు మన వెనక చాలామంది వస్తారు. ఒకసారి కిందపడితేనే తెలుస్తుంది మనకి చెయ్యి అందించి పైకి లేపేది ఎవరు, మనల్ని చూసి ఎగతాళిగా నవ్వేది ఎవరు అనేది క్లియర్‌గా తెలుసుకున్నాం. అన్నీ సక్రమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ రిలీజ్ అయ్యి, సక్సెస్ అయ్యి మంచి గుర్తింపుతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక సమయంలో హెక్టిక్ అయిపోయి తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో మా సుజాత నన్ను బిడ్డలాగా తోడు నీడగా ఉండి చాలా స్ట్రెంత్‌ను ఇచ్చింది. 2025లో ఇంకో న్యూప్రాజెక్ట్తో రాబోతున్నాం. మా సుజాతది కూడా 2025లో ‘సేవ్ ది టైగర్–3’ వెబ్ సిరీస్ రాబోతోంది. వర్క్‌లో,ప్రొఫెషన్లో ఇంకా ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాం.→ సుజాత: నాకు 2023 డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. 2024 జనవరి నుంచిప్రొఫెషన్ పరంగా ఎన్నో టెన్షన్స్‌తో ఉన్నా రాకేష్గారు నన్ను చాలా కేర్ తీసుకుంటూ, హాస్పిటల్‌కి తీసుకెళ్లి రెగ్యులర్ చెకప్‌లు చేయిస్తూ, చివరికి నా డెలివరీ రూమ్‌లో బేబీని తన చేతులలో బయటికి తీసి బొడ్డు కోసే వరకు, స్పెసిమెన్ శాంపిల్స్ కలెక్ట్ చేసే వరకు కూడా అన్నీ ఆయన చేతుల్లోనే జరిగాయి.మేము ముగ్గురం అక్కా, చెల్లెళ్ల్లం కాబట్టి నాకు బాబు పుడితే బాగుండు అని ఉంది. కానీ మా ఆయన మాత్రం ఎవరైనా ఒకటే అనేవారు. ఫైనల్‌గా మా పాపాయి ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పటివరకు ఆగిపోయిన సినిమాకు ఉన్న అడ్డంకులు అన్నీ వాటంతట అవే క్లీయర్ అయిపోయి, మూవీ రిలీజ్ అయిపోయింది. మా పాప పుట్టుకతో మా ఆయన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లు మేము ఫీలవుతున్నాం. అందుకే మా పాప పేరు కూడా ‘ఖ్యాతిక’ అని పెట్టుకున్నాం. ఆ పేరు కూడా బాగా కలిసొచ్చింది. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మా రాకేష్ చాలా కష్టపడుతున్నాడు, మనవాడి కోసం మనం కూడా ఏదైనా చేయాలని స్వచ్ఛందంగా వచ్చి సినిమాలో పని చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే మేం డబ్బు కంటే కూడా మనుషులను ఎక్కువగా సంపాదించుకున్నాం అనే తృప్తి 2024లో మాకు చాలా ఉంది.కామెంట్లు చేసినా కామ్‌గా ఎదిగాంఇంద్ర నీల్: ‘కాలచక్రం’ అనే సీరియల్లో మేఘన, నేను కలిసి నటించాం. మా ఫ్రెండ్షిప్తో కలిపి మా రిలేషన్‌షిప్‌కు 25 ఏళ్లు. మా పెళ్లి జరిగి 19 ఏళ్లవుతోంది. మా ఇద్దరి లైఫ్‌లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి? అని చె΄్పాలంటే మా మ్యారేజ్ అనే చె΄్తాను. 2005 మే 26న ‘చక్రవాకం’ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అత్త రోల్ చేశారు మేఘన. ఆ సీరియల్లో అత్తను ప్రేమించే క్యారెక్టర్ నాది..సో... రియల్ లైఫ్‌లో కూడా తనని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. చాలా కష్టపడి, పెద్దల్ని ఒప్పించి, పెళ్లికి వచ్చేలా చేసుకుని, మా ఇద్దరి డబ్బుల్తోనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. అది మాకు ఎప్పటికీ తీయని గుర్తు. → నాకైతే 2024 గురించి చిన్న పశ్చాత్తాపం ఉంది. మా నాన్నకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పి షోల కోసం అమెరికా వెళ్లాను. నేను వర్క్ చేయడానికి ఎక్కడికైనా వెళ్లి, కష్టపడుతుంటే నాన్నకు కూడా చాలా ఇష్టం. నేనున్నాను కదా... నువ్వు వెళ్లు అని ధైర్యం చెప్పి పంపారు. కానీ నేను ఇండియాకి తిరిగి వచ్చేసరికి, నా ధైర్యం అయిన ఆయనే మాకు దూరం అయిపోయారు. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ రోజు ఆయన మాతో భౌతికంగా లేకపోవడం మాకు చాలా పెద్ద లాస్. ∙2025 పై మాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా ఇద్దరికీ ఒక మంచి ΄్లాన్ కూడా ఉంది. మంచి బిజినెస్ ΄్లాన్స్తో పాటుగా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రివీల్ చేస్తే సర్ప్రైజ్ అంతా పోతుందని చెప్పడంలేదు.ట్రిప్స్ అయితే చాలానే ΄్లాన్ చేస్తున్నాం. మేం ఇద్దరం ఎక్కువగా రోడ్ ట్రిప్స్‌కి వెళ్లడానికే ఇష్టపడతాం. అయితే అన్నీ అన్΄్లాన్డ్ ట్రిప్సే ఉంటాయి. అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. మేఘన రామి: జీవితంలో ఓ మంచి పార్టనర్ దొరకడం అనేది చాలా ముఖ్యం. అప్పుడున్న ఆ ఏజ్‌లో అది కరెక్టో, కాదో అనేది పక్కన పెడితే... ఇప్పుడు మా 19 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత అనిపిస్తోంది.... అప్పుడు మేం తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని. ‘ఏంటి, వాళ్లు ఇలా పెళ్లి చేసుకున్నారు?’ అని వ్యతిరేకంగా మాట్లాడుకున్నవాళ్లూ కూడా ఉన్నారు. కానీ మేం తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మా లైఫ్ అప్పట్నుంచి చేంజ్ కావడం ఆరంభమైంది. ఇక నా ఫుడ్ బిజినెస్‌లో నీల్ సపోర్ట్ చాలా చాలా ఉంది. లేదంటే... ఈ రోజు ఈ బిజినెస్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇంత దూరం రానే రాదు. వైఫ్‌తో పచ్చళ్లు అమ్మిస్తున్నాడనీ, ఇండస్ట్రీలో వర్క్ లేక పచ్చళ్లు అమ్ముకుంటున్నారనీ, బతుకుతెరువు కోసం ఇలా చేస్తున్నారనీ చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ మేం ఇద్దరం చాలా చాలా మెమొరీస్‌ని బిల్డ్ చేసుకోగలిగాం. మంచి లైఫ్‌ని లీడ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా 2025లో మా రిలేషన్‌షిప్‌కి సంబంధించి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇక 2025 రిజల్యూషన్స్ అంటే... ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే న్యూ ఇయర్ రావడానికి రెండు వారాల ముందే యోగా సభ్యత్వం తీసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంటర్వ్యూలు: శిరీష చల్లపల్లి -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటుడు ప్రభాకర్ కూతురిని చూశారా (ఫొటోలు)
-
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్‌ను ఆడుకున్న బిగ్‌బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్‌లో గెలవకపోతే ప్రైజ్‌మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారని చెప్పాడు బిగ్‌బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్‌మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్‌లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్‌కు రూ.12,489 ప్రైజ్‌మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్‌లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్‌బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్‌ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్‌బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్‌మేట్స్‌ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా..
బిగ్‌బాస్ 8వ సీజన్లో వచ్చినంత మంది గెస్టులు మరే సీజన్లోనూ వచ్చి ఉండరు. ఫ్యామిలీ వీక్ దగ్గరి నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. రెండువారాల క్రితం పాత సీజన్ కంటెస్టెంట్లు, గత వారం సెలబ్రిటీలు రాగా ఇప్పుడు బుల్లితెర తారలు హౌస్‌లోకి వస్తున్నారు.బిగ్‌బాస్ హౌస్‌లో అర్జున్ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. త్వరలో ప్రారంభమవుతున్న కొత్త సీరియల్ జంటను లోనికి తీసుకొచ్చారు. నటి పెద్దగా పరిచయం లేదేమో కానీ అర్జున్ కళ్యాణ్ మాత్రం ఇదివరకే తెలిసిన వ్యక్తి! అతడు గతంలో బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.ఫైనలిస్టులతో గేమ్ఈ సీరియల్ జంటతో పోటీపడి గెలిస్తే ప్రైజ్‌మనీలో కొంత డబ్బు యాడ్ చేస్తానన్నాడు బిగ్‌బాస్. అలాగే మరో సీరియల్ జంట ప్రభాకర్, ఆమని కూడా వచ్చారు. వీళ్లు కూడా కంటెస్టెంట్లతో కలిసి గేమ్స్ ఆడారు. ఫినాలే వీక్ కాబట్టి ఈ వారం గొడవలు గట్రా ఏమీ ఉండవు. కేవలం ఇలాంటి ఫన్ గేమ్స్, ఎమోషనల్ ఏవీ జర్నీ వీడియోలు మాత్రమే ఉండనున్నాయి. చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్ -
Prabhakar: ట్రోలర్స్ కి దొరికితే ఏసుకుంటారు..
-
బుల్లితెర ప్రియులకు సరికొత్త సీరియల్.. ఎప్పుటినుంచంటే?
తెలుగులో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్న ఛానల్ "స్టార్ మా". సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. తాజాగా "ఇల్లు ఇల్లాలు పిల్లలు" అనే సరికొత్త సీరియల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథే ఇల్లు ఇల్లాలు పిల్లలు.ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ ఉంది. అంతే కాదు - మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా ఉంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే... ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథేంటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటోసరికొత్త సీరియల్ "ఇల్లు ఇల్లాలు పిల్లలు" చూడాల్సిందే.ఈ సీరియల్ ఈ నెల 12 నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేయనున్నారు. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ. తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు నిర్మాత, ప్రభాకర్ ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని.. ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చూపించనున్నారు. -
‘ఆటిట్యూడ్ స్టార్’ ట్యాగ్‌కి అర్హుణ్ణి కాదంటే తీసేస్తాను: చంద్రహాస్
‘‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ ఔట్పుట్ చూశాక సినిమా విజయంపై మాకు చాలా నమ్మకం వచ్చింది’’ అని చంద్రహాస్ అన్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వంలో చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ మహత్గారు ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా... అన్ని షేడ్స్‌లో నన్ను బాగా చూపించారు. అన్ని అంశాలున్న ‘రామ్‌నగర్ బన్నీ’ నా తొలి సినిమా కావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రం చూశాక ‘ఆటిట్యూడ్ స్టార్’ అనే ట్యాగ్‌కు నేను అర్హుణ్ణి కాదంటే తీసేస్తాను. ఈ కథపై ఉన్న నమ్మకంతోనే మా నాన్న ప్రభాకర్‌గారు సినిమా నిర్మించారు. అన్ని జానర్ మూవీస్‌లో నటించి, మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం నేను నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరో సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. -
నలుగురు హీరోయిన్లతో 'రామ్‌నగర్ బన్నీ'.. టీజర్ వచ్చేసింది!
చంద్రహాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రభాకర్ మాట్లాడుతూ ..'నన్ను బుల్లితెరపై ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి.' అని అన్నారు.దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ' ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్తోనే చేయాలని ముందుకొచ్చాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనే అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు. -
నా స్థానంలో వేరేవాళ్లుంటే చచ్చిపోయేవాళ్లు: చంద్రహాస్
బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రహాస్ తనపై వస్తున్న నెగెటివిటీ, ట్రోలింగ్‌పై స్పందించాడు. ఇది నా తొలి సినిమా. ఇలా స్టేజీ ఎక్కి మాట్లాడి రెండేళ్లవుతోంది. అప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా అని విపరీతంగా ట్రోల్ చేశారు.తండ్రిని చూసి గర్వపడాలిఅందరిముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరోలా ప్రవర్తించలేను. పైగా నేను తప్పు చేసినప్పుడు తిడితే పడతాను, కానీ ఏమీ చేయకముందే విమర్శిస్తే మాత్రం సహించను. ఇప్పుడు నేను మా నాన్న గురించి డబ్బా కొట్టబోతున్నాను. ఎవరైనా సరే తండ్రిని చూసి గర్వపడాలి. మీ నాన్నను చూసి గర్వపడటం లేదంటే దానంత దురదృష్టం మరొకటి లేదు.ఎవ్వర్నీ వదలనుమా నాన్న బుల్లితెర మెగాస్టార్. ఆయనొక డైరెక్టర్, యాక్టర్, నిర్మాత. వేల ఎపిసోడ్లలో నటించడమే కాకుండా ఎన్నో షోస్ చేశాడు. మా నాన్న గొప్ప హీరో కాబట్టి నాకు యాటిట్యూడ్ ఉంటుంది. నన్ను తిట్టినవారే ఈ రామ్‌నగర్ బన్నీ మూవీ చూసి పాజిటివ్‌గా మారతారని అనుకుంటున్నాను. తర్వాతి సినిమాకు మరికొందర్ని పాజిటివ్‌గా మారుస్తా.. అలా నన్ను నెగెటివ్‌గా చూస్తున్నవాళ్లందరినీ పాజటివ్‌గా మార్చేవరకు వదలను.ఎంకరేజ్ చేయండినాలాంటివాడు కనక హిట్టు కొట్టాడంటే ఈ జనరేషన్‌కు పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడినవుతాను. రేపు పొద్దున థియటర్లో యాటిట్యూడ్ స్టార్ అన్న టైటిల్ పడగానే.. మీరందరూ అరిచి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. నా స్నేహితులు చాలామంది నా స్థానంలో వాళ్లుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్లమని చెప్పారు. అది తప్పు, నాపై ఎంత దాడి చేసినా సరే.. నాకలాంటి ఆలోచనలు రావు. ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. -
ఆటిట్యూడ్ స్టార్ 'చంద్రహాస్' సినిమా ఫస్ట్ లుక్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామ్ నగర్ బన్నీ'. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, పొడకండ ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో 'రామ్ నగర్ బన్నీ' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా హీరో చంద్రహాస్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందజేశారు .తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..'ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి నాకు చెప్పారు. ఆయన పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇందులో హీరోగా నటిస్తున్న చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.' అని స్పీకర్ తెలిపారు.'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మాట్లాడుతూ .. మా "రామ్ నగర్ బన్నీ" ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం వరద బాధితుల సహాయార్థం అందిస్తాం.' అని ఆయన తెలిపారు. -
అచ్చెన్నకు ఎమోషన్.. అన్నయ్యకు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ‘‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాగాలు ఆలపిస్తుంటే.. ఆ ఎమోషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ అన్నయ్యకు ప్రమోషన్ ఇచ్చేందుకు ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు. అచ్చెన్న అన్నయ్య కింజరాపు ప్రభాకర్ నాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) డీఎస్పీగా ఉన్నారు. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అంతలోగానే ఆయనకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ మంత్రిగారి అన్నయ్యకు ‘రిటైర్మెంట్ గిఫ్ట్’ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అదనపు ఎస్పీ పోస్టులకు 30 మంది డీఎస్పీలు అర్హులుగా ఉన్నారు. వారి పదోన్నతుల కోసం పాటించాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మొత్తం పోలీసు శాఖలో అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ 30 మందికి పదోన్నతులు కల్పించడానికి అనుమతించలేమని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం అవసరం లేకున్నా సరే పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కూడా పేర్కొంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు.. అటు పోలీసు శాఖ ఇటు ఆర్థిక శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రిటైరయ్యేలోగా తన అన్నయ్యకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి0దేనని పట్టుబట్టారు. దాంతో అదనపు ఎస్పీల పద్నోనతుల జాబితాను 22 మందికి పరిమితం చేస్తూ మరో జాబితాను రూపొందించారు. కొత్త జాబితాలో 22వ పేరు కింజరాపు ప్రభాకర్‌దే కావడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆమోదం తరువాత చూసుకుందాం.. ముందు ఆ జాబితాలోని వారికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా కూడా ఊపారు. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే కింజరాపు ప్రభాకర్‌తో సహా ఆ జాబితాలోని 22 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే భారత్‌కు వస్తానన్న ప్రభాకర్‌రావు.. గత నెలలోనే భారత్ రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. -
ఆ రెండు గంటల్లో ఏం జరిగింది?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతకాని/హైదరాబాద్: : ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్(45) సోమవారం భూవివాదంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా.. ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించిరా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన చెబుతున్న మాటలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీయడంతో పురుగుల మందు తాగిన సమయాన వారు అక్కడే ఉన్నారని భావిస్తున్నారు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విచారణ జరిపి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. దీంతో అదికారులు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే, ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి కూడా చింతకాని తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు ఆరా తీయడమే కాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే వరకు స్థానిక అధికారులు ఏం చేశారని ప్రశ్నించినట్టు సమాచారం.వీడియో తీసి... వాట్సాప్ గ్రూపులో పెట్టి కలెక్టరేట్ వద్ద ప్రభాకర్ తన తండ్రిని వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇద్దరు ప్రభాకర్‌ను బయటకు తీసుకెళ్లి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించాక, ఆయన వివరిస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.39 గంటలకు తీసిన వీడియోను సాయంత్రం 5.40 గంటలకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. దీంతో మధ్య రెండు గంటల సమయంలో ఏం జరిగిందో తేలాల్సి ఉంది. అయితే, రైతు ప్రభాకర్ ఆత్మహత్యలో రాజకీయకుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ తొలుత సమస్యను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు విన్నవించాడు. కాంగ్రెస్ నాయకులు అనుకూలంగా మాట్లాడకపోవటంతో బీఆర్ఎస్ నాయకుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అవమాన పరచాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకునేలా కొందరు ప్రేరేపించారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీడియో తీసినట్టు భావిస్తున్న గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.విచారణ చేయిస్తున్నాం..ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌ను ఈ విషయమై ఆరా తీయగా రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నామని తెలిపారు. ఆయన తండ్రి ఫిర్యా దుతో ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పా రు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులుగా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలనడంతో..బోజడ్ల ప్రభాకర్ తన తండ్రి పెదవీరయ్యతో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. కలెక్టర్ లేకపోవడం, అంతకు ముందే సమయం అయిపోవడంతో అధికారులు వెళ్లిపోగా సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాకర్ ఓ మామిడితోటలో వీడియోలో పురుగుల మందు డబ్బా చూపిస్తూ మాట్లాడాక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ వీడియోలో తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్లు పేర్కొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా వీడియోలో ప్రభాకర్ కన్నీటిపర్యంతమవుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభాకర్ కలెక్టరేట్‌కు ఎప్పుడు వచ్చాడు, ఆయనతో ఎవరెవరు ఉన్నారు, మండల స్థాయిలో అధికారులను కలిసినా ఎందుకు పరిష్కారం చూపలేదనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. -
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. సన్‌సిటీ బండ్లగూడ జాగీర్‌లోని ఓ సూపర్ మార్కెట్ సమీపంలో గురువారం మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్ హోకం (21), మధ్యప్రదేశ్ శివుపురి గ్వాలియర్ ప్రాంతానికి చెందిన అనుభవ్ సక్సేనా (24)లు బ్యాగ్‌తో ప్యాసింజర్ ఆటోదిగి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రాఘవేందర్, కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఎండీఎం డ్రగ్స్‌ను ఐటీ, ఈవెంట్ మేనేజర్లకు విక్రయిస్తున్నామని తెలిపా రు. తాము చంద్రపూర్‌కు చెందిన సాబేర్ అనే వ్యక్తి ద్వారా కొరియర్ తెప్పించుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్ విలువ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందన్నారు. -
జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
-
నిన్నే నమ్ముకున్నాం సారూ.. మరొక్కమారు నాకు చాన్స్ ఇవ్వరూ ప్లీజ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్‌చౌదరికి పార్టీ అధిష్టానం చుక్కలు చూపిస్తోంది. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన ఆయన 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీచేయాలని తీవ్రంగా యత్నిస్తున్న చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభాకర్ చౌదరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీకి కష్టపడిన తనకు ఈ దుస్థితి ఏమిటని కార్యకర్తల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు గనుక టికెట్ ఇవ్వకపోతే ప్రభాకర్ చౌదరి రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని అనుచరులు వాపోతున్నారు. పరిగణనలోకి కూడా తీసుకోలేదు గత రెండు మాసాలుగా టికెట్ కోసం యత్నిస్తున్న ప్రభాకర్ చౌదరికి ఏ దశలోనూ హామీ లభించలేదు. పైగా ఈయన్ను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అర్బన్ నియోజకవర్గంలో పాతిక వేలకు పైగా బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్టు అంచనా. దీంతో జనసేనకు ఇస్తే బావుంటుందనేది చంద్రబాబు ఆలోచన. 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో టీడీపీ కోసం కృషి చేస్తే ఉన్నట్టుండి జనసేనకు టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏమిటని చౌదరి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గనుక టికెట్ తెచ్చుకోలేకపోతే రాజకీయ సన్యాసం తప్పదేమోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందని తెలుస్తోంది. తేల్చుకునేందుకు విజయవాడకెళ్లిన చౌదరి వాడుకుని వదిలేయడమంటే చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే. ఈ కోవలోనే బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్ లాంటి వాళ్లందరూ బలయ్యారు. తాజాగా ప్రభాకర్ చౌదరి వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు సొంత పార్టీలోనే ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకించే వాళ్లు తానా అంటుంటే.. వీరికి వంతపాడుతూ అధిష్టానం తందానా అంటోంది. జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు ప్రభాకర్ చౌదరిపై ఏదో ఒక రకంగా రోజూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు దీన్ని ఎదుర్కోలేక తంటాలు పడుతుంటే మరోవైపు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేదు. ఇప్పుడాయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ పరిస్థితి గందరగోళంగా ఉంది. పొత్తులో ఏ పార్టీకి సీటిస్తారో, ఎవరు అభ్యర్థో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రభాకర్ చౌదరి విజయవాడకు బయలుదేరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
తళుకుమను తార...
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్లో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ జరుపుకుంటోంది. జాన్ భూషణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్‌ని నటుడు సాయి కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్. ‘‘ప్రభాకర్‌గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్. -
నా గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య చాలా బాధపడింది: సీరియల్ నటుడు ప్రభాకర్
సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానెల్స్‌లో సీరియల్స్‌తో అలరిస్తున్నాడు. తాజాగా ఓ షోకి భార్యతో సహా వచ్చిన ప్రభాకర్.. తన ప్రేమ-పెళ్లి విషయాల గురించి మాట్లాడాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య బాధపడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఏం జరిగింది? ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ఈ షోలో ప్రభాకర్-మలయాజ పెళ్లి ఫొటోల్ని స్క్రీన్‌పై ప్లే చేయగానే.. తమది దొంగపెళ్లి అని, ఆర్య సమాజ్‌లో ఏడడుగులు వేశామని అన్నాడు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్.. పెళ్లిలో కన్యాదానం చేశాడని అప్పటి సంగతుల్ని ప్రభాకర్ గుర్తుచేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య.. 'నాకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధపడింది. ఆ సందర్భాన్ని ఎలాగోలా సరిచేసుకుని మనస్ఫూర్తిగా నా భార్యకు సారీ చెప్పాను. అయితే నేను సారీ చెప్పడం గొప్పకాదు. తను నన్ను క్షమించడం గొప్ప విషయం' అని భార్య మలయజ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆమె బుగ్గపై అందరూ చూస్తుండగానే ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్‌గా మారింది. ఇకపోతే ప్రభాకర్ పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండగా, అతడి భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అలానే ప్రభాకర్ కొడుకు సుహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం. కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) -
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ మూకల దాడి
పుంగనూరు(చిత్తూరు జిల్లా) : టీడీపీ శ్రేణులు మళ్లీ బరితెగించాయి. వైఎస్సార్సీపీ నేత ఇంట్లోకి జొరపడి రాళ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాయి. పుంగనూరు మండల వైస్ ఎంపీపీ సరోజమ్మ, ఆమె భర్త ప్రభాకర్‌నాయక్ మండలంలోని పాళ్యెంపల్లెలో ఉంటున్నారు. ఈ నెల 4న చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో మండలంలోని జెడీ తాండాకు చెందిన టీడీపీ నేత కృష్ణానాయక్, ఆయన కుమారులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రభాకర్‌నాయక్ తమ ఆచూకీ తెలిపి ఉంటారన్న అనుమానంతో కృష్ణానాయక్ ఆయన కుమారుడు శ్రీనివాసనాయక్, వారి అనుచరులు కలిసి పథకం ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభాకర్‌నాయక్ ఇంటిపై దాడి చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ప్రభాకర్నాయక్పై రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన ఆయన బావమరిది మునీంద్రనాయక్పైనా దాడి చేశారు. గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రభాకర్నాయక్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మోహన్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రభాకర్నాయక్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
‘రాజుగారి కోడిపులావ్’ మూవీ రివ్యూ
టైటిల్: రాజుగారి కోడిపులావ్ నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నిర్మాణ సంస్థలు : ఏఎమ్ఎఫ్, కోన సినిమా నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన దర్శకత్వం : శివ కోన సంగీతం : ప్రవీణ్ మని సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు ఎడిటర్ : బసవా- శివ కోన విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘రాజుగారి కోడిపులావ్’కథేంటంటే.. రాజుగారు(ప్రభాకర్) ఓ హోటల్ రన్ చేస్తూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. ఆ చుట్టు పక్కల ఏరియా ప్రజలు రాజుగారి కోడిపులావ్ కోసం ఎగబడేవారు. ఇలా వ్యాపార పరంగా రాజుగారు సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధగా ఉండేవాడు. దానికి కారణం తనకు కొడుకు పుడుతాడు అనుకుంటే కూతురు పుట్టడం, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి. ఈ రెండు కారణాల వల్ల రాజుగారు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు డ్యాని(శివ కోన)- క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్ కౌశిక్)-ఆకాంక్ష(నేహాదేష్ పాండే), షారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. ఈషా ఐటీ ఎంప్లాయ్. వీరంతా కలిసి కారులో ట్రిప్‌కి బయలుదేరగా మార్తమధ్యలో కారు పాడవుతుంది. దీంతో అడవిలో వీరంతా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తున్న ఈ మూడు జంటల్లో అనూహ్యంగా క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. ఆ మరుసటి రోజే ఈషా కపిపించకుండా పోతుంది. మిగిలిన నలుగురు భయంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అడవిలో వీరికి దారి దొరక్క తిరుగుతూనే ఉంటారు. చివరకు వీరికి ఆ దట్టమైన అడవిలో ఓ ఇల్లు కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు క్యాండి ఎలా మరణించింది? డ్యానీ ఎవరు? ఫారుఖ్, ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో ‘రాజుగారి కోడిపులావ్’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజుగారి కోడిపులావ్ హోటల్ సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికే కథ వేరే మలుపు తీసుకుంటుంది. మూడు జంటల పరిచయం.. వారి ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది. గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠత ప్రేక్షకుడిలో ఏర్పడుతుంది. ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు చూపించడంతో దాని వెనక ఏదో నేపథ్యం ఉంటుందని అర్థమవుతుంది. క్యాండీ చనిపోయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ప్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తుంది. డ్యానీ కనిపించకుండా పోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతంది. కానీ సెకండాఫ్‌లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు.అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ థ్రిలింగ్కు గురిచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో డ్యాని బాగా హైలెట్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో శివ కోన ఒదిగిపోయాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. శివ తర్వాత బాగా పండిన పాత్ర ప్రాచి కెథర్. క్యాండి పాత్రలో ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. ఆకాంక్ష పాత్రని నేహా న్యాయం చేసింది.కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక రాజుగారి పాత్రలో ప్రభాకర్ తెరపై కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే..దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. ప్రవీన్ మణీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'రాజుగారి కోడిపులావ్'.. కొత్త రిలీజ్ డేట్
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజుగారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాతో శివ కోన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరి దృష్టిని ఆకట్టుకొన్నాయి. ట్రైలర్ అయితే 1 మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజు గారి కోడి పులావ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా "వాట్ ద ఫ* ఈజ్ ఆఫ్ కోడిపులావ్" అనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ వారి పెర్ఫామెన్స్ తో సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు. ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. తొలుత జూలై 29న రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఎందులో ఇందులో మార్పు చేశారు. ఆగస్టు 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) -
అమెరికాలో ప్రొఫెసర్‌గా వరంగల్ ఆదివాసీ
వరంగల్: కడు పేదరికం.. తినడానికి అన్నం కూడా దొరకని పరిస్థితి. తండ్రి పని చేస్తేనే పూటగడిచేది. లేనిపక్షంలో పస్తులుండడమే. పైగా మారుమూల గ్రామం.. అందులో పాఠశాల కూడా లేని కుగ్రామం. ఇలాంటి తరుణంలో ఎవరికైనా చదువుకోవాలనే ఆలోచనే రాదు. ఏదైనా పని చేసుకుని బతకాలని భావిస్తారు. కానీ అలాంటి వారికి ఈ యువకుడు పూర్తిగా విరుద్ధం. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఒక పక్క సమస్యలతో సహవాసం చేసూ్తనే.. మరో పక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఆయననే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామం దొరవారివేంపలి్లకి చెందిన ఈక ప్రభాకర్. తాను ఎంచుకున్న విద్యలో ఖండాంతరాలు దాటి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవాలో ప్రొఫెసర్‌గా పని చేసేందుకు ఎంపికయ్యారు. ఎర్ర బస్సు కూడా ఎరగని ఈ గ్రామం నుంచి అమెరికాకు వెళ్లడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈక పాపమ్మ–సమ్మయ్య దంపతుల ప్రథమ సంతానం ప్రభాకర్. తన ఎదుగుదల గురించి ఆయన మాటల్లోనే.. ‘పోడు వ్యవసాయం ఆధారంగానే మా కుటుంబ పోషణ గడిచేది. తినడానికే ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామంలో పాఠశాల కూడా లేదు. 1989లో అప్పటి ఐటీడీఎ పీఓ బెస్ట్ అవైలెబుల్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. హాస్టల్‌కు వెళ్తే కనీసం అన్నం అయినా సరిగా దొరుకుతుందనుకునే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలోనే రాజేంద్ర కాన్వెంట్ హై స్కూల్లో సీటు వచ్చింది. పాఠశాల చదువులోనే మా తల్లి పాపమ్మ 1997లో మృతి చెందింది. ఈ ఘటనను దిగమింగుకుని పదో తరగతి పూర్తి చేశా. అనంతరం ఇంటర్ ఎల్బీ కళాశాల వరంగల్‌లో, కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో బీజెడ్సీ గ్రూపులో డిగ్రీ పూర్తి చేశా. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో పీజీ పూర్తి చేశా. బెస్ట్ అవైలెబుల్ స్కీం పూర్తయిన తరువాత ఐటీడీఏ నుంచి స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యా. ఆ స్కాలర్ షిప్‌తోనే డిగ్రీ, పీజి పూర్తయింది. 2006 నుంచి 2013 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డి పూర్తి చేశా. 2013 నుంచి 2017 వరకు సీఎస్ఐఆర్ఆర్ఏలో రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశా. ఇదే సమయంలో మండలంలోని ఈశ్వరగూడెం గ్రామానికి చెందిన రవళితో వివాహమైంది. పీహెచ్డీ ఫెలోషిప్‌లో భాగంగా‘టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రిసెర్చ్’లో సంవత్సరం పని చేశా. అనంతరం గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. అక్కడ ప్రొఫెసర్‌గా పని చేసూ్తనే గత సంవత్సరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోనాలో ప్రొఫెసర్‌గా అప్లికేషన్ చేశాను. నాలుగు దఫాలుగా జరిగిన ఇంటర్వూ్యల ఆధారంగా నన్ను ఎంపిక చే సి వీసా ఇచ్చారు. ఈనెల 28న అమెరికాకు వెళ్తు న్నా. ఖండాతరాలు దాటి ప్రొఫెసర్‌గా పనిచేసే అ వకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’. -
బిగ్‌బాస్ 7లో బుల్లితెర ప్రభాకర్? రచ్చ రచ్చే!
బిగ్‌బాస్ 7 టైటిల్ ప్రోమో రాకతోనే సోషల్ మీడియాలో సందడి మొదలైపోయింది. బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడోచ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులు సంబరపడుతున్నారు. ఎక్కువసార్లు బిగ్‌బాస్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభమైంది. అయితే ఈ సారి మాత్రం అప్పటివరకు ఆగేదే లేదంటూ ప్రీపోన్ అవుతోందట! అంటే ఆగస్టు నెలలోనే బిగ్‌బాస్ 7 షురూ అయిపోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై నెలాఖరు లేదా ఆగస్టు ప్రారంభంలో షో స్టార్ట్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు! ఇప్పటికే ప్రోమో షూట్ కూడా పూర్తవగా, కంటెస్టెంట్ల ఎంపిక ఫైనలైపోయిన వెంటనే బిగ్‌బాస్ 7 గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ షో కోసం బ్యాంకాక్ పిల్ల శ్రావణి.. థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు వచ్చేసింది. బిగ్‌బాస్ కోసమే ఆమె ఇక్కడికి వచ్చిందన్నది నెటిజన్ల అభిప్రాయం. ఈమె పేరు కచ్చితంగా లిస్ట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు బుల్లితెర ప్రభాకర్. టీవీలో ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్‌లో ప్రభాకర్ నటించాడు. వెండితెరపై కొన్ని చిత్రాల్లోనూ మెరిశాడు. 25 ఏళ్లుగా అతడు టాప్ నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇతడిని అభిమానులు ప్రభాకర్‌ను బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు. ఇతడుగానీ హౌస్‌లో అడుగుపెడితే రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. ఒకవేళ ప్రభాకర్ నో చెప్తే తన స్థానంలో అతడి కొడుకు చంద్రహాస్ వచ్చినా ఓకే అంటున్నారు. చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే రెడీ అయిన సంగతి తెలిసిందే! ఇతడి టాలెంట్ చూసి మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే మరో రెండు సినిమాల ఆఫర్ వచ్చాయని చెప్పాడు. ఇకపోతే తొలి చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ప్రవర్తన చూసిన జనాలు అతడికి ఆటిట్యూడ్ స్టార్ అన్న ట్యాగ్ కట్టబెట్టారు. ఇతగాడు కానీ వస్తే మీమర్స్‌కు కావాల్సినంత కంటెంట్ దొరకడం ఖాయం! మరి ఈ తండ్రీకొడుకుల్లో ఎవరైనా ఒకరు వస్తారా? లేదా? అనేది చూడాలి! చదవండి: ఆ హీరో ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లకుండా తప్పు చేశా: హీరోయిన్ ఆదిపురుష్ కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువే! -
వడ్డించడానికి రెడీగా ఉన్న 'రాజుగారి కోడిపులావ్'..!
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజు గారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. (ఇది చదవండి: కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!) 'రాజు గారి కోడిపులావ్' చిత్రంలో నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర నటుడు ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ మనీ సంగీతమందించారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
ఓ వయ్యారి వన్నెలాడి..
శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేశ్ పాండే ముఖ్య తారలుగా, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. శివకోన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. అనిల్ మోదుగ మరో నిర్మాత. కాగా ఈ సినిమాలోని ‘సునో సునామీ’ పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు ప్రవీణ్ మని స్వరపరచిన ఈ పాటకు మల్లిక్ వల్లభ లిరిక్స్ అందించగా ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ పాడారు. -
ఏనుగు పిల్లని బలి ఇస్తారా?
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్‌గా విడుదలవుతోంది. (ఇదీ చదవండి: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను ఎందుకు కలుస్తానంటే: అమితాబ్) ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్రతి సీన్ అడ్వెంచరస్‌గా ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చి దిద్దాము. ఈ నెల 9న విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. (ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్‌కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్) -
యూత్‌ని ఆకట్టుకునేలా ‘రాజుగారి కోడిపులావ్’
శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్’. కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివ కోన, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రాజు గారి కోడిపులావ్ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ అలాగే సినిమా ఔట్ లైన్ కూడా తెలిపే ఒక వీడియోను విడుదల చేశారు. ‘రీయూనిన్ తో కలిసిన 6 మంది స్నేహితులు.. సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆ సంఘటనల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు చేసే పోరాటమే ‘రాజుగారి కోడిపులావ్’. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో ఈ మూవీని గ్రాండ్‌గా తెరకెక్కించాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆ స్టార్ హీరో మూడు పెళ్లిళ్ల విషయం దాచి నాతో పెళ్లి, గర్భం..: నటి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన అంజు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానూ చేసిన ఆమె తర్వాత బోల్డ్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే తలకిందులు చేసింది. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? వంటి కారణాల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. 'మా అమ్మ నేను ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ డైరెక్టర్ మహేంద్రన్ సర్ చూసి నన్ను సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నాడు. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను. కానీ అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్ హీరో టైగర్ ప్రభాకర్ నన్ను చూసి ఇష్టపడ్డారు. నా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆయనకు అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు మాత్రమే! నేనిప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పాను. అయినా సరే నా వెంటపడ్డాడు. దీంతో అమ్మానాన్నను అడిగి చెప్తానన్నాను. ప్రభాకర్ వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.. అతడిని చూడగానే అమ్మానాన్న ఈ పెళ్లే వద్దన్నారు. కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకరనే కావాలంటూ ఇంట్లో చెప్పాపెట్టకుండా తన దగ్గరికి వెళ్లిపోయాను. తనను ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే ప్రభాకర్‌కు మూడు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసింది. దాని గురించి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు చాలా బాధేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను. పైగా నేను గర్భిణిని. అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్లో పెట్టి ఒంటిచేత్తో తిరిగొచ్చేశాను. ఆ ఇంట్లో నుంచి వెళ్లేపోయేటప్పుడు ప్రభాకర్‌తో ఒక్కటే మాట చెప్పాను.. నన్ను చాలా బ్యాడ్ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెన్నడూ ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చివరిసారిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా కాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయాను. నెమ్మదిగా దాని నుంచి తేరుకుని తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చింది అంజు. -
వేముల ప్రభాకర్‌కు కీర్తి పురస్కారం
జగిత్యాల: పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత వేముల ప్రభాకర్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. వేముల ప్రభాకర్ శ్రీవరకవి భూమాగౌడుశ్రీ నవల రచనకు గాను కీర్తి పురస్కారం ప్రకటించగా ఈనెల 28న అందుకోనున్నారు. ఇప్పటివరకు మూడు నవలలు, ఒక కథ సంపుటి, ఆరు కవిత సంపుటిలు, స్వీయరచనతో పాటు రెండు సాహితీ గ్రంథాలు, ఒక మాసపత్రిక వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ సందర్భంగా వేముల ప్రభాకర్‌ను సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రచయితలు అభినందించారు. -
మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా!
ఏ ప్రభుత్వానికైనా ఆబ్కారి ఆదాయం ముఖ్యమైందే. తెలుగు రాష్ట్రాల్లో కల్లుగీత అనుమతులు, అమ్మకాలు మొదట్లో వేలం ద్వారా జరిగేవి. తర్వాత కల్లుగీత సహకార సంఘాలు ఏర్పాటుచేసారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదని వాటిని కుదించి దున్నే వాడికే భూమి అన్నట్లుగా గీసేవాడికే చెట్టు Tree for Tapper అన్నారు. పథకం ఏదైనా, ఏ పార్టీ అధికారం లోనున్నా ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకుండా చూసే పని చేసేది ఎక్సైజ్ శాఖ, వాళ్ళ పనితీరుకు అదే గీటురాయి. ప్రభుత్వ ఖజానా నిండినంత కాలం ఆ శాఖ అవినీతి గురించి పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అబ్కారి శాఖలో మామూళ్లు మామూలే! కాదు కూడదు అంటే తప్పు చేసినా చేయకున్నా కల్తీకల్లు కేసులు తప్పవని గీత కార్మికులకు తెలుసు. హైదరాబాద్ నగర శివార్లలో ముఖ్యంగా దూల్ పేట ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, అమ్మకాలు జరిగిన రోజుల్లో తమ కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గీత సంఘాలు రోడ్డెక్కిన రోజుల్లో మాచర్ల జగన్నాధం గారి' పరిశ్రమ' పత్రికలో ' కల్తీ సారా కల్పతరువు రాజధానిలో దూల్ పేట ' పేర నేనొక వ్యాసం రాస్తూ అబ్కారి శాఖ, స్థానిక పోలీస్ సిబ్బంది అవినీతి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది 22 అక్టోబర్ 1974 సంచికలో ప్రచురితమై, అంచెలంచెలుగా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోనున్న అధికారులు అనధికారుల దృష్టిలో పడి చివరికి విచారణకు దారితీసింది. నేనా రోజుల్లో హైదరాబాద్ లోని ఒక సహకార సంస్థలో ఉద్యోగం చేస్తూ చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండేవాణ్ణి. తెల్లవారక ముందే ఒక పోలీస్ జవాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చి గిట్టనివాడు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు నాకు సమ్మన్స్ ఇచ్చి పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి ముందు హాజరు కమ్మని చెప్పి వెళ్ళాడు. నేను అద్దెకుంటున్న ఇంటి యజమానే కాదు కొత్తగా కాపురానికి వచ్చిన మా ఆవిడ కూడా భయపడిపోయింది నేనేం నేరం చేసానో? అని. నిజం చెప్పాలంటే నేనూ గాబరాపడిపోయాను, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ రోజులు. కేంద్రంలో ఇందిరా గాంధి రాష్ట్రంలో జలగం వెంగలరావు గారల పాలన నడుస్తున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడినా జైలుకూడు తినాల్సిన పరిస్థితులు. ఎందుకైనా మంచిదని సలహా కోసం ముందుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక బంధువు దగ్గరికి వెళ్ళాను. అతను అంతా విని 'అబ్కారి శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది, పోలీస్ ప్రభుత్వ పీఠాలను కాపాడుతుంది. ఈ రెండు శాఖలను విమర్శించడానికి మీకు ఎన్ని గుండెలండీ 'అన్నాడు. నాకున్న ఒక్క గుండె అయన మాటలతో దడదడలాడిపోయింది. 'లాభంలేదు, ఎవరన్నా లీడర్‌ను తీసుకొని వెళ్ళండి, రోజులు బాగాలేవు! 'అని చివరగా సలహా కూడా ఇచ్చి పంపాడు. అసలు నాయకులే లేని రోజులవి, ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారాయె. అధికారి మంచివాడైతే ఆయనే అర్థం చేసుకుంటాడని పోలీస్ కమీషనర్ గారి కార్యాలయంలో ఒక్కణ్ణే విచారణకు హాజరయ్యాను. ఆయనో యువఅధికారి, అదృష్టవశాత్తు సౌమ్యుడు కూడా. ఒక ఫైల్ తీసి నా ముందు పెట్టాడు. అందులో దూల్ పేట గుడుంబా వ్యాసమే కాకుండా అదే పరిశ్రమ పత్రికలో నేను రాసిన 'దేశ రాజధానిలో నల్లమందు వ్యాపారం విచ్చలవిడి (ఆనంద ఉగాది సంచిక )' మత్తు పదార్థాలకు బానిసలవుతున్న మన విద్యార్థులు (18జూన్ 1974 సంచిక ), పోలీసులను దొంగలుగా మారుస్తున్న తమిళనాడు ప్రోహిభిషన్ చట్టం (31డిసెంబర్ 1974 సంచిక )కాక మరో మూడు వ్యాసాల పేపర్ కటింంగ్స్ ఉన్నాయి. ' మీరు హైదరాబాద్ లో ఉన్నారు, దూల్ పేట వ్యాపారం గురించి తెలిసుండొచ్చు, గీత కార్మికుల కుటుంబం నుండి వచ్చారు, కల్లు గురించి రాసుంటారు కానీ డ్రగ్స్ గురించి ఎలా రాస్తున్నారు?' అన్నాడాయన. జాతీయ స్థాయి పత్రికల్లో వచ్చిన వార్తలే నా వ్యాసాలకు ఆధార మన్నాను. 'చట్ట సభల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్లకు రక్షణ ఉంటుంది,కానీ జర్నలిస్ట్ రచనలు పక్కా ఆధారాలు లేందే రాస్తే ఇబ్బందుల్లో పడతారు 'అన్నాడు. నిజమే కానీ జర్నలిస్టులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయలేరు కదా! వాళ్ళిచ్చిన క్లూను ప్రభుత్వం వాడుకొని సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికొస్తాయి అన్నాను నేను. ' మీ వ్యాసల్లోనున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ ను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలిపించే అవసరం రాకుండా చూసుకొండి 'అన్నాడు. నేను బతుకుజీవుడా! అని బయట పడ్డాను. -వేముల ప్రభాకర్ -
గ్రాండ్ సాంగ్.. భారీ ఫైట్
‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ (పాలిక్ శ్రీనివాసా చారి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రమేష్ రావుల నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నాం. ప్రభాకర్‌పై ఓ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించాం. ఇప్పుడు రవి మాస్టర్ సారథ్యంలో ప్రభాకర్‌పై భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నాం. వింద్యా రెడ్డి మంచి కథ అందించారు. జాన్ భూషణ్ మూడు అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు పాలిక్. ‘‘మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమేష్ రావుల. -
Telangana: ఆ కవుల గురించి మీకు తెలుసా?
'ఎంతో మంది చనిపోతున్నారు అందులో కొద్ది మంది మాత్రమే తమలోని అధ్బుతమైన ఆలోచనలు ఈ లోకానికి పంచిపోతున్నారు ' అంటాడు టాడ్ హెన్రీ (Die Empty ) తమ వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టనష్టాలైనా భరించి అలా సమాధిలోకి వెళ్ళడానికి ముందే రచనల ద్వారా తమలోని ప్రతిభా ఉత్పత్తులను పంచిపోయిన కవులు రచయితలు తెలంగాణలో ఎందరో ఉన్నారు. వేల సంవత్సరాలు గడిచినా ప్రజల్లో ఈనాటికీ ఆ సాహిత్యం నిలిచివున్నా వారి జ్ఞాపకాలే చెదిరిపోతున్నాయి,వారి సమాధులు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కన్నడ ఆదికవి అనిపించుకున్న పంప ( 902-975 AD) అంతటి కవి సమాధి నిజామాబాదు బోధన్‌లో నామమాత్రంగా మిగిలిపోయింది. తెలుగు ఆదికవి అంటున్న నన్నయ కాలానికే చెందినవాడుగా, కరీంనగర్ వేములవాడ ప్రాంతీయుడుగా భావిస్తున్న చాటుపద్య కవి వేములవాడ భీమకవికి అక్కడ చిన్న స్మారకం కూడా పెట్టకుండా చాటుకే ఉంచేసారు. కాకతీయుల కాలంనాటి శాసనకవి నగునూరు పాలకుడు ఎన్నో దేవాలయాలు నిర్మించిన వెల్లంకి గంగాధరుడిని పట్టించుకున్న వారే లేరు. తెలుగులో తొలి వచన కావ్యకర్త, వచన సంకీర్తనా వాంజ్ఞయానికి మూలపురుషుడు అనిపించుకున్న సింహగిరి వచనాల కృష్ణమాచార్య సంతూరు తెలంగాణ వాడే అయినా ఆయన పేరిట ఏదీ ఎక్కడా లేదు. మహా పండితుడు,సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి ప్రసిద్ధుడైన కోలాచలం మల్లినాధ సూరి (14వ శతాబ్దం) మెదక్ జిల్లా కొలిచెలమ /కొల్చారం వాడే అయినా ఆయనను తలుచుకునే పని ప్రభుత్వం చేసింది లేదు. భాగవతకర్త పోతన అంతటి మహానుభావుడికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో బమ్మెరలో తలపెట్టిన 'పోతన స్మృతివనం' రూపురేఖలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఇటీవల ఆ గ్రామానికి వెళ్ళివచ్చిన సాహితీ మిత్రుడు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు వాపోయారు. తుమ్మూరి స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఎలగందులకు చెందిన పూర్వకవి, పోతనామాత్యుని శిష్యుడు, భాగవతంలోని ఏకాదశ ద్వాదశ స్కందాలను రచించిన వెలిగందుల నారయకవి స్మారకం వంటిదేదీ ఆ గ్రామంలో ఈనాటికీ లేదని వారు చెబుతుంటే అశ్చర్యం వేసింది. ప్రతియేటా మాతృభాషా దినోత్సవాలు మొక్కుబడిగా జరపడం కాదు ఆ భాషను నిలబెట్టడానికి తమ ప్రాణాలను దారపోసిన కవులు రచయితలను తలుచుకోవడం అవసరం. -వేముల ప్రభాకర్, అమెరికా నుంచి -
భక్త రామదాసు నేలకొండపల్లిలో ప్రాచీన బౌద్ధ క్షేత్రం!
భక్త రామదాసు అనగానే ముందుగా అందరూ చెప్పేది ఆయన శ్రీ రాముని ఆలయం నిర్మించిన (1664) భద్రాద్రి గురించి. రామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న (1620-1688) పుట్టిన ఊరు నేలకొండపల్లిలో వారి స్వగృహం (ఇప్పుడు ధ్యాన మందిరంగా మార్చారు) వారి ఇష్టదైవం శ్రీరాజగోపాలస్వామి గుడి ఉన్నాయి. రామదాసు జగమెరిగిన రామ భక్తుడు, ఆయన కీర్తనల్లో, దాశరథి శతకంలో వినబడేది రామకథనే, కాని వారి ఊరు మాత్రం మహాభారత కథతో (విరాట్‌రాజు దిబ్బ, కీచకగుండం లాంటివి ) ముడిపడి ఉండడం విశేషం. అంతేకాదు నేలకొండపల్లి క్రీ శ2-6 శతాబ్దుల మధ్య కాలంలో ప్రసిద్ధమైన బౌద్ధమత కేంద్రం కావడం మరో విశేషం. ఆ కాలంలో ముడి ఇనుముతో, పంచలోహలతో ఇక్కడ తయారైన బుద్ధ విగ్రహాలు దక్షిణ భారత మంతా పంపిణీ చేయబడేవట. నేలకొండపల్లి ఎర్రమట్టిదిబ్బలో 1976 లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అమరావతి కన్నా పెద్దదిగా భావించబడే బౌద్ధస్తూపం ఈ గ్రామ చరిత్రనే మార్చేసింది. ఈ చక్రాకార స్తూపం చుట్టూ 180 ఎత్తు 16మీ గా 2 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. దీనిపైనున్న బ్రాహ్మి లిపి శాసనాన్ని క్రీ శ 3-4 శతాబ్దులదిగా భావిస్తున్నారు. స్తూప పరిసరాల్లోని దాదాపు నూరు ఎకరాల్లో మజ్జుగూడెం వరకు బౌద్ధ బిక్షుల నివాసాలు, నల్లదిబ్బ ప్రాంతంలో చైత్యాలు, మట్టిబొమ్మలు,నీటితొట్టెలు, బైరాగిగుట్ట వద్ద విగ్రహాల తయారీ కేంద్ర శిథిలాలు బయట పడ్డాయట. ఇక్కడున్న బాలసముద్రం సరస్సులో ఒక జాలరి వలకు చిక్కిన బుద్ధుని పంచలోహ విగ్రహం చాలా విలువైనదట. బాదనకుర్తి, ఫణిగిరి,ధూళికట్ట బౌద్ధ క్షేత్రాల్లా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా పురావస్తు శాఖవారు శిథిలమైన నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పూర్వరూపం తేవడంతో ఇది దేశ విదేశ బౌద్ధ యాత్రికులను ఆకర్శించడం సంతోషకరం. -వేముల ప్రభాకర్ -
న్యాయవాదులకు వరం ‘లా నేస్తం’
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తోన్న డాక్టర్ వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు న్యాయవాదులను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకుంటున్నారని న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లా నేస్తం, సంక్షేమ నిధి పథకాలతో న్యాయవాదులు పొందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడం కష్టమని, అలాంటి వారిని ఆదుకునేందుకే లా నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. 2019 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్ల పాటు స్టైఫండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత మూడున్నర ఏళ్లలో 65,537 మంది న్యాయవాదులకు రూ.34.39 కోట్లను స్టైపెండ్ రూపంలో చెల్లించామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్‌ఫండ్‌తో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంక్షేమ నిధి నుంచి అర్హులైన న్యాయవాదులకు వైద్య ఖర్చులు, లా పుస్తకాలు, మేజర్ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్ వంటి అత్యవసరాలకు నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధి ద్వారా ఇప్పటివరకు 7,733 మంది న్యాయవాదులకు రూ.25 కోట్ల మేర సాయం చేసినట్లు చెప్పారు. -
సిర్నాపల్లి సంస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపిన రాణి కథ తెలుసా? 1905లోనే..
రాజులైనా, సంస్థానాధిపతులైనా, ప్రజాస్వామ్యంలోనైనా పాలకులు చేసిన మంచిని ప్రజలు ఎంత కాలమైనా మరిచిపోరనడానికి నిజామాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. చుట్టుముట్టు దట్టమైన అడవి వున్నా ఒకప్పుడు దాదాపు వంద గ్రామాల సంస్థానంగా వెలుగు వెలిగిన గ్రామం సిర్నాపల్లి. దాన్ని బహుకాలం(1859-1920) ఏలిన రాణి శీలం జానకీ బాయి. రాణిగారు తవ్వించిన చెరువులు, కుంటలు, కాలువల వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, ఆమె పట్టుదల వల్లనే ఆనాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1899 లో తలపెట్టిన హైదరాబాద్-బోధన్ -మన్మాడ్ రైల్వే లైన్‌ను సిర్నాపల్లి, ఇందూర్(నేటి నిజామాబాద్ )ల వైపు తిప్పారని, ఫలితంగా తమకు 1905లోనే రైలు సౌకర్య భాగ్యం కలిగిందని, ఇందల్వాయి రామాలయాన్ని ఆమెనే నిర్మించిందని గ్రామస్తులు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటారు. పోలీస్ చర్య తర్వాత భారత్‌లో విలీనమైపోయిన హైదరాబాద్ రాజ్యంతో పాటు నాటి సంస్థానాలు 14 కూడా తమ అధికారాన్ని వదులుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట తాకిడితో సిర్నాపల్లి రాణిగారి వారసులు గ్రామాన్ని విడిచిపెట్టక తప్పలేదు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన నక్సలైట్ ఉద్యమంతో దాదాపు 5 ఎకరాల్లో విస్తరించివున్న సిర్నాపల్లి కోటగడి ప్రభుత్వ బడిగా మారిపోయింది. రాణి జానకీబాయి (1859-1920) వేల్పూర్ రేకులపల్లిలోని ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిందంటారు. వేటకు వచ్చి అడవిలో తప్పిపోయి, ప్రమాదకర పరిస్థితుల్లోనున్న ఒక నవాబుకు, అడవిలోకి వంటచెరుకు కోసం వచ్చిన ఒక 12 సంవత్సరాల బాలిక దారి చూయించి ఆదుకున్నదని, అతను ఆమె ధైర్య సాహసాలను నిజాం దృష్టికి తీసుకుపోవడంతో రాజు జానకీ బాయి అనే ఆ బాలికను సంస్థాన పాలకరాలుగా నియమించాడన్నది ప్రచారంలో నున్న ఒక కథ. అయితే భర్త అకాల మరణంతో అధికారాన్ని చేపట్టిన జానకీ బాయి సంస్థానాన్ని పాపన్నపేట రాణి శంకర్మమ్మలా సమర్థవంతంగా నడిపి 'మషాల్ దొరసాని'గా (పగలే దివిటీలు వెలగడం ) పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని చరిత్ర. రాణిగారికి సంస్థాన పాలనలో లింగన్న అనే పట్వారి కీలక పాత్ర పోషించాడని చెప్పుకుంటారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి శీలం రాంభూపాల్ రెడ్డి గారు, INTACH అనబడే సాంస్కృతిక వారసత్వ సంస్థ కన్వీనర్ అనురాధా రెడ్డి గారు రాణి జానకీ బాయి వారసులేనట. తెలంగాణ నయాగరాగా పేరొందిన సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ రాణి జానకీ బాయి పేరుతో పిలువబడడం ఆమెకున్న ప్రజాదరణను తెలుపుతుంది. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి చదవండి: వేదామృతం.. గీతామృతం.. ఏదైనా నీరా ప్రియం! -
బండ సొరికలలో గుండుకు వెలిసిన కొమురెల్లి మల్లన్న!
మాదిరాజు- మాదమ్మ దంపతుల సంతానంగా చెప్పబడే మల్లికార్జునుడిని పరమశివుడి అవతారంగా భావించి కొలవడం వీర శైవ సంప్రదాయం. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో సిద్ధిపేట సమీపంలో నున్న కొమురవెల్లిలో మల్లికార్జునుడు 'బండ సొరికలలో గుండుకు వెలిసిన మల్లన్నదేవుడి' గా ఇరుపక్కల గొల్ల కేతమ్మ, లింగబలిజ మేడలమ్మ దేవేరులతో పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రానికి ప్రధానంగా వచ్చే భక్తులు యాదవ, గొల్ల, కురుమ, లింగబలిజలని చెప్పవచ్చు. కొమురవెల్లికి దాదాపు 20 కి మీ దూరంలోనున్న' కొండ పోచమ్మ'ను మల్లన్న స్వామి అక్కగా భావించి భక్తులు అక్కడికీ వెళ్తుంటారు. ప్రతియేటా సంక్రాతి నుండి ఉగాది వరకు జరిగే ఈ జాతరలో మొదటి ఆదివారం 'లష్కర్ బోనాల'కు హైదరాబాద్ నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గంగరేణి చెట్టు కింద పట్నాలు మల్లన్న ఆలయం ముందున్న గంగరేణి చెట్టు కింద జరిగే పట్నాలు అనబడే ముగ్గు పూజలు విశేషమైనవి. పసుపు రంగు బట్టలు వేసుకొని, జగ్గువాద్యం పట్టుకున్న ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులు వేసి మధ్యలో స్వామిని పెట్టి, ఆవాహనం చేసి పూజలు చేస్తుంటారు. బహు పాత్రాభినయం చేస్తూ, గ్రామీణుల భాషలో, పిట్ట కథలు జోడించి, ఆడుతూ పాడుతూ ఒగ్గులు చెప్పే కథలు విన సొంపుగా ఉంటాయి. జాతర చివరలో కామదహనం ఈ కళలో ప్రసిద్దులైన వారు, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అసలు సిసలు తెలంగాణ కళాకారులు వరంగల్‌కు చెందిన చుక్క సత్తయ్య ( 1935-2017), కరీంనగర్ మిద్దె రాములు( 1941-2010) లాంటివారు. కొమురెల్లి జాతర చివరలో కామదహనం ఉంటుంది. అగ్ని ప్రతిష్ఠ చేసి, కణకణ మండే నిప్పులు తొక్కుతూ అగ్ని గుండాలు దాటడం వీరశైవ ఆచారం. 'శివసత్తుల' ఆచారం మల్లన్న ఆలయ ప్రాంగణంలోనే వున్న చిన్న ఉపాలయం రేణుకా చార్యుడిది. వీర శైవ సంప్రదాయం లోని పంచాచార్యులలో రేణుకాచార్య ప్రధముడు. వీర శైవులు పవిత్ర గ్రంధంగా భావించే 'శ్రీ సిద్ధాంత శిఖామణి'ని బోధించింది వీరే నంటారు. తెలుగు రాష్ట్రాల్లోని వృత్తి కులాలవారు చాలా మంది శైవ సంప్రదాయికులే కావడం, ముఖ్యంగా తెలంగాణలో యాదవ కులాలవారు ఆ రోజుల్లనే వీరశైవం వైపు ఆకర్శించబడడం, 'శివసత్తుల' ఆచారం వంటి అంశాలు ఆసక్తికరం, పరిశోధకులు దృష్టి పెట్టాల్సిన విషయాలు. 'మల్లన్నసాగర్ ' పేరిట కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన జలాశయానికి 'మల్లన్నసాగర్ 'అని పేరు పెట్టడమే కాకుండా,గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆ నీటితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామి పాదాలు కడిగితే, అదేయేడు డిసెంబర్లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరపున కోటి రూపాయలు విలువైన బంగారు కిరీటాన్ని మల్లన్న కల్యాణ వేడుకల్లో సమర్పించారు. -వేముల ప్రభాకర్, అమెరికా నుంచి -
అనంతగిరిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పద్మనాభ స్వామి!
శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన, ఆళ్వార్ల రచనల్లో ప్రస్థావించబడిన, లక్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు సంబందించిన దివ్య దేశాలు 108 కాగా ఇందులో భారత్‌లో ఉన్నవి 105 మాత్రమే, ఒకటి నేపాల్ లో ఉండగా మిగతా రెండు ఈ భూలోకంలో కాదు అక్కడెక్కడో, అల వైకుంఠపురంలో ఉన్నాయంటారు. ఇందులో ఎక్కువ కెక్కువ ఉన్నది తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో. ఆంధ్రప్రదేశ్‌లో నున్న రెండు ఆలయాలు తిరుమల, అహోబిలంలు. భారత్‌లోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ పెరుమాళ్ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ లెక్కలోకి రాకున్నా హైదరాబాద్‌కు 75 కిమీ దూరంలో వికారాబాద్ అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణంలో మనకూ ఒక అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారు. నిజాం ప్రభుత్వం లో ప్రధాన మంత్రిగా ( 18931901)పనిచేసిన నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా బహదూర్ జాగీర్ కావడం వల్ల దీనికి ’వికారాబాద్’ అన్న పేరు వచ్చిందట. అంతకు పూర్వం ఇది గంగవరంగా పిలువబడిందట. హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పుట్టింది వికారాబాద్ అడవుల్లోనే. వికారాబాద్ చల్లటి ప్రాంతం కావడం, అక్కడ లోయలు, కొండలతో మంచి అడవి ఉండడం, వర్షా కాలంలో అందమైన జలపాతాలు ప్రత్యక్ష మవడం వల్ల నిజాం నవాబులు ఆ రోజుల్లోనే దీన్ని విశ్రాంతి కేంద్రంగా వాడుకున్నారట. ఇక్కడున్న వనాలు వాటిలోని ఔషద గుణాలు గమనించి 1946లోనే ఇక్కడ క్షయ వ్యాధిగ్రస్తుల కోసం ఒక టీబీ సానెటోరియం పెట్టడం విశేషం. ఓ సారి అడవుల్లోకి వేటకు వచ్చి అలసిసొలసి పడుకున్న నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ) కలలోకి వచ్చిన స్వామి తన ఆలయాన్ని పునరుద్దరించమన్నాడని, ఆ ఆదేశాన్ని రాజు గారు పాటించారని చెబుతారు. -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ! -
ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ!
ప్రభువెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయీలెవ్వరు అన్నాడు శ్రీ శ్రీ. రాజులూ రాణుల పల్లకిలే కాదు యుద్దాలు జరిగినప్పుడు గాయపడ్డ సైనికులను చికిత్స కోసం శిబిరాలకు చేర్చడానికి కూడా రాజులు బోయీల సేవలను వాడుకున్నారు. అలా అంగ్లేయుల పాలనా కాలంలో సికింద్రాబాద్ మిలిటరీ బటాలియన్లో ఒక 'బోయీ'గా పని చేసినవాడు సూరిటి అప్పయ్య. 1813 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాదులలో ప్లేగు మహమ్మారి విజ్రుoభించి వేలాది మంది జనం కుప్ప తెప్పలుగా చనిపోతున్న కాలంలో బెటాలియాన్తో పాటు మధ్య భారత్ లోని ఉజ్జయినికి బదిలీ పై వెళ్లిపోయాడు అప్పయ్య. అంతేకాదు అక్కడున్న మహంకాళి ఆలయానికి వెళ్లి తనకోసమో తన కుటుంబం కోసమో కాదు అందరికోసం తల్లీ! ఈ మహా విపత్తు నుండి మానవాళిని కాపాడుమని, అదే జరిగితే సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారి విగ్రహం పెడతానని, గుడి కడతానని మొక్కుకున్నాడు. 'ఈ సామాన్య బోయీతో అది అయ్యే పనేనా, అయినా సరే భక్తుడిని పరీక్షిద్దా' మనుకుందో ఏమో అన్నట్లుగా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టడం, అప్పయ్య సికింద్రాబాద్‌కు బదిలీ అయి రావడం జరిగిపోయింది. సూరిటి అప్పయ్య తన మాట తప్పకుండా సహచరుల సహాయం కూడా తీసుకొని కర్రతో చేసిన ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని నాటి లష్కర్ లోని ఓ ఖాళీ ప్రదేశంలో (1815 జులైలో) ప్రతిష్టించి, చిన్న గుడి కూడా కట్టించాడట. ఆ నిర్మాణ సమయంలో అక్కడున్న ఒక పాత బావిని బాగు చేస్తున్నప్పుడు దొరికిన మాణిక్యాలమ్మ విగ్రహాన్ని కూడా ఆ గుడిలోనే ప్రతిష్టించాడని చెబుతారు. అప్పయ్యనే భక్తుల సహకారంతో (1864 లో )కర్ర విగ్రహం స్థానంలో రాతి విగ్రహం పెట్టించాడంటారు. ఆ తర్వాతి కాలంలో అప్పయ్య కుమారుడు సంజీవయ్య (1900) ఆయన కుమారుడు మేస్త్రి లక్ష్మయ్య ( 1914), అతని వారసుడు కిష్టయ్య వరసగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. ఇంతా జరిగాక 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు' అన్నట్లుగా పలుకుబడి గల పెద్దల కమిటీలు రంగ ప్రవేశం చేసి, పూజారి వర్గాన్ని తెచ్చి, చివరికి దేవాదాయ శాఖవారికి ఈ ఆలయాన్ని( 1947 లో ) అప్పగించారట. ఎట్లయితేనేమి,తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్బంగా లక్షలాది మంది భక్తులు వచ్చే ఒక ఆలయానికి ప్రభుత్వ అజమాయిషీ అవసరమే కాదనడం లేదు, కానీ అసలు సిసలు ధర్మకర్తలను, ఈ ఆలయాన్ని స్థాపించిన సామాన్యులను ఎవరూ లెక్క చేయక పోవడమే విచారకరం. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ వారి అధికారిక వెబ్ సైట్ లో , తెలంగాణ ప్రభుత్వ టూరిజం వారి సమాచారంలో 'సూరిటి అప్పయ్య డోలి బేరర్'అని ఒక్క మాట అనేసారే గాని ఈ ఆలయ ఏర్పాటు కోసం అయన పడ్డ పాట్లను చెప్పలేదు, ఈ గుడి కోసం చెమటోడ్చిన అప్పయ్య మూడు తరాల మేస్త్రి వారసుల ప్రస్తావన అసలే తేలేదు. అంతా పల్లకి నెక్కిన ప్రభువులను కొనియాడే వారే, అది మోసిన బోయీల సేవలను గుర్తించే దెవరు? బోనాల పండగ మరుసటి రోజు 'భవిష్య వాణి' కోసం మాతంగి స్వర్ణలత చుట్టూ మూగేవారే అందరూ కానీ తరతరాలుగా ఆ భాగమ్మలు జోగమ్మలు పడుతున్న బాధలు పట్టించుకునేదెవరు? -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా! -
యదార్థ సంఘటనతో ‘వీకెండ్ పార్టీ’
కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి మారిపోయింది. రియాలిటీ చిత్రాలను, రియలిస్టిక్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజ జీవితంలోని ఘటనలు, యథార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి నేపథ్యంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీకెండ్ పార్టీ’. నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది. కథారచయిత అమరుడు డాక్టర్ బోయ జంగయ్య గారి 80వ జయంతి సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాత బోయ చేతన్ బాబు, సినిమా దర్శకులు అమరేందర్ ప్రోమో విడుదల చేశారు. నాగార్జునసాగర్ లో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా, ఈ సినిమా కొనసాగుతూ ఉంటుందని మేకర్లు తెలిపారు. బాహుబలి ప్రభాకర్, గీతా సింగ్, గుంటూరు విజయ్, అక్షిత్ అంగరీష్, రమ్య నాని, రమ్య రాజ్, సిరి, గీతిక, ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సదా చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
కొడుకుపై దారుణమైన ట్రోల్స్.. స్పందించిన నటుడు ప్రభాకర్
తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై బుల్లితెర మెగాస్టార్, టీవీ నటుడు ప్రభాకర్ ఆసక్తికర రీతిలో స్పందించాడు. కాగా బుల్లితెరపై నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో సీరియల్స్‌కు నిర్మాతగా వ్యవహరించిన ఆయన చిన్న సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో సినీ, టీవీ రంగంలో దూసుకుపోతున్న ప్రభాకర్ తన వారసుడిగా కొడుకు చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సౌందర్య రజనీకాంత్ ఇటీవల ఓ చానల్‌తో ముచ్చిటించిన ఆయన తన కొడుకును అందరికి పరిచయం చేశాడు. ఈ సందర్బంగా చంద్రహాస్‌ను చూపిస్తూ.. ‘హీరో కావాలనేది మా అబ్బాయి కల. ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు హీరోగా మూడు సినిమాలు చేస్తున్నారు. అందరి తనని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ క్రమంలో చంద్రహాస్ చూపించిన యాటీట్యూడ్, ఆయన నిలుచున్న తీరు చూసి అంతా అతడిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. వీడు హీరో ఏంటీ!.. ఇంకా ఒక్క సినిమా కూడా రాలేదు అప్పుడు పెద్ద స్టార్లా ఫోజులు కొడుతున్నాడు. బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ చంద్రహాస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. మీ కొడుకు మూవీ ఎంట్రీపై నెపోటిజం మీద ఏమైనా ట్రోల్స్ వచ్చాయా? అని హోస్ట్ అడగ్గా ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. వాడు వచ్చిందే ఇప్పుడు.. ఇంకా వాడి సినిమాలే బయటకు రాలేదు అన్నాడు. ‘‘పరిచయం చేసిన ఇంటర్య్వూపైనే అందరూ వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. ‘వీడు హీరో ఏంటీ? వాడు ఇటూ తిరిగాడు అటు తిరిగాడు ఎంటీ? జెబులో చేతులు పెట్టుకున్నాడేంటి. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్‌పై గురించి ఏమన్నదంటే.. యూటిట్యూడ్ చూపిస్తున్నాడు’ అంటూ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు. చంద్రహాస్ నిలబడ్డ స్టైల్ వాళ్లకి నచ్చలేదు. అదే చెప్పారు. రేపు యాక్టింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా ఆదరిస్తారు. జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారు. వారికి అనిపించింది చెబుతారు’ అని ప్రభాకర్ వ్యాఖ్యానించాడు. -
యూపీలో యోగికి గుడి
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు యూపీలోని భరత్కుండ్కు చెందిన ప్రభాకర్మౌర్య అనే వీరాభిమాని గుడి కట్టాడు. యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కాషాయ వస్త్రాలు, విల్లంబులతో దేవతల మాదిరిగా తల వెనుక వెలుగులతో ఏర్పాటు చేశాడు. రోజుకు రెండు సార్లు పూజలు చేసి, భక్తులకు ప్రసాదం పంచిపెడుతున్నాడు. ఫైజాబాద్–ప్రయాగ్‌రాజ్ హైవే పక్కనే భరత్‌కుండ్ ఉంది. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్‌కుండ్ రామాయణ కాలంలో అరణ్యవాసం వెళ్లే శ్రీరాముడికి ఆయన సోదరుడు భరతుడు వీడ్కోలు పలికిన చోటుగా ప్రసిద్ధి. యోగి కార్యక్రమాలతో ప్రభావితమై ఆయనకు గుడి కట్టినట్లు మౌర్య తెలిపాడు. -
హీరోగా మారిన ప్రభాకర్ తనయుడు చంద్రహాస్
‘‘నేను ఇండ్రస్టీకి వచ్చి 25ఏళ్లు అయింది. మా అబ్బాయి చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది నా భార్య మలయజ. తాను చేసిన యూ ట్యూబ్ వీడియో ద్వారా నా ప్రమేయం లేకుండానే చంద్రహాస్ హీరోగా అవకాశాలు తెచ్చుకోవడం తండ్రిగా గర్వంగా ఉంది’’ అని నటుడు ప్రభాకర్ అన్నారు. ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం కానున్నాడు. నేడు(సెప్టెంబర్ 17) చంద్రహాస్ పుట్టిరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘చంద్రహాస్ చేసిన ‘నాటు నాటు..’ అనే కవర్ సాంగ్ మంచి పేరుతో పాటు హీరోగా రెండు అవకాశాలు తేవడంతో ఆశ్చర్యపోయాను. వీటిలో కృష్ణ దర్శకత్వంలో కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి నిర్మిస్తున్న సినిమా, సంపత్ వి. రుద్ర డైరెక్షన్లో ఏవీఆర్, నరేష్గార్లు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే మా స్వంత సంస్థలో ఓ సినిమా నిర్మించనున్నాం’’ అన్నారు. ప్రభాకర్ భార్య మలయజ మాట్లాడుతూ.. ‘చంద్రహాస్ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్ వర్కర్. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘‘పరిశ్రమలోని చాలామందిని చూసి నటుడిగా స్ఫూర్తి పొందాను.. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌గార్లు.. వారి అంకితభావానికి హ్యాట్సాఫ్. హీరో అవ్వాలనేది నా కల.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కోసం కష్టపడతాను’’ అన్నారు చంద్రహాస్. -
Karnataka: మాజీ మంత్రి కన్నుమూత
బెంగళూరు: మాజీమంత్రి, ఉత్తర కన్నడ జిల్లా కారవారలో పలు విద్యాసంస్థలను స్థాపించిన ప్రభాకర్ రాణె (81) సోమవారం మధ్యాహ్నం తన స్వగృహంలో కన్నుమూశారు. నెల క్రితం జ్వరం రావటంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కారవార జోయిడా స్థానం నుంచి క్రాంతిరంగ పార్టీ నుండి ఒకసారి, కాంగ్రెస్ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1993లో వీరప్ప మెయిలీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: (బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర) -
కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియకనే ప్రధాని అధ్యక్షతన జరిగిన భేటీకి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి, దేశ అభ్యున్నతికి దోహదపడుతున్న నీతి ఆయోగ్‌ను విమర్శించి, కేసీఆర్ తన నైజాన్ని మరో సారి చాటుకున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్రానికి ఏం కావాలో చెప్పుకునే విజ్ఞత కూడా ముఖ్యమంత్రికి లోపించడం విచారకరమన్నారు. ప్రధాని మోదీని విభేదించే ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌తో పాటు నవీన్ పట్నాయక్ వంటి వారు కూడా సమావేశానికి వచ్చి ఆయా రాష్ట్రాల హక్కులను సాధించుకుంటున్నారని తెలిపా రు. రాష్ట్రాల అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించే నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరుతో ఆయనకు రాష్ట్ర ప్రజల పట్ల గల చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మతితప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాను తప్ప మంత్రులు, కలెక్టర్లకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వని కేసీఆర్ నీతి ఆయోగ్‌పై విమర్శలు చేయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. -
వైట్‌హౌస్‌లో భారతీయ ఆరతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్‌ను నామినేట్ చేయడంతో ‘ఆ పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలు’ అనే ప్రశంసలతో పాటు, ‘ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది... దిల్లీలో జన్మించింది ఆరతి ప్రభాకర్. తన మూడవ యేట కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. టెక్సాస్‌లోని లబ్బక్ సిటీలో పెరిగింది. ఆరతికి అమ్మ ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన విషయాలు చెబుతుండేది. ‘నీకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకోవాలి’ అని ఆమె తరచుగా చెప్పే మాట ఆరతి మనసులో బలంగా నాటుకుపోయింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ఆరతి. 34 ఏళ్ల వయసులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్స్ అండ్ టెక్నాలజీ (నిస్ట్)కి నాయకత్వం వహించింది. ‘నిస్ట్’కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. ‘నిఫ్ట్’ తరువాత రెచెమ్ (ఏరోస్పేస్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ) కార్పోరేషన్‌కు సీనియర్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ(డర్ప)కి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఆమె కెరీర్లో మరో ఘనతగా చెప్పుకోవాలి. రక్షణకు సంబంధించి భవిష్యత్కాల సాంకేతిక జ్ఞానానికి సంబంధించిన అధ్యయనం, ఆవిష్కరణలకు సంబంధించి అమెరికాలో ఇది శక్తివంతమైన సంస్థ. దీనికి నాయకత్వం వహించడం చిన్న విషయమేమీ కాదు. పెంటగాన్ ‘బ్లూ స్కై రిసెర్చ్ ఏజెన్సీ’గా ప్రసిద్ధి పొందిన ఈ సంస్థకు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ఊతం ఇచ్చింది ఆరతి. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... తాను కౌమారంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ‘ఆ సమయంలో కూడా ఎప్పటిలాగే ఉండేది తప్ప, ఏవో విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడేది కాదు. ఆ విషాద ప్రభావాన్ని నానై చూపించేది కాదు. ఒకానొక దశలో ఆమెకు నేను, నాకు ఆమే ప్రపంచం అన్నట్లుగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే మా అమ్మ అసాధారణమైన అమ్మ. సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టం. ఆ సేవాదృక్పథం ఆమెను ఎప్పుడూ చురుకుగా ఉండేలా చేసేది’ అని తల్లిని గుర్తుచేసుకుంటుంది ఆరతి. ప్రస్తుత విషయానికి వస్తే... ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే బాధ్యతను స్వీకరించబోతుంది ఆరతి. ఆమె గురించి అమ్మ మాటల్లో చెప్పాలంటే ‘సాహసం మూర్తీభవించే అమ్మాయి’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల్లో చెప్పాలంటే... ‘ప్రతిభావంతురాలైన, గౌరవనీయ శాస్త్రవేత్త’ అరవై మూడు సంవత్సరాల ఆరతి ప్రభాకర్...సెనేట్ అమోదముద్ర వేస్తే వైట్‌హౌస్ ఓఎస్టీపీ (ఆఫీస్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పాలసీ) ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టబోయే తొలి భారత సంతతి మహిళగా రికార్డ్ సృష్టిస్తుంది. ఆమెకు అభినందనలు. -
ఆ రాత్రి ఏం జరిగింది?
‘బాహుబలి’ ప్రభాకర్, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో పాలిక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ కొట్టారు. ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ – ‘‘రిటైర్డ్ మిలటరీ మేజర్ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. సినిమాకు కీలకమైన పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాం’’ అన్నారు రావుల రమేష్. పాలిక్ మాట్లాడుతూ – ‘‘నా శిష్యురాలు వింధ్య రెడ్డి ఈ చిత్రకథ ఇచ్చారు’’ అన్నారు. వింధ్య రెడ్డి, సంగీత దర్శకుడు జాన్ భూషణ్ మాట్లాడారు. -
సరికొత్త కాన్సెప్ట్‌తో ‘గోకులంలో గోవిందుడు’
గతంలో తమిళ హీరో విక్రమ్‌తో ‘ఊహ’, వడ్డే నవీన్‌తో ‘శ్రీమతి కల్యాణం’లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ప్రభాకర్ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మూవీకి ‘గోకులంలో గోవిందుడు’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై వ్యాపారవేత్త పి.ఎన్.రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకొంటున్న ‘గోకులంలో గోవిందుడు’ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుందని మూవీ మేకర్స్ తెలిపారు. -
ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?
ముంబై: ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకి చెప్పారు. ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి వ్యక్తిగత అంగరక్షకుడినని చెప్పుకుంటున్న ప్రభాకర్ అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. ఈ అరెస్ట్‌ల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షారూక్‌ఖాన్ మేనేజర్ పూజా దడ్లానితో కారులోనే ఈ డీల్ గురించి 15 నిముషాల సేపు చర్చించారంటూ ప్రభాకర్ తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనని తొమ్మిది నుంచి 10 ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. మరోవైపు కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఈ కేసు ఇంకా అనూహ్య మలుపులు తిరగడం ఖాయంగా అనిపిస్తోంది. అక్టోబరు 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని అర్థర్ రోడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అతని బెయిల్ పిటిషన్ మంగళవారం బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. గట్టి జవాబు ఇస్తాం: సమీర్ ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తోసిపుచ్చినట్టుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాంఖెడే హెచ్చరించారు. సాక్షి అడ్డం తిరిగాడని, ఎన్సీబీ ప్రతిష్టను మంట కలిపేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నాడని, కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అలాంటి మీటింగ్లేవీ జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభాకర్ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఎన్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రభాకర్ ఈ కేసులో సాక్షి మాత్రమే. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఆయన చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చెప్పుకునే బదులు న్యాయమూర్తి సమక్షంలోనే తన గోడు చెప్పుకోవాల్సింది. అతని అఫిడవిట్‌ను ఎన్సీబీ డైరెక్టర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. మహారాష్ట్ర పరువు తీస్తారా?: శివసేన ఫైర్ ఆర్యన్‌ఖాన్ విడుదలకు ఎన్సీబీ ముడుపులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర పరువు తీయడానికే ఈ కేసులు పెట్టారని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటుగా సంజయ్ రౌత్ ఒక వీడియో క్లిప్పింగ్ షేర్ చేశారు. ఆ వీడియోలో ఎన్సీబీ కార్యాలయంలో గోసవి ఫోన్ చేతిలో పట్టుకొని (స్పీకర్ ఆన్ చేసి) ఉండగా... ఆర్యన్ ఖాన్ ఎవరితోనో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. ఈ ముడుపుల వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలని రౌత్ డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడేపై సిట్‌తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్సీబీపై తరచుగా విమర్శలు చేస్తోంది. నాపై కుట్ర జరుగుతోంది: పోలీసుల్ని ఆశ్రయించిన వాంఖెడే తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్సీబీ ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చట్టపరమైన చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలంటూ నగర పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి లేఖ రాశారు. ‘‘ముడుపుల ఆరోపణలకు సంబంధించి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ ఈ అంశాన్ని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ పరిశీలనకు పంపారు. దురద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలి’’ అని కోరారు. -
ఆ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో భాగంగా చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి కోర్టు ధిక్కరణ, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు దాఖలు చేసినవారికే రూ.59 కోట్లు విడుదల చేస్తూ జీవో 208 జారీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు గతంలో ఈ నిధులను విడుదల చేయరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసింది. నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కోర్టుధిక్కరణ కేసుల్లో హాజరైనవారి కోసం అంటూ రూ.59 కోట్లను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన లెక్చరర్ సి.ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. గతంలో ఆదేశించిన మేరకు జీవోను సవరించి తాజాగా జారీచేశారా అని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ నివేదించారు. ఈ నిధులను ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో స్పష్టం చేస్తూ సవరించిన జీవో జారీచేయడానికి ఇబ్బంది ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా గత ఏడాది విడుదల చేసిన నిధులు సకాలంలో నిర్వాసిత రైతులకు అందించలేకపోయామని, దీంతో తాజాగా ఈ జీవో జారీచేయాల్సి వచ్చిందని వివరించారు. -
మహా విష్ణువులా చిరంజీవి నన్ను ఆదుకున్నారు
కరోనా క్రైసిస్‌లో సినీపరిశ్రమ కార్మికులతో సహా ఆపదలో ఉన్న ఎందరినో మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ ఆపత్కాల సాయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు కోడైరెక్టర్ (లంకేశ్వరుడు చిత్రానికి కో డైరెక్టర్)గా పని చేసిన ప్రభాకర్‌కు ఆపత్కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం చేశారు. వారి పాప చదువుకు అవసరమైన ఫీజులు సాయం చేసి ఆదుకున్నారు. ఈ సాయంపై ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ నేను దాసరి వద్ద కోడైరెక్టర్‌గా పని చేశాను. చిరంజీవి నటించిన లంకేశ్వరుడికి కోడైరెక్టర్‌గా చేశాను. ఇటీవల `హెల్ప్ లైన్` అనే సినిమా తీసి దర్శకనిర్మాతగా చాలా నష్టపోయాను. ఆ సినిమాని ఎవరూ రిలీజ్ చేయక నష్టపోయాను. సీబీఐటీలో మా అబ్బాయి ఇంజినీరింగ్ పూర్తయి రెండేళ్లయ్యింది. వాడి సర్టిఫికెట్లు డబ్బు కట్టి తేవాలి. పాప బీబీఏ ఫైనల్ ఇయర్‌కు వచ్చింది. 2.5 లక్షల రూపాయలు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయగలదు. ఎంత ప్రయత్నించినా డబ్బు ముట్టలేదు. దీంతో సాయం కోసం ఎవరిని అర్థించాలి? అనుకున్నాను. నా ఉద్యోగం మాటేమో కానీ.. చెల్లి చదువు పరీక్ష ఫీజు కట్టాలి.. అని నా కుమారుడు అన్నాడు. నా ఇద్దరు పిల్లల భవిష్యత్‌ని కాపాడుకోలేను.. నా ఇల్లు శ్మశానవాతావరణంలా మారిందని బాధపడ్డాను. కానీ ఏదోలా ప్రయత్నించాను. తెలుగు చిత్రసీమలో చిరంజీవిగారు మాత్రమే ఈ సాయం చేయగలరు. ఆయనను అర్థించేందుకు కలిసాను. 30ఏళ్ల క్రితం లంకేశ్వరుడికి పని చేసినప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమను కనబరిచారు. వెంటనే స్పందించి ఫీజు ఏర్పాటు చేశారు. ఆ ఫీజును ఇన్ టైమ్‌లో కట్టలేకపోవడంతో హాల్ టికెట్ ఇవ్వలేమని అన్నారు. కానీ చిరంజీవి గారు సాయం చేశారని అనగానే అక్కడ స్టాఫ్ అంతా సాయం చేశారు. గజేంద్ర మోక్షంలో మొసలికి చిక్కిన గజేంద్రుని కాపాడేందుకు వచ్చిన మహా విష్ణువులా చిరంజీవి నన్ను ఆదుకున్నారు. చిరంజీవి గారు ఆదుకున్నారు అనగానే నా కష్టం విని రామ్ చరణ్ గారి స్టాఫ్ కూడా అంతే సాయం చేశారు. నేను ఈరోజు ఇలా మాట్లాడానంటే దానికి కారణం చిరంజీవి గారు.. రామ్ చరణ్ గారు ఆదుకోవడం వల్లనే’’ అని అన్నారు. పరిశ్రమలో ఎందరికో సాయం చేసిన మెగాస్టార్ ఇటీవల కొందరు ఆర్టిస్టులకు చెక్కుల రూపంలో ఆర్థిక సాయమందించారు. ఇప్పుడు కష్టకాలంలో పిల్లల పరీక్షలకు ఫీజులు కట్టలేని కోడైరెక్టర్ ప్రభాకర్‌ని ఆదుకున్నారు. -
శివ పార్వతి సారీ చెప్పారు
-
శివ పార్వతి వీడియోపై ప్రభాకర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: తనకు కరోనా వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారని 'వదినమ్మ' సీరియల్ నటి శివపార్వతి భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. తన గురించి ఆ సీరియల్ నటుడు, నిర్మాత ప్రభాకర్ పట్టించుకోలేదని ఆమె వీడియోలో వాపోయారు. అయితే, ఇదంతా ఓ చిన్న పొరపాటు వల్లే జరిగిందని పేర్కొంటూ ప్రభాకర్ బుధవారం రాత్రి ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. "శివపార్వతి అమ్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని మీద స్పందించమని నన్ను అభిమానించే వాళ్లు, అలాగే అది నిజమని నమ్మిన వాళ్లు, మీడియా ఛానల్స్ వాళ్లు, అసలేం జరిగిందని తెలసుకోవాలనుకునేవాళ్లు.. అందరూ అడిగారు. ఇంతమంది అడుగుతున్నా కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటే.. ఇన్ని రోజుల తర్వాత అమ్మని నిన్న వీడియోలో చూడటమే. ఆ వీడియోలో ఆమె మాటలు వినడమే. ఎందుకంటే నాకు అటునుంచి ఫోన్లు రాలేదు. నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు, వాళ్ల అబ్బాయి మాట్లాడాడు. (చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!) ఇవన్నీ అమ్మకు పెద్దగా తెలియకపోవడం వల్ల చిన్న మిస్ అండర్స్టాండింగ్ జరిగి బాధపడి, వీడియో రిలీజ్ చేశారు. అయినా నేను అమ్మ కోలుకోవాలి, అమ్మ కోలుకున్న తర్వాత ఈ విషయం మాట్లాడతాను అని రియాక్ట్ అవలేదు. కానీ ఇందాక శివ పార్వతమ్మ నాకు ఫోన్ చేసి బాబు.. సారీ, చిన్న పొరపాటు జరిగింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగింది. నేను అది యూట్యూబ్‌లో కూడా పెట్టలేదు. నాకు సోషల్ మీడియా గురించి కూడా తెలీదు. వదినమ్మ గ్రూప్‌లో మాత్రం పెట్టాను. అది బయటకు ఎలా వెళ్లిందో నాకు తెలియదు. నాకు విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. అసలేం జరిగిందనేది మళ్లీ ఇంకో వీడియో పెడతానన్నారు. ఈ వీడియోలు పెట్టడాలు వదిలేయండి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండమ్మా అని చెప్పాను. (నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి) అమ్మకు ఏ అవసరం వచ్చినా చూసుకోడానికి మేమున్నాం, ఎప్పటికీ ఉంటాం కూడా! అమ్మే కాదు, ఇండస్ట్రీలో ఎవరికి ఏం ఆపద వచ్చినా అందరం సాయం చేస్తాం. ఈ సందర్భంగా శివ పార్వతి అమ్మకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చేంతవరకు సహాయపడ్డ మా ఇండస్ట్రీ గొప్ప వ్యక్తులకు, ముఖ్యంగా శివబాలాజీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, జీవితా రాజశేఖర్, ఇంకా ఎవరెవరు ముందుకొచ్చి అమ్మకు సహాయపడ్డారో వాళ్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ విషయం గురించి తప్పకుండా నేను వివరణ ఇస్తాను. అమ్మ కూడా వివరణ ఇస్తుంది. ప్రస్తుతానికి అమ్మ కోలుకోవాలని మనస్ఫూర్తిగా మనమందరం ప్రార్థిద్దాం" అని ప్రభాకర్ తెలిపారు. -
సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ ఆత్మహత్య
పంజగుట్ట : సీనియర్ జర్నలిస్టు, రచయిత వడ్డాలపు ప్రభాకర్ (43) హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో కుమారునితో కలిసి ఉంటున్న ఆయన శనివారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుండి బయల్దేరి ఎనిమిదిన్నరకు సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నారు.అయితే ఆయన నేరుగా ఆఫీస్‌కు వెళ్లకపోవటం, రాత్రి రెండు గంటలు దాటినా ఇంటికి రాకపోవటంతో ఆయన కుమారుడు శిల్పి ఆదివారం తెల్లవారుజామున పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు వ్యాపారులు హుస్సేన్‌సాగర్‌లో ఓ గుర్తు తెలియని శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు జేబుల్లో లభించిన సెల్‌ఫోన్, గుర్తింపు కార్డు ఆధారంగా ప్రభాకర్‌ను గుర్తించారు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో బాధపడుతున్నందునే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రభాకర్ పలు టీవీ చానళ్లతో పాటు, బస్తీ సినిమాకు మాటల రచయితగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ‘సాక్షి’దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రభాకర్ మరణంపై ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి సంతాపం వ్యక్తం చేశారు. నేడు స్వస్థలానికి భౌతిక కాయం గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచిన ప్రభాకర్ భౌతికకాయాన్ని పలువురు జర్నలిస్టులు సందర్శించి సంతా పం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి నివాళి అర్పించారు. సోమవారం ఉదయం కుటుంబీకుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించి ఆయన స్వస్థలం కేసము ద్రం మండలం కల్లెడకు తరలిస్తారు. -
ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్
బ్యాడ్ టైమ్‌లో బ్యాడ్ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏవిఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ... ‘నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు ఆర్కిటెక్ గా పని చేసేవాడ్ని ఒక ఫొటో వంద మాటలు చెపుతుంది అన్నట్లు ఒక సినిమా వెయ్యి మాటలను చెపుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అభిరామ్, కృతిక చాలా బాగా నటించారు. మా ఎడిటర్ అమర్ చాలా బాగా ఎడిట్ చేశారు. నాకు ఈ జోనర్ చాలా కంఫర్ట్ అనిపించింది’అన్నారు. ప్రొడ్యూసర్ స్వామి మట్లాడుతూ... ‘మాకు సినిమా గురించి ఏమీ తెలియదు. సుబ్బుగారు వచ్చి కథ చెప్పారు. కథ నచ్చి ఆయనతో కలిసి మరో ముగ్గురం మొత్తం నలుగురం కలిసి ఈ సినిమాని నిర్మించి ఇంత దూరం తీసుకువచ్చాం. ఇక దేవుడి పైనే భారం వేశాం’ అన్నారు. హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ... ‘ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాతో కలిసి ఈ సినిమా నటించిన అందరూ మంచి వారు. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. హీరో అభిరామ్ మాట్లాడుతూ... ‘సుబ్బుగారికి ప్రొడ్యూసర్స్‌కి నా థ్యాంక్స్. ఈ కథ విని నచ్చి చేశాను. కృతికి కూడా కృతజ్ఞతలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బి.వి.ఎస్.ఎన్గారికి, మధుర శ్రీధర్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు. బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ... ‘ఒక థ్రిల్లింగ్ చిత్రాన్ని ఇంత దూరం తీసుకురావడమే చాలా కష్టం. షూటింగ్ వరకు తీసుకువెళ్ళాక నాలాంటి వారు కొన్ని మార్పులు చెపుతారు కొంచెం, కామెడీ యాడ్ చెయ్యమని, కొన్ని మాటలని, కొంత లవ్ యాడ్ చెయ్యమని ఇలా అంటుంటారు. కాని వీళ్ళు అమెరికా నుండి వచ్చిన ఒక దర్శకుడిని నమ్మి ఈ అవకాశం ఇవ్వడం. ఈయన వాళ్ళని నమ్మించడం చాలా గ్రేట్ వారిద్దరికి ముందుగా అభినందనలు. చాలా మంది అనుకుంటారు విదేశాల్లో చదువుకుని వస్తారు వీళ్ళకు సినిమాల ఏమి తెలుసు అని. కాని శేఖర్‌కమ్ముల, అడవిశేషు ఇలా చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు’ అన్నారు. -
రాహు కాలంలో చిక్కుకుందా?
బ్యాడ్ టైమ్‌లో బ్యాడ్ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏవిఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. ‘‘కొత్త దర్శకులు విభిన్న ఆలోచనలతో న్యూ ఏజ్ సినిమాలు తీస్తున్నారు. ఇది కూడా అలాంటిదే’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్
కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా రాహు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ.. ‘కొత్త సబ్జెక్ట్స్‌తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమాని రివల్యూషనైజ్ చేస్తున్నారు. ఇది కూడా అలాటి ఒక న్యూ ఏజ్ సినిమా అవుతుంది’ అన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ ఫిలిం స్కూల్లో పట్టా పొందిన సుబ్బు.. రాహు సినిమాను టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో రూపొందించారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు. ఏవీఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లక్కరాజు సంగీతమందిస్తున్నారు. చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
టీడీపీ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న పోలీసు దొర..
‘పోలీస్ కమిషనరా.. అయితే ఏంటి?.. సిటీకి సీపీలు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్’.. 17 ఏళ్ల క్రితం ఓ సినిమాలో పేలిన ఈ పూరీ జగన్నాథ్ మార్కు డైలాగ్.. ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంది.ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. మన వైజాగ్ వరకు ఈ డైలాగ్ కాస్త మార్చి చెప్పుకోవాలేమో అనిపిస్తోంది.. అదెలా అంటే..పాతికేళ్లుగా సిటీకి సీపీలు వస్తున్నారు, పోతున్నారు.. అయితే ఏంటి?.. షాడో సీపీ మాత్రం ఒక్కడే.. ఇక్కడే..!కానీ సినీ డైలాగ్‌లో చెప్పినట్లు సదరు షాడో సీపీ లోకల్ కూడా కాదండోయ్.. సిక్కోలు నుంచి వచ్చి ఇక్కడే పాతుకుపోయారు..ఇంతకీ ఆ షాడో సీపీ ఎవరంటారా.. అతడే కేపీ.. అదేనండి కింజరాపు ప్రభాకర్..ప్రస్తుతం ఏసీపీగా ఉన్న ఈయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల సోదరుడే ఈయనగారు.ఎస్సైగా, సీఐగా, ఏసీపీగా.. పోస్టు ఏదైనా.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడే బిచాణా వేసేశారు. బహుశా ఇంత అడ్డగోలుగా పాతుకుపోయిన పోలీసు అధికారి బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మరొకరు లేరేమో! ఒకేచోట మూడేళ్ల సర్వీసు దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలూ ప్రభాకర్ విషయంలో పని చేయలేదు.ఇటీవలే కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సహా చాలామంది బదిలీ అయినా.. మంత్రి సోదరుడు మాత్రం ఇక్కడే పాగా వేసేశారు.సరే.. వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఇలా పాతుకుపోయి.. తన పని తాను చూసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు.కానీ సదరు ప్రభాకర్ మాత్రం పూర్తిస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాదిరిగా పని చేస్తుండటమే వివాదాస్పదమవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రులు, అధికార పార్టీ నేతల కుటుంబీకులు, రాజకీయ నాయకుల బంధువులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదా..!?.. అయ్యో ఎందుకు చేయకూడదు.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తమ ఉద్యోగ ధర్మాన్ని, రాజకీయాలతో ముడిపెట్టకుండా చేయాలి. రాజకీయాలకతీతంగా పనిచేయాలి. అలా పని చేస్తున్నవారెందరో ఉన్నారు. కానీ రాజకీయాలతో అంటకాగుతూ.. అధికార పార్టీ మనిషిగా ముద్ర వేసుకుని మరీ హల్చల్ చేసే ఏసీపీ కింజారపు ప్రభాకర్ వంటి కొందరు కూడా ఉంటారు. కింజారపు ప్రభాకర్‌కు నిబంధలేమిటి?.. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలకు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోగా ఎన్నికల బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఏ పోస్టులో పనిచేసినా మూడేళ్ల పాటు జిల్లాలో పనిచేసిన వారికి స్థానచలం తప్పదని, అదేవిధంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులను సైతం బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ మేరకు బదిలీల ప్రక్రియను గడువులోగా ముగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరేళ్లుగా ఇక్కడే పనిచేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఇక జిల్లా స్థాయిలో కూడా బదిలీలకు అర్హులైన అధికారుల జాబితాలను సిద్ధం చేసి సీసీఎల్ఏ, పంచాయతీరాజ్ కమిషనర్లకు పంపించారు. అదేవిధంగా పోలీసుశాఖ పరిధిలో మూడేళ్లకుపైగా నగరంలోనూ, జిల్లాలోనూ పనిచేస్తున్న సీఐలు, ఏసీపీలను కూడా బదిలీ చేశారు. కానీ ఒక్క కింజారపు ప్రభాకర్‌ను మాత్రం మినహాయించేశారు. మూడున్నరేళ్ళుగా ట్రాఫిక్ ఏసీపీగా ఇక్కడే తిష్ఠ వేసిన ఆయన్ను సరిగ్గా నెల కిందట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం జిల్లా దాటించాలని ఉన్నా... కీలకమైన స్పెషల్ బ్రాంచ్‌కు వేయడం చూస్తేనే.. మంత్రి సోదరుడి విషయంలో నిబంధనలు ఎలా నీరుగారిపోయాయో అర్ధమవుతుంది. షాడో సీపీగా హల్చల్ తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలకంగా ఉంటూ చీటికీ మాటికీ అధికారులపై, ప్రజలపై నోరేసుకుని పడిపోయే మంత్రిగా అచ్చెన్నాయుడుకు పేరుంది. అలాంటి అచ్చెన్నాయుడికి స్వయానా సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడుకు చిన్నాన్న... ఇంతకంటే బ్యాక్‌గ్రౌండ్ ఏం కావాలి?!.. అందుకే ప్రభాకర్ ఏం చెబితే అదే పోలీసుశాఖలో నడిచిపోతుంది.. కాదు కాదు పరిగెడుతుందనే చెప్పాలి. ఈ బ్యాక్ గ్రౌండ్ చూసుకునే సదరు ప్రభాకర్ పోలీస్ కమిషనర్ సహా పై అధికారులెవ్వరినీ లెక్కచేయని తనంతో వ్యవహరిస్తూ మంత్రులు, రాజకీయ నేతలతో మాత్రం సన్నిహితంగా ఉంటుంటారు. ఇక ప్రభాకర్ ఇటీవలి కాలంలో స్పెషల్ బ్రాంచ్‌లోకి మారిన తర్వాత షాడో సీపీగా హల్చల్ చేస్తున్నారన్న వాదనలు స్వయంగా పోలీసు అధికారవర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలపై కన్ను తెలుగుదేశం నేతలతో ఏసీపీ కింజారపు ప్రభాకర్ ఎంత సన్నిహితంగా ఉంటారనేది ఎవరూ చెప్పనక్కరలేదు. ఆయన ఫేస్ బుక్ చూసినా అర్థమైపోతుంది. టీడీపీ కార్యకర్త మాదిరి నారా లోకేష్‌బాబుతో ఫొటోలు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు సహా పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో దిగిన ఫొటోలను ఫేస్బుక్లో పెట్టుకుని హల్చల్ చేయడం చర్చనీయాంశమవుతోంది. సరే.. ఇదంతా ఆయన వ్యక్తిగతం అనుకున్నా.. ఆయన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి టీడీపీ పెద్దలకు పంపించడం వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధమైనా.. ఓ విధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు చేసే పనిని ప్రభాకర్ నెత్తికెత్తుకోవడం, కేవలం టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రెండు మూడేళ్లు మినహా.. ♦ 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఈయన విశాఖ నగరంలోని దాదాపు అన్ని పోలీస్స్టేషన్లతో పాటు రూరల్ జిల్లా పరిధిలోని జీకేవీధి, అనకాపల్లి స్టేషన్లలోనూ ఎస్సైగా పనిచేశారు. ♦ 2002లో సీఐగా పదోన్నతి పొందిన ప్రభాకర్ మొదట కంచెరపాలెం స్టేషన్లో.. తర్వాత ట్రాఫిక్, విజిలెన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. ♦ 2011లో డీసీపీగా పదోన్నతి పొందిన ఈయన కొంతకాలం హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2014లో విశాఖలోని పోలీసు శిక్షణాకేంద్రం ఏసీపీగా తిరిగి వచ్చేశారు. 2014 నవంబర్ నుంచి ట్రాఫిక్ ఏసీపీగా చేసిన ప్రభాకర్ ఈ మధ్యనే స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అంటే మధ్యలో కొద్ది కాలం మినహా దాదాపు 25 ఏళ్లపాటు విశాఖలోనే పనిచేసిన అధికారిగా కింజారపు ప్రభాకర్ ఓ రికార్డు సృష్టించారనే చెప్పాలి. సిక్కోలు ఖాకీ బదిలీలన్నీప్రభాకర్ కనుసన్నల్లోనే ఇక సొంత జిల్లా, తమ్ముడు మంత్రిగా, అన్న కొడుకు ఎంపీగా ఉన్న సిక్కోలులో పోలీసుల బదిలీలన్నీ స్వయానా ప్రభాకరే చూస్తుంటారనేది పోలీసు వర్గాలే లోపాయికారీగా అంగీకరిస్తున్న వాస్తవం. ఎస్సైలు మొదలు.. డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీల వరకు అన్నీ ప్రభాకర్ కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా సిక్కోలుకు అను‘కూల’ అధికారులను పోస్టింగ్‌లు ఇప్పించడంలో ప్రభాకర్ చక్రం తిప్పారని అంటున్నారు. 1991 బ్యాచ్‌కే చెందిన వివేకానంద, కృష్ణవర్మ, ఏవీ రమణలను శ్రీకాకాళానికి బదిలీ చేయించడంలోనూ ప్రభాకర్ ప్రమేయం ఉందన్న వాదనలు పోలీసువర్గాల్లోనే వినిపిస్తున్నాయి. -
రారండోయ్
వైరాగ్యం ప్రభాకర్ కథల సంపుటి ‘రెండు తలల పాము’ ఆవిష్కరణ అక్టోబర్ 29న సాయంత్రం 5:30కు కరీంనగర్‌లోని ఫిలిమ్ భవన్లో జరగనుంది. ఆవిష్కర్త: పత్తిపాక మోహన్. వక్త: బి.వి.ఎన్.స్వామి. నిర్వహణ: తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా. ‘క్రాంతదర్శి: కందుకూరి’, ‘భారతదేశంలో తెలుగు స్థానం’ పుస్తకాల ఆవిష్కరణ సభ అక్టోబర్ 31న సాయంత్రం 6 గంటలకు న్యూ వుడ్లాండ్స్ హోటల్, మైలాపూరు, చెన్నైలో జరగనుంది. వక్త: రామతీర్థ. నిర్వహణ: చెన్నపురి తెలుగు వాణి. కె.శాంతారావు కవితా సంపుటి ‘మహాబాటసారి’ ఆవిష్కరణ నవంబర్ 3న సాయంత్రం 6 గంటలకు విజయవాడ గవర్నరుపేటలోని ఎం.బి.భవన్ మినీ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్. వక్త: దీర్ఘాసి విజయభాస్కర్. నిర్వహణ: ‘వనమాలి–మల్లెతీగ’. ‘లేఖిని’ ఆధ్వర్యంలో రచయిత్రుల కోసం ప్రత్యేకంగా యద్దనపూడి సులోచనారాణి స్మారక కథల పోటీ నిర్వహిస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి స్వాతి శ్రీపాద తెలియజేస్తున్నారు. మూడు బహుమతులు వరుసగా 10 వేలు, 8 వేలు, 5 వేలు. ప్రత్యేక బహుమతులు వెయ్యి చొప్పున రెండు. డీటీపీలో ఆరు పేజీలకు మించని కథలను నవంబర్ 30 లోగా పంపాలి. వివరాలకు: 8297248988. చిరునామా. లేఖిని, కేరాఫ్ డాక్టర్ వాసా ప్రభావతి, 11/2ఆర్టీ మున్సిపల్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్–36. కర్ణాటక తెలుగు సాహితీ సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని(2019 ఫిబ్రవరి 21)ని పురస్కరించుకొని మహాకవి పోతన భాగవతంలోని 2, 3వ స్కంధాలలోని విషయంపై ‘ఛందోబద్ధ గేయ, కవితా పోటీలు’ నిర్వహిస్తోంది. ఎన్నికైన ప్రతి రచనకు రూ.5,000 పురస్కారం. చివరి తేది: 30 డిసెంబర్ 2018. చిరునామా: రాఘవ మాస్టర్, కేరాఫ్ క.తె.సా.స., అంజనాద్రి టవర్స్, మూడో అంతస్తు, బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన, హెచ్ఆర్బీఆర్ లే అవుట్, కళ్యాణ్ నగర్, బెంగుళూరు–560043. మెయిల్: ట్చజజ్చిఠ్చిఛిౌఝఝ్ఛటఛ్ఛిఃజఝ్చజీl.ఛిౌఝ -
ప్రేక్షకుడి హాస్యం
నూతన నటీనటులతో కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేక్షకుడు’. రేఖ సాయిలీల ప్రొడక్షన్స్ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోను న్యాయవాది ఎస్.వరలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.వి.రెడ్డి, పిల్లా రాజా మాట్లాడుతూ– ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో చలమయ్యగారి మిఠాయికొట్టు చాలా ఫేమస్. అందులోని స్వీట్స్‌లాగే ఈ చిత్రం మధురంగా ఉంటుంది. వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. అంతర్వేది, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. మున్నాకాశీ చక్కని బాణీలు అందిస్తున్నారు. ప్రేక్షకుల్ని మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నటీనటులు ప్రభాకర్, శ్రీవాణి, మున్నాకాశీ పాల్గొన్నారు. -
బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకీ రాముడు’
ప్రముఖ యాంకర్, నటుడు బిత్తిరిసత్తి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘తుపాకీ రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘బిత్తిరి సత్తిగా అందరికీ పరిచయమైన సత్తి.. తుపాకీ రాముడు చిత్రంలో మరో కోణంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు ప్రభాకర్‌గారు నాకు పరిచయమైన తొలి దర్శకుడు. సీనియర్ దర్శకుడైన ప్రభాకర్‌గారు ఈ చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం అందరికీ మంచి పేరు, సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’. అన్నారు. చిత్ర దర్శకుడు టి. ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. బిత్తిరిసత్తిని ఈ చిత్రంలో వైవిధ్య కోణంలో చూపిస్తున్నాము. రసమయి బాలకిషన్‌గారు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి సహకరించారు. పూర్తి వినోదాత్మకంగా ఉండబోతోన్న ఈ చిత్రం ప్రేక్షకులందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’ అని అన్నారు. నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ‘సత్తిని మా బ్యానర్లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకులని ఈ చిత్రం చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా అంతా ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రం సత్తికి మంచి పేరునే కాకుండా బిజీ నటుడిని కూడా చేస్తుంది. ఇంకా రెండు పాటలు చిత్రీకరణ జరపాల్సి ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా దాదాపు చివరికి వచ్చాయి. త్వరలోనే ఇతర వివరాలను ప్రకటిస్తాము.’ అన్నారు. -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ ఎన్విఎస్ఎస్ ప్రభకర్
-
సీపీ సీరియస్?
విశాఖసిటీ: ఓ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్‌పై నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా సీరియస్ అయినట్లు తెలిసింది. ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘పచ్చ సేనలో ఖాకీ చొక్కా’ అనే శీర్షికపై ప్రచురితమైన కథనం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ మహేస్ చంద్ర లడ్డా.. ఏసీపీ ప్రభాకర్‌ను కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రాజకీయ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనం ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. బాధ్యతాయుతంగా వ్యవహరించి.. అన్ని వర్గాల పట్ల ఒకే వైఖరితో మెలగాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. -
చుట్టూ పచ్చచొక్కాలు.. మధ్యలో ఓ ఖాకీ చొక్కా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక్కసారి ఈ ఫొటో పరికించి చూడండి. చుట్టూ పచ్చ చొక్కాలు.. నడిమధ్యలో ఓ ఖాకీ చొక్కా కనిపిస్తోంది కదూ.. సదరు ఖాకీ దొర విశాఖ నగర ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్.. అంతే కాదండోయ్.. ఈయనగారు కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు స్వయానా సోదరుడు. అయితే ఏంటి.. మంత్రులు, రాజకీయ నేతల కుటుంబీకులు ఉద్యోగాలు చేయకూడదా? అని అంటారేమో!.. ఎందుకు చేయకూడదూ.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తన ఉద్యోగ ధర్మానికి, రాజకీయాలను కలగలిపేయకూడదన్నదే ఇక్కడ ప్రస్తావనాంశం.. ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం.. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు పూర్తి విరుద్ధమన్నదే ఇక్కడ చర్చనీయాంశం. విమర్శలకు తావిస్తున్న అంశం కూడా.. ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీబీఎన్ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా ఫక్తు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా విశాఖ నగరంలోనే ఏసీపీ ప్రభాకర్ తిష్ట వేశారు. అంతేకాదు.. మధ్యలో ఒకట్రెండేళ్లు తప్ప గత పాతికేళ్లుగా పెద్దగా బదిలీలు లేకుండా ఈ ప్రాంతంలోనే పాతుకుపోయారు. సర్వీస్‌లో ఎలాంటి ఘనకార్యాలు లేకుండానే ఈయనకు ఇండియన్ పోలీస్ మెడల్ ఇచ్చిన సందర్భంలోనూ అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రభుత్వాధికారి అయి ఉండీ.. పచ్చచొక్కా కార్యక్రమాలకు చెందిన పోస్టర్లను ఆవిష్కరించడమేంటని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన సదరు పోలీస్ అధికారి.. అ«ధికార టీడీపీకి ఎంతటి వీరవిధేయత చూపుతున్నారో ఈ ఫొటోతోనే స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఇలా చెయ్యడమేంటని విమర్శలు జోరందుకుంటున్నాయి. -
బ్రాండ్ బాబు సినిమాపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 'బ్రాండ్ బాబు' సినిమా పై కేసు నమోదైంది. తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించడంపై ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. బ్రాండ్ బాబు సినిమాలో చనిపోయిన సన్నివేశంలో తన ఫోటో చూపారని బాధిత మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు. -
‘బ్రాండ్ బాబు’ స్పెషల్ ప్రీమియర్ షో
-
‘బ్రాండ్ బాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రాండ్ బాబు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ సంగీతం : జెబి రచన : మారుతి దర్శకత్వం : ప్రభాకర్ పి నిర్మాత : శైలేంద్ర బాబు దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలా మారుతి మార్క్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రాండ్ బాబు.. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాకర్ దర్శకుడు. బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడిగా తొలి ప్రయత్నం ‘నెక్ట్స్ నువ్వే’తో నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన బ్రాండ్ బాబుతో ఆకట్టుకున్నారా..? డిఫరెంట్ క్యారెక్టర్లో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మెప్పించాడా..? కథ: డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్(సుమంత్ శైలేంద్ర), తన బ్రాండ్ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : బ్రాండ్ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు. రిచ్ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ సరిగ్గా సరిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు.(సాక్షి రివ్యూస్) చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా.. ఓవరాల్‌గా మరోసారి కీలక పాత్రలో మురళీ శర్మ సినిమాకు ప్లస్ అయ్యారు. ఇతర పాత్రల్లో పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ అందుకున్న ప్రభాకర్ నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. రెండో ప్రయత్నంగా మారుతి బ్రాండ్‌తో బ్రాండ్ బాబు సినిమాను తెరకెక్కించారు. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కినా సినిమాలో ఎక్కువగా మారుతి మార్క్ సీన్సే కనిపిస్తాయి. దర్శకుడిగా ప్రభాకర్ తన మార్క్ చూపించలేకపోయాడు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్‌ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో, ఎలా ప్రవర్తిస్తారో చూపించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. కొన్నిసీన్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. (సాక్షి రివ్యూస్)హీరోకు హీరోయిన్ మీద ప్రేమ కలగడానికి, అతనిలో మార్పు రావడానికి బలమైన కారణం ఏమీ కనిపించదు. జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర్చు పెట్టారు. ప్లస్ పాయింట్స్ : కామెడీ మురళీ శర్మ నటన ప్రొడక్షన్ వ్యాల్యూస్ మైనస్ పాయింట్స్ : పాటలు ఎడిటింగ్ సెకండ్ హాఫ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మారుతిగారి జోక్యం లేదు
‘‘డైరెక్టర్ మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథ రెడీ చేసి వేరే డైరెక్టర్‌తో చేయాలనుకుంటున్న టైమ్‌లో నిర్మాతలు ‘బన్ని’ వాసు, ఎస్.కె.ఎన్, ఎడిటర్ ఉద్భవ్ నా గురించి చెప్పారు. మారుతిగారు కథ చెప్పారు. బాగా నచ్చింది. డైరెక్షన్ చేస్తానని చెప్పా’’ అన్నారు ప్రభాకర్. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రభాకర్ చెప్పిన విశేషాలు... ► నా తొలి చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’ నిరాశపరచింది. అయితే సినిమా చూసినవారు సూపర్ అన్నారు. కానీ ప్రేక్షకుల్ని సినిమాకి రప్పించలేకపోయాం. దెయ్యం కథ కావడంతో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో మహిళా ప్రేక్షకులు, పిల్లలు సినిమాకి రాలేదు. ► మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథని చక్కగా వండి నా చేతుల్లో పెట్టి వడ్డించమన్నారు. ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు నా బ్రదర్ చనిపోవడంతో వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ ఆగకూడదని మారుతిగారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఓ సీన్ డైరెక్ట్ చేశారు. హీరో ఫ్యామిలీకి బ్రాండ్స్ పిచ్చి ఉంటుంది. దాన్నే వెటకారంగా, వినోదాత్మకంగా చూపించాం. ► ఇప్పటి హీరోయిన్లు కథ, పాత్ర గురించి కాకుండా హీరో ఎవరు? బ్యానర్ ఏంటి? అని అడుగుతున్నారు. ఈషా నా పాత్ర ఏంటి? అన్నారు. తనను చూస్తుంటే సావిత్రి, సౌందర్యగార్లను చూసినట్టు అనిపించింది. ► ‘బ్రాండ్ బాబు’ డైరెక్షన్ విషయంలో మారుతిగారు జోక్యం చేసుకోలేదు. మనం మరో సినిమా చేద్దామని మారుతిగారు అన్నారు. జ్ఞానవేల్ రాజాగారు ఓ చిత్రం చేద్దామన్నారు. ఆరేడు సెంటిమెంట్ కథలు రెడీ చేశా. నటుడిగానూ కొనసాగుతా. -
అమ్మాయి ఆత్మకథ
అటవీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యం’. ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రలో నటించారు. రమణ ఎస్.వి (వెంకట్రావ్) దర్శకత్వంలో సాయి సంహిత క్రియేషన్స్ పతాకంపై శ్రీసత్య జయ కోమలీదేవి నిర్మించారు. రఘువీర్, వర్ష, శ్రావణ్, జీవా, గిరిధర్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారాల మధ్య అడవిని, తన జాతిని కాపాడుకునే ఓ అమ్మాయి ఆత్మకథతో ఈ చిత్రం రూపొందించాం. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. మా సినిమా పాటలను దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరిగారు రిలీజ్ చేసి, బాగున్నాయని అభినందించారు. ఈ చిత్రానికి చంద్రబోస్‌గారు పాటలు రాయడంతో పాటు ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి. అమర్, లైన్ ప్రొడ్యూసర్స్: భాస్కర్, రామారావు. -
మారుతి కామెడీ టైమింగ్ కనిపించింది
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మారుతిగారి కామెడీ టైమింగ్ చాలా చోట్ల కనిపించింది. ప్రభాకర్ దర్శకత్వ ప్రతిభ తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సుమంత్ శైలేంద్రకు స్వాగతం పలుకుతున్నా. సుమంత్, ఈషా రెబ్బాకు ఈ చిత్రం మంచి హిట్ తీసుకురావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్. శైలేంద్ర నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని నాగచైతన్య విడుదల చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్ నాగచైతన్యకు నచ్చడం సంతోషంగా ఉంది. వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ విడుదల చేసినందుకు నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు ఈషా రెబ్బా. ఈ చిత్రానికి సంగీతం: జేబి, కెమెరా: కార్తీక్ ఫలని. -
ఏదైనా ‘బ్రాండ్’ కావాల్సిందే...!
ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతి.. మరో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రభాకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బ్రాండ్ బాబు’ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి కథను అందించగా.. జేబీ మ్యూజిక్ సమకూర్చాడు. కాగా, ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు. తన చిత్రాల్లో హీరోలకు ఏదో ఒక వీక్నెస్ పెట్టే మారుతి.. ఈ చిత్రంలో హీరోకు బ్రాండ్ అనే జాడ్యాన్ని అంటగట్టాడు. బ్రాండ్ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని డైమండ్.. ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించటం, ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పటం, వాళ్లను ఎదిరించి తన ప్రేమను ఎలా గెలిపించుకోగలిగాడు. తదితర కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్ సరసన తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తోంది. రాజా రవీంద్ర, మురళీ శర్మ, సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ రిలీజ్
-
‘అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలలుగా పరిస్థితి దారుణంగా ఉందని, ఆరోగ్యశ్రీ చెల్లింపులు ఆగిపోయాయాన్నరు. ఏసీడీపీ నిధుల్లోనూ కోత పెట్టారని, కొత్త పథకాల కారణంగా పాత పథకాలు మందగించాయన్నారు. పెన్షన్లు, షాదీ ముబారక్ చెల్లింపులు ఆగిపోయాయన్నారు. వాటన్నింటిపై అసెంబ్లీలో చర్చించేందుకు సమావేశాలు నిర్వహించాలన్నారు. సీపీఐ నేత నారాయణ రామాయణాన్ని విమర్శించారని, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని ఆయన అన్నారు. -
ఆగస్టులో ‘బ్రాండ్ బాబు’
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. మురళీశర్మ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేసిన బ్రాండ్ బాబు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మారుతి స్టైల్లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. -
మారుతి కథతో ‘బ్రాండ్ బాబు’
యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు మారుతి మార్క్‌తో రిలీజ్ అవుతున్న మరో మూవీ బ్రాండ్ బాబు. మారుతి స్వయంగా కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాతో కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బుల్లితెర స్టార్ యాంకర్ పీ ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుండగా మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. జెబీ సంగీతమందిస్తున్నారు. మారుతి మార్క్కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. -
సామాన్య ప్రజలను ఓట్ల కోసమే మోసం..
సాక్షి, పశ్చిమ గోదావరి : కొల్లేరు మూడో కాంటూరు కుదింపుకి సీపీఐ పార్టీ వ్యతిరేమని సీపీఐ జిల్లా జనరల్ సెక్రటరీ డేగా ప్రభాకర్ తెలిపారు. ఏలూరులో ఆదివారం భారతీయ కమ్యూనిస్టు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించడం అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఓట్ల కోసం మోసం చేసి రాజకీయాలు చేస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 120 జీవో తప్పకుండా అమలు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంటూరు కుదింపు జరిగితే కొల్లేరు చుట్టు ఉన్న జనావాస ప్రాంతాలు గతంలో చెన్నై తరహాలో ముంపుకు గురవటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టుకు కూడా వెళతామని డేగా ప్రభాకర్ తెలిపారు. -
‘రాష్ట్రంలో నియంత పాలన’
ఆర్మూర్ : అమరవీరుల త్యాగాలతో ఆవిర్భవించిన రాష్ట్రంలో ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కుటుంబ పాలనతో నియంతలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ప్రభాకర్ విమర్శించారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల ఆకాంక్షల దీక్ష దినంగా పాటిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సును శనివారం నిర్వహించారు. ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అంతకు ముందు ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాం, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడారు. సూర్యశివాజి, ఏపీ గంగారాం, రాజన్న, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కిషన్, సుమన్, నిఖిల్, గంగాధర్, నరేందర్, ప్రశాం త్, క్రాంతి,లక్ష్మి, అయేషా బేగం పాల్గొన్నారు. -
ప్రేక్షకులు చెడిపోకూడదు
ఆది, ఆశ్లేష జంటగా ప్రభాకర్ ఇప్పు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సహచరుడు’. వెరీ గుడ్ సినీ స్కూల్ పతాకంపై రవికుమార్ గంజి నిర్మించారు. సాయి శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ చిత్రం బిగ్ సీడీని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించగా, ఆడియో సీడీని నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘సహచరుడు’ లాంటి చిన్న సినిమాలు వచ్చినప్పుడే ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీకి వస్తారు. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘ఎనిమిదేళ్ల కష్టమే ‘సహచరుడు’ సినిమా. ఒక సినిమా వల్ల ప్రేక్షకులు చెడిపోకూడదు అనేదే నా ఉద్దేశం. హృదయాన్ని తాకే సందేశం మా సినిమా ద్వారా ఇచ్చాం’’ అన్నారు ఇప్పు ప్రభాకర్. ‘‘ట్రెండ్‌కి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలని మొదట అనుకున్నాం. కానీ, అందరికీ అర్థమయ్యే లిరిక్స్‌తో ట్యూన్ చేసాం. పాటలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్. ఆది, ఆశ్లేష, నిర్మాత రవికుమార్ గంజి, పాటల రచయిత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
సరైన పరిష్కారం!
గ్యాంగ్‌లో ఎవరికైనా ఏమైనా జరిగితే సత్య ఊరుకోడు. ఎందుకంటే అతనే గ్యాంగ్ లీడర్. కానీ సడన్‌గా ఓ నలుగురి గ్యాంగ్ వల్ల మర్డర్ జరుగుతుంది. అసలు.. ఈ సత్యగ్యాంగ్కు మర్డర్‌కి సంబంధం ఏంటి? ఆ మర్డర్ పర్పస్ ఏంటి? అనే విషయాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, సుమన్, సుహాసిని, ‘కాలేకేయ’ ప్రభాకర్ ముఖ్య తారలుగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించారు. సెన్సార్ కంప్లీటైంది. ‘‘కాంప్రమైజ్ కాకుండా 16 నెలలు శ్రమించి నిర్మించాం. ఈ చిత్రం ద్వారా ఓ మంచి సందేశం ఇస్తున్నాం. పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. క్లైమాక్స్‌లో అనాథల భవిష్యత్‌కు సరైన పరిష్కారం చూపటం హైలైట్. ‘సత్యగ్యాంగ్’ మంచి చిత్రంలా నిలుస్తుంది’’ అన్నారు మహేశ్‌ఖన్నా. ఈ చిత్రానికి సంగీతం: జెబి. -
‘తుపాకీ రాముడు’గా బిత్తిరి సత్తి
ఓ టీవీ ఛానల్ కార్యక్రమంతో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. పలు టీవీ షోలకు గెస్ట్ గానూ వ్యవహరిస్తున్న సత్తి త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణ కళాకరుడు, ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటించనున్నాడు. బతుకమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు తుపాకీ రాముడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 2న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
కవి మచ్చ ప్రభాకర్ ఆత్మహత్య
సిరిసిల్ల: అభ్యుదయ కవి, తెలంగాణ రచయితల వేదిక జాతీయ కార్యదర్శి మచ్చ ప్రభాకర్(63) ముంబైలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్కి చెందిన మచ్చ ప్రభాకర్ 1977లో ముంబై వెళ్లి అక్కడే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 33 ఏళ్లు పని చేసి ఇటీవల రిటైర్ అయ్యారు. ప్రభాకర్ భార్య పుష్ప(57) 20 రోజుల కిందట జనవరి 2న గుండె పోటుతో మరణించారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ప్రభాకర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ప్రభాకర్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభాకర్ మృతదేహాన్ని సిరిసిల్లకు బుధవారం తీసుకువస్తున్నట్లు సోదరుడు ఆనంద్ తెలిపారు. -
'కాలకేయ'ప్రభాకర్‌తో సరదాగా కాసేపు
-
కంచ ఐలయ్యపై చర్యలేవి: ఎమ్మెల్యే ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: ఆర్య వైశ్యులను స్మగ్లర్లు అని అభివర్ణిస్తూ పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ప్రశ్నించారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినా, రాతలు రాసినా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని ప్రభాకర్ కోరారు. -
‘సోషల్’లో దుష్ప్రచారంపై చట్టాలు తేవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సైబర్ క్రైమ్ రోజురోజుకూ విస్తృతం అవుతోందని, దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అన్నారు. ముఖ్యంగా ఫేక్బుక్లు ఎక్కువయ్యాయని, వాట్సాప్ వంటి గ్రూపుల్లో ముఖ్యమంత్రి సహా, మంత్రులు, ఎమ్మెల్యేలపై కామెంట్లు, తప్పుడు పోస్టింగ్‌లు ఎక్కువయ్యాయని తెలిపారు. దీంతోపాటే బ్లూవేల్ గేమ్ ద్వారా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వీటిని నిలువరించేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలని అన్నారు. -
నెక్ట్స్ మూడు సినిమాలు ఒకే బ్యానర్లో..!
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది సాయికుమార్, విజయాలు సాదించటంలో మాత్రం తడబడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నా తరువాత ఆ ట్రాక్ రికార్డ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డాడు. శమంతకమణితో మల్టీ స్టారర్ సినిమా చేసినా అది కూడా ఆది కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నెక్ట్స్‌నువ్వే మీదే ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆది. అంతేకాదు నెక్ట్స్‌నువ్వే సినిమా నిర్మాతల్లో ఒకరైన తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో వరుస సినిమాలకు ఓకె చెప్పాడు. ఆది తన తదుపరి మూడు చిత్రాలను జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలోనే చేయనున్నాడట. వీటిలో రెండు ద్విభాషా చిత్రాలు కాగా మరోటి తెలుగు సినిమా. రిలీజ్ కు రెడీగా ఉన్న నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని వి4 క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, జ్ఞానవేల్‌రాజా, యువి క్రియేషన్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
సామాన్యుడి వినూత్న ఐడియాలు
-
రామ్‌గోపాల్‌వర్మపై అభిమానంతోనే..
రాయవరం(మండపేట): ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై అభిమానమే తనను సినీ రంగం వైపు వెళ్లేలా చేసిందని వర్ధమాన సినీ దర్శకుడు నాగప్రభాకర్ అన్నారు. తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకుని ఉత్తమ దర్శకుడిగా రాణించాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. శనివారం రాయవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మండపేట నుంచి చెన్నై వెళ్లిన తాను తొలుత ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు వద్ద ‘బొంబాయి ప్రియుడు, పెళ్లిసందడి’ సినిమాలకు, అనంతరం ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్ వద్ద ‘చెప్పాలని ఉంది, అయోధ్య రామయ్య సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేశానన్నారు. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పనిచేశాక రామ్‌గోపాల్‌వర్మపై ఇష్టంతో ఆయన పేరుతోనే తొలిసారిగా సినిమాకు దర్శకత్వం వహించానన్నారు. అనంతరం ‘డీటీఎస్ నిశ్శబ్దం, తరువాతి కథ’ చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. లవ్, థ్రిల్లర్‌గా ‘శివరంజని’ వ్యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘శివరంజని’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు. నందు, రష్మి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నందినిరాయ్, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి, రాజేంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారన్నారు. పూర్తిగా లవ్ అండ్ థ్రిల్లర్‌గా ఆద్యంతం సస్పెన్స్‌తో సినిమా ఉంటుందన్నారు. చివరి అర్ధగంట భాగం సినిమాకు ప్రాణం పోస్తుందన్నారు. సంగీతాన్ని శేఖర్‌చంద్ర అందిస్తుండగా, కెమెరామెన్‌గా సురేందర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి, చివరి షెడ్యూల్ చేస్తున్నామన్నారు. రెండు పాటలు మినహా టాకీ భాగం పూర్తి అయినట్లేనన్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడతాం
గోపాలపురం: సీపీఐ పేదల పక్షాన పోరాడుతోందని, ప్రభుత్వ నిరంకుశవైఖరిని ఎండగడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. మండలంలోని భీమోలులో మంగళవారం ఆందోళన కారులతో ఆయన సమావేశం నిర్వహించారు. 35 సంవత్సరాలుగా పట్టాలు పొంది భూమి సాగులో ఉన్న పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. బినాబీ కౌలు దారులను సృష్టించి కోర్టును అడ్డుపెట్టుకుని భూములను లాక్కోవాలని చూస్తున్న అధికార పార్టీ నాయకులకు తగిన బుద్దిచెబుతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ భీమోలు భూసమస్యపై రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాకను గమనించి నాయకులను నిర్బంధించడం చరిత్రలో మొట్టమొదటి సారన్నారు. నాయకులు బండి వెంకటేశ్వరరావు, వైట్ల విద్యాదరరావు,జెవి నరసింహారావు, కాకులపాటి వెంకట్రావు, దోశమ్మ పట్టాదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిరంకుశవైఖరిని ఎండగడతాం ఏలూరు (సెంట్రల్): సామాజిక హక్కుల వేదిక, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం స్థానిక వసంతమహల్ సెంటర్ సమీపంలోని రెవెన్యూ భవన్లో రౌండ్‌టేబుల్ సమావేశం జరగనున్నట్లు సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ డేగా ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఓట్లూ రామ్‌నాథ్‌కు వస్తాయి
బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ఆత్మప్రబోధానుసారం ఓట్లేయాలని కాంగ్రెస్ నేతలిచ్చిన పిలుపు మేరకు కోవింద్‌కు ఓట్లేస్తారన్నారు. ఓడిపోతామని తెలిసీ మీరాకుమార్ ను పోటికి పెట్టడం బలిపశువును చేయడమేనన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలోనే ఉన్నారని, రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్‌కే ఓటేస్తారని చెప్పారు. -
ఆది హీరోగా 'నెక్ట్స్ ఏంటి..?'
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆది.. హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ స్టార్టింగ్‌లో ఒకటి రెండు సక్సెస్‌లు వచ్చినా.. తరువాత వరుస ఫ్లాప్‌లు నిరాశపరిచాయి. ప్రస్తుతం మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న శమంతకమణి సినిమాలో నటిస్తున్న ఆది తరువాత సోలో హీరోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ సాధించిన ప్రభాకర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా వీ4 మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కామెడీ థ్రిల్లర్ 'యామిరుక్క భయమే'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెక్ట్స్ ఏంటి..? అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవల సూపర్ హిట్ అయిన నాని సినిమాలోని పాట పల్లవిని ఆది సినిమాకు టైటిల్‌గా నిర్ణయించారు. -
‘పెప్పర్ స్ప్రే’ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో జరిగిన పెప్పర్ స్ప్రే ఘటనపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేసిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. 2014 ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలోనే కొందరిపై పెప్పర్ స్ప్రే చల్లడం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ, పింఛన్లు, ఇతర సౌకర్యాలను రద్దు చేయాలని కోరుతూ పొన్నం ప్రభాకర్ ఈ పిటిషన్ వేశారు. ఘటన జరిగి మూడేళ్లయిందనీ, కోర్టుకు ఆలస్యంగా వచ్చారని చెబుతూ జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. -
కొండాపూర్‌లో 'పూరీ' విగ్రహం పెట్టారు
చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): సినీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్ ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే పూరీ జగన్నాథ్ వీరాభిమాని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్ తో ఆవిష్కరింపజేశాడు. అనంతరం విలేకరులతో పూరీ ఆకాశ్ మాట్లాడుతూ..దేశంలోనే ఒక సినీ డైరెక్టర్‌కు విగ్రహం ఏర్పాటు చేయడం అరుదని, అలాంటిది మా నాన్నగారి విగ్రహం కొండాపూర్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే కొండాపూర్ ప్రజలు ఎంతో అభిమానంతో మా నాన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఈ విషయంలో కొండాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే నా వంతుగా ఊరికి అభివృద్ధిలో సహకరిస్తానని చెప్పారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. -
ఖతర్నాక్...కాలకేయ!
వెండితెర అద్భుతం ‘బాహుబలి’లో బాహుబలి, భల్లాలదేవలు ఎలా గుర్తుండి పోతారో కాలకేయుడు కూడా అలాగే గుర్తుండి పోతాడు. అతడు మాట్లాడిన ‘కిలికి’ భాష కూడా అలాగే గుర్తుండి పోతుంది. నల్లరాతి కొండలాంటి దృఢమైన శరీరం, చింత నిప్పులాంటి కళ్లు...ఈ భయానక ఆహార్యానికి తోడు భయంకరమైన కంఠంతో వెన్నులో చలి పుట్టించాడు కాలకేయుడు. ‘ప్రభాకర్’ అనే పేరు పెద్దగా తెలియకపోవచ్చుగానీ, ‘కాలకేయుడు’ అనే పేరు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులకు తెలుసు! ఎవరీ ప్రభాకర్!మహబూబ్‌నగర్ జిల్లా హస్నాబాద్‌కు చెందిన ప్రభాకర్ స్వభావరీత్యా సిగ్గరి. క్రికెట్ ఆడడం తప్ప సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. నటిస్తాను అని ఎప్పుడు భవిష్యవాణిని అంచనావేయలేదు. మాంచి ఒడ్డూ పొడుగు ఉన్న ప్రభాకర్‌ను చూసి బంధువు ఒకరు... ‘‘హైదరాబాద్‌కు వచ్చేయ్... రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాను’’ అన్నాడు. అయితే ఆరు సంవత్సరాలు గడిచినా అలాంటిదేమీ జరగలేదు. మహేష్‌బాబు ‘అతిథి’ సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు అనుకోకుండా ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించే చాన్సు వచ్చింది ప్రభాకర్‌కు. ‘మగధీర’ సినిమా కోసం నటులను వెదుకుతున్నప్పుడు డైరెక్టర్ రాజమౌళిని కలిశాడు ప్రభాకర్. ఆయన ఏమీ చెప్పలేదు. అయితే తనతో పాటు రాజస్తాన్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ ‘మగధీర’ షూటింగ్ జరుగుతోంది. రాజస్తాన్‌లో ప్రభాకర్‌ను గమనించారు రాజమౌళి. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తరువాత మళ్లీ ఉద్యోగ వేటలో పడ్డాడు ప్రభాకర్. ఒకరోజు రాజమౌళి నుంచి పిలుపు వచ్చింది. ‘మర్యాద రామన్న’ సినిమాలో ఒక వేషం ఇస్తున్నట్లు చల్లని కబురు చెవిలో వేశారు రాజమౌళి. చా...లా గొప్ప చాన్స్... కానీ తనకు నటన అంతగా రాదు... ఇదే విషయాన్ని రాజమౌళితో చెప్పాడు ప్రభాకర్. ‘ఫరవాలేదు’ అంటూ దేవదాస్ కనకాల దగ్గర శిక్షణ ఇప్పించడమే కాకుండా, నెలకు పదివేలు సై్టపెండ్ కూడా ఇచ్చారు రాజమౌళి. ‘మర్యాద రామన్న’ సినిమాలో వేసిన బైరెడ్డి పాత్రతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్‌తో అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ‘బహుబలి’ సినిమాలో వేసిన కాలకేయుడి వేషం ప్రభాకర్‌ని ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ఈ సినిమాలో ఉపయోగించిన ‘కిలికి’ భాష కోసం రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రాక్టీస్ చేసేవాడు ప్రభాకర్. ఇది మాత్రమే కాదు... కాలకేయుడిగా ప్రేక్షకులను భయపెట్టడానికి ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగానూ పడ్డాడు. ఆ కృషి వృథా పోలేదు... అని కాలకేయుడి పాత్రకు వచ్చిన స్పందన చెప్పకనే చెప్పింది. -
ఆదికి జోడిగా మరాఠి భామ
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆది.. ప్రేమకావాలి,లవ్ లీ లాంటి హిట్ సినిమాలో నటించిన స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్న ఆది, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందు రానున్నాడు. బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా ఆకట్టుకున్న ప్రభాకర్ దర్శకత్వంలో ఆది హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వీ4 మూవీస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఆదికి జోడిగా ఓ మరాఠి భామను ఎంపిక చేశారు. మరాఠితో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన వైభవీ శాండిల్య, ఆది సరసన హీరోయిన్గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీస్ సంస్థలు సంయుక్తంగా వీ 4 మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
వీ4 తొలి సినిమా ఆదితో..!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, యువి ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలతో కలిసి వీ4 పేరుతో కొత్త బ్యానర్ నెలకొల్పిన సంగతి తెలిసింది. ముందుగా ఈ బ్యానర్ పై భారీ చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ బ్యానర్ తొలి ప్రయత్నంగా ఓ చిన్న సినిమాను ప్రారంభిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేని డిఫరెంట్ కాంబినేషన్‌ను ఈ సినిమా కోసం సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోతో పాటు దర్శకుణ్ని కూడా ఫైనల్ చేసిన నిర్మాతలు త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలోనే కనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ హీరో ఆది. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆది, హీరోగా స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతున్నాడు. ఈ యంగ్ హీరోతో టీవీ స్టార్ ప్రభాకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది వీ4 సంస్థ. గతంలో ప్రభాకర్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమా పట్టాలెక్కనుందన్న వార్త వినిపించింది. అయితే శిరీష్ సినిమాను పక్కన పెట్టేసిన ప్రభాకర్ ఆది హీరోగా సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ఈ ఏడాదిలోనే మరో రెండు చిన్న మీడియం రేంజ్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
చింతలమానెపల్లి : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని, వాటిని కాపాడడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అటవీశాఖ కోర్సిని బీట్ అధికారి ప్రభాకర్ అన్నారు. బాబాపూర్ గ్రామపంచాయతీలోని లంబాడిహేటిలో అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం నివారించాలంటే అడవులను పెంచాలన్నారు. అటవీ జంతువులను వేటాడడానికి పలుచోట్ల ఉచ్చులు బిగించారని వీటికారణంగా మనుషులు చనిపోతున్నారన్నారు. అటవీ జంతువుల కారణంగా పంటలు నష్టపోయినా, ఆస్థులు నష్టపోయినా సమాచారం అందిస్తే వాటికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అడవులను నాశనం చేయడం, వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, చట్టాలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కాళకేయుడితో తలపడుతున్న కాట్రవల్లి
స్టార్ కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ అలీ ప్రేక్షకులను అలరించారు. ‘యమలీల’, ‘ఘటోత్కచుడు’, ‘గుండమ్మగారి మనవడు’ వంటి పలు చిత్రాల్లో హీరోగా మెప్పించారాయన. ఇక.. ప్రభాకర్ విషయానికి వస్తే... విలన్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన ‘రైట్ రైట్’ మూవీలో హీరోకు సమానంగా ఉండే ఫుల్ లెంగ్త్ పాత్రలో మెప్పించారు. కాట్రవల్లి డైలాగ్‌తో అలీ వినోదం పండిస్తే.. కాళకేయగా ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాకర్ ప్రేక్షకులను భయపెట్టారు. తాజాగా వీరిద్దరూ లీడ్ రోల్లో ‘కాళకేయ వర్సెస్ కాట్రవల్లి’ చిత్రం రూపొందుతోంది. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఓగిరాల మూవీస్ పతాకంపై వేమూరి నాగేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇది కామెడీ ఎంటర్టైనర్. ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కల్యాణ్ నటించిన దేవుడి పాత్ర తరహాలో ఈ చిత్రంలో ఓ ప్రముఖ నటుడు కనిపిస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
అందులో విలన్.. ఇందులో హీరో!
‘బాహుబలి’లో కాలకేయగా, అంతకు ముందు పలు చిత్రాల్లో విలన్‌గా నటించిన ప్రభాకర్ ఇప్పుడు హీరో తరహా పాత్రలు చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ‘రైట్... రైట్’లో పాజిటివ్ క్యారెక్టర్ చేశారు. త్వరలో ‘రక్షక భటుడు’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వి, సప్తగిరి, బ్రహ్మాజీ ముఖ్యతారలుగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘రక్షక భటుడు’. సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. సంస్థ లోగోను మరో నిర్మాత ఎమ్మెస్ రాజు విడుదల చేశారు. ‘‘కొత్త కథతో క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఈ సినిమా చేస్తున్నాను. రెండు గంటల సినిమాలో చివరి 15 నిమిషాలు థ్రిల్లింగ్‌గా, మిగతాదంతా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ‘‘ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు ఎ. గురురాజ్. ఎస్.ఎల్. గ్రూప్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, సినిమాటోగ్రాఫర్ జోషి పాల్గొన్నారు. -
మెరుపు
‘‘ఈ రోజు నీ బర్త్‌డే కదా. ఆఫీసుకు సెలవ్ పెట్టేద్దాం. ఈరోజంతా జాలీగా గడిపేద్దాం. ఏమంటావు?’’‘‘అంతకంటేనా!’’ఎప్పుడూ ఆఫీసు తప్ప మరో విషయం పట్టని భర్త...ఇలా మాట్లాడడం కీర్తిని ఆశ్చర్యపరిచింది.‘‘మాట్లాడింది మీరేనా? ఎందుకో నేను ఒక పట్టాన నమ్మలేకపోతున్నాను’’ అంది సరదాగా.‘‘అవును. నేనే. నీ పుట్టిన రోజుకు కూడా నేను ఆఫీసుకు వెళితే ఇంకేమైనా ఉందా? నువ్వు తప్పించి నాకు ఎవరు ఉన్నారు చెప్పు?’’ అన్నాడు ప్రభాకర్. ఈమాట అంటున్నప్పుడు అతని కళ్లలో సన్నటి కన్నీటి పొర. అవును. ప్రభాకర్‌కు ఆమె తప్ప ఎవరూ లేరు.తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. ఉన్న... ఒక్కగానొక్క అన్న తనని ఎప్పుడో మరిచిపోయాడు.ఒంటరితనం భారమై, అది డిప్రెషన్‌గా మారి, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు చుట్టుముడుతున్న రోజుల్లో పరిచయమైంది కీర్తి. ప్రభాకర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే రకం కాదు.ఇతరులతో అంత త్వరగా కలిసిపోయే రకం కూడా కాదు.అలాంటి ప్రభాకర్‌ను తన స్నేహంతో మార్చేసింది కీర్తి.ఆమె స్నేహంలో ప్రభాకర్‌లో కొత్త కళ తొంగి చూసింది.‘ఆఫీసు కోసం కాదు... ఆఫీసుకొచ్చే కీర్తి కోసం’ అన్నట్లుగా... ఎప్పుడు ఆఫీసుకు వెళదామా అని ఎదురుచూసేవాడు. తనకు వేరే సెక్షన్‌కు బదిలీ అయినట్లు చెప్పింది కీర్తి.ప్రభాకర్ తల్లడిల్లిపోయాడు. సెక్షన్ బదిలీ కావడం అంటే... ఎక్కడికో దూరంగా వెళ్లిపోవడం కాదు. జస్ట్... ఫ్లోర్ మారడం అంతే!ఈమాత్రానికే... ప్రభాకర్ విరహ వేదనతో తల్లడిల్లిపోయాడు.ఒకరోజు కీర్తితో ఏకాంతంగా మాట్లాడాడు...‘‘నువ్వు సెక్షన్ మారిపోతేనే... చాలా దూరమైనట్లు ఫీలైపోతున్నాను. రేపు... నువ్వు పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్లిపోతే నేను బతకలేను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు. ప్రభాకర్ మాటలకు కీర్తి కరిగిపోయింది.పెళ్లికి పచ్చజెండా ఊపింది. ఆమె ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లైన ఆరు నెలల తరువాత....కీర్తి తన కొలిగ్ అశోక్‌తో క్లోజ్‌గా ఉంటున్నట్లు ప్రభాకర్ చెవిలో వేశారెవరో. ఆ తరువాత కూడా... కీర్తి, అశోక్‌లపై ఆఫీసులో చిలవలు పలవలుగా ప్రచారం జరిగింది. అది ప్రభాకర్ వరకు వచ్చింది. ఇక ఆగలేకపోయాడు.ఒకరోజు భార్యను నిలదీశాడు.‘‘నువ్వేనా ఇలా మాట్లాడుతుంది. ఎవరో ఏదో అన్నారని నన్ను అనుమానిస్తావా?’’ అంటూ బాగా ఏడ్చింది కీర్తి.‘‘నిన్ను బాధ పెట్టి ఉంటే... క్షమించు’’ అన్నాడు ప్రభాకర్. అయితే ఆ మాట మనసులో నుంచి రాలేదు.అతడి కళ్లలో అనుమాన బీజం... పెద్ద చెట్టై కూర్చుంది. ప్రభాకర్ ఏడుస్తూ చెబుతున్నాడు... ‘‘ఈరోజు నా భార్య పుట్టిన రోజు. సరదాగా దుర్గంచెరువుకు వెళ్లాం. మేము ఇంటికి తిరిగివచ్చే సమయానికి రాత్రి అయింది... ఆ చీకట్లో పెద్దగా ఉరుము ఉరిమింది. వెంటనే... మెరుపు మెరిసింది. ఆ వెలుగులో... నాకు కనిపించిన దృశ్యం... కిందపడిపోయి ఉన్న కీర్తి. అక్కడ తడిగా ఉండడంతో... ఉరుము శబ్దం విన్న వెంటనే ఉలిక్కిపడి జారి పడింది. ఆమె తల అక్కడ ఉన్న బండరాయిని తాకడంతో.... చనిపోయింది...’’ ‘‘నువ్వు చెప్పింది అబద్ధం’’ అన్నాడు ఇన్స్పెక్టర్ నరసింహ.ఆతరువాత... రకరకాల పద్ధతుల్లో ప్రభాకర్‌ని విచారించగా... కీర్తిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు ప్రభాకర్.ఏ విషయం వల్ల... ప్రభాకర్ అబద్ధం చెబుతున్నాడని ఇన్స్పెక్టర్ గ్రహించాడు? -
కడవకల్లులో దేహశుద్ధి
పుట్లూరు: కడవకల్లులో ప్రభాకర్ అనే యువకుడిని సోమవారం రాత్రి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారని పోలీసులు తెలిపారు. గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే కాలనీకి చెందిన ప్రభాకర్ చనువుగా మాట్లాడుతున్నాడనే కారణంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీలోని రచ్చబండ వద్ద చెట్టుకు కట్టేసి మరీ హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని విడిపించారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. -
మంజీర నదిలో వ్యక్తి గల్లంతు
ఆంధోల్(మెదక్ జిల్లా): ఆంధోల్ మండలం రోళ్లపహాడ్ వద్ద మంజీరా నది వరద నీటిలో ప్రభాకర్(30) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు నది పక్కనే రెండెకరాల పొలం ఉంది. పొలానికి కావాల్సిన నీటిని నదిలో మోటారు పెట్టి పారిస్తుంటారు. నేటి (ఆదివారం) ఉదయం నదిలో ఉన్న మోటారును ఇద్దరు కూలీల సహాయంతో బయటికి తీసేందుకు వెళ్లాడు. తాడు సహాయంతో నదిలోకి ప్రభాకర్ దిగాడు. అదే సమయంలో వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ప్రవాహానికి ప్రభాకర్ కొట్టుకుపోయాడు. స్థానికులు నదిలో ఎంత వెతికినా ప్రయోజన లేకపోయింది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
స్నేహితుల చెంతకే ప్రభాకర్
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో గాయపడిన యువకుడి మృతి నాడు అమ్మా, నాన్నలు.. నేడు కుమారుడు.. తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం తొగర్రాయి(దుగ్గొండి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న యువకుడు ప్రభాకర్ శుక్రవారం మృతిచెందాడు. మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన స్నేహితులు నల్ల సతీష్, చిలువేరు రాజు, చింతం ప్రభాకర్ ఈనెల 18న గిర్నిబావిలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా అదే రోజు సతీష్, రాజు మృతి చెం దిన విషయం తెలిసిందే. చావుబతుకుల మధ్య ఉన్న చింతం ప్రభాకర్(20)ఆరు రోజు లుగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ మధ్యాహ్నం మృతి చెం దినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతు డి తాత కంతిరి వెంకటనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. నాడు అమ్మా, నాన్నలు.. నేడు కుమారుడు.. తొగర్రాయికి చెందిన కంతిరి వెంకటనర్సయ్య కూతురు పూలను ఊరుగొండ గ్రామానికి చెందిన చింతం సదానందంకు ఇచ్చి పెళ్లి చేశారు. ప్రభాకర్ పుట్టిన ఐదేళ్లకే సదానందం చనిపోయాడు. గత నాలుగేళ్ల క్రితం పూల చని పోయింది. దీంతో ప్రభాకర్‌ను తాత వెంకటనర్సయ్య పెంచుకుంటున్నాడు. కూలీ పనులుకు వెళ్లి జీవనం సాగిస్తున్న ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లయింది. గ్రామంలో ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభాకర్ తాతఅమ్మమ్మల రోదనలు పలువురిని కంట తడి పెట్టించాయి. -
వినూత్న బోధనకు విశిష్ట పురస్కారం
ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభాకర్ కౌడిపల్లి : వినూత్న పద్ధతిలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయునికి రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం దక్కింది. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పడు నివృత్తి చేస్తూ కొత్త పద్ధతిలో విద్యార్థులకు సులభంగా స్పష్టంగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నందకుగా మండలంలోని తునికి వద్దగల ఎంజేపీటీబీసీ డబ్ల్యూ ఆర్ఎస్ (మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ మత్స్యకారుల గురుకుల పాఠశాల)లో విధులు నిర్వహిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనుంది. మండలంలోని తునికి గురుకుల పాఠశాలకు గతేడాది బదిలీపై వచ్చిన ప్రభాకర్ జీవశాస్త్రంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించేవారు. పాఠాలతోపాటు స్కూల్ దశలోనే ప్రాక్టికల్స్ చేసి చూపుతున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు విన్నదానికి కన్నా ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో విషయం సులభంగా అర్థమవుతోంది. గురుకులంలో ప్రాక్టికల్స్ మెటీరియల్ లేకపోవడంతో ప్రిన్సిపాల్ తిరుపతి, గురుకుల పాఠశాల కార్యదర్శి మల్లయభట్టుతో చర్చించి సుమారు రూ. 4లక్షలతో సైన్స్ పరికరాలను తెప్పించి విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యాబోధనలో లోకాస్ట్ మెటీరియల్ వాడుతూ బోధనోపకరణలతో బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. విద్యాబోధన ఇలా.. విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉపాధ్యాయుడు ప్రభాకర్ తరగతి గదిలో ఎన్నో వినూత్న ప్రక్రియలతో బోధిస్తాడు. ఉదాహరణకు శ్వాసక్రియ పాఠ్యాంశం బోధించేందుకు ఏకంగా మేకకు చెందిన శ్యాస వ్యవస్థను తీసుకువచ్చి అందులో స్వయంగా గాలి ఊది విద్యార్థులతో చేయించడంతో పాటు శ్యాస వ్యవస్థలోని భాగాలు, ప్రక్రియ అందులోని అవయవాలను వివరించి వినూత్నంగా బోధిస్తాడు. దీంతో విద్యార్థులకు సులభంగా అర్ధమవుతుంది. ఇలాంటి ప్రయోగాలు ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో మాత్రమే చేయిస్తారు. దీంతో ప్రభుత్వం ప్రభాకర్ ప్రతిభను గుర్తించింది. గతంలో ఆయన ఖమ్మం జిల్లాతోపాటు మెదక్ జిల్లాలో బొమ్మల రామారం, తూప్రాన్, మెదక్ బాలికల గురుకుల పాఠశాలలో సైతం విధులు నిర్వహించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో సైతం విద్యార్థులు పాల్గొనేలా చేసి బహుమతులు అందుకున్నారు. జిల్లాస్థాయితోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ తనను ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా తనకు తోచిన ఆలోచన ప్రకారం బోధనోపకరణలతో విద్యాబోధన చేస్తా. విద్యార్థులతోపాటు తోటి సిబ్బందితో స్నేహభావంతో మెలగడంవల్ల విద్యార్థుల సమస్యలను తెలియ చేస్తారు. దీంతో సులభంగా వారి సందేహాలను నివృత్తి చేస్తా. - ప్రభాకర్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు -
జాతీయ తెలుగుకవి సమ్మేళానికి ఆహ్వానం
కరీంనగర్ రూరల్: శ్రీశైలంలోని శ్రీప్రసన్న వరదరాజస్వామి కళ్యాణమండపంలో ధూర్జటి రసజ‘ సమాఖ్య శ్రీకాళహస్తి ఆ«ధ్వర్యంలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న జాతీయ తెలుగు కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ప్రధాన కార్యదర్శి, చామన్‌పల్లి జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు వైరాగ్యం ప్రభాకర్‌ను ఆహ్వానిస్తు సమాఖ్య కార్యదర్శి మురళీ లేఖ పంపించారు. ఈ కవి సమ్మేళనంలో తెలుగుభాషాప్రాచుర్యం,ప్రాముఖ్యతను తెలిపే కవితలను పఠించనున్నట్లు ప్రభాకర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న తాడెం ప్రభాకర్(23) ద్విచక్రవాహనం పై వెళ్తూ.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యం చేస్తే సహించం
సంస్థాన్ నారాయణపురం: ఎరుకల జాతి హక్కులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఎరుకల సంఘం జాతీయ అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ ఎరుకల హెచ్చరించారు. సంస్థాన్ నారాయణపురంలో ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎరుకల హక్కుల సమస్యలపై పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వలిగి ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు కావస్తున్నా, ఎరుకల తెగ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేకుండా, దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నామన్నారు. ఎరుకల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలన్నారు. ఎరుకల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మానపాటి సతీష్‌కుమార్, కొండేటి సుగుణమ్మ, నల్లగొండ కళమ్మ, కుంభం సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలుగు వెంకటయ్య, రుద్రాక్షి రవి, కొండేటి లక్ష్మయ్య, తదితరులున్నారు. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..
మద్యానికి బానిసైన ఓ భర్త డబ్బుల కోసం కమ్మలు ఇవ్వలేదన్న అక్కసుతో భార్యను చంపిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి కథనం ప్రకారం...రంగారెడ్డిజిల్లా పూడూరుకు చెందిన ఆకుల ప్రభాకర్‌తో షాబాద్ మండలానికి చెందిన యశోద(32)తో పదహేను సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిరువురు మల్కాజిగిరి వీణాపాణినగర్‌లో నివాసముంటున్నారు. యశోద తమ్ముడు నరేష్ అక్కకు తోడుగా ఉంటూ స్ధానికంగా బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. క్యాటరింగ్ పనిచేసే ప్రభాకర్ తరచూ బయటకు వెళ్లి నెలల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు. తాగుడుకు బానిసైన ప్రభాకర్ తరచూ భార్యను వేధించేవాడు. మంగళవారం అర్ధరాత్రి దాటాక చిత్తూరుకు వెళ్లిన ప్రభాకర్ ఇంటికి వచ్చి భార్యతో మద్యానికి డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు. ఆమె కమ్మలు ఇస్తే అమ్ముకుని వచ్చిన డబ్బులతో మధ్యం తాగుతానని గొడవ పడడంతో ప్రతిఘటించిన యశోదను గొంతు నులిపి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా బావమరిది దుకాణానికి వెళ్లి మీ అక్క చనిపోయిందని చెప్పడంతో నరేష్ బంధువులకు సమాచారం అందించి ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరచూ అక్కను బావ వేదించేవాడని తన అక్క చావుకు అతనే కారణమని నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గొంతు మీద కొన్ని గుర్తులు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక అందింతే పూర్తి వివరాలు తెలుస్తాయని, నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి తెలిపారు. -
నిధులు ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడంలో విఫలమైందని బీజేపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జీవీవీ గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. ఈనెల 7న హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోడీ మహాసమ్మేళనం జరగనున్న నేపథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేరడమే మోడీ లక్ష్యమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి కూడా అమలైన దాఖలాలు కన్పించడం లేదని విమర్శించారు. ఎంసెట్–2 లీకేజీకి కారకులైన కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిని మంత్రి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ అ«ధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నెహ్రు యువ కేంద్ర వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, నగిరి మనోహర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, దాసరి మల్లేశం, ఓరుగంటి రాములు, నల్లగుంట్ల అయోధ్య, అబిద్, లక్ష్మణ్‌రావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విషోదయం
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ ప్రభాకర్ ఒకసారి ఆయన వంక చూసి, జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇద్దరు ముగ్గురు ముసలాళ్లు దూరంగా నిలబడి చూస్తున్నారు. వాళ్ల గాజు కళ్లల్లో నిర్లిప్త భయం దోబూచులాడుతోంది. ‘‘మీ అమ్మగారు తన శరీరాన్ని మా సంస్థకి డొనేట్ చేశారు. మీరూ ఈ పేపర్ల మీద సంతకం చేస్తే, మిగిలిన పని పూర్తిచేసుకుంటాం!’’ ప్రభాకర్ వాళ్లు చూపించిన చోట సంతకాలు చేశాడు. ‘‘ప్రభాకర్గారా?’’ ‘‘ఎవరు?’’ ‘‘నేను మజిలీ ఓల్డేజ్ హోమ్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నాను. సారీ మీకో బాడ్ న్యూస్. మీ అమ్మగారు ఈ రోజు తెల్లవారు ఝామున నిద్రలోనే మరణించారు.’’ ‘‘నేనొచ్చి శవాన్ని హాండోవర్ చేసుకోవాలా?’’ ‘‘అవసరం లేదు. ఆమె తన బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. ఒకసారి మీరు వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే, శవాన్ని మెడికల్ కాలేజీవాళ్లు తీసుకెళ్లిపోతారు.’’ ‘‘వెంటనే బయల్దేరి వస్తున్నాను.’’ తల్లికి తనొక్కడే కొడుకు. బంధువులంతా ఎక్కడెక్కడో వున్నారు. ఎవరికీ తెలియపర్చాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి తేలిగ్గా నిట్టూర్చాడు. శవాన్ని అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్లి కర్మకాండలు చెయ్యాలంటే అదో పెద్ద తలనొప్పి వ్యవహారం! పైగా స్వప్న ఒప్పుకుంటుందో లేదో? స్వప్నకి ఫోన్ చేసి విషయం చెప్పాడు, ‘‘త్వరగా పన్చూసుకొని ఇంటికొచ్చేయ్’’ అంది. అరగంటలో ఊరిబయట వున్న ఓల్డేజ్ హోమ్ ముందు కారాపాడు. ఒక ముసలాయన గబగబా ఎదురొచ్చాడు. ‘‘మీరు ప్రభాకర్‌గారు కదా? రండి లోపలికి వెళ్దాం’’ అంటూ ఓల్డేజ్ హోమ్ వెనక్కు తీసుకెళ్లాడు. మెడికల్ కాలేజీ స్టాఫ్, ఓల్డేజ్ హోమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు వర్కర్లు అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నారు. కొద్ది దూరంలో ఫ్రీజర్ బాక్సులో తల్లి శవం కనబడుతోంది. నెమ్మదిగా తల్లి దగ్గరకు వెళ్లి మొహం వంక చూశాడు. పీక్కుపోయిన దవడలు! గుంటలు పడ్డ కళ్లు! సరుగుడు కర్రలాంటి శరీరం. నిద్రలోనే ప్రాణం పోయినందున, మొహంలో మరణయాతన తాలూకు ఛాయలు కనిపించడం లేదు. ముసలి మేనేజర్ ముందుకొచ్చి, ప్రభాకర్ భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా ఒత్తాడు. ‘‘రాత్రి కూడా చాలా హుషారుగా వున్నారు. పొద్దున్న మార్నింగ్ వాక్‌కి రాలేదేమని అడగడానికి వెళ్తే యి...లా! అయినా బతికినంతకాలం ఎవరి మీదా ఆధారపడలేదు, గ్రేట్ డెత్’’ నిట్టూర్చాడు. ప్రభాకర్ ఒకసారి ఆయన వంక చూసి, జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇద్దరు ముగ్గురు ముసలాళ్లు దూరంగా నిలబడి చూస్తున్నారు. వాళ్ల గాజు కళ్లల్లో నిర్లిప్త భయం దోబూచులాడుతోంది. ‘‘మీ అమ్మగారు తన శరీరాన్ని మా సంస్థకి డొనేట్ చేశారు. మీరూ ఈ పేపర్ల మీద సంతకం చేస్తే, మిగిలిన పని పూర్తిచేసుకుంటాం!’’ ప్రభాకర్ వాళ్లు చూపించిన చోట సంతకాలు చేశాడు. అరగంటలో వాళ్లు పని పూర్తిచేసుకొని ఫ్రీజర్ నుంచి శవాన్ని బయటకు తీసి, తమ వ్యాన్‌లో ఎక్కించి, ప్రభాకర్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. ‘‘పనైపోయింది కదా! ఇక నేను వెళ్లవచ్చా!’’ ముసలి మేనేజర్ ప్రభాకర్ వంక తేరిపార చూశాడు, ‘‘ఒకసారి నాతో రండి’’ అంటూ ఓల్డేజ్ హోమ్ ముందు భాగంలోకి కదిలాడు. ఐదేళ్ల క్రితం తల్లిని చేర్పించడానికి వచ్చినప్పుడు, ముందున్న స్థలం అంతా బోసిగా ఉండేది. ఇప్పుడంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. మొక్కల మధ్యలో అక్కడక్కడా సిమెంటు బెంచీలు వేశారు. వాటి పక్కనే కరెంట్ పోల్స్ కనబడుతున్నాయ్. ‘‘సామాన్యంగా ఇక్కడ ఎవరైనా చనిపోతే, ఆ వార్త వీలైనంత వరకూ హోమ్‌లో ఉన్న మిగిలినవాళ్లకి తెలియనివ్వం! వెనక గేటులోంచి శవాన్ని పంపించేస్తాం. సగం చచ్చిపోయిన తరువాతే వాళ్లు ఇక్కడకొస్తారు. చివరి దశలో వాళ్లు ప్రశాంతంగా వెళ్లిపోవాలని మా కోరిక! రేపు నేనైనా సరే!’’ ప్రభాకర్ విసుగ్గా మొహం పెట్టాడు. అతనికి వీలైనంత తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలనుంది. సాయంత్రం బావమరిది కొడుకు పెళ్లి రిసెప్షన్ ఉంది. వెళ్లకపోతే స్వప్న ఊరుకోదు. ‘‘మీ అమ్మగారు వచ్చిన తరువాతే ఈ కూరగాయ మొక్కలు, ఆకుకూరల మడులు పెట్టించారు. సిమెంటు బెంచీలు వేయించారు. చుట్టుపక్కలుండే పిల్లలకి ఫ్రీగా ట్యూషన్లు చెప్పేవారు. ఆవిడ రామదాసు కీర్తనలు పాడుతుంటే...’’ ముసలి మేనేజర్ గొంతు కొద్దిగా తడబడింది. ‘‘అవునూ మీరొక్కరే వచ్చారేంటి? మీ భార్యగారు రాలేదా?’’ ‘‘ఆవిడకి టైఫాయిడ్. హాస్పిటల్లో ఐసీయూలో ఉంది.’’ ముసలి మేనేజర్ ప్రభాకర్ వంక జాలిగా చూశాడు. ప్రభాకర్‌కి ముళ్లమీద ఉన్నట్టుంది. ‘‘మరి నేను బయల్దేర్తాను. హాస్పిటల్‌కి వెళ్లాలి.’’ ‘‘రెండు నిమిషాలలో వెళ్లిపోదురుగాని, రండి! మీ అమ్మగారి గదిలోకి వెళ్దాం.’’ ‘‘యిప్పుడు జరిగిన కార్యక్రమానికి డబ్బులు కట్టాలా?’’ ప్రభాకర్ భయం భయంగా అడిగాడు. ‘‘ఎందుకంటే నా దగ్గర ఐదు వందలో, వెయ్యో ఉన్నాయి. ఎమోంట్ కావాలంటే నేనెళ్లి పంపుతా.’’ ‘‘నీ పర్సులో అరడజను డెబిట్ కార్డులు ఉన్నాయ’’ని నాకు తెలుసన్నట్టు మేనేజర్ బోసిగా నవ్వేడు. ‘‘అంత అవసరం లేదండి. మీ అమ్మగారు అన్ని ఏర్పాట్లు ముందే పూర్తిచేసుకున్నారు.’’ యిద్దరూ గదిలోకి నడిచారు. తల్లి తాలూకు చీరలు ఒక సంచీలో సర్దబడున్నాయి. ఒక మూల టేబుల్మీద పుస్తకాలు పేర్చున్నాయ్. ‘‘మీ అమ్మగారి వంటిమీద ఎటువంటి బంగారం లేదు. రిస్ట్ వాచీ, సెల్‌ఫోన్ లాంటివి కూడా లేవు’’ ప్రభాకర్ ఒక్కసారి తప్పు చేసినవాడిలా తలదించుకున్నాడు. ‘‘ఆ బట్టలు ఎవరైనా అడుక్కునేవాళ్లు ఉంటే ఇచ్చేయండి.’’ ‘‘మీ అమ్మగారి గుర్తుగా తీసుకెళ్లరా?’’ ‘‘వద్దండి. వాటిని చూస్తే నా మనసు వికలం అయిపోతుంటుంది’’ ముతక వాసన వస్తున్న వాటి వంక దొంగచాటుగా అసహ్యంగా చూశాడు. ముసలి మేనేజర్ ఒక్క క్షణం ప్రభాకర్ వంక పరకాయించి చూశాడు. ‘‘మీ అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం! కనీసం రోజుకొక్కసారైనా మిమ్మల్ని తలుచుకుంటుంటారు. మిమ్మల్ని చాలా సుకుమారంగా పెంచారట కదా!’’ ప్రభాకర్ ఇబ్బందిగా తలూపాడు. ‘‘మీ అమ్మగారి చివరి కోరికేంటో తెలుసా?’’ కొంపదీసి అస్థికలు గంగలో కలపమందా? అయినా మెడికల్ కాలేజీవాళ్లు తీసికెళ్లిం తర్వాత యింకేం మిగుల్తాయ్! లేదంటే ఈ ఓల్డేజ్ హోమ్‌కి లక్ష రూపాయలు డొనేషన్ ఇమ్మందా?’’ ప్రభాకర్ నోరు తడారిపోయింది. ‘‘ఏంటది?’’ పీలగా అడిగేడు. ‘‘ఆఫీస్ రూంలో కూర్చుని మాట్లాడుకుందాం రండి’’ యిద్దరూ కలిసి ఆఫీస్ రూమ్‌లో కూర్చున్నారు. ‘‘టీ గాని, కాఫీ గాని తాగుతారా?’’ ‘‘వద్దండి! అలవాటు లేదు’’ అబద్ధం ఆడేడు ప్రభాకర్. ముసలి మేనేజర్ డ్రాయర్ సొరుగులోంచి ఒక కాగితం బయటకు తీశాడు. ‘‘ఇది మీ అమ్మగారి వీలునామా లాంటిది! ఒక రకంగా ఆవిడ చివరి కోరికని చెప్పొచ్చు.’’ ప్రభాకర్ మొహం విచ్చుకుంది. ‘‘ఏమైనా డబ్బులు దాచిపెట్టిందేమో?’’ ముసలి మేనేజర్ చిన్నగా నవ్వేడు, ‘‘మీరు ఫ్రిజ్ వాటర్ తప్ప ఇంకోటి ముట్టుకోరట కదా! వుక్కపోత అసలు భరించలేరట! టీవీలో అర్ధరాత్రి దాకా సినిమాలు చూస్తుంటారట కదా! అందుకే మీ అమ్మగారు మీకు ఒక ఫ్రిజ్, ప్లాస్మా టీవీ, ఎయిర్ కూలర్ ఇమ్మన్నారు. వాటి తాలూకు డబ్బు బ్యాంకులో వేసుంచారు.’’ ప్రభాకర్ నోరు చప్పరించాడు. ‘‘యివన్నీ నాకున్నాయండి! ఆ వస్తువుల డబ్బిస్తే, మా అమ్మగారి గుర్తుగా ఇంకేదైనా కొనుక్కుంటాం.’’ (స్వప్న ఎప్పట్నించో రవ్వల దుద్దులు అడుగుతోంది) ముసలి మేనేజర్ గొంతు సవరించుకున్నాడు, ‘‘మీ అమ్మగారికి మీరంటే పంచప్రాణాలు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోను డబ్బులివ్వద్దని రాశారు.’’ ‘‘ఓకే! ఐటమ్స్ కోసం ఎప్పుడు రమ్మంటారు?’’ ప్రభాకర్ మనసులో వాటిని అమ్మితే ఎంతొస్తుందో లెక్కేసుకుంటున్నాడు. ‘‘నేను చెప్పేది మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు.’’ ‘‘అవి మీరు ఇంటికి తీసుకెళ్లడానికి కాదు.’’ ప్రభాకర్ అర్థంకానట్టు చూశాడు. ‘‘ఇవాళ కాకపోయినా రేపైనా మీరిక్కడికి రాక తప్పదు కదా! అప్పుడు మీరు ఇబ్బంది పడకూడదని మీ అమ్మగారు చేసిన ఏర్పాటు ఇది!’’ ప్రభాకర్ బతికున్న శవంలా బిగుసుకుపోయాడు. - రాఘవేంద్ర శ్రీనివాస్ -
'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పూర్తయింది!
'కాలకేయ' ప్రభాకర్, ఏ.రవితేజ, అశ్విని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’. రెడ్ కార్పెట్ రీల్ బ్యానర్లో రవి పచ్చపాల ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఎస్.జె. చైతన్యకృష్ణ దర్శకుడిగా టాలీవుడ్ పరిశ్రమకు పరిచియం అవుతున్నాడు. శైలజ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్యకృష్ణ మాట్లాడుతూ.. టైటిల్ చూసి రకరకాలుగా స్పందించిన వారు ఈ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇది చక్కటి ప్రేమకథ. ఈ మూవీలో హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానిగా కనపడతాడు. ‘బాహుబలి’లో కాలకేయగా నటించిన ప్రభాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. సాధారణంగా ఏడ్పించే సీన్లలో వాడే గ్లిజరిన్‌ని మెదటిసారిగా ఈ సినిమాలో నవ్వించటానికి వాడాల్సి వచ్చిందన్నాడు. అలాగే రియల్ గ్యాంగ్‌స్టర్స్‌ని ఈ చిత్రంలో చూపించాం. ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. త్వరలో టీజర్‌ని, అతి త్వరలో ఆడియోని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఏ.రవితేజ, ప్రభాకర్, అశ్విని చంద్రశేఖర్, భానుశ్రీ, వేణు, అప్పారావు తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం ఎమ్.టి.కవిశంకర్ అందిస్తుండగా, సహ నిర్మాతలుగా నగరం సునీల్, మధుమణి వ్యవహరిస్తున్నారు. -
మా కెమిస్ట్రీ కుదిరింది!
‘‘పోలీస్ కావాలని హైదరాబాద్‌కొచ్చా. ఉద్యోగం ఇప్పిస్తామంటూ చాలామంది నన్ను మోసం చేశారు. కానీ, దేవుడు మాత్రం మోసం చేయకుండా నటుడిగా ఈ స్థాయికి చేరుకునేలా చేశాడు. రాజమౌళిగారు ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’లో నాకు మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు ఇచ్చారు’’ అని ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించిన ‘రైట్ రైట్’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ప్రభాకర్ మాట్లాడుతూ - ‘‘ ‘బాహుబలి’ తర్వాత నేను చేసిన ఫుల్‌లెంగ్త్ మూవీ ఇదే. సాధారణంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది అంటారు. కానీ, ఈ చిత్రంలో నాకు, సుమంత్ అశ్విన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సుమంత్ డ్రైవర్.. నేను కండక్టర్. ఇందులో డ్యాన్స్ చేశా. డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లు తప్పక చూడాల్సిన సినిమా ఇది. నిర్మాత ఎమ్మెస్ రాజుగారు, దర్శకుడు మను నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి వెళ్లినప్పుడు విదేశీయులు కూడా నా నటన మెచ్చుకుంటుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’లో విలన్‌గా, మలయాళంలో మోహన్‌లాల్ చిత్రంలో ప్రధానపాత్ర చేస్తున్నా. ఇంకా ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘కాలకేయ వర్సెస్ కాట్రవల్లి’, కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నా’’ అని చెప్పారు. -
శ్రీనివాసపురంలో ఉద్రిక్తత
- పాలేరును కొట్టిన రైతు - ఆందోళనకు దిగిన దళితులు జంగారెడ్డిగూడెం రూరల్ రైతుకు పాలేరుకు మధ్య జరిగిన గొడవ ఓ గ్రామంలో లాఠీచార్జికి దారి తీసింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో దళితులకు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసపురానికి చెందిన రైతు సురేష్ దగ్గర ప్రభాకర్ అనే వ్యక్తి పాలేరుగా పనిచేస్తున్నాడు. సురేష్ పొలంలోని పంటను పశువులు పంటను నాశం చేశాయి. పంట నాశనం చేస్తుంటే ఏం చేస్తున్నావంటూ రైతు పాలేరుపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పాలేరు బంధువులు ప్రభాకర్‌కు న్యాయం చేయాలని గ్రామంలో ఆందోళన దిగారు. ఈ సందర్భంగా రైతులకు దళితులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తం మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న దళితులపై లాఠీ ఝుళిపించారు. నాయయం అడిగిన తమపై అన్యాయంగా పోలీసులు లాఠీచార్జి చేశారని దళితులు ఆరోపించారు. -
అప్పుల బాధతో అన్నదాత మృతి
అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం భానుముక్కలపాడు గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్ (45) రూ.4 లక్షలు అప్పులు చేశాడు. నాలుగు ఎకరాల కౌలు భూమిలో మొక్కజొన్న సాగు చేయగా అది ఎండిపోయింది. అప్పులు తీర్చే విషయంలో తీవ్ర ఆందోళన చెందిన అతడు శనివారం రాత్రి అదే విషయమై కుటుంబ సభ్యుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతడు గుండెపోటుతో మృతి చెందాడు. -
వెండితెర మీద ప్రభాస్ పెళ్లి
ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతీ విషయంలో ఓ హాట్ టాపిక్లా చక్కర్లు కొడుతోంది. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చకు వస్తున్న ఓ అంశం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి. ఇప్పటికే 35 మార్క్‌ను కూడా దాటేసిన ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాకపోవటంతో ప్రభాస్ పెళ్లిని ఏకంగా సినిమా టైటిల్‌గా వాడేస్తున్నారు. బాగా చర్చ జరుగుతున్న విషయం కావటంతో ఇలాంటి టైటిల్ అయితే పబ్లిసిటీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమా విషయానికి వస్తే, బాహుబలి సినిమాలో కాలకేయ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్. ఇప్పటికే సుమంత్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న ప్రభాకర్ ఇప్పుడు మరో సినిమాలో కీ రోల్లో నటిస్తున్నాడు. 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్‌జె చైతన్య దర్శకుడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టైటిల్‌పై ప్రభాస్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఓ యువకుని ఆలోచన అంపశయ్య
ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆనందాలు, ఆవేశాలు, ఆవేదనలు.. అణువణువునా ఆక్రమించుకున్న యువకుడి మనసెంత అల్లకల్లోలం? ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో పీజీ చేసిన ఆ విద్యార్థి అంతరంగమే దానికి సాక్ష్యం. నవల పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సుప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన ఏళ్లనాటి కథను సాహసోపేతంగా తెరకెక్కిస్తున్నారు సిటీకి చెందిన దర్శకుడు ప్రభాకర్ జైని. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత ఓయూలో షూటింగ్ చేసిన ఈ ఏకైక చిత్రంలో సినీరంగానికి చెందని నగర ప్రముఖులూ పాలుపంచుకోవడం విశేషం. - ఎస్.సత్యబాబు ‘అమ్మా నీకు వందనం’ చిత్రం ద్వారా అద్దె తల్లుల (సరొగేట్ మదర్స్) హృదయ వేదనను తెరకెక్కించిన దర్శకుడు ప్రభాకర్ పలు పురస్కారాలు దక్కించుకున్నారు. ప్రభుత్వాధికారిగా పదవీ విరమణ చేసిన ఈయన తనకు ఎంత మాత్రం పరిచయం లేని సినీరంగాన్ని ఎంచుకోవడం మాత్రమే కాదు.. పూర్తి వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అదే కోవలో ప్రస్తుతం అంపశయ్యకి చిత్ర రూపమిస్తున్న ప్రభాకర్ జైని పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. ఓయూలోని హాస్టల్ గదిలో షూటింగ్.. దశాబ్దాల క్రితం నాటి కథ ఇది. చాలా ప్రాచుర్యం పొందిన అంపశయ్య నవలను గతంలో పలువురు సినిమాగా రూపొందించాలనుకున్నా సాధ్యం కాలేదు. అయితే యువకుడిగా ఉన్నప్పుడు ఈ నవల చదివి ఎంతో ప్రభావితమైన నేను ఎలాగైనా ఈ కథను తెరకెక్కించాలని చాలెంజ్‌గా తీసుకొని చిత్రం రూపొందించా. సిటీలోని పలు చోట్ల సినిమా షూటింగ్ చేశాం. గత 50 ఏళ్లలో లేని విధంగా ఓయూలో ఈ సినిమా షూటింగ్ చేయగలిగాం. కథకు అనుగుణంగా 1970 నాటి పరిస్థితులను యథాతథంగా పునఃప్రతిష్టించాం. సిటీ వేదికగా.. జాతీయ అవార్డు లక్ష్యంగా.. అంపశయ్యలో అచ్చ తెలుగమ్మాయి, నగరవాసి పావని హీరోయిన్గా, శ్యామ్ హీరోగా నటించారు. పొట్టి శ్రీరాములు వర్సిటీలోని థియేటర్ ఆర్ట్స్ కోర్సు విద్యార్థులు పాత్రలు పోషించారు. ఐఏఎస్ అభ్యర్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు చెప్పే సిటీకి చెందిన ఆకెళ్ల రాఘవేంద్ర హీరోకి కర్తవ్య బోధ చేసే పాత్రలో సినీరంగానికి పరిచయమవుతున్నారు. తెలంగాణ ప్రజా కళాకారుడు కిన్నెర మొట్ల మొగిలయ్య కూడా ఒక పాటలో తొలిసారి కనిపించనున్నారు. స్వాతి నాయుడు, యోగి దివాన్, కమెడియన్‌గా రాధాకృష్ణ, వాల్మీకి (సాక్షి-పూరి జగన్నాథ్ షార్ట్ ఫిలిం పోటీ విజేత), మోడల్ మోనికా థాంప్సన్.. అలాగే మరికొందరు సినీ రంగానికి చెందిన నగరవాసులు ఈ సినిమాలో నటనతో పాటు పలు అంశాల్లో పాలుపంచుకున్నారు. కొన్ని పాత్రల్లో నేను, నా భార్య కూడా నటించాం. ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ దశలో ఉంది. కథ మీద ఉన్న నమ్మకంతో జాతీయ అవార్డు లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నాం. -
గులాబీ గూటికి వలసలు..
-
గులాబీ గూటికి వలసలు..
టీఆర్ఎస్లోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్యూ * కారెక్కిన టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ * అదేబాటలో దానం, మరికొందరు? * షాక్‌లో టీటీడీపీ.. ఫిరాయింపులు అడ్డుకోలేక సతమతం * రెండు రోజుల్లో కొందరు ముఖ్య నేతలు చేరుతారంటున్న గులాబీ వర్గాలు * జీహెచ్ఎంసీ పీఠమే లక్ష్యంగా కసరత్తు * మరింత మందిని ఆకర్షించే పనిలో సీనియర్ మంత్రులు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పీఠం వలసలకు తెరలేపింది.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. గ్రేటర్‌ను కైవసం చేసుకునే దిశగా వ్యూహం పన్నిన అధికార టీఆర్ఎస్... మరింత మంది విపక్ష ఎమ్మెల్యేలు, నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. మరింత మందిని తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్‌లు గురువారం టీఆర్ఎస్లో చేరారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పేర్లు బయటకు వెల్లడించకపోయినా రెండు రోజుల్లో మరో టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతారని ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. మరింత ముమ్మరం.. గ్రేటర్ పీఠంపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కనీసం వంద డివిజన్లలో విజయం కోసం టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ నెల రెండో వారం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో... ఆలోగానే ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి చేర్చుకోవడంలో నిమగ్నమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద, ప్రకాష్‌గౌడ్‌లు టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. వారిలో ఇద్దరు రెండు రోజుల్లోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని సీనియర్ మంత్రి ఒకరు సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆశిస్తున్న దానం నాగేందర్ ఈ విషయాన్ని ఇప్పటికే టీఆర్ఎస్ అధినాయకత్వం చెవిన వేశారు. దీనిపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్న ఆయన... సోమవారం తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చర్చలు జరుపుతున్న హరీశ్‌రావు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్‌రావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్లో చేరితే భవిష్యత్‌లో వారి రాజకీయ ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండదని నేరుగా సీఎం కేసీఆర్ హామీ ఇస్తున్నట్లు తెలిసింది. ముందుగా ఫోన్లో కేసీఆర్‌తో మాట్లాడాకే వారు పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటున్నారు. టీటీడీ బోర్డు పదవినివదులుకున్న సాయన్నకు ఆ స్థాయి ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇస్తామన్న హామీ తరువాతే... ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి టీఆర్ఎస్లో చేరారు. అయితే 'ఇంకో రెండు రోజుల్లో మరికొందరు ప్రముఖులు టీఆర్ఎస్లో చేరుతారు. మీరే చూస్తారుగా.. జంట నగరాల్లో కాంగ్రెస్, టీడీపీ దాదాపు ఖాళీ అవుతాయి..' అని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొనడం గమనార్హం. షాక్‌లో టీ టీడీపీ.. వలసలతో తెలంగాణ టీడీపీ సతమతం అవుతోంది. పార్టీని వీడితున్న వారిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక ఆ పార్టీ నాయకత్వం తలపట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక విధంగా అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కోలేక చేతుత్తేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీకి నమ్మకమైన నేతగా పేరున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న పార్టీని వీడివెళతారని తాము ఊహించలేదని తెలంగాణ టీడీపీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల సమయంలోనే సాయన్న పార్టీ మారతారని ప్రచారం జరిగినా... ఆయన టీడీపీతోనే ఉన్నారు. దీంతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమించారు. అయినా సాయన్న గురువారం టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇదివరకే నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు గులాబీ గూటికి చేరారు. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా గులాబీ దళంలో చేరనున్నారని చెబుతున్నారు. అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారాన్ని ప్రకాశ్‌గౌడ్ ఖండించారు. -
కొత్త సినిమాకు... రైట్ రైట్
యూత్ మాత్రమే కాదు... ఫ్యామిలీస్ కూడా మెచ్చే ప్రేమకథా చిత్రాలు చేస్తూ సుమంత్ అశ్విన్ అందరికీ దగ్గరయ్యాడు. ‘లవర్స్’, ‘కేరింత’, ‘కొలంబస్’... ఇలా వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ యువహీరో తాజాగా ‘రైట్ రైట్’ అనే చిత్రం అంగీకరించారు. నూతన దర్శకుడు మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబరు 7న ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఒక మలయాళ సూపర్‌హిట్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటి వరకూ సుమంత్ అశ్విన్ చేసిన పాత్రలకు భిన్నంగా ఇందులోని పాత్ర ఉంటుంది. ‘బాహుబలి’లో విలన్‌గా భయపెట్టిన ప్రభాకర్ ఓ కీలక పాత్రలో నవ్వించ నున్నారు. విజయనగరం, అరకు పరిసర ప్రాంతాల్లో జరిగే సింగిల్ షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్’ స్వామి, ఛాయాగ్రహణం: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, ఆర్ట్: కె.ఎం. రాజీవ్, సహ నిర్మాత: జె.శ్రీనివాసరాజు. -
కదనరంగంలో కాలకేయ
-
ఇంతకీ ఏంటీ.. కాలకేయ 'కిలికి'
తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో విడుదలై రికార్డుల మోత మోగిస్తోన్న ఈ చిత్రరాజం ఎన్నో విశేషాలకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా నటీనటుల హావభావాలు, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు ప్రేక్షకులను మరో విశేషం అమితంగా ఆకట్టుకుంటోంది. అదే 'కిలికి'! థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఒక్కసారైనా దీన్ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారంటే నమ్మాల్సిందే! ఇంతకీ ఏంటీ 'కిలికి'? సీన్లోకి వెళ్తే.. మాహిష్మతి రాజ్యభారాన్ని తన కుమారులైన భల్లాల దేవ, బాహుబలిలకు అప్పగించాలని భావిస్తుంది శివగామి. ఇద్దరిలో ఎవరు సమర్థులో పరీక్షించి, వారికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తుంది. సకల విద్యల్లోనూ ఆరితేరిన ఆ అన్నదమ్ములిద్దరూ ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీపడుతూ సమవుజ్జీలుగా నిలుస్తారు. దీంతో శివగామికి ఎటూ తేల్చుకోలేని స్థితి ఎదురవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మాహిష్మతి రాజ్య సైనిక రహస్యాలు తస్కరించి, దాడికి సిద్ధమవుతారు 'కాలకేయులు'. వీరు గిరిజన తెగకు చెందిన వారు. వారి ప్రభువు 'కాలకేయుడు'. మాహిష్మతి రాజ్యమ్మీదకు దండెత్తి వచ్చిన కాలకేయ మహారాజుతో శాంతి చర్చలు జరిపేందుకు వెళతారు శివగామి, యువరాజులు. ఈ సీన్లో కాలకేయ పాత్రధారి ప్రభాకర్ ఓ వింత భాషలో మాట్లాడతాడు. అయితే అదేదో నోటికొచ్చిన కారుకూతలు కావు. బాహుబలి సినిమా కోసమే సృష్టించిన ప్రత్యేక భాష అది. దాని పేరే కిలికి! సృష్టికర్త ఎవరు? ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకొన్న విషయం మనందరికీ తెలిసిందే.. ఇందులో తమిళ వెర్షన్‌కు పాటలు, మాటలు రాసింది 'మదన్ కార్కీ'. ప్రఖ్యాత తమిళ సినీ రచయిత వైరముత్తు కుమారుడే ఆయన. విడుదలైన భాషలన్నిటిలోనూ వినిపించిన 'కిలికి' భాష సృష్టికర్త కూడా ఆయనే. ఈ కొత్త భాష ఏదో నోటికొచ్చిన కూత కాదని, దాని వెనక ఎంతో వ్యాకరణం దాగుందని చెబుతారీయన. ఆలోచనకు బీజం.. బాహుబలి సినిమా తమిళ వెర్షన్ మాటల రచయితగా కార్కీ తొలుత ఈ ప్రతిపాదన తీసుకొచ్చారట. రెండేళ్ల కిందట దర్శకుడు రాజమౌళి యుద్ధ సన్నివేశాన్ని వివరించినపుడు కాలకేయులు మాట్లాడే భాష కొత్తగా సృష్టిద్దామని కార్కీ ఆయనతో అన్నారు. దానికి రాజమౌళి అంగీకరించడంతో ఈ భాష పుట్టుకొచ్చింది. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' లోని ఎల్విష్, స్టార్‌ట్రెక్ సిరీస్‌లోని క్లింగన్ వంటి భాషలను ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు. క్లిక్ నుంచి కిలికి వరకూ.. కంప్యూటర్ సైన్స్ పట్టభద్రుడైన కార్కీ పరిశోధన కోసం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో చేరారు. ఈ సమయంలోనే చిన్నారులకు పాఠాలు చెప్పడం లాంటి పార్ట్‌టైం జాబ్స్ చేసేవారు. వివిధ భాషల్లో ప్రవేశమున్న కార్కీ.. పిల్లలకు కూడా ఆ భాషలను నేర్పించడం మొదలు పెట్టారు. ఈ సమయంలోనే ఆయనకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. 'ఏదైనా సరికొత్త భాష కనిపెడితే ఎలా ఉంటుందీ..?' అన్నదే ఆ ఆలోచన. అంతే.. 100 ప్రాథమిక పదాలతో ఓ కొత్త భాషను కనిపెట్టేశారీయన. దీనికి 'క్లిక్' అని పేరు పెట్టారు. ఇందులో మిన్-నేను, నిమ్-మీరు.. లాంటి సింపుల్ పదజాలాన్ని నింపేశారు. ఈ 'క్లిక్'నే బాహుబలి కోసం మరింత విస్తరించి 'కిలికి' చేశారు. క్లిక్‌లోని ప్రాథమిక పదాలకు మరికొన్ని పదాలు జతకూర్చి 750 పదాలతో సరికొత్త పదజాలాన్ని సృష్టించేశారు. దీనికి 40కి పైగా బలమైన వ్యాకరణ సూత్రాలనూ రచించారు. ప్రస్తుతం వాడుక భాషల్లోని మాటలన్నీ ఇందులోనూ ఉంటాయని, దీనితో పాటలు కూడా రాయొచ్చని కార్కీ చెబుతున్నారు. కఠినత్వం కోసం.. 'కాలకేయ' ప్రభాకర్ మాట్లాడే భాషను మొదట సబ్‌టైటిల్స్ ద్వారా తెర మీద కనిపించేలా చేద్దాం అనుకున్నారు. అయితే అలా చేయడం ద్వారా భావోద్వేగాలు ప్రేక్షకుడికి చేరవని గ్రహించారు. దీంతో యుద్ధక్షేత్రంలో శత్రువు పలుకులు కఠినంగా ఉండేలా.. గ్రామర్ విషయంలో జాగ్రత్త పడ్డారు. నెమ్మదైన మాటలు మృదువుగా, ఘాటైన మాటలు కటువుగా ఉండేట్టు పదాల రూపకల్పన చేశారు. ఉదాహరణకు 'రక్తం' అనే పదాన్ని కిలికిలో 'బ్రుర్ర్స్లా' అని పలుకుతారు. ఇలా కాలకేయ కాఠిన్యాన్ని ప్రేక్షకుడికి గుచ్చుకునేలా చేశారు. అన్నట్టు.. నాలుకతో ప్రభాకర్ చేసే 'టప్ టప్' శబ్దాలు కూడా వ్యాకరణంలో భాగమే! మీకోసం కొన్ని వాక్యాలు 1. తెలుగు: అతడు బతికే ఉండాలి. కిలికి: టా బీత్ క్రువూల్ డుంక్రా. 2. తె: అది నిజమా? కి: లూర్షా క్వే? 3. తె: ఆయుధాలు కిందపడేసి పారిపోండి. కి: నిమ్ క్ల్కే గదీత్వూ ట్టా కొరోటా-జ్రా రెయ్య్.. ఫుహూ క్ల్కే. 4. తె: ఒక గ్లాసు మంచినీరు ఇస్తారా? కి: నిమ్ ష్వీక్క్ మిన్ సుర్ప్ ఉనో ఢాబ్ సాస్‌లా ఫిన్హీ క్వే? 5. తె: మూర్ఖంగా మాట్లాడకు. కి: డంబాడంబా జివ్లా బాహా-నా. -
ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయండి
కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల జిల్లాలో నిరసన వెల్లువెత్తుతోంది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధతం చేస్తామంటూ గురువారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కర్నూలు(న్యూసిటీ): కృష్ణాజిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దారు డి.వనజాక్షిపై ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల జిల్లాలో నిరసన వెల్లువెత్తుతోంది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో భాగంగా గురువారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ప్రభాకర్ డౌన్...డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ వ్యాపారానికి సహకరించని అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హుసేన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కూడా కొందరు రాజకీయ నాయకులు ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రెవెన్యూ అసోసియేషన్ కర్నూలు డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అరెస్టు చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులకు రక్షణ కరువైందని ఆదోని ఆర్డీఓ ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే రాస్తారోకో చేయరాదని ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీఎండీ హుసేన్తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అయినా, అరగంటపాటు కొనసాగించిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గిరికుమార్‌రెడ్డి, కర్నూలు డివిజన్ కార్యదర్శి నిత్యానందరాజు, ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, ఆదోని డివిజన్ అధ్యక్షుడు రజనీకాంతరెడ్డి, నాయకులు రామన్న, ప్రసాద్, నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, జేఏసీ సభ్యులు బాలవెంకటేశ్వర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు శివరాముడు, భూలక్ష్మి, అనురాధ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సోమసుందరం, ఉద్యోగులు, వీఆర్ఓలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఊరంతా పందిళ్లు.. ఇంటింటా సందడి
కొత్తపేట(ప్రొద్దుటూరు) : ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్న కొత్తపేట గ్రామంలో ఆదివారం భారీ ఎత్తున పెద్దమ్మతల్లి దేవర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1000 ఓట్లు గల ఈ గ్రామంలో ఈ ఉత్సవాల నిర్వహణకు గ్రామస్తులు రూ.కోటికిపైగా వెచ్చిస్తున్నారు. వివరాలిలావున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి కూతవేటు దూరంలో జమ్మలమడుగు రోడ్డులో కొత్తపేట గ్రామం ఉంది. పూర్వం గ్రామంలో ప్రతి ఏటా పెద్దమ్మతల్లి దేవరను నిర్వహించేవారు. అయితే గ్రామ పరిస్థితుృ దష్ట్యా దేవరను నిలిపివేశారు. 1958లో చివరగా ఈ ఉత్సవం నిర్వహించారు. కాగా గ్రామస్తులంతా చర్చించుకుని మళ్లీ గ్రామంలో ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రయత్నించారు. మూడేళ్లుగా ఈ విషయం నానుతోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో రెండేళ్లుగా ఉత్సవాన్ని పోలీసుల సూచన మేరకు నిలిపివేశారు. ఏది ఏమైనా ఈ మారు నిర్వహించాలని పూనుకున్నారు. ఈ మేరకు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయానికి సున్నాలు వేశారు. ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి హాజరు కావాలని గ్రామంలోని పలువురు ఆహ్వాన పత్రాలను కూడా పంచిపెట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఊరంతా పందిళ్లు వేసి ఏర్పాట్లు చేశారు. ఇంటింటా అమ్మవారికి సమర్పించేందుకు పొట్టేళ్లు సిద్ధం చేసుకున్నారు. 10 పొట్టేళ్లను కూడా ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి 500కుపైగా పొట్టేళ్లను గ్రామానికి తీసుకురాగా మొత్తం ఖర్చు కోటి రూపాయలకుపైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ప్రముఖుల రాక దేవర ఉత్సవానికి హాజరు కావాలని గ్రామస్తులు ప్రముఖులను ఆహ్వానించారు. ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్బాష, రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, టీడీపీకి సంబంధించి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఉత్సవం నిర్వహించారు తాను ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో గ్రామంలో చివరగా దేవర ఉత్సవాన్ని నిర్వహించారు. 1958 నుంచి దేవర నిర్వహించలేదు. చాలా కాలం తర్వాత నిర్వహిస్తుండటంతో అంతా సందడిగా ఉంది. - గుద్దేటి వెంకటసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చారు గ్రామానికి సంబంధించి పలువురు విదేశాల్లో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు. ఎందరో హైదరాబాద్‌లాంటి నగర ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటివారు తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను ఆహ్వానించారు. విదేశాల్లో ఉన్న వారు సైతం వచ్చారు. - వెల్లాల కుమార్‌రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ అందరినీ ఆహ్వానించాం దేవర మహోత్సవానికి హాజరు కావాలని ఇరు పార్టీల వారిని ఆహ్వానించాం. గ్రామస్తులంతా బంధు మిత్రులను పిలుచుకున్నారు. గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరూ ఆహ్వానితులే. - రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గ్రామ కమిటీ సభ్యుడు గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది దేవర మహోత్సవంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. చాలా రోజులుగా ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వాహనాల పార్కింగ్‌కు కూడా ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేశాం. -కృష్ణారెడ్డి -
కుక్కల్ని చంపిన ఇద్దరి అరెస్ట్
బెంగళూరు(బనశంకరి): దొంగతనానికి వె ళ్లిన సమయంలో మొరిగిన ఐదు కుక్కలకు విషమిచ్చి చంపిన మోసెస్, ప్రభాకర్ అనే ఇద్దరిని జేజేనగర పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 5వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో రంగనాథకాలనీ 4 వక్రాస్ లో సుమారు 5 కుక్కలు, 5 కాకులు, మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానిక నివాసి సత్య జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పశ్చిమవిభాగం డీసీపీ లాబూరామ్ నేతృత్వంలో ఓ బృంధాన్ని ఏర్పాటు చేశారు. ఏసీపీ సత్యనారాయణ మార్గదర్శనంలో ఇన్స్‌స్పెక్టర్ వసంత్‌కుమార్, ఎస్ఐ అంజనప్ప సిబ్బందితో తీవ్రగాలింపులు చేపట్టారు. పోలీసులు నిందితుడు మోసెస్ ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. తనతో పాటు ప్రభాకర్ కూడా ఉన్నట్లు నోరువిప్పడంతో అతన్నీ అరెస్ట్ చేశారు. -
ప్రతిభావంతుడు..మన ప్రభాకరుడు
గంగారం(కాల్వశ్రీరాంపూర్) : ఆయన పేదరికంలో పుట్టి పెరిగారు. సరస్వతీ కటాక్షం పొందాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగారు. కష్టాలకు ఎదురీదుతూ పట్టుదలతో విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయికి ఎదిగారు. నేడు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌లో సిలబస్ మార్పు కమిటీ సభ్యుడిగా నియాకమయ్యారు. ఈ మేరకు టీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనే కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన భైరి ప్రభాకర్. ఆయన తల్లిదండ్రులు రాజవీరు-కనుకమ్మ. తండ్రి చేనేత కార్మికుడు. తల్లి పచ్చళ్లు తయారు చేస్తూ విక్రయించేవారు. వాటిని అమ్మడం ద్వారా ప్రభాకర్ చదువులకు డబ్బు సమకూర్చారు. చెల్లెలు రమ వ్యవసాయ కూలీ పనులు చేసేవారు. ఆమె సంపాదించిన సొమ్మును సోదరుని ఉన్నత విద్యాభ్యాసానికి అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం.. గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించారు. కాల్వశ్రీరాంపూర్‌లో హైస్కూల్, సుల్తానాబాద్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఏపీపీఎస్సీగ్రూ-4 పరీక్ష రాశారు. అందులో ఉత్తీర్ణులై సిరిసిల్లలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగం సాధించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్స్టర్నల్ పరీక్షలు డిగ్రీ, ఎంఏ, ఎంకాం పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా చేరారు. ఎంఫిల్, పీహెచ్డీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (మానవ వనరుల అభివృద్ధి)పై పరిశోధన చేసి పీహెచ్డీ సాధించారు. ప్రొఫెసరయ్యాక వరంగల్ ఉమెన్స్ కాలేజీ, సిరిసిల్లలో అధ్యాపకుడిగా పనిచేశారు. సొంతూరిపై మమకారం.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, కుటుంబ పోషణ విస్మరించలేదు ప్రభాకర్. తల్లిదండ్రులను పోషిస్తూనే తన ఇద్దరు చెల్లెలు పద్మ, రమ వివాహం చేసి అత్తారింటికి పంపించారు. స్వగ్రామంపై మమకారంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, దస్తులు అందించారు. చదువులో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. గురువు చెంతనే చోటు.. ప్రభాకర్ ప్రస్తుతం మెదక్ జిల్లా గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విభాగాధిపతిగా భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అప్పటి వీసీ లింగమూర్తి నుంచి ప్రభాకర్ డాక్టరేట్ పట్టా (కాన్వోకేషన్) అందుకున్నారు. ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ఆయన చెంతనే విధులు నిర్వర్తించే టీపీఎస్సీలో సభ్యుడిగా చేరారు. అదృష్టంగా భావిస్తున్నా, ప్రభాకర్ మా అమ్మానాన్నతోపాటు చెల్లెళ్లు సైతం నేను చదువుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. కనిపెంచి ప్రయోజకుడిని చేసిన అమ్మానాన్న, ఉన్నతస్థాయికి ఎదిగేలా మార్గనిర్దేశం చేస్తూ, ఉన్నత విద్యాభ్యాసంలో ఎదిగేలా కృషి చేసిన గురువులకు రుణపడి ఉంటా. నాపై నమ్మకంతో అప్పగించిన టీపీఎస్సీ సిలబస్ మార్పు కమిటీలో సభ్యుడిగా బాధ్యతగా పనిచేస్తా. -
అక్రమ హేచరీలపై ఉక్కుపాదం
వాకాడు : కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ, చెన్నై అనుమతులు పొందిన రొయ్యల హేచరీలు జిల్లాలో 37 మాత్రమే ఉన్నాయని, అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రొయ్యల హేచరీలు చాలా ఉన్నాయని కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ చెన్నై సీనియర్ టెక్నికల్ అధికారి రమేష్, ఎన్ఎఫ్డీపీ హెదరాబాద్ ప్రభాకర్ తెలిపారు. ఫిషరీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి వీరు మంగళవారం రాత్రి మండలంలోని తూపిలిపాళెం తీరంలోని రొయ్యల హేచరీలను తనిఖీ చేశారు. అందులో అనుమతులు లేకుండా నడుపుతున్న ఆర్ఆర్ హేచరీని సీజ్ చేశారు. ఇటీవల వినాయక, శాంతి, బాలాజీ హేచరీలను కూడా సీజ్ చేశారు. తోటపల్లిగూడూరులోని వీజీఆర్, విడవలూరులోని నీలకంఠ రొయ్యల హేచరీలను కూడా సీజ్ చేశామని రమేష్, ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో అనేక రొయ్యల హేచరీలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, వాటిని గతంలోనే గుర్తించి కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులు పొందాలని హెచ్చరికలు జారీ చేశామన్నారు. అయినప్పటికీ వారు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా హేచరీలను నడుపుతూ, నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా స్థానికంగా దొరికే నాసిరకమైన తల్లి రొయ్యలను పెంచి వాటి ద్వారా రొయ్య పిల్లలను తయారు చేసి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆదేశించడంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ జిల్లాలో 8 హేచరీలు సీజ్ చేశామన్నారు. ఆయన వెంట తహశీల్దార్ ఈశ్వరమ్మ, మత్స్యశాఖ అధికారి కృష్ణకుమార్, ఆర్ఐ మధుసూదన్‌రాజు, ఎస్హెచ్ఓ రషీద్, సిబ్బంది ఉన్నారు. హేచరీలపై దాడులు విడవలూరు: జిల్లాలోని వాకాడు, తోటపల్లిగూడూరు, విడవలూరు మండలాల్లోని అనుమతులు లేని హేచరీలపై మత్స్యశాఖ, కోస్టల్ అధికారులు సంయుక్తంగా మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు హేచరీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని రామచంద్రాపురంలోని నీలకంఠ హేచరీపై దాడులు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ హరికిరణ్, కోస్టల్ అధికారులు రమేష్, ప్రభాకర్, కోవూరు ఎఫ్డీఓ చాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య రొయ్యల హేచరీ సీజ్ తోటపల్లిగ ూడూరు : మండలంలోని కాటేపల్లిలో ఉన్న ఆదిత్య(ఈజీఆర్) రొయ్య పిల్లల హేచరీని మంగళవారం సాయంత్రం కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల జిల్లాలో లోకల్ బ్రూడర్స్తో రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్న హేచరీలపై కోస్టల్ ఆక్వా అథార్టీ అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అనుమతి లేకుండా రొయ్యల పిల్లల్ని ఉత్పత్తి చేసి, అమ్మకాలు చేస్తున్న ఈ హేచరీపై ఆకస్మికంగా దాడి చేశారు. క్షుణ్ణంగా విచారించి సీజ్ చేశారు. -
ట్రాన్స్‌కో సీఎండీగా ప్రభాకర్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా డి.ప్రభాకర్‌రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ట్రాన్స్‌కో సీఎండీగా కొనసాగుతున్న ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.కె.జోషీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ప్రభాకర్‌రావును నియమించింది. ప్రస్తుతం ప్రభాకర్‌రావు టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. -
అందరికీ దగ్గరవుతాడు!
చంద్రమోహన్, ప్రభాకర్, చిన్న, రాంజగన్ తదితరులు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘పాషా అందరివాడు’. పలువురు బాల నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని సాయి సూరజ్ ఫిలింస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో ఎస్.కె. సైదా సూరజ్ రూపొందించారు. ఈ శనివారం చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు ఎంతో మమకారంతో ఈ సినిమా తీశారు. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే తపనతో తీసిన చిత్రం ఇది. ఈ మధ్య నేనెలాంటి కథలో నటించాలనుకున్నానో, ఎలాంటి డైలాగులు చెప్పాలనుకున్నానో ఈ చిత్రం అలాంటిదే’’ అని చెప్పారు. మా ‘పాషా అందరివాడు’ అందరికీ దగ్గరవుతాడనే నమ్మకం ఉందని సైదా సూరజ్ తెలిపారు. -
విమోచన దినోత్సవాన ఎగిరిన జాతీయ జెండా
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిరసనలు వెల్లువెత్తా యి. జాతీయ జెండాను ఎగురవేసేందుకు బీజేపీ, ఏబీవీపీ ఇతర సంఘా లు పోటీపడ్డాయి. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో పలు చోట్ల వాగ్వివాదాలు జరిగాయి. కొంతమేరకు ఉద్రిక్తత ఏర్పడింది. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ సహా బీజేపీ నాయకులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను దాటి రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరోవైపు ఏబీవీపీ నాయకులు కూడా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ప్రవేశమార్గం వద్ద పోలీసులతో వాగ్విదానికి దిగారు. మరి కొందరు ఇనుప కంచెను దాటడానికి యత్నించారు. ఇద్దరు ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ప్రధాన ద్వారంపైకి ఎక్కి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి పట్టణ ఒకటవ ఠాణాకు తరలించారు. భారీ భద్రత అంతకుముందే పోలీసులు కలెక్టరేట్ చుట్టు పక్కల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి ఎవరూ ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఏబీవీపీతోపాటు టీజీవీపీ నాయకులు కూడా కలెక్టరేట్ వద్ద జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. టీఎన్జీఓస్ భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం నిర్వహించారు. మహిళా కళాశాలలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తపస్ ఆధ్వర్యం లో సంఘం కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు జాతీయ జెండాను ఎగురవేశారు. సదస్సులు, సభలు బోధన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు. ఏబీ వీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. టీజీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాస్తారోకో నిర్వహించారు. కోటగిరి తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేస్తుండగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ నాయకులు ర్యాలీలు తీసి, బస్టాండ్ ఎదురుగా జాతీయ జెండాను ఎగురవేశారు. బాన్సువాడలో సీపీఎం, బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. మానవహారం నస్రుల్లాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వర్నిలో పీడీఎస్‌యూ నాయకులు ధర్నా చేపట్టారు. ఆర్మూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. నందిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఏబీవీపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. జేఏసీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. బాల్కొండ, మద్నూరు, బిచ్కుంద, జుక్కల్ మండల కేంద్రాలలో ఏబీవీపీ, బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశా రు. ఎల్లారెడ్డిలో మండల కేంద్రంతోపాటు పలు చోట్ల జాతీయ జెండాలను ఎగురవేశారు. కామారెడ్డి ఆర్టీ ఓ కార్యాలయంపై ఏబీవీపీ నాయకులు జాతీయ జెం డాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. నిజాంసాగర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మాచారెడ్డి, భిక్కనూరు మండల కార్యాలయాల లో బీజేపీ నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయం పరిపాలన విభాగ భవ నంపై, కళాశాల భవనంపై ఏబీవీపీ నాయకులు జా తీయ జెండాను ఎగురవేశారు. డిచ్పల్లి మండలం గన్నారం ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ గ్రామస్తులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. సిరికొండలో న్యూడెమోక్రసీ నేతలు అవగాహన సదస్సు నిర్వహిం చారు. -
రుణమాఫీ కోరుతూ టవరెక్కిన యువరైతు
కోహీర్ : రుణమాఫీ పథకంలో స్పష్టత కొరవడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువరైతు ప్రభాకర్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కారు. ఈ సంఘటన మండలంలోని బిలాల్పూర్ గ్రామం లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు గంటల పాటు ఉత్కంఠ రేపిన సంఘటన చివరికి పోలీసుల జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. వివరాలు యువ రైతు ప్రభాకర్ మాటల్లోనే.. ‘నాపేరు కాసుబాగుల ప్రభాకర్. తల్లి పేరు మాణ్యమ్మ. నా తల్లి పేరిట 340 సర్వే నంబరులో 2.20 ఎకరాల పొలం ఉంది. పొలంపై తీసుకున్న పంట రుణం రూ. 50 వేలు గత మార్చి నెలలో తీర్చా. రుణాలు కట్టిన వారికి సైతం రుణ మాఫీ వర్తింప చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా.. ప్రస్తుతం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో నా తల్లి పేరు లేదు. సకాలంలో రుణం చెల్లించినప్పటికీ రీషెడ్యూల్ చేయడం లేదు. రుణ మాఫీ జాబితాలో పేర్లున్న రైతులను సైతం బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ పథకంపై ప్ర భుత్వం స్పష్టమైన ప్రకటన చేయా లి. గ్రామంలో ఉపాధి పథకం, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి.. విచారణకు చర్యలు తీసుకోవాలి. ఉన్నత చదువులు చదవిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, తక్కువ చదువు చదవిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. అంతకు ముందు సమాచారం అందుకున్న కోహీర్ ఏఎస్ఐ యూసుఫ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మైకు ద్వారా టవర్‌పైన ఉన్న ప్రభాకర్ తో మంతనాలు జరిపారు. డిమాండ్లు అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రభాకర్ టవర్ దిగారు. -
‘పోలవరం’తో ఆదివాసీల జలసమాధి
ప్రాజెక్టును రద్దు చేసే వరకూ పోరాటం కొందరి ప్రయోజనాల కోసమే మోడీ, బాబు కుట్ర ద ళితులతో పాటు పేదలకూ భూమి పంచాలి టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ కేయూ క్యాంపస్ : పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం జరిగితే లక్షలాది మంది ఆదివాసీలు జల సమాధి కానున్నారని, ఈ విపత్తును చూడడానికేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ ప్రశ్నించారు. ఇదే జరిగితే ఆదివాసీ సమాజం తెలంగాణ పాలకు లను క్షమించబోదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాజెక్టును రద్దు చేసే వరకు ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశా రు. తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీఏకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యం లో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో ప్రభాకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర పన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి, పోడు వ్యవసాయంతో బతుకీడుస్తున్న 2-3 లక్షల వరకు ఆదివాసీలు జలసమాధి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్, టీ జేఏసీ నాయకులు కూడా పోలవరం డిజైన్ మార్పునకు పోరాడుతున్నారే తప్ప ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. మేధావులుగా భా వించే వారు స్వప్రయోజనాల కోసం సెక్రటరియేట్‌కు క్యూ కడుతూ పోలవరంపై పెదవి విప్పకపోవడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ యావత్ సమాజం రాష్ట్రం కోసం ఉద్యమించినట్లుగా పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలనే డిమాండ్‌తో పోరాడాలని, దీనికి తాను నేతృత్వం వహిస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు. మిగతా వర్గాల మాటేమిటి? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తన విధానాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెబుతున్న పాలకులు గిరిజ న, బీసీ తదితర వర్గాల్లో భూమి లేని నిరుపేదలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని చెప్పిన టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాలో కాల్పు లు జరిపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. పాలకులది మొండివైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు విషయంలో మొండివైఖరిని అవలంభిస్తున్నాయని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘా ల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనేని నర్సాగౌడ్ విమర్శించారు. ప్రాజెక్టు రద్దు కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అందరూ సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ఉన్నా ఆదివాసీలను ముంచే పోలవరం పై శ్రద్ధ ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ఈక్రమంలో నిర్వాసితులయ్యే ఆదివాసీలను పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. ససదస్సులో టీఏకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరాజు, తుడందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, తెలంగాణ సహజ వనరుల సంరక్షణ సమితి జిల్లా కన్వీనర్ నల్లెల రాజయ్య, టీఏకేఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము రవి, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బైరబోయిన సుధాకర్, తు డుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బూరక యాదగిరి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ కలకలం!
ధారూరు: గ్రామాల్లో ప్రతి చిన్నపనికీ సర్పంచ్‌లు అంతోఇంతో డిమాండ్ చేస్తూ ఉంటారు. పని త్వరగా పూర్తి కావడం కోసం ప్రజలు కూడా ‘సమర్పించు’కోక తప్పని పరిస్థితి. రేషన్ కార్డుకు, పింఛన్ నమోదుకు, వివిధ రకాల సర్టిఫికెట్లకు చేసుకునే దరాఖస్తులపై సంతకాల చేసేందుకు మామూళ్ల కోసం సర్పంచ్‌లు చేయి చాస్తుంటారు. ఇక నుంచి అలా డబ్బులు తీసుకునేటప్పుడు సర్పంచ్‌లతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆలోచించాల్సిన పరిస్థితిని ఈ ఘటన కల్పించింది. లంచం తీసుకుంటూ ఓ సర్పంచ్ ఏసీబీ అధికారులకు పట్టుబడడం ధారూరు మండలంలో బుధవారం సంచలనం రేపింది. ఎక్కడ నలుగురు కూడినా ఈ అంశంపై చర్చించుకుంటూ కనిపించారు. సర్పంచ్ ఏసీబీకి పట్టుబడడంతో ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు రేగింది. ఇన్నాళ్లు ఏసీబీ అధికారులు కేవలం ప్రభుత్వ అధికారులను మాత్రమే పట్టుకుంటారని భావించిన వారు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. నాగారం గ్రామానికి చెందిన మొగిలి కృష్ణారెడ్డి గ్రామంలోని వాటర్ ట్యాంకు దగ్గరి నుంచి పరిగి రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం మార్చి నెలలో పంచాయతీ నుంచి తీర్మానం తీసుకున్నాడు. దానిపై సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ సంతకం చేయాల్సి ఉంది. అందుకు ఆమె డబ్బులు డిమాండ్ చేయడంతో రూ. 25వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం కృష్ణారెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం బుధవారం కృష్ణారెడ్డి.. సర్పంచ్ మరిది రాంకృష్ణయ్యగౌడ్కు డబ్బులివ్వడంతో ఆయన తీసుకెళ్లి సర్పంచ్‌కు ఇచ్చాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు సర్పంచ్‌తోపాటు ఆమె మరిదిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ తీర్మానం ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్నట్లు సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ అంగీకరించారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. కాగా ‘అందరి సర్పంచ్ల మాదిరిగా నేను డబ్బులు తీసుకున్న. ఇందులో తప్పేంముంది’ అని సర్పంచ్ తమను ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి ఏసీబీకి చిక్కడం ఇదే మొదటిసారి.. ప్రజాప్రతినిధులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల లాగే ప్రజా ప్రతినిధులు కూడా ప్రజా సేవకులని, వారు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు చైతన్యవంతులై అవినీతికి పాల్పడిన వారిపై తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్న వారి వివరాలు చెబితే దాడులు జరుపుతామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజు, వెంకట్‌రెడ్డి, సునీల్, లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీ సీనియర్‌నేత కన్నుమూత
సూర్యాపేట/ గరిడేపల్లి :బీజేపీ సీనియర్‌నేత రామినేని ప్రభాకర్(62) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సౌమ్య ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంటకు చెందిన ప్రభాకర్ గడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా 1981,1988,1990 సంవత్సరాలలో మూడు సార్లు గెలిచి 25 సంవత్సరాల పాటు పనిచేశారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పలు పదవుల్లో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1996లో మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆయనను పంచాయతీరాజ్ విభాగంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. 2009లో సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రామినేనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రామినేని మృతదేహాన్ని మొదట సూర్యాపేటకు ఆతరువాత మర్రికుంటకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు స్వగ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు ప్రముఖుల రాక మర్రికుంటలో గురువారం జరగనున్న అంత్యక్రియలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. రామినేని మృతి పార్టీకి తీరనిలోటు సూర్యాపేట మున్సిపాలిటీ : బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామినేని ప్రభాకర్ మృతి పార్టీకి తీరనిలోటని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం రామినేని ప్రభాకర్ భౌతికకాయానికి సూర్యాపేటలోని ఆయన నివాసంలో రాష్ట్ర , పట్టణ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. నీతికి, నిజాయితీకి మారుపేరు ప్రభాకర్ అని కొనియాడారు. సంతాపం తెలిపిన వారిలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, గోదల రంగారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, రంగరాజు రుక్మారావు, సంపత్‌కుమార్, బండపల్లి పాండురంగాచారి, చలమల్ల నర్సింహ, టీయూపీఎస్ రాష్ట్ర నాయకుడు శేషగాని శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్‌రావు, అప్పారావు, సారగండ్ల మాణిక్యమ్మ, బాణాల విజయ్‌కుమార్, ఏడుకొండల్, జీడి భిక్షం, బెరైడ్డి సంజీవరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, కోతి మాధవి, అన్నెపర్తి రాణి, అబీద్, శ్రీనివాస్, కత్తి వెంకన్న ఉన్నారు. -
టీడీపీతో పొత్తే చేటు తెచ్చింది
బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్ కుత్బుల్లాపూర్: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో లాభం కంటే నష్టమే వాటిల్లిందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎల్వీఎస్ ప్ర భాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ కార్యవర్గ సమావేశం మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలోని సరోజిని గార్డెన్లో నిర్వహించారు. గ్రేటర్ యూత్ నాయకుడు చెరుకుపల్లి భరత సింహారెడ్డి తన అనుచులతో కలిసి శాలువాలు, బొకేలతో సత్కరిం చారు. ముఖ్య అతిథులుగా హాజరైన లక్ష్మణ్, ప్రభాకర్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి రాజకీయ తీర్మానం చేసిన ఏకైక పార్టీ బీజేపీయేనని అటువంటి పార్టీకి ఓట్లు వేయించుకోలేని నిస్సాహాయ ిస్థితిలో నాయకత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పట్టు లేకపోవడంతో మతోన్మాద శక్తులుగా ముద్రపడ్డ ఎంఐఎం పార్టీతో జతకట్టి గ్రేటర్ పరిపాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, జిల్లా అర్బన్ అధ్యక్షుడు మీసాల చంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, భీంరావ్, ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాస్, కాంతారావు, శ్రీధర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మణికొండరామారావు, అసెంబ్లీ కన్వీనర్ రాజాగౌడ్, జిల్లా కార్యదర్శి నటరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ పొత్తుకు బీజేపీ, టీడీపీ యత్నం
భువనగిరి, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న టీడీపీ, బీజేపీ కూటమి జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటయ్యే మున్సిపల్ పాలకవర్గాల్లో పాగా వేయాలని రెండు పార్టీలూ కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం బీజేపీ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, టీడీపీ నుంచి తొర్రూర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. వీరిద్దరు స్థానిక కౌన్సిలర్లను సమన్వయం చేసి రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి ప్రణాళికను రూపొందిస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో ఉన్న 30 వార్డులో బీజేపీ8, టీడీపీ7, కాంగ్రెస్ 8, ఇండిపెండ్లెంటు ్ల6, సీపీఎం ఒకచోట గెలిచాయి, ఇందులో బీజేపీ, టీడీ పీలకున్న 15మందికి మరొకరు మద్దతు ఇస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. అయితే ఐదేళ్ల పదవి కాలాన్ని చెరి సగం పంచుకునేందుకు రెండు పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరు ముందుగా పదవిని దక్కించుకోవాలన్న దానిపై సందిగ్దత నెలకొంది. టీడీ పీ, బీజేపీలు రెండూ ముందుగా పదవిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో 34వార్డులున్నాయి. ఇక్కడ టీడీపీ, సీపీఎం కూటమికి 14, బీజేపీకి 4 వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిస్తే ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడం ఖాయం. ఒకచోట మేము, మరో చోట మీరు అన్నట్లు చెరో మున్సిపల్ స్థానాన్ని దక్కించుకోవడానికి బీజేపీ, టీడీపీలు పావులు కదుపుతున్నాయి. అయితే రెండుచోట్ల స్థానిక కౌన్సిలర్లను సమన్వయం చేసి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. భువనగిరి, సూర్యాపేటల్లోని టీడీపీ, బీజేపీ స్థానిక పెద్ద నాయకులతో చర్చలు జరుపుతూ కౌన్సిలర్లను ఒప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. భువనగిరిలో ముందుగా తామే చైర్మన్ పదవిని చేపడతామని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లు సమాచారం.తమకు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారని, మరొకరి మద్దతు కూడగడ తామని దీంతో ముందుగా తమకే అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ, రాష్ర్ట స్థాయిలో పొత్తులు కుదుర్చుకున్న బీజేపీ, టీడీపీలు స్థానికంగా అదే పద్ధతిలో ముందుకు సాగాలని నాయకత్వం కోరుకుంటుంది. దీనికోసం రెండు పార్టీ ఉన్నతస్థాయి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ఇక పంచాయతీల్లో ఆన్లైన్ పాలన
పలమనేరు, న్యూస్‌లైన్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతంగా తయారు చేసేందుకు పంచాయతీల్లో ఆన్లైన్ పాలనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ-పంచాయత్స్ పేరుతో పిలిచే ఈ కార్యక్రమాన్ని 2008-09 సంవత్సరంలో జాతీయ సాంకేతిక సమాచార సంస్థ (ఎన్ఐసీ) వారి సాయంతో రూపొందించారు. వారం రోజుల్లో జిల్లాలోని 348 గ్రామ పంచాయతీల్లో తొలి దశగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కంప్యూటర్లు, పరికరాలు, సంబంధిత ఎంపీడీవో కార్యాలయాలకు చేరాయి. మూడంచెలుగా వినియోగం 2008-09లో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని అభివృద్ధిపరచి మూడు అంచెలుగా ముందుకు తీసుకెళ్లనున్నారు. ప్రాథమికంగా గ్రామాల్లో జనన మరణాల నమోదు, ఇంటి పన్నులు, లెసైన్స్ ఫీజు వసూళ్లను చేపట్టనున్నారు. పనుల పర్యవేక్షణ, పంచాయతీ సమావేశాలు, ప్రజాప్రతినిధుల సమాచారం, ఉద్యోగుల వివరాలు, వేలం పాటలు, కోర్టు కేసులు, తని ఖీలు, సమాచార హక్కు చట్టం, ఆడిట్, ఫిర్యాదులకు సంబంధించిన ఎంఐఎస్ రిపోర్టులు, పంచాయతీరాజ్ నిధులకు సంబంధించి ఈ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ముఖ్యమైన అప్లికేషన్లు ఇలా ప్లాన్ ప్లస్ ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీ నుంచి తుది ఆమోదం పొందేవరకు కార్యక్రమమంతా వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్లు గ్రహించి రిపోర్టులను అందిస్తాయి. ఇవి కేంద్ర స్థాయిలో జాతీయ ప్రణాళికలను రూపొందించేందుకు ఉపయోగపడుతాయి. యాక్షన్ స్టాఫ్ ద్వారా స్థానిక రికార్డులు ఆర్థిక ప్రగతిని చూపెడతాయి. ప్రియాసాఫ్ట్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ గురించి ఇందులో అప్లికేషన్లు ఉంటాయి. లోకల్ గవర్నమెంట్ డెరైక్టరీ ద్వారా అప్డేట్ సమాచారం ఉంటుంది. నేషనల్ పంచాయత్ పోర్టల్ ద్వారా పంచాయతీలకు సంబంధించిన సమాచారం లభ్యమవుతుంది. ఏరియా ప్రొఫైలర్, నేషనల్ అసెట్ డెరైక్టరీ, సర్వీసెస్, సోషల్ ఆడిట్ తదితర అంశాలు గ్రామీణుల చెంతకు రానున్నాయి. ఇప్పటికే సర్పంచులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఆపరేటర్లను నియమించారు. ఈ-పంచాయత్‌తో అన్ని రకాల సేవలు సామాన్యునికి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై డీపీవో ప్రభాకర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పనులు జరుగుతున్నాయని, వారం రోజుల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. -
రెపరెపలాడిన అరుణపతాకం
సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలతోపాటు కార్మిక దినోత్సవాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక తెలుగు సంఘాలు కూడా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ముంబై ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనిట్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు, సభలను రిలయన్స్ కంపెనీకి చెందిన నాలుగు జోన్లల్లో నిర్వహించారు. తిలక్ నగర్ జోన్లో సైదులు సంగపంప, ఎడ్ల సత్తన్న, దిండోషి జోన్లో గుండె శంకర్, మల్లేశ్ ధీరమల్లు, ఎంఎంఆర్డీఏ జోన్లో కత్తుల లింగస్వామి, శ్రీను జింకల, ఎంఐడీసీ జోన్లో పొట్ట వెంకటేశ్ నేతృత్వంలో కంపెనీ గేటు ఎదుట ‘మేడే’ ఎర్ర జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలకు యూనియన్ నాయకులు దిండోషిలో వాసు, మిలింద్ రానడే, అఖిల భారత తెలంగాణ రచయిత వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్మికుల హక్కులనుద్దేశించి మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ... ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగోలో 1848, మే 1న కార్మికులు రక్తాన్ని చిందించిన రోజును ప్రపంచమంతటా కార్మికదినంగా జరుపుకుంటున్నారన్నారు. ఆ వారసత్వాన్ని ముంబైలోని రిలయన్స్ తెలుగు కార్మికులు కొనసాగిస్తుండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సంవత్సరం సుమారు పది ప్రాంతాల్లో శ్రమజీవి సంఘం, తెలంగాణ సంఘీభావ వేదికతోపాటు మరికొన్ని తెలంగాణ ప్రజా సంఘాలు కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. రిలయన్స్ నాయకులు మిలింద్ రానడే, ఎస్. సైదులు తిలక్ నగర్ జోన్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ.. కార్మికుల ఐక్యత వల్లనే రిలయన్స్‌లో యూనియన్ బలపడి ఎన్నో హక్కులను సాధించుకొని ముందుకు పోతున్నామన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించి కార్మికుల సంక్షేమం కోసం పోరాడదామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కళా బృందం ఆలపించిన ఓ అరుణ పతాకమా.. కార్మికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలకు బొమ్మ లజ్మీన్, చెక్క మహేశ్ తదితరులు సహకరించారు. ఎంఐడీసీలో పొట్ట వెంకటేశ్, వాసు కార్మిక హక్కుల గురించి, మేడే ప్రత్యేకతను వివరించి సంఘటిత పోరాటమే లక్ష్యంగా కార్మికులు ముందుకు నడిచి తమ జీవితాలను మెరుగుపర్చుకోవాలన్నారు. పద్మశాలి సుధారక మండలి ఆధ్వర్యంలో.. పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలు, కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. వర్లీ బీడీడీ చాల్స్‌లోని మండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్, అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్ తదితరులు మే డే, అవతరణ దినోత్సవాల గురించి ప్రసంగించారు. ముఖ్యంగా సంయుక్త మహారాష్ట్ర కోసం అమరులైన వీరుల్లో తెలుగు వారు కూడా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. హరిత పాటిల్, డి.అన్నపూర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి జిందం భాస్కర్, పీఆర్వో సురుకుట్ల సురేష్, కోశాధికారి వక్కల్దేవి గణేష్, వేముల రామచందర్, చాప పరమేశ్వర్, నుమల్ల గంగాధర్ తదితరుల పాల్గొన్నారు. తూర్పు డోంబివలిలో.. సాక్షి, ముంబై: తెలంగాణ శ్రమజీవి సంఘం, తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు డోంబివలిలో గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. లేబర్ నాకా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. తర్వాత కళాకారులు ఆలపించిన గేయాలు సభికులను ఉత్తేజపరిచాయి. కార్యక్రమంలో శ్రమజీవి సంఘం నాయకుడు గోండ్యాల రమేష్, అక్కనపెల్లి దుర్గేష్, సీపీఐఎంఎల్ మహారాష్ర్ట అధ్యక్షుడు అరుణ్, అక్షయ్, బాలరాజ్, బద్లాపూర్ నర్సింహ్మ, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. తూర్పు అంధేరీలో.. తూర్పు అంధేరిలోని ‘తెలుగు కార్మికుల అసోసియేషన్ ముంబై’ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన బస రాజయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఏర్పడిన అనేక చట్టాలు, శాసనాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. కార్యక్రమంలో పదాధికారుల ప్రధాన కార్యదర్శి బత్తుల లింగం, ఉపాధ్యక్షుడు కృపానందం, కార్యదర్శి మగ్గిడి రవి, కోశాధికారులు సంఘం ప్రభాకర్, తలారి భూమన్నలతోపాటు వినోద్, బస మహేష్, మణుకల పోశెట్టి, కోతి గంగారం, బోండోల్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ములుండ్‌లో.. భారత్ సేవా సంఘం (బిఎల్ఎస్ఎస్), సంత్ రవిదాస్ మాదిగ సంఘం (ఎస్ఆర్ఎంఎస్) సంయుక్తంగా గురువారం ఉదయం పశ్చిమ ములుండ్‌లో తెలుగు నాకా వద్ద ప్రపంచ కార్మిక దినం, సంయుక్త మహారాష్ట్ర దినం, నారాయణ మేగాజీ లోఖండే జయంతి సభ నిర్వహించారు. ఈ సభలో బిఎల్ఎస్ఎస్ అధ్యక్షుడు డి. సాయిలు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గడ్సె స్వామి, కార్యదర్శి బోనగిరి కుమార్, ఎస్‌ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు బి. ద్రవిడ్ మాదిగ, జుట్టు లక్ష్మణ్, శనిగారం రవి, డి. శంకర్, బి. రాజేష్, కిషోర్, కొత్తూరి నందు, గుండ్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చిలో జిల్లాకు సోనియా!
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మార్చిలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి సోనియాను కలుసుకున్నారు. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కలను సాకారం చేసినందుకు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు రావాల్సిందిగా నాయకులు ఆహ్వానించడంతో సోనియా సుముఖత వ్యక్తం చేశారు. మార్చి మొదటి వారం లేదా చివరి వారంలో వస్తానని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను సంప్రదించి పర్యటనను నిర్ధారణ చేసుకోవాలని ఆమె నాయకులకు సూచించారు. సోనియాను కలిసిన వారిలో కోలేటి దామోదర్, హర్కర వేణుగోపాల్, కె.రవీందర్రావు ఉన్నారు. విజయోత్సవ సభగా.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు కృతజ్ఞత సభ , తెలంగాణ విజయోత్సవ సభను భారీ స్థాయిలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు యోచిస్తున్నారు. గతంలో పలుమార్లు సభ వాయిదాపడగా, ప్రస్తుతం తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం, రాజపత్రం కొద్దిరోజుల్లో రానుండడం, ఎన్నికల సమయం కావడంతో సభను భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సోనియాతోనే సభ నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2004లో కరీంనగర్‌లోనే తెలంగాణకు అనుకూలంగా మాట ఇచ్చినందున, మళ్లీ అదే కరీంనగర్లో విజయోత్సవ సభ నిర్వహిస్తే, తెలంగాణలో పార్టీకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని జిల్లా నేతలు అధిష్టానాన్ని ఒప్పిస్తున్నారు. -
ఉద్యమ కన్నారం దుర్గం
ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి నెలవైన జిల్లా మలిదశ తెలంగాణ ఉద్యమానికి కోటగా నిలిచింది. ఉద్యమం ప్రారంభం నుంచి దశాబ్దాల కల నెరవేరిన క్షణం వరకు ప్రతి సందర్భంలో ఉత్తేజకరమైన పాత్రను నిర్వర్తించింది. అణిచివేత, నిర్భంధం, వేధింపులు, బైండోవర్లు, అరెస్టులు వీటన్నింటినీ అధిగమించి ఉద్యమం గమ్యానికి చేరేదాకా వెన్ను చూపని సాహసాన్ని ప్రదర్శించింది. 2001 నుంచి 2014 వరకు అన్ని ముఖ్య ఘట్టాలకు, కీలక మలుపులకు కేంద్రబిందువుగా నిలిచింది. ఈ పదమూడేళ్ల ఉద్యమ ప్రస్థానం ఇలా సాగింది. సింహగర్జనతో మొదలు.. తెలంగాణ రాష్ట్ర సమితికి కరీంనగర్ అచ్చొచ్చిన జిల్లా. పార్టీ ఆవిర్భావం తరువాత ముఖ్యమైన అన్ని కార్యక్రమాలకు ఇక్కడనుంచే శ్రీకారం చుట్టారు. జలదృశ్యంలో పార్టీని ప్రారంభించిన కేసీఆర్ మొదటి బహిరంగసభను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేశారు. 2001లో ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సింహగర్జన విజయం పార్టీపై అంచనాలను పెంచింది. అదే సంవత్సరం జరిగిన స్థానిక ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ 28 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జెడ్పీపై గులాబీ జెండా ఎగురవేసింది. తెలంగాణ భావజాలాన్ని నింపుకున్న జిల్లా ప్రజలు పార్టీకి అండగా నిలవడంతో అప్పటినుంచి టీఆర్ఎస్కు కరీంనగర్ సెంటిమెంటుగా మారింది. మాటిచ్చిన సోనియా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటో తనకు తెలసుననీ... తాము అధికారంలోకి వస్తే వారి ఆకాంక్షను నెరవేరుస్తానని సోనియా గాంధీ కరీంనగర్‌లోనే ప్రకటించారు. 2004 మార్చి 11న అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ మాటలు చెప్పారు. ఈ మాట ప్రకారమే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమయ్యింది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ రైలురోకో సందర్భంగా జైలుకే వెళ్లారు. శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేసి కిరణ్‌కు షాకిచ్చారు. మద్దతిచ్చిన సుష్మా.. భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు మొదటినుంచి అనుకూలంగా ఉన్నా జనంలో ప్రాచుర్యం పొందింది మాత్రం కరీంనగర్లో సుష్మాస్వరాజ్ సభ తర్వాతే. 2011 మే 31న ఆమె భారీ బహిరంగసభలో తెలంగాణ ఏర్పాటుకు తమ పూర్తి సహకారం ఉంటుందన్న ప్రకటన చేశారు. అప్పటికే జేఏసీలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆ తర్వాత మరింత క్రియాశీలంగా వ్యవహరించింది. పార్టీ జిల్లా అగ్ర నేతలు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ భవన్ కేంద్రంగా... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయిన కేసీఆర్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయ సాధనకు కృషిచేశారు. యూపీఏ అజెండాలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం ద్వారా రాజకీయ ప్రక్రియను మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా కరీంనగర్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కేసీఆర్ వ్యూహాలకు కేంద్రంగా మారింది. రాజీనామాల అస్త్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగమైన టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మంత్రిపదవులకు రాజీనామాలు చేశారు. జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేంద్ర కేబినెట్ నుంచి కేసీఆర్ వైదొలగారు. తెలంగాణ సెంఇమెంటు లేదన్న వ్యాఖ్యలకు జవాబుగా కేసీఆర్ ఎంపీ పదవికి 2006 సెప్టెంబర్ 12న రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో రెండు లక్షల ఆధిక్యాన్ని సాధించి ఉద్యమాన్ని సజీవంగా నిలిపారు. 2008 మార్చిలో మరోసారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. జిల్లానుంచి కేసీఆర్‌తో పాటు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికయ్యారు. కేసీఆర్ అరెస్టుతో ఆజ్యం తెలంగాణ ఉద్యమం 2009 ఎన్నికల తర్వాత ఉప్పెనగా మారింది. 2009 సెప్టెంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అంటూ కేసీఆర్ సిద్దిపేటలో ఆమరణ నిరాహారదీక్ష తలపెట్టారు. ఉత్తర తెలంగాణ భవన్ నుంచి దీక్షకు బయల్దేరిన ఆయనను అల్గునూరు చేరుకోగానే పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జైలుకు తరలించగా కేసీఆర్ అక్కడే దీక్షను కొనసాగించారు. ఆయన దీక్షకు మద్దతుగా జిల్లాలో అన్ని వర్గాలు ఆందోళనలకు దిగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం రాజుకుంది. ఫలితంగా డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది. సీమాంధ్ర ఉద్యమంతో డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటనను వెనక్కివెళ్లింది. ఆ తర్వాత ఉద్యమం నిరంతరంగా సాగింది. టీడీపీ నిర్ణయం ఇక్కడే.. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తెలంగాణ ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ భేటీ జరిగింది. అప్పటికి టీడీపి వైఖరిపై అనుమానాలు తలెత్తాయి. అఖిలపక్షంలో ఏం చెప్పాలన్నది నిర్ణయించేందుకు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని జిల్లాలోనే నిర్వహించారు. అఖిలపక్షానికి పార్టీ తరఫున పంపే లేఖను ఇక్కడే తయారు చేశారు. - సాక్షి, కరీంనగర్ జేఏసీలో కీలకం... తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ఉద్యమంలో చరిత్రాత్మక ఘట్టం. రాజకీయ పార్టీలతో పాటు విభిన్న భావజాలాలుగల సంఘాలు సంస్థలన్నీ ఒకే వేదికకు వచ్చి ఉద్యమాన్ని ఉరకలేత్తించాయి. జేఏసీలో కీలకమైన కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ ఇద్దరూ జిల్లావారే. మిలియన్‌మార్చ్, సడక్‌బంద్, రైలురోకో, సాగరహారం, సహాయ నిరాకరణ, సకల జనులసమ్మె... జేఏసీ ఆమ్ములపొది నుంచి వెలువడిన అస్త్రాలు. ఒక్కొక్కటీ ప్రభుత్వం మీద తెచ్చిన ఒత్తిడి అంతా ఇంతాకాదు. ఈ ఆందోళనలన్నింటికి జిల్లానుంచి ఉద్యమకారులు ఆటంకాలన్నింటినీ ఛేదించుకుంటూ వెళ్లారు. ప్రపంచాన్ని తనవైపు ఆకర్శించిన సకలజనుల సమ్మె ప్రకటన కూడా జిల్లా నుంచే వెలువడింది. -
వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షల ఫలితాలు విడుదల
అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సీడీలను విడుదల చేశారు. వీఆర్ఓ పరీక్షలో జిల్లాకు చెందిన యెగానందరెడ్డి (హాల్ టికెట్ -112103198) 99 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. వీఆర్ఏ పరీక్షలో 97 మార్కులతో బోనాల ప్రభాకర్ (హాల్‌టికెట్ -312100031) రాష్ర్ట స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. జిల్లాలో ఫిబ్రవరి 2న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు నిర్వహించారు. 64 వీఆర్ఓ పోస్టులకు 61,073 మంది దరఖాస్తు చేసుకోగా 52,942 మంది పరీక్ష రాశారు. 167 వీఆర్ఏ పోస్టులకు 4,637 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,175 మంది పరీక్ష రాశారు. సాక్షి మెటీరియల్ ఎంతో తోడ్పడింది వీఆర్ఓ పరీక్షలో జిల్లా 6వ ర్యాంకర్ మనోహర్ తనకల్లు, న్యూస్‌లైన్ : వీఆర్ఓ పరీక్షకు సాక్షి స్టడీ మెటీరియల్ తనకు ఎంతో ఉపయోగపడిందని మనోహర్ పేర్కొన్నాడు. తనకల్లు మండలం గణాదివారిపల్లికి చెందిన మనోహర్ 96 మార్కులు సాధించి జిల్లాలో 6వ ర్యాంక్ సాధించాడు. మనోహర్ తల్లిదండ్రులు సుబ్బరాయుడు, రెడ్డెమ్మ. వీరు వ్యవసాయం చేస్తు జీవనం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా మనోహర్ పెద్దవాడు. తమ్ముడు హేమకుమార్ టైలరింగ్ చేస్తున్నాడు. మనోహర్ ఎంఎస్సీ, బీఈడీ చేశాడు. 2008లో నిర్వహించిన డీఎస్సీలో అర్ధ మార్కు తక్కువ రావడంతో ఎంపిక కాలేదు. అయినా నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. వీఆర్ఓ పరీక్షలో ర్యాంక్ సాధించిన మనోహర్‌ను పలువురు అభినందించారు. వీఆర్ఓ ఉద్యోగం చేస్తూ.. మరిన్ని పోటీ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని మనోహర్ తెలిపాడు. తల్లిదండ్రుల కష్టం, తమ్ముడి ఆర్థిక సాయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పాడు. 25న మెరిట్ జాబితా : కలెక్టర్ మెరిట్, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా జిల్లాలో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వీఆర్ఓ పోస్టులకు జిల్లా స్థాయిలో రూపొందించిన జనరల్ మెరిట్ లిస్ట్, వీఆర్ఏ పోస్టులకు జిల్లా స్థాయితో పాటు గ్రామ స్థాయి జనరల్ మెరిట్ లిస్ట్‌లను ఏపీపీఎస్సీ వారు పంపినట్లు తెలిపారు. -
పేదరికంలో మెరిసిన ఆణిముత్యం
తాడిమర్రి, న్యూస్‌లైన్ : కృషి, పట్టుదల ఉంటే చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు బోనాల ప్రభాకర్. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెరువుకు చెందిన ప్రభాకర్ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరీక్ష ఫలితాల్లో 97 మార్కులతో రాష్ర ్టస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. బోనాల లక్ష్మయ్య, నారాయణమ్మ దంపతులకు రాము, ప్రభాకర్ సంతానం. లక్ష్మయ్య 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి సెంటు స్థలం లేదు. పూరిగుడిసెలోనే నివసించారు. నారాయణమ్మ కూలి పనులు చేస్తూ కుమారులిద్దరినీ చదివించింది. ప్రభాకర్ పదో తరగతి వరకు తాడిమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ (బీఎస్సీ) ధర్మవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివాడు. ఆ తర్వాత కూలిపనులకె ళుతూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూనే గ్రూప్-2, వీఆర్ఓ, వీఆర్ఏ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. గత ఏడాది జరిగిన వీఆర్వో ఫలితాల్లో 87 మార్కులతో 68వ ర్యాంక్ సాధించాడు. అయితే 67వ ర్యాంక్‌కే కటాఫ్ నిలిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా వీఆర్వో, వీఆర్ఏ పోస్టు సాధించాలని పట్టుదలతో చదివాడు. ఫలితంగా వీఆర్ఏ ఫలితాల్లో (హాల్ టికెట్టు నంబర్ 312100031) 97 మార్కులు సాధించి స్టేట్ ఫస్టుగా నిలిచాడు. వీఆర్ఓ పరీక్షల్లో 87 మార్కులతో 286 ర్యాంక్ సాధించాడు. ప్రభాకర్ వీఆర్ఏ ఫలితాల్లో స్టేట్‌ఫస్టుగా నిలవడంతో తల్లి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. గ్రామస్తులు తల్లీ, కుమారులకు స్వీట్లు తినిపించి అభినందించారు. అమ్మ కల సాకారం చేయాలనుకున్నా.. ఇరవై ఏళ్ల క్రితం నాన్న అనారోగ్యంతో మృతి చెందాడు. అమ్మ ఎలాగైనా అన్న(ప్రస్తుతం ప్రైవేట్ టీచర్)ను, నన్ను చదివించాలని ఎంతో కష్టపడింది. అమ్మ ఒక్క రోజు ఇంటి దగ్గర ఉంటే ఇల్లు గడిచేది కాదు. అమ్మ తపన నాలో పట్టుదలను పెంచింది. ఎలాగైనా కష్టపడి చదివి ఉద్యోగం సాధించి అమ్మ కల సాకారం చేయాలను కున్నాను. కల నెరవేరింది. - బోనాల ప్రభాకర్, వీఆర్ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
మహాముత్తారం, న్యూస్‌లైన్: మండలంలోని నిమ్మగూడెం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పైడాకుల ప్రభాకర్(30), తిప్పల శ్రీపాల్(28) ద్విచక్రవాహనంపై బోర్లగూడెం వస్తుండగా టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ప్రభాకర్ అక్కడికక్కడే చనిపోయూడు. శ్రీపాల్‌కు తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికులు అతడిని 108లో మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎంజీఎం తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మేకల కోసం వెళ్లి.. శ్రీపాల్ నిశ్చితార్థం మూడు రోజుల్లో జరగాల్సి ఉంది. దీనికోసం మేకలు కొనడానికి బోర్లగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారితోపాటు మరో బైక్‌పై ఇద్దరు వచ్చారు. నలుగురూ కలిసి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనాస్థలాన్ని ఎస్సై అశోక్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో... యైటింక్లయిన్‌కాలనీ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాకవిపోతనకాలనీకి చెందిన చందుపట్ల పద్మ(45) మరణించింది. ఆమె కుమారుడు రామకృష్ణకు గాయూలయ్యూరుు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ బంధువుల అమ్మారుు మంచిర్యాలలో ప్రసవించింది. ఆమెను చూడడానికి పద్మ తన కుమారుడు రామకృష్ణతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లింది. తిరిగి వస్తుండగా ఇందారంలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో పద్మ అక్కడికక్కడే చనిపోరుుంది. రామకృష్ణకు గాయూలయ్యూరుు. తన కళ్లముందే తల్లి చనిపోవడం చూసి అతడు కన్నీటిపర్యంతమయ్యూడు. తన తల్లి ని కాపాడాలంటూ ప్రయాణికులను వేడుకోవడం కలచి వేసింది. తన తండ్రికి, బావకు ఫోన్ చేయాలంటూ వేడుకున్నాడు. పద్మ భర్త చంద్రమౌళి గోదావరిఖని ఓసీపీ-1లో విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స కోసం వచ్చి .. ముస్తాబాద్ : చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి బస్సు ఢీకొని మరణించాడు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో మంగళవారం వేకువజామున ఈ సంఘటన జరిగింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం మేరకు..నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పుర్ర రాజయ్య (55) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నామాపూర్‌లో వైద్యం కోసం భార్య సాయవ్వ, తల్లితో కలసి సోమవారం ఇక్కడకు వచ్చాడు. రాత్రి వరకు నామాపూర్‌లోనే ఉండడం తో ఇక్కడే పడుకున్నారు. మంగళవారం వేకువజామున బస్టాండ్ వద్ద చలికాచుకున్న రాజయ్య టీ కోసం వెళ్తుం డగా సిద్దిపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్క డే చనిపోయూడు. భార్య, తల్లి రోదనలు మిన్నంటాయి. రాజయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వెల్లువెత్తిన నిరసన
నల్లగొండటౌన్, న్యూస్‌లైన్: పెద్దవూర మండలం ఏనెమీదితండాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమంలోని 12 మంది విద్యార్థినులపై లైంగికదాడికి పాల్పడిన ట్యూటర్ హరీష్‌తోపాటు ఆశ్రమ వార్డెన్ శ్రీనివాస్‌ను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. జిల్లా పోలీస్ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి వరకు 11 మంది విద్యార్థినులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయని, శనివారం మరొక విద్యార్థిని కూడా ఫిర్యాదు చేసిం దని చెప్పారు. విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులను విచారణ చేశామని, 12మంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇద్దరిపై12 కేసులు చేశామని వెల్లడించారు. నిందితుడు హరీష్‌పై నిర్భయతో పాటు మరో రెండు సెక్షన్లు, వార్డెన్ శ్రీనివాస్‌పై మరో సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలి పారు. విద్యార్థినులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన హరీష్ వారిని ప్రలోభపెట్టి లోబర్చుకున్నట్లు విచారణలో బాధితులు వెల్లడించారన్నారు. బాధితులందరికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మహిళా డాక్టర్ల చేత వైద్యపరీక్షలు నిర్వహించామని, త్వరలో రిపోర్టు రానుందన్నారు. బాధిత విద్యార్థినులకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించి విద్యాభ్యాసం సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టప్రకారం వారికి రావాల్సిన పరిహారం అందేలా చూడనున్నామన్నారు. జిల్లాలో ఆ సంస్థ నిర్వహిస్తున్న మరో రెండు ఆశ్రమాలపై కూడా ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై కూడా విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించనున్నామన్నారు. ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ సుభాష్‌చంద్రబోష్ ఉన్నారు. -
ప్రేమ పెళ్లితో.. పోలీసులకు తంటా!
సాక్షి, తిరుమల: తమిళనాడులోని వాణియంబాడికి చెందిన ఓ ప్రేమ జంట బుధవారం తిరుమలలో పెళ్లి చేసుకుంది. అమ్మాయి మైనర్ అని, ప్రియుడు కిడ్నాప్ చేశాడంటూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో పారిపోయి వచ్చానని, తన ఇష్టపూర్వకంగానే ప్రియుడిని పెళ్లి చేసుకున్నానని ఆ యువతి తెలిపింది. దీంతో తిరుమల పోలీసులు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు. వివరాలిలా.. తమిళనాడులోని వేలూరు జిల్లా వాణియంబాడికి చెందిన ప్రభాకర్ (22), అదే ప్రాంతానికి చెంది బెంగళూరులో స్థిరపడిన లత బుధవారం తిరుమలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకుని వధువు బంధువులు తిరుమలకు చేరుకున్నారు. నవ దంపతులను బస్టాండ్‌లో పట్టుకున్నారు. తాను ప్రియుడితోనే జీవిస్తానని లత తెగేసి చెప్పింది. ఇంతలో జనం గుమికూడారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నడిరోడ్డులో పంచాయితీ వద్దంటూ అందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మైనరుగా ఉన్న లత (17 సంవత్సరాలా 10 నెలలు)కు గతనెల 25వ తేదీన మరో యువకుడితో నిశ్చితార్థం చేశామని ఆమె బంధువులు పోలీసులకు తెలిపారు. లతను ప్రభాకర్ కిడ్నాప్ చేశాడని వాణియంబాడి స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై నవ వధువు లత అభ్యంతరం తెలిపింది. తనకు ఇష్టంలేని వ్యక్తితో నిశ్చితార్థం జరిపించా రంది. అందుకని పారిపోయి వచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది. దీంతో తిరుమల పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని.. ఇరువర్గాలు వాణియంబాడి స్టేషన్లో తేల్చుకోవాలని చెప్పారు. అయితే తిరుమల పోలీసులు మాత్రం ముందుజాగ్రత్తగా ఇరువర్గాల స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. -
వివాహిత దారుణహత్య
కుప్పం రూరల్, న్యూస్‌లైన్: కడ వరకు కాపాడుకుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధం మోజులో పడి భార్యను కడ తేర్చేందుకు పథకం పన్నాడు. స్నేహితుని సాయంతో భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చందం పంచాయతీ కొత్తఇండ్లు గ్రావూనికి చెందిన చంద్రకళ (28)కు దళావారుు కొత్తపల్లె వాసి బాలాజీ(34)తో 2001 లో వివాహమైంది. వీరి పిల్లలు భార్గవ్(7), నిహారిక(4). బాలాజీ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడైన ప్రభాకర్‌తో కలసి పథకం పన్నాడు. నూలుకుంట గ్రావుం వద్దనున్న సుబ్రవుణ్య స్వామి ఆలయంలో పూజలు చేస్తే దంపతుల మధ్య కలతలు తీరుతాయని నమ్మిం చాడు. బాలాజీ, ప్రభాకర్ గురువారం ఉదయం చంద్రకళను ఇండిక కారు (ఏపీ02క్యూ4999)లో దేవాలయుం వద్దనున్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. పూజ కోసమంటూ చంద్రకళ కళ్లకు గంతలు కట్టారు. ఆపై రాళ్లు, దుడ్డుకర్రలతో అతికిరాతకంగా దాడి చేసి చంపారు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం పన్నారు. వుృతదేహాన్ని కారులో తీసుకుని కుప్పం-క్రిష్ణగిరి జాతీయు రహదారిపై వచ్చారు. అయితే పగటి పూట ట్రాఫిక్ అధికంగా ఉండడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. కుప్పం నుంచి తమిళనాడులోని వేపనపల్లెకు వెళ్లే దారిలోనున్న అటవీ ప్రాంతంలో చంద్రకళ మృతదేహాన్ని దాచారు. చంద్రకళ కనబడడం లేదంటూ ఆమె బంధువులకు గురువారం సాయంత్రం సమాచారమిచ్చారు. దీంతో బంధువులు బాలాజీ ఇంటికి వచ్చి నిలదీ శారు. వీరిపై బాలాజీ, అతని స్నేహితులు దాడి చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని సీఐ రాజగోపాల్‌రెడ్డి, ఎస్ఐ గంగిరెడ్డి తెలిపారు. -
మావోయిస్టు నేత చంద్రశేఖర్‌పై కేసు కొట్టివేత
గద్వాల, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీ కర్ణాటక రాష్ట్ర సభ్యుడు చంద్రశేఖర్ గోరబాల అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్‌పై జిల్లా పోలీసులు పెట్టిన మారణాయుధాల కేసును జిల్లా మూడో అదన పు సెషన్స్ కోర్టు జడ్జి ప్రభాకర్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయవాది మనోహర్ కథనం ప్ర కారం... 2010 జూన్ 12 రాత్రి కర్ణాటక నుంచి అయిజ మీదుగా కర్నూలుకు ఆయుధాలతో వెళ్తున్నాడనే ఆరోపణలతో అయిజ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్‌ను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు గద్వాల కోర్టులో హాజరుపరచగా, జ డ్జి రిమాండ్ విధించారు. ఏకే-47, అత్యాధునిక ఆయుధాలతో చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్లు అప్పట్లో జిల్లా పోలీసులు మీడియా ముందు చూపించారు. నాటినుంచి చర్లపల్లి జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న ఆయన గద్వాల కోర్టుకు హాజరవుతూ వచ్చారు. రెండున్నర ఏళ్ల విచారణ అనంతరం చంద్రశేఖర్ పై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు మోపిన ఆయుధాల కేసులో సాక్షాధారాలు చూయించలేకపోయారు. దీంతో శుక్రవారం గద్వాల ఏడీజే ప్రభాకర్ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. తీర్పు కాపీ వచ్చే వరకు పోలీసుల అదుపులు ఉండాల్సి ఉన్నందున, తీర్పు వెలువడిన అనంతరం చర్లపల్లి జైలు అధికారులు చంద్రశేఖర్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారని న్యాయవాది మనోహర్ వివరించారు. అయిజ ఎక్కడుందో తెలియదు.. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. తనను కర్ణాటకలో అదుపులోకి తీసుకుని, అయిజలో అరెస్టు చేసినట్లు చూపించారని ఆరోపించారు. అయిజ ఎక్కడుంతో తనకు ఇప్పటి వరకు తెలియదన్నారు. ఏది ఏమైనా చివరకు న్యాయమే గెలుస్తుందన్న వాస్తవానికి నిదర్శమే కోర్టు తీర్పు అని ఆయన పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆంధ్రబ్యాంక్ చైర్మన్‌కు తీవ్రగాయాలు
హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్‌నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రబ్యాంక్ చైర్మన్ ప్రభాకర్‌తో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ దంపతులను నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వివాదం రాజేసిన డీఈల అరెస్టు
హైదరాబాద్:తమపై దాడి చేశారంటూ తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు డీఈలను అదుపులోకి తీసుకున్న ఘటన శుక్రవారం వివాదానికి కారణమైంది. విద్యుత్ సౌధలో డీఈలుగా పనిచేస్తున్న సోమశేఖర్, ప్రభాకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీ. ఉద్యోగులు ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేయడం సబబు కాదని సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొన్నారు. విద్యుత్ సౌధలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో పోలీసులను భారీగా మోహరించారు. గతంలో తమపై దాడికి పాల్పడారంటూ టీ.ఉద్యోగులు ఫిర్యాదు మేరకు డీఈలను అరెస్టు చేశారు.