పెప్పర్ స్ప్రే ఘటనపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో జరిగిన పెప్పర్ స్ప్రే ఘటనపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేసిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. 2014 ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలోనే కొందరిపై పెప్పర్ స్ప్రే చల్లడం తెలిసిందే.
ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ, పింఛన్లు, ఇతర సౌకర్యాలను రద్దు చేయాలని కోరుతూ పొన్నం ప్రభాకర్ ఈ పిటిషన్ వేశారు. ఘటన జరిగి మూడేళ్లయిందనీ, కోర్టుకు ఆలస్యంగా వచ్చారని చెబుతూ జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.