
సాక్షి, పశ్చిమ గోదావరి : కొల్లేరు మూడో కాంటూరు కుదింపుకి సీపీఐ పార్టీ వ్యతిరేమని సీపీఐ జిల్లా జనరల్ సెక్రటరీ డేగా ప్రభాకర్ తెలిపారు. ఏలూరులో ఆదివారం భారతీయ కమ్యూనిస్టు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించడం అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఓట్ల కోసం మోసం చేసి రాజకీయాలు చేస్తోందన్నారు.
పర్యావరణాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 120 జీవో తప్పకుండా అమలు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంటూరు కుదింపు జరిగితే కొల్లేరు చుట్టు ఉన్న జనావాస ప్రాంతాలు గతంలో చెన్నై తరహాలో ముంపుకు గురవటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టుకు కూడా వెళతామని డేగా ప్రభాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment