డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | Two arrested for selling drugs | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Published Fri, May 31 2024 4:55 AM | Last Updated on Fri, May 31 2024 4:55 AM

Two arrested for selling drugs

రాజేంద్రనగర్‌: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. సన్‌సిటీ బండ్లగూడ జాగీర్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌ సమీపంలో గురువారం మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్‌ హోకం (21), మధ్యప్రదేశ్‌ శివుపురి గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన అనుభవ్‌ సక్సేనా (24)లు బ్యాగ్‌తో ప్యాసింజర్‌ ఆటోదిగి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. 

దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రాఘవేందర్, కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా తెల్లటి పౌడర్‌ రూపంలో ఉన్న 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ లభించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఎండీఎం డ్రగ్స్‌ను ఐటీ, ఈవెంట్‌ మేనేజర్‌లకు విక్రయిస్తున్నామని తెలిపా రు. 

తాము చంద్రపూర్‌కు చెందిన సాబేర్‌ అనే వ్యక్తి ద్వారా కొరియర్‌ తెప్పించుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్‌ విలువ మార్కెట్‌లో రూ.20 లక్షలు ఉంటుందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement