హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 8.5 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ చేపట్టి భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఒక డ్రగ్ పెడ్లర్‌తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ రూ. 8.5 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లొ భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ వింగ్, బోయినపల్లి పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. ‘ఒక డ్రగ్ పెడ్లర్‌తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుండి 8.5 కేజీల అమ్ఫేటమైన్ డ్రగ్ సీజ్ చేశాం. దీనిద్వారా ఎండీఎంఏ డ్రగ్ తయారు చేస్తారు. మార్కెట్‌లో కేజీ కోటి నుంచి కొటీ 20 లక్షలు పలుకుతుంది. రూ. 8.5 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది.డ్రగ్స్ పెడ్లర్ నాగరాజుతో పాటు, వినోద్ కుమార్, శ్రీశైలంలు అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో అంజిరెడ్డి అనే వ్యక్తి కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేశారు. నిందితులపై నేషనల్ డొమెస్టిక్ ప్రిపేర్డ్‌నెస్ కన్సార్టియం(NDPC)యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment