ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది | Eye Witness Explains About Patancheru Pashamailaram Reactor Blast Incident, Know More Details Inside | Sakshi
Sakshi News home page

ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది

Jul 1 2025 5:51 AM | Updated on Jul 1 2025 11:25 AM

Pashamailaram Reactor Blast Incident Eye Witness

మంటల్లో చిక్కుకున్న వాళ్ల అరుపులే గుర్తొస్తున్నాయి 

నేను వాష్‌రూంకి వెళ్లడంతో బతికిపోయిన  

ఫస్ట్‌ఫ్లోర్‌ కిటికీలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న 

ప్రమాద ఘటనను ‘సాక్షి’కి వివరించిన ప్రత్యక్ష సాక్షులు.. కుటుంబీకుల కోసం బంధువుల ఆర్తనాదాలు

సాక్షి, హైదరాబాద్‌: ‘పెద్ద శబ్దం..ఒక్కసారిగా మంట లు వచ్చాయి. మొత్తం పొగ..దుమ్ము.. ఏం జరుగు తోందో తెలియలేదు. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. మా కళ్ల ముందే పేలుడు జరిగింది..మా ముందే చాలామంది చనిపోయారు. కొందరు మహిళ లు మంటలు అంటుకుని కాపాడాలంటూ వేడుకుంటు న్న అరుపులే ఇంకా గుర్తొస్తున్నాయి. మా చిన్నాన్నలు, అన్నలు, స్నేహితులు కనిపించకుండా పోయారు.

వాళ్లు బతికి ఉన్నారో..? లేదో..? తెలియడం లేదు.. పొద్దుటి నుంచి వాళ్ల జాడ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాం..ఎప్పు డు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది..’అని పాశమైలారం సిగాచి ఫ్యా క్టరీలో ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షులు ‘సాక్షి’వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా వాళ్ల జాడ చెప్పండి సారూ’అంటూ బాధితుల బంధువులు అక్కడికి వచి్చ న అధికారులను బతిమాలుకుంటున్న తీరు కంట తడిపెట్టించింది. తమ వాళ్ల గురించి ఎందుకు చెప్ప డం లేదంటూ కొందరు మహిళలు ఏకంగా రాళ్ల ను తీసుకుని అధికారులపై దాడి చేసినంత పని చేశా రు. వారి కుటుంబీకుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు..ఆగ్రహావేశాలు సైతం అందరినీ కలిచి వేశాయి.  

వాష్‌రూంలో ఉండగా పెద్ద శబ్దం  
నేను ఉదయం షిప్ట్‌లో ఉన్నా. పేలుడు జరగడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా డ్రయింగ్‌ యూనిట్‌ దగ్గరే పనిచేస్తున్నా. మూత్ర విసర్జన కోసం బయటికి వెళ్లి పక్కన వాష్‌రూంలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. బయటికి వచ్చి చూసే సరికి పెద్దగా మంటలు..పొగ..దుమ్ము ఏమీ కనపడ లేదు. వాష్‌రూంకు వెళ్లకపోతే చనిపోయేవాడిని.  – చందన్‌ గౌర్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్‌ 

నేను రియాక్టర్‌ దగ్గరే పని చేస్తున్నా  
నేను రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. ఉదయం పేలుడు జరిగినప్పుడు రియాక్టర్‌ దగ్గర పనిచేస్తున్న. మొదట ఎయిర్‌ బ్లోయర్‌ పేలింది. దానివల్ల నేను పనిచేస్తున్న రియాక్టర్‌ కూడా పెద్ద శబ్దంతో పేలింది. అయితే పక్కనే గది నుంచి మెట్లు ఉన్న విషయం నాకు ముందు నుంచి తెలుసుకాబట్టి ఆ దారి వెతుక్కుంటూ బిల్డింగ్‌ పైకి వెళ్లిన. అక్కడ కూడా ఏమీ అర్థం కాలేదు. వెంటనే కూలిన ఒక గోడ పట్టుకుని పాకుతూ మొదటి అంతస్తులోకి కిందికి వచి్చన. అక్కడ కిటికిలోంచి కిందికి దూకిన. నా పక్కనే రెండు శవాలు పడి ఉన్నాయి. వెంటనే అక్కడ నుంచి బయటికి వచ్చేశా. పేలుడు జరిగినప్పుడు కనీసం 30 నుంచి 45 మంది అక్కడ ఉన్నారు. వాళ్లంతా చనిపోయే ఉంటారు. – పవన్‌ ఇసాద్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్‌ 

మా ఇద్దరు చిన్నాన్నలు చిక్కుకున్నారు 
ఏడేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. ఇప్పటివరకు ఏ చిన్న ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు నేను రియాక్టర్‌ రూం దగ్గరే పనిచేస్తున్న. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. వెంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో కిందికి పారిపోయిన. కానీ మా చిన్నాన్నలు శశికుమార్, లఖ్నజీత్‌ ఇద్దరు లోపలే చిక్కుకున్నారు. ఒకరి శవం దొరికింది. ఇంకొకరు ఏమయ్యారోఏమో.. – విజయ్, బక్సర్‌ జిల్లా బిహార్‌ 

ముగ్గురిని కాపాడినం.. 
నేను ప్రమాదం జరిగినప్పుడు పక్కన బిల్డింగ్‌లో టిఫిన్‌ చేస్తున్న. బయటికి వచ్చేసరికి మొత్తం పొగ ఉంది. ఏం కనిపించలేదు. కాసేపటికి అంతా అటు ఇటు ఉరుకుతున్నరు. పక్కన అడ్మిని్రస్టేషన్‌ బిల్డింగ్‌ దగ్గర కొంతమంది కాపాడాలని అరుస్తున్నారు. నేను, ఇంకో ఇద్దరం కలిసి వాళ్ల దగ్గరికి వెళ్లినం. పైన ఫ్లోర్‌ నుంచి మెల్లగా కిందికి దింపి ముగ్గురిని కాపాడినం.  – శివ, కార్మికుడు, ఒడిశా 

డ్యూటీలోనే దూరంగా ఉన్నా..  
నేను ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న. పేలుడు జరిగినప్పుడు డ్యూటీలోనే ఉన్న. కానీ స్పాట్‌కు దూరంగా ఉన్న. పె ద్ద శబ్దం వచి్చంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లిన. ఎవరెరు చనిపోయారో అర్థం కాలేదు. అనేకమంది గాయపడ్డారు. – సంతోష్ కుమార్, ఉద్యోగి, ఏపీ  

ఆచూకీ లేనివారు ఎంతమంది?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం పరిశ్రమలో విధులకు వెళ్లినవారు ఇంటికి తిరిగి రాక.. ఆసుపత్రుల్లోనూ కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో అసలెంత మంది ఉన్నారు.. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఎంతమంది.. అనేదానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేకుండా పోయింది.

ఒకవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, శిథిలాల కింద ఎంతమంది ఉండి ఉంటారనే దానిపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు తెలిసింది. రెండు మృతదేహాలు శిథిలాల కింద లభ్యమైనట్లు చెబుతున్నారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రులకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. డీఎన్‌ఏ పరీక్షలు చేపడుతున్నట్లు తెలిసింది. కుటుంబసభ్యుల డీఎన్‌ఏలతో పోల్చాకే మృతదేహాలను అప్పగించనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వరకు ముగ్గురిని గుర్తించినట్లు తెలుస్తుండగా.. దీన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 10 అంబులెన్సులను ఏర్పాటు చేశారు.  

Special Story: పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన

కంపెనీ డ్రైవర్‌ సమయస్ఫూర్తి
8 మంది క్షతగాత్రులను బస్సులో ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్‌:  పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిన వెంటనే అక్కడ భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే జరిగిన ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్న కంపెనీ బస్సు డ్రైవర్‌ లాల్‌రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పేలుడు కారణంగా బస్సు ధ్వంసమైనా వెనుకడుగు వేయకుండా బాధితులను ముత్తంగిలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన తీరును ఆయన ‘సాక్షి’ కి వివరించారు. ‘నేను జనరల్‌ షిప్ట్‌ వాళ్లను కంపెనీకి తీసుకువచ్చి న తర్వాత బస్సును పార్క్‌ చేసి కూర్చుని ఉన్నా. కొద్ది నిమిషాల్లోనే పెద్ద శబ్దం విని్పంచింది.  కాసేపటికి అంతా గాయాలతో బయటికి వస్తున్నారు. ఇంకా అంబులెన్స్‌లేవీ రాలేదు. నేను వెంటనే 8 మందిని బస్సులో ఎక్కించుకుని ముత్తంగి ఆసుపత్రికి తీసుకెళ్లిన. అక్కడి నుంచి మదీనగూడ ఆసుపత్రికి తీసుకొచి్చన. ఆషాక్‌ నుంచి బయటికి రాలేకపోతున్నా..’అని లాల్‌రెడ్డి వివరించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement