patancheru
-
హైదరాబాద్ పఠాన్ చెరు చౌరస్తా వద్ద ఉద్రిక్తత
-
కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పటాన్చెరులో ఉద్రిక్తతలు
సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాత కాంగ్రెస్ క్యాడర్ గురువారం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కాట వర్గీయులు మహిపాల్ దిష్టిబొమ్మను తగలబెట్టాలని చూశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రవాగ్వాదంతో తోపులాట జరిగింది.నిరసనగా.. సీఎం చిత్రపటంతో కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకుని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆఫీస్‌ను ముట్టడించి.. లోపల సీఎం ఫొటో ఉంచారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్తతల నడుమ.. పటాన్చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గత కొంతకాలంగా పటాన్చెరు కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మద్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ పంచాయితీని సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రానురాను ఆ పరిస్థితులు మరింత ముదిరాయి. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో..బొల్లారంలో ఓ కార్యక్రమానికి హాజరైన గూడెం పాత వర్గాన్ని బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో సేవ్ కాంగ్రెస్ .. సేవ్ పటాన్చెరు స్లోగన్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగడం.. పోలీసుల జోక్యం టెన్షన్ వాతావరణం నెలకొంది. -
మెట్రో రెండో దశ పనులకు గ్రీన్‌సిగ్నల్.. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో దశ పనుల్లో భాగంగా ఐదు మార్గాల్లో పనులు జరుగనున్నాయి. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం కానుంది. ఆరు కారిడార్లలో 116.4 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెట్రో నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లుగా ఉండనుంది.హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ పనులు జరుగనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా(30 శాతం) రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా(18 శాతం) రూ.4,230 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే, అప్పుగా రూ.11,693 కోట్లు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.1,033 కోట్లు(52 శాతం నిధులు) సేకరించనున్నారు.కారిడార్లు ఇలా.. కారిడార్-4లో నాగోల్-శంషాబాద్(36.8 కి.మీ)కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట. కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయాణగుట్ట. కారిడార్-7లోమియాపూర్-పటాన్చెరు, కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్‌నగర్. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ.(40 కిలోమీటర్లు). -
నేడు కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దమైంది. సోమవారం(జులై 15) సాయంత్రం సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గూడెం కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో స్థానిక కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్‌గౌడ్,నీలం మధును కాంగ్రెస్ అదిష్టానం బుజ్జగిస్తోంది. మహిపాల్‌రెడ్డి వెంట సంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ , అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్, ఎంపీపీ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
HYD: కుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి,హైదరాబాద్: పటాన్చెరు ఇస్నాపూర్‌లో శుక్రవారం(జూన్28) దారుణం జరిగింది. కుక్కలదాడిలో ఎనిమిదేళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినపుడు కుక్కలు విశాల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.విశాల్ కుటుంబం కూలిపని చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. పొట్ట కూటి కోసం వచ్చి కొడుకును కోల్పోవడంపై విశాల్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
-
ఎమ్మెల్యే సోదరుడు మధు అరెస్టు
పటాన్ చెరు టౌన్, పటాన్చెరు: అక్రమ మైనింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోద రుడు గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు శుక్రవారం తెలవారుజా మున అరెస్టు చేశారు. పటాన్చెరు మండలం లక్డా రం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్‌పై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి ఆర్డీవో ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ తని ఖీలు చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో పటాన్చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పోలీసులు 379, 447, 427, 409, 420 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 21, 23, 4 క్లాస్ (1),4 క్లాస్ (1)ఏ కేసు నమోదు చేసి శుక్రవారం తెల్లవారుజామున గూడెం మధును అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే ముందు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటాన్‌చెరుకు కాకుండా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా మూడో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం కందిలోని జిల్లా జైలుకు తరలించారు. మంత్రి దామోదర ఆదేశాలతోనే అక్రమ కేసులు: ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడుమధుసూదన్ రెడ్డి అరెస్టును మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో చేరాలి.. లేకుంటే అక్రమ కేసులు నమోదు చేస్తాం’’ అన్న విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే తమ పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడం?: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను తప్పు చేస్తే మూడుసార్లు గెలిచేవాడిని కాదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పదేళ్లలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. 2012–13లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతితోనే క్వారీలను ప్రారంభించామని గుర్తు చేశారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్.. కారణం ఇదే..
సాక్షి, పటాన్చెరు: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. వివరాల ప్రకారం.. గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిపై చీటింగ్, మైనింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో మధుసూదన్ రెడ్డి క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ కూడా నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం, మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మధుసూదన్ అరెస్ట్‌తో పటాన్చెరు పోలీసు స్టేషన్ వద్దకి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో, స్టేషన్ ఎదుట పోలీసులు మోహరించారు. -
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. పీఏపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాప్చెరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 304ఏ కింద లాస్య పీఏ ఆకాశ్‌పై కేసు నమోదు చేశారు. ఉదయం 5.15 గంటలకు ఆకాశ్ ఫోన్ చేశారని.. ఇద్దరికే దెబ్బలు తగిలాయని లోకేషన్ షేర్ చేశాడని లాస్య సోదరి నివేదిత తెలిపింది. మేం వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జుగా ఉందని ఆమె చెప్పింది. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్‌రావు వెల్లడించారు.ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపు తప్పి ఓఆర్ఆర్ పక్కన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు లాస్య నందిత బతికే ఉంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ప్రమాదంలో లాస్య పీఏ ఆకాష్ కాళ్లు విరిగిపోయాయని ఏఎస్పీ తెలిపారు. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు -
లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే..
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది. పటాన్ చెరు ఓఆర్ఆర్పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి అయ్యాయి. లాస్య తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ‘‘తలకు బలమైన గాయాలు కావడం వల్లే అక్కడికక్కడే ఆమె చనిపోయారు. లాస్య నందిత శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్ఛర్ అయ్యాయి. ఆరు దంతాలు ఊడిపోయాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. మొత్తంగా.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఆమె మరణించారు’’ అని పోస్టుమార్టం నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రావాల్సిన స్పష్టత లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు పూర్తిస్థాయి విచారణ తర్వాతే.. సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు పరిశీలించారు. ఏఎస్పీ సంజీవరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం అని అన్నారాయన. -
సీఎం రేవంత్‌తో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీపై పఠాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవానం మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు. ఈ అంశంపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని మహిపాల్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని మహిపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనపై అవాస్తవ ప్రచారాలు, ఊహగానాలకు పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. చదవండి: ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి -
వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభించిన నటుడు బాలకృష్ణ
-
రేపు వేల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభం
హైదరాబాద్: వేల్యూ జోన్ హైపర్ మార్ట్ కొత్త అవుట్లెట్ మాల్ హైదరాబాద్‌లోని పటాన్చెరులో గురువారం (రేపు) ప్రారంభం కానుంది. సినీ నటుడు బాలకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. ఇందులో ప్రముఖ బ్రాండ్లపై 40% డిస్కౌంట్ లభిస్తుంది. అవుట్లెట్ చుట్టుపక్కల ఇక్రిశాట్, నిమ్జ్, ఐఐటీ, ప్రధాన సంస్థలు ఉండటంతో విద్యార్థులు, కుటుంబాలు, నిపుణులను మాల్ ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని యాజమాన్యం వ్యక్తం చేసింది. ‘‘మాల్ ఆర్కిటెక్చర్, లేవుట్ నిర్మాణం భాగ్యనగర సంస్కృతి, అభివృద్ధికి వేదికగా నిలిచింది. వెడలై్పన కారిడార్లు, సహజకాంతి, అధునాతన పద్ధతుల్లో రూపొందించిన స్టోర్ల మిశ్రమం సందర్శకులకు గొప్ప షాపింగ్ అనుభూతి పంచుతాయి’’ అని యాజమాన్యం వివరించింది. -
సంగారెడ్డి: పటాన్చెరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్‌గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్‌కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్‌ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్‌ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్‌కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
పటాన్ చేరు పబ్లిక్ మేనిఫెస్టో ఏ పార్టీకి ప్రజల ఓటు?
-
కాంగ్రెస్‌లో తేలని పటాన్చెరు పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు టికెట్ పంచాయితీ ఇంకా పరిష్కారం కాలేదు. ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో తన పేరు ఉండడంతో బీఫారం తీసుకునేందుకు నీలం మధు ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఏఐసీసీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని, స్పష్టత వచ్చిన తర్వాత బీఫారం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు చెప్పారు. దీంతో మధు అనుచరులు కొంతసేపు గాంధీభవన్‌లో హడావుడి చేశారు. టికెట్ ప్రకటించి బీఫాం ఎందుకు ఇవ్వరంటూ ఆందోళన నిర్వహించారు. ఈ టికెట్ విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గట్టి పట్టు పడుతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన విధంగా మధుకు కాకుండా తన సన్నిహితుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌కే టికెట్ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీలో మకాం వేశా రు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని చెపుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి బుధవారమే ఆయన నామినేషన్ వేయాల్సి ఉన్నా ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. తనకు జ్వరం వచ్చినందున బుధ, గురువారాల్లో నిర్ణయించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నానని, ఈనెల 10న తాను నామినేషన్ వేస్తానని ఆయన ప్రకటించారు. అయి తే, మధుకు బీఫాం ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నారని, ఈ కోణంలోనే తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంగిశెట్టి, సలీం రాజీనామా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ముషీరాబాద్ టికెట్ ఆశించిన సంగిశెట్టి జగదీశ్వర్‌రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో బీసీలకు అన్యాయం చేసినందున తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మైనార్టీ నేత సలీం కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాం«దీభవన్‌కు వచ్చిన ఆయనకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు బోసురాజు, గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, నవీన్ భార్యకు తుంగతుర్తి టికెట్ కేటాయించనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద అంబర్‌పేట మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు బుధవారం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయమే జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఇంత దారుణంగా.. వివాహితను హత్య చేసిందెవరు?
సాక్షి, సంగారెడ్డి: వివాహిత హత్యకు గురైన సంఘటన గుమ్మడిదల మండలంలో ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ముడావత్ శివనాయక్, మంగమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఏడాది క్రితం వలసవచ్చి హైదరాబాద్‌లోని బాలానగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. అతను డ్రైవర్, ఆమె అడ్డా కూలీగా పనులు చేసుకుంటున్నారు. గత నెల 28న మంగమ్మ ఎప్పటిలాగే కూలీ పని కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె అదృశ్యంపై భర్త బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గురువారం రాత్రి గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో చెట్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. వారు శివనాయక్‌కు గుర్తించిన ఆ మహిళ మృతదేహం ఒక్కసారి చూడాలని సూచించారు. దానికి అతను అంగీకరించి అక్కడికి వెళ్లి పరిశీలించగా అది భార్య మృతదేహమేనని గుర్తుపట్టాడు. అయితే ఐదురోజుల క్రితం దుండగులు హత్య చేసి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ఇవి చదవండి: 'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు? -
'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, హత్నూర, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లో 5 వేల వరకు వివిధ రకాల పరిశ్రమలున్నాయి. అందులో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అధికం. ఇటీవల కొన్ని వాటిల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమాయకులైన కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. రెండేళ్లలో జరిగిన ప్రమాద వివరాలు.. ► పటాన్చెరు పారిశ్రామిక వాడలో 28 ప్రమాదాలు జరిగి 12 మంది మృతిచెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు. ► బొల్లారం పారిశ్రామికవాడలో 13 ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మరణించగా 40 మంది గాయపడ్డారు. ► బొంతపల్లిలో ఐదు ప్రమాదాలు చోటుచేసుకొని ఇద్దరు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ► గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఐదు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు గాయపడ్డారు. ► హత్నూర పారిశ్రామికవాడలో ఐదు ప్రమా దాలు జరగగా ఇద్దరు మరణించారు. 20 మంది కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. వారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి వలసొచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజా ఘటనలు.. ► ఇటీవల బొల్లారంలోని అమరా ల్యాబ్స్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా ఒక కార్మికుడు మృతిచెందాడు. ► తాజాగా హైగ్రోస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారని తోటి కార్మికులు చెప్పారు. ► ఏడాది కాలంలో ఖైతాన్, వింధ్యా కెమికల్స్, మైలాన్, లీఫార్మా, శ్రీకర ల్యాబ్స్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు మరికొంత మంది కార్మికులు మృతిచెందారు. ఎందుకీ ప్రమాదాలు? రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా మండే స్వభావం గల రసాయనాలను వినియోగిస్తుంటారు. రియాక్టర్లో రసాయనాలను కలిపే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రియాక్టర్ పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రమ్ముల్లో నుంచి రసాయనాలను వేరు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు యాజమాన్యం నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో పనులు చేయించాల్సి ఉంటుంది. రియాక్టర్లలో ఒత్తిడి నియంత్రణకు నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏర్పాటు చేయటంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో అవి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ కోసం దృష్టి సారించటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు! నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలకు అవగహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వంటి సంస్థలకు నోటీసులు అందిస్తున్నాం. – శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇవి చదవండి: రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా.. -
పటాన్చెరు: అన్ని పార్టీల్లో వర్గపోరు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో పటాన్ చెరు ఒకటి. వైవిధ్యమైన ప్రాంతంగా దీనికి పేరు ఉంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రాంతంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. మరోవైపు ఈసారి ఎలాగైన సీటు దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పటాన్చేరులోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నువ్వా-నేనా అన్నట్టు సొంత పార్టీ అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టికెటు తనకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. మూడు పార్టీల్లోనూ వర్గపోరు! మూడు పార్టీల్లో వర్గ పోరు నడుస్తోంది. ఈసారి పటాన్చేరు ఎన్నికలు వాడివేడిగా కొనసాగేలా ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్లో సైతం వర్గపోరు గట్టిగానే నడిచింది. కానీ అధిష్టానంలో తన మాట ప్రకారం ఈసారి సిట్టింగ్‌లకే టికెట్ కెటాయించింది. దాంతో పటాన్‌చేరులో అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మరోసారి మహిపాల్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్‌లో కూడా ఇద్దరు పోటీపడుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే అంటూ పోటీ పడుతూ మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దాంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిని సంతరించుకుంది. బీజేపీ నుంచి నందీశ్వర్, గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీల్లో నెలకొన్ని వర్గపోరు అధిష్టానాలకు తలనొప్పిగా మారేలా ఉంది. టికెట్ల వ్యవహారంతో అసమ్మతి నెలకొనే అవకాశం ఉందని భయపడుతున్నారు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండడం వివిధ మతాల సాంప్రదాయాలు సంస్కృతులు నిలయం. రాజకీయానికి అంశాలు : పారిశ్రామిక వాడ కాబట్టి ఒక గ్రామ వార్డు సభ్యులు కావాలంటే అన్ని లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రాజకీయం చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం ఈ విషయంలోనె కొంతమంది రాజకీయ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం.హైదరాబాద్ పట్టణానికి కూత వేటు దూరం కాబట్టి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల సంస్కృతులు సాంప్రదాయాలు, కూడుకోని ఉంటాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ : కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ (పిసిసి వైస్ ప్రెసిడెంట్) బిజెపి: మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ పారిశ్రామికవేత్త అంజిరెడ్డి. -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన
-
మళ్లీ గెలిపిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, సంగారెడ్డి జిల్లా: 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు. పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలని చెప్పిన సీఎం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే కచ్చితంగా మెట్రో వస్తుందని అన్నారు. గురువారం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పటాన్చెరు ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇక్కడికి త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు. పటాన్చెరులో పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినట్లు చెప్పారు. పటాన్చెరులో మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడస్తున్నాయన్నారు. పటాన్‌చెరుకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని, మూడు మున్సిపాల్టీలకు రూ. 30కోట్ల నిధులు, మూడు డివిజన్లకు రూ.30కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ‘ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చాం. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో తీసుకొచ్చాం. 15 రోజుల్లోనే అనుమితచ్చేలా చర్యలు చేపట్టాం. అధికారుల టేబుల్‌పై ఫైల్ ఆగితే రోజుకు రూ. 1000 ఫైన్ వేస్తున్నాం. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉండటం తెలంగాణకు గర్వకారణం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే.. -
పటాన్‌చెరుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఈ నెల 22న శంకుస్థాపన
పటాన్చెరు: పటాన్చెరు పట్టణానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రాబోతుంది. దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యంతో ఇటు ఆర్థికంగా, అటు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పటాన్చెరు ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి ఫలితంగా ఆధునిక శస్త్ర చికిత్సలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కొల్లూరు డబుల్ బెడ్రూంలను ప్రారంభించి, అనంతరం 11 గంటలకు పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పక్కన నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసి జీఓ ఎంఎస్ 82 జారీ చేసిందన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ.184.87 కోట్లు మంజూరైంది. ఈ మొత్తం వ్యయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 75 శాతం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఖర్చు చేయనుంది. సివిల్ వర్క్స్ నిర్మాణం మరియు పరికరాలు, ఫర్నిచర్ మరియు ల్యాబ్‌ల సేకరణ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇనన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మూలంగా వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలను, నిపుణులైన వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారన్నారు. ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్రచికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఆస్పత్రి నిర్మాణ వివరాలు.. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మూడు అంతస్తుల్లో 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. వార్డులు... ఎన్ఐసీయూ వార్డ్, డయాలసిస్, కార్డియాక్, ఎంఐసీయూ, న్యూరో, కార్డియాక్ ఐసీయూ, ఎన్‌ఎస్‌ఐసీయూ, గైనకాలజీ, సర్జరీ వార్డ్, జనరల్ మెడిసిన్ వార్డులు ఉంటాయి. ల్యాబ్ వివరాలు... మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, బ్లడ్ బ్యాంక్, క్యాత్ ల్యాబ్‌లు ఉండనున్నాయి. శంకుస్థాపనకు సిద్ధం.. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పటాన్చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు స్థలాన్ని సిద్ధం చేశారు.ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పక్కనే గల రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుబాటులో ఉండే వైద్య సేవలు.. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. -
తుపాకీతో బెదిరించి.. ఫ్లిప్‌కార్ట్ సామాగ్రి దొంగతనం.. కళ్లకు గంతలు కట్టి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు దొంగలు దారిదోపిడీకి పాల్పడ్డారు. సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రితో వెళుతున్న డీసీఎంను అడ్డగించారు. డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భానూర్–బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ప్లిప్ కార్డ్ కంపెనీ నుంచి గజ్వేల్‌కు ఓ డీసీఎం వెళుతుండగా, పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూర్ సర్వీస్ రోడ్డు వద్ద ఐదుగురు కారులో వచ్చి అడ్డగించారు. డీసీఎం డ్రైవర్‌ను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కళ్లకు గంతలు కట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేలోపు తుపాకీతో బెదిరించారు. ఓ గంట తర్వాత కారులోంచి దింపారు. కళ్లకు కట్టిన గంతలు విప్పుకొని చూడగా, సుల్తాన్పూర్ ఎగ్జిట్–4 సర్వీస్ రోడ్డు వద్ద ఉన్నాడు. కొద్దిదూరంలో డీసీఎం ఉంది. అక్కడకు వెళ్లి చూడగా, డీసీఎంలో ఉన్న 20 బ్యాగులు కనిపించలేదు. సుమారు రూ.1,78,000 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయని గుర్తించాడు. వెంటనే బాధితుడు పటాన్చెరు పోలీసులకు తెలుపగా వారు సంఘటన స్థలానికి వెళ్లాక పోలీసులు ఇది భానూర్–బీడీఎల్ ఠాణా పరిధిలోకి వస్తుందని వారికి సమాచారం ఇచ్చారు. డ్రైవర్ ఎండీ సత్తార్ ఫిర్యాదు మేరకు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడు నెలల క్రితమే ప్రేమ వివాహం.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. పటాన్చెరు మండలం అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం హమీద్‌నగర్‌కు చెందిన ప్రణయ్‌కుమార్‌రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడునెలల క్రితం ఉపాధి నిమిత్తం అమీన్పూర్ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు. ఈ నెల 22వ తేదీ రాత్రి పదిగంటలకు బయటకు వెళుతున్నానని చెప్పాడు. రాత్రయినా తిరిగి రాలేదు. భర్త కోసం భార్య సాయిలత తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఐదురోజులు దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేసింది. -
ఏడాదిలోగా గగనతలంలోకి మానవసహిత రాకెట్
పటాన్చెరు: ఆస్ట్రోనాట్స్‌తో కూడిన రాకెట్‌ను ఏడాదిలోగా గగనతలంలోకి పంపనున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. గగన్‌యాన్ మిషన్ తుదిదశకు చేరుకుందని, మానవసహిత రాకెట్ ప్రయోగాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని మంజీర మిషన్ బిల్డర్స్ రూపొందించిన సిమ్యూలేటెడ్ క్రూ మాడ్యూల్(ఎస్సీఎం) ఫ్యాబ్రికేషన్ సెల్‌ను శుక్రవారం ఆయన వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో గగన్‌యాన్ ప్రాజెక్టు పూర్తి కానుందని, ఇది సఫలం అయితే అంతర్జాతీయంగా అగ్రదేశాల సరసన భారత్ నిలబడుతుందని పేర్కొన్నారు. విక్రమ్ సారాబాయి స్పేస్ స్టేషన్ డైరక్టర్ ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరికల్లా మానవసహిత రాకెట్ ప్రయోగాలకు మార్గం సుగమమైందన్నారు. మంజీరాలో తయారు చేసిన ఆ పరికరం దేశంలోనే మొదటిదన్నారు. రాకెట్ ప్రయోగంలో కీలకమైన రెండున్నర టన్నుల బరువు ఉండే సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్‌కు 3 ప్యారాషూట్లు అనుసంధానిస్తారని తెలిపారు. ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా సముద్రంలో దిగేలా రూపొందించామని, ఐదు ఎస్సీఎం స్ట్రక్చర్ షెల్ విడిభాగాలను తయారు చేయాలని మంజీర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. 2024 కల్లా రాకెట్లో ఆస్ట్రోనాట్స్ వెళ్లగలిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇస్రో హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. కాగా, మంజీర పరిశ్రమ ఎండీ సాయికుమార్ తమ పరిశ్రమలో తయారు చేసిన ఎస్‌సీఎంను ఉన్నికృష్ణన్‌కు అందించారు. -
రసాయన పరిశ్రమలో ప్రమాదం
జిన్నారం (పటాన్చెరు): మైలాన్ రసాయన పరిశ్రమ యూనిట్ – 1లో రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఆది వారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మైలాన్ పరి శ్రమ లోని లిక్వి డ్ రా మెటీరియల్స్ శాంపిల్ డిస్పెన్సింగ్ గదిలో 1.1.3.3 టెట్రా మిథైల్ డిసిలోక్సేన్ అనే రసాయన మెటీరియల్‌ను (దీనితో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తులకు అవసరమైన మందులు తయారు చేస్తారు) సుమారు 400– 500 డిగ్రీ సెల్సియస్‌లో వేడి చేసి దాని నుంచి జిప్రసైడోన్ ఇంటర్మీడియెట్ రసాయనం తయారు చేస్తుంటారు. ఈ ప్లాంటులో పది మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటిలాగానే రసా యనాలను వేరు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా ఒత్తిడి ఎక్కువై మెరుపులు వచ్చా యి. యాసిడ్ మాదిరి కాలే గుణం ఉన్న రసాయనాలు ఒక్కసారిగా బయటకు ఎగ జిమ్మాయి. అవి ఒంటి మీద పడటంతో చర్మం కాలి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన వేర్‌హౌస్ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా (40), బిహార్‌కు చెందిన రంజిత్‌కుమార్ (27) అనే ముగ్గురు అక్కడికక్కడే కాలి పోయారు. మంటలు కూడా చెలరేగినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..: ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను యాజమాన్యం హుటాహుటి న ఆస్పత్రికి తరలించింది. ఘటన జరిగిన గంటసేపటి తర్వాత పోలీసులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమకు చేరుకున్నారు. మరోవైపు వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను యాజమాన్యం ఘటనా స్థలా నికి పంపలేదు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు కార్మికులకు రక్షణ కల్పించేలా యాజ మాన్యం చర్యలు తీసు కోవాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతు న్నామని సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టీస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
చిగురిస్తున్న మెట్రో ఆశలు.. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో హారం...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పలు మార్గాల్లో మెట్రో మార్గం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన నేపథ్యంలో.. తాజాగా పలు ప్రాంతాల నుంచి మెట్రో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అధికార, విపక్ష పార్టీలు, వివిధ వర్గాల వారు మద్దతునిస్తుండడంతో నూతనంగా చేపట్టాల్సిన మెట్రో మార్గాలపై అధ్యయనానికి హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరు మెట్రో పూర్తికి సుమారు రూ.300 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. ఈ స్థాయిలో నిధులు వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్న విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యం, లేదా కేంద్ర సహకారంతో పలు రూట్లలో ప్రాజెక్టులు చేపట్టడం.. తొలుత ప్రైవేటు సంస్థలు చేసే వ్యయంతో పూర్తిచేసి ఆ తర్వాత వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు వడ్డీతో సహా చెల్లించడం (హైబ్రిడ్ యాన్యుటీ ) తదితర విధానాలపై సర్కారు దృష్టి సారించడం విశేషం. (క్లిక్ చేయండి: ఇక ఈజీగా ఆధార్ అప్డేట్) ఔటర్ చుట్టూ మెట్రో హారం... మహానగరానికి మణిహారంలా 158 కి.మీ మేర విస్తరించిన ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు మెట్రో రూటు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా!
సాక్షి, పటాన్చెరు(సంగారెడ్డి): అదృశ్యమైన యువకుడు హత్యకు గురైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ, తన ఇద్దరు కుమారులతో కలసి పటాన్చెరు మండలం పాటీ చౌరస్తా సమీపంలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రెండో కుమారుడు శివ కుమార్(18)కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 10వ తేదీన బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ కుటుంబసభ్యులు ఉండే ప్రదేశం పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు మార్చారు. ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన శివకుమార్, అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. యువకుడి కుటుంబం పటాన్చెరు శివారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా, యువతి కుటుంబం ముషీరాబాద్ ప్రాంతంలో ఉంటోంది. వారి ప్రేమ యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన భారతితో శివకుమార్‌కు ఫోన్ చేయించారు. ముషీరాబాద్ రావడానికి డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో డబ్బులు ఆన్లైన్లో పంపారు. దీంతో అదే రోజు రాత్రి బయలుదేరాడు. వెళ్లే ముందు ముషీరాబాద్ వెళ్తున్నట్టు తన ఇంటి సమీపంలో ఉంటున్న సతీశ్‌కు ఫోన్ చేసి తెలిపాడు. శివకుమార్ యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి ఓ కాలువలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో శివకుమార్ స్వగ్రామం కోడేరులో విషాదచాయలు అలుముకున్నాయి. -
భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!
సాక్షి, సంగారెడ్డి: భార్యపై అనుమానంతో భర్త బెడ్రూంలో సెల్‌ఫోన్ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయ్యింది. దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్‌కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ భీంరెడ్డి భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాజు బావ శాఖామణి బీరంగూడ మంజీరానగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్. ఇతడి భార్య అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్రూమ్లో సెల్ఫోన్లో వీడియో ఆన్ చేసి సెల్ఫ్‌లో పెట్టాడు. అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్‌కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్ఐ సుభాశ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్ గౌడ్, మల్లేశ్‌గౌడ్, అస్లంఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కోఆప్షన్ భర్త సస్పెన్షన్ పటాన్చెరు: వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నేత, అమీన్పూర్ కోప్షన్ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీఎస్ మణి ఓ పాస్టర్‌గా గుర్తింపు పొందాడని, దాంతోనే ఆయనకు టీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్యను కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడుపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు. సమావేశంలో అమీన్పూర్ కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలి రాజు, నాయకులు యూనుస్, వడ్ల కాలప్ప పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు సమస్యపై యువతి ట్వీట్.. సజ్జనార్ స్పందన
సాక్షి, హైదరాబాద్: నగరంలో రాత్రి సమయాల్లో బస్టాప్‌లో బస్సలు సరిగా ఆపడం లేదంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే నందిని అనే యువతి తన సమస్యను ట్విటర్ వేదికగా తెలియజేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చింది.‘దయచేసి మీ డ్రైవర్స్ కి చెప్పండి ప్రతి బస్టాప్ లో బస్సులు ఆపమని 9:52 నుంచి 10:02 వరకు పటాన్చెరు ఆల్విన్ బస్టాప్‌లో ఒక్క బస్సు కూడా ఆపలేదు. చేయి చూపించిన కూడా ఆపలేదు. ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగింది, ఆర్టీసీ అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. స్టాప్‌లలో కాకుండా ఇంకెక్కడ ఆపుతారు. దయచేసి అవసరమైనవి చేయండి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎంజీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ట్విటర్లను ట్యాగ్ చేశారు. Sir, దయచేసి మీ డ్రైవర్స్ కి చెప్పండి ప్రతి బస్టాప్ లో బస్సులు ఆపమని 9:52 నుండి 10:02 వరకు patancheru ఆల్విన్ బస్టాప్ లో ఒక్క బస్సు కూడా ఆపలేదు చేయి చూపించిన కూడా ఆపలేదు ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగింది rtc ante public transport, stops kaaka inkekkada aaputharu @tsrtcmdoffice — Nidhi Nidhi (@NandhiniNandu12) September 27, 2022 అయితే యువతి చేసిన ట్వీట్‌కు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సంబంధిత అధికారులు దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ టీఆఎస్ఆర్టీసీ ట్విటర్‌ను ట్యాగ్ చేశారు. సజ్జనార్ ఆదేశాలపై స్పందిస్తూ. యువతికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ. . తమ డ్రైవర్లు, కండక్టర్లకు అల్విన్ బస్ స్టాప్ వద్ద బస్సులను ఆపమని అవగాహన కల్పిస్తామని టీఎస్ఆర్టీసీ తెలిపింది. కాగా సాధారణ పౌరులు చెప్పే సమస్యలు, చేసే ట్వీట్లపై వెంటనే సమాధానమిచ్చే సజ్జనార్‌పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
లక్షలు పోసి కొన్న బుల్లెట్ బండి.. చూస్తుండగానే కాలిపోయింది
సాక్షి, సంగారెడ్డి: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మార్కెట్లో ఎన్ని కొత్త మోడల్ బైక్‌లు వచ్చినప్పటికీ బుల్లెట్‌పై యువతకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. లక్షలకు లక్షలు పోసి మరి కొనుక్కొని తమ సొంతం చేసుకుంటారు. డుగ్గు డుగ్గు సౌండ్లతో రోడ్లపై రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వాహనాల్లో ఉన్నట్టుండి మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా ఓ బుల్లెట్ బండిని స్టార్ట్ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పటాన్చెరు పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ జన్యానాయక్, స్థానికుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన జావిద్ తన బుల్లెట్ బండిని పటాన్చెరు పట్టణంలో ని బ్లాక్ ఆఫీసు దుకాణాల ఎదుట పార్క్ చేశాడు. పని ముగించుకొని తిరిగి బండిని స్టార్ట్ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. -
రూ.వెయ్యి కోట్లతో తండాల అభివృద్ధి
జిన్నారం (పటాన్చెరు): రాష్ట్రంలోని అన్ని తండాలను రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల 75వ వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆమె వీక్షించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో మాట్లాడి వారికి విద్య, భోజనం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 193 గిరిజన పాఠశాలలను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
చింతమనేనిదే పందెం కోడి!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు/పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిన్నకంజర్ల శివారులోని ఓ ఫాంహౌస్‌లో కోడిపందేల ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోడిపందేల స్థావరంపై బుధవారం రాత్రి పటాన్చెరువు పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. పందేల ప్రధాన నిర్వాహకుడైన టీడీపీ నేత, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పరారవడంతో ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పందెం నిర్వహణకు చింతమనేనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేర్చామని, ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో 40 మందిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశామని పటాన్చెరువు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. చింతమనేని తన ఫోన్‌ను స్వీచ్చాఫ్ చేసుకున్నారని చెప్పారు. అయితే, పోలీసులు దాడులు నిర్వహించిన కోళ్ల పందేల స్థావరంలో తాను లేనంటూ చింతమనేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై డీఎస్పీ స్పందించారు. ఆయన కోడి పందేలు ఆడిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు సాంకేతిక ఆధారాలను విడుదల చేస్తామన్నారు. అయితే, చింతమనేని బుధవారం కోడి పందేల్లో పాల్గొన్న ఓ వీడియో ‘సాక్షి’కి చిక్కింది. పోలీసుల దాడి సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపించింది. మరోవైపు.. ఇదే స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థాయిని బట్టి బరుల ఏర్పాటు కోడిపందేల్లో పాల్గొనే వారిని చింతమనేని వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తూ రప్పిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చింతమనేని తొలుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహీర్ శివారులోని కుంచారంలో కోళ్ల పందేలు ఆడి తిరిగి అక్కడి నుంచి చిన్నకంజర్లలోని మామిడి తోటలో పందేలు ఆడేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. ముందుగా 20 మందితో పందేలు మొదలవగా వాట్సాప్ గ్రూప్‌లో చింతమనేని లోకేషన్ షేర్ చేయడంతో ఆ సంఖ్య 70కి చేరిందన్నారు. గతంలో సినీ పరిశ్రమలో పనిచేసిన బర్ల శ్రీను అనే వ్యక్తి కూడా పందేల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ స్థావరంలో రూ.500 పందెం కాసేవారికి ఒక బరి, రూ. వెయ్యి కాసేవారికి మరొకటి, రూ.2 వేలు కాసే వారికి మరొకటి.. ఇలా స్థాయిని బట్టి బరులను ఏర్పాటుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించిన చోట గుట్టలకొద్దీ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. సీజ్ చేసిన వాహనాల్లోనూ ఇవి లభించాయి. పట్టుబడిన 21 మంది వీరే.. ఈ కేసులో పట్టుబడిన నిందితులు హైదరాబాద్‌తోపాటు ఏలూరు, కృష్ణాజిల్లా, రాజమండ్రి, విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులైన అక్కినేని సతీశ్, శ్రీనివాస్‌రావు, చేతేశ్వర్‌రావు, శ్రీరామకృష్ణ, బాలస్వామి, లింగాల నాగేశ్వర్రావు, రవడి శ్రీను, రవీంద్ర చంద్రశేఖర్, నాగబాబు, నాగశేషు, సూర్యనారాయణరావు, వంశీ, షణ్ముఖ్‌సాయి, నిఖిల్, గంటా శ్రీనివాసరావు, పార్స శ్రీనివాసరావు, బొడపాటి నాగేశ్వరరావు, ముల్లపుడి నర్సన్న, సత్యనారాయణ రాజు, నర్ర సాంబశివరావు, ప్రకాశ్‌లను రిమాండ్‌కు తరలించారు. ఇక్కడే రేవ్ పార్టీలు కూడా? చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కోళ్ల పందేల స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్లో హైదరాబాద్‌కు చెందిన పలువురు యువతీ యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
రెండు నెలల క్రితమే పెళ్లి.. కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని
సాక్షి, కరీంనగర్/ పటాన్‌చెరుటౌన్: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సోఫీనగర్‌కు చెందిన సంయుక్త(24) బీటెక్ పూర్తి చేసింది. సంయుక్తను నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉత్తేజ్ కుమార్‌కు ఇచ్చి ఏప్రిల్ 7న వివాహం చేశారు. ఉత్తేజ్ కొండాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఇంటి దైవానికి పూజ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కోడలు రాకతో ప్రమాదం జరిగిందని కొత్తకారు ఇప్పించాలని కోడలిని అత్త వేధించడం మొదలుపెట్టింది. అనంతరం భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బంధం కొమ్ము గ్రామం శ్రీదామా హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. సంయుక్తను తరచూ అత్త లావణ్య, మామ పవన్‌కుమార్ ఫోన్లో పెళ్లి సమయంలో రూ.15లక్షల కట్నం, పది తులాల బంగారం ఇచ్చారని, మరో సంబంధం చేసుకుంటే కట్నం ఎక్కువ వచ్చేదని వేధించేవారు. వీరితో పాటు భర్త కూడా అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో ఉత్తేజ్ బుధవారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి సంయుక్త ఉరేసుకుని కనిపించింది. అమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వీరశెట్టి విజయ్‌దర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కూతుర్ని ఆమె భర్త ఉత్తేజ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని సంయుక్త తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే? -
తల్లీకొడుకు అదృశ్యం.. కూరగాయలు కొనేందుకు వెళ్లి..
పటాన్చెరు టౌన్: కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిలు వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పానగల్లు మండలం వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన ఓంకార్, భార్య శిరీషతో కుమారుడు నానితో కలిసి బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు శివారు ఏపీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. చదవండి: బస్టాండ్‌లో భార్య భర్తల మధ్య చెప్పుల గొడవ.. చివరికి.. ఓంకార్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, శిరీష కూలీ పనిచేస్తుంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈనెల 27న సాయంత్రం కూరగాయలు కొనేందుకు కుమారుడితో మార్కెట్ వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కూతురు అదృశ్యంపై స్వగ్రామానికి చెందిన సురేష్‌పై అనుమానం ఉందని శిరీష తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థులపై ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, పటాన్చెరు టౌన్: విదార్థులతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ట్యూషన్ టీచర్‌ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా..రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సాల్మన్ రాజు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ వెళ్తున్నారు. సోమవారం ఓ బాలిక ట్యూషన్‌కి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండగా తండ్రి నిలదీయడంతో టీచర్ వేధిస్తున్న విషయం బయటపడింది. స్థానికులు, మహిళలతో కలిసి ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు సాల్మన్ రాజును నిలదీసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడగా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
గీతం పూర్వ విద్యార్థిని శివాలి మరో గిన్నిస్ రికార్డు
పటాన్చెరు: గీతం యూనివర్సిటీ పూర్వ విద్యా ర్థిని శివాలి జోహ్రి గిన్నిస్ రికార్డు సాధించారు. కాగితంతో పూలు, ఇతర ఆకృతులను క్విల్లింగ్ ప్రక్రియలో చేసి ఆమె ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు, 15 అసిస్ట్ రికార్డులు సాధించిన శివాలి తాజాగా 2020 ఏడాదికి గాను 14వ గిన్నిస్ రికార్డ్ సాధించారు. 2016–17 విద్యా సంవ త్సరంలో గీతం యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి పది యూనిక్ వరల్డ్ రికార్డులు కూడా పొందారు. ఆమె రికార్డులను గీతం యూనివర్సిటీ వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపిస్తూ వచ్చారు. తొలిసారిగా ఆమె నిర్ణీత సమ యంలో తన తల్లి కవిత జోహ్రి కలిసి 1,251 విభిన్న ఆకృతుల్లో కాగితపు బొమ్మలను తయా రు చేసి రికార్డు సృష్టించారు. తాజాగా 2,342 బొమ్మలను తయారు చేసి గీతంలో ప్రదర్శిం చారు. శివాలి మరోసారి గిన్నిస్ రికార్డు సాధించడంపై గీతం యాజమాన్యం హర్షం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా యాజ మాన్య ప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు -
వివాహేతర సంబంధం.. ఇద్దరిని ఓకే ఇంట్లో చూడటంతో..
సాక్షి, పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది. ఈ ఘటనలో భార్య పద్మతో పాటు మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డితో కలసి హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భీంరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని చక్రపురి కాలనీలో ఈ నెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో తీవ్రగాయాలతో ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో అమీన్పూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య భర్త కనిపించడం లేదని చందానగర్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇవ్వడాన్ని అమీన్పూర్ పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా భాసీరాబాద్ మండలం జీవంగి గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటప్ప(39) కూలి పని చేసుకుంటూ చందానగర్‌లో భార్య పద్మతో నివాసం ఉంటున్నాడు. బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద అడ్డపై కూలి పనికి వెంకటప్ప వెళ్తుండగా, భార్య ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉండే సెంట్రింగ్ పని చేసుకునే అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పుడప్పుడు వెంకటప్పను రహమాన్ తనతో పనికి తీసుకెళ్లేవాడు. చదవండి: ప్రేమ పేరుతో కూతురు పరువు తీస్తోందని... ప్రియుడితో కలిసి తల్లి.. పక్కా ప్రణాళిక ప్రకారమే.. ఒక రోజు ఇంట్లో పద్మ, రహమాన్ ఇద్దరిని చూసిన వెంకటప్ప భార్య పద్మతో గొడవపడ్డాడు. దీంతో పద్మ భర్త అడ్డు తొలగించాలని రెహమాన్‌కు తెలపింది. దీంతో రెహమాన్ అతడితో పనిచేసే సుభాష్‌తో కలసి వెంకటప్ప అడ్డు తొలగించుకునేందుకు ప్లాస్ వేసుకున్నారు. ప్రణాళికలో భాగంగా ఈ నెల 8వ తేదీన వెంకటప్పను కొల్లూరు దగ్గర పని ఉందని చెప్పి రెహమాన్, సుభాష్‌లు వెంకటప్పను స్కూటీపై ఎక్కించుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లాక పని ఈ రోజు లేదని చెప్పి మద్యం సేవించడానికి ఆలూర్ వెళ్లి బాగా తాగారు. తిరిగి అక్కడి నుంచి లింగంపల్లి వచ్చి అక్కడ వెంకటప్పకు మరో సారి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటప్పను అమీన్పూర్ పరిధిలోని చక్రపూరి కాలనీలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెద్దబండ రాయితో వెంకటప్ప తల, మొఖంపై కొట్టి చంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు మృతుడి భార్య పద్మ, అబ్దుల్ రెహమాన్, సుభాష్‌లను రిమాండ్‌కు తరలించారు. వారు వాడిన స్కూటీని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, ఎస్ఐ సోమేశ్వరి, అమీన్పూర్ కానిస్టేబుళ్లు రాములు, మహేందర్‌ను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఆరుగురి అరెస్ట్ -
ఈ మూర్తి.. జగతికి స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. నాటి స్వాతంత్య్ర పోరాటం అధికారం, హక్కుల కోసమే కాకుండా వేల ఏళ్ల సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిందని తెలిపారు. ఆ పోరాటంలో పాటించిన ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రధాని మోదీ శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వివరాలు ప్రధాని మాటల్లోనే.. ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం ‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగుకంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురుమంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను. మనం అనుసరిసున్న విలువలు, ఆదర్శాలను మనం ఈరోజు రామానుజాచార్యుల విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. రామానుజుల మార్గం రాబోయే సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రాచీన భారతీయతను కూడా బలోపేతం చేస్తుంది. విశిష్టాద్వైత బోధనతో.. అంబేద్కర్ వంటివారు రామానుజాచార్యులను ప్రశంసించడంతోపాటు ఆయన బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. మన దేశంలో పూర్వకాలం నుంచీ వివిధ వాదాలు, సిద్ధాంతాలను విశ్లేషించి స్వీకరించడమో, తిరస్కరించడమో కాకుండా.. అందులోని మంచిని వివిధ రూపాల్లో ఆచరించే సాంప్రదాయం ఉండేది. అదే రీతిలో రామానుజాచార్యులు కూడా అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చిస్తున్న ప్రగతిశీలత, సామాజిక సమస్యల పరిష్కారం వంటి ఎన్నో అంశాలను రామానుజులు తన సంస్కృత, తమిళ గ్రంథాల్లో ఎప్పుడో లేవనెత్తారు. మూఢ విశ్వాసాలను అధిగమిస్తూ.. వెయ్యేళ్ల క్రితం సమాజంలో బలంగా ఉన్న మూఢ, అంధ విశ్వాసాలను అధిగమిస్తూ భారతీయ ఆలోచన ధారను రామానుజాచార్యులు సమాజానికి పరిచయం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, వారిని చేరదీసి గౌరవించారు. యాదగిరిపై నారాయణ మందిరం నిర్మించి దళితులకు దర్శనం, పూజలు చేసే అధికారం కల్పించారు. తాను స్నానం చేసి వచ్చే సమయంలో శిష్యుడు ధనుర్దాసు భుజాల మీద చేయివేసి నడవడం ద్వారా అంటరానితనం సరైనది కాదని స్పష్టంచేశాడు. చదవండి: ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం సమానత్వాన్ని బోధిస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’.. ఆదర్శాలు, సత్యం అనే ఆభరణాలు లేని గాంధీని, ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని మనం ఊహించలేం. హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది. రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. ఈ సమతాస్ఫూర్తితోనే ఎలాంటి అంతరాలు లేకుండా ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయ త్నిస్తోంది. ఈ రోజు ఇక్కడ నాకు 108 దివ్యదేశ మందిరాల సందర్శన భాగ్యం లభించింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్రావు పాల్గొన్నారు. ప్రధాని మోదీది రాజధర్మం: చినజీయర్ స్వామి నిత్యం ప్రజల శ్రేయస్సును కాంక్షించే శ్రీరామచంద్రుడు వ్రత సంపన్నుడుగా ప్రసిద్ధికెక్కాడని.. ఇప్పుడు దేశప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ప్రధాని మోదీ కూడా వ్రత సంపన్నుడేనని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడారు. మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి ఏళ్లకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచారని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ మోదీలో కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషిచేస్తున్నారు. అందుకే ఆయనకే ప్రధాని స్థానం సరిపోలుతుంది. సబ్‌కాసాత్– సబ్కా వికాస్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.’’అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలుచేస్తోందన్నారు. కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
పటాన్ చెరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సంగారెడ్డి: పటాన్ చెరులోని ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ ఓ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆటోను ఢీకొట్టడంతో.. ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందగా.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లుతున్న మరో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని మృతి చెందిన వారి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రగాయాల పాలైన మరొకరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రమణ కుమార్ పరిశీలించారు. -
కరెంటు షాక్‌తో తండ్రి, కూతురు మృతి
పటాన్చెరు టౌన్: బాలుడు లోపలి నుంచి గడియ పెట్టుకోవడంతో ఇనుప చువ్వతో తీసే ప్రయత్నం చేసిన ఘటనలో విద్యుదాఘాతానికి గురై తండ్రి, కూతురు మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన బసుదేవ్ మాలిక్ (36) ఇస్నాపూర్ ప్రముఖ్‌నగర్‌లోని ఓ భవనంలో రెండో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. పాశంమైలారంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు బిద్యార్థి మాలిక్(6), కున్ను మాలిక్ (2) ఉన్నారు. సోమవారం ఇంటిపక్కనే ఉండే ఓ బాలుడు వారి ఇంట్లో పొరపాటున లోపలినుంచి గడియ పెట్టుకున్నాడు. దీంతో బసుదేవ్ మాలిక్, అతడి భార్య రేను మాలిక్ ఇద్దరు కలసి ఇనుప చువ్వతో గడియ తీసే ప్రయత్నం చేస్తుండగా ఇనుపచువ్వ వెనుకభాగం ఇంటి బాల్కనీకి ఆనుకుని ఉన్న కరెంట్ స్తంభం నుంచి వెళ్తున్న 11 కేబీ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై బసుదేవ్ మాలిక్, అతని వద్ద నిల్చున్న కూతురు కున్ను తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. భార్య రేనుమాలిక్‌కు తీవ్రంగా గాయాలవడంతో చికిత్స నిమిత్తం చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
కుక్కను చంపాడని మనిషిని చంపారు
పటాన్చెరు టౌన్: భర్తను హత్య చేసి భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రెండవ అడిషన ల్ కోర్టు ముగ్గురికి జీవితఖైదు విధించింది. ఒక్కొ క్కరు రూ.5 వేల జరిమానా చెల్లించాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. 2014లో పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రామచంద్రా పురానికి చెందిన ఉప్పు ప్రశాంత్ రామేశ్వరంబండ వీకర్‌సెక్షన్ కాలనీలో నివాసం ఉండేవాడు. ప్రశాంత్ ఇంటి పక్కనే శ్రీనివాస్ నివాసం ఉండేవాడు. కాగా ప్రశాంత్ ఒక కుక్కను పెంచుకున్నాడు. అది శ్రీనివాస్ ఇంటికి వెళ్లడంతో.. వాళ్లు కొట్టి చంపారు. దీంతో ప్రశాంత్, శ్రీనివాస్‌ల మధ్య గొడవ జరిగిం ది. దీంతో బొంబాయి కాలనీకి చెందిన మ్యాతరి ప్రకాష్, నక్కోల వినోద్‌లతో కలసి 2014 జూలైలో శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశాడు. ఘటనలో శ్రీని వాస్ చనిపోగా, అతడి భార్య రేణుక గాయపడింది. హత్య, హత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశా రు. అప్పటినుంచి కేసుకు సంబంధించిన వాదన లు కోర్టులో నడుస్తున్నాయి. శుక్రవారం అడిషనల్ పీపీ మహ్మద్ మహబూబ్ వాదనలు విన్న జిల్లా రెండవ అడిషనల్ కోర్టు న్యాయమూర్తి అనిత నిందితులకు జీవితఖైదు విధించారు. -
పటాన్చెరు: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలలో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పటాన్చెరు, ఖమ్మం వైరా గురుకులు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. (చదవండి: ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే!) పటాన్చెరు-ఇంద్రేశం గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఖమ్మం వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ తగిన నిర్ణయం తీసుకోవాలిని కోరుతున్నారు. (చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!) తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరిగితే.. రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నా ఎదుగుదల సర్వేల్ గురుకులం భిక్షే -
మోగనున్న బడిగంట: ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం!
శేరిలింగంపల్లి: కరోనా వ్యాప్తితో మూతపడ్డ పాఠశాలలను సెప్టెంబర్ 1 నుంచి తెరిచి తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జీహెచ్ఎంసీ అధికారులు, ఎంఈఓ ఆధ్వర్యంలో శానిటేషన్, ఎంటమాలజీ విభాగం సిబ్బంది పారిశుద్ధ్య, శానిటైజేషన్ పనులను నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ రెండు రోజులుగా పరిశుభ్రతా పనులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇక ఆన్లైన్ తరగతులకు స్వస్తి పలకాలని నిర్ణయించడంతో విద్యార్థులంతా పాఠశాలలకు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో.. ► ప్రభుత్వ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణను శుభ్రం చేయించే బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారు. ► తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు శానిటైజ్ చేస్తున్నారు. ► వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్, జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు వెంకన్న, సుధాంషుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులు ఈ పనులను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలోని ప్రభుత్వపాఠశాలల వివరాలు: ►శేరిలింగంపల్లి ప్రాంతంలో మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 14,332 మంది విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ►మొత్తం 13 జెడ్పీహెచ్ఎస్లలో 6,232 మంది విద్యార్థులు, నాలుగు యూపీఎస్ స్కూళ్లలో 908 మంది విద్యార్థులు, 43 ప్రాథమిక పాఠశాలల్లో 7,192 మంది విద్యార్థులు చదువుతున్నారు. ► శేరిలింగంపల్లి మండలంలో ప్రైవేటు పాఠశాలలు 261 ఉండగా, వాటిల్లో 90 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. సురభికాలనీ పాఠశాలలో పరిశుభ్రత పనులు, పాపిరెడ్డికాలనీలోని గ్రౌండ్‌ను చదును చేస్తున్న దృశ్యం పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలి. పాఠశాలలన్నింటినీ జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో పరిశుభ్రం చేసి శానిటైజ్, చేయిస్తున్నాం. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం కోవిడ్ నిబంధనలను విధిగా అందరూ పాటించాల్సిందే. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి స్కూళ్లు తెరిచేలా శానిటైజ్ చేయించి సిద్ధం చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తాం. -కె.వెంకటయ్య, మండల విద్యాధికారి శేరిలింగంపల్లి ఉపాధ్యాయులు పాటించాల్సిన అంశాలివీ... ♦ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని పాఠ శాల ఆవరణ అంతా పరిశుభ్రంగా మార్చాలి. ♦ పాఠశాలలోని తరగతి గదులు శుభ్రం చేయించాలి. ♦ పాఠశాలను పూర్తిగా శానిటైజ్ చేయించాలి. ♦ పాఠశాల ఆవరణలో ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, సంపులను క్లీనింగ్ చేయించాలి. ♦ విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలి. ♦ ప్రభుత్వం ఆదేశించిన కోవిడ్ నిబంధనలన్నీ విధిగా అందరూ పాటించాలి. ♦ పరిశుభ్రమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం తయారీ, భౌతిక దూరం పాటిస్తూ వారు భుజించేలా చూడాలి. విద్యార్థులు పాటించాల్సిన అంశాలు: ♦ ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలి. ♦ పాఠశాలలో భౌతిక దూరం పాటించాలి. ♦ చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ♦ కోవిడ్ నిబంధనలన్నీ తప్పక పాటించాలి. -
పఠాన్ చేరు- సాయినగర్ కాలనిలో కారు బీభత్సం
-
1,200 ఏళ్లనాటి జైన విగ్రహం మాయం వెనుక అసలు కథ
ధ్యానముద్రలో ఉన్న ఈ విగ్రహం జైన మహావీరుడిది. నల్ల గ్రానైట్‌తో నిగనిగ మెరిసిపోతున్న దీని వయస్సు 1,200 ఏళ్లు. ఇది పటాన్చెరు ప్రాంతంలోనిది. రాష్ట్రకూటుల కాలంలో ప్రతిష్టితమైంది. దీని ఎత్తు నాలుగున్నర అడుగులు. అయితే, ఈ విగ్రహం ఇటీవల ఉన్నట్టుండి మాయమైంది. అంతర్జాతీయ విపణిలో అత్యంత విలువైన ఈ విగ్రహం అదృశ్యమవడం ఇప్పుడు హెరిటేజ్ తెలంగాణలో అలజడి రేపుతోంది. సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు రాష్ట్రకూటుల పాలనకు సంబంధించిన కీలక ప్రాంతం. అప్పట్లో ఈ ప్రాంతం జైనుల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగానూ విలసిల్లింది. అయితే, ఇక్కడ పలు జైన కట్టడాలు ప్రస్తుతం జీర్ణావస్థలో దర్శనమిస్తున్నాయి. ధ్యానముద్రలో ఉన్న మహావీరుడి విగ్రహం రోడ్డు పక్కన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఈ ప్రాంతం గుండా వెళ్లేవారు ఆసక్తితో తిలకిస్తూ ఉండేవారు. ఆలస్యంగా వెలుగులోకి.. గతంలో ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖలో పనిచేసి రిటైర్ అయిన ఈమని శివనాగిరెడ్డి తాజాగా ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆయన సర్వీసులో ఉన్న సమయంలో ఇక్కడి విగ్రహాలు, ఇతర కట్టడాలపై అధ్యయనం చేసి ఉన్నారు. దీంతో వాటిని చూడాలన్న ఆసక్తితో ఇటీవల పటాన్చెరు వెళ్లారు. అక్కడ జైనుడి విగ్రహం కనిపించలేదు. ఓ బుద్ధుడి విగ్రహం కనిపించింది. ధ్యానముద్రలో ఉన్న ఈ తథాగతుడి విగ్రహం ఏడాదిన్నర క్రితం పటాన్చెరులో ఏర్పాటైంది. స్థానికులను విచారించగా ఇటీవలి వరకు జైనవిగ్రహం రోడ్డు పక్కనే ఉండేదని, దాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని పేర్కొన్నారు. ఆయన హెరిటేజ్ తెలంగాణ అధికారులను సంప్రదించగా తాము దాన్ని తరలించలేదన్నారు. గతంలో పటాన్చెరు నుంచి కొన్ని విగ్రహాలను తీసుకొచ్చి స్టేట్ మ్యూజియంలో భద్రపరిచారు. వాటిల్లోనూ ఈ విగ్రహం కనిపించలేదు. దాన్ని ఎవరు తరలించుకుపోయారో గుర్తిస్తామని హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ చెప్పారు. చాలా ప్రాంతాల్లో జైన నిర్మాణాలు, విగ్రహాలు ఆలనాపాలనా లేక పడి ఉన్నాయి. విగ్రహాలను చూసి ఆవేదన చెందే కొందరు జైన భక్తులు వాటిని తాము పరిరక్షిస్తామని, ప్రదర్శనకు ఏర్పాటు చేస్తామని పురావస్తు శాఖను అప్పుడప్పుడూ సంప్రదిస్తుంటారు. కానీ, ఈ విగ్రహం విషయంలో ఎవరూ సంప్రదించలేదని అధికారులు చెబుతున్నారు. స్మగ్లర్ల చేతికి చిక్కద్దనే.. పురాతన కాలం నాటి రాతి విగ్రహాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. వాటిని కొందరు స్మగ్లర్లు విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటివారి చేతుల్లోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతో ఎలాంటి పురాతన సంపద అయినా రాష్ట్రప్రభుత్వం ఆస్తిగా మాత్రమే ఉండాలనే నిబంధనను అధికారులు విధించారు. చట్టం ఏం చెబుతోంది.. రాష్ట్రంలోని ప్రతి పురాతన నిర్మాణం, విగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిగా ఇటీవలే కొత్తగా అమలులోకి వచ్చిన తెలంగాణ హెరిటేజ్ చట్టం చెబుతోంది. భూమిలో పది సెంటీమీటర్ల లోపల దొరికే ప్రతి పురావస్తు వస్తువు, సంపద ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిర్మాణాలు, విగ్రహాలున్నా.. కొన్నింటిని మాత్రమే రక్షిత కట్టడాలుగా గుర్తించి ప్రభుత్వం సంరక్షిస్తోంది. అయినా మిగతావాటిపై అజమాయిషీ మాత్రం ప్రభుత్వానిదే. ఎక్కడైనా విలువైన విగ్రహాలు, వస్తుసంపద వెలుగుచూస్తే స్థానికుల అనుమతితో వాటిని ప్రదర్శనశాలకు తరలిస్తారు. స్థానికులు ఒప్పుకోని పక్షంలో అక్కడే ఉంచి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటారు. వాటికి భద్రత లేని పక్షంలో ఎవరైనా ముందుకొచ్చి సంరక్షణకు చర్యలు తీసుకుంటామంటే నిబంధనల ప్రకారం మాత్రమే వారికి అప్పగిస్తారు. కానీ పటాన్‌చెరులోని విగ్రహాన్ని ఎవరో హెరిటేజ్ తెలంగాణ శాఖ అధికారుల అనుమతి లేకుండా తరలించుకుపోయారని స్పష్టమవుతోంది. జైన వర్గానికి చెందిన వారు తీసుకెళ్లి సంరక్షిస్తున్నా.. .అనుమతి లేకుండా తీసుకుపోవటం మాత్రం నిబంధనలకు విరుద్ధమేనని అధికారులు చెబుతున్నారు. కానీ విగ్రహం ఎక్కడుందనే విషయంలో మాత్రం సమాచారం లేక వారు దాన్ని వెదికే పనిలో పడ్డారు. -
భార్యతో గొడవ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్మ
పటాన్చెరు టౌన్ : భార్యతో గొడవపడి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాల్తూరు గ్రామానికి చెందిన అల్లూరి నాగవెంకట సత్యభార్గవ్ (27) చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సత్యభార్గవ్ నాలుగు నెలల క్రితం అదే జిల్లాకు చెందిన బంధువుల అమ్మాయి మంజును హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చెన్నై వెళ్లి ఇద్దరికి నచ్చజెప్పారు. దీంతో ఈ ఏడాది జనవరిలో సత్యభార్గవ్ భార్య మంజుతో కలసి పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం సాయికాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 21వ తేదీన సత్యభార్గవ్ భార్య మంజు గొడవపడ్డారు. దీంతో సత్యభార్గవ్ తన తమ్ముడికి ఫోన్ చేసి ఇంట్లో గొడవ జరిగిందని నేను స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సోమవారం మృతుడి తమ్ముడు రవితేజ ఇంద్రేశం ఇంటికి రాగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేçహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. -
65 శాతం సీట్లు గిరిజనులకే.. మంత్రి హర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గిరిజన గురుకులంలో కో ఎడ్యుకేషన్ లా కాలేజీ (రెసిడెన్షియల్) ఏర్పాటుకు గతేడాది గిరిజన గురుకుల సొసైటీ ప్రతిపాదనలు పంపింది. కోవిడ్–19 నేపథ్యంలో అనుమతులకు ఆలస్యం అవుతుందని అధికారులు భావించారు. కానీ లాసెట్ పరీక్ష, ఫలితాల ప్రకటన, కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం అడ్మిషన్ల ప్రక్రియకు కలసివచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం దక్కింది. ప్రస్తుతం లాసెట్–20 తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి కాగా రెండో విడత కౌన్సెలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గిరిజన న్యాయ కళాశాలకు వచ్చిన అనుమతులను ఉన్నత విద్యా మండలి, సెట్ కన్వీనర్లకు సమరి్పంచడంతో ఈ కాలేజీలో సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. 65 శాతం సీట్లు గిరిజనులకే.. గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా ప్రారంభం కానున్న న్యాయ కళాశాలలో 65 శాతం సీట్లు గిరిజనులకే కేటాయిస్తారు, గిరిజన విద్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఇందులో గిరిజనులకు 39, ఎస్సీలకు 6, బీసీలకు 7, అగ్రవర్ణాలకు 2, స్పోర్ట్స్ కోటా 2, ఎన్సీసీ 2, ఎక్స్ సరీ్వస్ మెన్ 1, వికలాంగులకు 1 కేటాయిస్తారు. శుభ పరిణామం: మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ప్రారంభించడం శుభ పరిణామం. కేజీ టూ పీజీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను నిర్వహిస్తోంది. ఇటీవలే నర్సంపేటలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభించాం. బీఈడీ, మరో రెండు పీజీ కోర్సులకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–20 వల్ల అనుమతులు రావడంలో ఆలస్యం అవుతోంది. -
మరో అమ్మాయితో భర్త చాటింగ్.. భార్య ఆత్మహత్య
సాక్షి, రామచంద్రాపురం(పటాన్చెరు): మరో అమ్మాయితో భర్త రహస్యంగా వాట్సప్ చాటింగ్ చేస్తున్నాడనే మనస్తాపం చెంది ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంఘటన రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లికార్జున నగర్లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన రామలక్ష్మి(25) మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డితో వివాహం జరిగింది. జీవనోపాధికై రామచంద్రపురం వలస వచ్చారు. వెంకట్ రెడ్డి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహ సమయంలో కట్నం కింద ఎకరం భూమి, 50 గ్రాముల బంగారం, నగదును ఇచ్చారు. వివాహం జరిగిన సమయంలో ఇద్దరు మంచిగానే కాపురం చేశారు. వారికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. మృతురాలి భర్త వెంకట్ రెడ్డి ఆయన పని చేసే కంపెనీలో ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరుచుకున్నాడు. రహస్యంగా వాట్సాప్ లో ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఈ విషయంలో గతంలో మృతురాలు రామలక్ష్మి భర్త వెంకట్ రెడ్డిని నిలదీసింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. చదవండి: విషాదం.. పెళ్లయిన ఆర్నెళ్లకే ఈ విషయంలో కూతురు సంసారం పాడవుతుందన్న ఆలోచనతో అల్లుడికి నచ్చజెప్పారు. ఆ సమయంలో తను చాటింగ్ చేయనని హామీ ఇచ్చాడు. కాగా మృతురాలు రామలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చింది. ఆ సమయంలో భర్త తిరిగి అమ్మాయితో చాటింగ్ చేసిన మెసేజ్‌ను చూసి ఆ మెసేజ్‌లను తన చెల్లికి పంపించింది. తన చెల్లికి ఫోన్ చేసి బావ మారలేదని, తిరిగి ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని ఆ బాధ భరించలేక చనిపోతున్నా అని ఫోన్ పెట్టేసింది. తిరిగి చెల్లెలు ఫోన్ చేసినా తీయకపోవడంతో తల్లిదండ్రులకు తెలియజేసింది. కాగా సోమవారం తెల్లవారుజామున అల్లుడు వెంకట్ రెడ్డి తమకు ఫోన్ చేసి తమ కూతురు రామలక్ష్మి పడక గదిలో ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారని తెలిపారు. తమ అల్లుడు మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి తన కూతురు ఉరి వేసుకుని చనిపోయిందని అల్లుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో విషాదం ఒంటికి నిప్పంటించుకొని.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నిప్పంటించుకొని మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివపేట పట్టణంలోని దత్తత్రేయనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివపేట పట్టణంలోని దత్తాత్రేయనగర్ కాలనీకి చెందిన గాండ్ల శ్రీలత (35)కు కూకట్‌పల్లిలోని నిజాంపేట్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శ్రీలత కంది మండలం ఎర్థనూర్, మామిడిపల్లి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించింది. ఆదివారం రాత్రి పుట్టింటికి వచ్చిన ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సోమవారం సదాశివపేట పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ప్రసాద్ మరణం.. అన్నీ అనుమానాలే...
సాక్షి, పటాన్చెరు టౌన్ (హైదరాబాద్): నూతన సంవత్సర వేడుక ఓ కుటుంబంలో విషాదం నింపింది. మంచినీళ్లు తాగేందుకు సింటెక్స్ ట్యాంక్‌లోకి తలపెట్టి ప్రమాదవశాత్తు లోపలికి పడిపోయి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన సాయిలు ఎనిమిదేళ్ల క్రితం జీవనోపాధి కోసం పటాన్‌చెరుకు వచ్చి ఇంద్రేశం గ్రామం సాయికాలనీలో వినయ్ టైలరింగ్ వద్ద పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయిలుకు ముగ్గురు పిల్లల్లో రెండో కుమారుడు భవానీప్రసాద్(20) చందానగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి ఇంటివద్ద ఉంటున్నాడు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి భవానీప్రసాద్ తన స్నేహితులు వెంకటరెడ్డి, అశోక్, సాయితేజ, దినేశ్‌యాదవ్, వంశీత్ రెడ్డి, ఆనంద్‌తో కలసి నూతన సంవత్సర వేడుకల్ని పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఓ భవనంపై జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో భవానీప్రసాద్ కేక్ కోసిన తరువాత వస్తానని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. స్నేహితులతో కలసి పటాన్చెరు పట్టణంలో మంగలబస్తీలో శ్యామ్ అనే వ్యక్తి ఇంటిపై మద్యంపార్టీ చేసుకుని అందరూ పడుకున్నారు. పార్టీకి ముందు భవానీప్రసాద్ పక్కనే ఉన్న వాటర్‌ట్యాంకుపై సెల్ఫీ దిగే నేపథ్యంలో మద్యం సీసా ట్యాంకులో పడిపోయింది. తర్వాత అందరూ పడుకున్నారు. భవానీ ప్రసాద్‌కు దాహం వేయడంతో నీటి ట్యాంకు పైకి ఎక్కాడు. ట్యాంక్‌లో తల పెట్టగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు అతన్ని బయటకు తీసి 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి చూసి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అన్నీ అనుమానాలే... భవానీ ప్రసాద్ మంచినీళ్లు తాగేందుకు ట్యాంకుపైకి ఎక్కాడని అతడి స్నేహితులు చెబుతోన్న వాదనే అసంబద్ధంగా ఉందని, కొడుకు మృతిపై అనుమానం ఉందని తండ్రి, కుటుంబ సభ్యులు అనుమానాలు లేవనెత్తుతున్నారు. కేసు నమోదు చేసి హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
తమాషా చేస్తున్నావా.. నీ అంతు చూస్తా
పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఓ జర్నలిస్ట్‌పై దూషణలకు దిగారు. ఓ దినపత్రికలో వ చ్చిన కథనం నేపథ్యంలో సదరు జర్నలి స్ట్‌కు ఫోన్‌చేసి ‘తమాషా చేస్తున్నావా.. నా పేరుతో కథనం రాస్తావా.. ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారు. ఈ ఆడియో కాస్తా మంగళవారం సోషల్ మీడియాలో వైరలైంది. అనంతరం తన ను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫోన్లో దూ షించారని జర్నలిస్టు సంతోష్‌నాయక్ పో లీసులను ఆశ్రయించాడు. తాను రాసిన కథనానికి ఎమ్మెల్యే ఫోన్లో దూషించడం తో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని డీఎస్పీ భీంరెడ్డిని కలసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే తీరును టీయూడబ్ల్యూజే– ఐజేయూ ఒక ప్రకటనలో ఖండించింది. -
అక్రమ దత్తత: బాలుడి దీనగాద
పటాన్చెరు టౌన్: అక్రమ దత్తత వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లికి చెందిన హరణ్ పాత బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వినాయక చవితి రోజున హైటెక్ సిటీ సమీపంలో పాత బట్టలు అమ్ముతున్న సమయంలో వర్షం రాకతో రెండు సంవత్సరాల బాలుడు అతని వద్దకు తడుస్తూ వచ్చాడు. దీంతో హరణ్ చుట్టు పక్కల బాలుడికి సంబంధించిన వారు లేకపోవడంతో ఆ బాలుడి తీసుకొని పటాన్చెరు సాయి కాలనీలో ఉండే మామా యాకోబ్ ఇంటికి వచ్చాడు. దీంతో యాకోబ్, అతడి భార్య సరోజ పిల్లలు లేని కారణంగా ఆ బాలుడిని వారి వద్ద ఉంచుకున్నారు. అప్పటి నుంచి వారు ఆ బాలుడిని పెంచుకుంటున్నారు. బాలుడి దత్తత అక్రమని వారు సొంత తల్లిదండ్రులు కాదని జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు బాలుడిని తెచ్చిన హరణ్, అక్రమ దత్తత తీసుకున్న యాకోబ్, సరోజ ముగ్గురు పై కేసు నమోదు చేశారు. కాగా బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్కాచెల్లెలు అదృశ్యం..
పటాన్చెరు టౌన్ : ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు ఇద్దరు అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఇంద్రేశం ఆర్కే నగర్ కాలనీకి చెందిన జగదీశ్వర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు స్వప్నకు వివాహం కాగా రెండో కూతురు అనూష గతంలో వివాహం చేసుకొని విడాకులు తీసుకొని వీరి వద్దే ఉంటుంది. చిన్న కూతురు మనీషా పటాన్చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది.ఈ క్రమంలో గురువారం జగదీశ్వర్ భార్య స్వరూపతో కలసి పనిపై బయటకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి రాగానే కూతుర్లు అనూష, మనీషా ఇంట్లో లేరు. ఇంటి పక్కనే ఉన్న నందుకు అనూష, మనీష గచ్చిబౌలిలో ఉండే బ్యాంకు వెళ్తున్నామని చెప్పి వెళ్లినట్లు తండ్రి తెలిపారు. అదృశ్యమైన ఇద్దరు కూతుర్ల కోసం చుట్టు పక్కల వెతికిన ఆచూకీ లభించలేదన్నారు. కాగా కూతుర్ల అదృశ్యం పై ఇంటి పక్కనే ఉండే మేస్త్రీ వెంకటేష్ కొడుకు శ్రీకాంత్ పై అనుమానం ఉందని తండ్రి జగదీశ్వర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేçస్తునట్లు పోలీసులు తెలిపారు. -
పూడ్చిపెట్టిన శవానికి గుండుగీశారు
సాక్షి, పటాన్చెరు టౌన్: పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి గుండు గీసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం పోచారం గ్రామపరిధిలోని గణపతిగూడెంకు చెందిన ఓ వృద్ధురాలు (65) ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సమాధి చేశారు. మంగళవారం మూడోరోజు కావడంతో కుటుంబ సభ్యులు సమాధి దగ్గరికి వెళ్లగా.. మృతురాలి తల వెంట్రుకలు బయట ఉన్నాయి. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీసి చూడగా శవానికి గుండు గీసి ఉంది. దీంతో పటాన్చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మద్యానికి బానిసైన తమ్ముడిని దారుణంగా..
సాక్షి, రామచంద్రాపురం(పటాన్చెరు): నిత్యం తాగొచ్చి డబ్బులు కావాలని వేధిస్తున్న తమ్ముడిని సొంత అన్నే హత్య చేసిన సంఘటన రామచంద్రపురం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ రమేశ్ కథనం ప్రకారం.. రామచంద్రపురం పట్టణంలోని బొంబాయి కాలనీలో నివాసముండే సయ్యద్ చిన్న కుమారుడు లతీఫ్(25) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన లతీఫ్ నిత్యం డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. బుధవారం కూడా ఎప్పటిలాగానే లతీఫ్ మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఉన్న ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధింపులకు గురిచేయడంతో తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం తిరిగి లతీఫ్ గొడవ చేయడంతో అతని అన్న ఇబ్రహీం కోపంతో లతీఫ్‌పై గొడ్డలితో దాడి చేశాడు. దాంతో లతీఫ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఏం చేయాలో తోచని ఇబ్రహీం తమ్ముడి మృతదేహాన్ని భారతీనగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీ కాలనీ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మృతదేహం కొంతమేరకు కాలిపోగా కుక్కలు, పందులు మృతదేహాన్ని పీక్కు తిన్నాయి. శుక్రవారం ఆ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేవలం తల మాత్రమే ఉండటంతో బొంబాయి కాలనీవాసులు లతీఫ్‌గా గుర్తించారు. ప్రదీప్ సోదరుడు ఇబ్రహీంని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోల్ పోసి హత్యకు యత్నం
జిన్నారం (పటాన్చెరు): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడానికి కారణమైన వారిపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించాడు ఓ తండ్రి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో ఆదివారం జరిగింది. గుమ్మడిదల ఎస్ఐ రాజేశ్‌నాయక్ కథనం ప్రకారం.. రాంరెడ్డిబావి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, సుశీల దంపతులకు నవీన్‌రెడ్డి, మమత ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 17న అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె ప్రవళిక, నవీన్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుని అమీన్పూర్లో కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా నవీన్‌రెడ్డి తల్లి సుశీల వీరికి వివాహం చేసేందుకు సహకరించిందని శ్రీనివాస్‌రెడ్డి పగను పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సుశీల ఆమె కుమార్తె మమతలు ఇంట్లో ఉండగా శ్రీనివాస్‌రెడ్డి దంపతులు సుశీల ఇంటికి వచ్చి వారితో గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన శ్రీనివాస్‌రెడ్డి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సుశీల కుమార్తె మమతకు 35 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మమత తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలి
సాక్షి, పటాన్చెరు: అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ కొన్నేళ్లుగా పోరాటం చేస్తోందని వక్తలు గుర్తు చేశారు. మంగళవారం పటాన్చెరు శివారులోని ఎస్వీఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల కోరిక మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మజ్లిస్ కారణంగా కేసీఆర్ తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా చేపట్టడం లేదన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మాట్లాడుతూ పటాన్చెరులో తెలంగాణ విమోచన ఉత్సవాల సభ నిర్వహణకు ప్రత్యేక కారణం ఉందన్నారు. తెలంగాణ విమోచనానికి సర్ధార్ వల్లభాబాయ్ పటేల్ సేనలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పటాన్చెరు చేరుకోగానే నిజాం రాజు తన సంస్థానాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ లొంగిపోయారని నాటి ఘటనలను వివరించారు. ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇస్తామంటోందని, కానీ తాము కోరుకుంటున్నది అది కాదన్నారు. అధికారికంగా అన్ని కార్యాలయాల్లో తెలంగాణా విమోచన దినోత్సవాలు నిర్వహించాలన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల గౌరవం కోసం, తెలంగాణ ప్రజల కోరికను గుర్తిస్తూ విమోచన దినోత్సవాలను నిర్వహించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతికి మారు పేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయిందన్నారు. బీజేపీయే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు గుర్తించారని, అందుకే అనేక మంది బీజేపీలో చేరుతున్నారని ఆయన గుర్తు చేవారు. టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని మరళీధర్‌రావు అన్నారు. గ్రౌండ్ లెవల్లో ఆ పార్టీ షేక్ అవుతోందిని, ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేపట్టినా ఆ పార్టీని కాపాడలేరని ఆయన విశ్లేషించారు. అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ నాయకుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తోనే పటాన్చెరులో తమ పార్టీ రాష్ట్ర కమిటీ సభను ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరులో బీజేపీకి టిక్కెట్ వచ్చి ఉంటే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందే వాడినని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రానుందన్నారు. ‘తమ ఇంట్లోని కుక్కపిల్లను కాపాడుకోలే ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది’అని శ్రీకాంత్‌గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి వచ్చినట్లే కేసీఆర్ పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించనుందన్నారు. బీజేపీ నాయకుడు గరికపాటి రామ్మోహాన్‌రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినంపై అధికారంలోకి రాగానే ఆ మాటను విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా విమోచన కమిటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఇందులో ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి (మెదక్), విజయపాల్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, నాయకుడు వివేక్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, అనంత్‌రావు కులకర్ణి, ఆదెల్లి రవీందర్, అంకగల్ల సహాదేవ్ పాల్గొన్నారు. -
‘త్వరలో మమత ఇంటికే... ఆ తర్వాత కేసీఆరే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారులో మజ్లిస్ పార్టీ సవారీ చేస్తోందని.. కేసీఆర్ ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎస్వీఆర్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ విమోచన దినోత్సవ సభ’ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947 ఆగస్టు15 అనంతరం 13మాసాల తర్వాత హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. తెలంగాణలో మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి ఉందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోందన్నారు. త్వరలో మమత ఇంటికి వెళ్ళిపోతుంది. కేసీఆర్ కూడా ఇంటికి వెళతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో కుక్కలకు మర్యాద ఉంది. కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు విలువ లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏం పాలన నడుస్తుందో తెలియడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదని.. ఆ పార్టీకి కనీసం అధ్యక్షుడు లేకపోవడం హాస్యస్పదం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నిధులు విడుదల చేసిందన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందని విమర్శించారు. హర్యానా, బిహార్ రాష్ట్రాలకు ఉన్న పూర్వ ముఖ్యమంత్రులకు పట్టిన గతి తెలంగాణ సీఎంకి కూడా పడుతుందన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేశామని మంత్రి ప్రహ్లాద్ జోషి గుర్తు చేశారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు భారీగా బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. -
అసైన్డ్ భూములు హాంఫట్
సాక్షి, పటాన్చెరు: నియోజకవర్గంలో భూముల విలువ అమాంతంగా పెరిగిపోతుంది. దీంతో అక్రమార్కుల కన్ను అసైన్డ్ భూములపై పడింది. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పటాన్‌చెరుమండలం పరిధిలోని చిట్కుల్, ముత్తంగి గ్రామాల శివారులోని అసైన్డ్ భూములను దర్జాగా కబ్జా చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. రెండు గ్రామాల శివారులో ఉండటం మూలంగా కబ్జాదారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముత్తంగి పరిధిలోని సర్వేనెంబర్ 540లో ఉన్న అసైన్డ్ భూమిని చిట్కుల్ పరిధిలోని ఓ వెంచర్లో కలుపుకొని దస్తావేజులను సృష్టించారు. ఇక ఆ దస్తావేజులతో ముత్తంగి పంచాయతీ నుంచి ఇంటి నెంబర్లు తీసుకుని రెండెకరాల భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఆ భూముల క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఆ స్థలం విలువ రూ.12 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ భూమిని కాపాడాలని ముత్తంగిలోని స్థానికులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవలె ముత్తంగిలో నిర్వహించిన ఓ గ్రామ సభలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. స్థానిక కార్యదర్శిని ప్రజలు నిలదీశారు. పట్టా భూములకే ఇంటి నిర్మాణాలకు అనుమతులు దొరకడం లేదని కాని అసైన్డ్ భూమికి ఇంటినెంబర్లు ఎలా వచ్చాయంటూ వారు నిలదీశారు. అయితే స్థానిక కార్యదర్శి మాత్రం తనకే సంబంధం లేదని చేతులెత్తేశారు. వాస్తవానికి గ్రామ హద్దురాళ్లు ఇతర ఆనవాళ్లను బట్టి ఆ భూమి ముత్తంగిదేనని స్థానిక గ్రామ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ అసైన్డ్ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు చిట్కుల్ నుంచి అనుమతులు పొందారని అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా తమ ప్రైవేటు సంభాషణల్లో అసైన్డ్ భూమి అన్యాక్రాంతం అయ్యిందని ఒప్పుకుంటున్నారు. అయితే ఓ వెంచర్ నిర్వాహకులు ఆ భూమిని తమ పరిధిలోకి చేర్చుకొని దానికి ఇంటి నెంబర్ పొందారని చెప్తున్నారు. సర్వే నెంబర్ 540లో దుంపల్లి విఠలయ్య, పిచ్చకుంట్ల లక్ష్మయ్యకు దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణం అసైన్డ్ భూములు ఉన్నాయి. దుంపల్లి విఠలయ్య మృతి చెందారు. ఆయన సతీమణి సుగుణమ్మ పేరు మీద నేటికీ పాస్‌బుక్‌లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూమి ఉందనే అంశంపై సర్వే చేయించి తగిన చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూములను అమ్ముకోవడం, కొనడం నేరం. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – యాదగిరిరెడ్డి, తహసీల్దార్,పటాన్చెరు ఇంటి నంబర్లు ఇవ్వలేదు అసైన్డ్ భూమి ఏ గ్రామ పరిధిలో ఉందనేది తేల్చాల్సి ఉంది. ఆ భూమిలోని ఇళ్లకు ఈ పంచాయతీ నుంచి ఇంటి నంబర్ ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు ఆ భూమి ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో తేల్చితే తప్ప చర్యలు తీసుకోలేం. – కిషోర్, గ్రామ కార్యదర్శి, ముత్తంగి అలాంటిది మా దృష్టికి రాలేదు మా దృష్టికి అలాంటి అంశం రాలేదు. వివరాలు తెలుకొని చర్యలు తీసుకుంటాం. నా హయాంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. గతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నాం. –సంజయ్, కార్యదర్శి చిట్కుల్ -
అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..
సాక్షి, పటాన్చెరు: ప్రియుడుతో కలసి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించిన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రాజేశ్వర్‌రావు, సీఐ నరేష్ వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన బేగరి దివాకర్ 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలసి పటాన్చెరు చైతన్యనగర్ కాలనీలో నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల ఆగస్టు 26న మండల పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో దివాకర్ (39) హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజేశ్వర్ రావు, సీఐ నరేష్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన మైలారం జంగయ్యకు కొన్ని రోజుల క్రితం దివాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వీరి పరిచయం స్నేహంగా మారడంతో దివాకర్ అవసరాల కోసం అప్పుడుప్పుడు జంగయ్య వద్ద డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలో జంగయ్య తరుచూ దివాకర్ ఇంటికి వచ్చిపోతుండే వాడు. ఈ క్రమంలో దివాకర్ భార్య సురేఖతో జంగయ్యకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారింది. జంగయ్యపై దివాకర్‌కు అనుమానం వచ్చిందని దివాకర్ భార్య సురేఖ జంగయ్యతో చెప్పింది. దీంతో ప్రణాళిక వేసిన జంగయ్య తన స్నేహితుడైన నవాపేట్ మండలం పులుమామిడి గ్రామానికి చెందిన ఆకుల పరమేష్, మాదారం గ్రామానికి చెందిన ప్రకాష్‌ను సంప్రదించాడు. దివాకర్‌ను హత్య చేసేందుకు రెండు లక్షల సుపారి మాట్లాడి రూ. లక్షా 30 వేలను అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆగస్టు 26న పథకం ప్రకారం పరమేష్, ప్రకాష్‌లు ఇద్దరు దివాకర్‌కు మద్యం తాగించి మండల పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో శివానగర్ వైపు వెళ్లే రోడ్డులో గల ఎల్లమ్మ గుడి సమీపంలో దివాకర్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు హత్యకు కారణమైన జంగయ్య, పరమేష్, ప్రకాష్, దివాకర్ భార్య సురేఖను అదుపులోకి తీసుకొని నలుగురిని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 13 వేల నాలుగు వందలు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నిర్మల్ కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ పదార్థం పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టు పక్కల ఉన్న పరిశ్రమలకు వ్యాపించడంతో అక్కడి స్థానికుల భయాందోళనలు గురవుతున్నారు . మంటలను అదుపులోకి తేవడానికి సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్రి ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి
సాక్షి, పటాన్చెరు: గణిత శాస్త్రం అర్థం చేసుకోవడం కష్టం అయితే అది అర్థమైయ్యిందంటే అందులోనే నూటికి నూరుశాతం మార్కులు పొందవచ్చని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. తనకు చిన్నప్పుడు గణితశాస్త్రం అర్థమయ్యేది కాదన్నారు. తనతో పాటు చదువుకున్న 60 విద్యార్థుల్లో ఏడో తరగతి వచ్చేసరికి 27మంది మాత్రమే చదువులు కొనసాగించారని గుర్తు చేశారు. మిగతా వారంతా చదువు మానేశారన్నారు. మానవ జీవితంలో గణిత శాస్త్రం చాలా ప్రాముఖ్యమైందని ఆయన విశ్లేషించారు. శుక్రవారం పటాన్చెరు మండలం పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాథమటికల్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్‌ను మంత్రి ప్రారంభించారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్ కూడ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ మనిషి జీవితానికి, గణితానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తగినట్టుగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా గణిత శాస్త్రంతో ముడిపడినదేనని జగదీశ్‌రెడ్డి వివరించారు. ప్రాథమిక విద్యస్థాయిలో గణితంపై పట్టు సాధించకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గణితం మాస్టార్ కోసం ఆరా తీస్తున్న మంత్రి ‘తన కూతురు ఇటీవల లెక్కల్లో వెనుకబడిందని తెలిసింది. ఆమెలో లెక్కలంటే భయం లేకుండా చేయాలనేది నా ప్రయత్నం. అయితే రెండు నెలలుగా ఓ లెక్కల మాస్టార్ కోసం వెతుకుతున్నా’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. చిన్నారుల్లోని నిగూడమైన సృజనాత్మక శక్తిని వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన విశదీకరించారు. చిన్నారుల్లో అంత ఒత్తిడి అవసరమా..? ‘చిన్నప్పుడు లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి. వందకు వంద మార్కులు వచ్చేవి. ఆ తరువాత నన్ను ఫిడ్జి స్కూల్లో వేశారు. మార్కులు తగ్గాయి. తల్లిదండ్రులు నన్ను ఐఐటీ చదవాలనే ఉద్ధేశ్యంతో ఆ స్కూళ్లో వేశారు. ఐఐటీ చేయలేనని చెప్పేశాను. ఆ తరువాత అమెరికాలో ఓ యూనివర్సిటలో గణిత ప్రాధాన్యతతో కూడిన గ్రాడ్యుయేషన్ చేస్తున్నా ప్రథమ మూడు పరీక్షల్లో ఏ మాత్రం చదవకపోయినా మంచి మార్కులు వచ్చాయి. దానికి కారణం దేశంలో ప్రాథమికస్థాయిలో చదివిన ఫౌండేషన్ కోర్సులే కారణం. అయితే నాకనిపిస్తుంది పిల్లలకు ఆ స్థాయిలో డిగ్రీలో నేర్పే కోర్సులు అవసరమా అంత వత్తిడి ఎందుకు’అని గీతం అధ్యక్షుడు శ్రీభరత్ అన్నారు. గణితం అనే తర్కమని(లాజిక్), అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమని శ్రీభరత్ అన్నారు. కాన్ఫరెన్స్‌కు వచ్చిన స్పందనను నిర్వాహకుడు ప్రొఫెసర్ మారుతీరావు వివరిస్తూ వంద పరిశోధన పత్రాలు సమర్పిస్తారని భావిస్తే.. తమ అంచాలకు మించి 300 పరిశోధనా పత్రాల సమర్పణకు గణితశాస్త్ర పరిశోధకుడు ఈ కాన్ఫరెన్స్‌కు హాజరవుతున్నారని తెలిపారు. గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇండియన్ మాథమెటికల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొ.ఎస్.ఆర్ముగం, ఆంధ్రా–తెలంగాణ మాథమెటికల్ సొసైటీ అధ్యక్షుడు కేశవరెడ్డి, అమెరికా నుంచి వచ్చిన తెలుగు శాస్త్రవేత్త జెర్మయ్య కె.బిల్లా పాల్గొన్నారు. -
పాములను ప్రేమించే శ్రీను ఇకలేడు..
సాక్షి, పటాన్చెరు: అతడు పాములను ప్రేమించేవాడు. ఎవరైనా పాము అని భయపడుతున్నారంటే వారి భయం పోగొట్టేందుకు వాటిని పట్టుకునేవాడు. వాటిని మనుషుల సంచారం లేని చోట సురక్షితంగా వదిలివేసేవాడు. ఇది అతడి వృత్తి కాదు.. ప్రవృత్తి. పాములు పట్టడం అతడికో హాబీ.. ఇంట్లోవాళ్లు వద్దన్నా వినేవాడు కాదు. అతడికి ఉద్యోగం ఉంది. అయినా పాములంటే భయపడే జనానికి ఊరట కలిగించడానికి వాటిని పట్టుకోవడం అభిరుచిగా పెట్టుకున్నాడు. చివరికి ఆ హాబీ అతడి ప్రాణం తీసిన హృదయ విదారక సంఘటన పటాన్చెరు ప్రజలను కలచివేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో, గ్రామంలో, జిల్లాలో ఇతర చోట్ల ఎక్కడైనా పాము కనిపిస్తే ముందుగా అందరికి అభిరుచిగా పాములు పట్టే వ్యక్తి శ్రీనివాస్ ముదిరాజ్ అలియాస్ ధనుష్ గుర్తుకు వచ్చేవాడు. శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థలో కొంత కాలంగా కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన రాజు, జయలక్ష్మిలు ముగ్గురు పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 30 సంవత్సరాల క్రితం పటాన్చెరు పట్టణానికి వచ్చి శాంతినగర్ కాలనీలో ఉండేవారు. రాజు, జయలక్ష్మిల పెద్ద కూతురు వివాహం కాగా, రెండో కుమారుడు శ్రీనివాస్ ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో ఎవరైనా పాములు తిరుగుతున్నాయని, ఇబ్బందులు పడుతున్నామని చెపితే చాలు శ్రీనివాస్ ఉచితంగా పాములను పట్టి మనుషులు తిరగని చోట్ల వదిలే వాడు. ఇది అతడికో హాబీగా మారింది. పాములు పట్టొద్దని ఇంట్లో వారు చెప్పినా సరే వారికి చెప్పకుండా వెళ్లి అదే పని చేసేవాడు. అలాంటి శ్రీనివాస్ గురువారం వికారాబాద్ జిల్లాకు పనిపై వెళ్లగా అక్కడ మోమిన్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో మర్పల్లి మండలం కొంశెట్టిపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చిందని ఫోన్ రావడంతో అక్కడే ఉన్న శ్రీను దాన్ని పట్టడానికి వెళ్లాడు. అయితే పామును పట్టే క్రమంలో అది రెండు సార్లు శ్రీనివాస్‌ను కాటు వేసింది. అయినా ఆ పామును పట్టుకొని భద్రపరిచాడు. అనంతరం సదాశివపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. దీంతో చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వార్త తెలియడంతో పటాన్చెరు పట్టణంలో విషాదం అలుముకుంది. -
ముగ్గురు అమ్మాయిల అదృశ్యం
పటాన్చెరు టౌన్: వేర్వేరు ఘటనల్లో బుధవారం ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. వారిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉన్నారు. కళాశాలకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు, ఇంట ర్వూ్యకని చెప్పిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కనిపించకుండా పోయారు. ఈ ఘటనలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి కథనం ప్రకారం..పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాంరెడ్డి కూతురు శివాని గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వూ్య ఉందని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 8:45 గంటలకు తన స్నేహితుడు సాయికిరణ్ రెడ్డికి ఫోన్ చేసి తాను లింగంపల్లి వద్ద ఉన్నానని తన ఇంటి వద్ద దించాల్సిందని అడిగింది. దీంతో శివానిని లింగంపల్లి నుంచి తీసుకొచ్చి కృషి డిఫెన్స్ కాలనీ వద్ద దించినట్లు సాయి కిరణ్‌రెడ్డి తెలిపాడు. ఇంట ర్వూ్యకని చెప్పి వెళ్లిన తన కూతురు ఇంటికి రాలేదని తండ్రి రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలకని చెప్పి వెళ్లిన విద్యార్థినులు మరో ఘటనలో పటాన్చెరు పట్టణంలోని ఎంజీ రోడ్డు లో ఉంటున్న ఆకుల వసంత, యాదగిరిల కూతురు ఆకుల ప్రశాంతి, ఆల్విన్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి కూతురు చాకలి గాయత్రి ఇద్దరు కలసి మంగళవారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. రాత్రి ఎంత సేపటి కి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆకుల ప్రశాంతి, గాయత్రి ల తల్లిదండ్రులు తెలిసిన వారి ఇంటి వద్ద, బంధువుల ఇంటి వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి నలుగురి దుర్మరణం
పటాన్చెరు టౌన్: పెద్దకుంటలో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అల్వాల్ బాలాజీనగర్‌కు చెందిన నందిని (15), గోవర్ధన్ (16), ఆనంద్ (17), లోకేష్ (10)లు వేసవి సెలవులు కావడంతో సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామం గీతం విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆ పక్కనే ఉన్న పెద్దకుంటలో ఈతకు వెళ్లారు. మొత్తం ఆరుగురు కలిసి కుంట వద్దకు వెళ్లగా అందులో నందిని, గోవర్ధన్, ఆనంద్, లోకేష్‌లు ఈత కోసం పెద్దకుంటలోకి దిగారు. మిగతా ఇద్దరు దివ్య, అమూల్య ఒడ్డున కూర్చున్నారు. కుంటలోకి దిగిన నలుగురికి ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఈ విషయాన్ని దివ్య, అమూల్య కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వచ్చే సరికే నలుగురూ మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి కందనూలు (నాగర్‌కర్నూల్): సరదాగా చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీపంలోని సూర్యకుంట చెరువులో చేపలు పట్టేందుకు బొక్కి శైలజ (12), మండల స్వాతి (9), మండల అనిల్ (10), గణేశ్‌లు వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు వారు నీటిలో మునిగిపోయారు. గమనించిన గ్రామస్తుడు వెంకటయ్య నీటిలో మునిగిపోతున్న గణేశ్‌ను కాపాడి జిల్లా ఆస్పత్రికి తరలించాడు. మృతుల్లో మండల స్వాతి, అనిల్ అన్నా చెల్లెళ్లు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై లక్ష్మీనర్సింహులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డుపై దారుణ హత్య
పటాన్చెరు టౌన్: ప్రతీకారం ‘కత్తి’పట్టింది. దాదాపు ఏడు నెలల క్రితం నాటి కక్ష.. పట్టపగలు జాతీయ రహదారిపై హత్యకు దారితీసింది. నాడు జరిగిన హత్యకు ప్రతీకారంగా సరిగ్గా అదే ప్రాంతంలో దుండగుడు ఓ వ్యక్తిని తెగనరికాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రారం ప్రాంతంలో శుక్రవారం 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ హత్యోదంతం సంచలనం కలిగించింది. హత్యోదంతాన్ని కొందరు వీడియోలు, ఫొటోలుగా చిత్రీకరించడంలో మునిగిపోయారు తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఒళ్లు గగుర్పాటు కలిగించిన ఈ ఘటనతో జాతీయ రహదారిపై రెండు పక్కలా ట్రాఫిక్ నిలిచిపోయింది. హంతకుడు ప్రత్యర్థిని కత్తితో తెగనరికి.. పది నిమిషాల్లో పని ముగించుకుని పరారయ్యాడు. ఈ దృశ్యాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ భోలక్‌పూర్ ప్రాంతానికి చెందిన మహబూబ్ హుస్సేన్ (25) ఓ హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి సంగారెడ్డి పట్టణంలోని కోర్టుకు శుక్రవారం హాజరయ్యాడు. కోర్టు పని ముగించుకున్న అనంతరం తన స్నేహితునితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వీరు పటాన్చెరు రుద్రారం సమీపానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దుండగుడు ఒక్కసారిగా హుస్సేన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అటకాయించాడు. ముప్పు ఊహించిన హుస్సేన్, అతని స్నేహితుడు వాహనం వదిలి పరుగులు పెట్టారు. దుండగుడు.. హుస్సేన్‌ను వెంబడిస్తూ కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన హుస్సేన్‌పై దుండగుడు యథేచ్ఛగా కత్తితో దాడి చేశాడు. తల, మెడ భాగాలను పలుమార్లు కత్తితో నరికి కిరాతకంగా హతమార్చాడు. హుస్సేన్‌ను దుండగుడు తెగనరుకుతున్న క్రమంలో కత్తి బలంగా శరీరంలోకి దిగబడగా, దాన్ని బలంగా బయటకు లాగి పదేపదే వేటు వేసిన వైనం సంఘటన స్థలంలో ఉన్న వారిని హడలెత్తించింది. కాగా, హుస్సేన్ స్నేహితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై ప్రయాణిస్తున్న వారు హడలెత్తిపోయి, ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి ఉదంతాన్ని కళ్లప్పగించి చూశారు. హుస్సేన్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత ఆ దుండగుడు పరారయ్యాడు. రెండు హత్యలూ అక్కడే.. గత ఏడాది నవంబర్‌లో హుస్సేన్ వ్యాపార భాగస్వామి అర్షద్ పటాన్చెరు లక్డారం సమీపంలోనే హత్యకు గురయ్యాడు. ఇప్పుడు హత్యకు గురైన హుస్సేన్ కూడా లక్డారం ప్రాంతానికి అతి సమీపంలోని రుద్రారంలో హతమయ్యాడు. అర్షద్ తాలూకు మనుషులే ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడే హత్యకు గురికావడం సంచలనంగా మారింది. పథకం ప్రకారమే హత్య! హుస్సేన్ శుక్రవారం కోర్టుకు హాజరవుతాడనే విషయం ముందే తెలిసిన వ్యక్తులే పథకం ప్రకారం మాటు వేసి ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. కోర్టుకు హాజరై సంగారెడ్డి నుంచి తిరుగు ప్రయాణమైన హుస్సేన్.. ఎప్పుడు, ఏ సమయంలో ఎక్కడికి చేరుకున్నాడో పక్కాగా గమనిస్తూ, సమాచారం సేకరించిన మీదటే రుద్రారం వద్ద అతడిని హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖరరెడ్డి సందర్శించారు. హుస్సేన్ గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడని, ఆ కేసులోని ప్రత్యర్థులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని, మొత్తానికి పాత కక్షలే ఘటనకు కారణమని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పాత హత్య కేసు నేపథ్యం.. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన మహబూబ్ హుస్సేన్, చర్లపల్లికి చెందిన హర్షద్ కలిసి రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిర్వహించేవారు. ఈ దందాలో విభేదాలు రావడంతో హుస్సేన్.. అర్షద్‌కు చెందిన రేషన్ బియ్యాన్ని ఒక సందర్భంలో అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు పెరిగి పెద్దవైన నేపథ్యంలో అర్షద్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్న మహబూబ్ హుస్సేన్.. అతని డీసీఎం డ్రైవర్ సమీర్‌తో పాటు మరికొందరితో కలిసి పథకం వేశాడు. ఈ క్రమంలో మాట్లాడే పని ఉందని గత ఏడాది నవంబర్ 17న కబురంపిన హుస్సేన్.. పటాన్చెరు మండలం లక్డారం సమీపంలోకి అర్షద్‌ను రప్పించాడు. అక్కడ రాడ్‌తో కొట్టి అర్షద్‌ను హతమార్చాడు. మృతదేహాన్ని రోడ్డుపై పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. హత్యోదంతం మర్నాడు అర్షద్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం దర్యాప్తు చేసి మహబూబ్ హుస్సేనే అర్షద్‌ను హత్య చేశాడని నిర్ధారించి, అతడిని ఏ1గా, ఇందుకు సహకరించిన సమీర్‌ను ఏ2గా నిర్ధారిస్తూ రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన మహబూబ్ హుస్సే న్.. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి సంగారెడ్డి కోర్టుకు వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలోనే రుద్రారం సమీపంలో హత్యకు గురయ్యాడు. -
దూసుకొచ్చిన మృత్యువు
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిపైకి కంటెయినర్ లారీ దూసుకువచ్చింది. ఆగి ఉన్న మరో కంటెయినర్ లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. నాగాలాండ్‌కు చెందిన దానేశ్వర్ దాస్, అస్సాం రాష్ట్రానికి చెందిన ఉతోపన్ పెగు, బాబు బోరి, బిష్వజిత్ పెగు బతుకుదెరువు కోసం జిల్లాలోని ఇస్నాపూర్‌కు వచ్చి స్థానిక మహేశ్వర్ ఆసుపత్రి సమీపంలో ఉంటూ హిండ్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దానేశ్వర్ దాస్, ఉతోపన్ పెగు, బాబు బోరి, బిష్వజిత్‌లు వారి స్నేహితుడైన అస్సాం కు చెందిన మంజన్ పెగుతో కలసి కిరాణా సామాను తీసుకోవడానికి ఇస్నాపూర్ చౌరస్తాకు నడుచుకుం టూ వస్తున్నారు. వారు ప్రముఖ్‌నగర్ కాలనీ సమీపంలో ఆగి ఉన్న కంటెయినర్ పక్క నుంచి వెళుతుండగా అదే సమయంలో వెనకాల నుంచి దూసుకువచ్చిన మరో కంటెయినర్ లారీ వీరిని ఢీకొట్టింది. అదే వేగంలో పక్కనే ఆగి ఉన్న కంటెయినర్ లారీని కూడా ఢీకొంది. దీంతో కంటెయినర్ డ్రైవర్ వెంకటేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఢీకొన్న కంటెయినర్ క్లీనర్ గోవింద్ మానేకు కూడా తీవ్ర గాయాలయ్యా యి. దానేశ్వర్ దాస్(19), ఉతోపన్ పెగు (25) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో డ్రైవర్ వెంకటేశ్, క్లీనర్ గోవింద్ మానే, మంజన్ పెగును చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు బాబు బోరి, బిష్వజిత్‌లను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా, ప్రథమ చికిత్స చేసి వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దానేశ్వర్ దాస్, ఉతోపన్ పెగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పురాతన జైన విగ్రహం అపహరణ!
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో పురాతన కాలానికి చెందిన జైన విగ్రహం చోరీకి గురైంది. పాత పంచాయతీ కార్యాలయం ఎదుట కూడలిలో ఉండే ఈ విగ్రహాన్ని స్థానికులు రోజూ దర్శించుకునే వారు. కాని శనివారం ఉదయం నుంచి అది కనపడకుండా పోయింది. అనేక ఏళ్లుగా అక్కడ ఉన్న విగ్రహం కనబడకుండా పోయిందనే వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. ఆ విగ్రహాన్ని భారీ మొత్తానికి అమ్ముకున్నారనే ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు కొందరు జైన భక్తులు ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని స్థానిక పెద్దలను ఆశ్రయించారని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున కొన్ని పూజలు చేసి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లినట్లు చెప్తున్నారు. దీని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. విగ్రహం చరిత్ర ఇది.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చోరీకి గురైన విగ్రహం జైన తీర్థంకరుడిదిగా భావిస్తున్నారు. దాదాపు 1400 ఏళ్ల కిందటి విగ్రహంగా చెబుతున్నారు. ఏక శిలపై దిగంబర జైన్ విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్దారు. 1015–1042 సంవత్సరాల మధ్య కళ్యాణీ చాళుక్య జయసింహ మహారాజు పటాన్ చెరును రాజధానిగా చేసుకుని పాలించాడని ఆధారాలు ఉన్నాయి. ఆ రాజు కాలంలో జైన మతం ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో పటాన్చెరులో ఏడు వందల జైన దేవాలయాలు ఉండేవని చరిత్రకారులు గ్రంథస్తం చేశారు. నేటికీ పెద్ద పెద్ద జైన విగ్రహాలు, దేవాలయాలు పటాన్చెరులో కనిపిస్తాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో కనిపించే పెద్ద జైన విగ్రహం ఇక్కడ లభించిందే. పటాన్చెరులో జైన ఆరామాలు ఉండేవని చెప్తున్నారు. ఇప్పటికీ జైన సాధువులు పటాన్‌చెరుకు వచ్చి వెళ్తుంటారు. ఆ కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాని భావిస్తున్నారు. కాగా, ఈ విషయమై స్థానిక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాలయ్యను వివరణ కోరగా.. ఆ విగ్రహం సంగతి తమకు తెలియదని చెప్పారు. తమ శాఖ ఆ విగ్రహాన్ని ఎక్కడికీ తరలించలేదని స్పష్టం చేశారు. దాన్ని తరలించాల్సిన అవసరం తమకు లేదన్నారు. -
‘రాహుల్ క్షమాపణ చెప్పాలి’
పఠాన్‌చెరు(మెదక్): గరీబీ హఠావో నినాదంతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పఠాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. గరీబీ హఠావో నినాదంతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తోన్న రాహుల్ గాంధీ మొదట క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గరీబీ హఠావో అనే నినాదాన్ని 1971లో రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ, 1989లో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ఎత్తుకుని దేశం నుంచి పేదరికాన్ని ఎందుకు పారదోలలేకపోయారని ప్రశ్నించారు. ఇలా పేదరికం పేరుతో దేశంలోని పేదలతో ఎన్నాళ్లు ఆటలాడతారని సూటిగా అడిగారు. పేదలను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు మోసం చేస్తారని అన్నారు. స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు అయినా ఇంకా పేదవాళ్లు పేదరికంలోనే ఎందుకు ఉన్నారో రాహుల్ దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిర, రాజీవ్ గాంధీలు ఎందుకు పేదరికం పోగొట్టలేదు.. ఇది ప్రజలను మోసం చేయడం కాదా..ముందుగా ప్రజలకు బేషరుతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్ ఓట్లు అడగాలన్నారు. నిజంగా పేదరిక నిర్మూలన చేపడుతోంది సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. కాంగ్రెస్ రూ.200 పెన్షన్ ఇస్తే.. కేసీఆర్ ఆ పెన్షన్‌ను వేయి రూపాయలు చేశారు.. రైతు బంధు పేరుతో రైతులకు ఆర్ధికసాయం అందించారు. పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్ధికసాయం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.. ఆకలి చావులు లేవు.. వలసలు తగ్గాయి.. దేశమంతా మన పథకాలు అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.. పేద విద్యార్థుల చదువుల కోసం 500 ఆంగ్ల గురుకుల పాఠశాలలను కేసీఆర్ ప్రారంభించి వారి చదువులకు ఏడాదికి లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ తెస్తామన్నాం.. తెచ్చాం ‘తెలంగాణ తెస్తామని 2001లో చెప్పాం.. తెలంగాణ సాధించాం. వేయి రూపాయల పెన్షన్ ఇస్తామన్నాం.. ఇస్తున్నాం. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ పెన్షన్ రూ.2016 రూపాయలకు పెంచి ఇస్తాం. దసరా నాటికి డబుల్ బెడ్ రూం ఇల్లు పైసా ఖర్చు లేకుండా పేదలకు అందిస్తాం. ఉద్యోగం దొరికే వరకు నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామ’ని హరీష్ వెల్లడించారు. ఇంటికి పెద్ద కొడుకులా కేసీఆర్ ఇంటికి పెద్దకొడుకులా పెన్షన్లు పెంచిన ఏకైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని, ఏప్రీల్ 11న అందరూ ఓటు వేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిపాజిట్ గల్లంతయ్యే పార్టీలు అని, వాటికి ఓటు వేస్తే మోరీ వేసినట్లేనని వ్యాఖ్యానించారు. పోటీ కాంగ్రెస్, బీజేపీలతో కాదని సిద్ధిపేట నుంచి మెజార్టీ ఎక్కువ ఉంటుందా లేక పఠాన్ చెరు నుంచి మెజార్టీ ఎక్కువ వస్తుందా అన్నదే పోటీ అని అన్నారు. -
ఔటర్‌పై కారు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
పటాన్చెరు టౌన్: కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. అమీన్పూర్ సీఐ ప్రభాకర్, అసిస్టెంట్ జిల్లా ఫైర్ అధికారి సుదర్శన్‌రెడ్డి కథనం ప్రకారం..బుధవారం ఉద యం 11.10 గంటల సమయంలో మేడ్చల్ నుంచి ముత్తంగి వైపు వెళ్తున్న కారు (టీఎస్ 07 జీఎం 4666) సుల్తాన్పూర్ సమీపంలోకి రాగానే మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు కారు డోర్ తీసేం దుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. ఇంజన్ నుంచి మంటలు ఎగిసిపడి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. అప్పటికే కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. కారు మియాపూర్, జేపీనగర్ క్రాస్ రోడ్డుకు చెందిన గంట శ్రీదేవి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని హైదరాబాద్ బోరంపేట్కు చెందిన గంటా వెంకటగిరి (48)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎరుకతో ఉంటే మేలు! హైదరాబాద్ శివార్లలో తరచూ కార్లు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రాణనష్టం లేకపోయినా ఆస్తినష్టం మాత్రం భారీగా ఉంటోంది. ఇలాంటి అగ్నిప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించొచ్చని సూచిస్తున్నారు. వైర్లపై కన్నేయాలి కార్లలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు 70 శాతం వాటి లో వినియోగిస్తున్న వైర్లే కారణమవుతున్నాయి. వీటికి అతుకులు ఉండటం, నిర్వహణ మరిచిపోవడంతో నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదాలకు కారణమవుతోంది. బ్యాట రీకి ఉండే వైర్ల ద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. ఇటీవల కాలంలో కార్లలో తక్కువ మందం ఉన్న వైర్లను వినియోగించడం ప్రమాదాలకు కారణమవుతోంది. బ్యాటరీలను మరవొద్దు కార్లలోని బ్యాటరీలను యజమానులు సరిగ్గా పట్టించుకోకపోవడం కూడా అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. బ్యాటరీల్లో హైడ్రోజన్, ఎలక్ట్రోలైట్ సంబంధిత పదార్థాలు ఉంటాయి. ఇవి తరచూ బయటికొచ్చి బ్యాటరీలపై పేరుకుపోతాయి. దీంతో విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో పాటు నిప్పు రవ్వలు చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంజన్‌ను పరిశీలించాలి.. కార్లలో ఉండేది ఇన్నర్ కంప్రెషన్ ఇంజన్. అంటే దాని లోపలి ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ మండటంతో వెలువడే శక్తి ద్వారా అది పని చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉండే సీలింగ్స్, గ్యాస్ కిట్స్‌ను సరిగ్గా బిగించుకోవాలి. వీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. లేకపోతే ఇంధనం లీక్ కావడం, నిప్పు రవ్వలు చెలరేగి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. కూలెంట్ సైతం కీలకమే ఇటీవల వస్తున్న కార్లకు రేడియేటర్లు ఉండట్లేదు. ఇవి ఉంటే వాటిలో నీరు నిండుకోగానే పొగలు వచ్చి కార్లు ఆగిపోయేవి. ఇప్పుడు దీనికి బదులు కూలెంట్ ఆయిల్ వినియోగిస్తున్నారు. ఇది ఇంజన్ చుట్టూ తిరిగి దాన్ని చల్ల్లబరుస్తుంది. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే మంటలు వచ్చే ప్రమాదముంది. కూలెంట్ ఆయిల్ నాణ్యత కోల్పోయినప్పుడు మార్చకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గ్యాస్ కిట్లతోనూ కష్టమే పెట్రోల్, డీజిల్‌కు బదులు సీఎన్జీ, ఆటో ఎల్పీజీలతో నడిచే వాహనాలొచ్చాయి. తక్కువ ఖర్చనే ఉద్దేశంతో కొన్ని పాత వాహనాలనూ కన్వర్షన్ చేయడం ద్వారా గ్యాస్‌ను ఇంధనంగా వాడుతున్నారు. ఈ గ్యాస్ కిట్లతో పాటు వీటిని వాడే పైప్ కూడా నాణ్యమైన, ఐఎస్ఐ మార్క్ ఉన్నవే వాడాలి. ఏమాత్రం నాణ్యతా లోపమున్నా ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. -
దగ్దమైన కారు,ఒకరు సజీవ దహనం
-
‘‘లారీ మూతోడా’’ అన్నాడని.. దారుణం
పటాన్చెరు టౌన్ : లారీ మూతోడా అని వెక్కిరించినందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం పటాన్చెరు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేశ్వర్ రావు, సీఐ నరేశ్, క్రైం సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన మాచిరెడ్డి గోపాల్‌రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న ఇంట్లో నుంచి దుర్గమాత శోభయాత్ర చూసి వస్తా అని చెప్పి వెళ్లిన గోపాల్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు రుద్రారం గ్రామ శివారులో తోషిభా కంపెనీకి వెళ్లే దారిలో హత్యచేసిన విషయం తెలిసిందే. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు మాచిరెడ్డి గోపాల్‌రెడ్డిని హత్యచేసిన వ్యక్తి రేజింతల నాగరాజుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా మృతుడు గోపాల్‌రెడ్డి తరుచూ నాగరాజును లారీ మూతోడా అని వెక్కిరించేవాడని, దీంతో పాటు వీరు ఇద్దరు 10 సంవత్సరాల క్రితం వీ.బీ.సీ కంపెనీలో పని చేసే సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. ఇవి మనసులో పెట్టుకున్న నాగరాజు గోపాల్‌రెడ్డిని పథకం ప్రకారం కూల్‌డ్రింక్ తాగిపిస్తాని చెప్పి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. అనంతరం చేతితో బలంగా గాయపరిచి, పక్కనే ఉన్న రాయిని గోపాల్‌రెడ్డి తలపై వేయడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అనంతరం నాగరాజు గోపాల్‌రెడ్డి సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 2012లో నాగరాజు మరో వ్యక్తితో కలిసి ఓ హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారం రేజింతల నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. -
పారిశ్రామికవాడ.. దడ
జిన్నారం(పటాన్చెరు) : వరుస చోరీ ఘటనలు పారిశ్రామికవాడల్లో వణుకుపుట్టిస్తున్నాయి. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ దోపిడీలతో అటు వ్యాపారులు, ఇటు స్థాని కులు కలవరానికి గురవుతున్నారు. జిన్నారం మండలం బొల్లారం ఇటీవల మున్సిపాలిటీగా అవతరించింది. ఈ గ్రామంలో 200 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి జనాభా 40 వేలకు పైనే ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడి పరిశ్రమల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒడిషా, బీహార్ లాంటి రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. గుర్తుతెలి యని వ్యక్తులు ఎక్కువగా ఉండే ఈ ప్రాం తంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. గతంలోనూ దుండగులు షాపులను టార్గెట్ చేస్తూ దోపిడీలకు దిగారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందులో కొన్ని కేసులను మాత్రమే పోలీసులు ఛేదించగలిగారు. చిన్న చిన్న చోరీలతో పాటు ఏకంగా లక్షల విలువైన వస్తువులను చోరీ చేసే స్థాయికి దొంగలు తెగబడ్డారు. జ్యువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకోవడం పోలీసులకు సవా ల్గా మారింది. తాజాగా బొల్లారంలోని ఓ నగల దుకాణానికి ఏకంగా కన్నం వేసి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. సీఐస్థాయి పోలీస్ స్టేషన్ ఉండడంతో పాటు, గ్రామంలోని పలు ప్రధాన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించినా, ఇటీవల తరచూ కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నాచోరీలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. షాపుల్లో ఉన్న సీసీ కెమెరాలను మొదట పనిచేయకుండా చేసి తర్వాత తాపీగా వారి పని కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం బొల్లారంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. తమ షాపులను ఎలా రక్షించుకోవాలా అని వ్యాపారస్తులు ఆందోళనకు గురవుతుండగా, వరుస చోరీ ఘటనలతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు జంకుతున్నారు. -
పెంచుకునేందుకే బాలుడి కిడ్నాప్
జిన్నారం(పటాన్చెరు) : వివాహం జరిగి ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోవటంతో ఓ బాలుడిని పెంచుకోవాలని ఆశ పడ్డ మహిళ ఏకంగా ఇంటి ముందు ఆడుకుంటున్న మూడున్నరేళ్ల బాలున్ని కిడ్నాప్ చేసింది. ఈ సంఘటన జిన్నారం మండలంలోని బొల్లారం గ్రామంలో గత నెల 24న జరిగింది. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఎట్టకేలకు బాలున్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను బొల్లారం సీఐ సతీష్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... బీహార్‌కు చెందిన సునీల్‌కుమార్, రేఖాకుమారిలు కొంతకాలం క్రితం వలస వచ్చి బొల్లారంలో నివాసం ఉంటున్నారు. సునీల్‌కుమార్ ఓ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం లేరన్న బాధ భార్యా భర్తలను వేధిస్తుండేది. పిల్లలు కావాలని రేఖాకుమారి ఎంతగానో ఆశపడింది. ఎంతకీ పిల్లలు కాకపోవటంతో బొల్లారంలో వెంకట్‌రెడ్డినగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడున్నరేళ్ల కల్లుగిరి అనే బాలున్ని రేఖాకుమారి గమనించింది. బాలునికి ఏదో ఆశచూపి బయటకు పంపి, తాను కొద్ది సేపటికి బయటకు వెళ్లింది. బాలున్ని తీసుకుని ఆటోలో వెళ్లి సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కి బిహార్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లింది. దీంతో బాలుడు కనిపించకపోవటంతో అతని తల్లిదండ్రులు గత నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాలుడి ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ముందు బాలుడిని అనుసరించి వెనుకే రేఖాకుమారి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రేఖాకుమారి భర్త ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. బిహార్‌లో ఉన్న రేఖాకుమారిని తిరిగి రప్పించేందుకు భర్తతో కలిసి పోలీసులు వ్యూహ రచన చేశారు. సోమవారం సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన రేఖాకుమారితో పాటు బాలున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలున్ని పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రేఖాకుమారినిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన పోలీసులను సీఐ సతీష్‌రెడ్డి అభినందించారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులు అçప్రమత్తంగా ఉండాలని సీఐ సతీష్‌రెడ్డి ప్రజలకు సూచించారు. -
ఆస్పత్రిలో శిశువులు తారుమారు
పటాన్చెరు టౌన్: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువులు తారుమారైన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. పటాన్చెరు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వసుంధర, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని జిన్నారం మండలం అండూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం తన భార్య అర్చనను కాన్పుకోసం కోసం శనివారం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బొల్లారం గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్ భార్య సరస్వతినీ ప్రసవం కోసమే చేర్పించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం డెలివరీ కోసం సరస్వతి, అర్చనను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ముందుగా సర్వసతికి డెలివరీ చేయగా బాబు పుట్టాడు. అయితే వార్డుబాయ్ సరస్వతికి పుట్టిన బాబును పొరపాటున అర్చన కుటుంబీకులకు అందజేశాడు. కాసేపటి తర్వాత అర్చనకు పాప పుట్టింది. పాపను అర్చన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తీసుకెళ్లగా జరిగిన పొరపాటు తెలిసింది. వైద్యాధికారులు కుటుంబ సభ్యులతో చర్చించి శిశువులు ఇద్దరికీ డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. పరీక్షల అనంతరం శిశువులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు. -
రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం!
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజా మున 2.30కి అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో టైర్లకు మంటలు అంటుకున్నాయి. సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంట లను ఆర్పే యత్నం చేశారు. అగ్నికీలలు భారీ గా ఎగిసిపడటంతో హైదరాబాద్ నుంచి మరో 10 ఫైరింజన్లను రప్పించారు. 12 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. ప్రమాదం కారణంగా కిలోమీటర్ మేర దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. రూ.కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. గతంలోనూ ఇదే పరిశ్రమకు చెందిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించి రూ.25 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పరిశ్రమను సందర్శించిన హోంమంత్రి.. ఘటనా స్థలాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చన్నారు. పరిశ్రమ యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీనిచ్చారు. కాగా ఘటనపై విచారణ చేప ట్టి వివరాలు వెల్లడిస్తామని అగ్నిమాపక జిల్లా అధికారి డీఎఫ్ఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదు
-
ఇంకా మంటలు అదుపులోకి రాలేదు : డీఎస్పీ
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అగర్వాల్ రబ్బరు పరిశ్రమలో సంభవించిన ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పడానికి 6 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఈదురు గాలులు తోడవడంతో సిబ్బంది వాటిని అదుపు చేయలేక పోతున్నారు. దీనిపై డీఎస్పీ సీతారాం మాట్లాడుతూ.. ఈ రోజు తెల్లవారుజామున 2.45 గంటలను అగ్ని ప్రమాదంకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందిన వెంటనే ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఇప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదని, మరో మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదన్నారు. ఈ ప్రమాదం శాట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
పటాన్చెరులో అగ్నిప్రమాదం , భారీగా ఆస్తి నష్టం