50 ఎకరాల్లో ఎఫ్‌ఎల్‌వో
50 ఎకరాల్లో ఎఫ్‌ఎల్‌వో
Published Wed, Aug 17 2016 3:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
హైదరాబాద్: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్ వద్ద ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద 50 ఎకరాల్లో దీనిని నెలకొల్పుతున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివద్ధి చేస్తున్నాయి. పార్కులో 3-5 ఏళ్లలో రూ. 200 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ పద్మ రాజగోపాల్ తెలిపారు. 3- 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎఫ్‌ఎల్‌వో ప్రతినిధులు బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
సభ్యులకు మాత్రమే..
ఎఫ్‌ఎల్‌వో వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇండస్ట్రియల్ పార్కులో కేవలం ఎఫ్‌ఎల్‌వో సభ్యులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. పర్యావరణానికి హాని కలిగించని కంపెనీలు ఇక్కడ ఏర్పాటవుతాయి. యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే 36 దరఖాస్తులు అందాయి. కాగా పార్కులో మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తోంది.
Advertisement
Advertisement