పటాన్‌చెరు టౌన్: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్నాపూర్ గ్రామంలో హెచ్‌పీ ఇండ్రిస్టియల్ గ్యాస్ గోదాము వద్ద అక్రమంగా సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారంతో శనివారం సాయంత్రం దాడులు చేయగా ఈ గోదాము ముత్తంగికి చెందిన నాగరాజు గౌడ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో అక్రమార్కులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో అక్కడున్న 23 పెద్ద సిల్లిండర్లు 44 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకుని ఫిల్లింగ్ కేంద్రాన్ని సీజ్ చేశారు. దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్, అధికారులు సురేష్,ప్రభాకర్,వీఆర్‌ఓ లు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్రమ గ్యాస్ రీ-ఫిల్లింగ్ కేంద్రం సీజ్
Published Sat, Oct 8 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
Advertisement
Advertisement