గ్యాస్ లీకైన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందారు...
పటాన్‌చెరు: గ్యాస్ లీకైన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందారు. ఈనెల 16న పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో గ్యాస్‌లీక్ కారణంగా ఓ కుటుంబం మొత్తం మంటల్లో చిక్కుకు పోయి తీవ్ర గాయాల పాలైన సంఘటన తెలిసిందే. గురువారం తెల్లవారు జామున చిట్కుల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
చిట్కుల్ వాసులు తలారి బాబురావు(38) భార్య మాధవి(35) వారి ముగ్గురు సంతానం మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందారు. అయితే ఆదివారం భార్యభర్తలిద్దరితో పాటు వారి కుమారుడు లక్ష్మణ్(9) మృతి చెందాడు. కాగా 14 ఏళ్ల వయసున్న మనోజ్, శ్రీరాములు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీరామ్, లక్ష్మణ్‌లు కవల పిల్లలు, లక్ష్మణ్ మృతిచెందగా శ్రీరామ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పోలీసులు తెలిపారు. మనోజ్ పరిస్థితి నిలకడగా ఉంది. బాబురావు కూకట్‌పల్లిలో బిల్డర్‌గా పనిచేసేవారు, భార్యభర్తల మృతితో చిట్కుల్‌లో విషాదం నెలకొంది.