సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పటాన్చెరు ఎంవీఐ కార్యాలయం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న క్రేన్‌ను డీసీఎం ఢీకొంది. ఈ సంఘటనలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లోనే మృతిచెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ డీసీఎం అనంతపురం నుంచి కాన్పూర్‌కు టమాటా లోడు తీసుకెళ్తున్నది. కాగా, క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Published Sat, Jan 27 2018 11:22 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement