Outer ringroad
-
ఆర్ఆర్ఆర్పై అన్నిటికీ రైట్.. రైట్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)పై వెళ్లేందుకు అన్ని వాహ నాలకు అనుమతి ఇవ్వబోతున్నారు. ఎక్స్ ప్రెస్‌వే అయినప్పటికీ బస్సులు, కార్లే కాకుండా ఆటోలు, ద్విచక్రవాహనాలు, చివరకు ఎడ్ల బండ్లు సైతం దీని మీదుగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు, అలాగే విమానాశ్రయానికి ప్రత్యేకంగా నగరం నుంచి శంషాబాద్ వరకు నిర్మించిన పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేల మీద ద్విచక్రవాహనాలు, ఆటోలు లాంటి చిన్న వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే.ఈ రెండింటి లాగే ఆర్ఆర్ఆర్ కూడా ఎక్స్‌ప్రెస్ వేగా నాలుగు వరుసల్లో రూపుదిద్దుకోనున్నప్పటికీ అన్ని వాహనాలూ వెళ్లేందుకు అనుమతించనున్నారు. సర్వీసు రోడ్లు ఉండవు.. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ వేలకు సర్వీసు రోడ్లను నిర్మిస్తారు. ఇప్పుడు నిర్మించే ప్రధాన జాతీయ రహదారులకు కూడా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్)గా నిర్మించినందున దానికి సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయలేదు. అలాగే ఆర్ఆర్ఆర్కు కూడా సర్వీసు రోడ్డు ఉండదని తెలుస్తోంది. దీన్ని జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 335 కి.మీ. నిడివితో కూడిన ఈ రోడ్డుకు దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానుంది. కాగా దీని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డును 8 వరుసలుగా నిర్మించాల్సి ఉన్నా, ప్రస్తుతానికి 4 వరుసలు సరిపోతాయని ఇప్పటికే నిర్ధారించారు. తాజాగా దీని వ్యయంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చించారు. ప్రస్తుతానికి ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. వీలైనంత వరకు ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలని ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే సర్వీసు రోడ్ల ప్రతిపాదన తొలగించారు. అయితే సర్వీసు రోడ్లు లేకుంటే స్థానికులు ఎక్కువగా వినియోగించే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు లాంటివి ఎక్స్‌ప్రెవే పైకి ఎక్కేందుకు వీలుండదు. అలాంటప్పుడు స్థానికులు భూములు ఇచ్చేందుకు అంగీకరించరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్స్‌ప్రెస్ వే అయినప్పటికీ, సాధారణ జాతీయ రహదారుల మీదకు అన్ని వాహనాలను అనుమతిస్తున్నట్టే దీని మీదకు కూడా అనుతించటం ద్వారా సర్వీసు రోడ్ల అవసరం లేకుండా చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు వైపులా ప్రధాన క్యారేజ్ వేకు చివరన (అంచున) 3 మీటర్ల వెడల్పుతో కాస్త పల్లంగా రోడ్డు (పేవ్డ్ షోల్డర్ పోర్షన్) నిర్మిస్తారు. ఇది ప్రధాన రోడ్డుకు చివరలో ఉండే తెల్ల గీతకు అవతల ఉంటుందన్న మాట. రోడ్డు అంచుల్లో చిన్న వాహనాలు రీజినల్ రింగ్‌రోడ్డును 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకుపోగలిగే సామర్థ్యంతో, ప్రమాణాలతో నిర్మిస్తారు. అంత వేగంగా వాహనాలు దూసుకుపోతుంటే ద్విచక్ర వాహనాలు, ఆటోల లాంటి తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఆర్ఆర్ఆర్కు సర్వీసు రోడ్డు అవసరం లేదని ఎన్హెచ్ఏఐ భావిస్తుండటంపై కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ రోడ్డు చివరన ఉండే పేవ్డ్ షోల్డర్స్ పోర్షన్‌ను ఇలా తక్కువ వేగంతో వెళ్లే ఆటోలు, ద్విచక్ర వాహనాలు లాంటి వాటికి కేటాయిస్తారు. అయితే సర్వీసు రోడ్డు ఉంటేనే బాగుంటుందని స్థానిక అధికారులు కోరుతున్నట్టు సమాచారం. వీలుకాని పక్షంలో కనీసం ఒక్క వైపైనా సర్వీసు రోడ్డు నిర్మించేలా డిజైన్ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. -
ఔటర్.. సూపర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. కొత్త గహాల లాంచింగ్స్‌లో ప్రధాన నగరంలో కంటే ఔటర్ ప్రాంతాలదే హవా కొనసాగుతుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 30,340 గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 45 శాతం ఔటర్ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి. మేడ్చల్, మియాపూర్, నిజాంపేట, శంషాబాద్, కోకాపేట, పటాన్చెరు, తెల్లాపూర్ శివార్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ఎఫ్వై 19లోని మొత్తం 18,460 యూనిట్లలో 35 శాతం శివారుల్లోనే లాంచింగ్ అయ్యాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ తెలిపింది. 58 శాతం హౌసింగ్స్ ఔటర్‌లోనే.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 ఆర్థ్ధిక సంవత్సరంలో 1.49 లక్షల గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 58 శాతం శివారు ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై20లో 2.07 లక్షల యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 53 శాతం, అలాగే ఎఫ్వై 19లో 2.29 లక్షల ఇళ్లు ప్రారంభం కాగా.. ఇందులో 51 శాతం గృహాలు శివారు ప్రాంతాల్లోనే లాంచింగ్ అయ్యాయి. శివారు ప్రాంతాలలో ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో పుణే ప్రథమ స్థానంలో.. కోల్‌కతా చివరి స్థానంలో నిలిచింది. ఎఫ్వై 21లో పుణేలో 29,950 గృహాలు ప్రారంభం కాగా.. 76 శాతం ముల్శీ, పిరంగట్, దౌండ్, కంషేట్, రావేట్, చకాన్, చికాళీ, వాడ్గావ్ బుద్రక్, తలేగావ్ దభాడే, ఉంద్రీ శివారుల్లోనే ఉన్నాయి. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం
రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడ్‌తో మహారాష్ట్రకు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న గుర్తుతెలి యని వాహనాన్ని ఢీకొంది. ఈ తీవ్రతకు కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. డోర్లు లాక్ కావడం, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో క్షణాల్లో అగ్నికీలలు విస్తరించాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతా నిమిషాల్లోనే... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఉమామహేశ్వరరావు రొయ్యల వ్యాపారి. పాలకొల్లు నుంచి ముంబైకి రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. ఈయన వద్ద థానేకు చెందిన ముత్యంజయ యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూర్యకుమార్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. పాలకొల్లు నుంచి ఓ కంటైనర్ (ఏపీ 39 టీక్యూ 5734)లో ఇద్దరు డ్రైవర్లు బయలుదేరారు. వీరిలో ఒకరు వాహనం నడుపుతుండగా మరొకరు క్యాబిన్లో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ వాహనం ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణిస్తూ హిమాయత్‌సాగర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం ధాటికి కంటైనర్ ముందు భాగం దెబ్బతినడంతో పాటు మంటలు అంటుకున్నాయి. క్యాబిన్ కూడా ధ్వంసం కావడంతో పాటు దాని డోర్స్ లాక్ అయ్యాయి. నిమిషాల వ్యవధిలోని మంటలు క్యాబిన్ మొత్తం ఆక్రమించాయి. వీటిలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర వాహన చోదకులు ఆగి వారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. క్యాబిన్ ముందు అద్దాలు పగులకొట్టినా.. మంటల ఉధృతి కి వెనక్కు తగ్గారు. గ్యాస్‌సిలిండర్ పేలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కేబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు పూర్తిగా కాలిపోయారు. రాజేంద్రనగర్ పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారమివ్వడంతో ఫైరింజన్ మంటల్ని ఆర్పింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన రాజేంద్రనగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఈ ఉదం తంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కంటైనర్ ఢీకొట్టిన వాహనం వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి,శామీర్‌పేట్/ఉప్పల్: ఔటర్ రింగు రోడ్డుపై శామీర్‌పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన కరుణాకర్‌రెడ్డి (46), భార్య సరళ (38), ఆమె చెల్లెలు సంధ్య(30)తో కలిసి కారులో గజ్వేల్‌లోని ఓ శుభకార్యానికి హాజరై తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో శామీర్‌పేట ఓఆర్ఆర్ గుండా ఉప్పల్‌కు వెళ్తుండగా లియోనియా సమీపంలో ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరుణాకర్‌రెడ్డి, సరళ, సంధ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరుణాకర్‌రెడ్డి, భార్య సరళ, సంధ్య (ఫైల్) చిలుకానగర్‌లో విషాదం మృతుల్లో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ఈరెల్లి రవీందర్‌రెడ్డి భార్య సంధ్య ఉన్నారు. ఆమె మృతిచెందిన వార్త తెలియడంతో చిలుకానగర్‌లో విషాదం నెలకొంది. కాగా కరుణాకర్‌రెడ్డి స్థానికంగా బియ్యం వ్యాపారం చేసుకుంటూ ఆదర్శ్‌నగర్ కాలనీ సాయిబాబా దేవాలయం కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే వీరు మృతిచెందడం కాలనీ వాసుల్ని కలచివేసింది. చదవండి: బైక్ టైర్లో చీర కొంగు చుట్టుకొని.. -
మంత్రి బాలినేని ఎస్కార్ట్కు ప్రమాదం
-
మంత్రి బాలినేని కాన్వాయ్‌కు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర , సాంకేతిక శాఖమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. గచ్చిబౌలి నుంచి విజయవాడకి వెళ్తుండగా పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగురోడ్డుపై ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడంతో పల్టీకొడుతూ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. మంత్రి బాలినేని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాపయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మిగిలిన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను హయత్‌నగర్‌లోని హాస్పిటల్‌కి తరలించారు. మృతిచెందిన పాపయ్య కుటుంబానికి మంత్రి బాలినేని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఫైసల్ అహ్మద్‌కు కొనసాగుతున్న చికిత్స
-
ప్రఖ్యాత నగరం.. నీటి సరఫరా అంతంతమాత్రం..
సాక్షి, శంషాబాద్: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శంషాబాద్ పట్టణంలో తాగునీటి సౌకర్యం లేక పలు కాలనీలు అల్లాడుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు నీటి సరఫరా బాధ్యత జలమండలి తీసుకోవడంతో ఇక్కడ పంచాయతీ చేతిలో ఏమీ లేకుండా పోయింది. జలమండలి అన్ని ఆవాసాలకు మంచినీరందించే పనిని చేపట్టడం లేదు. ఫలితంగా శంషాబాద్ పట్టణంలోని మధురానగర్, సిద్దేశ్వరకాలనీ, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీలో నీటి సరఫరా లేక పదిహేను రోజులుగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరించాలని సూచించారు. వీలైనంత త్వరగా సంబంధిత కాలనీలకు మంచినీటి సరఫరా చేపట్టేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి పనిపూర్తి చేయాలని ఆదేశించారు. అయినా సదరు శాఖ అధికారులు నీటి సరఫరాపై తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఎందుకిలా..? శంషాబాద్‌లోని పాత గ్రామానికి నాలుగున్నరేళ్లుగా జలమండలి అధికారులు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీలోని మిగతా ప్రాంతాలకు పంచాయతీ నుంచి బోరు నీటిని సరఫరా చేసేవారు. అయితే, కొంత కాలంగా ఔటర్ రింగ్‌రోడ్డు లోపు పూర్తి ఆవాసాలకు నీటి సరఫరాను అందించే బాధ్యతను ప్రభుత్వం జలమండలికి అప్పగించింది. దీంతో పంచాయతీ అధికారులు నూతనంగా ఎలాంటి పనులూ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. శంషాబాద్‌లోని జాతీయ రహదారికి అవతల ఉన్న ప్రాంతంలో అర్బన్ మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఇంకా పూర్తి చేయకపోవడంతో ఇక్కడ కృష్ణా నీటి సరఫరా ప్రారంభం కాలేదు. గతంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో పంచాయతీ అధికారులు కూడా వాటిని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానికంగా నెలకొన్న సమస్యను పంచాయతీ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో రెండుమార్లు జలమండలి అధికారులకు విన్నవించారు. అయినా సంబంధిత అధికారులు ఆయా కాలనీలకు మంచినీటి సరఫరాను అందించే ప్రక్రియపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పడిపోయిన నీటిమట్టం శంషాబాద్ పట్టణంలో మధురానగర్, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టుకొచ్చాయి. అద్దెకు నివాసముండే వారు పెరిగిపోయారు. దీంతో ఇళ్ల యజమానులు 1000 నుంచి 1500 ఫీట్ల వరకు బోర్లు వేశారు. విచ్చలవిడిగా తవ్విన బోర్లతో ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటాయియి. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు బోర్ల వరకు ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, లాడ్జీలు, ప్రైవేటు హాస్టళ్ల నిర్వహిస్తున్నా అడ్డుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడి జనాభాకు అనుగుణంగా పంచాయతీ నీటి సరఫరాను అందించలేకపోతోంది. మరో వైపు కృష్ణా నీటి సరఫరా చర్యలు కూడా లేకపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నీటి సరఫరాకు మార్గం సుగమమం చేయడంతో పాటు అక్రమ బోర్లును అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీటి ఇబ్బంది చాలా ఉంది స్థానికంగా నీటి ఇబ్బంది చాలా ఉంది. కృష్ణా నీటి సరఫరా చేపట్టాలి. కాలనీలో బోర్లు ఎండిపోయాయి. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి. సరైన నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం – కె. సత్యనారాయణ– మధురానగర్ స్పందించడం లేదు.. పంచాయతీ పరిధిలోని ఔటర్ లోపలి ప్రాం తాలకు నీటి సరఫరా చేయాల్సిన జల మండలి పట్టించుకోవడం లేదు. పంచాయతీలోని ఔటర్ అవతలి భాగంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సత్వరమే స్పందిస్తున్నారు. పంచాయతీ చేతిలో సమస్యను పరిష్కరించేందుకు అవకాశం లేదు. జలమండలి అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. సత్వరమే కాలనీలకు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. –రాచమల్ల సిద్దేశ్వర్, శంషాబాద్ సర్పంచ్ -
ఔటర్ రోడ్డుపై ప్రమాదం
సాక్షి, గండిపేట : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిలిచివున్న కారును ఓ లారి బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం తలెత్తింది. భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైనట్టు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మరో హైవే..
ఖమ్మంఅర్బన్: వాణిజ్యపరంగా దూసుకుపోతున్న ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు విస్తరిస్తున్నాయి. నగరాన్ని ఆనుకుంటూ మరో నేషనల్ హైవే వెల్లబోతోంది. ఇప్పటికే సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావు పేట జాతీయ రహదారికి సంబంధించిన నిధులు మంజూరై.. భూ సేకరణ పనులు దాదాపు పూర్తికాగా.. తాజాగా వరంగల్–ఖమ్మం నగరాలను కలుపుతూ ఇంకో నేషనల్ హైవే రాబోతోంది. సూర్యాపేట–అశ్వారావుపేట రహదారికి అనుసంధానం చేసే విధంగా నిర్మించే వరంగల్–ఖమ్మం నేషనల్ హైవేకు సంబంధించి.. ఒడిశాకు చెందిన ఎస్ఎం కన్సల్టెన్సీ ఏజెన్సీ బృందం మంగళవారం ప్రాథమిక సర్వే చేసింది. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలాల సరిహద్దున ఉన్న పొలాల్లో సర్వే కొనసాగింది. గూగుల్ మ్యాప్ అధారంగా సర్వే చేశారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు సుమారు 112 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 60 కిలో మీటర్ల మేర సర్వే పూర్తయినట్లు బృందం సభ్యులు తెలిపారు. వరంగల్ నుంచి ఖమ్మం రూరల్ మండలం మీదుగా రఘునాథపాలెం, ఖమ్మం నగరాన్ని కలుపుతూ.. కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో.. సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరో 10 రోజుల్లో సర్వే పూర్తవుతుందని సర్వే బృందంలోని సభ్యుడు ఒకరు తెలిపారు. రెండు నేషనల్ హైవేలు, ఔటర్ రింగురోడ్డు నిర్మాణాలు పూర్తయితే ఖమ్మం పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. జిల్లాలోని ప్రధాన పరిశ్రమగా ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మార్కెటింగ్ పరంగా ముడి సరుకుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలం కానుంది. ఔటర్ రింగ్‌రోడ్డు.. సూర్యాపేట–అశ్వారావుపేట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ.. ఖమ్మం నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అధికారులు సర్వే కూడా చేశారు. సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతోపాటు జాతీయ రహదారుల నిర్మాణంతో ఖమ్మం చుట్టూ రవాణాపరంగా సమస్యలు తొలగనున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది. -
రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు..
-
రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు.. పోలీసుల ఛేజింగ్
ఆటోడ్రైవర్ల చేష్టలతో వాహనదారులు వణికిపోయారు. హైవేపై రేసులతో రెచ్చిపోయారు. దీంతో వాహనదారులు భయాందోళనలకు గురికాగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని వెంటాడి మరీ అరెస్ట్ చేశారు. తమిళనాడులోని చెన్నై హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాక్షి, చెన్నై: నగరంలో ఆటోడ్రైవర్లు చెలరేగిపోయారు. చెన్నై హైవే ఔటర్ రింగ్ రోడ్‌పై రేసులు నిర్వహించి అడ్డంగా బుక్కయ్యారు. బైక్‌పై వెళ్తున్న కొందరు వారిని రెచ్చగొట్టంతో వారు మరింత వేగంతో దూసుకెళ్లటంతో వాహనదారులు భీతిల్లిపోయారు. అది గమనించిన పోలీసులు వారిని వెంటాడి మరీ పట్టుకున్నారు. సుమారు ఆరగంటకు పైగానే ఛేజింగ్ కొనసాగింది. మొత్తం ఆరు ఆటోలను, ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ఇల్లీగల్ రేసులు, ట్రాఫిక్ ఉల్లంఘనతోపాటు వాహనదారులకు భయాందోళనలు గురి చేసినందుకు వారిపై కేసులు నమోదు చేశారు. కాగా, గతంలోనూ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు. -
ఓఆర్ఆర్పై దారి దోపిడీ చేస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్ : ఔటర్ రింగ్‌రోడ్డుపై దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ రమణగౌడ్ తెలిపి వివరాల ప్రకారం... చింతల్మెట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హైదర్(20), కిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్ యాయా(21) క్యాబ్ డ్రైవర్లు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన వీరు బతుకుదెరువు కోసం వలస వచ్చి క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. సంపాదన సరిపోకపోవడంతో ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయాలని భావించారు. కానీ ధైర్యం చాలకపోవడంతో ఓఆర్ఆర్పై తమ వాహనంలో తిరుగుతూ ఆగి ఉన్న వాహనాల వద్దకు వెళ్లి వారితో మాటలు కలిపే వారు. అదను చూసి సెల్ఫోన్లు, విలువైన వస్తువులు తీసుకుని ఉడాయించే వారు. ఈ నెల 4న కోకాపేట ఓఆర్ఆర్పై కారు చెడిపోవడంతో రాత్రి సమయంలో మరమ్మతులు చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి సహాయం చేస్తామంటూ నమ్మబలికి సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ నెల 10న ఇందిరానగర్ ప్రాంతంలోని ఓఆర్ఆర్పై డీసీఎం డ్రైవర్ పక్కకు ఆపి కాలకృత్యాలు తీర్చుకుంటుండగా భయాభ్రాంతులకు గురి చేసి రూ. 8,900 నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకోని అతడిపై దాడి చేశారు. రెండు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఓఆర్ఆర్పై నిఘా పెట్టారు. దొంగలించిన సెల్‌ఫోన్‌ను సయ్యద్ హైదర్ వాడుతుండటంతో దానిపై నిఘా వేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు సయ్యద్ యాయాను కూడా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఓఆర్ఆర్పై వాహనాలను ఆపకండి : ఇన్స్పెక్టర్ ఓఆర్ఆర్పై వాహనాలను ఆపవద్దని నార్సింగి ఇన్స్పెక్టర్ రమణగౌడ్ వాహనదారులకు సూచించారు. అత్యవసరమైతే తప్ప వాహనాన్ని పార్కు చేయవద్దని చెప్పారు. ఎవరైనా దారి దోపిడీలకు పాల్పడితే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. దీని ద్వారా నిందితులను టోల్గేట్ల వద్ద అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దోపిడీ జరిగిన వెంటనే స్పందించాలన్నారు. -
అమరావతి ఔటర్‌కు 17,762 కోట్లు
సాక్షి, అమరావతి: సవరించిన అలైన్మెంట్ ప్రకారం అమరావతిలో 189 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకు రూ.17,762 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ చేతకానితనం, అసమర్ధత వల్ల రాష్ట్ర ప్రభుత్వం పరువుపోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్చి నాటికి ప్రధాన రహదారిపై రాకపోకలు పునరుద్ధరించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం–విజయవాడ మధ్య దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయవాడ–మచిలీపట్నం రహదారి మార్గం 38 శాతం పూర్తయ్యిందని, నిర్దేశించిన సమయానికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి పనులలో జాప్యం సరికాదని సీఎం చెప్పారు. -
క్రేన్‌ను ఢీకొన్న డీసీఎం: డ్రైవర్ మృతి
-
క్రేన్‌ను ఢీకొన్న డీసీఎం: డ్రైవర్ మృతి
సాక్షి, పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పటాన్చెరు ఎంవీఐ కార్యాలయం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న క్రేన్‌ను డీసీఎం ఢీకొంది. ఈ సంఘటనలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లోనే మృతిచెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ డీసీఎం అనంతపురం నుంచి కాన్పూర్‌కు టమాటా లోడు తీసుకెళ్తున్నది. కాగా, క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
‘మహా’ గిఫ్ట్..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుమతినిచ్చిన లేఅవుట్లలో ‘గిఫ్ట్ డీడ్’ కింద వచ్చిన భూమిని ఈ నెలాఖరు నాటికి వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లానింగ్ విభాగం, ఎస్టేట్ విభాగ అధికారులు కలిసి ఆయా లేఅవుట్లను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 39 లేఅవుట్లలోని ప్లాట్లు, భూమికి జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మరో మూడు రోజుల్లో మిగతా ప్లాట్లకు ట్యాగింగ్ పూర్తి చేసి నెలాఖరు నాటికి ఈ–వేలం నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా సన్నాహలు చేస్తున్నారు. కబ్జాలకు చెక్.. కాసుల వర్షం ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రావడంతో గతంలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాట్లు, ఉప్పల్ భగాయత్ ప్లాట్లు తొలుత వేలం వేయాలని భావించారు. కబ్జా కోరల్లో చిక్కుకుని ఖాళీగా ఉంటున్న గిఫ్ట్ డీడ్ భూములు విక్రయిస్తే ఇటు సంస్థకు ఆదాయం సమకూరడంతో పాటు సంరక్షించే ఒత్తిడి తగ్గుతుందని యోచించారు. కొన్నిచోట్ల కొంత మంది స్థలం అక్రమించిన సందర్భాలుండడంతో గిఫ్ట్‌డీడ్ భూములను అమ్మాలని నిర్ణయించారు. తదనుగుణంగా ఆయా లేఅవుట్లలోని ప్లాట్లు, భూములకు జియో ట్యాగింగ్ పనులను వేగిరం చేశారు. కొన్ని ప్రాంతాల్లోని మూడెకరాల భూములను ఏకంగా విల్లాలు నిర్మించే అవకాశముండటంతో వారికే ఎక్కువ ధరకు విక్రయించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ‘ప్రభుత్వ జీఓ 33 నంబర్ ప్రకారం హెచ్ఎండీఏ అనుమతిచ్చిన లేఅవుట్లో మూడు శాతం, గేటెడ్ కమ్యూనిటీ, గ్రూప్ హౌసింగ్‌లోనైతే మూడు నుంచి ఐదు శాతం భూమిని హెచ్ఎండీఏకు గిఫ్ట్‌డీడ్ చేస్తారు. పార్కులు, రోడ్డు, మౌలిక వసతులతో సంబంధం లేకుండా ఈ భూమిని హెచ్ఎండీఏ పేరున యజమాని రిజిస్టర్ చేస్తారు. ఈ భూమిని అమ్ముకునే అధికారం హెచ్ఎండీఏకు ఉంది. గతంలో భూములకు తక్కువ రేటు ఉండటంతో చాలా మంది భూములను గిఫ్ట్ డీడ్ చేసేందుకు సుముఖత చూపారు. ఇప్పుడు ఆ భూములే హెచ్ఎండీఏకు భారీ ఆదాయం సమకూర్చబోతున్నాయ’ని ప్లానింగ్ విభాగ అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉప్పల్ భగాయత్, హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని ప్లాట్లు విక్రయిస్తే రూ.వెయ్యి కోట్ట వరకు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఔటర్ నిర్వాసితులకు గిఫ్ట్‌డీడ్ భూములు.. ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములిచ్చిన వందలాది మంది రైతులకు భూమికి భూమిని హెచ్ఎండీఏ అధికారులు కేటాయించారు. కాగా, 27 మంది రైతులకు భూములిస్తామంటే ఎక్కడ కూడా అందుబాటులో లేకుండాపోయాయి. దీంతో ఆయా రైతులకు దాదాపు 27 వేల గజాలను శ్రీనగర్‌లోని లే అవుట్లలో ఉన్న గిఫ్ట్‌డీడ్ భూములను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. -
స్పీడ్ రైడ్..డెడ్లీ దౌడ్!
ఔటర్ రింగురోడ్డుపై వాహనాలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. పరిమితికి మించి రెట్టింపు వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నాయి. వాయువేగం కారణంగా చివరకు వాహనంలోని సేఫ్టీ పరికరాలు సైతం పనికిరాకుండా పోతున్నాయి. వేగ నియంత్రణ కోసం ఔటర్ రింగురోడ్డులో స్పీడ్లేజర్ గన్ నిఘా ఉంచినా ఫలితం లేదు. సగటున 140–200 కి.మీ వేగంతో కార్లు, ఇతర వాహనాలు దూసుకెళ్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఈమేరకు మూడు లక్షల మందికి పైగా ఉల్లంఘనులను గుర్తించారు. దాదాపు రూ.43 కోట్లకుపైగా జరిమానా విధించారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఔటర్‌పై 45 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 39 మంది మృత్యువాతపడ్డారు. సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై వాహనదారులు వాయు వేగంతో దూసుళ్తున్నారు. అతివేగం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి హెచ్ఎండీఏ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అమలు చేస్తున్న ‘స్లో స్పీడ్ సాంకేతిక వ్యవస్థ’ వాహనదారుల వేగం ముందు తెల్లబోతోంది. ఈ ఏడాది నవంబర్ నెలాఖరునాటికి 3 లక్షల రెండు వేల 295 మంది వాహనదారులు 140 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ‘స్పీడ్ లేజర్ గన్’ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వీరికి రూ.43 కోట్ల 37 లక్షల 93 వేల 325 జరిమానా విధించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్లో శామీర్‌పేట–కీసర మార్గం, వట్టినాగులపల్లి, పోశెట్టిగూడ, హిమాయత్‌సాగర్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తుక్కుగూడ, రావిర్యాల, బొంగళూరు వద్ద అతివేగంతో వాహనాలు దూసుకెళ్తున్నాయని స్పీడ్ గన్ కెమెరా గణాంకాలు వెల్లడిస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 156.9 కిలోమీటర్ల పరధిలో ఈ ఏడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందారు. 66 మంది గాయపడ్డారు. పొగమంచు కమ్మే డిసెంబర్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే అస్కారముందని, ఈ సమయంలోనైనా వాహనాలు వేగాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించినా మారని తీరు... గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ జోష్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. ఈ అతి వేగం ఉన్న సమయంలో సేఫ్టీ మెజర్స్ కూడా పనిచేయడం లేదు. నిఘా మరింత పెంచాలి... ఓఆర్ఆర్పై వాహనాల వేగాన్ని పరిశీలించేందుకు టోల్‌ప్లాజాల వద్ద తప్ప ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో అధికారులు భావించినట్టుగా వేగనియంత్రణ సాధ్యం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా లేకపోవడంతో తమపై పర్యవేక్షణ లేదనే భావనతో వాహనచోదుకులు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆభయకేసు ఉదంతంతో ఓఆర్ఆర్పై నిఘాలేమి బహిర్గతమైంది. అభయను అపహరించిన దుండుగులు ఓఆర్ఆర్పై దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించినా ఎక్కడా ఆ దృశ్యాలు నమోదు కాలేదు. ఆ తర్వాత హెచ్ఎండీఏ అధికారులు అప్రమత్తమైనట్టు కనిపించినా...ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అయితే ఈ ఏడాది సైబరాబాద్, రాచకొండ పోలీసులకు ఎనిమిది స్పీడ్ లేజర్ గన్ కెమెరాలు ఇచ్చారు. దీంతో పెట్రోలింగ్ వాహనాల్లో ఆ స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఉంచుతూ అతివేగంతో వెళ్లే వాహనదారులకు ఈ–చలాన్లు ఇస్తున్నారు. తీవ్రత ఎలా ఉందంటే... 2014: సెప్టెంబర్ 29న తెల్లవారుజామున శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన ఘోర ప్రమాదంలో సెంట్రల్ ఎక్సైజ్ ఉన్నతాధికారి సత్యనారాయణ కుటుంబసభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో కూతురు తీవ్రంగా గాయపడింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 2015: నవంబర్ 25న తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్‌తో పాటు వారి స్నేహితులిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. 2017: నవంబర్ 23న ఓఆర్ఆర్ పెద్దఅంబర్‌పేట సమీపంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాదర్గుల్లో ఇంజనీరింగ్ చదువుతున్న అభిషేక్ (19), మన్నగూడ వాసి మహేశ్(20) కన్నుమూశారు. సైబరాబాద్ పరిధి ఓఆర్ఆర్లో... ఠాణాలు కేసులు జరిమానా మాదాపూర్ 67,562 9,69,51,470 అల్వాల్ 20175 2,89,51,125 శంషాబాద్ 89588 12,85,58,780 రాజేంద్రనగర్ 60306 8,65,39,110 జీడిమెట్ల 19,437 2,78,92,095 మొత్తం 2,57,068 36,88,92,580 రాచకొండ పరిధి ఓఆర్ఆర్లో... ఠాణాలు కేసులు జరిమానా ఉప్పల్ 173 2,48,255 వనస్థలిపురం 45,054 6,46,52,490 మొత్తం 45,227 64,90,0745 -
ఔటర్ పై ప్రమాదం, బెజవాడ వాసులు మృతి
హైదరాబాద్ : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న లారీని... మహీంద్రా జైలో కారు (ఏపీ 16 టీఎల్ 5252) వెనకనుంచి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవిజయవాడ సెంట్రల్ ఎక్సయిజ్ ఉద్యోగి మహేందర్, ఆయన భార్య నాగరామలక్ష్మి, ఎంబీబీఎస్ చదువుతున్న సింధూర అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్ కౌంటర్, ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డిపై దుండగుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నర్సింహారెడ్డిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన నర్సింహరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగులపై పోలీసులు జరిపిన ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు మృతి చెందాడు. మరణించిన మృతుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివగా అనుమానిస్తున్నారు. -
ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ
- ప్రయాణించే మార్గం స్థితిగతులు ముందే తెలుస్తాయ్.. - రెండు బిడ్స్ దాఖలు - రూ.210 కోట్లతో నిర్మాణం..నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనదారులు ఆ మార్గంలో ట్రాఫిక్, వాతావరణం తదితర పరిస్థితులను తెలుసుకొనేందుకు వీలుగా ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ ఏర్పాటు కానుంది. ఔటర్‌పై 19 జంక్షన్ల (ఇంటర్ ఛేంజెస్)లో రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల కోసం హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. వీటిని రెండ్రోజుల క్రితం తెరిచారు. ఎల్అండ్టీ, ఈఎఫ్‌సీఓఎన్ సంస్థల నుంచి రెండు బిడ్స్ దాఖలయ్యాయి. వీలైనంత త్వరలో సాంకేతిక ప్రక్రియను పూర్తిచేసి, రుణదాత జైకా అనుమతి తీసుకొన్నాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో పూర్తిచేసి 2014 నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుపై 20 జంక్షన్లకు గాను 19 చోట్ల ఈ ఈ ఆధునిక సమాచార వ్యవస్థను 18 నెలల వ్యవధిలో నిర్మించి, అయిదేళ్ల పాటు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. కాంట్రాక్టు సంస్థ ఖరారయ్యాక లక్ష్యాల మేరకు పనులు జరిగితే... ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ 2016లో అందుబాటులోకి రానుంది. కళ్ల ముందే సమాచారం ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని నగరాలలో మాత్రమే ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ అమల్లో ఉంది ఔటర్‌పై ఇది అందుబాటులోకి వస్తే నిర్ణీత కిలోమీటర్ల పరిధిలో తాము వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్థితిగతుల గురించి వాహనచోదకులు ముందే తెలుసుకోవచ్చుప్రయాణించే మార్గంలో రద్దీ, రోడ్డుపై తవ్వకాలు లేదా ప్రమాదాలు, అలాగే వర్షం నీరు నిలిచినా, పొగమంచు కమ్ముకున్నా.. వెంటనే ఆ వివరాలు తెలుస్తాయి 19 జంక్షన్లలో సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)లు, ఆటోమాటిక్ వెహికల్ క్లాసిఫయర్ కం కౌంటర్ (ఏబీసీసీ), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు, లార్జ్ డిస్ప్లే స్క్రీన్, నానక్‌గూడలో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, కంప్యూటర్-ఎలక్ట్రానిక్-కమ్యూనికేషన్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రతి జంక్షన్‌కు 1 కి.మీ. ముందుగానే వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డు ఉంటుంది. దీనిపై ఎప్పటికప్పుడు ఔటర్‌పై ట్రాఫిక్, రోడ్డు, వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక ఎలక్ట్రానిక్ డిస్ప్లే ద్వారా ప్రదర్శిస్తారు. -
ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదం
-
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం, ఐదుగురు మృతి
హైదరాబాద్ : నగర శివారులోని ఔటర్‌రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డుప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా తుక్కుగూడలో ఔటర్‌రింగ్ రోడ్డుపై శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు మరో నలుగురి పరిస్థితి విషమం ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు మగవాళ్లు ఉన్నారు. మృతులది మహారాష్ట్రకు చెందిన వాళ్లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.