ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్ కౌంటర్, ఒకరి మృతి
Published Sat, Aug 16 2014 2:13 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డిపై దుండగుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నర్సింహారెడ్డిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన నర్సింహరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
దుండగులపై పోలీసులు జరిపిన ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు మృతి చెందాడు. మరణించిన మృతుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివగా అనుమానిస్తున్నారు.
Advertisement
Advertisement