encouter
-
Jammu Kashmir: జమ్మూలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రత సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. కాగా, జమ్మూలోని షోపియన్ జిల్లా డ్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి. గత కొన్ని రోజులుగా టెర్రరిస్ట్‌లు అమాయక వలసకూలీలను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులలో ఇప్పటికే అమాయక కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భయపడిపోయిన కూలీలు ఇప్పటికే జమ్మూ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది.. -
జైల్లో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు హతమయ్యారు. ఇద్దరు ఖైదీలను తోటి ఖైదీ కాల్చి చంపడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గ్యాంగ్ వార్ ఘటనపై నివేదక అందజేయాలని డివిజనల్ కమిషనర్ డీకే సింగ్, చిత్రకూట్ ఐజీ, జైళ్ల శాఖ డీఐజీ సంజీవ్ త్రిపాఠిలను ఆదేశించారు. మృతి చెందిన ఖైదీలను అన్షు దీక్షిత్, మిరాజుద్దీన్ అలియాస్ మిరాజ్ అలీ, ముకీం కాలాగా పోలీసులు ప్రకటించారు. మిరాజ్ అలీ, ముకీం కాలాని అన్షు దీక్షిత్ తుపాకీతో కాల్చి చంపేశాడు. మరికొందరు ఖైదీల తలకు తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దీక్షిత్ ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి సత్యనారాయణ్ తెలిపారు. అయితే జైల్లోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందరూ కరుడుగట్టిన నేరస్తులని.. వారిపై చాలా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనపై జిల్లా జైలర్ ఎస్పీ త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఖైదీల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో సిబ్బంది ఆపేందుకు యత్నించారని.. ఆ సమయంలో దీక్షిత్ జైలు అధికారి రివాల్వర్ లాక్కుని తోటి ఖైదీలపై కాల్పులు జరిపాడని అన్నారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో దీక్షిత్ చనిపోయాడని చెప్పారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో గ్యాంగ్ వార్ కారణంగానే కాల్పుల ఘటన చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. యూపీలోని షామ్లీకి చెందిన ముకీం కాలా హత్యలు, దోపిడీలు, వసూళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ముఠాలో మిరాజ్ అలీ కీలక సభ్యుడిగా తెలుస్తోంది. సీతాపూర్‌కి చెందిన కాంట్రాక్ట్ కిల్లర్ అన్షు దీక్షిత్ గతంలో గ్యాంగ్ స్టర్ మున్నా బజరంగి వద్ద పనిచేసినట్లు సమాచారం. మిరాజ్ అలీని మార్చి 20న వారణాసి జైలు నుంచి చిత్రకూట్ జైలుకి మార్చారు. కాలాని సహరాన్పూర్ నుంచి ఈ నెల 7న ఇక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. దీక్షిత్ 2019 నుంచి ఇదే జైలులో ఉంటున్నాడు. చదవండి: ఆస్పత్రిలో పక్కా ప్లాన్: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి -
కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్న వేళ..కశ్మీర్లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం కల్నల్ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్ కాల్స్‌కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్‌లు 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లోని గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన వారు. వీరితోపాటు లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షకీల్ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్‌కు చెందిన హైదర్ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది. అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్ అశుతోష్ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్‌కు, మేజర్ అనూజ్ సూద్ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్‌లోయలో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎ.ఖాజీ (ఫైల్ ఫొటోలు, ఎడమ నుంచి కుడికి) -
భీకరపోరు: ఐదుగురు జవాన్ల వీర మరణం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి రక్తపాతం సృష్టించారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని భీకర కాల్పులకు దిగారు. ఆదివారం ఉదయం హంద్వారా సమీపంలో దాదాపు 8 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఐదురుగు జవాన్లు వీర మరణం పొందారు. వీరిలో సీనియర్ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఓ మేజర్ కూడా ఉన్నారు. అయితే ఉగ్రవాదుల కాల్పులను వెంటనే తిప్పి కొట్టిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా గత 15 రోజులకుగా కశ్మీర్ సెక్టార్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. ఇద్దరు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దక్షిణ కశ్మీర్ షోపియన్ జిల్లాలోని మెల్‌హురా ప్రాంతంలో మంగళవారం జరిగింది. మెల్‌హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ చెర్చ్ చేపట్టారు. దీంతో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు మంగళవారమే తెలిపారు. (చెన్నైలో భయం.. భయం) ఇక ఈ ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా మృతి చెందగా.. మూడో ఉగ్రవాది కాల్పులు జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీటర్లో పేర్కొన్నారు. ఇక మూడో ఉగ్రవాది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందినవారు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు. Operation at Melhura continued through the night. Two terrorists killed.Bodies recovered. For third terrorist search is on. https://t.co/mXMg99GzgU — J&K Police (@JmuKmrPolice) April 29, 2020 -
ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నాం: నారాయణ
సాక్షి, హైదరాబాద్: దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీఐ స్వాగతించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ నాయకులు నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును స్వాగతిస్తున్నారు. దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో కేసు విచారణలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా దిశ మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్‌ను రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామూన నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడి హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు సైనికులను ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో పుల్వామా ఉగ్ర దాడిలో ప్రమేయం ఉన్న సాజద్ భట్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని ఇదే దాడితో సంబంధం ఉన్న అహ్మద్ భట్‌గా గుర్తించారు. సాజద్ బట్ 25 కిలోల పేలుడు పదార్థంతో ఉన్న మారుతి ఈకో కారును పుల్వామా దాడిలో ఉపయోగించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. సోఫీయన్ మదర్సాలో విద్యార్థిగా ఉన్న సాజద్ పుల్వామా దాడికి ముందు కొన్ని రోజలు కనిపిచంకుండా పొయినట్లు ఎన్ఐఏ తెలిపింది. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది సోమవారం హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ రాహుల్ వర్మ మరణించిన విషయం తెలిసిదే. -
ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో జరిగిన హోరాహోరి కాల్పుల్లో భద్రతాబలగాలు శనివారం ఉదయం ముగ్గురు తీవ్రవాదులను హతమార్చాయి. కాగా ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 గన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఎన్కౌంటర్ నేపథ్యంలో సోపోర్‌లో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అలాగే ముందుజాగ్రత్త చర్యగా బారాముల్లా జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. సీఆర్పీఎఫ్, ఎస్‌వోజీ దళాలు జాయింట్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. -
ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
కుప్వారా: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు సైతం మృతి చెందినట్లు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్ కౌంటర్, ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డిపై దుండగుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నర్సింహారెడ్డిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన నర్సింహరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగులపై పోలీసులు జరిపిన ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు మృతి చెందాడు. మరణించిన మృతుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివగా అనుమానిస్తున్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులకు మధ్య కాల్పులు
కడప: అక్రమ ఎర్రచందనం సరఫరాకు పాల్పడుతున్న స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు బుధవారం సాయంత్రం జరిగాయి. వైఎస్ఆర్ జిల్లాలోని రైల్వేకోడూరు మండలం బాలపల్లి అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో తమిళనాడుకి చెందిన ఎర్రచందనం కూలీ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో కాల్పుల జరిపామని పోలీసుల తెలిపారు.