
సాక్షి, హైదరాబాద్: దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీఐ స్వాగతించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ నాయకులు నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును స్వాగతిస్తున్నారు. దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో కేసు విచారణలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా దిశ మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామూన నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment