Disha Case
-
‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంచ్ స్టే ఇచ్చింది.10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో కమిషన్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్‌నగర్ సీఐ శ్రీధర్‌తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఎన్కౌంటర్ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్‌లో లోపాలు ఉన్నాయన్న కమిషన్..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని రిపోర్టు ఇచ్చింది. ఎన్కౌంటర్ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్.. అప్పటి ఎన్‌కౌంటర్‌ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్ రిపోర్ట్‌పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది -
దిశా కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: దిశా కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ అధికారిగా పనిచేసిన పోలీసు అధికారి సురేంద్ర స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీఆర్ఎస్ కోసం డీజీపీ అంజనీ కుమార్ యాదవ్‌కు దరఖాస్తు సమర్పించారు. ఇటీవల తరుచూ బదిలీలపై అసంతృప్తితో ఉన్నాయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా దిశా నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సురేంద్ర షాద్ నగర్ ఏసీపీగా ఉన్నారు. దిశ కేసు విచారణ అధికారిగా పనిచేశారు. తరువాత ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా పనిచేశారు. సురేంద్రను ఇటీవలె సైబరాబాద్ కమాండర్ కంట్రోల్ విభాగానికి ఏసీపీగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన స్వచ్చంద పదవీ విమరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అయితే వీఆర్ఎస్కు వ్యక్తిగత కారణాలను చూపుతున్నప్పటికీ.. తరచుగా బదిలీలు, లూప్ లైన్ పోస్టింగ్‌లు పొందడం పట్ల సురేందర్ కలత చెందినట్టుగా తెలుస్తోంది. ఇక సురేందర్‌కు మరో మూడేళ్ల సర్వీసు ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు -
‘దిశ’ కేసులో వాయిదాలు సరికాదు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘దిశ’హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాదనలను వినిపించకుండా తప్పించుకుంటున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదిస్తారని, అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలకు హాజరుకావడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఉండగా, ఢిల్లీ నుంచి న్యాయవాదులు ఎందుకు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఏదేమైనా చివరి వాదనలను ఏప్రిల్ 12కు వాయిదా వేస్తున్నామని, ఆ రోజు నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా అయినా వాదనలు వినిపించాలని సీజే ధర్మాసనం ఆదేశించింది. పోలీసులపైనే హత్య కేసు పెడితే ఎలా అన్న సీనియర్ న్యాయవాది – 2019, డిసెంబర్ 6న ‘దిశ’కేసు నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం జీ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ‘దిశ’కేసు అత్యాచారం, హత్య కేసులో దర్యాప్తు అధికారి తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. పోలీసులపైనే హత్య కేసు పెడితే పోలీసు అధికారి జీవించే హక్కుకు భంగం కలిగినట్టే అవుతుందన్నారు. ఆర్టీకల్ 21 కింద నిర్దేశించిన జీవించే హక్కు ప్రమాదంలో ఉన్నప్పుడు పౌరులు హైకోర్టుకు వస్తారని.. కానీ, కమిషన్ నివేదిక ఆధారంగా కేసు నమోదుకు హైకోర్టు ఆదేశిస్తే, పోలీసు అధికారులు ఎక్కడికి వెళ్లగలరని ప్రశ్నించారు. ‘దిశ’తండ్రి తరఫున కె.వివేక్‌రెడ్డి వాదిస్తూ.. 2012లో ఏపీ హైకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం హత్యల ఘటనల్లో పోలీసులు తగిన విధానాన్ని అనుసరించాలని స్పష్టంగా పేర్కొందన్నారు. కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకునే ముందు విధివిధానాలను అనుసరించాలన్నారు. నిందితుల హత్యలను ‘దిశ’తండ్రి సమర్థిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
తుపాకులు అన్‌లాక్ ఎందుకు చేశారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితులు తుపాకులను ఎలా అన్‌లాక్ చేశారు?.. ఒకవేళ పోలీసులే అన్‌లాక్ చేస్తే.. ఎందుకు చేశారో చెప్పడం లేదు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పిన పోలీసులు వారికి సంకెళ్లు ఎందుకు వేయలేదు. ఇలాంటి వన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి’అని ‘దిశ’ఎన్కౌంటర్ కేసులో పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. 2019, డిసెంబర్ 6న జరిగిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం జీ ధర్మాసనం సోమ వారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘2019, నవంబర్ 27న చటాన్‌పల్లి వద్ద ఓ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. 28న ఉదయం బాధితురాలి మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.. కొద్ది రోజుల్లోనే నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. డిసెంబర్ 6న ఘటనాస్థలికి వారిని తీసుకెళ్లిన పోలీసులు.. నిందితులు తమపై దాడికి యత్నించారని, ఆత్మరక్షణ కోసం కాల్చామని చెబుతున్నారు. 10 మంది సీనియర్ అధికారులు ఎన్కౌంటర్ సమయంలో ఉన్నారని చెబుతున్నా.. నిందితులను ఎక్కడ కాల్చారో కూడా చెప్పలేకపోయారు. ఈ 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కేసు వివరాలను నిందితుల తల్లిదండ్రులకు చెప్పకుండా.. క్రమంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. కావాలనే మీడియాకు లీకులు ఇవ్వడంతో పాటు 2019లో నవంబర్ 29, డిసెంబర్ 6న ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు ఇచ్చారు. ఎన్కౌంటర్ స్థలంలోని మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోకముందే సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇది తాము సత్వర న్యాయం అందించామని ప్రజ లకు చెప్పడం కోసమే ఏర్పాటు చేసినట్లు ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా సీపీ వ్యాఖ్యానించారు. సిట్ కూడా దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించలేదు. సీసీ ఫుటేజీలను పరిశీలించాకే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతుండగా, లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డి మాత్రం నిందితుల్లో ఇద్దరిని ఫుటేజీలో చూడలేదని చెప్పారు. నిందితుల్లో జోలు నవీన్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. స్కూల్ రికార్డుల ప్రకారం నిందితుల్లో ముగ్గురు మైనర్లే అయినా.. జువెనైల్ చట్టప్రకారం దర్యాప్తు చేయలేదు. ఈ కేసును ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో కోర్టు పర్య వేక్షణలో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయి’అని వృందా నివేదించారు. కాగా, ప్రభు త్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ)వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయవాది కోర్టును విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 23కు వాయిదా వేసింది. -
పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ ఎన్కౌంటర్ కేసులో పోలీసులు.. నలుగురు అనుమానితులను చంపినా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను హైకో ర్టు స్వీకరించింది. ఎన్కౌంటర్నుతప్పుబడుతూ సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఓ కమిషన్‌ను నియమించింది. గత జనవరిలో కమిషన్ నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై సుప్రీంకోర్టు గత మేలో విచారణ జరిపింది. ‘దిశ’ఎన్కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని తేల్చిచెబుతూ.. రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసింది. కాగా, హైకోర్టులోనూ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ క్రమంలో ‘దిశ’ఎన్‌కౌంటర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బ్రిందా గ్రోవర్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. దిశ ఘటనకు సంబంధించిన వివరాలను కోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ‘2019, నవంబర్ 27న చటాన్‌పల్లి వద్ద ఓ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరిని 2019, డిసెంబర్ 6న పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే రోజు ఘటనా స్థలానికి వారిని తీసుకెళ్లారు. అక్కడ తమపై నిందితులు దాడి చేశారంటూ పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమా.. లేక నిజంగా ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్కౌంటర్ చేశారా.. అనే దానిపై నిజాలు నిగ్గుతేల్చాలని పలు హక్కుల సంఘాలు హైకోర్టు సీజేకు లేఖ రాశాయి. పారదర్శకంగా, స్వేచ్ఛాయుత విచారణ జరిపేలా చూడాలని కోరాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ ఎన్‌కౌంటర్‌పై హైపవర్ కమిషన్‌ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2021 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విచారణ జరిగిన ఈ కమిషన్.. 2022, జనవరి 28న నివేదికను సమర్పించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2022, మే 20న ఈ కేసు విచారణ బాధ్యతను హైకోర్టుకు అప్పగించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న మొత్తం పది మంది పోలీసు అధికారులను సెక్షన్ 302 ఆర్/డబ్ల్యూ 34 ఐపీఎస్, 201 ఆర్/డబ్ల్యూ, 302 ఐపీఎస్, 34 ఐపీఎస్ కింద విచారణ జరపాలని కమిషన్ సూచించింది. కమిషన్ నివేదిక మేరకు ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈ కోర్టు ఆదేశించాలి. నలుగురు అనుమానిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ సమ ర్పించిన పోలీసులు.. నలుగురిని చంపిన వారి పై మాత్రమే కేసు నమోదు చేయలేకపోవడం చట్టవిరుద్ధం. పీయూసీఎల్ తీర్పులో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించాలని హైకోర్టు ఆదేశించినా దాన్ని పాటించలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పుల మేరకు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులోనూ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించేందుకు హైకోర్టుకు సర్వాధికారాలున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన వెంటనే సీపీ ప్రెస్‌మీట్ పెట్టి.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’అని అనడం ఎన్కౌంటర్ కావాలనే చేశారనేందుకు బలం చేకూర్చుతోంది’ అని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే జనవరి 2కు వాయిదా వేసింది. -
మాయని మచ్చగా తొండుపల్లి ఘటన.. ఆ అమానుషానికి మూడేళ్లు
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. – షాద్‌నగర్ 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. మారిన చట్టాలు దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అప్రమత్తత అవసరం సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
దిశ ఎన్కౌంటర్: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిశ ఎన్కౌంటర్ కేసు హైకోర్టుకు చేరింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు చేరింది. దిశ కేసులో ఎమికస్ క్యూరీగా దేశాయ్ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది. దిశ కేసు నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు విచారిస్తుందంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. త్వరగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా 287 పేజీల కమిషన్ నివేదికకు సంబంధించి 57 మంది సాక్షులను, 10 మంది పోలీసులను విచారించారు. 2019 నవంబర్ 27న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన యువవైద్యురాలు దిశ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం చటాన్‌పల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన కింద కాలుతూ ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతురాలిని దిశగా తేల్చారు. 2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. షాద్ నగర్‌కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. -
వైపరీత్య ఘటనల్లో రాజకీయమా?
చట్టానికి అనుగుణంగా ప్రజాభిప్రాయం ఉండాలని లేదు. ‘హత్యాచార’ ఘటనలు జరిగినప్పుడు బాధితుల ఆవేదన లాంటి కారణాలతో కొన్ని సందర్భాలలో ఇన్స్టంట్ జస్టిస్ అందించడం కోసం పోలీసులు కొన్ని చర్యలు చేపడుతున్నారు. అవి వివాదాస్పదమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితపక్షానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలి. చట్టానికీ, ప్రజాభిప్రాయానికీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలి. గతంలో లైంగికదాడుల సందర్భాల్లో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున స్పందించేవారు. కానీ ఇప్పుడు వాటిని రాజకీయం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సమాజంలో జరిగే వైపరీత్యంగా కాకుండా, అదేదో ప్రభుత్వమే దగ్గరుండి చేయించినట్లుగా ఆరోపించడం వాటి దివాళాకోరుతనం. తెలంగాణలో ‘దిశ’ అనే యువతిపై జరిగిన దారుణ ‘హత్యాచారానికి’ సంబంధించి పోలీ సులు అప్పట్లో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. నింది తులు ఎదురుదాడి చేస్తే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్ జరగ్గానే పోలీసులకు అభినందనల వెల్లువ వచ్చింది. పోలీసు అధికారులపై జనం పూల వర్షం కురిపించారు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్న దంటే, ఆనాడు ఉన్న ప్రజల మూడ్ అది అని చెప్పడానికి. ‘దిశ’ కేసు చివరికి సుప్రీంకోర్టుకు చేరి ఏకంగా ఒక రిటైర్డ్ జస్టిస్ సిర్పూర్కర్ అధ్యక్షతన కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ నివేదిక సంచలనంగా మారింది. ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయా లని సిఫారసు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఈ కమిషన్ నివేదికను తరచి చూస్తే, ఎన్కౌంటర్ బూటకపుదే అన్న విషయం ఇట్టే అర్థం అవుతుంది. పోలీసులు తమ సాక్ష్యాలలో పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆయా క్రాస్ ఎగ్జామినేషన్లలో తేలికగా దొరికి పోవడం కనిపిస్తుంది. ఈ కేసు వ్యవహారం ఇంతవరకు వస్తుందని పోలీసులు అనుకుని ఉండకపోవచ్చు. పోలీసులే ఇలా తీర్పులు ఇచ్చేస్తే, కోర్టులు ఎందుకు? విచారణలు ఎందుకు? పోలీ సులు ఈ ఒక్క ఎన్‌కౌంటర్‌తోనే ఆపుతారా? వారు ఎవరిపైన అయినా కక్ష పూనితే ఇలాగే ఎన్కౌంటర్ చేస్తే ఏమిటి పరిస్థితి అన్న ప్రశ్న కూడా సహజంగానే తలెత్తింది. ఢిల్లీలో ‘నిర్భయ’ అనే యువతిని దారుణంగా కదిలే బస్సులో హింసించి అత్యాచారం చేసిన ఘటన దేశం అంతటినీ కుదిపివేసింది. అప్పటికప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తెచ్చింది. అయినా ఢిల్లీలో ఆ తర్వాత కూడా అనేక లైంగిక దాడి నేరాలు జరిగాయి. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కొన్ని ఘటనలు మొత్తం సమాజాన్ని కలవరపెట్టాయి. అక్కడ కూడా కొందరు ఎన్కౌంటర్ అయ్యారని చెబుతారు. ఎన్కౌంటర్లు ప్రధానంగా నక్సల్స్ హింసాకాండను అదుపు చేసే సందర్భంలో వ్యాప్తిలోకి వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1960వ దశకంలో నక్సలైట్లను అణచివేయడానికి జలగం వెంగళరావును హోం మంత్రిగా నియమించారని అనేవారు. ఆ తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నక్సల్బరీ ఉద్యమంలో శ్రీకాకుళం తదితర జిల్లాలలో పలువురు షావుకార్లను హతమార్చేవారు. ఒక గ్రామంలో అయితే ఒక వ్యాపారి తలను నరికి గ్రామ నడిబొడ్డున వేలాడదీసి భయానక వాతావరణం సృష్టించారు. గిరిజనులను దోపిడీ చేస్తున్నా రన్నది వారిపై ప్రధాన అభియోగం. నక్సల్స్ ఉద్య మంలో హింస పెరిగేకొద్దీ ఆ ఉద్యమం బలహీనపడుతూ వచ్చిందని చెప్పాలి. ఈ ఎన్కౌంటర్లపై 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఒక కమిషన్‌ను కూడా వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కాలంలో కూడా నక్సల్స్ దాడులు, పోలీస్ ఎన్కౌంటర్లతో ఉమ్మడి ఏపీలోని కొన్ని జిల్లాలు అట్టుడికి పోతుండేవి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్కౌంట ర్లలో పలువురు నక్సలైట్ నేతలు మరణించారు. బెంగళూరు నుంచి నలుగురు నక్సల్ నేతలను పట్టుకొచ్చి, జగిత్యాల ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణ అప్పట్లో వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ, ఒడిషా, ఏపీ సరిహద్దులలోనూ కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి. అంతకుముందు గద్దర్‌పై కొందరు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఆయన బతికి బయటపడ్డారు. ఇది పోలీసుల పనే నన్న ఆరోపణలు వచ్చాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తిరుమల అడవులలో ఇరవైమంది తమిళకూలీలు ఎన్కౌంటర్ అయ్యారు. ఆ కేసులో ఎందువల్ల న్యాయవ్యవస్థ ఇంత తీవ్రంగా స్పందించలేదో తెలియదు. ఇదంతా చరిత్ర. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి ఇలాంటి సీరియస్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. ఇంతకుముందు నయీమ్‌ను కూడా తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడు ప్రజల నైతిక మద్దతు లభించిందనే చెప్పాలి. దిశ హత్య తర్వాత ఏపీలో దిశ చట్టం తేవడంతో పాటు దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ వంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. దిశ యాప్‌ను మహిళలు కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపవలసి ఉంది. అందులో ఇరవై ఒక్క రోజులలో నిందితులకు శిక్షలు పడాలి లాంటి నిబంధనలు పెట్టారు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అక్కడక్కడా లైంగిక దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఆ మాటకు వస్తే ప్రపంచలోని అన్ని దేశాలలోనూ ఇలాంటివి ఉన్నాయి. రామాయణంలో రావణుడు ఒంటరిగా ఉన్న సీతమ్మవారిని అపహరించుకుపోవడం, భారతంలో ద్రౌపదిని భర్తల ముందే వస్త్రాప హరణ చేసి అవమానించడం, జరాసంధుడు వంటివారు ఇతర మహి ళలపై ఆకర్షణ పెంచుకుని, చివరికి మృత్యువు పాలవడం వంటివి అందరికీ తెలిసినవే. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు ఇలాంటి దాడులకు గురి అవుతూనే ఉన్నారు. అయితే మన దేశంలో ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడానికి ఆయా పార్టీలు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఇది సమాజంలో జరిగే వైపరీత్యంగా కాకుండా, అదేదో ప్రభుత్వమే దగ్గరుండి చేయించినట్లుగా ప్రతి పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఏపీలో అయితే ఇది మరీ శృతి మించి రాగాన పడినట్లుగా ప్రతిపక్షం, దానికి మద్దతు ఇచ్చే మీడియా విపరీత ప్రచారం చేస్తుంటాయి. స్త్రీలపై అవాకులు చవాకులు పేలేవారు కూడా మహిళోద్ధారకుల్లా మాట్లాడుతుంటారు. గతంలో లైంగికదాడి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వపరంగా ఏవైనా లోపాలు ఉంటే, లేదా పోలీసుల పాత్ర ఉందని అభియోగం వస్తే ప్రజలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున స్పందించేవారు. ఉదాహరణకు 1978 ప్రాంతంలో హైదరాబాద్‌లో ఒక పోలీస్ స్టేషన్లో ఒక మహిళ అమానుషానికి గురైనప్పుడు ఏపీ అంతా అట్టుడికిపోయింది. పలు చోట్ల కర్ఫ్యూలు కూడా పెట్టవలసి వచ్చింది. కానీ ఇప్పుడు రాజకీయం పులిమి ప్రత్యర్థులను బదనాం చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దానితో బాధితురాలికి న్యాయం జరగడం కష్టంగా మారుతోంది. నలభై ఏళ్ల సీనియర్ నేతగా ఉన్న ఒకాయన లైంగికదాడి బాధితురాలి వద్దకు వందమంది అను చరులను వెంటేసుకుని వెళ్లడం విమర్శలకు దారి తీసింది. వ్యక్తిగత నేరాలు వేరు. సమాజం లేదా ప్రభుత్వపరంగా జరిగే నేరాలు వేరు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. కానీ తమ రాజకీయ లబ్ధి కోసం అన్నిటినీ కలగాపులగం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న తాపత్ర యంతో మన నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్ల సమాజానికి నష్టం జరుగుతోంది. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే– చట్టం వేరు, ప్రజాభిప్రాయం వేరు. ఈ రెండింటికీ మధ్య సమన్వయం చేసుకుంటూ పోలీస్ వ్యవస్థ లేదా ప్రభుత్వం ముందుకు వెళ్లకపోతే సమస్యలను కొని తెచ్చుకు న్నట్లవుతుంది. అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందే. అదే సమయంలో ఇన్స్టంట్ జస్టిస్ పేరుతో ఎన్ కౌంటర్లు చేసుకుంటూ పోతే దానికి అంతం ఉండదన్న వాస్తవాన్ని కూడా గమనంలోకి తీసుకోవలసిన అవసరం ఉందని చెప్పాలి. వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ పోలీసులు చెబుతున్న ‘కట్టుకథ’ అని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. సుప్రీం కోర్టు కూడా ఎన్కౌంటర్ దోషులెవరనేది ఇప్పుడు రహస్యమేమీ కాదని పేర్కొంది. ‘దిశ’ నిందితుల్లో ముగ్గురు మైనర్ యువకులు. వాళ్ళు మైనర్లని సాధికారికంగా నిర్ధారణకు వచ్చాకనే పోలీసుల ఆరోపణలు ‘నమ్మశక్యం కానివి’గా కమిషన్ పేర్కొంది. అలా ఈ వ్యవహారంలో తప్పంతా పోలీసుల మీద పడుతోంది. అయితే యావత్ దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్ కట్టుకథలకు కేవలం పోలీసులను నిందించడం ఘోరమైన పాక్షిక వైఖరి అవుతుంది. అధికారంలో ఉన్నవారి అనుయాయుల ఎరుక లేకుండా పోలీసు యంత్రాంగం తనకు తానుగా తప్పుడు కేసులకు, ఇలాంటి ఎన్కౌంటర్లకు పాల్పడ్డానికి సాహసిస్తుందా? ‘‘భారతదేశంలో 1984–2020 మధ్య దేశ పోలీస్ యంత్రాంగం ప్రవర్తన మారలేదు. వృత్తి బాధ్యతల పరంగానూ, పోలీస్ యంత్రాంగాన్ని నిర్వహించే పాలకుల ఆచరణలోనూ మార్పు లేదు’’ – రిటైర్డ్ జడ్జి ఢీంగ్రా ‘‘చటాన్‌పల్లి (హైదరాబాద్ శివార్లు)లో ‘దిశ’ హత్య కేసులోని నలుగురు నిందితుల ఎన్కౌంటర్ ఓ కట్టుకథ. పిన్న వయస్సు యువకు లపై జరిగిన ఈ ఎన్కౌంటర్లో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తక్షణ న్యాయం కోసం పోలీసులు ఈ ఎన్కౌంటర్ జరపడం అనేది ఆమోదయోగ్యం కాదు. ఎన్కౌంటర్ జరి పిన పోలీసులపై చర్యలు తప్పనిసరి. హత్యానేరం కింద పోలీసులపై విచారణ చేయాల్సిందే.’’ – జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక (20.5.2022) ‘‘ఎన్కౌంటర్లో దోషులెవరో కమిషన్ గుర్తించింది. ఇందులో దాపరికమంటూ లేదు, కేసును ఇక తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది.’’ – సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటన (21.5.2022) ఈ సందర్భంగా ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైనది... జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సాధికార నివేదికను పొక్కనివ్వకుండా చూడమని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పదేపదే విజ్ఞప్తులు చేసుకోవడం. కానీ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ కమిషన్ నివేదికను తదుపరి చర్యలకు తెలంగాణ హైకోర్టుకు పంపించారు. అంతకుముందు పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ హత్యలపై సీబీఐ ప్రత్యేక విచారణను కోరుతూ పిటిషనర్ న్యాయవాది జి.ఎస్.మణి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని ఫలితంగానే 2019 డిసెంబర్లో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించాల్సి వచ్చింది. పిటిషనర్ న్యాయవాది మణి ‘మహిళలపై తరచుగా జరుగుతున్న హత్యలను నిరోధించడంలో విఫలమవుతున్న వైనాన్ని గుర్తించకుండా ఉండేందుకే పోలీసులు ఇలాంటి ఎన్కౌంటర్లకు బుద్ధిపూర్వకంగా తలపెడుతున్నారని పేర్కొ న్నారు. అందుకే సీబీఐనిగానీ, ప్రత్యేక విచారణ బృందాన్నిగానీ రంగంలోకి దించాలని కోరారు. ఈ విజ్ఞప్తులు అన్నింటి ఫలితంగానే సిర్పూర్కర్ కమిషన్ నియామకం జరిగింది. 14 మాసాలకు పైగా చటాన్‌పల్లి ఎన్కౌంటర్ భాగోతంపై పూర్తి విచారణ జరిపింది. చివరకు ‘ఈ ఎన్కౌంటర్ కట్టుకథ’ అని తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ... ఆ మాటకొస్తే యావత్తు దేశంలో జరుగుతున్న ‘ఎన్కౌంటర్’ కట్టు కథలకు కేవలం పోలీసులను మాత్రమే నిందించడం ఘోరమైన పాక్షిక వైఖరి అవుతుంది. ఎందుకంటే, ‘శివుడికి తెలియకుండా చీమైనా కుట్టద’న్న సామెత మనకు ఉగ్గుతో పోసిన పాఠం ఉండనే ఉంది కదా! అలాగే పాలనాధికారంలో ఉన్నవారి అనుయాయుల ఎరుక లేకుండా పోలీసు యంత్రాంగం తానుగా తప్పుడు కేసులకు, ఇలాంటి ఎన్కౌంటర్లకు పాల్పడ్డానికి సాహసిస్తుందా?! పాలకుల స్వార్థ ప్రయోజనాల్ని కనిపెట్టి, కాపు కాసుకుని ఉండే పోలీసు వర్గాలు మాత్రమే ఇలాంటి ఎన్కౌంటర్లకు సిద్ధమవుతాయి. ఈ చొరవనే ‘పిలవని పేరంటం’ అనేది! అసలు, సమాజంలో విచ్చలవిడిగా మహిళలపై రకరకాల హత్యలకు, అరాచకాలకు పాల్పడ్డానికి కారణం... భారత సామాజిక వ్యవస్థ అరాచక, దోపిడీ వ్యవస్థగా మారడం. ఫ్యూడల్ (భూస్వామిక) వ్యవస్థ పూర్తిగా కనుమరుగు కాకముందే మరింతగా ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష దోపిడీకి ‘గజ్జె’ కట్టిన కారణంగానే భారత సామాజిక స్థితిగతులు 75 ఏళ్ల తర్వాత కూడా అధోగతికి చేరుతూనే ఉన్నాయి. ఇది మనం మనం కళ్లారా చూస్తున్న దృశ్యమే. ఈ పరిస్థితికి జవాబుగానే ‘దిశ’ కేసు విచారణలో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ‘ఎదురుకాల్పుల నివారణకే ఎన్కౌంటర్ జరపాల్సి వచ్చిందన్న’ పోలీసు అధికారుల సాకును... నమ్మలేకనే ‘కట్టుకథ’గా నిర్ధారించవలసి వచ్చింది. ‘ఉగ్రవాదుల’ పేరిట జరిగే ఎదురు బొదురు కాల్పుల సంగతి వేరు. అది సమ ఉజ్జీల మధ్య ‘సమరశంఖం’ కావొచ్చు! కానీ ‘దిశ’ దారుణ హత్యకేసు పేరిట పోలీసులు జరిపిన ‘ఎన్కౌంటర్’ కేసు సందర్భంగా నిందితులెవరో జాతీయ స్థాయి కమిషన్ తేల్చి చెప్పింది. అందువల్లనే ఇంక అది ఏమాత్రం రహస్యం కాదని జస్టిస్ రమణ కూడా ప్రకటించాల్సి వచ్చింది. ‘రావలసిన తీర్పు ఎంతకాలం ఆలస్యమైతే, ఆ మేరకు కక్షిదారులకు అంతకాలం అన్యాయం జరిగినట్టే’ అని న్యాయ చట్టం ఘోషిస్తున్నా సరే, మనకు చలనం లేదు! మరొక విశేషమేమంటే మన దేశంలోనే ఒక భూమి తగాదాలో 108 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు రావడం చూశాం మనం! ఇప్పుడు తాజా కేసులోని ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్ యువకులు. వాళ్ల స్కూల్ రికార్డులను సైతం పరిశీలించి మరీ వాళ్లు మైనర్లని సాధికారికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే సిర్పూర్కర్ కమిషన్ పోలీసుల ఆరోపణలు ‘నమ్మశక్యం కానివి’గా తీర్పిచ్చింది! అలాగే, సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిరంగ పర్చకుండా రహస్యంగా కవర్లో పెట్టి కోర్టు వారు కింది కోర్టులకు పంపాలిగానీ, బహిరంగపరచ రాదనే వాదనను ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చడం ప్రశంసనీయం. అంతేకాదు, ప్రభుత్వం తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్... కమిషన్ నివేదికను బట్టబయలు చేస్తే న్యాయపాలనపై తీవ్రమైన ప్రభావం ఉంటుంద న్నారు. కాబట్టి ‘సీల్డ్ కవర్’లో పెట్టి పంపాలని వాదించారు. ఈ వాదనను కమిషన్ సభ్యురాలైన జస్టిస్ కోహ్లీ నిరాకరించారు. ఈ సమయంలోనే ప్రధాన న్యాయమూర్తి రమణ... ‘దేశ భద్రతకు ఏర్పడిన తీవ్ర ప్రమాదకర సన్నివేశం ఏదైనా ఉండి ఉంటే దాన్ని పరిశీలించవచ్చు. ఇది తెలంగాణ పోలీసు ఎన్కౌంటర్ కేసు కాబట్టి ‘సీల్డ్ కవర్’ రాజకీయం ఇక్కడ కుదరద’న్నారు! రక్తసిక్తమైన ఢిల్లీ పోలీసుల చేతులు, చేతల గురించి ప్రస్తావిస్తూ ‘ఢిల్లీ పోలీసులంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీసులని అర్థమ’ని సుప్రసిద్ధ భారత అభ్యుదయ, ప్రజాస్వామికవాద ‘కారవాన్’ పత్రిక సంపాదకుడైన ప్రభిజిత్ సింగ్ వ్యంగ్యీకరించడం(మే – 2022) ఇక్కడ ప్రస్తావనార్హం. ‘దిశ’ కేసులో ఉభయపక్షాల బాధితులూ మహిళలూ, కుటుం బాలే. కాబట్టి సజ్జనార్ నాయకత్వాన పోలీస్ ఎన్కౌంటర్లో హతులైన యువకుల వివరాలతో ప్రాథమిక కేసును నమోదు చేయా లని తెలంగాణ మహిళ, ట్రాన్స్‌జెండర్ సంస్థల సంయుక్త సంస్థ డిమాండ్ చేసింది. పోలీసులను (కమిషనర్ సజ్జనార్‌తో సహా) పేరు పేరునా పేర్కొంటూ కమిషన్ అభిశంసించిన అధికారులను అందరినీ అరెస్టు చేయాలని కోరింది. ఆ తర్వాతనే 2019 డిసెంబర్లో సుప్రీం కోర్టు కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. నేటి భారత మహిళల స్థితి గతుల్ని పరామర్శించుకుంటూ, సమీక్షించుకుంటూ... ఓ మహిళా మూర్తి ఆలోచనల్ని ఇక్కడి పేర్చుకుందాం. ‘‘వెలుగు రేకలు ప్రసరించని చీకటిలో ఏ ఉదయ కుసుమమూ విచ్చుకోదు నిరాశా నిస్పృహలను తరిమేసి / దిగంతాలను తాకి వచ్చే వేకువ పిట్టనొకదాన్ని ఈ భూగోళంపై వదలాలి విశ్వాసాన్ని కూడదీసుకోలేని జన కూడలిలో ఏ రేపటి పసితనమూ గుబాళించదు దురహంకారం మెడలు విరిచి – విశాల ప్రపంచాన్ని ఒడిసి పట్టుకునే గర్భాశయానికి ఏ నేలైనా తలవొంచి నిలబడాల్సిందే...’’ – వైష్ణవిశ్రీకి కృతజ్ఞతతో... ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించింది?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. అసలు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించిందనేది ఒకసారి చూద్దాం. పోలీసులు ఏం చెప్పారు? సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను సేఫ్ హౌజ్ నుంచి దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు ఉదయం 3గంటలకు సేఫ్ హౌజ్ నుంచి సంఘటనా స్థలానికి బయల్దేరిన పోలీసులు TS 09 PB 4760 మినీ బస్సులో నిందితులను సేఫ్ హౌజ్ నుంచి దిశను చంపిన స్థలానికి తరలించారు ఉదయం 4.30గంటలకు చింతపల్లికి చేరుకున్న పోలీసులు ఇంకా చీకటిగా ఉండటంతో 5.30గంటల వరకు బస్సులోనే కూర్చున్న పోలీసులు పోలీసులు చెప్పిన దాంట్లో భిన్న వాదనలేంటీ? సంఘటన సమయంలో ఉన్న పోలీసులు ఒక్కొక్కరు ఒక్కో సమయం చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేసిన కమిషన్ రాత్రి 11గంటలకే శంకర్‌పల్లిలో నిందితులను ఉంచిన సేఫ్హౌజ్కు బస్ చేరుకున్నట్లు లాగ్‌బుక్‌లో నమోదు ప్రయాణానికి రెండు గంటలు పట్టిందని కొందరు పోలీసులు... గంటలోనే 65కిలోమీటర్లు ప్రయాణించామని కొందరి వాంగ్మూలం జాతీయ మానవహక్కుల సంఘం ముందు ఇచ్చిన వాంగ్మూలానికి... కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా కమిషన్ ముందు పోలీసులు చెప్పిందేంటీ? ఉదయం 5.45నిమిషాలకు బస్సులోంచి దిగి క్రైం సీన్లోకి ఎంటరైన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు 4నిందితులతో పాటు వెళ్లిన 10మంది పోలీసులు ఇద్దరు పంచులు సంఘటన స్థలానికి చేరుకున్న తరువాత చింతపల్లి బ్రిడ్జి వద్ద పరిశీలన చేసిన అధికారులు దిశ మృతదేహం లభించిన ప్రాంతం నుంచి తూర్పున 50అడుగుల దూరంలో ఉన్న పొలాల వైపు వెళ్లిన పోలీసులు నిందితులు దశను హత్యచేసిన తరువాత పొలాల వైపు వెళ్లారని అందుకే... పొలాల్లోకి తీసుకెళ్లామంటున్న పోలీసులు నిందితులు పొలాల్లో మారణాయుధాలు దాచినట్లు పోలీసుల అనుమానం పోలీసులు చెప్పినదానిపై కమిషన్ అనుమానాలేంటీ? పోలీసులు పొలాల్లోకి వెల్లేందుకు అక్కడున్న గేట్ ద్వారా వెళ్లారా లేక... ఫెన్సింగ్ తొలగించారా అనే విషయంపై స్పష్టత లేదు ఇక పొలాల్లోకి వెల్తున్న సమయంలో ఒకరి వెంట ఒకరు సింగిల్ ఫార్మేషన్లో వెళ్లినట్లు వాంగ్మూలం ఇచ్చిన పోలీసులు దాదాపు 300మీటర్లు నడిచిన తరువాత అక్కడ ఉన్న హైటెన్షన్ పోల్ వద్ద ఆగిన పోలీసులు తెల్లవారు జామున మంచు కురుస్తుండటంతో 30ఫీట్ల దూరంలో ఉన్న వ్యక్తి కూడా సరిగా కనిపించని పరిస్థితి నెలకొని ఉంది ఘటనా స్థలంలో ఏం జరిగింది? పోలీసులు కమిషన్‌కు ఏం చెప్పారు? హైటెన్షన్ పోల్ దగ్గర దిశను హత్య చేసిన తరువాత ఆమె వస్తువులను దాచినట్లు చెప్పిన నిందితులు పోల్ దగ్గరకు చేరుకున్న తరువాత అక్కడ తప్పి వస్తువులు తీసేందుకు పోలీసుల యత్నం అదే సమయంలో వంగి తవ్వుతున్న కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కున్న నిందితుడు వెంటనే మిగిలిన నిందితులు పరగెత్తండిరా అంటూ గట్టిగా అరుస్తూ పోలీసుల కళ్లలోకి మట్టి విసిరాడు ఇంతలో మరో ఇద్దరు నిందితులు పోలీసులపైకి రాల్లు రువ్వుతూ పొలాల్లోకి పరిగెత్తారు తుపాకి లాక్కున్న నిందితుడు పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు... పోలీసులు లొంగిపోవాలంటూ అరుస్తున్నా... నిందితుడు కాల్పులు జరుపుతూ పొలాల్లోకి పరుగెత్తాడు ప్రాణ రక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసుల వాంగ్మూలం కాల్పులు ప్రారంభమైన 5నిమిషాల తరువాత 4గురు నిందితులు బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే చనిపోయినట్లు గుర్తింపు కమిషన్ అనుమానాలేంటీ? దిశను హత్యచేసి ఆమె వస్తువులు హైటెన్షన్ పోల్ వద్ద దాచినట్లు గుర్తించామని చెప్పిన పోలీసులు దిశ వస్తువులు వెలికి తీసేందుకే సంఘటనా స్థలానికి వెల్లినట్లు పోలీసుల నివేదిక\ సంఘటనా స్థలంలో దొరికిన దిశా వస్తువులపై నిందితుల ఆనవాళ్లు, వేలి ముద్రలు లేవని గుర్తించిన కమిషన్ సంఘటన 6.15జరిగినట్లు ఎఫ్ఐఆర్ కాని పోలీసుల వాంగ్మూలం ప్రకారం 6.30వరకు బతికే ఉన్న నిందితులు మంచు కారణంగా 20అడుగులు కూడా చూడలేని పరిస్థితి ఉందని కొందరు పోలీసుల వాంగ్మూలం లేదు మంచి విజిబులిటి ఉందని మరికొందరు పోలీసుల వాంగ్మూలం కళ్లలోకి మట్టికొట్టి నిందితులు పారిపోయారన్న విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదు... కళ్లలోకి మట్టి కొట్టిన విషయంపైనా పోలీసుల వాంగ్మూలంలో భిన్న వాదనలు పోలీసులకు తగిలినా గాయాలపైనా అనుమానాలు... ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు నివేదిక పోలీసులు ఇచ్చిన నివేదికలో ముగ్గురు సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు వెళ్లడి కాని ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన నివేదికలో చిన్న చిన్న గాయాలున్నట్లు గుర్తింపు గాయపడిన వారిని అక్కడ ఉన్న పోలీసులే ప్రాథమిక చికిత్స చేసినట్లు వాంగ్మూలం ఇచ్చిన కానిస్టేబుళ్లు గాయపడ్డవారిని అక్కడే ఉన్న బస్సులో ఆసుపత్రికి తరలించకపోవడంపై అనుమానాలు ఆంబులెన్స్ వచ్చినా వారు గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయలేదు... కనీసం వారెవరో అంబులెన్స్ సిబ్బందికి చూపెట్టలేదు ఘటనా స్థలంలో జరిగిన దానిపై కమిషన్‌కు పోలీసులు ఏం చెప్పారు? చింతపల్లికి చేరుకున్న సమయంలో తన పిస్టల్ మ్యాగజీన్ మోడ్‌లో ఉందన్న కానిస్టేబుల్ మ్యాగజీన్ మోడ్‌లో ఉన్న పిస్టల్‌ను కాక్ చేస్తే బుల్లెట్ ఫైరింగ్ చాంబర్లోకి వస్తుంది చాంబర్ మోడ్‌లో ఉన్నప్పుడే తుపాకి ట్రిగ్గర్ నొక్కితే అది పేలుతుంది. అయితే తుపాకి కాక్ చేశాక... చాంబర్ మోడ్‌లో ఉన్నప్పుడు తప్పకుండా సేఫ్టీ పిన్ ఆన్ చేయాలి కాని తన పిస్టల్‌ను కాక్ చేయలేదన్న పోలీస్ అధికారి ఘటనా స్థలంలో జరిగిన దానిపై కమిషన్ అభ్యంతరాలు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారా అన్న విషయంపైనా అనుమానాలు తుపాకి లాక్కునే సమయంలో తుపాకి పెట్టే పౌచ్ చినిగిపోయిందా... అది డెడ్‌బాడి దగ్గర ఎందుకు లేదు? తుపాకి లాక్కుని నిందితులు కాల్పులు జరిపిన తరువాత తుపాకి ఎవరు స్వాధీనం చేసుకున్నారు? తుపాకి పౌచ్ డెడ్‌బాడీకి 22ఫీట్ల దూరంలో దొరికిందన్న పోలీసు అధికారి పౌచ్ కేవలం 5ఫీట్ల దూరంలో దొరికిందన్న మరో పోలీస్ అధికారి బలవంతంగా తుపాకీ లాక్కున్న పౌచ్‌కు ఏమీ కాకపోవడం అనుమానాస్పదంగా లేదా? GSR (గన్ షాట్ రెసిడ్యుయరీ)పై కమిషన్ అభ్యంతరాలు నిందితుల చేతుల నుంచి తుపాకీ కాల్చిన ఆనవాళ్లు కలెక్ట్ చేయడంలోనూ అనుమానాలు నిందితుల కుడి చేతికి గన్ షాట్ రెసిడ్యుయల్ ఉందని గుర్తించిన ఫొరెన్సిక్ నిపుణులు వారి ఎడమచేతిలో ఎలాంటి జిఎస్ఆర్ దొరకలేదన్న ఫొరెన్సిక్ నిపుణులు జీఎస్అర్లో తప్పకుండా ఉండాల్సిన అంటిమోని, బోరియం, లెడ్ మూలకాలు నిందితుల చేతుల నుంచి తీసిన సాంపుల్స్‌లో లభించలేదు కేవలం నైట్రైట్స్ మాత్రమే వారి వద్ద సేకరించిన శాంపిల్స్‌లో లభించాయి. ఎవరైనా చనిపోయిన తరువాత వారి చేతిలో తుపాకి పెట్టి ఉండొచ్చు. చనిపోయిన వ్యక్తి చేతికి నైట్రైట్స్ రాసి ఉండొచ్చు... చనిపోయిన వ్యక్తి చేతిలో తుపాకి పెట్టి కాల్చి ఉండొచ్చు కాల్పులు జరిపిన విధానంపై పోలీసులు ఏం చెప్పారు? కాల్చకండి కాల్చకండి..లొంగిపోండి అంటూ మూడుసార్లు అరిచిన పోలీసు అధికారి పారిపోతూ నిందితులు కాల్పులు జరిపారు... అటు వైపే పోలీసులు కాల్పులు జరిపారు మంచు వల్ల మనిషి కనబడకపోయినా శబ్దం ఆధారంగా కాల్పులు జరిపినట్లు చెప్పిన పోలీసులు ఎలాంటి కాల్పులు జరపని జల్లు శివ,జల్లు నవీన్‌కు ముందు భాగంలో బుల్లెట్లు తగిలాయి కమిషన్ అనుమానాలు పోలీసులు ఎందుకు గాల్లోకి కాల్పులు జరపలేదు? ఎందుకు పారిపోతున్న నిందితుల కాళ్లపైకి కాల్పులు జరపలేదు? పోలీసులు తూటాలు నిందితుల ముందుభాగం నుంచి వెనక్కి వెళ్లినట్లు ఆనవాళ్లు పారిపోతున్న వారిపై వెనక నుంచి కాల్పులు జరిపితే వారికి ముందు భాగంలో గాయాలెలా అయ్యాయి? ఎవరెవరికి ఎక్కడ గాయాలయ్యాయి? మహమ్మద్ ఆరిఫ్ 1. దవడ కింద భాగంలో ఒకటిన్నర సెంటీమీటర్ల బెల్లెట్ ఎంట్రీ గాయం... మెడ వెనక నుంచి దాదాపు 3సెంటీమీటర్ల గాయంతో బయటకు వెళ్లిపోయిన బుల్లెట్ 2.ఛాతి కుడిభాగంలో మరో బుల్లెట్ గాయం... 3.ఛాతి మధ్యభాగంలో మరో బుల్లెట్ గాయం... 4.పొత్తి కడుపులో మరో బుల్లెట్ జొల్లు శివ 1.పొత్తి కడుపులో కుడివైపున చొచ్చుకెల్లిన బుల్లెట్ 2. ఛాతి భాగంలో ఎడమవైపున దూసుకెళ్లిన బుల్లెట్ 3. ఛాతీ భాగంలో ఎడమవైపున దిగువన మూడో బుల్లెట్ జొల్లు నవీన్ 1. ఛాతీలోకి దూసుకెల్లిన బుల్లెట్ 2. తలలోకి దూసుకెల్లిన బుల్లెట్ చింతకుంట చెన్నకేశవులు 1. గొంతులోకి దూసుకెల్లిన బుల్లెట్ పోలీసుల కాల్‌డేటా రికార్డుల్లో ఏముంది? మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవుల చేతుల్లో రెండు 9mm పిస్టల్లు లభ్యం 9ఎంఎం పిస్టల్‌కు సంబంధించిన 10ఎంప్టీ కాంట్రిడ్జెస్ ఎస్ఎల్ఆర్ తుపాకికి సంబందించిన 3ఎంప్టీ కాంట్రిడ్జెస్ ఏకే-47కు చెందిన 6ఎంప్టీ కాంట్రిడ్జెస్ లభ్యం కమిషన్ ముందు డ్రైవర్ ఏం చెప్పారు? తాను బస్సులో పడుకుని ఉండగా తుపాకుల శబ్దం వినిపించిందన్న డ్రైవర్ అయితే బయట చీకటి, పొగమంచు ఉండటంతో తనకేమి కనబడలేదన్న డ్రైవర్ -
చటాన్ పల్లి మిస్టరీ..!
-
‘దిశ’ఎన్కౌంటర్: ఆ పోలీసులకు శిక్ష పడాల్సిందే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మక్తల్: దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ ముమ్మాటికీ బూటకమని, పోలీసులు ముందస్తు ప్లాన్ ప్రకారమే అంతమొందించారని.. ఇదే విషయాన్ని సిర్పూర్కర్ కమిషన్ నివేదించిందని మృతుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందన్నారు. ఇప్పుడు హైకోర్టులో కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. తమవారిని చంపిన వారికి కూడా తగిన శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ ఎన్‌కౌంటర్‌తో తమ కుటుంబాలు బజారున పడ్డాయని వాపోయారు. సర్కారు ఇప్పటివరకు చేసిందేమీ లేదని, తమకు న్యాయం చేయడంతోపాటు ఆదుకోవాలని వేడుకున్నారు. ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు మాకున్న ఒక్క కొడుకును బూటకపు ఎన్కౌంటర్లో చం పారు. ఆ పోలీసులకు కూడా కఠినశిక్ష పడినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. మూడేళ్లుగా అష్టకష్టాలు పడుతున్నాం. రోజు కూలికి వెళితేనే బతుకు. ముసలితనంలో కష్టాలు భరించలేకపోతున్నాం. మాకు భూమి లేదు. ప్రభుత్వం నుంచి కనీసం పింఛన్ రాలేదు. మా ఇంటికి ఎవరైనా రావాలంటే కూడా భయపడుతున్నారు. ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. –మహ్మద్ మౌలాన్‌బీ, హుస్సేన్, ఆరిఫ్ తల్లిదండ్రులు, జక్లేర్, నారాయణపేట జిల్లా మమ్మల్ని ఆదుకునేవారే లేరు.. మాకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు గొర్రెల కాపరిగా పనిచేస్తుండేవాడు. ఆ డబ్బుతో బతుకు గడిచేది. కొడుకు చనిపోయినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికంగా చితికిపోయాం. మమ్మల్ని ఆదుకునేవారే కరువయ్యారు. గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకుంటున్నాం. ఎవరైనా దయతలచి డబ్బులిస్తే వాటితో కాలం వెళ్లదీస్తున్నాం. మా కుటుంబాన్ని ఆగం చేసిన పోలీసులకు శిక్ష పడాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. – జొల్లు మణెమ్మ, రాజప్ప, ఎన్కౌంటర్ మృతుడు జొల్లు శివ తల్లిదండ్రులు, గుడిగండ్ల వారికి శిక్ష పడితేనే.. పోలీసుల వల్లే నా కుటుంబం బజారున పడింది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్తను కిరాతకంగా చంపేశారు. మూడు నెలల తర్వాత నాకు బిడ్డ పుట్టింది. నా బిడ్డకు తండ్రి లేకుండా చేశారు. ఏ పోలీసులు అయితే బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారో.. వారిని కూడా కిరాతకంగా చంపాలి. వారికి శిక్ష పడితేనే నా కుటుంబానికి న్యాయం జరిగినట్లు. ఈ నమ్మకం నాకుంది. – రేణుక, ఎన్కౌంటర్ మృతుడు చెన్నకేశవులు భార్య, గుడిగండ్ల, మక్తల్, నారాయణపేట మాకు ఎవరు దిక్కు? నాకున్న ఒక్క కొడుకును పోలీసులు పొట్టనబెట్టుకున్నారు. తర్వాత రెండు నెలలకే నా భర్త కురుమయ్య చనిపోయాడు. మా కుటుంబానికి ఎవరూ దిక్కు లేకుండా అయింది. నేను, నా కోడలు కలిసి కూలీనాలి చేసుకుని బతుకుతున్నాం. ఎవరికేం చెప్పినా మాకు ఒరిగేదేమీ లేదు. అంతా దేవుడిపైనే భారం. – జయమ్మ, ఎన్కౌంటర్ మృతుడు చెన్నకేశవులు తల్లి, గుడిగండ్ల, మక్తల్, నారాయణపేట జిల్లా పోలీసులకూ అదే శిక్ష పడాలి నా భర్త గతంలోనే కన్నుమూశాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును పోలీసులు బలితీసుకున్నారు. ఏకాకిని అయిపోయిన. కూలీనాలి చేసుకుని బతుకుతున్నా. నా కొడుకుకు ఏదైనా శిక్ష పడి ఉన్నా కళ్లతో చూసుకునే దాన్ని. నా కొడుక్కు వేసిన శిక్షనే ఈ ఘాతుకానికి పాల్పడిన పోలీసులకు కూడా వేయాలి. – జొల్లు లక్ష్మి, ఎన్కౌంటర్ మృతుడు నవీన్ తల్లి, గుడిగండ్ల, మక్తల్, నారాయణపేట జిల్లా -
పోలీసులది కట్టుకథ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు..!!
-
సిర్పూర్కర్ కమీషన్ నివేదికలో షాకింగ్ నిజాలు..!!
-
దిశ ఎన్ కౌంటర్ తర్వాత హత్యచారాలు ఆగాయా ?? పోలీసులకు గుణపాఠం
-
దిశ ఎన్ కౌంటర్ కేసులో లాయర్ సంచలన నిజాలు..!!
-
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం
-
దిశ కేసు హైకోర్టుకు బదిలీ
-
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్...కట్టుకథే..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న పది మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేయాలని తమ నివేదికలో సిఫార్సు చేసింది. కమిషన్ జనవరి 28నే సీల్డు కవర్లో 387 పేజీల సుదీర్ఘ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయగా.. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ సెక్రటేరియట్ శుక్రవారం ఈ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్ తమ నివేదికలో ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన అంశాలతోపాటు 15 సాధారణ సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. నివేదికలో కమిషన్ పేర్కొన్న అంశాలివీ.. ‘‘పోలీసులపై దాడి కట్టుకథ! పోలీసు అధికారి సైదుపల్లి అరవింద్ గౌడ్‌ను జొల్లు శివ కర్రతో.. మరో పోలీసు అధికారి కె.వెంకటేశ్వర్లును జొల్లు నవీన్ రాళ్లతో కొట్టారని పోలీసుల రిపోర్టులో ఉంది. గాయాలైన పోలీసులను షాద్‌నగర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి కేర్ ఆస్పత్రికి తరలించినట్టు ఉంది. కానీ పోలీసు సిబ్బంది మెడికల్ రికార్డులో, మెడికో లీగల్ సర్టిఫికెట్లో వేర్వేరుగా గాయాల వివరాలున్నాయి. ఒక డాక్యుమెంట్లో వారిని కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంటే.. మరోదానిలో ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంది. కేర్ ఆస్పత్రిలో చికిత్స విషయానికొస్తే.. ఒరిజినల్ రికార్డులన్నీ సిట్‌కు ఇచ్చారు. కానీ కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టలేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్ కూడా ప్రవేశపెట్టలేదు. నుదుటికి గాయమైన పోలీసుకు సంబంధించి ఒకచోట కుడివైపు అని, మరోచోట ఎడమవైపు అని రాశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయనేది, వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారనేది అబద్ధం. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు అపహరించారనేది కట్టుకథ, నమ్మశక్యం కానిది. తుపాకీలను అపహరించారనడానికి ఆధారాలను రూపొందించారు. ఇద్దరు అధికారుల నుంచి తుపాకీలు అపహరించారని ఒకసారి.. ఒక అధికారి నుంచే అపహరించారని పోలీసుల తరఫు సాక్షి వేర్వేరుగా చెప్పారు. నిందితులు కాల్పులు జరిపే అవకాశమే లేదు పోలీసుల నుంచి నిందితులు తుపాకీ అపహరించారనే అంశంలోనూ అనుమానాలు ఉన్నాయి. పోలీసు బెల్టుకు ఉండే పౌచ్ బటన్ తీసి 9ఎంఎం పిస్టల్ ఎలా అపహరించగలిగారు? నిందితులకు ఆయుధాల నిర్వహణ తెలుసనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ సమయంలో సదరు పిస్టల్‌ను ఎలా నిర్వహిస్తారనేది అధికారులు చూపారు. ఆ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. తుపాకీలను ఉపయోగించడం తెలియని వ్యక్తి అంత సులభంగా వాడటం చాలా కష్టం. నిందితులు వాటిని వాడటం సాధ్యం కాదు. తుపాకీలో మేగజీన్ (బుల్లెట్లు ఉండే చాంబర్) లోడ్ పొజిషన్లో ఉందని అధికారులు చెప్తున్నారు. తుపాకీ కాల్చాలంటే పైభాగాన ఉన్న స్లయిడ్‌ను లాగడం ద్వారా చాంబర్లోకి బుల్లెట్ క్యాట్రిడ్జ్ వెళ్లేలా చేయాలి. సేఫ్టీ స్విచ్ ఎక్కడ అనేది సూచించే ఆధారాలు రికార్డుల్లో లేవు. శిక్షణ లేని వ్యక్తి సేఫ్టీ స్విచ్‌ను గుర్తించి తుపాకీ కాల్చడం సాధ్యం కాదని బాలిస్టిక్ నిపుణులు చెప్తున్నారు. నిందితులు ఆయుధాలు లాక్కొని వెంటనే కాల్పులు ప్రారంభించారన్న పోలీసుల ఆరోపణలు ఊహకు కూడా అందడం లేదు. పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారా? ఆత్మరక్షణ కోసమా? నిందితులను పట్టుకోవడానికి ప్రతీకార కాల్పులు ప్రారంభించారా అనేది అస్పష్టంగా ఉంది. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారనేది తేలలేదు. కాల్పులు నిజంగానే జరిగాయని చెప్తుండటంపై అనుమానం తలెత్తుతోంది. మృతి చెందిన నలుగురి మొండెం, తలపై తుపాకీ గాయాలున్నాయి. అవి పరిశీలిస్తే పోలీసులు స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్టుగా విశ్వసించాల్సి వస్తోంది. ఎన్నో అంశాల్లో వ్యత్యాసాలు.. ఘటన ప్రాంతానికి సంబంధించి కొన్ని వీడియో ఫుటేజీలు కమిటీకి అందాయి. అవి ఒక ఆర్డర్లో లేవు. పైగా నిడివి తక్కువగా ఉన్న క్లిప్పింగ్‌లు. అవి ప్రాథమిక ఫుటేజీ నుంచి సేకరించినట్టుగా ఉన్నాయి. కమిషన్ ముందు పూర్తి ఫుటేజీ ఎందుకు ప్రవేశపెట్టలేదో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. సెక్షన్ 161 సీఆర్పీసీ కింద ఒకే సాక్షి వాంగ్మూలాన్ని పదేపదే ఎందుకు సేకరించారో కూడా చెప్పలేదు. మృతదేహాలను తరలించిన బస్సుకు సంబంధించి పలు లాగ్‌బుక్స్ ఉన్న అంశంపైనా సమాధానం లేదు. గాయపడిన పోలీసులకు సంబంధించి ఆస్పత్రిలో రికార్డు లేకపోవడం, ఖాళీ అయిన బుల్లెట్ క్యాట్రిడ్జ్‌లు అన్నీ తిరిగి సేకరించకలేకపోవడం, ఘటనాస్థలం నుంచి కాల్చి న బుల్లెట్లనూ సేకరించలేకపోవడం వంటివాటిని కేవలం దర్యాప్తులో లోపాలుగా చెప్పలేం. మృతదేహాలు, ఇతర వస్తువుల స్థానాల్లో కీలక తేడాలు, విచారణ నివేదికలు, క్రైం సీన్ పంచనామాల్లో వ్యత్యాసాలు చూస్తుంటే పోలీసుల వాదన నమ్మశక్యం కాదని నిర్ధారణ అవుతోంది. కస్టడీ అనుమతిలోనూ చట్ట ఉల్లంఘన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించే సమయంలోనూ తీవ్రమైన చట్ట ఉల్లంఘన జరిగినట్టు తేలింది. ఎలాంటి పత్రాలను పరిశీలించకుండానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ముందు ప్రొసీడింగ్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గానీ, పోలీసు అధికారిగానీ లేరు. ఏసీపీ వి.సురేందర్ స్థానంలో ఓ కానిస్టేబుల్ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా అజ్మల్ కసబ్ కేసులో సుప్రీంకోర్టు చేసిన సూచనలను గుర్తుంచుకోవాలి. బెయిల్ కోసం దరఖాస్తు/పోలీసు రిమాండ్‌ను వ్యతిరేకించడం/జ్యుడీషియల్ కస్టడీని వ్యతిరేకించడం వంటి అంశాల్లో నిందితులకు న్యాయ సలహా అవసరం. ఘటన నాటికి ముగ్గురూ మైనర్లే.. జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ముగ్గురూ మైనర్లు.. పాఠశాల రికార్డులను పరిశీలించినప్పటికీ పోలీసులు వారి వయసును నమోదు చేయలేదు. మరణించే నాటికి ముగ్గురు మైనర్లేనని వారి బంధువులు కూడా పేర్కొన్నారు. ఆధార్ కార్డుల్లోనూ వారి పుట్టిన సంవత్సరం 2001గా నమోదై ఉంది. ఆధార్‌కార్డు పుట్టినతేదీకి అధికారిక రుజువు కాదు. ఈ నేపథ్యంలో పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్లో నమోదు చేసిన విధంగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం ప్రాథమిక పత్రంగా ఉండాల్సింది.’’ నిందితులను చంపే ఉద్దేశంతోనే.. రికార్డుల్లోని అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం.. నిందితులు 6.12.2019 నాటి ఘటనలో ఆయుధాలను లాక్కోవడం, కస్టడీ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయడం, పోలీసులపై దాడి, కాల్పులు జరపడం వంటివి చేయలేదని నిర్ధారించాం. రెండో విషయం ఏమిటంటే నిందితులు 9ఎంఎం పిస్టల్‌తో కాల్చడమనే సందర్భమే తలెత్తలేదు. నిందితులంతా బుల్లెట్ల గాయాల కారణంగానే మరణించారు. వారిపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపిన పోలీసు అధికారుల చర్యలను సమర్థించడానికి వీల్లేదు. షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవిలను 302 ఐపీసీ కింద విచారణ చేయాలి. ఈ అధికారులు ఐపీసీ సెక్షన్ 76, సెక్షన్ 300 ఐపీసీ (3) నుంచి మినహాయింపు పొందలేరు. ఎందుకంటే వారు నిందితులపై కావాలనే కాల్పులు జరిపారనే వాదన నమ్మదగినది. దీని ప్రకారం.. వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్.. ఈ పది మందినీ కూడా ‘సెక్షన్ 302 రెడ్ విత్ 34 ఐపీసీ, 201 రెడ్ విత్ 302 ఐపీసీ, 34 ఐపీసీ’ల కింద విచారించాలి. వేర్వేరు చర్యలు చేసినప్పటికీ నిందితులను చంపాలనే ఉద్దేశంతోనే వారు ఉన్నారు. ఆ పది మంది పోలీసులు కూడా నలుగురు నిందితులను సురక్షితంగా ఉంచే బాధ్యత కలిగిన వారే. ఏవైనా చర్యలు లేదా లోపాలు ద్వారా ఆ బాధ్యతలో విఫలమైతే.. నిందితుల మృతి పట్ల ఉమ్మడి ఉద్దేశం ఉన్నట్టుగానే భావించాలి. అంతేకాదు ఎన్కౌంటర్ తర్వాత రికార్డులు తారుమారు చేయడంలో వారి ప్రవర్తన, నిందితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన తీరు చూస్తే వారి ఉమ్మడి ఉద్దేశం స్పష్టమవుతోంది. మాబ్ లించింగ్ (మూక దాడి) ఆమోదయోగ్యం కాదు. అదే విధంగా తక్షణ న్యాయం వంటి ఆలోచన కూడా ఆమోదయోగ్యం కాదు. ఏ సమయంలోనైనా చట్టం నియమాలు బలంగా ఉండాలి. నేరానికి శిక్ష అనేది చట్టం ఏర్పాటు చేసిన విధానం ద్వారానే ఉండాలి. పోలీసులకు బాడీ కెమెరాలు పెట్టాలి విచారణ సమయంలో గమనించిన అంశాల మేరకు పలు సాధారణ సిఫార్సులు చేయాల ని నిర్ణయించినట్టు కమిషన్ నివేదికలో పే ర్కొంది. ఈ మేరకు 15 సిఫార్సులు చేసింది. ∙మహిళలు, చిన్నారులపై దాడులకు సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ∙ శాంతిభద్రతల నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలి. ∙అరెస్టు సమయంలో రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను తప్పనిసరిగా పాటించాలి. ∙దర్యాప్తు మొత్తం వీడియో రికార్డు చేయాలి. ∙ పోలీసుల శరీరానికి కెమెరాలు పెట్టాలి. ∙ అన్ని కేసుల్లోనూ సీసీ టీవీ ఫుటేజీని తప్పనిసరిగా సేకరించాలి. ∙సాక్షుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. ∙క్రైం సీన్‌పై ఫోరెన్సిక్ నిపుణులకు పూర్తి బాధ్యత అప్పగించాలి. ∙అన్ని ఫోరెన్సిక్ ఆధారాలను వరుస క్రమంలో భద్రపర్చాలి. ∙ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిర్వహించడాన్ని నివారించాలి. ∙పోలీసు కస్టడీకి దరఖాస్తు చేసిన ప్రతీసారి నిందితుడిని హాజరుపర్చేలా మేజిస్ట్రేట్ ఆదేశించడాన్ని తప్పనిసరి చేయాలి. ∙పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నిందితులకు నోటీసులు జారీ చేయాలి. ∙ సెక్షన్ 176(1–ఏ) కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 కింద మేజిస్టీరియల్ విచారణ చేయాలి. ∙దర్యాప్తునకు సంబంధించిన పోలీసులు మీడియా సమావేశాలు నిర్వహించాలి. ∙అసత్య సాక్ష్యాలకు సంబంధించి చర్యలను సరళీకృతం చేయాలి. ఇది కూడా చదవండి: దిశ కేసు హైకోర్టుకు బదిలీ -
దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దోషులెవరో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ గుర్తించిందని, ఇందులో దాపరికానికి తావులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ఏం చర్యలు చేపట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టుకే అప్పగిస్తున్నట్టు తెలిపింది. నివేదిక సాఫ్ట్ కాపీలను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ పంపాలని కమిషన్ సెక్రటేరియట్‌ను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తామని.. నివేదికపై అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పుకొనే స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపింది. ఆయా అభిప్రాయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో ఈ విచారణను ముగిస్తున్నామని ప్రకటించింది. నివేదికపై గోప్యత అవసరమేంటి? దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల బంధువులు, న్యాయవాది జీఎస్ మణి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. కేసు తీవ్రత దృష్ట్యా సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సీల్డు కవర్లోనే ఉంచాలని, బహిర్గతం చేసేందుకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిర్గతం చేయకూడదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో కొన్ని కేసుల్లో నివేదికలను సీల్డు కవర్లోనే ఉంచిందని దివాన్ గుర్తుచేయగా.. ‘‘ఏదైనా దేశ భద్రతకు సంబంధించిన అంశాలుంటే పరిశీలిస్తాం. కానీ ఇది ఎన్కౌంటర్ కేసు. కమిటీ నివేదిక ఇచ్చింది. అంతిమంగా ముగింపు ఉండాలి కదా.. నివేదికను చూడకుండా మీరు వాదించలేరు కదా.. కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. అలాంటిది గోప్యత అవసరం ఏముంది?’’ అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేసు రోజువారీ విచారణ సుప్రీంకోర్టులో సాధ్యం కాదని, కమిషన్ నివేదిక అనంతరం చర్యలు ఏమిటనే ప్రశ్న కూడా ఉందని గుర్తుచేశారు. ఇక సుప్రీంనియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచరాదో చెప్పాలని జస్టిస్ హిమా కోహ్లి ప్రశ్నించారు. నివేదికను సీల్డు కవర్లోనే ఉంచాలని శ్యాం దివాన్ మరోసారి అభ్యర్థించినా జస్టిస్ ఎన్వీ రమణ తిరస్కరించారు. దేశంలో ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కేసును పర్యవేక్షించలేం కాబట్టి హైకోర్టుకు తిరిగి పంపాల్సి ఉంటుంది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ వివరణాత్మక నివేదిక సమర్పించింది. అయితే సరైన చర్య ఏమిటన్నదే ప్రశ్నగా ఉంది. కమిషన్ కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఈ కేసును హైకోర్టుకు పంపుతాం’’ అని పేర్కొంటూ విచారణను ముగించారు. నిష్పక్షపాతంగా నివేదిక సిర్పూర్కర్ కమిషన్ నివేదిక నిష్పక్ష పాతంగా ఉంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించింది. నివేదిక అంశాలను చూస్తే బాధిత కుటుంబాలకు సగం న్యాయం అందినట్టే ఉంది. హైకోర్టు మీద నమ్మకంతో పూర్తి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – పీవీ కృష్ణమాచారి, మృతుల కుటుంబాల తరఫు న్యాయవాది, ఇండిపెండెంట్ కౌన్సిల్ నిందితుల కుటుంబాలకుసమాచారమే లేదు శుక్రవారం సుప్రీంకోర్టులో దిశ కేసు విచారణ జరగనుందన్న విషయంపై తమకు సమాచారం లేదని నిందితుల కుటుంబ సభ్యులుతెలిపారు. మరోవైపు దిశ కేసు విచారణ పూర్తయ్యే వరకూ మృతుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా తమ ఇళ్ల ముందు పోలీసు భద్రతేదీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్య మధ్యలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో వచ్చి కాసేపు ఉండి వెళుతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: తుది దశకు ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు -
తుది దశకు ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. సుప్రీంకోర్టులోని ఫస్ట్ కోర్టులో శుక్రవారం తుది వాదనలు జరగనున్నాయి. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా పీ సొందర్ బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ డాక్టర్ డీఆర్ కార్తికేయన్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ ‘దిశ’ కేసు విచారణాంశాలను క్రోడీకరించి రిపోర్టు కాపీలను సీల్డ్ కవర్లో పెట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ లావు నాగేశ్వర రావులు కమిటీ నివేదిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అనంతరం శుక్రవారం తుది వాదనలు, ఆపైన తీర్పు వెలువరించనున్నారు. పోలీసులు, పిటిషనర్ తరుఫు న్యాయవాదులతో పాటు ‘దిశ’ నిందితుల కుటుంబ సభ్యుల తరుఫు న్యాయవాది, ఇండిపెండెంట్ కౌన్సిల్ పీవీ కృష్ణమాచారి సుప్రీంకోర్ట్ వాదనలకు హాజరుకానున్నట్లు తెలిసింది. ఎప్పుడు ఏం జరిగిందంటే? ► 2019 నవంబర్ 27న రాత్రి చటాన్‌పల్లిలో ‘దిశ’ హత్యాచారం సంఘటన జరిగింది. డిసెంబర్ 6న సీన్ రీ–కన్స్ట్రక్షన్ సమయంలో పోలీసుల ఎదురు కాల్పులలో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, సీహెచ్ చెన్నకేశవులు మృతి చెందారు. అదే ఏడాది డిసెంబర్ 12న సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. ►‘దిశ’, నిందితుల కుటుంబ సభ్యులతో పాటూ పోలీసులు, వైద్యులు, విచారణాధికారులు (ఐఓ), రాష్ట్రం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) 53 మంది అధికారులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కమిషన్ విచారించింది. ►నలుగురు మృతుల పోస్ట్‌మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్ట్, ఇన్వెస్టిగేషన్ రికార్డులు, ఫొటోగ్రాఫ్‌లు, వీడియోల ఆధారంగా సుమారు 47 రోజుల పాటూ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి, వాంగ్మూలాలను సేకరించింది. ►ఆ తర్వాత త్రిసభ్య కమిటీ చటాన్‌పల్లిలోని దిశ సంఘటనా స్థలాన్ని, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను భౌతికంగా సందర్శించి పలు కీలక సాక్ష్యాలు, ఫొటోలు, వీడియాలను సమీకరించింది. తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. చదవండి: రాజ్యసభకు ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం -
Disha Encounter: ‘దిశ’ తండ్రి ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజున తెలంగాణ పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. రియల్ హీరోలు అంటూ ప్రశంసించారు. సామాన్యంగా పోలీసులంటే జనాల్లో ఉండే భయం ఆ రోజు దూరమయ్యింది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. వారిని హీరోలుగా చేసిన సంఘటన ఏంటంటే.. 2019, నవంబర్ 27న ఓ అమ్మాయిపై మృగాళ్లు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఆ దారుణం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మృగాళ్లకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష అని ప్రజలు భావించారు. ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న తెల్లవారు జామున ‘దిశ’ను హతమార్చిన నలుగురిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ సంఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. (చదవండి: ‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా? ) ఎన్కౌంటర్ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకున్న రెండేళ్లు పూర్తయినప్పటికి.. దిశ కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి కోలుకోలేదు. ఈ క్రమంలో దిశ తండ్రి మాట్లాడుతూ.. ‘‘లైంగిక నేరగాళ్లకు కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్న సమయంలో న్యాయవ్యవస్థ సత్వరమే స్పందించాలి. నెల రోజుల్లోగా నిందితులకు కఠిన శిక్ష విధించాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేయకపోతే.. బాధితులకు, వారి కుటుంబాలకు ఎన్నటికి న్యాయం జరగదు’’ అన్నారు. (చదవండి: మళ్లీ తెరపైకి దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన) సమాజంలో ఇలాంటి దారుణాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు లైంగిక నేరాల పట్ల అవగాహన కల్పించాలి. ఇలాంటి దారుణాలు నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి శిక్షణ ఇవ్వాలి అని కోరారు. చదవండి: Disha Encounter: సంచలనం.. చర్చనీయాంశం -
దిశ ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్
సాక్షి, హైదరాబాద్/ షాద్‌నగర్/ శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచా రం కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ హైదరాబాద్‌కు వచ్చింది. కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, సభ్యులు బాంబే హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ బి.కార్తికేయన్లు ఆదివారం చటాన్‌పల్లిలోని దిశ ఎన్కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. త్రిసభ్య కమిటీతో పాటు ‘దిశ’హత్యాచారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) చైర్మన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, విచారణాధికారి (ఐఓ) జె.సురేందర్‌రెడ్డి, శంషాబా ద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, కమిషన్ తరుఫు న్యాయవాదు లు, కమిషన్ సెక్రటరీ కూడా ‘దిశ’సంఘటనా స్థలికి సంబంధించిన ప్రైవేట్ గెస్ట్‌హౌస్, తొండుపల్లి గేటు, చటాన్‌పల్లి ప్రాంతాలను సుమారు 6 గంటలపాటు సందర్శించారు. తొలుత నలుగురు నిందితులను దర్యాప్తు నిమిత్తం ఉంచిన ప్రైవేట్ గెస్ట్ హౌస్‌ను బృందం సందర్శించింది. ఆ తర్వాత ‘దిశ’ఘటనకు కారణమైన తొండుపల్లి గేటును పరిశీలించింది. దిశ స్కూటర్‌ను ఎక్కడ పార్క్ చేసింది? నిందితులు లారీని ఎక్కడ నిలిపి ఉంచారు? వంటి వివరాలపై డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రహరీలోకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు బృందం అక్కడే గడిపింది. కాగా, తొండుపల్లి గేటు సమీపంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి త్రిసభ్య కమిటీని కలిశారు. తమకు కూడా ఒకరోజు సమయమివ్వాలని శ్రీధర్‌రెడ్డి కోరగా.. ‘మీ సమస్యలన్నీ మాకు తెలుసని.. మీకు న్యాయం జరుగుతుంది’అని కమిషన్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుల తరఫున విచారణ వద్దు... సిర్పుర్కర్ కమిషన్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సంద ర్శించి, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించింది. ‘దిశ’కేసు సమయం లో స్టేషన్లో రికార్డ్ల నిర్వహణ, విలేకరుల సమావేశం నిర్వహించిన సమావేశం గది, స్టేషన్‌లోని ఇతరత్రా ప్రాంతాలను పర్యవేక్షించింది. ఇదిలా ఉండగా.. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిటీ ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందని, నిందితుల తరుఫున విచారణ చేయడమేంటని ప్రశ్నిస్తూ షాద్‌నగర్ పీఎస్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ‘కమిషన్ గో బ్యాక్’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నేతలు స్టేషన్ ముందు బైఠాయించారు. చటాన్‌పల్లిలో ప్రతీ అంశం పరిశీలన.. షాద్‌నగర్ పీఎస్ నుంచి కమిటీ నేరుగా చటాన్‌పల్లికి చేరుకుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సుమారు గంటసేపు క్షుణ్నంగా పరిశీలించింది. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకొచ్చిన బస్ ఎక్కడ నిలిపారు? దిశ వస్తువులను ఎక్కడ పాతి పె ట్టారు? నిందితులు ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఆ సమయంలో పోలీసులు నిల్చున్న చోటు, ఎదురు కాల్పుల్లో నిందితుల మృతదేహాలు పడి ఉన్న దూరం.. వంటి ప్రతీ అంశంలోనూ కమిషన్ క్షుణ్నంగా వివరాలు సేకరించింది. ‘దిశ’ను దహనం చేసిన ప్రాంతాన్ని సాధ్యమైనంత దగ్గరికి వెళ్లి పరిశీలించింది. కాగా, ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ జరిగి డిసెంబర్ 6తో రెండేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2లోపు సుప్రీంకోర్ట్‌కు కమిషన్ నివేదికను సమర్పించే అవకాశముంది. -
దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు
సాక్షి, షాద్‌నగర్: దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ విషాదాంతానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యా యి. నలుగురు మృగాళ్ల వికృత చేష్టలకు ఆమె అసువులుబాసినా మహిళా రక్షణ చట్టాలకు ‘దిశా’నిర్దేశం చేసింది. ఆమె మరణించిన కూతవేటు దూరంలోనే ఆ నలుగురికీ పడిన శిక్ష చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై.. షాద్‌నగర్ శివారులో ముగిసి.. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించిన ఈ ఘటనను ఓసారి నెమరువేసుకుంటే.. చదవండి: ‘దిశ’ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో దిశ అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్లి నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకుని ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసింది. కాపుకాసిన ఆ నలుగురు ఆమెను బలవంతంగా ఓ పాడుబడిన ప్రహరీ పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి అంతమొందించారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని లారీలో తెచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. 2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం దిశను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్థలికి తీసుకొచ్చారు. పోలీసులపై దాడి చేసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయింది. దిశ హత్య ఘటన ఎంతగా కదిలించిందంటే ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్థిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ హత్యోదంతం చట్టాలకు దిశానిర్దేశం చేసింది. కొత్త చట్టాలకు రూపకల్పన దుర్మార్గుల చేతిలో కిరాతకంగా బలైన దిశ పేరిట ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొచ్చాయి. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లు, పోలీసు వ్యవస్థను రూపొందించారు. ఇలాంటి సంఘటనలపై వేగంగా తీర్పు ఇచ్చి నిందితులకు శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలు ఎక్కడున్నది వాహనాల ద్వార ఎక్కడికి వెళ్తున్నది ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని రక్షించేలా ప్రత్యేక యాప్‌లను క్రియేట్ చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలను కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇదీ పరిస్థితి దిశ ఘటన తర్వాత కొంత మార్పు వచ్చినా ఇంకా పూర్థి స్థాయిలో రాలేదని చెప్పాలి. ఈ సంఘటన తర్వాత కూడా ఆగడాలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజధాని సాక్షిగా జరిగిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య ఉదంతమే ఇందుకు ఉదాహరణ. మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో పూర్తి స్థాయిలో చైతన్యం రాకపోవడం.. పోలీసులు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో దుర్మార్గుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. ఏది ఏమైనా దిశ హత్యోదంతం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మార్పునకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. సాగుతున్న విచారణ దిశ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులకు శిక్ష అమలైంది. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ సభ్యులు ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. -
పథకం ప్రకారమే ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది అంకానికి చేరింది. 53 మంది పోలీసులు, సాక్షుల విచారణ సోమవారంతో ముగియగా, మంగళవారం నుంచి మ రికొందరు పోలీసులు, నలుగురు నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు మొదలయ్యాయి. నలుగురు మృతులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు కుటుంబసభ్యుల తరపున న్యాయవాదు లు ఇండిపెండెంట్ కౌన్సిల్ పీవీ కృష్ణమాచారి, సహాయకురాలు రజిని కమిషన్‌కు వాదనలు వినిపించారు. నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు.. ఆయుధాలతో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉం డగా నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నాలేవీ చేయలేదని న్యాయవాదులు అన్నారు. పోలీసులే పథకం ప్రకారం ఎన్కౌంటర్ చేశారని కమిషన్‌కు తెలిపారు. నిందితులకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వ కుండా కస్టడీలోకి తీసుకొని సీన్–రీకన్స్ట్రక్షన్ పేరిట పని పూర్తి చేశారని పేర్కొన్నారు. నలుగురిలో ముగ్గురు నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులు మైనర్లని.. వారిని పోలీసులు జువెనైల్ కోర్టుకు పంపించకుండా తప్పుచేశారని కృష్ణమాచారి వివరించారు. పైగా నిందితులు మరణించింది 2019, డిసెంబర్ 5 ఉదయం 5 గంటలలోపేనని డెత్ రిపోర్ట్ సూచిస్తుంటే.. పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత జరిగిందని అబద్ధాలు చెబుతున్నారని ఆరో పించారు. పైగా విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్మెంట్లు సరిగా నమోదు చేయలేదని వివరించారు. దిశ కేసులో ముందు నుంచి అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. కమిషన్ విచారణలో మాత్రం తనకి, ఈ కేసుకు సంబంధం లేదని వాంగ్మూలం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అడ్వొకేట్ రజిని కమిషన్‌కు తెలిపారు. అనంతరం జర్నలిస్ట్ కె.సజయ తరపు న్యాయవాది వసుధ నాగరాజు వాదనలు వినిపించారు. -
మెజిస్ట్రేటే తప్పు స్టేట్మెంట్ ఇచ్చారు
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నమోదు చేసిన స్టేట్మెంట్ తప్పని అప్పటి నందిగామ సబ్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వర్లు దిశ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. జూనియర్ సివిల్ జడ్జి కే ఉషారాణి అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం మాత్రమే ఇచ్చానని.. వాళ్లేం రాసుకున్నారో తనకి తెలియదని వివరించారు. న్యాయస్థానంలో నిజమే చెప్తానని ప్రమాణం చేసి, రాతపూర్వకంగా అఫిడవిట్లో పేర్కొని, సంతకాలు చేసిన స్టేట్మెంట్ను ఇప్పుడు తప్పని తెలపడంపై కమిషన్ చైర్మన్ జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదు అని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిర్పుర్కర్.. ఇలా ప్రవర్తించడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ షాద్‌నగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు. దిశ ఘటన సమయంలో నందిగామ ఎస్సైగా ఉన్న వెంకటేశ్వర్లును సిర్పుర్కర్ కమిషన్ మంగళవారం విచారించింది. 2019, డిసెంబర్ 5న దిశ హత్యాచార నిందితులు నలుగురిని మియాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహేశ్‌కు అప్పగించినట్లు విచారణాధికారి (ఐఓ) జే సురేందర్ రెడ్డి తప్పుగా రికార్డ్ చేశారని వెంకటేశ్వర్లు చెప్పారు. వాస్తవానికి ఆ రోజు మధ్యరాత్రి ఒంటి గంటకు శంకర్‌పల్లిలోని రవి గెస్ట్ హౌస్‌లో ఏసీపీ చంద్రశేఖర్‌కు నిందితులను కస్టడీకి అప్పగించామన్నారు. 2019, డిసెంబర్ 7న ఉదయం 11:50 గంటలకు షాద్‌నగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారన్న విషయం గుర్తు లేదని తెలిపిన మీరు.. అదే రోజు ఉదయం 8 గంటలకు మాత్రం విచారణాధికారి (ఐఓ) జే సురేందర్ రెడ్డికి ఆ రోజు ఘటన గురించి పూసగుచ్చి ఎలా వివరించగలిగారని కమిషన్ ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ తాను అప్పటికే గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నానని.. తలకి తగిలిన దెబ్బ నొప్పి పెరుగుతుండటంతో గుర్తు లేదని చెప్పాడు. స్పృహ కోల్పోవటం, తల తిరగడం మధ్య తేడా తనకి తెలియదని, అందుకే స్పృహ కోల్పోయానని చెప్పానన్నారు. ఫోన్ పడిపోయిందన్న విషయం తెలపలేదు నిందితుడు జొల్లు నవీన్ తన కళ్లలో మట్టి విసిరి, రాళ్లతో కొట్టాడని దీంతో నుదురు, తల, మెడపై గాయాలయ్యాయని వెంకటేశ్వర్లు కమిషన్‌కు చెప్పారు. ఐఓ, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, అఫిడవిట్లో, వైద్యులకు ఎక్కడా కూడా తల, మెడపైన గాయాలయ్యాయన్న విషయాన్ని ఎందుకు తెలపలేదని ప్రశ్నించగా.. అంతగా అవసరంలేదనిపించిందని సమాధానం ఇచ్చారు. 2019 డిసెంబర్ 6 నాటి సీజర్ రిపోర్టులో సంఘటన స్థలంలో రక్తం అంటిన ఖాకీ దుస్తులు, నలుపు రంగు పిస్టల్ పర్సు ముక్కను స్వాధీనం చేసుకున్నామని ఐఓ సురేందర్ రెడ్డి తప్పుగా నమోదు చేశారని, వాస్తవానికి 7వ తేదీన ఉదయం 8–8:30 గంటల సమయంలో ఐసీయూలో తనని విచారించేందుకు వచ్చిన సురేందర్ రెడ్డి చేతికి రక్తం అంటిన దుస్తులు, పిస్టల్ పర్స్‌ను ఇచ్చానని వెంకటేశ్వర్లు తెలిపారు. చెన్నకేశవులు మిమ్మల్ని నేల మీదకి తోసేశాడని ఏ రిపోర్ట్‌లోనూ ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించగా.. ఐఓ సురేంద ర్‌రెడ్డికి తెలిపానని బదులిచ్చారు. ఆ తోపులాటలో తన ఫోన్ కూడా ఘటనా స్థలంలో పడిపోయిందని కమిషన్‌కు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. -
కాల్పులు జరిపింది ఆ ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితులపై లాల్మదార్, రవి, సిరాజుద్దీన్ అనే ముగ్గురు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని అప్పటి ఆమన్‌గల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) కొండా నరసింహారెడ్డి (ప్రస్తుతం బాచుపల్లి పీఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు) జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ త్రిసభ్య కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ‘దిశ’సీన్ రీ–కన్స్ట్రక్షన్, ఎన్కౌంటర్ సమయంలో ఎప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ బుధవారం ఆయన్ను విచారించింది. ‘పారిపోకండి, కాల్చకండి, లొంగిపోండి.. అంటూ షాద్‌నగర్ ఏసీపీ వాసం సురేందర్ రెండు మూడుసార్లు అరిచి నా నిందితులు కాల్పులు ఆపలేదు. దీంతో తొలుత లాల్‌మదార్‌ను గాలిలోకి కాల్పులు జరపాలని ఏసీపీ ఆదేశించారు. అయినా ముద్దాయిలు ఫైరింగ్ ఆపకపోయే సరికి లాల్మదార్, రవి, సిరాజుద్దీన్ ముగ్గురినీ ఎదురు కాల్పులు జరపాల్సిందిగా ఆదేశించారు..’అని నరసింహారెడ్డి తెలిపారు. నిందితులలో ఆరిఫ్, చెన్నకేశవులు కాల్పులు జరపడం తాను చూశానని పేర్కొన్నారు. ముగ్గురు పోలీసులు ఏ పొజిషన్లో ఉండి కాల్పులు జరిపారో తాను గమనించలేదన్నారు. కాల్పులు పూర్తయ్యాక నిందితుల మృతదేహాలను మీరు చూశారా? అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చారు. కాల్పుల్లో పోలీసులు అరవింద్, వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయని, వాళ్లు స్పృహ కోల్పోయి పడిపోయారని తెలిపారు. 108 అంబులెన్స్ స్ట్రెచర్‌లో క్షతగాత్రులను షాద్‌నగర్ ఎస్ఐ, వాళ్ల సిబ్బంది పోలీసు వాహనంలో తీసుకెళ్లారని వివరించారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని సూచించలేదా అని ప్రశ్నించగా.. లేదని చెప్పారు. ‘దిశ’వస్తువులు బయటకు తీసినప్పుడే ఎన్కౌంటర్ ‘షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నిందితులను చటాన్‌పల్లిలోని రవి గెస్ట్ హౌస్‌కు తీసుకురమ్మని ఆదేశించడంతో.. 2019 డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు నలుగురు నిందితులతో చర్లపల్లి జైలు నుంచి బయలు దేరాం. ఉదయం 3 గంటల సమయంలో ఏసీపీ నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి ఒక్కో కానిస్టేబుల్ చొప్పున హ్యాండ్లర్ (నిందితుల చేతికి బేడీలు వేసి పట్టుకోవడం) విధులను వేశారు. ఏ1 మహ్మద్ ఆరిఫ్‌కు హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, ఏ2 జొల్లు శివకు హెడ్ కానిస్టేబుల్ అరవింద్, ఏ3 జొల్లు నవీన్‌కు కానిస్టేబుల్ బాలు రాథోడ్, ఏ4 చెన్నకేశవులుకు కానిస్టేబుల్ శ్రీకాంత్ హ్యాండర్లుగా ఉన్నారు. హ్యాండర్ కానిస్టేబుల్స్ చేతికి లాఠీలు గానీ తుపాకులు గానీ ఇవ్వలేదు. చటాన్‌పల్లి సర్వీస్ రోడ్డుకు ఉదయం 5:30 గంటల కల్లా చేరుకున్నాం. ఉదయం 6 గంటల ప్రాంతంలో దిశ వస్తువులు దాచి ఉంచిన ప్రాంతాన్ని ఆరిఫ్ గుర్తించాడు. ఏసీపీ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో కిందికి వొంగి మట్టిని నేనే తొలగించా. పాలిథిన్ కవర్లో సెల్‌ఫోన్ కనిపించింది. కవర్ మీద ఉన్న మట్టిని తొలగించాను. సెల్‌ఫోన్ బయటకు తీయలేదు. అదే సమయంలో ఎన్కౌంటర్ సంఘటన జరిగింది..’అని నరసింహారెడ్డి తెలిపారు. ఆరిఫ్ నా పిస్టల్ లాక్కున్నాడు ‘ముందుగా జానకిరామ్ కళ్లల్లో మహ్మద్ ఆరిఫ్ మట్టి కొట్టి వెనక్కి నెట్టేశాడు. ఆ తర్వాత తన చేతికి ఉన్న క్లచ్‌లను తానే విడిపించుకున్నాడు. వెంటనే పారిపోతున్నాడని జానకిరామ్ అరవడంతో కింద వంగి ఉన్న నేను ఎడమ వైపునకు తిరిగా. వెంటనే నా కళ్లల్లోకి కూడా ఆరిఫ్ మట్టి విసిరేశాడు. ఆ వెంటనే ఆరిఫ్ తన రెండు చేతులతో నా బెల్ట్‌కు ఉన్న పిస్టల్‌ను పర్స్‌తో సహా బలంగా లాగాడు. వెంటనే ‘అరేయ్ ఉరకండ్రా’అంటూ అరిచాడు. దీంతో మిగిలిన ముగ్గు రు నిందితులు కూడా హ్యాండ్లర్ కానిస్టేబుళ్లను వెనక్కి నెట్టేసి ముందు వైపునకు పరుగెత్తారు..’అని వివరించారు. మరి మీ పక్కనే ఉన్న ఆరిఫ్‌ను పట్టుకోవటానికి మీరు ప్రయత్నించలే దా? అని కమిషన్ ప్రశ్నించగా.. ‘ఆ సమయం లో కళ్లల్లో పడిన మట్టిని తుడుచుకుంటున్నా. వెంటనే ఆరిఫ్ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి..’అని నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆరిఫ్ మీ పిస్టల్‌ను లాగే సమయం లో ఏసీపీ సురేందర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. తాను కిందికి వొంగి మట్టిని తవ్వుతుంటే ఏసీపీతో సహా మిగిలిన ఎస్కార్ట్ సిబ్బంది దృష్టి అంతా ఇటువైపే పెట్టారని తెలిపారు. ఎవరు మట్టి విసిరారో చూడలేదు ఎస్కార్ట్‌గా వచ్చిన అందరు పోలీసుల కళ్లల్లో మట్టి పడిందా? అని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. తనకు తెలియదని, అరవింద్, వెంకటేశ్వర్లు కళ్లల్లో మట్టి పడటం అయితే తాను చూశానని నరసింహారెడ్డి తెలిపారు. పంచ్ విట్నెస్‌లైన అబ్దుల్ రవూఫ్, రాజశేఖర్ ముఖ కవళికలు, శరీరాకృతులు గుర్తు లేవని, వారిని చూస్తే మాత్రం గుర్తుపడతానని చెప్పారు. కమిటీ ముందు 9 ఎంఎం పిస్టల్ ‘దిశ’ఎన్కౌంటర్ సమయంలో నరసింహారెడ్డి వద్ద ఉన్న 9 ఎంఎం పిస్టల్, దాని పర్సును కమిషన్ ముందుంచాలని మంగళవారం త్రిసభ్య కమిటీ ఆదేశించిన నేపథ్యంలో.. బుధవారం 9 ఎంఎం పిస్టల్‌ను, 10 బుల్లెట్లతో కూడిన మ్యాగజైన్‌ను తీసుకొచ్చారు. అయితే సంఘటన సమయంలో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్‌ను సీజ్ చేశారని, దీంతో వేరే 9 ఎంఎం పిస్టల్‌ను తీసుకొచ్చామని, తుపాకీని పెట్టుకునేందుకు వినియోగించిన నైలాన్ పర్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉందని నరసింహారెడ్డి చెప్పారు. -
దిశ కేసు: ‘నేనొకటి చెబితే.. సజ్జనార్ మరొలా చెప్పారు’
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ బుధవారం శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాశ్‌రెడ్డిని విచారించింది. ఈ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను కమిషన్ విచారించిన సందర్భంగా చాలా ప్రశ్నలకు ఆయన ‘శంషాబాద్ డీసీపీ బ్రీఫింగ్ చేసేవారు.. దాన్ని బట్టే మీడియాకు వివరాలను వెల్లడించాను’ అని అని చెప్పిన నేపథ్యంలో కమిషన్ తరుఫున న్యాయ వాది ఎం.విరూపాక్ష దత్తాత్రేయ గౌడ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిపై పలు ప్రశ్నలను సంధించారు. విచారణలోని కీలకాంశాలివే.. ‘దిశ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) మహ్మద్ ఆరిఫ్ ఒప్పుకోలు విచారణ (కన్ఫెషన్ స్టేట్మెంట్) 2019 నవంబర్ 29న సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమై 6:45 గంటలకు ముగిసింది. ఏ2– జొల్లు శివ ఒప్పుకోలు విచారణ 6:45 గంటలకు ప్రారంభించి ఎన్ని గంటలకు ముగించారో రికార్డ్ చేయలేదు. ఆరిఫ్ వాంగ్మూలం పూర్తికాకుండానే గంట ముందే అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌కు నిందితులు నేరం చేసిన తీరును ఎలా చెప్పగలిగారు’అని డీసీపీని జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ప్రశ్నించింది. సాయంత్రం 5:15 గంటలకు నిందితుల అరెస్టు గురించి మాత్రమే ఏసీపీ సురేందర్ తనకి చెప్పారని.. అదే విషయాన్ని సీపీ సజ్జనార్‌కు వివరించానని.. త్రిసభ్య కమిటీకి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. 2019 డిసెంబర్ 6వ తేదీ నాటికి దిశ సెల్‌ఫోన్, పవర్ బ్యాంక్‌ల రివకరీ, నిందితుల డీఎన్ఏ సేకరణ జరగలేదని తెలిపారు. కానీ, అదే రోజు రాత్రి 7:15 గంటలకు శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం సీపీ సజ్జనార్ రికవరీ, డీఎన్ఏ సేకరణ జరిగినట్లు తప్పుగా తెలిపారని వివరించారు. నిందితులు మరణించాకే వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించామని పేర్కొన్నారు. పోలీస్ ఆఫీసర్ల చేతిలోని తుపాకులు అన్‌లాక్ చేసి ఉన్నాయని మీరే చెప్పారా అని కమిషన్ ప్రశ్నించగా.. షాద్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తనకు ఆ విషయం చెప్పారని.. అదే విషయాన్ని సీపీకి తెలియజేశానని సమాధానం ఇచ్చారు. 2019 డిసెంబర్ 6వ తేదీన సజ్జనార్ రెండోసారి నిర్వహించిన ప్రెస్మీట్లో ఇచ్చిన ప్రజెంటేషన్, నేరం జరిగిన తీరు కేవలం తన బ్రీఫింగ్ మీద ఆధారపడి నిర్వహించలేదని త్రిసభ్య కమిటీకి డీసీపీ తెలిపారు. గాలి తీసింది నవీన్ అని చెప్పలేదు.. ‘దిశ’స్కూటీ టైర్లో గాలి తీసింది జొల్లు నవీన్ అని తాను చెప్పలేదని సిర్పుర్కర్ కమిషన్‌కు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. 2019 నవంబర్ 29న రాత్రి 7:15 గంటలకు శంషాబాద్ డీసీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ నిర్వహించే సమయానికి జొల్లు నవీన్ ఒప్పుకోలు విచారణ జరగలేదు.. కానీ, ఆ ప్రెస్మీట్లో సీపీ సజ్జనార్.. నవీనే స్కూటీలో గాలి తీశాడని ఎలా చెప్పారని కమిషన్ ప్రశ్నించింది. దీంతో తాను ఆ విషయాన్ని కమిషనర్‌కు చెప్పలేదని.. నలుగురు నిందితులు కలిసే దిశ స్కూటీని పంక్చర్ చేసే పథకం రచించారని మాత్రమే చెప్పానని డీసీపీ వెల్లడించారు. మళ్లీ మేజిస్ట్రేట్ అనుమతి అవసరం లేదనిపించింది.. ‘నిందితుల కస్టడీ కోసం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి అత్యవసరమని ఏసీపీకి మీరు చెప్పలేదా?’అని కమిషన్ ప్రశ్నించగా.. ‘2019 నవంబర్ 30న రిమాండ్ కోసం షాద్‌నగర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం కదా.. అందుకే కస్టడీ కోసం మళ్లీ జ్యుడీషయల్ మేజిస్ట్రేట్ అనుమతి అవసరం లేదని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నాతో చెప్పారు. దాంతో నాకూ ఆ అవసరం లేదనిపించింది’అని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి సిర్పుర్కర్ కమిషన్‌కు వివరించారు. ఎగ్జిక్యూటివ్ మెజి్రస్టేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. ఇద్దరి ఆఫీసు లు ఒకటే దగ్గర ఉండటంతో నాకూ అనవసరమే అనిపించింది.. అని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లా అండ్ ఆర్డర్లో డీసీపీ హోదాలో ఉంటూ, శంషాబాద్ వంటి కీలకమైన ప్రాంతానికి ఉన్నతాధికారి అయి ఉండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో క్రిమినల్ ప్రొసిజర్స్ కోడ్స్‌ను సరిగా అనుసరించాలని తెలియదా’అని మండిపడ్డారు. పైగా నిందితులను కస్టడీకి తీసుకునేముందు భౌతికంగా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడం, నిందితుల ఆరోగ్య పరిస్థితులు, ఇతరత్రా వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలని కూడా తెలియకపోతే ఎలా అని మందలించారు. కొన్ని ప్రశ్నలకు చాలా లోతైన సమాధానాలు చెబుతున్న మీరు.. కొన్ని కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే అర్థం తెలియదు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్ రెండో రోజు మంగళవారం జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ‘దిశ’నిందితులు మహ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులో ఆరీఫ్ మినహా మిగిలిన ముగ్గురు జువెనైల్స్ అనే విషయం తనకి తెలియదని కమిషన్ ముందు సజ్జనార్ వాంగ్మూలం ఇచ్చారు. అలాగే 2019, డిసెంబర్ 5 రాత్రి సమయంలో నిందితులను రవి గెస్ట్ హౌస్‌లో విచారించమని తాను చెప్పలేదని.. సురక్షిత ప్రదేశంలో మాత్రమే నిందితులను ఉంచాలని సూచించానని వివరించారు. కేసు దర్యాప్తులో ఉండటం, దిశ వస్తువుల రికవరీ ఉన్నందునే చర్లపల్లి జైలు నుంచి నిందితులను తీసుకెళ్లామని చెప్పారు. ఆ సమయంలో ముద్దాయిలకు సీన్ రీ–కన్స్ట్రక్షన్ సమాచారం ఇవ్వలేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును సాధారణ నేరంగా ఎలా పరిగణించారని, పైగా కేసు విచారణలో ‘మార్నింగ్ బ్రీఫింగ్’కే పరిమితం అయ్యానని అనడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరం జరిగిన ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉంటూ ఎస్ఓటీ బృందాల ఏర్పాటు, విచారణ, ఎస్కార్ట్ పోలీసులకు ఆయుధాలు, సమాచార సేకరణ, అరెస్ట్.. ఇలా ప్రతీదీ మీ కంటే కిందిస్థాయి అధికారి(డీసీపీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి)కే తెలుసని చెప్పడం సరైందికాదని అసహనం వ్యక్తం చేసింది. (చదవండి: పొగాకు వినియోగంలో వారే అధికం.. షాకింగ్ విషయాలు వెల్లడి) కమిషన్ ప్రశ్నలలో ప్రధానమైనవి.. కమిషన్: నిందితులను అరెస్ట్ చేసిన విధానం గురించి శంషాబాద్ డీసీపీ మీకు చెప్పారా? సజ్జనార్: లేదు, చెప్పలేదు. కమిషన్: స్టేషన్ల స్థాయి ఆయుధాల జారీ, తనిఖీలో అంతిమ బాధ్యత పోలీస్ కమిషనర్‌కి ఉండదా? సజ్జనార్: సైబరాబాద్‌లో ఆయుధాలు, మందుగుం డు సామగ్రి విభాగంతో పాటు ఇతర విభాగాలు కూడా ఉంటాయి. ప్రతి దానికి డీసీపీ ర్యాంక్ అధి కారి ఉంటాడు. కమిషనర్ లా అండ్ ఆర్డర్, పరిపాలన, విధానపరమైన నిర్ణయాలకే పరిమితం అవుతాడు. ఆయుధాల జారీ, తనిఖీలలో ఏమైనా సమ స్యలు తలెత్తితే అది సీపీ దృష్టికి వస్తుంది అంతే. కమిషన్: నిందితుల నేరాంగీకారం (కన్ఫెషన్ స్టేట్మెంట్) ఎప్పుడు రికార్డ్ చేశారు? సజ్జనార్: మహ్మద్ ఆరీఫ్ నేరాంగీకార రికార్డ్‌ను సాయంత్రం 5:20గం. నుంచి 6:30గం.ల మధ్య, శివ నేరాంగీకార రికార్డ్ 6:45 గం.కు జరిగింది. కమిషన్: ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించే ముందు ఆరీఫ్ నేరాంగీకార రికార్డ్‌ను చదివారా? సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ బ్రీఫింగ్ చేశారు. కమిషన్: నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు త రలించకుండా ప్రెస్మీట్లో వివరాలెలా చెప్పారు? సజ్జనార్: ప్రాథమిక సమాచారాన్ని ప్రజలకు తెలి పేందుకే డీసీపీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించాం. కమిషన్: ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యమెందుకు? సజ్జనార్: 2019, సెప్టెంబర్ 6న ఉదయం 6:20 గం.కు ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించా రని శంషాబాద్ డీసీపీ తెలిపారు. కానీ, 2గం. ఆలస్యంగా 8:30గం.కు శంషాబాద్‌లో ఎఫ్ఐఆర్ నమో దుచేశారు. ఇలా ఎందుకయ్యిందో తెలియదు. కమిషన్: నిందితుల మరణ సమాచారాన్ని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయంత్రం 5:30 గంటలకు చెప్పారు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: చటాన్‌పల్లిలోని సంఘటనా స్థలానికి మీరు ఎప్పుడు వెళ్లారు? ఎంత సేపు ఉన్నారు? సజ్జనార్: 2019, డిసెంబర్ 6న వెళ్లా. గంటన్నరసేపు ఉన్నా. ఆసమయంలో షాద్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) శ్రీధర్ ఇన్చార్జిగా ఉన్నాడు. కమిషన్: మృతదేహాలపోస్ట్మార్టంపై సూచించారా? సజ్జనార్: లేదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు లేఖ రాశాను అంతే. కమిషన్: ‘దిశ’కనబడటంలేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సజ్జనార్: నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాం. విచారణ పూర్తయిందో.. లేదో.. తెలియదు. కమిషన్: ఏసీపీ.. నిందితుల మృతదేహాల నుంచి డీఎన్ఏ సేకరించిన విషయం మీకు తెలుసా? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: సంఘటన స్థలంలో ప్రెస్‌మీట్ కోసం టేబుల్, కుర్చీలు, మైక్ ఎవరు ఏర్పాటు చేశారు? సజ్జనార్: రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన కదా గుర్తులేదు. కమిషన్: మీరు సంఘటన స్థలానికి వెళ్లకముందే అక్కడ టెంట్ వేసి ఉందా? సజ్జనార్: లేదు, మధ్యాహ్నం సమయంలో చూశా. సంఘటన స్థలం నుంచి 100–200 అడుగుల దూరంలో ఏర్పాటు చేశారు. 2 రోజుల్లో కలిపి సజ్జనార్‌ను 5 గంటల 16 నిమిషాల పాటు కమిషన్ విచారణ చేసింది. మొత్తం 160 ప్రశ్నలను త్రిసభ్య కమిటీ అడిగింది. ఎన్కౌంటర్ అంటే ఏంటో నాకు తెలియదు! ‘మిమ్మల్ని ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’అని 2019, డిసెంబర్ 6న పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఖండించారా?’అని త్రిసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. లేదు అని సజ్జనార్ సమాధానం ఇచ్చారు. అంటే మీరు ఇలా సంబోధించడాన్ని ఒప్పుకుంటున్నారా? అని అడగగా.. లేదు అన్నారు. ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’అంటే ఏంటని మళ్లీ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ఏమో దానర్థం ఏంటో నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. కాల్‌డేటా రికార్డ్స్ నోడల్ ఆఫీసర్ల విచారణ.. సజ్జనార్ విచారణ అనంతరం.. దిశ కేసులో పాల్గొన్న పోలీసులు, నిందితుల కాల్ డేటా, టవర్స్ వివరాలు, లొకేషన్స్ గురించి సంబంధిత నెట్వర్క్ అధికారులను కమిషన్ విచారించింది. బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ ఇంజనీర్ ఎన్. శ్రీనివాసులు, రిలయెన్స్ జియో నోడల్ ఆఫీసర్ జితేందర్, వొడా ఫోన్–ఐడియా ప్రత్యామ్నాయ నోడల్ ఆఫీసర్ పీ. జయలక్ష్మి, భారతీ ఎయిర్టెల్ చీఫ్ నోడల్ ఆఫీసర్ వీ.వెంకటనారాయనన్‌ను కమిషన్ తరుఫు న్యాయ వాది విరూపాక్ష దత్తాత్రేయ గౌడ విచారించారు. ప్రెస్మీట్లో తప్పులు చెప్పా.. చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలో 2019, డిసెంబర్ 6న మధ్యాహ్నం 3 గంటలకు వీసీ సజ్జనార్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. కేసు వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ నాలుగు భాషల్లో వివరించారు. దిశ వస్తువులు ఫోన్, పవర్ బ్యాంక్‌లు పొదల వెనకాల దొరికాయని తెలిపారు. అలాగే అదే ప్రెస్మీట్లో సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు వినియోగించిన తుపాకుల సేఫ్టీ లాక్స్ ఓపెన్ చేసి ఉన్నాయా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఎస్ ఉన్నాయని చెప్పారు. అలాగే బాధితురాలు, నిందితుల డీఎన్ఏ రిపోర్టులు వచ్చాయని చెప్పారు. వీటిపై కమిషన్ ఇవన్నీ ప్రెస్మీట్లో ఎలా తప్పుగా చెప్పారని ప్రశ్నించింది. ఆ సమయంలో చాలా మంది జనాలు గుమిగూడి ఉన్నారని, పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే సడెన్‌గా తప్పుగా చెప్పేశానని కమిషన్‌కు సమాధానం ఇచ్చారు. సంఘటనా స్థలంలో మృతదేహాల పంచనామాలు జరుగుతున్నాయి? వస్తువుల రికవరీ జరుగుతోంది? ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో ప్రెస్‌మీట్ నిర్వహించడం అత్యవసరమని ఎలా అనుకున్నారని త్రిసభ్య కమిటీ అసహనం వ్యక్తం చేసింది. (చదవండి: Nalgonda: 4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు) -
Disha Encounter: ముగిసిన సజ్జనార్ విచారణ.. అడిగిన ప్రశ్నలివే..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ అంశానికి సంబంధించి వరుసగా రెండో రోజు విచారణకు వీసీ సజ్జనార్ హాజరయ్యారు. అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ జరిగినప్పుడు సజ్జనార్ సీపీగా పని చేసి చేశారు. దాంతో సజ్జనార్ విచారణకు హాజరుకావడం అనివార్యమైంది. సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారిస్తోంది. సజ్జనార్‌పై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపిస్తుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ సమాచారం మీకు ముందే ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. డీసీపీ శంషాబాద్ చెబితే తనకు తెలిసిందని సజ్జనార్ సమాధాన ఇచ్చారు.సంఘటన జరిగిన తర్వాత నిందితులను పట్టుకున్న అంశాలను కమిషన్ లేవనెత్తింది. కమిషన్ అడిగిన ప్రశ్నకు సజ్జనార్ సమాధానాలు చెబుతున్నారు. దిశ కమిషన్ ముందు వీసీ సజ్జనార్ విచారణ ముగిసింది. చదవండి: సీజ్ చేసిన.. తుపాకులెలా వాడారు? కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన విషయం మీకు ఏ సమయానికి తెలిసింది? సజ్జనార్: డిసెంబర్ 6 ఉదయం ఆరు గంటల 20 నిమిషాలకు తెలిసింది. కమిషన్: ఎన్ కౌంటర్‌పై ఎఫ్ఐర్ నమోదు ఎంక్వైరీ చేశారా ? సజ్జనార్: శంషాబాద్ డీసిపి కి ఎఫ్ ఐ ఆర్ చేయమని చెప్పాను. కమిషన్: ఎన్కౌంటర్ స్పాట్ కి ఏ టైం లో చేరుకున్నారు? సజ్జనార్: ఉదయం 8:30 గంటలకు స్పాట్ కు చేరుకున్నాను. కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంచార్జ్ ఆఫీసర్ ఎవరు? సజ్జనార్: షాద్‌నగర్ సీఐ శ్రీధర్ ఇంచార్జీ. కమిషన్: ఎన్కౌంటర్ స్పాట్‌కు రీచ్ అయ్యాక ఎవరెవరిని కలిశారు? సజ్జనార్:ఏసిపి సురేందర్‌ను కలిశాను. సజ్జనార్:పోస్టుమార్టం గురించి డీఎంఈకి సమాచారం అందించాను. కమిషన్: ఇంక్వెస్ట్‌ను ఎవరి సమక్షంలో చేశారు. సజ్జనార్:తెలంగాణలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ఇంక్వెస్ట్ చేస్తారు. సజ్జనార్: పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ వర్సెస్ మహారాష్ట్ర కేస్ తీర్పు ప్రకారం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందే జరగాలి. కమిషన్: ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు చేయమని ఎవరు చెప్పారు? కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన సమయంలో మీతో పాటు ఎంత మంది సీనియర్ అధికారులు ఉన్నారు? కమిషన్: సీన రీ కన్స్ట్రక్షన్ కి వెళ్లేటప్పుడు పోలీసులతో ఆయుధాలు ఉన్నాయా? కమిషన్: ఎంత మంది పోలీసులు వెపన్స్ క్యారీ చేశారు? ఎన్కౌంటర్ జరిగిన రోజు సజ్జనార్ మాట్లాడిన క్లిప్లింగ్‌ను రెండు భాషల్లో ప్లే చేశారు. సజ్జనార్: పోలీసుల నుండి నిందితులు వెపన్స్ లాక్కున్నారు. కమిషన్: వెపన్స్ ఎందుకు అన్‌లాక్ చేశారు? సజ్జనార్: వెపన్స్ అన్‌లాక్ చేయలేదు. కమిషన్: మీడియా సమావేశంలో వెపన్స్ అన్ లాక్ చేసినట్టు ఉంది? కమిషన్:ప్రెస్ మీట్ సమయానికి బాధితురాలి వస్తువులు రికవరీ కాకపోయినా ఎందుకు రికవరీ చేశామని చెప్పారు? కమిషన్:వెపన్స్ రికవరీ కాకుండా, పోస్ట్ మార్టం పూర్తి కాకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? సజ్జనార్: డిసిపి శంషాబాద్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెట్టాను. కమిషన్: ఘటన జరిగిన సమయంలో ఎన్ని గంటలు స్పాట్లో ఉన్నారు? సజ్జనార్: గంటన్నర గంటలపాటు ఉన్నాను. కమిషన్: 2008 వరంగల్ ఎన్కౌంటర్, 2016 నక్సలైట్ల ఎన్కౌంటర్, 2019 దిశ కేస్ కౌంటర్ లలో ఒకటే రకమైన విధానం కనిపిస్తుంది. మీ హయంలోనే ఇలా జరిగింది. సజ్జనార్: వరంగల్ ఎన్కౌంటర్ సమయంలో నేను ఎస్పీ గా ఉన్నాను, 2016 లో నేను లా అండ్ ఆర్డర్ లో లేను అని సమాధాన ఇచ్చారు. కమిషన్: మిమ్మల్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మీడియా అభివర్ణించింది. మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా? సజ్జనార్: నేను అంగీకరించను. కమిషన్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు. డీసీపీపై నే ఆధార పడతారా? సజ్జనార్: గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్ లకు. పూర్తి సమాచారం ఉంటుంది. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. కమిషన్: దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? సజ్జనార్: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడం లో కొంత సమయం డిలే అయ్యింది. కమిషన్: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సజ్జనార్: ఎఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది పైన సస్పెన్షన్ విధించాం. కమిషన్: ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా పెట్టారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయాము అని సాక్షులు చెప్పారు. సజ్జనార్: ఎన్ కౌంటర్ స్పాట్‌కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా వీడియో సమావేశం ఏర్పాటు చేశాం. కమిషన్: సమావేశం కోసం కుర్చీలు, టేబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయం లో ఎక్కడి నుండి తెచ్చారు? సజ్జనార్: షాద్ నగర్ పోలీసులు సమగ్రి నీ తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి సామాగ్రిని తీసుకొచ్చారో నాకు తెలియదు. ఆ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది నాకు గుర్తు లేదు అని సజ్జనార్ సమాధానమిచ్చారు. దీంతో సజ్జనార్ విచారణ పూర్తయ్యింది. -
సీజ్ చేసిన.. తుపాకులెలా వాడారు?
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు సోమవారం హాజరయ్యారు. త్రిసభ్య కమిటీ తరఫున న్యాయవాది కే. పరమేశ్వర్ విచారించారు. త్రిసభ్య కమిటీ సజ్జనార్‌ను అడిగిన ప్రశ్నలలో ప్రధానమైనవి.. కమిషన్: నందిగామ, ఆమన్‌గల్ పోలీస్స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ)లు వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ 2019, డిసెంబర్ 3న సీజ్ చేశారని రిమార్క్స్ కాలమ్‌లో నమోదు చేశారు. కానీ, డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో ఇదే పిస్టల్‌ను వినియోగించారని తేలింది. ఇదెలా సాధ్యమైంది.? సజ్జనార్: తనిఖీ చేశాక సమాధానం ఇస్తా. కమిషన్: నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది 2019, నవంబర్ 29 రాత్రి 10 గం.కు అయితే.. మీరెలా 3 గంటల ముందే (7 గం.) మీడియాకు నేరం జరిగిన తీరును వివరించారు? సజ్జనార్: 2019, నవంబర్ 29న శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ సమస్యలపై స్టడీ ఉంటే వెళ్లా. అక్కడ్నుంచి క్యాంప్ ఆఫీస్‌కు వస్తుంటే శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. డీసీపీ కార్యాలయానికి రావాలన్నది ఫోన్ సారాంశం. అక్కడికి వెళ్లిన నాకు నిందితుల అరెస్ట్ గురించి డీసీపీ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు చెప్పమన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు మీడియాకు వివరాలను తెలియజేశా. నేను ప్రత్యేకంగా ఈ కేసును పర్యవేక్షించలేదు. మార్నింగ్ బ్రీఫింగ్లో పాల్గొనేవాడిని. ‘దిశ’కేసుపై ఏర్పాటు చేసిన 9 బృందాలకు శంషాబాద్ డీసీపీ నేతృత్వం వహించారు. కమిషన్: నిందితుల కస్టడీ విచారణకు ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించారా? సజ్జనార్: నిందితుల కస్టడీ విచారణ సమయంలో అదనపు బలగాలు కావాలని 2019, డిసెంబర్ 2న డీసీపీ అభ్యర్థిస్తే.. అదనపు డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులను అపాయింట్ చేశా. నిందితుల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆ విభాగాన్ని ఆదేశించా. డీసీపీ అభ్యర్థన మేరకే ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఆయుధాలు కేటాయించాం. కమిషన్: ఆ 9 ఎంఎం పిస్టల్ ఎవరిది? సజ్జనార్: ఎన్కౌంటర్లో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ నందిగామ సబ్ఇన్స్పెక్టర్ నర్సింహకు జారీచేశారు. కానీ, ఆ సమయంలో నందిగామ పీఎస్‌కు వెంకటేశ్వర్లు ఎస్ఐగా పోస్టింగయ్యారు. దీంతో ఆ పిస్టల్ వెంకటేశ్వర్లు చేతికి వెళ్లింది. కమిషన్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ)ను ఎలా ఎంపిక చేస్తారు? వీళ్లు సీపీకి రిపోర్ట్ చేస్తారా? సజ్జనార్: సివిల్ ఫోర్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన పోలీసులను ఎస్ఓటీలో నియమిస్తారు. సందర్భాన్ని బట్టి సీపీకి, స్థానిక స్టేషన్లలో రిపోర్ట్ చేస్తుంటారు. కమిషన్: సైబరాబాద్ సీపీ పరిధిలోనూ ప్రత్యేక ఆయుధాల నమోదు రిజిస్టర్ ఉంటుందా? సజ్జనార్: ఉంటుంది. ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లానే సైబరాబాద్ సీపీలో ఆర్మ్స్ రిజర్వ్ వింగ్ కూడా ఉంటుంది. కమిషన్: నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్ గురించి సైబరాబాద్ సీపీ రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల నమోదు ప్రక్రియకు ప్రత్యేకంగా సీఏఆర్ వింగ్ ఉంది. కొన్ని సందర్భాల్లో సీఏఆర్ నేరుగా స్టేషన్లకు ఆయుధాలను జారీ చేస్తుంది. కమిషన్: నందిగామ, ఆమన్‌గల్ స్టేషన్లకు కేటాయించిన ఆయుధాలను చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేశారు? ఎలాంటి నిర్ధిష్టమైన విధుల కోసం ఆయుధాలను కేటాయించారు? ఆయా వివరాలను రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల జారీ, తనిఖీ అంశాలను పర్యవేక్షించడానికి అదనపు డీసీపీ, సీఏఆర్ నేతృత్యంలో ప్రత్యేక వింగ్ ఉంది. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో షాద్‌నగర్ ఏసీపీ వీ. సురేందర్‌తో సమావేశమయ్యారా? సజ్జనార్: కాలేదు. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో శంషాబాద్ డీసీపీ కాన్ఫరెన్స్ హాల్లో మీరు సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా 9 బృందాలను ఏర్పాటు చేశారు. దీనిపై మీరేమంటారు? సజ్జనార్: లేదు, ఇది జరిగింది 2019, నవంబర్ 30న. కమిషన్: అంటే.. ఈ ఎంట్రీ తప్పంటారా? సజ్జనార్: దీనికి సురేందరే సమాధానం చెప్పాలి. కమిషన్: ఎస్కార్ట్ పోలీసులకు 6 పొడవైన ఆయుధాలను కేటాయించే ముందు వాటి అవసరం ఏముందని ప్రశ్నించారా? సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ కోరితేనే జారీచేశా. కమిషన్: గతంలో మీరెప్పుడైనా అత్యాచారం, హత్య కేసుల్లో ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఇలాంటి ఆయుధాలను జారీ చేశారా? సజ్జనార్: ఒకసారి తనిఖీ చేసుకొని సమాధానమిస్తా. కోర్టుకు హాజరుకాకుండానే కస్టడీకి అనుమతి.. ‘దిశ’నిందితులు మహ్మద్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు కోర్టులో హాజరుపరచలేదని అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ షాద్‌నగర్ పీ.శ్యాంప్రసాద్.. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల భౌతిక హాజరు అత్యవసరమని తనకు అనిపించలేదని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 2న మధ్యాహ్నం సమయంలో పోలీసులు నిందితుల కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని, అదే రోజు సాయంత్రం అనుమతి ఇచ్చామని తెలిపారు. అలాగే నిందితుల పంచనామాలు, సాకుల స్టేట్మెంట్లు కూడా తనకు సమర్పించలేదని, తహసీల్దార్‌కు సమర్పించారని స్పష్టం చేశారు. తహసీల్దార్ రిమాండ్ రిపోర్ట్‌ను అనుసరించే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చానని వివరించారు. కాగా.. ఈ కేసులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిందితులను 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. పోలీసులు 15 రోజులు కస్టడీలో ఉంచుకున్నారన్నారు. చర్లపల్లి జైలర్ నిందితుల సంతకాలను అటాచ్ చేశాడు కాబట్టి.. తాను ఆ సంతకాలను నిర్ధారించుకోలేదని కమిషన్‌కు తెలిపారు. నిందితుల తరఫు నుంచి తనకి ఎలాంటి న్యాయపరమైన సలహా లేదా కస్టడీని వ్యతిరేకిస్తూ దరఖాస్తు అందలేదని వెల్లడించారు. -
Disha Case: విచారణకు హాజరైన వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ సోమవారం త్రిసభ్య కమిటీ (సిర్పుర్కర్ కమిషన్) ఎదుట హాజరయ్యారు. ఎన్కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్మెంట్ను కమిషన్ నమోదు చేయనుంది. కాగా, ఇప్పటికే ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలు, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్ స్టేట్మెంట్ కీలకం కానుంది. చదవండి: (‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది) -
‘దిశ’ పోలీసు క్షతగాత్రుల రిపోర్టుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్లో క్షతగాత్రులైన పోలీస్ కానిస్టేబుల్ ఏ అరవింద్‌గౌడ్‌కు గచ్చబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ సర్జన్ డాక్టర్ రాజేశ్ రచ్చను వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ పలు ప్రశ్నలను సంధించారు. అరవింద్ చికిత్స ఫైనల్ రిపోర్ట్లన్నీ విచారణ అధికారికి ఒరిజినల్స్‌తో సహా సమర్పించామని, తమ వద్ద ఎలాంటి పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు లేవని రాజేశ్ వాంగ్మూలం ఇచ్చారు. చదవండి: ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్ మెడికో లీగల్ కేస్(ఎంఎల్సీ)లో కూడా సీటీ స్కాన్ కాపీలు ఆసుపత్రి వద్ద ఉండవని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గచ్చిబౌలి ఆసుపత్రిలో 2019, డిసెంబర్ 6న ఉదయం 10:18 గంటలకు బెడ్ నంబర్ 11 కేటాయిస్తూ అడ్మిట్ చేసుకున్నట్లు ఓపీ రికార్డ్‌లో ఉంది. కానీ, షాద్‌నగర్ ఇన్స్పెక్టర్ నుంచి ‘వైద్యం సమాచార లేఖ’ మాత్రం 2019, డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటలకు చేరింది. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.. తెలియదని సమాధానమిచ్చారు. అతనికి ఐసీయూలో చికిత్స చేయాల్సినంత గాయాలేవీ కాలేదని చెప్పారు. చదవండి: ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి.. డిశ్చార్జి సమ్మరీలో ఎక్స్‌రే గురించి ఎందుకు రాయలేదని ప్రశ్నిచగా.. అందులో పేషెంట్ చికిత్స తాలూకు అన్ని వివరాలను నమోదు చేయమని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో మరణించిన చెన్నకేశవులు ఎడమ చేతిలో లభ్యమైన కాటన్ స్వాబ్‌ను పరీక్షిస్తే నెగెటివ్ వచ్చిందని హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బాలిస్టిక్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వీ వెంకటేశ్వర్లు.. కమిషన్ ముందు వాం గ్మూలం ఇచ్చారు. న్యూఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీబీఐ) బాలిస్టిక్ రిటైర్డ్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడీ ఎన్బీ బర్ధన్‌ను కూడా కమిషన్ విచారించింది. కాగా, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్‌లకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పి.విశ్వక్‌సేన్‌రెడ్డిని సిర్పుర్కర్ కమిషన్ గురువారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ ఆయనను ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 6న ఉదయం 8 గంటలకు కేర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పృహలోనే ఉన్నారని విశ్వక్‌సేన్‌రెడ్డి వివరించారు. కుడి కను బొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు.. ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో పారాసెటమాల్ ఇచ్చామని, కడుపులోని మంటను తగ్గించే పాంటోప్, ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స చేశామని కమిషన్‌కు తెలిపారు. ఇవి తప్ప వేరే ఏ రకమైన చికిత్స చేయలేదని, దీనిని రికార్డ్‌లోనూ నమోదు చేశామని వివరించారు. నొప్పి, వాపును తగ్గించే వోవెరాన్, టీటీ ఇంజెక్షన్లను కానిస్టేబుల్ బయటే ఇప్పించుకున్నారని, కేర్ ఆస్పత్రిలో ఇవ్వలేదని తెలిపారు. గాయం 2 సెంటీమీటర్లు ఉన్నట్టుగా ఎలా లెక్కించారని కమిషన్ ప్రశ్నించగా.. గాయాన్ని కొలిచే ఉపకరణం (క్యాలిబర్) తన వద్ద లేదని, కేవలం ఓ అంచనాతోనే చెప్పానని, దాన్నే రికార్డ్‌లో నమోదు చేశానని సమాధానమిచ్చారు. ‘సంచలనం సృష్టించిన లేదా మెడికో లీగల్ (ఎంఎల్సీ) కేసుల్లో డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రుల గాయాల గురించి స్పష్టంగా రాయాల్సి ఉంటుందని.. మరి మీరెందుకు నమోదు చేయలేద’ని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం సమాధానం చెప్పలేనంటూ డాక్టర్ విశ్వక్‌సేన్‌రెడ్డి దాటవేశారు. అంతర్గతంగా రక్తస్రావమైతేనే వ్యక్తి మరణిస్తారని, వేరే ఇతర సందర్భాల్లో అలా జరగదని చెప్పిన విశ్వక్సేన్.. కేర్ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లకు అలాంటి తీవ్ర గాయాలేవీ లేవని, సాధారణ గాయాలే ఉన్నాయని వివరించారు. షాద్‌నగర్ సీహెచ్‌సీ రికార్డ్‌లో కానిస్టేబుల్ స్పృహ కోల్పోయారని ఉందని, అందువల్లే ఐసీయూలో అడ్మిట్ చేశామని, అంతే తప్ప చికిత్సలో ఆ రికార్డులను అనుసరించలేదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజే ఉదయం 8:30 గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స అందించామని తెలిపారు. ఫోన్లో చెప్తే రికార్డ్‌లో నమోదు మంగళవారం షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ (సీహెచ్‌సీ) సర్జన్ గోనె నవీన్ కుమార్ విచారణ అసంపూర్తిగా ముగియగా.. గురువారం ఉదయం తిరిగి కొనసాగించారు. కేర్ ఆస్పత్రి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లకు సంబంధించిన డిశ్చార్జి సమ్మరీని ఎవరూ తన వద్దకు తీసుకురాలేదని.. ఎవరో ఫోన్లో చెబితే ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేశానని నవీన్‌కుమార్ తెలిపారు. డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రులకు ఎక్స్‌రే తీసినట్టు లేదని.. కానీ డాక్టర్స్ నోట్లో మాత్రం ఉందేమిటని ప్రశ్నించగా.. ‘డాక్టర్స్ నోట్‌ను ఇప్పుడే తొలిసారి చూస్తున్నా’నని నవీన్ సమాధానమిచ్చారు. కేర్ ఆస్పత్రి రికార్డుల్లో అరవింద్‌గౌడ్‌కు ఎడమ భుజం మీద సన్నని వెంట్రుకలాంటి చీలిక ఏర్పడి ఉందని, దాన్ని మీరెందుకు షాద్‌నగర్ ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేయలేదని ప్రశ్నించగా.. డాక్టర్ నవీన్ సమాధానం ఇవ్వకుండా 15 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు నడుచుకుంటూ షాద్‌నగర్ సీహెచ్‌సీకి వచ్చారని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ముందు వాంగ్మూలం ఇచ్చిన నవీన్ కుమార్.. త్రిసభ్య కమిటీ ముందు మాత్రం స్పృహ కోల్పోయి వచ్చారని తెలిపారు. పైగా ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీనిపై కమిషన్ ప్రశ్నించగా.. అన్నింటికీ ‘ఏమీ లేదు’అంటూ సమాధానం ఇచ్చారు. నేడు సజ్జనార్ విచారణ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించనుంది. ఈ మేరకు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు ఇతర సాక్షుల విచారణ సుదీర్ఘంగా కొనసాగడంతో సజ్జనార్ విచారణ వాయిదా పడింది. కమిషన్ మూడు రోజుల పాటు సజ్జనార్‌ను విచారించనున్నట్టు సమాచారం. -
దిశ ఎన్కౌంటర్: గడ్డి ఉండటంతో బుల్లెట్లు దొరకలేదు!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ సంఘటన స్థలంలో ఎన్ని బుల్లెట్లు లభ్యమయ్యాయి? వేరే వస్తువులు ఏం సేకరించారు? అనే కోణంలో దిశ కమిషన్ విచారణ సోమవారం కొనసాగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. వెంకన్నను సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ విచారించింది. దిశ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో బాగా గడ్డి ఉండటంతో బుల్లెట్లు దొరకలేదని.. వాటి 19 కాట్రిడ్జ్‌లు మాత్రం లభ్యమయ్యాయని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. బుల్లెట్ల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాలని విచారణ అధికారి (ఐఓ) సురేందర్‌రెడ్డికి సూచించామని.. ఆయన బాంబ్ స్క్వాడ్‌తో కలసి వెతికినా కూడా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఐఓకు చేతి గ్లవ్జ్లు, పంచ్ మెటీరియల్‌లను ఎప్పుడు ఇచ్చారని కమిషన్ ప్రశ్నించగా.. గుర్తులేదని సమాధానం చెప్పారు. ఘటనా స్థలం నుంచి కాట్రిడ్జ్‌లు కాకుండా ఇంకా ఏం సేకరించారని అడగగా.. 9ఎంఎం తుపాకీ, రక్తం అంటిన దూది, మట్టి లభించిందని తెలిపారు. ఎన్కౌంటర్లో పోలీసులు 9 ఎంఎం తుపాకీ, ఏకే–47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్)ను వినియోగించారని చెప్పారు. టెంట్ ఎక్కడిది?... అంతకుముందు ఉదయం 11 గంటలకు దిశ హత్యాచార నిందితులను సీన్–రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లే సమయంలో హాజరైన రెండో ప్రత్యక్ష సాక్షి (పంచ్ విట్నెస్) ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్‌ను విచారించారు. కమిషన్: మీ కళ్లలో మట్టి పడింది కదా.. మరి ఆరీఫ్యే కాల్పులు జరిపాడని ఎలా చెప్పారు? సాక్షి: శబ్దం ముందు నుంచి వచ్చింది కాబట్టి అంచనా వేశా. కమిషన్: ఆరీఫ్ కాల్పులు జరపడం మీ కళ్లతో చూశారా? లేదా? సాక్షి: చూడలేదు. కాల్పులు జరిపాక పోలీసులతో కలసి పక్కనే టెంట్లో నిల్చున్నా. కమిషన్: ఆ సమయంలో అక్కడ టెంట్ లేదు కదా? సాక్షి: లేదు, సీఐ చెప్పినట్లుగా కొంచెం దూరంలో నిల్చున్నా. కమిషన్: టెంట్ ఎప్పుడొచ్చింది? సాక్షి: తెలియదు. కమిషన్: మీ కళ్లల్లో మట్టి పడింది కదా మరి అంబులెన్స్‌లో ఉన్న వైద్యులకు చూపించుకోలేదా? సాక్షి: లేదు, నాకు నేను కళ్లు తుడుచుకుంటే మంటపోయింది. కమిషన్: ఎన్కౌంటర్ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వచ్చారా? సాక్షి: వచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కమిషన్: సీపీ మృతదేహాలను చూశారా? సాక్షి: నాకు తెలియదు.. గుర్తులేదు. సాయంత్రం వరకూ సజ్జనార్ అక్కడే.. సోమవారం మధ్యాహ్నం సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. దీంతో ఉదయం 10:32 గం.కు ఆయన హైకోర్టు ఆవరణలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, రహుఫ్ విచారణే సోమవారం కూడా కొనసాగింది. భోజనానంతరం డాక్టర్ వెంకన్న విచారణ జరిగింది. సాయంత్రం 4:02 గంటల వరకూ సజ్జనార్ వేచి ఉన్నా, సమయం లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. గురు లేదా శుక్రవారం ఆయన్ను విచారించే అవకాశముంది. -
నేడు దిశ కమిషన్ ముందుకు సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ, రెండురోజుల విరామం తర్వాత సోమవారం పునఃప్రారంభం కానుంది. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను తొలిసారిగా త్రిసభ్య కమిటీ విచారించనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌కు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఆయన్ను సుదీర్ఘంగా మూడురోజుల పాటు విచారించే అవకాశమున్నట్లు తెలిసింది. సుమారు 30 ప్రశ్నలను సంధించనున్నట్లు సమాచారం. దిశ హత్యాచార నిందితులను సీన్–రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లే సమయంలో హాజరైన రెండో సాక్షి. ఫరూక్నగర్ అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ విచారణ సోమవారం ఉదయం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో సజ్జనార్ హాజరయ్యే అవకాశముందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. -
‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో సాక్షుల నుంచి విచిత్ర సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్స్ట్రక్షన్కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ ఓ పంచ్ సాక్షిని శుకవ్రారం విచారించింది. నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, కేసు పూర్తిగా సందర్భానుసారాలపై ఆధారపడి ఉన్నప్పుడు.. అలాంటి పంచనామాకు ఎలాంటి అపఖ్యాతి లేని వ్యక్తులను పంచ్ విట్నెస్గా తీసుకెళతారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: కేటీఆర్ అలాగే ‘దిశ’ కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్కు.. షాద్‌నగర్ ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్‌ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్‌ను విచారించింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు. రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం ఉదయం అబ్దుల్ రహుఫ్‌ను విచారించి.. మధ్యాహ్నం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వొకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. ‘దిశ’ ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
బుల్లెట్ల శబ్దం వినిపించిందా?.. లేదు ఆ సమయంలో నిద్రపోతున్నా!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 2019 డిసెంబర్ 5న నిందితులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ నుంచి రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో దిశ మృతదేహాన్ని కాల్చే సిన ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన వాహనం డ్రైవర్ యాదగిరిని గురువారం త్రిసభ్య కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా? అని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ‘లేదు, ఆ సమయంలో నేను వాహనంలోనే పడుకున్నా’అని డ్రైవర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్కౌంటర్లో మరణించిన నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృపాల్ గుప్తా, బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తాలను కూడా కమిషన్ విచారించింది. మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించలేదని కృపాల్ గుప్తాను ప్రశ్నించగా.. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇవ్వలేదని పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మృతదేహాలపై ఏమైనా గాయాలున్నాయా అని ప్రశ్నించగా.. లేవని కృపాల్ సమాధానమివ్వగా, సుధీర్ గుప్తా మాత్రం మృతదేహాలపై పోలీసులు కొట్టినట్లు గాయాలున్నాయని చెప్పినట్లు సమాచారం. శుక్రవారం కూడా గాంధీ ఆసుపత్రి వైద్యుల విచారణ కొనసాగనుంది. దిశ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది. చదవండి: Tollywood Junior Artists: ప్రియుడు మోసం చేయడంతో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటు చేసిన బృందంపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీసీ సిర్పుర్కర్ కమిషన్ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎన్హెచ్ఆర్సీ డీఐజీ మంజిల్ సైనీ, ఇన్స్పెక్టర్లు దీపక్‌కుమార్, అరుణ్ త్యాగిల విచారణ బుధవారంతో ముగిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారు వంటి కీలక అంశాలను ఘటనాస్థలి నుంచి సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేశారని త్రిసభ్య కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: రెండ్రోజుల్లో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ ‘దిశ’నిందితులను పోలీసులు విచారించిన ప్రైవేటు అతిథిగృహం వాచ్మెన్, చటాన్‌పల్లికి నిందితులను తరలించిన వాహనాల డ్రైవర్లను కూడా కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ తర్వాత మృతదేహాలకు పంచనామా నిర్వహించిన వైద్యులు, పోలీస్ క్షతగాత్రులకు వైద్యం అందించిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులను కమిషన్ నేడు విచారించనుంది. శుక్రవారం వీసీ సజ్జనార్‌ను విచారించే అవకాశముందని తెలిసింది. -
రెండ్రోజుల్లో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. దిశ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను గురువారం లేదా శుక్రవారం విచారణ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సజ్జనార్‌కు త్రిసభ్య కమిటీ భౌతికంగా సమన్లు జారీ చేసింది. సోమవారం ప్రారంభమైన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ముగ్గురు సభ్యుల విచారణ మంగళవారం కూడా కొనసాగింది. మరొక సభ్యుడి విచారణతో బుధవారం ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్ అతిథి గృహంలో ఉంచి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్‌మెన్‌ను కూడా సిర్పుర్కర్ కమిషన్ విచారించనుంది. ఆ తర్వాత ఫోరెన్సిక్ బాలిస్టిక్ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ నిపుణులను కూడా విచారణ చేయనుందని తెలిసింది. చదవండి: సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులపై ఈ పోస్టర్లు కనిపించవు -
సమన్లు జారీ.. ‘దిశ’ కమిషన్ విచారణకు సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను తొలిసారిగా త్రిసభ్య కమిటీ విచారించనుంది. ఇప్పటికే సజ్జనార్‌కు సమన్లు జారీ చేసిన కమిషన్.. మంగళవారం లేదా బుధవారం రోజున విచారణ చేయనున్నట్లు సమాచారం. దిశ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సమర్పించిన నివేదికపై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ ఎన్హెచ్ఆర్సీలోని ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు కమిటీ ముందు హాజరుకానున్నారు. మళ్లీ మహేశ్ భగవత్ హాజరు.. దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్‌గా మహేశ్ భగవత్‌ను నియమించింది. ఇప్పటికే పలుమార్లు కమిషన్ ముందు హాజరైన భగవత్‌ను త్రిసభ్య కమిటీ పలు ప్రశ్నలను అడిగింది. కొన్ని ప్రశ్నలకు ఆయన కొంత సమయం అడిగారని, మరికొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారని తెలిసింది. దీంతో సోమవారం ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ తర్వాత మళ్లీ సిట్ చీఫ్ మహేశ్ భగవత్ విచారణకు హాజరుకానున్నారు. సిట్ నివేదికలో పొందుపరిచిన అంశాలకు, కమిషన్ విచారిస్తున్న అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం, పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో విచారణకు రెండుమూడు రోజుల సమయం పడుతుందని ఓ అధికారి తెలిపారు. విచారణ తర్వాత సిర్పుర్కర్ కమిషన్ 2–3 నెలల్లో నివేదికను అందజేస్తుందని సమాచారం. -
దిశ ఘటన : సల్మాన్, రవితేజ, రకుల్‌తో సహా 38 మందిపై కేసు
ఇప్పటికే డ్రగ్స్ కేసు, ఫోర్నోగ్రఫీ కేసులతో సతమతమవుతున్న సినీ ప్రముఖలపై తాజాగా మరో కొత్త కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటనపై బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ సహా మొత్తం 38 మంది సెలబ్రిటీలపై తాజాగా కేసు నమోదు అయింది. అసలు దిశ కేసుకు, వీరికి సంబంధం ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే... నవంబర్ 27, 2019న హైదరాబాద్‌లో ఓ యువతిపై నలుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు దిశ అని పేరు పెట్టారు. ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా బాధితుల అసలు పేర్లను వాడకుండా ఇతర పేర్లతో వాటి గురించి చర్చలు చేస్తుంటారు. ముఖ్యంగా బాధితురాలి పేర్లను, ఫోటోలను బహిర్గతం చేయడం నేరం. ఒకవేళ అలా చేస్తే వారిపై కేసు నమోదు అవుతుంది. అయితే దిశ ఘటన జరిగినప్పుడు మాత్రం పలువురు సెలబ్రిటీలు ఆమె అసలు పేరును ఉపయోగించారు. కొందరైతే ఫోటో కూడా వాడారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనుపమ్ ఖేర్, ఫర్హాన్ అక్తర్, సల్మాన్‌ఖాన్ సహా టాలీవుడ్ స్టార్స్ రవితేజ, అల్లు శిరీష్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి ఉన్నారు. వీరు బాధిత అమ్మాయి పేరుని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి నలుగురుకి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు ఇలా పేరు వెల్లడించడం సరికాదంటూ ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటి అనే న్యాయవాది సబ్జీ మండీలోని పోలీస్ స్టేషన్లో సెక్షన్ 228ఏ కింద కేసు పెట్టారు. అంతేకాదు వీరిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘దిశ’ కమిషన్ విచారణకు మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ ఎదుట రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ శనివారం విచారణకు హాజరయ్యారు. అయితే అప్పటికే నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన ఆరిఫ్ (ఎన్కౌంటర్లో మృతి చెందాడు) తండ్రి హుస్సేన్‌ను విచారిస్తుండటంతో భగవత్‌ను విచారించలేదు. దీంతో ఆయన విచారణను కమిషన్ ఈనెల 13కి రీషెడ్యూల్డ్ చేసినట్లు తెలుస్తోంది. హుస్సేన్ విచారణ శనివారం పూర్తయింది. ఇప్పటివరకు రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి, షాద్‌నగర్ రోడ్లు, భవనాల విభాగం (ఆర్అండ్బీ) డీఈఈ ఎం రాజశేఖర్, దిశ సోదరిలను చైర్మన్, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇందులో దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని విచారించి కమిషన్ పలు కీలక సమాచారాన్ని రాబట్టింది. ఎన్కౌంటర్ తర్వాత నిందితుల మృతదేహాలకు పంచనామ చేసిన వైద్యులు, ఆయుధాలు (తుపాకులు) నిర్వహణ అధికారులు, సాంకేతిక, కాల్ రికార్డింగ్ బృందాలను విచారించనున్నట్టు సమాచారం. మరొక 15 రోజుల్లో సిర్పుర్కర్ కమిటీ విచారణ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇదిలా ఉండగా...ఇప్పటికే ఒక పర్యాయం నిందితుల కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్‌కు ‘ఇది బూటకపు ఎన్కౌంటర్’అని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని, పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
పోలీసుల నుంచి ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్/మక్తల్: ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2019, డిసెంబర్ 6న జరిగిన ఎన్కౌంటర్ ముందు, తర్వాతి సమయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు అధికారిని కమిషన్ వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిని త్రిసభ్య కమిటీ లోతుగా ప్రశ్నించారు. ‘దిశ’సోదరిని కూడా విచారణ కమిషన్ చైర్మన్, సభ్యులు విచారించారు. ‘దిశ’ఫోన్ సంభాషణ, ఇతరత్రా వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. అలాగే ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆరీఫ్ తండ్రి హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణుక.. శుక్రవారం త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో వారిని హైకోర్టు ఆవరణలోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్.. వారి నుంచి సమాచారాన్ని, సాక్ష్యాలను సేకరించింది. ఊర్లో ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా.. తమకు పోలీసుల నుంచి ప్రాణహాని, బెదిరింపులు వస్తున్నాయని నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్ రూపంలో కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. లాడ్జ్ నుంచి బలవంతంగా.. వాస్తవానికి కమిషన్ విచారణ ఈనెల 26 (గురువారం)న ఉండటంతో నిందితుల కుటుంబసభ్యులు బుధవారం రోజునే హైదరాబాద్‌కు చేరుకొని కాచిగూడలోని ఓ లాడ్జ్‌లో దిగారు. ‘దిశ’కేసు నిందితుల తల్లిదండ్రులు లాడ్జ్‌లో ఉన్నా రని తెలుసుకుని కొందరు పలుమార్లు అక్కడికి వచ్చారని శివ తండ్రి రాజప్ప విలేకర్లకు తెలిపారు. హోటల్ యజ మాని తనకు తెలియదని పలుమార్లు చెప్పినా వినకుండా రాత్రి సమయంలో ఫోన్ చేసి బెదిరించారన్నారు. భయాం దోళనకు గురైన హోటల్ యజమాని గురువారం రాత్రి తమను బలవంతంగా ఖాళీ చేయించారని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఓ న్యాయవాది ఇంట్లో తలదాచుకున్నామని చెప్పారు. కాగా, విచారణ అనంతరం నిందితుల కుటుంబ సభ్యులను బందోబస్తు మధ్య నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు తీసుకెళ్లి వారి వారి ఇళ్లలో పోలీసులు విడిచిపెట్టారు. -
దిశా ఎన్ కౌంటర్ పై నేడు కమిషన్ విచారణ
-
దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్/మక్తల్: సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నేడు విచారించనుంది. గురువారమే విచారణ జరగాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నిందితుల కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేశారు. త్రిసభ్య కమిటీ 18 మంది సాకులను విచారించనుంది. ఇదిలాఉండగా..తమకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని నిందితుల కుటుంబసభ్యులు బుధవారం కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్‌కుమార్, శివల కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో.. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆరీఫ్ తండ్రి హుస్సేన్, నవీన్‌కుమార్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రా జప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణు కలు బుధవారమే ఇళ్ల నుంచి వెళ్లిపోయారని.. రెం డురోజుల నుంచి హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. అయితే వీరిని విచారణకు హాజరుకావొద్దని పోలీసులు బెదిరిస్తున్నారని జొళ్లు రాజప్ప ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 21న ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు దేవరకద్ర రోడ్ వద్ద బస్సుకోసం నిలబడగా..నంబరుప్లేటు లేని ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి ఢీకొట్టేందుకు ప్రయత్నించగా..రోడ్డు కిందికి దిగిపోవటంతో దగ్గరకొచ్చి బెదిరించారని తెలిపారు. కేసువాపసు తీసుకోకపోతే చింతకుంట కుర్మప్ప (చెన్నకేశవులు తండ్రి)కు పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించారని ఆరోపించారు. -
మళ్ళీ తెరపైకి దిశా ఎంకౌంటర్ కేసు
-
తెలంగాణ హైకోర్ట్ లో దిశా నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణ
-
ముస్లిం యువతి కేసు.. ‘దిశ’ డీఎస్పీ దర్యాప్తు
సాక్షి, అమరావతి/గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో గతేడాది ఆగస్టు 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముస్లిం యువతి కేసును ‘దిశ’ డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయిస్తామని దిశ ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతిక శుక్లా చెప్పారు. పొలానికి వెళ్తుండగా ఆమెను కొందరు అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారుల బృందం శనివారం ఆ గ్రామానికి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలను కృతిక శుక్లా మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఎర్రబాడు గ్రామంలో బాధిత ముస్లిం కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నందున వెంటనే ఇల్లు మంజూరు చేసి.. నిర్మించి ఇవ్వాలని ఆర్డీవో అధికారులకు కృతికా శుక్లా ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ íసీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలానీసామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు తదితరులున్నారు. -
మతిస్థిమితం లేని యువతికి చిత్రహింసలు
సాక్షి, నెల్లూరు: మతిస్థిమితం లేని ఓ యువతిని బంధువులే చిత్రహింసలకు గురి చేస్తున్న హృదయ విదారక ఘటన బాలాయపల్లిలో వెలుగుచూసింది. ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం యార్లపూడి గ్రామానికి చెందిన పద్మకు చిన్న వయసు నుంచే మతిస్థిమితం లేదు. ఆమె చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా, తండ్రి ఎటో వెళ్లిపోయాడు. పద్మ తన మేనమామ గగనం మల్లికార్జున, ప్రసన్న దంపతుల సంరక్షణలో ఉంటుంది. ఏడాది క్రితం పద్మకు అక్క వరసయ్యే బాలాయపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సుమతి, బావ వెంకటయ్య వద్ద మేనమామ వదిలి వెళ్లిపోయాడు. అయితే కొంతకాలం నుంచి పద్మను వారు చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొడుతున్నారు. పద్మను ఇంట్లో నిర్బంధించి పైశాచికంగా ప్రవర్తించేవారు. ఈ విషయం వైఎస్సార్సీపీ నాయకురాలు రాయి దేవికాచౌదరి దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, ఎస్సై నరసింహారావు, నెల్లూరు దిశ పోలీసులు మంగళవారం పద్మ నివాసం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో ఉన్న పద్మను చూసి నివ్వెరపోయారు. వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి, పక్కనే ఉన్న సఖి కేంద్రానికి తరలించారు. పద్మకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛన్ వస్తున్న విషయం గమనార్హం. -
వర్మకు షాక్: ‘దిశ ఎన్కౌంటర్’ విడుదలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఆయన దర్శకత్వం వహించిన ‘దిశ ఎన్కౌంటర్’ సినిమా విడుదలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. రెండు వారాల వరకు విడుదల చేయొద్దని చిత్రబృందానికి ఆదేశించింది. సినిమా ప్రొడ్యూసర్ల పేర్లపై పిటిషన్లో గందరగోళం ఉందని హైకోర్టు పేర్కొంది. నిర్మాత రాంగోపాల్‌వర్మ అని చెప్పిన పిటిషనర్.. వర్మ కాదు అనురాగ్ అని కోర్టుకు తెలిపిన న్యాయవాది. దిశ సినిమా పేరును నిశా ఎన్‌కౌంటర్‌గా మార్చామని ఈ సందర్భంగా న్యాయవాది తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన ఆధారంగా వర్మ ఈ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుదల ఆపాలని బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం సోమవారం పై విధంగా ఆదేశాలు ఇచ్చింది. దిశ సంఘటనతోపాటు అనంతరం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ‘దిశా ఎన్కౌంటర్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. -
వర్మకు చుక్కెదురు: ‘దిశ’ సినిమాకు బ్రేక్?
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ’ ఎన్కౌంటర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు. దీనికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్ విడుదల చేశాడు. త్వరలోనే విడుదల చేద్దామనుకుంటున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఆయనకు షాక్ ఇచ్చింది. ‘దిశ’ ఎన్కౌంటర్ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. దిశ ఎన్కౌంటర్ సినిమాకు అనుమతి ఇవ్వడంపై బోర్డులోని మెజార్టీ సభ్యులు అడ్డు చెప్పారు. సెన్సార్ ఇవ్వాలో లేదో తేల్చుకోలేకపోయినా నలుగురు సభ్యుల బోర్డ్ బృందం మాత్రం అనుమతి నిరాకరించింది. సెన్సార్ బృందం అనుమతి నిరాకరణతో సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో 8 సభ్యులు ఉన్న సెన్సార్ బోర్డు మళ్లీ సినిమా చూడనుంది. అనంతరం సినిమాపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే వాస్తవ సంఘటనలకు దగ్గరగా దిశ ఎన్కౌంటర్ సినిమా తీశారని దిశ కుటుంబసభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు కూడా గతంలో ఫిర్యాదు చేశారు. నిందితుల కుటుంబసభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు. -
భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): భార్య నగ్న వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన భర్తపై కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు నగరం ఏటీ అగ్రహారానికి చెందిన ఒక మహిళ తన భర్త వికృత నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి పనులు చేయకుండా, యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న భర్త, భార్యతో ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు తీసిన ఘటన వెలుగు చూసింది. (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) విషయం తెలుసుకున్న భార్య పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లటంతో దిశా పోలీసుస్టేషన్‌కు విచారణ నిమిత్తం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటీకే ఐటీ కోర్ బృందం ఆ వీడియోలు అప్లోడ్లను తీసివేసే పనిలో నిమగ్నమైంది. పోలీసులు యుద్ధప్రాతిపదికన కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పుడు అప్లోడ్ చేశాడు.. ఎన్ని వీడియోలు ఉన్నాయి.. యూట్యూబ్‌లో కాకుండా, ఇతరత్రా సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అప్లోడ్ చేశాడా...? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదును స్వయంగా అర్బన్ పోలీసు ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు. (మైనర్‌తో అసభ్య చాటింగ్) చదవండి: (సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..) -
వివాహితపై కన్నేసిన టీడీపీ నేతపై ‘దిశ’ కేసు
సాక్షి, డి.హీరేహాళ్ (రాయదుర్గం): వివాహితపై అసభ్యంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిపై దిశ చట్టం కింద కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డి.హీరేహాళ్ మండలం దొడగట్టకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసులు రౌడీషీటర్. ఇతను ఓ హత్య కేసులో ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. (యరపతినేని నివాసాల్లో సీబీఐ దాడులు) ఈ క్రమంలోనే శ్రీనివాసులు గ్రామంలోని ఓ వివాహితపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు. బుధవారం రాత్రి భర్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపైకి శ్రీనివాసులు రాళ్లు విసిరి వెకిలిచేష్టలు చేశాడు. వెంటనే ఆమె తన భర్తకు విషయం తెలిపింది. ఎవరక్కడ అని అరిచేసరికి అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. గురువారం బాధితురాలు తన భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. క్రైం నంబర్ 358 అండర్ సెక్షన్ 534డి, 509 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్ఐ వలిబాషా తెలిపారు. (భార్య, కూతురుపై కన్ను.. వ్యక్తి దారుణ హత్య) -
మళ్లీ తెరపైకి దిశ ఎన్కౌంటర్ చిత్రం
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న దిశ ఎన్కౌంటర్ చిత్రంపై నిందితుల తరఫు న్యాయవాదులు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్‌ను కలిశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయకుండా చూడాలని కోరారు. ఈ మేరకు కవాడిగూడ సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ బాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్‌లో దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి ఆర్జీవీ దిశ ఎన్కౌంటర్ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.(చదవండి: ‘మర్డర్’ సినిమాకు తొలగిన అడ్డంకులు) ఈ నేపథ్యంలో దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను నిలిపివేసేలా కేంద్రం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించి సినిమాను నిలిపివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలాఉండగా.. సెప్టెంబర్ 26న విడుదలైన దిశ ట్రైలర్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్ సినిమా అంచనాల్ని పెంచాయి. -
వర్మ ‘మర్డర్’కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేసింది. గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఇదే కథాంశంగా సినిమాను తెరకెక్కించాలని రామ్ గోపాల్‌వర్మ నిర్ణయించుకున్నారు. తమ అనుమతి లేకుండా రామ్‌గోపాల్‌వర్మ సినిమాను తీస్తున్నారంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. అమృత మొదట నల్గొండ కోర్టును ఆశ్రయించగా చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై వర్మ హైకోర్టును ఆశ్రయించగా సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. వారి పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ హామీ ఇవ్వడంతో ఇక ఏ అడ్డంకులు లేకుండా విడుదల కానుంది. అనంతరం రామ్‌గోపాల్‌వర్మ ట్విటర్ వేదికగా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. మర్డర్ చిత్రం తెరకెక్కడం వెనుక ఉన్న మా మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్థం చేసుకుంది. అన్ని విషయాలను కోర్టు ఆర్డర్ వచ్చిన తరువాత వెల్లడిస్తాను అంటూ వర్మ ట్వీట్ చేశారు. VERY HAPPY to inform that our good intentions of making the film MURDER has been rightly understood by the honourable COURT ..Details will be given once the order is with us ..THANKING EVERYONE 🙏🙏🙏💐💐💐 pic.twitter.com/lmdD4mOWVd — Ram Gopal Varma (@RGVzoomin) November 6, 2020 ఇదిలావుండగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న మరో చిత్రం దిశ ఎన్కౌంటర్. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారని వాటిని తొలగించాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పకే ఈ చిత్రం విడుదలను ఆపివేయాలని నిందితులు కుటుంబ సభ్యులు సుప్రీం జ్యుడీషియల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరో మారు హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఈ నెల 26న దిశ ఎన్కౌంటర్ చిత్రం విడుదల కానుంది. చదవండి: ‘ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’ -
బాధితులకు వరం.. జీరో ఎఫ్ఐఆర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న జీరో ఎఫ్ఐఆర్ పద్ధతి బాధితులకు వరంగా మారింది. తెలంగాణాలో దిశ ఘటన తరువాత మన రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్ర హోంశాఖ సైతం జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయాలని, చట్టంలో ఉన్న వెసులుబాటును అమలు చేయని పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం, వారి ఫిర్యాదుపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలనే నిబంధన ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ నిబంధనలు ఏడాదిగా పక్కాగా అమలవుతున్నాయి. గతేడాది మొదటి జీరో ఎఫ్ఐఆర్ కృష్ణాజిల్లా కంచికచర్లలో నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జీరో ఎఫ్ఐఆర్కు సంబంధించి 341 కేసులు నమోదయ్యాయి. గతేడాది 62 కేసులు, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 279 కేసులు నమోదు చేసినట్టు దిశ ప్రత్యేక అధికారి దీపికాపాటిల్ చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్ ప్రాధాన్యత వెనుక తెలంగాణలోని షాద్‌నగర్ గ్యాంగ్ రేప్ (దిశ ఘటన)తో జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలో ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. చట్టంలో జీరో ఎఫ్ఐఆర్ వెసులుబాటు ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు అది తమ పరిధిలోనిది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళితే తమ పరిధి కాదని పోలీసులు అనడంతో తాము రెండు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని బాధితురాలి కుటుంబసభ్యులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన శంషాబాద్ పీఎస్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దిశ మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క అమ్మాయికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు జీరో ఎఫ్ఐఆర్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. జీరో ఎఫ్ఐఆర్ నిరాకరిస్తే పోలీసులపై క్రిమినల్ కేసు బాధితులు ఫిర్యాదు చేసినా జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించే పోలీసులపై క్రిమినల్ (కేసు) చర్యలు తప్పవని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం హెచ్చరించింది. అన్యాయం జరిగిన చోటే ఫిర్యాదు చేసుకో.. మీ ప్రాంత పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేసుకో.. మా దగ్గరకు ఎందుకొచ్చావ్.. ఇవీ ఏళ్ల తరబడి పోలీసు స్టేషన్లలో పలువురు అధికారుల నోట కర్కశంగా వినిపించిన మాటలు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ మాటలు వినిపించడంలేదు. బాధితులు ఏ ప్రాంతం వారైనా, ఎక్కడైనా సత్వర సహాయం కోసం సమీపంలోని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. బాధితులు వచ్చిన వెంటనే వారినుంచి వివరాలు తీసుకుని ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి కేసును సంబంధిత పోలీసు స్టేషన్‌కు పంపించాలి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (పోలీసు)పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 166ఎ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు సహకరించని పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురవడంతోపాటు క్రిమినల్ కేసులో ఆరునెలల నుంచి రెండేళ్లపాటు శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. -
ఆర్జీవీ దిశకు వరుస ఎదురుదెబ్బలు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రానికి వరుసగా అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దిశ హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను నిలిపివేసేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉన్న క్రమంలోనే మరో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కోరుతూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులచే ఎన్‌కౌంటర్‌కు గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు సోమవారం హైకోర్టుకు చేరుకున్నారు. ఈ చిత్రంలో తమ వాళ్ళను విలన్స్‌గా చూపెడుతూ.. చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్ని కమిటీకి ఫిర్యాదు చేశారు. దీని వల్ల నిందితుల కుటుంబ సభ్యుల హక్కులకు భంగం కలుగుతోందని వాపోయారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లల మీద ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోయిన వారిపై చిత్రాన్ని తీసి తమను మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ఫిర్యాదులో ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెంటనే నిలిపి వెయ్యాలని కమిషన్‌ను కోరారు. నిందితుల తరుఫున న్యాయవాదుల సమక్షంలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే మూవీ ప్రారంభం దశలో వివాదాలు చుట్టుముట్టడంతో దిశ చిత్రం అసలు తెరపైకి వస్తుందాలేదా అనేది సందేహంగా మారింది. కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో గతేడాది నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఎన్కౌంటర్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో.. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుర్కర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
‘దిశ’ ఘటనపై వర్మ సినిమా ఆపండి
సాక్షి, హైదరాబాద్: దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు. దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరఫు న్యాయవాది నివేదించారు. అయితే ఈ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు నివేదించారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి..కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. (చదవండి : ఉత్కంఠభరితంగా దిశ ఎన్కౌంటర్ ట్రైలర్) -
తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు..
సాక్షి, హైదరాబాద్: తన యూట్యూబ్ చానల్లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. పంజాగుట్ట కేసులో ఓ మహిళను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అన్ని రకాల హద్దులు దాటాడని అరుణ కుమారి ఆరోపించారు.(చదవండి: 139 మంది అత్యాచారం: ‘భూమి’కి న్యాయం చేయండి) తన ఇంటర్వ్యూలో సభ్యసమాజం తలదించుకునే విధంగా బాధితురాలికి ప్రశ్నలు వేశాడని మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం ఏంటని, అతను సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గతేడాది జరిగిన ‘దిశ’ ఎన్కౌంటర్ ఫేక్ అంటూ మల్లన్న వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో నవీన్ సుప్రీంకోర్టుతో పాటు ‘నిర్భయ’ చట్ట నిబంధనలను అతిక్రమించాడని, అతడిపై తగినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ కిడ్నాప్.. విడుదల! దుండిగల్: ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అనుమానాస్పద స్థితిలో కిడ్నాప్ అయ్యాడు. దుండిగల్ సీఐ వెంకటేశం తెలిపిన మేరకు..న్యూషాపూర్‌నగర్‌కు చెందిన హజ్మత్ అలీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్. మంగళవారం రాత్రి మరో యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సలీం.. అలీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే అనుమానంతో కైసర్‌నగర్ చౌరస్తా లోని బాచుపల్లి రోడ్డు వరకు ఓ ఆటోను వెంబడించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వారు అందుకు ఒప్పుకోకుండా ఆటోను మియాపూర్ వైపు పోనిచ్చారు. ఈ క్రమంలో సదరు ఆటోను బాచుపల్లి పోలీసులు కోకకోలా చౌరస్తాలో పట్టుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న రేషన్ బియ్యం తరలింపు ముఠా సభ్యులు ఇన్నోవా కారులో వచ్చి సలీంను ఎత్తుకెళ్లడానికి యత్నించగా అతను తప్పించుకోవడంతో హజ్మత్ అలీని తమ వెంటకు తీసుకువెళ్లారు. దీంతో హజ్మత్ అలీ కుటుంబ సభ్యు బుధవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హజ్మత్ అలీ దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. తనను కిడ్నాపర్లు వదిలేశారని, బస్సులో ఇంటికి చేరుకున్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని పోలీసులు రేషన్ బియ్యం ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
నిర్భయ కేసులో జేడీఏ హబీబ్‌బాషా అరెస్టు
అనంతపురం క్రైం: నిర్భయ కేసులో భాగంగా అగ్రికల్చరల్ జేడీఏ హబీబ్‌బాషాను దిశ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అనంతపురంలోని జేడీఏ ఇంటి వద్ద డీఎస్పీ ఈ.శ్రీనివాసులు నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేసి, దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 3న కళ్యాణదుర్గం అగ్రికల్చరల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగిని జేడీఏ హబీబ్ బాషా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎస్పీ బి.సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీసీఎస్ డీఎస్పీ, దిశ పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు ఆదేశాలతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ: దిశ పోలీసు స్టేషన్లో జేడీఏ హబీబ్‌బాషాను డీఎస్పీ శ్రీనివాసులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటలకు జేడీఏను ఆయన ఇంటి నుంచి స్టేషన్‌కు తరలించారు. లైంగింక వేధింపులకు సంబంధించి లోతుగా ఆరా తీశారు. ‘జూనియర్ అసిస్టెంట్ తన సొంత పనులపై వచ్చినప్పుడు మీ క్యాబిన్‌కు ఎందుకు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించారని? ఆమెకు ఎన్నిసార్లు కాల్ చేశారు తదితర విషయాలపై ప్రశ్నించారు. కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడితే అసభ్య పదజాలం ఉపయోగించారని బాధితురాలు ఆరోపించిందని, దీనిపై మీరేం సమాధానం చెబుతారంటూ హబీబ్‌బాషాను డీఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. హబీబ్‌బాషా కాల్ డేటాను పోలీసులు సేకరించి, జూనియర్ అసిస్టెంట్‌కు ఫోన్లు ఏమైనా చేశారా? అని ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలాఉంటే విచారణలో హబీబ్‌బాషా తనకేం తెలియదని చెప్పినట్లు తెలిసింది. -
తల్లిలాంటి వదినే బాలికను..
నిర్భయ, దిశ వంటి అనేక కఠినమైన చట్టాలు వస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. మైనర్లని కూడా చూడకుండా వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు బాలికలపై జరిగిన అఘాయిత్యాలు బయటపడటం కలవరపెడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కంటికి రెప్పలా కాపాడాల్సిన అయిన వారే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రక్షించాల్సిన వారే తమ జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. విషయం బయటపడితే తమతో పాటు కుటుంబ పరువు పోతుందనే భయంతో పంటి బిగువున బాధను భరిస్తూ నరకయాతన పడుతున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అంతకంటే భయంకరమైన కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై తమ కామ వాంఛను తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న అమానవీయ ఘటనలు వింటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురవ్వాల్సిన దుస్థితి దాపురించింది. తమ జీవితాలను బాగు చేయాల్సిన తల్లిదండ్రులు, అన్న వదినలు, అక్కాచెల్లెళ్లు ఇలా పేగుబంధాలనే నమ్మలేని దుర్భర పరిస్థితి నెలకొంది. జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస దుర్ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ♦ జిల్లాలో గత వారం రోజుల్లో మూడు దుర్ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక వారి వద్ద నుంచి వచ్చి అన్న, వదినల వద్ద ఉంటుంది. అయితే తల్లి తరువాత తల్లిలా భావించే వదినమ్మే ఆ బాలికను డబ్బు కోసం ఓ వ్యభిచార ముఠాకు రూ.27 వేలకు అమ్మివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను డబ్బిచ్చి కొన్న వ్యభిచార ముఠా కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ బాధ భరించలేక వారి నుంచి తనకు రక్షణ కల్పించమంటూ సదరు బాలిక డయల్ 100 కు ఫోన్ చేయడంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు బాలికను వ్యభికార కూపం నుంచి రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించే ముఠాతో పాటు ఆమె వదినపై కూడా దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన అయిన వారి అండ కోరుకునే బాలికలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ♦ ఒంగోలు నగరంలో జరిగిన మరో ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ఉంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. కొంతకాలం పాటు కుమార్తెలిద్దరూ తల్లి వద్దే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. అయితే తల్లి బలరాం కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం సాగిస్తోంది. అయితే ఆ కామాంధుడి కన్ను తన కూతురులాంటి మైనర్ బాలికపై పడింది. ఈ క్రమంలో మైనర్ బాలికను బెదిరించి రెండుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా కామాంధుడిని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ఆమె గోల చేయవద్దంటూ కూతురికి నచ్చజెప్పి ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే తల్లితో సహజీవనం చేసే వ్యక్తితో తనకు పెళ్లి ఏంటని భావించిన బాలిక బేస్తవారిపేటలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం తెలియజేసింది. దీంతో బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా కామాంధుడితో పాటు అతనితో సహజీవనం చేస్తున్న బాలిక తల్లిపై సైతం కేసు నమోదైంది. కంటికి రెప్పలా చూడాల్సిన తల్లి కన్న కూతురినే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన ఆమెను విషయం తెలిసిన వారంతా ఛీత్కరించుకుంటున్నారు. ♦ కొత్తపట్నంలో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయి, తండ్రికి చూపు సరిగా కనిపించక ఉన్న బాలికపై ఓ కామాంధుడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉంది. అయితే కామాంధుడు చేసిన పాపానికి శాపమై తన కడుపులో బిడ్డగా పెరుగుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను మథనపడుతూ మౌనంగా రోదిస్తున్న తరుణంలో దీనిని గమనించిన మేనత్త గట్టిగా ప్రశ్నించడంతో మృగాడి దాష్టీకాన్ని బయటపెట్టింది. దీంతో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ♦ ఇలా చెప్పుకుంటూ పోతే మైనర్ బాలికలపై వరుసగా లైంగిక దాడులు, అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వచ్చేవారు కాదు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరగదనే భయంతో పరువు పోతుందనే ఆందోళనతో రహస్యంగా ఉంచేవారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు మైనర్ బాలిక, మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుండటంతో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. -
‘దిశ’ ఘటన ఎన్కౌంటర్ విచారణ గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ ఎన్కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిషన్‌కు మరో ఆరు నెలల గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన దారుణంలో నిందితులను ఎన్కౌంటర్లో కాల్చి చంపిన ఘటనపై సుప్రీంకోర్టు గత డిసెంబర్ 12న న్యాయ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ ఈ ఘటనపై న్యాయ విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని, కమిషన్ విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని నాటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీని ప్రకారం ఆగస్టు 3తో నివేదిక సమర్పణకు గడువు ముగియనుంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో కమిషన్ న్యాయ విచారణ కోసం సమావేశాలు నిర్వహించలేకపోయిందని కమిషన్‌కు కౌన్సిల్‌గా ఉన్న న్యాయవాది కె.పరమేశ్వరన్ సుప్రీంకోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. కమిషన్ గడువు మరో ఆరు నెలలు పొడిగించాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కమిషన్ గడువును పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
దిశ కేసుకు కోవిడ్ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 'దిశ నిందితుల ఎన్కౌంటర్'పై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిటీ విచారణకు కరోనా అడ్డంకిగా మారింది. కోవిడ్ కారణంగా విచారణలో జాప్యం జరుగుతోందని శుక్రవారం సుప్రీంకోర్టు కమిషన్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు 1365 మంది అఫిడవిట్లను సమర్పించామని తెలిపింది. ఈ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న హైదరాబాద్‌కు చేరుకుని సమావేశమైంది. ఆ సమయంలో నిందితుల పోస్టుమార్టం రీ పోస్టుమార్టం రిపోర్ట్‌ను కూడా పరిశీలించింది. ఆ తర్వాత దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలు సేకరించింది. ఎన్హెచ్ఆర్సీ నివేదికతో పాటు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నివేదికను పరిశీలించింది. మార్చి చివరి వారంలో రెండో దఫా సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ కేసులో ఆన్లైన్లో విచారణ చేపట్టేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ) డిసెంబర్ 6న నిందితుల ఎన్కౌంటర్ రంగారెడ్డిలోని షాద్‌నగర్ సమీపంలో చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర గతేడాది నవంబర్ 27న వెటర్నరీ వైద్యురాలిని అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 6వ తేదీన సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోతుండటంతో వారిని ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థాణంలో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. (దిశ: హైదరాబాద్‌కు చేరుకున్న జ్యుడీషియల్ కమిటీ) -
‘దిశ’ దర్యాప్తు పురోగతి రెండురోజుల్లో వెల్లడి!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ కేసులో పురోగతి వివరాలు రెండురోజుల్లో వెల్లడించనున్నట్లు సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ తెలిపారు. యూపీలో ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దూబే ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న క్రమంలో ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ కేసుపైనా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ‘సాక్షి’కార్తికేయన్‌ను సంప్రదించగా.. ఆయన రెండు రోజుల్లో రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలోని కమిటీ కార్యాలయంలోనే విచారణకు చెందిన పురోగతి గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలను తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియరీ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తుండగా.. విశ్రాంత హైకోర్టు జడ్జి జస్టిస్ రేఖా సుందర్ బాల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్లు సభ్యులుగా ఉన్నారు. ఆరునెలల కాలపరిమితి విధిస్తూ.. ఆలోపు ఎన్‌కౌంటర్‌పై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. అప్పుడేం జరిగింది... ‘దిశ’కేసులో నలుగురు నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు వెటర్నరీ డాక్టర్ అయిన ‘దిశపై 2019 నవంబర్ 27న శంషాబాద్ సమీపంలో లైంగిక దాడి జరిపి, హతమార్చి పెట్రోల్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు డిసెంబర్ 6వ తేదీన సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ‘దిశ’ను దహనం చేసిన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లగా.. అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో నిందితులు నలుగురూ హతమైన సంగతి విదితమే. -
మైనర్ పెళ్లిని అడ్డుకున్న ‘దిశ’
సాక్షి, అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ మరో ఘనతను సాధించింది. దిశ యాప్‌కు వచ్చిన సమాచారంతో మైనర్ వివాహం ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ► విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం రామవరం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు బలవంతపు పెళ్లి చేస్తున్నట్టు దిశ యాప్ ద్వారా ఆదివారం ఫిర్యాదు వచ్చింది. ► దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. రామవరం గ్రామానికి వెళ్లిన పోలీస్ రెస్క్యూ బృందం మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు సేకరించారు. ► ఆమె చదువుతున్న సర్టిఫికెట్లను పరిశీలించిన పోలీసులు, బాలికకు ఇంకా 18 ఏళ్లు నిండలేదని ధ్రువీకరించుకున్నారు. బాలికకు ధైర్యం చెప్పి ఆమె తల్లిందండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ► ఈనెల 13న ముహూర్తం ప్రకారం జరపతలపెట్టిన వివాహాన్ని రద్దు చేయాలని బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ► బాలిక తల్లిదండ్రులకు నచ్చజెప్పి వివాహాన్ని పూర్తిగా రద్దు చేశారు. మైనర్‌కు పెళ్లి చేస్తే చట్టరీత్యా చర్యలు మైనర్ బాలికకు వివాహం చట్టరీత్యా నేరం. బాలికకు బలవంతంగా పెళ్లి చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఆపదలో ఉన్న మహిళలే కాకుండా మైనర్ వివాహాల వంటి వాటిపై దిశ ప్రత్యేక బృందం చర్యలు తీసుకుంటుంది. విశాఖ జిల్లాలో మైనర్‌ను స్థానిక ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కేంద్రానికి తరలించి, కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించాం. – దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ -
కల్వర్టు కింద మహిళ మృతదేహం..
-
హతమార్చి.. ముఖం ఛిద్రం చేసి..
చేవెళ్ల: నుజ్జునుజ్జయిన ముఖం.. కల్వర్టు కింద రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహం.. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన యువకుడు ఇచ్చిన సమాచారంతో రంగారెడ్డి జిల్లా తంగడపల్లిలో ఈ దారుణోదంతం వెలుగుచూసింది. ‘దిశ’ఘటనలా ఉందంటూ జరిగిన ప్రచారం కలకలం రేపింది. ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లికి చెందిన యువకుడు శేరిల్ల నవీన్ ఉదయం ఏడు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్తుండగా, వికారాబాద్– హైదరాబాద్ రహదారిపై గల కల్వర్టు కింద మహిళ మృతదేహం కనిపించింది. ముఖం మొత్తం నుజ్జయి, నగ్నంగా పడి ఉన్న ఆమె గురించి వెంటనే అతను సర్పంచ్ భర్తకు తెలిపాడు. సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్ఐ రేణుకారెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బండరాళ్లతో మోదటంతో ముఖం గుర్తుపట్టరాని విధంగా మారింది. మృతదేహం వద్ద ఓ నైలాన్ తాడు తప్ప మరే ఆధారాలు లభ్యం కాలేదు. మహిళ వివస్త్రగా పడి ఉండగా, ఆమె దుస్తులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు పరిసరాల్లో ఎక్కడా కనిపించలేదు. మృతదేహాన్ని వంతెన పైనుంచి తాడుతో కిందికి దించిన తరువాత ముఖంపై బండరాళ్లతో మోదినట్టుగా ఉంది. పక్కనున్న రాళ్లపై రక్తం అంటుకుని ఉండటంతో పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. మహిళ ఒంటిపై రెండు బంగారు గాజులు, వేలికి బంగారు ఉంగరం, మెడలో బంగారు లాకెట్ ఉన్నాయి. ఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవని, అంటే వేరే ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడి, హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు: డీసీపీ ఘటన జరిగిన తీరు.. మరో ‘దిశ’ఉదంతంలా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోందని, లభ్యమైన బంగారు నగలను ల్యాబ్‌కు తరలిస్తామని చెప్పారు. ఘటనపై సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లను అప్రమత్తం చేశామన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించిన వాహనాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఓటీ అడిషనల్ డీజీపీ సందీప్‌కుమార్‌తో పాటు క్లూస్‌టీం సభ్యులు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలు ఘటనా స్థలంలోనే తచ్చాడాయి. మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే భద్రపరిచారు. భయమేసింది.. మాది తంగడపల్లి. డ్రైవింగ్ చేస్తాను. ఉదయం 7 గంటలకు బహిర్భూమికని బైక్‌పై వచ్చాను. కల్వర్టు కింద తెల్లగా, బొమ్మలా ఏదో కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే మహిళ మృతదేహం.. ఒక్కసారిగా భయమేసింది. ఇటువంటివి ఇంతకుముందెప్పుడూ చూడలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి సర్పంచ్ భర్త సత్తయ్యగౌడ్‌కు చెప్పాను. అనంతరం పోలీసులు వచ్చి పరిశీలించారు. – శేరిల్ల నవీన్, తంగడపల్లి, ఘటనను మొదటగా చూసిన వ్యక్తి -
యువతి పై అత్యాచారం,హత్య
-
రంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన!
సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మొహంపై కొందరు దుండగులు బండరాయితో మోదీ దారుణంగా హతమార్చారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహం బయటపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళపై అత్యాచారం జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసు ఆధారంగా కేసు విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలోని మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. రంగంలోకి ఐదు బృందాలు: శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈరోజు ఉదయమే ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాం. మహిళ ఒంటిపై దుస్తులు లేవు. వివస్త్రగా మృతదేహం పడిఉంది. ఆమె తలపై బండ రాయితో మోది చంపేశారు. అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుంది. కేసును ఛేదించేందుకు ఐదు బృందాలను రంగంలోకి దింపాం. అన్ని కమిషనరేట్ల పరిధిలో పోలీసుల్ని అలర్ట్ చేశాం. త్వరలోనే కేసు ఛేదిస్తాం. మృతురాలి వయసు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుంది. ఆమె ఒంటిపై బంగారు గొలుసు, చేతికి రింగ్, చెవులకు కమ్మలు ఉన్నాయి. -
దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి
సాక్షి, నారాయణపేట : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి తండ్రి కురమయ్య మృతిచెందారు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్నిరోజులపాటు చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితమే కురమయ్య కుటుంబ సభ్యులు ఆయన్ని తన స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకునివెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే మృతి చెందారు. కాగా దిశ అత్యాచార కేసులో ఏ4గా ఉన్న చెన్నకేశవులు పోలీసుతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కురమయ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గుడిగండ్ల వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక) -
రేణుక, ఆమె బిడ్డకు సాయం చేయండి: ఆర్జీవీ
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్థిక సహాయం అందించాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక భవిష్యత్తు బాగు కోసం తోచిన విధంగా విరాళం అందించి తనను ఆదుకోవాలని కోరారు. ‘‘చెన్నకేశవులు భార్య రేణుక పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే రేపిస్టుల నీడ వారి భవిష్యత్తుపై పడకుండా ఉండాలంటే.. దయచేసి ఎవరికి తోచిన సాయం వారు చేయండి’’అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. యాక్షన్ ఎయిడ్ ఫర్ సోసైటల్ అడ్వాన్స్మెంట్(ఏఏఎస్‌ఏ) అకౌంట్ నంబరును షేర్ చేసి... రేణుకకు విరాళం ఇవ్వాల్సిందిగా కోరారు. కాగా దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగే నాటికి చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.(నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం: వర్మ) ఇక రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో మెటర్నరీ వైద్యురాలిపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం ఆమెను తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వారిని ఘటనాస్థలికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా వారిని ఎన్కౌంటర్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇక ఈ దిశ ఘటనపై తాను సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను ఆయన ఇటీవల కలిశారు. పలువురు పోలీసు అధికారులతోనూ భేటీ అయ్యారు. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ) Chenna Keshavlu wife Renuka gave birth to baby girl and both are fine .What won’t be fine is their future becos of rapists ugly shadow ..Please donate whatever u can for them Account: Action Aid for societal Advancement AASA, 918010050607980 AXIS BANK IFSC code: UTIB0001454 pic.twitter.com/FzsLsRGHwd — Ram Gopal Varma (@RGVzoomin) March 7, 2020 -
మరోసారి తెరపైకి ‘దిశ’ కేసు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య- నిందితుల ఎన్కౌంటర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దిశ నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అని.. అందులో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జ్యూడిషియల్ కమిషన్‌ను కలిసేందుకు వారు హైకోర్టుకు చేరుకున్నారు. పరిహారంపై కమిషన్ ముందు ప్రస్తావించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం కమిషన్ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్యూడిషియల్ కమిషన్‌కు నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్ దాఖలు చేశారు.(దిశ నిందితుల ఎన్కౌంటర్లో నేరం జరిగిందా?) కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో గతేడాది నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఎన్కౌంటర్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో... మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుర్కర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసింది. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ) -
‘దిశ’ ఘటన; అధికారుల దిద్దుబాటు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు తొండుపల్లి టోల్గేట్ ప్లాజా సర్వీసు రోడ్డు వద్ద ‘దిశ’పై గతేడాది నవంబర్ 27న అత్యాచారం, ఆపై చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద మృతదేహం కాల్చివేత ఘటనతో ఉలిక్కిపడిన హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగాధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఆ ఘటనలు జరిగిన సమయాల్లో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న వాదన రావడంతో హెచ్ఎండీఏ అనుబంధ విభాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఓఆర్ఆర్ విభాగాధికారులు మేల్కొన్నారు. అప్పటి హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిచందన దాసరి ఆదేశాలతో డిసెంబర్లో ఓఆర్ఆర్ అండర్‌పాస్‌లలో ఎల్ఈడీ, సౌర లైట్లు అమర్చేందుకు టెండర్లు పిలిచారు. 158 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓఆర్ఆర్కు ఉన్న 165 అండర్‌పాస్ వేలలో రూ.1.90 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. బుధవారం నుంచి అన్నిచోట్లా ఈ వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు చెబుతున్నా, కొన్నిచోట్లా మాత్రం ఇంకా పనులు పూర్తికాలేదని కిందిస్థాయి సిబ్బంది అంటున్నారు. ఏదేమైనా దిశ ఘటనతో అధికారులు మేల్కొని రాత్రివేళల్లో వెలుగులు ఉండేలా చూడటం శుభ పరిణామమని వాహ నదారులు అంటున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, మహిళల భద్రతకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. -
చటాన్‌పల్లిలో ‘దిశ’ సినిమా షూటింగ్
షాద్‌నగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిర్వహించారు. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ) శంషాబాద్‌లో అత్యాచారం, హత్య అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే చటాన్‌పల్లి శివారులో మృతదేహాన్ని కాల్చివేసిన బ్రిడ్జి వద్ద స్కూటీ, లారీతో సన్నివేశాన్ని కూడా చిత్రీకరణ చేశారు. కాగా దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ ఈ నెల 17న శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్‌ను కలిసి దిశ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ ) -
‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ
శంషాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనమైన ‘దిశ’ఘటనను తనకున్న సామర్థ్యంతో ఉద్వేగభరితంగా చిత్రం తీసేందుకు యత్నిస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘దిశ’చిత్ర కథను తయారు చేసుకునే క్రమంలో సోమవారం శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కథ పరిశోధనలో ఉండటంతో అందులో ప్రధానమైన అంశం ఏమిటనేది ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. -
దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనను తెరకెక్కించబోతున్న డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ... ఆ దిశగా సన్నాహాలు వేగవంతం చేశారు. వర్మ ఉన్నట్టుండి సోమవారం రోజున రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. అక్కడి ఏసీపీ అశోక్‌కుమార్‌తో భేటీ అయ్యారు. దిశ ఘటనపై ఆయనతో చర్చలు జరిపారు. దిశ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెపై అత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్కౌంటర్ జరిగిన వరకూ ఉన్న పరిస్థితులు కేసు వివరాలను ఏసీపీ వివరించారు. త్వరలో మరికొందరు పోలీస్ అధికారులను కూడా కలుస్తానన్న ఆయన.. సమాచారన్నంతా సేకరించిన తర్వాత తాను సినిమాలో ఏం చూపించాలన్న దానిపై నిర్ణయానికి వస్తానన్నారు. చదవండి: దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ దిశ ఘటనపై ఓ సినిమా చేస్తానని ఈ మధ్య ప్రకటించిన నేపథ్యంలో ఆయన పోలీసులను కలడం ఆసక్తిగా మారింది. రామ్‌గోపాల్ వర్మ ఇటీవల దిశ ఘటనపై స్పందించి అత్యాచారానికి పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కూడా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సినిమా తీస్తానని ప్రకటించారు. దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి తాను శంషాబాద్ ఏసీపీని కలిసినట్టు వెల్లడించారు. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధనకు ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం సృష్టించిందని, ఒక ఎమోషనల్ క్యాప్చర్ చేయాలన్నదే తన ప్రయత్నమని వర్మ చెప్పారు. చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ -
‘దిశ’ పోలీస్ స్టేషన్లో తొలిగా 2 కేసులు
రాజమహేంద్రవరం క్రైం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాజమహేంద్రవరంలో ప్రారంభించిన దిశ మహిళా పోలీస్ స్టేషన్లో తొలిసారిగా ఆదివారం రెండు కేసులు నమోదయ్యాయి. భర్తల వేధింపులకు గురవుతున్న ఇద్దరు మహిళలు ఈ మేరకు ఫిర్యాదులు చేశారు. వారికి వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి తోడ్పాటు అందించారు. భర్త, అత్తమామలు వరకట్నం తీసుకురావాలంటూ తనను వేధిస్తున్నారంటూ నగరంలోని ఇన్నీసుపేటకు చెందిన కొండపల్లి మౌనికాదేవి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరువర్గాలకూ రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినప్పటికి వారిలో మార్పు రాకపోవడంతో దిశ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆదివారం మొట్టమొదటి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా మహిళా ఎస్సై రేవతిని నియమించారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తారని తెలిపారు. అలాగే తన భర్త శ్రీరామ్ రవితేజను అత్తమామలు మూడు నెలలుగా దాచేసి, కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేస్తున్నారని స్థానిక నెహ్రూనగర్ సుబ్బారావుపేటకు చెందిన వివాహిత జ్యోతిర్మయి ఫిర్యాదు చేసింది. తమకు దివ్యాంగురాలైన బిడ్డ పుట్టిందని, ఆ కుమార్తె తనవల్లనే మృతి చెందినట్లు వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసి బాధిత మహిళలకు న్యాయం చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ దగా పడిన మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత అండగా దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. -
ల్యాబ్స్ కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్
సాక్షి, రాజమండ్రి: బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే దిశ చట్టం లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేరం చేసిన వాళ్లు ఎవరైనా సరే వారిని శిక్షించడం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దిశ చట్టం దేశంలోనే ప్రత్యేకమైనదని తెలిపారు. శాంతి భద్రతలే తమ మొదటి ప్రాధాన్యం అని.. ముఖ్యంగా మహిళల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రాజమండ్రిలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్‌ను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దిశ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజిని సహా డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని.. చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మద్యం సేవించి రాక్షసులుగా మారి అత్యాచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి క్రూరులను శిక్షించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. అయితే సినిమాల్లో చూపించినట్లుగా వ్యవస్థలో స్వేచ్ఛ ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నపుడే అకృత్యాలు తగ్గుతాయని పేర్కొన్నారు. నేరాలను అదుపులోకి తెచ్చి వ్యవస్థలో మార్పులు చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. (కన్నీళ్లు తుడిచే ‘దిశ’గా..) ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు.. ‘‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే 7 రోజుల్లోనే దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి. ఉరిశిక్ష అమలు చేయడానికి అనువుగా దిశ చట్టం తీసుకవచ్చాం. వ్యవస్థలో మార్పులు రావాలి. ఈ రోజు రాజమండ్రిలో దిశ తొలి మహిళా పోలీసు స్టేషన్‌ను ప్రారంభించాం. మహిళల కోసం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లు. డీఎస్పీ స్థాయి నేతృత్వంలో 47 మంది సిబ్బంది పనిచేస్తారు. 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ. 26 కోట్లు కేటాయిస్తున్నాం. హైకోర్టు అనుమతితో త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తాం. విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు విడుదల చేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.( దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం.. దిశ చట్టంలో ప్రత్యేకతలు) అదే ప్రభుత్వ లక్ష్యం.. ‘‘ప్రతీ అడుగులోనూ అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటా. వారి పిల్లలకు మేనమామలా ఉంటా. 42 మంది లక్షల తల్లులకు అమ్మఒడి అందించాం. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. సున్నావడ్డీతో మహిళలకు రుణాలు. ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచి అవతరించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని మహిళా సాధికారికతకై సర్కారు చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ తెలిపారు. -
కన్నీళ్లు తుడిచే ‘దిశ’గా..
మహిళలకు రక్షణగా ఉంటూ.. వారిపై జరిగే నేరాల్లో దర్యాప్తు, విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షపడేట్లు చేసేలా రూపొందించిన ‘దిశ’ చట్టాన్ని అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను రూపొందించింది. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరం దర్గా సర్కిల్లో ఉన్న మహిళా స్టేషన్‌ను ఉన్నతీకరించి కొత్త హంగులతో దిశ స్టేషన్‌ను నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా వీడియో కాన్ఫరెన్సు (వీసీ) ద్వారా ఈ స్టేషన్‌ను శుక్రవారం ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి కేసులంటే.. మహిళలు, బాలికలపై జరిగే అన్ని ఘటనలపై దిశ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యొచ్చు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, లైంగిక దాడులు, అఘాయిత్యం, వేధింపులు, యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, ప్రేమపేరిట మోసాలు, కుటుంబ కలహాలు.. ఇలా మహిళలకుఎదురయ్యే ఇబ్బందులపై దిశ స్టేషన్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఎక్కడ నేరం జరిగినా దిశ స్టేషన్‌ను ఆశ్రయించవచ్చు. బాధిత మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదుచేసిన తరువాత పోలీసులు వారం రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానానికి చార్జ్‌షీట్ దాఖలుచేస్తారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన ఆధారాలు లభిస్తే వారం రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి, 14 రోజుల్లో న్యాయస్థానం ద్వారా విచారణ పూర్తయ్యేలాచేసి మొత్తం.. 21 రోజుల్లో శిక్షపడేలా చూస్తారు. అలాగే పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటిని కూడా ‘పోక్సో’ చట్టం కిందకు తీసుకొచ్చి 21 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తిచేసేలా దిశ చట్టంలో సవరణలు చేశారు. మహిళలపై లైంగిక దాడుల్లో దిశ చట్టం ప్రకారం మరణశిక్ష... పోక్సోలో గరిష్టంగా జీవితఖైదు పడేలా చేస్తారు. వన్స్టాప్తో సంధానం దిశ పోలీస్ స్టేషన్‌కు అనుగుణంగా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా వన్‌స్టాప్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా చివరిదశలో ఉన్నాయి. దిశ, వన్‌స్టాప్ కేంద్రం ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని బాధితులు వన్‌స్టాప్ సెంటర్‌కు వచ్చి వారి బాధను ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. బాధితురాలికి తొలుత కౌన్సెలింగ్ ఇచ్చి.. అవసరమైతే వైద్యసేవలు అందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆమె ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండడానికి వసతి కల్పిస్తారు. నేరం దిశ చట్టం కిందకు వస్తే 21 రోజుల్లో దర్యాప్తు, కోర్టులో ట్రయల్ పూర్తిచేసి శిక్ష పడేందుకు ఉచిత న్యాయవాదిని కూడా నియమిస్తారు. ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులతో పాటు పోలీసుశాఖ నుంచి ముగ్గురు, స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వాహకులు, వైద్యులు, లీగల్ కౌన్సెలర్‌తో ఉంటారు. పూర్తిస్థాయిలో సిబ్బంది దిశ చట్టం ప్రకారం స్టేషన్లో నమోదయ్యే కేసుల విచారణ, సాక్ష్యాల సేకరణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకం కోసం పోస్టులు కూడా మంజూరుచేసింది. ఇద్దరు డీఎస్పీలు, ఎస్ఐలు –5, ఏఎస్ఐ –2, హెడ్‌కానిస్టేబుల్–6, కానిస్టేబుల్–19, సైబర్ అనాలసిస్, హోంగార్డులు, డ్రైవర్లు, సహాయకులు కింద ఎనిమిది పోస్టులు మంజూరయ్యాయి. కేసుల విచారణ ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానంలో విచారణ జరగేప్పుడు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సైతం నియమించడానికి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం మంజూరుచేసిన పోస్టుల్లో కొన్ని ఇప్పటికే భర్తీకాగా మరికొన్నింటిని వీలైనంత త్వరగా భర్తీచేయనున్నారు. ధైర్యంగా రండి మహిళలు ఎక్కడైనా ఇబ్బందులకు గురైనా, దాడులు జరిగినా వెంటనే పోలీస్ స్టేషన్‌కు రండి. మావాళ్లు స్పందిస్తారు. మహిళలపై నమోదయ్యే కేసుల్లో దిశ చట్టం పరిధిలోకి వచ్చేవాటిలో నోటిఫికేషన్ వచ్చిన తరువాత 21 రోజుల్లో నిందితులకు శిక్షపడేలా చేస్తాం. అప్పటివరకు కూడా నమోదయ్యే కేసులను సైతం టాప్ ప్రియారిటీగా పరిగణించి వేగవంతంగా దర్యాప్తు పూర్తిచేసి నిందితులకు శిక్షపడేలా చేస్తాం. ఆపదలో ఉన్నప్పుడు సాయంకోసం డయల్–100, 181, పోలీస్ వాట్సాప్ : 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వండి. – ఎస్.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు