మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ‘ ఏపీ దిశ యాక్ట్’కు హట్సాఫ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా చట్టం చాలా మంచిదని కొనియాడుతున్నారు. ఇలాంటి చట్టాన్ని ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశం మొత్తం తీసుకురావాలని కోరుతున్నారు.