Disha
-
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్‌లోని బటన్‌ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్‌పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్‌ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.ఏఎన్ఎం యాప్‌లో 15 మాడ్యూల్స్...2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్‌లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్‌గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్‌కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.టెక్నాలజీతో రైతుకు దన్ను...‘ఈ–కర్షక్’ యాప్‌తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్‌తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్‌ను వివిధ యాప్‌లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్‌తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.అర చేతిలో ఆరోగ్యశ్రీ...ఆరోగ్య శ్రీ యాప్‌లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్‌నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్‌ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలు ఈహెచ్‌ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్‌కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థదేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్‌లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్‌లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది.♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
పేదవాడికి ఆరోగ్యశ్రీ చేరువ చేయడమే లక్ష్యం: సీఎం జగన్
-
Disha Naik: ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్
గోవాకు చెందిన దిశా నాయక్ చరిత్ర సృష్టించింది. విమానాశ్రయాల్లో అగ్ని ప్రమాదాలను నివారించే భారీ వాహనం ‘క్రాష్ ఫైర్ టెండర్’ను నడిపే తొలి భారతీయ వనితగా గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమోట్ అయ్యింది. గోవా వాసులు సరే, విమానయాన రంగం కూడా ఆమెను ప్రశంసగా చూస్తోంది. అగ్నిప్రమాదాలు ప్రాణాంతకం. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే అగ్ని ప్రమాదాలు మరీ తీవ్రం. సెకన్ల వ్యవధిలో చావు బతుకులు నిర్ణయమవుతాయి సరిగ్గా స్పందించకపోతే. అందుకే ప్రత్యేకంగా ‘ఏరోడ్రోమ్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్’ (ఏ.ఆర్.ఎఫ్.ఎఫ్.) సర్వసమయాల్లోనూ సిద్ధంగా ఉంటుంది ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో. అయితే ఈ విభాగంలో స్త్రీల ప్రాతినిధ్యం చాలా తక్కువ. 2021 వరకు గోవాలో ఒక్క మహిళ కూడా ఈ విభాగంలో లేదు. దిశా నాయక్ ఈ ఉద్యోగంలో చేరి గోవాలో తొలి ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె ‘క్రాష్ ఫైర్ టెండర్’ నడిపే ఫైర్‌ఫైటర్‌గా ప్రమోట్ అయ్యింది. దాంతో మన దేశంలో క్రాష్ ఫైర్ టెండర్‌ను ఆపరేట్ చేసే తొలి సర్టిఫైడ్ ఉమన్ ఫైర్‌ఫైటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. క్రాష్ ఫైర్ టెండర్ (సి.ఎఫ్.టి.) అంటే? ఇది హైటెక్ ఫైర్ ఇంజిన్. అగ్నిమాపక దళంలో కనిపించే ఫైర్ ఇంజిన్‌కు, దీనికి చాలా తేడా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో, విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలార్పేలా ఈ ఫైర్ ఇంజిన్‌ను తయారు చేస్తారు. దీనిని నడపడానికి, మంటలు ఆర్పేలా ఆపరేట్ చేయడానికి తీవ్రశిక్షణ అవసరం. సాధారణంగా మగవారు రాణించడానికే కొంత శ్రమ పడతారు. అలాంటిది దిశా నాయక్ అన్ని పరీక్షలు పాసై సి.ఎఫ్.టి.ని ఆపరేట్ చేసే మహిళా ఫైర్‌ఫైటర్ అయ్యింది. యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని.. గోవాలోని పెర్నెమ్కు చెందిన దిశా నాయక్‌కు బాల్యం నుంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని కోరిక. అయితే చదువు పూర్తయ్యాక అలాంటి ఉద్యోగం ఏమీ దొరకలేదు. 2021లో గోవాలోని ‘మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’లో ఫైర్‌ఫైటర్ ఉద్యోగాలకు పోస్టులు పడ్డాయి. ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళం లో అప్పటికి ఎవరూ అమ్మాయిలు లేకపోయినా దిశా అప్లై చేసింది. ‘మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకు. మోటర్ సైకిల్ నడిపేది. రన్నింగ్ బాగా చేసేది. ఆమె ఫైర్‌ఫైటర్‌గా చేరతానంటే రాణిస్తుందనే నమ్మకంతోనే ప్రోత్సహించాం’ అంటారు తల్లిదండ్రులు. వారి ప్రోత్సాహంతో జూన్ నెలలో ఉద్యోగంలో చేరింది దిశా. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దిశాలోని చురుకుదనం, అంకితభావం పై అధికారులు గమనించారు. కేవలం సహాయక సిబ్బందిగా ఉండటం కంటే క్రాష్ ఫైర్ టెండర్‌ను నడిపేందుకు ఆమె ఆసక్తి చూపడం గమనించి ఆమెను ట్రైనింగ్‌కి పంపారు. తమిళనాడులోని నమక్కల్‌లో ఆరునెలల పాటు శిక్షణ తీసుకుంది దిశ. ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించే తీరు, ఏ ప్రమాదంలో సి.ఎఫ్.టి.ని ఎలా ఉపయోగించాలి... అక్కడ ఆమెకు నేర్పించారు. తిరిగి వచ్చాక ఉన్నతాధికారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఆమె ప్రావీణ్యాన్ని నిర్థారించి సి.ఎఫ్.టి ఆపరేటర్‌గా ప్రమోట్ చేశారు. ‘ఆమె అన్నిరకాల పరీక్షల్లో ఉత్తమంగా నిలిచింది’ అని తెలిపారు. అన్నివిధాలా సిద్ధంగా ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే సంఘటనాస్థలికి చేరుకోవడం కంటే చేరుకున్నాక ఏం చేయాలన్నదే ఎక్కువ ముఖ్యం. ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా పని చేసేవారికి ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని ప్రవేశమార్గాలు, కీలకమైన ద్వారాలు, ముఖ్యస్థానాలు మైండ్‌లో ప్రింట్ అయి ఉండాలి. ప్రమాదం జరిగితే ఎక్కడికి చేరి ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఈ ఉద్యోగంలో క్షణాల్లో యూనిఫామ్‌లోకి మారి వెహికిల్‌లో కూచోవాలి. శారీరక బలంతో పాటు మానసిక బలం ప్రదర్శించాలి. సాంకేతిక జ్ఞానం కూడా తప్పనిసరి’ అని తెలిపింది దిశ. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!
సింగర్, బిగ్‌బాస్-14 కంటెస్టెంట్ రాహుల్ వైద్య, బుల్లితెర నటి దిశా పర్మార్ తల్లిదండ్రులయ్యారు. ఈ జంట గతంలో చాలా సార్లు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం దిశా పర్మార్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బేబీ, తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా మా ఇంటికి బిడ్డ రావడం సంతోషంగా ఉందని అన్నారు. (ఇది చదవండి: ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!) ఇన్‌స్టాలో రాస్తూ..'మా ఇంటికి లక్ష్మీ తల్లి వచ్చింది. మమ్మల్ని ఆ దేవుడు ఆడబిడ్డతో ఆశీర్వదించాడు. మమ్మీ, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు అండగా నిలిచిన వైద్యులకు మా కృతజ్ఞతలు. మాకు ఉత్తమమైన సేవలు అందించినందుకు మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంతోషకరమైన సమయంలో మా పాపను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఏనుగు బొమ్మతో ఉన్న కార్టూన్ ఫోటోను షేర్ చేశారు. గణేశ్ చతుర్థి సందర్భంగా పాప పుట్టడంతో అలా ఆనందాన్ని పంచుకున్నారు. మీ ఇంటికి గణేష్‌తో పాటు మీరు లక్ష్మీ దేవిని కూడా స్వాగతించారు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా.. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్- 14లో 2020లో ఆమె పుట్టినరోజు సందర్భంగా దిశాకు రాహుల్ ప్రపోజ్ చేశాడు.రాహుల్ వైద్య, దిశా పర్మార్ జూలై 16, 2021న ముంబైలో వివాహం చేసుకున్నారు. సింగింగ్ రియాలిటీ షో అయిన ఇండియన్ ఐడల్ మొదటి సీజన్లో రాహుల్ కనిపించారు. అతను కేహ్ దో నా, తేరా ఇంతేజార్, యాద్ తేరీ వంటి పాటలు పాడారు. అంతే కాకుండా ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్- 11లో కూడా పాల్గొన్నాడు. దిశా పర్మార్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత టీవీ షో ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాలో నకుల్ మెహతా సరసన నటించింది. దిశా వో అప్నా సా షోలో కూడా కనిపించింది. ఆమె నటించిన బడే అచ్చే లాగ్తే హై- 2తో ఫేమ్ తెచ్చుకుంది. (ఇది చదవండి: నోరుజారిన డాక్టర్‌బాబు.. రెచ్చిపోయి ఛాలెంజ్ చేసిన శోభా) View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక
పశ్చిమ గోదావరి: కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే కేంద్ర హోం మంత్రి పతకానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి అత్యుత్తమ నేరపరిశోధన చేసిన రాష్ట్రానికి చెందిన ఐదురుగు పోలీసు అధికారులు ఈ పతకానికి ఎంపిక కాగా వారిలో ఒకరు ధనుంజయుడు. నేర పరిశోధనల్లో ఉన్నత ప్రమాణాల్ని ప్రోత్సహించడం కోసం 2018 నుంచి పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు అందిస్తోంది. 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ డీఎస్పీగా ధనుంజయుడు పని చేస్తున్న సమయంలో రెండు కీలకమైన కేసులను చేధించడంలో విశేష కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పతకం అందిస్తున్నారు. ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ బాపట్ల జిల్లా చీరాల మండలం చీపురుపాలెం ధనుంజయుడి స్వగ్రామం. చీరాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991లో ఎస్సైగా డీటీసీలో శిక్షణ పొందారు. గుంటూరు జోన్ నుంచి ఎంపికై న ఈయన నెల్లూరు జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా నియమితులయ్యారు. ఆ తరువాత ఉదయగిరి, కావలి టూటౌన్, సంగం, ఆత్మకూరు పోలీస్స్టేషన్లలో ఎస్సై పనిచేశారు. నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి జరగడంతో ఆ సమయంలో ధనుంజయుడిని అక్కడికి పంపారు. ఆ తరువాతి కాలంలో నెల్లూరు త్రీ టౌన్‌కు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి చెంది విజయవాడలో సీఐడీ విభాగంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం మూడేళ్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్ డీఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అలాగే విశాఖ ట్రాఫిక్ ఏసీపీగా 10 నెలలు పనిచేశారు. సాంకేతిక ఆధారాలతో కేసుల నిరూపణలో ప్రతిభ 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలు దిశ డీఎస్పీగా రెండేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలోనే రెండు కీలకమైన కేసులు చేధించడంలో కీలకంగా పనిచేశారు. గిద్దలూరు మండలం అంబవరంలో ఏడేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ కేసును ధనుంజయుడు చాలెంజింగ్ తీసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి గత జనవరిలో కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే కందుకూరులో 15 ఏళ్ల బాలికను నిర్భంధించి వ్యభిచారం కూపంలోకి నెట్టారు. వారం రోజుల పాటు బాలికపై 25 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కూడా చాలెంజింగ్‌గా తీసుకుని సెల్‌ఫోన్, ఫోన్‌పే ఆధారంగా నిందితులను గుర్తించారు. 25 మంది ఆ వారం రోజుల పాటు వినియోగించిన కండోమ్‌లు డీఎస్పీ స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షలకు పంపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాలికతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు. దీంతో 25 మందిని బాలిక గుర్తించింది. అన్ని ఆధారాలతో ఈ కేసును నిరూపించారు. ఈ కేసును చేధించడంలో సాంకేతిక ప్రమాణాలు పాటించారు. ఈ రెండు కేసులు చేధించడంలో డీఎస్పీ విజయం సాధించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ.. డీజీపీ ద్వారా వీటి వివరాలను కేంద్రానికి పంపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్రం ధనుంజయుడిని కేంద్ర హోం మంత్రి పతకానికి ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా నుంచి ఆయన తాడేపల్లి సిట్‌కు డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా అత్యంత ప్రతిభ కనబర్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.250 కోట్ల దుర్వినియోగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇటీవల బదిలీల్లో భాగంగా మే నెలలో జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బదిలీపై వచ్చారు. -
త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్.. బుల్లితెర జంట కుప్పిగంతులు, ట్రోలింగ్
బిగ్‌బాస్ జోడీ సింగర్ రాహుల్.. నటి దిశా పార్మర్ త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే మెటర్నటీ ఫోటోషూట్ కూడా చేసి ఆయా ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే మెటర్నటీ షూట్ సందర్భంలో చేసిన చిలిపి పనులను, కుప్పి గంతులను తాజాగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న రాహుల్- దిశా సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. దిశా బేబీ బంప్‌ను ఆప్యాయంగా తడుముతూ ముద్దు పెట్టాడు రాహుల్. అభిమానులు వీరి ఆనందాన్ని చూసి మురిసిపోతుంటే మరికొందరు మాత్రం ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ప్రపంచంలో పిల్లలను కంటున్న మొదటి జంట మీదే అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారే అని ట్రోల్ చేస్తున్నారు. అలా మొదలైంది.. సింగర్ రాహుల్ హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో పాల్గొన్నాడు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో దిశా బిగ్‌బాస్ ఇంట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె బర్త్‌డే రోజు తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాడు రాహుల్. మోకాళ్ల మీద కూర్చుని పెళ్లి చేసుకోమని అడిగాడు. అందుకు ఆమె పచ్చజెండా ఊపడంతో 2021 జూలై 16న పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2023 మే 18న అమ్మానాన్న కాబోతున్నామంటూ రాహుల్, దిశ గుడ్‌న్యూస్ చెప్పారు. View this post on Instagram A post shared by Disha Parmar Vaidya (@dishaparmar) చదవండి: మళ్లీ పెళ్లి ఏ ఓటీటీలోకి రానుందంటే? -
ఉద్యోగినిపై వేధింపులు.. దిశ పోలీసులకు కాల్.. ఆరు నిమిషాల్లోనే
శ్రీకాకుళం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం, ఎస్ఓఎస్ యాప్ సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా పొందూరు మండలంలో బుధవారం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పొందూరు మండలంలో పనిచేస్తున్న ఉద్యోగినిని రణస్థలం మండలం కోటపాలెం సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎ.ధర్మారావు వేధింపులకు గురిచేశాడు. బైక్‌పై ఉద్యోగానికి వెళ్తున్న యువతిని రాపాక జంక్షన్ వద్ద అడ్డగించి బెదిరించాడు. వెంటనే అమ్మాయి ప్రాణభయంతో దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి సహాయం కోరింది. దీంతో ఆరు నిమిషాల్లో సంఘటనా స్థలానికి దిశ పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బాధితురాలికి భరోసా కల్పించారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. -
శ్వేత కేసును దిశాకు అప్పగించిన న్యూపోర్ట్ పోలీసులు
-
బిడ్డల చెంతకు చేరిన తల్లి
కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్‌స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది. సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్‌పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు. దిశ వన్‌స్టాప్ బృందం ఏఎస్ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది. -
సత్ఫలితాలిస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్
సాక్షి, అమరావతి: దిశ స్పూర్తితో మహిళలపై జరిగిన నేరాల్లో బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా రాష్ట్ర పోలీస్ శాఖ అవలంభిస్తున్న కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలిస్తోంది. ఈ విధానాన్ని గత ఏడాది జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో, మహిళలు హత్య, అత్యాచారం, ఇతర వేధింపులకు గురైన కేసులను జిల్లాకు ఐదు చొప్పున ఎంపికచేసి ఏడురోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి, దాదాపు 108 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో 48 కేసుల్లో కోర్టు విచారణ పూర్తయి నేరస్తులకు జీవితఖైదుతో పాటు, ఏడు నుంచి 25 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడింది. 13 కేసుల్లో విచారణ పూర్తయి తీర్పులు రిజర్వ్ అయ్యాయి. 47 కేసుల్లో విచారణ ముగింపుదశలో ఉంది. మరోవైపు గత ఏడాది నమోదైన 101 పోక్సో కేసుల్లో నేరస్తులకు కోర్టుల్లో కఠిన శిక్షలు పడ్డాయి. దిశ స్ఫూర్తితో పోలీస్ శాఖ చేసిన కృషితో ఈ ఏడాది రాయచోటి, కోనసీమల్లో మహిళలు అత్యాచారం, హత్యకు గురైన కేసులు, ఏలూరు జిల్లాలో తల్లీకూతుళ్ల అమానూష హత్య, బాపట్లలో ప్రేమ పేరుతో వేధింపులకు గురై యువతి హత్యాయత్నం సహా పలు కేసుల్లో ఏడురోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. ఈ విధానంలో ఎస్పీలు తమ పరిధిలో నమోదైన మహిళలు, యువతులు, చిన్నారులపై జరిగిన ఐదు తీవ్రమైన నేరాల కేసులను ప్రాధాన్యమైనవిగా ఎంపిక చేస్తారు. ఈ కేసులను.. ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్షిస్తారు. తద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్షపడటమేగాక ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోకుండా అవకాశం ఉంటుంది. ఈ కేసులపై ఐపీఎస్ అధికారి ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడంతో నేరస్తులు సాక్షులను బెదిరించే ఘటనలకు ఆస్కారం ఉండదు. డీజీపీ సైతం తన రోజువారీ ఎస్పీల టెలీకాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఈ కేసులపై చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. సమష్టి కృషితోనే సాధ్యం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలిస్తోంది. నేరస్తులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నుంచి అన్ని స్థాయిల్లోని అధికారుల సమష్టికృషితోనే ఇది సాధ్యం అవుతోంది. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. – కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
అంబర్‌పేట్‌లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం
-
దిశ ఎన్కౌంటర్ కేసు: లారీ ఓనర్ ఆ విషయం చెప్పనేలేదు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో.. తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో దిశ ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన నివేదికపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా గ్రోవర్.. తన వాదనలు వినిపించారు. ఎన్కౌంటర్ జరిగిన తీరును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వృందా.. పోలీసులు వెల్లడించిన తీరుపైనా పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీ లో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్ కౌంటర్ చేశారని ఆమె వాదించారు. సీసీ టివీలో లారీను చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. కానీ.. కమిషన్ ముందు శ్రీనివాస్ రెడ్డి ఆ విషయం చెప్పనే లేదు అని ఆమె పలు అంశాలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారామె. ఈ క్రమంలో.. ఇవాళ్టితో ఆమె వాదనలు ముగిశాయి. ఇక.. మిగిలింది ప్రభుత్వం తరపున వాదనలే. దీంతో తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
మాయని మచ్చగా తొండుపల్లి ఘటన.. ఆ అమానుషానికి మూడేళ్లు
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. – షాద్‌నగర్ 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. మారిన చట్టాలు దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అప్రమత్తత అవసరం సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
ప్రేమజంటపై దాడి కేసులో పురోగతి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: ప్రేమజంటపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆత్మకూరు మండలం పంపనూరు సిటీ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రేమికులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సీరియస్‌గా పరిగణించారు. దీనిని సవాలుగా తీసుకుని ఛేదించాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పంపనూరు సమీపంలోని వడ్డుపల్లి మిట్ట వద్ద ప్రేమికులపై దాడి చేసిన ముఠా ఆనవాళ్లను 24 గంటల్లోపే పసిగట్టారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాల మేరకు అనంతపురం నగరానికి చెందిన అల్లరి మూకలే దాడులకు కారణంగా గుర్తించారు. అనంతరం వారు అపహరించిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలోనే నగరంలోని రాజీవ్ కాలనీ, హెచ్చెల్సీ కాలనీకి చెందిన ఇద్దరితో పాటు కంబదూరుకు చెందిన ఓ యువకుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఏకాంతం మాటున ప్రమాదం ప్రేమ జంటలకు పంపనూరు సమీపంలోని సిటీ పార్క్ కేంద్రంగా మారింది. ఏకాంతం కోసం సిటీ పార్క్‌లోని పొదలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నెల 23న సిటీ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని యువకులు దాడిచేసి మూడు సెల్ఫోన్లు, రెండు తులాల బంగారు నగలు అపహరించుకెళ్లిన విషయం విదితమే. ఇది మొదటి సారి ఏమీ కాదు! గతంలో ఎన్నో సార్లు ప్రేమజంటలను టార్గెట్ చేసి నగదు, విలువైన వస్తువులు అపహరించుకెళ్లారు. సిటీ పార్క్‌లో విహరిస్తూ ఎక్కువగా కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా సిటీ పార్క్‌కు వస్తున్నారు. వీరిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. కాలేజీకి డుమ్మా కొట్టి పుస్తకాల బ్యాగు పక్కన పడేసి సిటీ పార్క్‌లో చక్కర్లు కొడుతూ ఏకాంతం కోసం గుట్టల్లోని పొదల మాటుకు వెళుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు యువకులు వారిని బెదిరించి లూటీ చేస్తున్నారు. చైతన్యం రావాలి ప్రేమజంటపై దాడి చేసిన వారిని పట్టుకు తీరుతాం. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించాం. సిటీ పార్క్ ప్రాంతంలో పోలీసుల పహారా పెంచుతున్నాం. కాకపోతే ప్రజల్లో చైతన్యం రావాలి. ఘటన జరిగిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు చేరవేయాలి. ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ యువత జాగ్రత్తగా ఉండాలి పంపనూరు సిటీ పార్కుకు ఎక్కువగా యువత వస్తుంటారు. కనుచూపు మేర అటవీ ప్రాంతం ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. యూనిఫాంతో జంటగా వచ్చే విద్యార్థులను, మైనర్లను అటవీ ప్రాంతంలోకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటాం. – ఎస్ఐ శ్రీనివాసులు, ఆత్మకూరు (చదవండి: శాస్త్రీయ పద్ధతులతో సమగర దర్యాప్తు) -
దిశ ఎన్కౌంటర్: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిశ ఎన్కౌంటర్ కేసు హైకోర్టుకు చేరింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు చేరింది. దిశ కేసులో ఎమికస్ క్యూరీగా దేశాయ్ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది. దిశ కేసు నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు విచారిస్తుందంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. త్వరగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా 287 పేజీల కమిషన్ నివేదికకు సంబంధించి 57 మంది సాక్షులను, 10 మంది పోలీసులను విచారించారు. 2019 నవంబర్ 27న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన యువవైద్యురాలు దిశ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం చటాన్‌పల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన కింద కాలుతూ ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతురాలిని దిశగా తేల్చారు. 2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. షాద్ నగర్‌కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. -
విచారణకు సజ్జనార్
-
తుది దశకు ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. సుప్రీంకోర్టులోని ఫస్ట్ కోర్టులో శుక్రవారం తుది వాదనలు జరగనున్నాయి. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా పీ సొందర్ బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ డాక్టర్ డీఆర్ కార్తికేయన్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ ‘దిశ’ కేసు విచారణాంశాలను క్రోడీకరించి రిపోర్టు కాపీలను సీల్డ్ కవర్లో పెట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ లావు నాగేశ్వర రావులు కమిటీ నివేదిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అనంతరం శుక్రవారం తుది వాదనలు, ఆపైన తీర్పు వెలువరించనున్నారు. పోలీసులు, పిటిషనర్ తరుఫు న్యాయవాదులతో పాటు ‘దిశ’ నిందితుల కుటుంబ సభ్యుల తరుఫు న్యాయవాది, ఇండిపెండెంట్ కౌన్సిల్ పీవీ కృష్ణమాచారి సుప్రీంకోర్ట్ వాదనలకు హాజరుకానున్నట్లు తెలిసింది. ఎప్పుడు ఏం జరిగిందంటే? ► 2019 నవంబర్ 27న రాత్రి చటాన్‌పల్లిలో ‘దిశ’ హత్యాచారం సంఘటన జరిగింది. డిసెంబర్ 6న సీన్ రీ–కన్స్ట్రక్షన్ సమయంలో పోలీసుల ఎదురు కాల్పులలో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, సీహెచ్ చెన్నకేశవులు మృతి చెందారు. అదే ఏడాది డిసెంబర్ 12న సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. ►‘దిశ’, నిందితుల కుటుంబ సభ్యులతో పాటూ పోలీసులు, వైద్యులు, విచారణాధికారులు (ఐఓ), రాష్ట్రం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) 53 మంది అధికారులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కమిషన్ విచారించింది. ►నలుగురు మృతుల పోస్ట్‌మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్ట్, ఇన్వెస్టిగేషన్ రికార్డులు, ఫొటోగ్రాఫ్‌లు, వీడియోల ఆధారంగా సుమారు 47 రోజుల పాటూ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి, వాంగ్మూలాలను సేకరించింది. ►ఆ తర్వాత త్రిసభ్య కమిటీ చటాన్‌పల్లిలోని దిశ సంఘటనా స్థలాన్ని, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను భౌతికంగా సందర్శించి పలు కీలక సాక్ష్యాలు, ఫొటోలు, వీడియాలను సమీకరించింది. తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. చదవండి: రాజ్యసభకు ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం -
దిశ పెట్రోలింగ్ వాహనాలు.. ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
-
భద్రతకు భరోసా
-
దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం సహించదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కాగా, ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదవండి: (2023 ఖరీఫ్‌కు పోలవరం) -
దిశా మహిళా పోలీసుల మనోభావాలు ఫ్యామిలీ విశేషాలు
-
Disha Encounter: ‘దిశ’ తండ్రి ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజున తెలంగాణ పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. రియల్ హీరోలు అంటూ ప్రశంసించారు. సామాన్యంగా పోలీసులంటే జనాల్లో ఉండే భయం ఆ రోజు దూరమయ్యింది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. వారిని హీరోలుగా చేసిన సంఘటన ఏంటంటే.. 2019, నవంబర్ 27న ఓ అమ్మాయిపై మృగాళ్లు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఆ దారుణం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మృగాళ్లకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష అని ప్రజలు భావించారు. ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న తెల్లవారు జామున ‘దిశ’ను హతమార్చిన నలుగురిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ సంఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. (చదవండి: ‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా? ) ఎన్కౌంటర్ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకున్న రెండేళ్లు పూర్తయినప్పటికి.. దిశ కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి కోలుకోలేదు. ఈ క్రమంలో దిశ తండ్రి మాట్లాడుతూ.. ‘‘లైంగిక నేరగాళ్లకు కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్న సమయంలో న్యాయవ్యవస్థ సత్వరమే స్పందించాలి. నెల రోజుల్లోగా నిందితులకు కఠిన శిక్ష విధించాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేయకపోతే.. బాధితులకు, వారి కుటుంబాలకు ఎన్నటికి న్యాయం జరగదు’’ అన్నారు. (చదవండి: మళ్లీ తెరపైకి దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన) సమాజంలో ఇలాంటి దారుణాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు లైంగిక నేరాల పట్ల అవగాహన కల్పించాలి. ఇలాంటి దారుణాలు నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి శిక్షణ ఇవ్వాలి అని కోరారు. చదవండి: Disha Encounter: సంచలనం.. చర్చనీయాంశం -
Disha Encounter: సంచలనం.. చర్చనీయాంశం
షాద్‌నగర్: ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది. ఓ అమ్మాయిపై జరిగిన దారుణ మారణకాండ దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. నిందితుల ఎన్కౌంటర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశను హతమార్చిన నిందితుల ఎన్కౌంటర్ ఘటన జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఎన్నో మలుపులు దిశ హత్యోదంతం తర్వాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. దిశను హత్య చేసిన నిందితులను పోలీసులు 2019 నవంబర్ 29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో ఇక్కడే వారిని ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం.. పోలీసుల పైకి రాళ్లురువ్వడం.. చెప్పులు విసరడం.. లాఠీచార్జీ చేయడం తెలిసిందే. ఆ తర్వాత నిందితులను పోలీసులు చటాన్‌పల్లి జైలుకు తరలించారు. 2019 డిసెంబర్ 6న తెల్లవారు జామున దిశను హతమార్చిన నలుగురిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ప్రజా సంఘాల ఆందోళన ఎన్కౌంటర్ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సభ్యులు ఆదివారం చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశాన్ని, దిశను కాల్చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిషన్ ప్రజలకు ఏవిధమైన సంకేతాలు ఇస్తోందని.. నిందితుల తరఫున విచారణ చేపట్టడం ఏమిటని నిలదీశారు. దీంతో దిశ హత్యోదంతం, ఎన్‌కౌంటర్‌ఘటన మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
దిశా పేరిట నకిలీ వెబ్సైట్.. తుమ్మయ్యపాలెంలో కలకలం..
సాక్షి, విజయనగరం: పూసపాటిరేగ మండలం తుమ్మయ్యపాలెం గ్రామంలో సర్వే పేరిట కొందరు అనధికార వ్యక్తులు హల్చల్ చేశారు. పీఎంజీవై దిశా పేరిట నకిలీ వెబ్సైట్ సృష్టించడంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామస్తుల ఆధార్ కార్డు వివరాలను ఆ సిబ్బంది అనధికారికంగా సేకరిస్తున్నారు. దిశా వెబ్సైట్ పేరిట మహిళల వేలిముద్రలు సేకరిస్తున్నారు. వారి ప్రవర్తన, చెప్పిన వాటికి ఏ మాత్రం పొంతన లేకపోవడంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో ఆ సర్వేను పోలీసులు నిలిపివేయించారు. చదవండి: రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసుల కాల్పులు -
‘దిశ వన్ స్టాప్’.. మహిళలపై వేధింపులకు ఫుల్స్టాప్
సాక్షి, అమరావతి: దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు వెనకంజ వేసే బాధిత మహిళలకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం నుంచి అవసరమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు వరకు పూర్తి బాధ్యత వహిస్తున్నాయి. దాంతో గతానికి భిన్నంగా బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా సత్వర న్యాయాన్ని పొందుతున్నారు. ఐదు రకాలుగా భరోసా బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసే దిశగా రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లను తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యాచరణ నిర్దేశించారు. దిశ వ్యవస్థ పరిధిలోకి వీటిని తీసుకువచ్చి ‘దిశ వన్‌స్టాప్ సెంటర్లు’గా తీర్చిదిద్దారు. దాంతో దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ ఇన్స్పెక్టర్ సహా 18 మంది సిబ్బందిని నియమించింది. వీరిలో వీలైనంత వరకు మహిళలనే నియమించారు. ఈ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటూ బాధిత మహిళలకు ఐదు రకాల సేవలు అందిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. బాధిత మహిళలకు ఐదు రోజుల వరకు ఆశ్రయం కల్పించేందుకు వసతి ఏర్పాట్లు చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడే మహిళల పరిస్థితిని గుర్తించి వారికి తగిన సహాయం చేసి సమస్య పరిష్కారానికి వన్‌స్టాప్ సెంటర్లు చొరవ చూపిస్తున్నాయి. అందుకోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దిశ యాప్, 108 కమాండ్ కంట్రోల్, పోలీస్ స్టేషన్ల నుంచి వన్‌స్టాప్ సెంటర్లకు సమాచారం వస్తుంది. ఆ వెంటనే ఇక్కడి సిబ్బంది బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వారి సమస్య పూర్తి పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటున్నారు. గృహ హింస, బాల్య వివాహాల కేసుల్లో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యాచారం, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు అవసరమైన వైద్య పరీక్షల నిర్వహణ, అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు వరకు వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బంది బాధ్యత వహిస్తున్నారు. ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా కలిగేంత వరకు వన్‌స్టాప్ సెంటర్లే బాధ్యత తీసుకుంటుండటం విశేషం. 35 శాతం పెరిగిన కేసుల పరిష్కారం వన్‌స్టాప్ సెంటర్‌ను ఆశ్రయిస్తే చాలు తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. మహిళలపై వేధింపులను ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణిస్తూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణం. దాంతో గతంలో కంటే బాధిత మహిళలు ధైర్యంగా వన్‌స్టాప్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. 2018 నాటితో పోలిస్తే వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారం 35 శాతం పెరగడం విశేషం. కొత్తగా 5 వన్‌స్టాప్ కేంద్రాల నిర్మాణం రాష్ట్రంలో ప్రస్తుతం 8 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భావనాలు ఉన్నాయి. మిగిలిన ఐదు జిల్లాల్లో కూడా వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భవనాలను నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో శాశ్వత భవనాలు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం వన్‌స్టాప్ సెంటర్లు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాయి. అవసరమైతే బాధిత మహిళల ఇంటికే సిబ్బంది వెళ్లి మరీ సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అవసరమైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నాం. తీవ్రమైన కేసుల్లో మహిళలకు వైద్య పరీక్షల నిర్వహణ, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకూ అన్నీ వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. – కృతికా శుక్లా, కమిషనర్, మహిళా–శిశు సంక్షేమ శాఖ -
Andhra Pradesh: మత్తు.. చిత్తు చేద్దాం
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలు లేవు... అయినా సరే అత్యంత అప్రమత్తంగా ఉండండి. ప్రధానంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదక ద్రవ్యాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా తక్షణం చర్యలు చేపట్టండి. – సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: ‘డ్రగ్స్’ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ దుష్ఫ్రచారం చేస్తోందని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతే ధ్యేయంగా ‘దిశ’ పోలీసు స్టేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఎఫ్ఐఆర్ల నమోదు మాత్రమే కాకుండా కేసుల పరిష్కారం కూడా పెరగాలని సూచించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టినందున పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ‘మత్తు’ జాడలు ఉండకూడదు.. కాలేజీలు, యూనివర్సిటీలు మాదకద్రవ్య రహిత ప్రదేశాలుగా ఉండాలి. అసలు మాదక ద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయో లేవో అన్నది కచ్చితంగా నిర్ధారించుకునేందుకు అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో నిశితంగా పర్యవేక్షించండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో కాలేజీలు, యూనివర్సిటీలే డ్రగ్స్ విక్రయాల పాయింట్లుగా ఉంటాయి. అక్కడే మనం సమర్థంగా కట్టడి చేయగలిగితే డ్రగ్స్ వ్యవహారాలను అరికట్టినట్టే. అన్ని కాలేజీలను మ్యాపింగ్ చేయండి. ఎక్కడైనా డ్రగ్స్ విక్రేతలు ఉన్నట్లు తెలిస్తే అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేది గుర్తించి మూలాల నుంచే డ్రగ్స్ వ్యవహారాలను పూర్తిగా తుడిచిపెట్టవచ్చు. డ్రగ్స్ ఆనవాళ్లు అన్నవి ఉండకూడదు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకుని కార్యాచరణ రూపొందించండి. ఎస్పీలు, కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై నివేదిక సమర్పించాలి. ఈ అంశంలో పనితీరు ఎలా ఉందో నిశితంగా సమీక్షిస్తా. డ్రగ్స్ లేకున్నా విపక్షాల దుష్ఫ్రచారం ఆంధ్రప్రదేశ్‌కు ఏమాత్రం సంబంధం లేని డ్రగ్స్ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. లేని అంశాన్ని ఉన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం సాగిస్తోంది. వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థతో పాటు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు ఉద్దేశపూర్వకంగా అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రతి మహిళ ఫోన్లో ‘దిశ’ మహిళలు, చిన్నారుల భద్రత కోసం తెచ్చిన ‘దిశ’ వ్యవస్థ సమర్థంగా పని చేయాలి. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ, ప్రతి మహిళ మొబైల్ ఫోన్లోనూ దిశ యాప్ ఉండేలా చూడాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళా పోలీసులు, వలంటీర్ల సహాయం తీసుకోండి. దిశ యాప్ డౌన్లోడ్, వాడకంపై విస్తృత ప్రచారం కల్పించండి. బాధితులకు సత్వర న్యాయం యువతులపై అఘాయిత్యాలను నివారించాలి. దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథకంతో బాధితులను శరవేగంగా ఆదుకోవాలి. సత్వరమే న్యాయం చేకూర్చేలా చర్యలు చేపట్టి పరిహారాన్ని అందించాలి. ఘటన జరిగిన నెల రోజుల్లోపే బాధిత కుటుంబాలను పరిహారం అందాలి. ఎక్కడైనా ఆలస్యం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి. ధైర్యంగా ముందుకొచ్చేలా.. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి కల్పించాలి. ఫిర్యాదుదారులకు వెసులుబాటుగా వ్యవస్థ ఉండాలి. ఎఫ్ఐఆర్లు పెరుగుతాయని వెనకడుగు వేయవద్దు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికి ధైర్యం చెప్పి ప్రోత్సహించండి. బాధితులు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగలగాలి. వాటిపై చట్ట ప్రకారం సత్వరం చర్యలు తీసుకోవాలి. బాధితులకు భరోసా కల్పించడం ముఖ్యం. వచ్చే ఏడాది 6 వేల పోలీసు నియామకాలు మన ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించాం. వారికి శిక్షణ డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. వచ్చే ఏడాది కొత్తగా 6 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసేలా దృష్టి సారించి సన్నద్ధం కావాలి. అక్రమ మద్యంపై ఉక్కుపాదం అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఎస్ఈబీ విభాగంతోపాటు పోలీసులు ఉక్కుపాదం మోపాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్టు దుకాణాలను తొలగించాం. మద్యం దుకాణాలను మూడో వంతు తగ్గించాం. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. విక్రయ వేళలు కుదించి రేట్లు పెంచాం. దీంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. ఇసుక అక్రమ రవాణాపై కూడా కఠినంగా వ్యవహరించాలి. గుట్కా నిరోధంపై ప్రత్యేకంగా దృష్టి సారించండి. అవసరమైతే చట్టం తీసుకొద్దాం. సైబర్ నేరాలు అరికట్టేందుకు కార్యాచరణ సైబర్ నేరాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సమర్థ అధికారులు, న్యాయ నిపుణులను నియమించాలి. దిశ, ప్రత్యేక కోర్టులపై సమీక్ష దిశ బిల్లు, ప్రత్యేక కోర్టులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. దిశ వన్‌స్టాప్ సెంటర్లు, మహిళా పోలీసుల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చేలా ఆమోద ప్రక్రియ కేంద్రం వద్ద ఏ దశలో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాసనసభలో బిల్లును ఆమోదించి చాలా రోజులైనా ఇంకా పెండింగ్‌లో ఉండటం సరికాదన్నారు. వెంటనే ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 2,652 కేసులను దిశ వన్ స్టాప్ సెంటర్ల ద్వారా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రత కోసం ఇప్పటివరకు 51,053 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ న్యాయవాదులు పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం పది కోర్టులు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. డిసెంబరు నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళలపై నేరాల కేసుల విచారణకు సంబంధించి 12 కోర్టులు పని చేస్తున్నాయని చెప్పారు. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కోర్టుల్లో ప్రభుత్వ న్యాయవాదులు పూర్తిస్థాయిలో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదుల నియామకం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె.సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, పలువురు అదనపు డీజీలు, డీఐజీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దిశ డౌన్లోడ్స్ 74.13 లక్షలు – ఇప్పటివరకు దిశ యాప్ డౌన్లోడ్స్ 74,13,562 – చర్యలు తీసుకోదగ్గ కేసుల్లో 5,238 మందికి భద్రత, ఇతర సాయం – దిశ యాప్ ద్వారా 2021లో నమోదైన ఎఫ్ఐఆర్లు 684 – నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి మ్యాపింగ్ – దిశ పోలీస్ స్టేషన్లు అన్నింటికీ ఐఎస్వో సర్టిఫికేషన్ – జీరో ఎఫ్ఐఆర్లు నమోదు – మహిళలపై నేరాల కేసుల్లో దర్యాప్తునకు 2017లో 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు. – గణనీయంగా మెరుగుపడ్డ ఫోరెన్సిక్ సదుపాయాలు. గతంలో డీఎన్ఏ నివేదిక కోసం ఏడాదిపాటు నిరీక్షించగా ప్రస్తుతం రెండు రోజుల్లోనే నివేదిక సిద్ధం. సంబంధిత కేసుల్లో ఏడు రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు. -
‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటు చేసిన బృందంపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీసీ సిర్పుర్కర్ కమిషన్ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎన్హెచ్ఆర్సీ డీఐజీ మంజిల్ సైనీ, ఇన్స్పెక్టర్లు దీపక్‌కుమార్, అరుణ్ త్యాగిల విచారణ బుధవారంతో ముగిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారు వంటి కీలక అంశాలను ఘటనాస్థలి నుంచి సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేశారని త్రిసభ్య కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: రెండ్రోజుల్లో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ ‘దిశ’నిందితులను పోలీసులు విచారించిన ప్రైవేటు అతిథిగృహం వాచ్మెన్, చటాన్‌పల్లికి నిందితులను తరలించిన వాహనాల డ్రైవర్లను కూడా కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ తర్వాత మృతదేహాలకు పంచనామా నిర్వహించిన వైద్యులు, పోలీస్ క్షతగాత్రులకు వైద్యం అందించిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులను కమిషన్ నేడు విచారించనుంది. శుక్రవారం వీసీ సజ్జనార్‌ను విచారించే అవకాశముందని తెలిసింది. -
సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
-
రెండ్రోజుల్లో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. దిశ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను గురువారం లేదా శుక్రవారం విచారణ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సజ్జనార్‌కు త్రిసభ్య కమిటీ భౌతికంగా సమన్లు జారీ చేసింది. సోమవారం ప్రారంభమైన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ముగ్గురు సభ్యుల విచారణ మంగళవారం కూడా కొనసాగింది. మరొక సభ్యుడి విచారణతో బుధవారం ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్ అతిథి గృహంలో ఉంచి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్‌మెన్‌ను కూడా సిర్పుర్కర్ కమిషన్ విచారించనుంది. ఆ తర్వాత ఫోరెన్సిక్ బాలిస్టిక్ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ నిపుణులను కూడా విచారణ చేయనుందని తెలిసింది. చదవండి: సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులపై ఈ పోస్టర్లు కనిపించవు -
విశాఖలోని దిశ పీఎస్‌ను సందర్శించిన పార్లమెంట్ కమిటీ
-
దిశ బిల్లు ప్రతులను తగులబెట్టిన నారా లోకేశ్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: దిశ బిల్లు ప్రతులను టీడీపీ నాయకులతో కలిసి, మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తగులబెట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనుమతులు లేకుండా ఆందోళన చేయడానికి వెళ్తున్న లోకేశ్‌ను గురువారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండవల్లిలోని నివాసానికి తరలించారు. అక్కడ దిశ బిల్లు ప్రతులను తగులబెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దిశ చట్టం అంటూ మహిళల్ని దగా చేశారన్నారు. నరసరావుపేటలో అనూష అనే యువతి హత్యకు గురై ఆరు నెలలైనా దోషులకు శిక్ష పడలేదన్నారు. గడిచిన 21 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, హత్యల ఘటనలు 17 చోటు చేసుకున్నాయని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యం ఘటనలు 517 చోటు చేసుకుంటే ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా దోషులకు శిక్ష పడలేదన్నారు. తన సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మను దారుణంగా చంపేస్తే ఈ రోజు వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. కర్నూలులో హాజీరాని, బద్వేల్లో శిరీష ఘటనల్లో ఏడాదైనా దోషులకు శిక్ష పడలేదని చెప్పారు. గుంటూరులో దళిత యువతి రమ్య హత్య ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. టీడీపీ నేతల అరెస్ట్ విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా లోకేశ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నేతలు గుంపులుగా అక్కడికి చేరుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై, పోలీసులపై దూషణలకు దిగడంతో పాటు 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా లోకేశ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్లీజ్ తాడేపల్లిరూరల్ : ‘మమ్మల్ని అరెస్ట్ చేయండి.. ఆ ఫొటోలు మా నాయకుడికి పంపించాలి. లేదంటే మేము పని చేయడం లేదని ముద్ర వేస్తారు. ప్లీజ్ సర్.. అరెస్ట్ చేయండి’ అంటూ కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అభ్యర్థించారు. టీడీపీ ఏ ఆందోళన చేసినా ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని వారి పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఆ ఫొటోలను తప్పని సరిగా పంపించాలని చెప్పారట. ఆందోళనలో ప్రభుత్వాన్ని, ముఖ్య నేతలను దూషించిన వీడియోలు కూడా పంపాలని నిబంధన పెట్టారట. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ గురువారం నరసరావుపేట వెళ్లేందుకు వస్తుండగా, తాడేపల్లిలోని చంద్రబాబు ఇంటి వద్దకు చేరిన టీడీపీ నాయకులు హంగామా చేశారు. ఈ సందర్భంగా తమను అరెస్ట్ చేయాలని కోరారు. -
‘దిశ’తో మహిళలకు రక్షణ
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ‘దిశ’పై లైంగిక దాడి లాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకోరాదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన దిశ బిల్లు, దిశ యాప్ మంచి ఫలితాలనిస్తున్నాయని పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ‘యువతపై సోషల్ మీడియా ప్రభావం – మహిళా రక్షణకు ఏపీ దిశ యాప్ (చట్టం)’ అనే అంశంపై స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లి నుంచి మేధావులతో వర్చువల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి విశ్లేషకుడిగా వ్యవహరించిన చుండూరు సుందర రామశర్మ మాట్లాడుతూ 2019 నవంబర్ 27న హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన అందరినీ కలచి వేసిందన్నారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి 2019 డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు దిశ బిల్లును తెచ్చారని తెలిపారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చేందుకు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఈవ్ టీజింగ్, వరకట్న వేధింపులు, ఫేక్ కాల్స్, చిన్నారులపై వేధింపులు తదితర ఘటనలపై ఉక్కుపాదం మోపేలా దిశ యాప్ దోహదం చేస్తోందన్నారు. లాక్డౌన్ సమయంలో 165 బాల్య వివాహాలను దిశ యాప్ ద్వారా నివారించారని, పోక్సో పరిధిలో నేరాల్ని అరికట్టేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. ‘దిశ’తో గట్టి చర్యలు చాలా మంది మహిళలు, విద్యార్థినులు సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై వేధింపులు, మోసాలకు గురవుతున్నారని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ డి.జమున పేర్కొన్నారు. ఇలాంటి వాటికి దిశ చెక్‌పెట్టి రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సమస్యలు తప్పవని తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాలపై అందరిలోను చైతన్యం తేవాలని పద్మావతి విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర ప్రొఫెసర్ డి.సీతాకుమారి సూచించారు. 1988లో పంజాబ్‌లో ఓ మహిళా ఐఏఎస్ అధికారి పట్ల సీనియర్ ఐపీఎస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో న్యాయం కోసం 17 ఏళ్లు పోరాడాల్సి వచ్చిందని తమిళనాడు హైకోర్టు సీనియర్ న్యాయవాది అపర్ణ చెప్పారు. 2013లో నిర్భయ చట్టం, 2019లో దిశ బిల్లు మహిళలకు సత్వర న్యాయం జరిగేలా దోహదం చేస్తున్నాయన్నారు. మహిళల రక్షణకు దిశ బిల్లు, దిశ యాప్ ద్వారా సీఎం జగన్ గట్టి చర్యలు చేపట్టారని అభినందించారు. ప్రజలంతా నిద్రించే సమయం మినహా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు అలవాటుపడినట్లు సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజం అంతా కలసికట్టుగా కృషి చేయాలని కోరారు. -
మళ్లీ తెరపైకి దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. దిశ సామూహిక హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు వేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో కమిషన్ విచారణలో జాప్యం చోటుచేసుకుంది. కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో జ్యుడీషియల్ కమిషన్ మళ్లీ విచారణ ప్రారంభించింది. నేడు(బుధవారం) ఎన్కౌంటర్ గురైన కుటుంబాల కమిషన్ సభ్యులు కలవనున్నారు. దిశ కమిషన్ సభ్యులు గుడిగండ్ల, జట్లేరు గ్రామానికి బయలుదేరారు. ఎన్కౌంటర్ గురైన కుటుంబాలకు కమిషన్ నోటీసులు ఇవ్వనుంది. ఎన్కౌంటర్ గురైన కుటుంబాల నుండి పలు కీలకమైన వివరాలు సేకరించనున్నట్లు తెలస్తోంది. -
మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం: సుచరిత
సాక్షి, అమరావతి: మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని హోంమంత్రి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళల భద్రతపై తక్షణం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. దిశ చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని.. దిశ చట్టం కింద 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. 1645 కేసులపై ఏడు రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని వెల్లడించారు. రమ్య హత్య కేసు నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశామన్నారు. ఆసుపత్రి వద్ద లోకేష్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎం జగన్ మానవత్వంతో బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయి. ఎమ్మార్వో వనజాక్షి, రిషితేశ్వరికి ఎలాంటి భద్రత కల్పించారో చూశాం. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయి. సీఎం జగన్ పాలనలో మహిళలకు భరోసా ఏర్పడింది. సీఎం జగన్ పాలనలో దళితులు గౌరవం పొందుతున్నారని’’ హోంమంత్రి సుచరిత అన్నారు. ఇవీ చదవండి: కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. -
దిశ ఘటనపై సుప్రీంకోర్టు వేసిన జ్యుడిషియల్ విచారణ మళ్లీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచారం, హత్య నిందితుల ఎన్కౌంటర్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. దిశ ఘటనపై సుప్రీం కోర్టు వేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో విచారణను జాప్యం చేసిన జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు శనివారం దిశ సంఘటనపై వర్చ్యువల్ మీటింగ్ నిర్వహించారు.మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ సమావేశం సాగింది. సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. దిశ కేసులో తాము భాగస్వామ్యం అవుతామని పిటీషన్ వేసిన న్యాయవాది వసుదా నాగరాజు తెలిపారు.పిటీషన్‌పై పూర్తి అఫిడవిట్ వేయాలని కమిషన్ సూచించింది. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాల తరపు సమావేశంలో న్యాయవాది కృష్ణమాచారి పాల్గొన్నారు. -
హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
రాజ్యసభలో.. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను హోంశాఖకు పంపినట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన దిశ – క్రిమినల్ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులు హోంశాఖ పరిశీలనలో ఉన్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. హింసకు గురవుతూ ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కింద ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరైనట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకసింగ్ చెప్పారు. జేఈఈ, నీట్లో కూడా రాణించేందుకు వీలుగా ఈ పాఠశాలల్లో ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులకు దక్షణ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1,570 పంచాయతీల్లో వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయగా 216 పంచాయతీల్లో ప్రస్తుతం వినియోగిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి దేవుసింగ్ చౌహాన్ తెలిపారు. మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో వైర్లెస్ద్వారా 8,07,504 టీబీ డాటాను వినియోగించారని, ఇది దేశంలోనే రెండో అత్యధికమని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. లోక్‌సభలో.. ఏపీ స్మార్ట్ సిటీల్లో 251 ప్రాజెక్టులు స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఏపీలో రూ.7,740.83 కోట్ల విలువైన 251 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ చెప్పారు. కాకినాడలో రూ.911.85 కోట్ల విలువైన 55 ప్రాజెక్టులు, తిరుపతిలో రూ.201 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులు, విశాఖపట్నంలో రూ.646.32 కోట్ల విలువైన 43 ప్రాజెక్టులు పూర్తయ్యాయని వివరించారు. అమరావతిలో రూ.2,046 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు వర్క్ ఆర్డ ర్ దశలో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు సంబంధించి రూ.7,798 కోట్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్‌రాణే తెలిపారు. విశాఖపట్నంలో సెంట ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైమ్, షిప్‌బిల్డింగ్ ప్రాజెక్టు చేపట్టినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. -
కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
-
కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను పరిశీలిన అనంతరం తమ అభిప్రాయాలను జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు - క్రిమినల్ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు ఆమె తెలిపారు. దిశ (క్రిమినల్ లా సవరణ) బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి 2020 జనవరి 21న తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి చెప్పారు. ఈ బిల్లుపై మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించాం. అనంతరం మా అభిప్రాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును మా మంత్రిత్వ శాఖకు పంపించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి గత జూన్ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచార నేరాలనుత్వరితగతిన విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉద్దేశించిన మరో బిల్లు 2020 జనవరి 29న హోం మంత్రిత్వ శాఖ నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి తెలిపారు. దీనిపై కూడా తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా బిల్లును ఈ ఏడాది జనవరి 11న హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది. దానిపై కూడా మా అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు తెలియచేయడం జరిగింది. ఈ రెండు దిశ బిల్లులు ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. -
స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించారు’’ అని అన్నారు. -
498ఏ కింద గర్ల్‌ఫ్రెండ్‌ను విచారించేందుకు వీల్లేదు..
సాక్షి, అమరావతి: గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్ కింద విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. భర్త సంబంధీకుల్లోకి గర్ల్‌ఫ్రెండ్ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదంది. ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌పై పోలీసులు సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అరెస్ట్‌తో సహా ఎలాంటి ఇతర కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. తనను వేధిస్తున్నారంటూ కొమ్మి సునీత.. భర్త ధర్మయ్య, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, భర్తకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న ఓ యువతిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిశా మహిళా పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి, రెండో నిందితురాలిగా చేర్చారు. దిశా పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ ఆ యువతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. వివాదంలోకి పిటిషనర్‌ను అనవసరంగా లాగారు.. పిటిషనర్(యువతి) తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు సునీత, ఆమె భర్త ధర్మయ్యకు మధ్య ఉన్న గొడవల్లో పైచేయి సాధించేందుకు వారి మధ్య వివాదంలోకి పిటిషనర్‌ను లాగారని తెలిపారు. ఫిర్యాదుదారు చెబుతున్న వేధింపులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెక్షన్ 498ఏ ప్రకారం భర్త, ఆయన బంధువులపై మాత్రమే వేధింపుల కేసు పెట్టేందుకు అవకాశం ఉంటుందని, అయితే పిటిషనర్ ఏ రకంగానూ ఫిర్యాదుదారు భర్తకు బంధువు కాదని తెలిపారు. అందువల్ల పిటిషనర్‌పై పోలీసులు పెట్టిన కేసు చెల్లదని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకునేంత బలంగా పిటిషనర్ వాదనలున్నాయన్నారు. 498ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
‘దిశ’ మౌలిక వసతుల కోసం రూ.4.50 కోట్లు
సాక్షి, అమరావతి: మహిళా భద్రత కోసం ఏర్పరచిన దిశ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. కేసుల సత్వర విచారణకు దిశ ల్యాబ్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన 7 రకాల పరికరాల కొనుగోలుకు ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ నిధులతో గ్యాస్ క్రోమటోగ్రఫీ పరికరాలు 2, ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం స్పెస్టోక్సోపీ పరికరాలు 3, హైయండ్ ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్లు 2, ఫోరెన్సిక్ హార్డ్‌వేర్‌రైట్ బ్రాకర్ కిట్ ఒకటి, యూఎఫ్‌ఈడీ పీసీ ఒకటి, డీవీఆర్ ఫోరెన్సిక్ ఎగ్జామినర్ ఒకటి, ఫోరెన్సిక్ ఆడియో ఎనాలిసిస్, స్పీకర్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి కొనుగోలు చేస్తారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్న పిల్లల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం త్వరగా ఆమోదం పొందడానికి మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కోరారు. రాష్ట్ర చట్ట సభలు చేసిన ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రానికి పంపామని తెలిపారు. అయితే ఈ బిల్లుపై కేంద్ర హోం శాఖ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అభిప్రాయాలు, సూచనలు కోరిందన్నారు. మహిళల భద్రతలో కీలకమైన ఈ బిల్లుపై వేగంగా స్పందించి దిశ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఆ లేఖ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి స్మృతి ఇరానీజీ.. రెండేళ్లుగా చిన్న పిల్లల కోసం, లింగ వివక్ష రూపుమాపే విధంగా మీరు సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయి. మహిళల పోషణ, సంక్షేమంపై పథకాలను బలోపేతం చేయడమే కాకుండా, మహిళలు, పిల్లల రక్షణ కోసం బలమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీరు నాతో అంగీకరిస్తారనుకుంటున్నా. మహిళలు, పిల్లల భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మహిళలు, పిల్లలపై జరుగుతున్న దారుణ ఘటనల్లో త్వరితగతిన దోషులను గుర్తించి కఠిన చర్యలను తీసుకునే విధంగా గత రెండేళ్లుగా అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాము. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ 2020 డిసెంబర్లో ‘ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు, పిల్లలపై నిర్దేశిత నేరాలకు ప్రత్యేక కోర్టులు) బిల్లు 2020’, ‘ఆంధ్రప్రదేశ్ దిశ – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లులను ఆమోదించింది. అటువంటి కేసులలో త్వరగా న్యాయం జరిపించి, దోషులకు కఠిన శిక్ష వేయడం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కూడా బిల్లులు అనుమతిస్తాయి. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన కేసుల్లో తగిన సాక్ష్యాలు ఉంటే ఏడు రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేసేలా చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ కేసుల్లో దోషులకు త్వరితగతిన శిక్ష విధించడానికి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. దిశ బిల్లుకు అంగీకారం లభిస్తుందన్న ఆశాభావంతో మహిళలు, చిన్న పిల్లలపై నమోదవుతున్న లైంగిక నేరాల కేసులలో దర్యాప్తు, విచారణను సకాలంలో పూర్తి చేసే విధంగా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా దృష్టి ఇలా.. ►ప్రత్యేకంగా ఒక మహిళా ఐఏఎస్, ఒక మహిళా ఐపీఎస్ అధికారుల నియామకం. ►డీఎస్పీల నేతృత్వంలో 18 దిశ మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు. ఇవి స్నేహ పూర్వకంగా ఉన్నాయని ఐఎస్ఓ ధృవీకరణ. ►ఆపద వేళ ఆదుకునేలా దిశ యాప్ రూపకల్పన. ఈ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే తక్షణం స్పందించి సాయం. ►ఈ యాప్‌ను ఇప్పటికే 19.83 లక్షల మంది డౌన్లోడ్. ఏడాదిన్నరగా 3,03,752 ఎస్‌వోఎస్ రిక్వెస్టులు. వీటిలో 1,823 చర్యలు తీసుకోవాల్సిన కాల్స్. 221 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు. ►మంగళగిరి, తిరుపతి, విశాఖపట్నంలో కొత్తగా దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు పనులు ప్రారంభం. ►రాష్ట్ర వ్యాప్తంగా 700 పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు. ►ఇంటిగ్రేటెడ్ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ కోసం 18 మినీ బస్సులు ఏర్పాటు. 900 ద్విచక్ర వాహనలతో దిశ పెట్రోలింగ్. ►కేసుల విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం. ►లైంగిక దాడికి గురై ప్రాణాలతో బయట పడిన వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత. బాధితులు ధైర్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేలా 13 జిల్లాల కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్ ఏర్పాటు. బాధితుల ఆత్మస్థైర్యం పెంచేలా సైకలాజికల్, సామాజిక కౌన్సెలింగ్, మెడికో లీగల్ అసిస్టెన్స్, తాత్కాలిక ఆశ్రయం. త్వరితగతిన సమాచారం పంపండి క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్.. ఉమ్మడి జాబితాలో ఉన్నందున, ఈ రెండు బిల్లులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ప్రకారం రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపించాము. ఈ బిల్లు ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖ 2021 జనవరి 11న ఓఎం నంబర్ 17/6/2021, 15.06.2021 తేదీన ఓఎం నంబర్ 17/01/2020తో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్యాఖ్యలు, పరిశీలన కోరింది. అందువల్ల త్వరితగతిన మీరు ఈ బిల్లులపై మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలను హోం శాఖకు పంపాల్సిందిగా కోరుతున్నా. ఈ బిల్లు గురించి వివరించడానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారిని ఒకరిని నియమిస్తాను. ఏడాదిన్నరగా ఇదీ ఫలితం.. ►డిసెంబర్ 2019 నుండి ఇప్పటి వరకు 162 రేప్, 1,353 లైంగిక నేరాల్లో ఏడు రోజుల్లోనే కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 498 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ►మహిళలపై నేరాల కేసులపై దర్యాప్తు పూర్తి చేయడానికి 2017లో 117 రోజులగా ఉన్న సగటు సమయం 2021 నాటికి 41 రోజులకు తగ్గింది. ►లైంగిక వేధింపుల కేసుల్లో ఈ సంవత్సరం దర్యాప్తు సగటు రేటు రాష్ట్రంలో 90.17 శాతంగా ఉంటే దేశ సగటు రేటు 35 శాతంగా ఉంది. ►143 మందిపై నేరారోపణలు రుజువు కాగా, ఇందులో ముగ్గురికి ఉరిశిక్ష, 14 మందికి జీవిత ఖైదు విధించారు. -
‘దిశ’ ప్రాజెక్టుపై సమీక్ష: సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: దిశ కాల్సెంటర్లలో అదనపు సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న ఆయన.. దిశ పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం ‘దిశ’ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు త్వరగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, విశాఖలో ల్యాబ్‌ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇక ఫొరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఇప్పటికే 58 పోస్టుల భర్తీకాగా... మరో 61 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. అదే విధంగా గంజాయి రవాణా, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో.. నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో... ప్రీతి సుగాలి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో... తీసుకునే చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ‘‘ప్రీతి సుగాలి తండ్రికి ఉద్యోగం ఇస్తున్నాం. ప్రీతి తల్లి కోరుకున్నట్లే ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నాం. 5 సెంట్ల ఇంటి పట్టా, ఐదెకరాల భూమిని కూడా ఇస్తున్నాం’’ అని ముఖ్యమంత్రికి తెలిపారు. -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్ లేఖ
-
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. దిశ చట్టం ఆమోదించాలంటూ సీఎం జగన్ లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. కాగా ‘దిశ’ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షలో భాగంగా దిశ చట్టానికి సంబంధించి కేంద్ర మంత్రికి జగన్ లేఖ రాశారు. కాగా ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం వైఎస్ జగన్
-
దిశ యాప్ డౌన్లోడ్ ఇలా..
మహిళల భద్రత విషయంలో ఏపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. హామీలు ఇవ్వడం, పథకాలు ప్రారంభించడంతోనే కాదు వాటిని పక్కాగా అమలు చేయడంలో అదే అంకిత భావం చూపిస్తోంది. అందుకు దిశ యాప్ ప్రమోషనల్ కార్యక్రమం మరో ఉదాహరణ. అమరావతి: ఏపిలో దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్‌ని కూడా రూపొందించారు. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ ద్వారా వచ్చిన కాల్స్, మేసేజ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు 850 పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో 160 సందర్భాల్లో ఎప్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇంచుమించు వెయ్యి మంది మహిళలు, అమ్మాయిలను ప్రమాదాల బారి నుంచి దిశ యాప్ రక్షించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా సీఎం జగన్ దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొని ప్రతీ ఒక్క మహిళ చేత ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డౌన్లోడ్ ఇలా ► ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ప్లే స్టోర్, ఆప్ స్టోర్ నుంచి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి ► యాప్ డౌన్లోడ్ పూర్తైన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ నంబర్ వస్తుంది ► ఓటీపీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత.. పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, ప్రత్యామ్నాయ నంబరు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్ నంబర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ► అక్కాచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్‌లో ఉన్న అత్యవసర సహాయం (SOS) బటన్ నొక్కితే వారి ఫోన్ నంబరు, చిరునామా, వారున్న లోకేషన్‌తో సహా వారి వాయిస్‌తో పాటు 10 సెకన్ల వీడియో రికార్డ్ చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి పంపేలా దిశ యాప్‌కి రూపకల్పన చేశారు. ► అక్కాచెల్లెమ్మల నుంచి అలెర్ట్ రాగానే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్‌కి సమాచారం చేరవేస్తారు. పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారికి రక్షణ కల్పిస్తారు. దిశతో ప్రయోజనాలు ► యువతులు, మహిళలు ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు ► ప్రయాణ సమయంలో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ ఏర్పాటు. ఈ ఆప్షన్లో తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ జరుగుతుంది. ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంధు మిత్రులకు చేరవేస్తుంది. ► దిశ యాప్‌లో 100, 112 వంటి అత్యవసర నంబర్లతో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, ట్రామాకేర్ సెంటర్లు, మెడికల్ షాపుల వివరాలు కూడా ఉంటాయి. ► కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పుష్ బటన్ ఆప్షన్ ద్వారా పోలీసులు ఏకకాలంలో దిశ యాప్ ఉపయోగించే వారందరికి సలహాలు, సూచనలు ఇస్తూ జరగబోయే ప్రమాదాలను నివారిస్తారు ► విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్ ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే ఫోన్‌ను గట్టిగా అటుఇటూ ఊపితే చాలు .. యాప్ ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి ఆపద సందేశం చేరుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోన్‌కి కాల్ చేసి వివరాలు సేకరిస్తారు. పోలీసుల ఫోన్‌కి ఎవరూ స్పందించకపోతే పోలీస్ వెహికల్స్‌లో అమర్చిన మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లోకేషన్‌కి పోలీసులు వేగంగా చేరుకునేలా ఏర్పాటు. దిశ యాప్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha చదవండి : ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలి: సీఎం జగన్ -
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్.. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలిని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని సీఎం జగన్ అన్నారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఫోన్లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు మాట్లాడుతూ.. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించాలనుకోవడం గొప్ప చర్య అని, సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని తాము చూడలేదని వాలంటీర్లు చెప్పారు. చదవండి: విద్యారంగ ప్రక్షాళన తర్వాత ఖాళీల భర్తీ కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు -
న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
కర్నూలు (సెంట్రల్): కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని సుగాలి ప్రీతిబాయి తల్లిదండ్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా ఆదివారం కలిశారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రీతిబాయి కేసును విచారించాలని సీఎం వైఎస్ జగన్ కొంతకాలం క్రితం సీబీఐకి లేఖ రాశారు. అయితే ఈ కేసును సీబీఐ తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తదుపరి ఏమి చేద్దామన్న విషయంపై మాట్లాడేందుకు సీఎం వైఎస్ జగన్ తన ప్రతినిధిగా దిశా ప్రత్యేక అధికారి కృతికా శుక్లాను ప్రీతిబాయి తల్లిదండ్రులైన పార్వతీదేవి, రాజునాయక్‌ల దగ్గరకు పంపారు. ఆమె ఆదివారం కర్నూలులో వారిని కలసి చర్చించారు. తమ బిడ్డ మరణంపై సీబీఐ విచారణే కావాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి కృతికా శుక్లా స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
'దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టనున్నాం'
-
దిశ యాప్ డౌన్లోడ్, వినియోగంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 'మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలి. యాప్ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలి. ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ముందుగా మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలి. కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కలిగించాలి. ఈ చర్యల వల్ల దిశ యాప్ వినియోగం పెరుగుతుంది. అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. దిశ పోలీస్స్టేషన్లు, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలి. పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చాలి’ అని తెలిపారు. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఐటీ పాలసీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష -
ట్రెండింగ్‌లో #JusticeForDisha
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పీఆర్ మేనేజర్‌గా వ్యవహరించింది దిశా సలియాన్. ఆమె మరణించి నేటికి(జూన్ 8) సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. దిశ చనిపోయిన ఆరు రోజులకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడు. దిశ మరణం ఈనాటికీ ఒక మిస్టరీనే. ఈ తరుణంలో దిశ చావుకి, సుశాంత్ చావుకి ఏదో లింక్ ఉందనేది సుశాంత్ ఫ్యాన్స్ అనుమానం. అందుకే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ట్విట్టర్లో జస్టిస్ ఫర్ దిశ హ్యాష్‌ట్యాగులతో క్యాంపెయిన్ నడిపించారు. ముంబై: దిశ సలియాన్ పోయినేడాది జూన్ 8న చనిపోయింది. ముంబైలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని జన్‌కళ్యాణ్ అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఆమె చాలా కాలంగా డిప్రెషన్లో ఉందని, అందుకే సూసైడ్ చేసుకుందని దిశ కాబోయే భర్త రోహన్ రాయ్ మీడియాతో చెప్పాడు. అయితే ఆమె మృతిపై అందరికీ అనుమానాలున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుంటే.. శవంగా కింద ఉన్న టైంలో ఆమె ఒంటి మీద బట్టలు లేవని, ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని, ఆమె మరణానికి ముందు ఆమె అపార్ట్మెంట్కి కొందరు వచ్చారని, సామూహిక అత్యాచారం చేశారని, ఒకానొక దశలో నటుడు సూరజ్ పంచోలీ ఆమెను గర్భవతిని చేశాడని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. అయితే యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసుకున్న ముంబై పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు దర్యాప్తును సీబీఐ తీసుకున్నాక.. దిశ కేసును కూడా పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఒక సెలబ్రిటీ ఫిగర్ విషయంలో ఇంతకాలమైనా ఎటు తేలకపోవడంపై చాలా మందిలో అసంతృప్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ కేసు చాలామందికి ముఖ్యంగా సుశాంత్ అభిమానులకు ఆమె పట్ల సానుభూతి క్రియేట్ అయ్యింది. మే 26.. దిశ డే దిశ సలియాన్ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టింది. ముంబైలో చదువుకున్న దిశ.. మాస్ మీడియా కోర్సులో డిగ్రీ చేసి పీఆర్ ఏజెన్సీలోకి అడుగుపెట్టింది. టైమ్స్ గ్రూప్ లాంటి ప్రముఖ కంపెనీల్లో పని చేసింది. కొన్నాళ్లపాటు సుశాంత్ పీఆర్వోగా వ్యవహరించింది. ఆమె తండ్రి ఓ వ్యాపారవేత్త. టీవీ యాక్టర్ రోహన్ రాయ్‌తో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై వరల్డ్ రికార్డు స్థాయిలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో వారంలో కనీసం మూడు రోజులైనా ట్వీట్లతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో సింపథీతో దిశా కోసం కూడా ఉద్యమిస్తున్నారు. మే 26న ఆమె పుట్టినరోజుకాగా.. ఆ రోజును ఏకంగా దిశ దినోత్సవంగా ట్విట్టర్లో జరిపారు కూడా. చదవండి: సుశాంత్‌కి పట్టిన గతే పడుతుంది -
Cyber Crime: పిన్ని స్నానం చేస్తుండగా వీడియో తీసిన బాలుడు.. ఆపై
సంధ్య (పేరు మార్చడమైనది)కు ఇంజనీరింగ్ లో సీటు రావడంతో తన పెద్దమ్మ కూతురైన గీత ఇంట్లో ఉండి చదువుకుంటోంది. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. వారి కొడుకు కిశోర్ (పేరు మార్చడమైనది) ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా సంధ్య ముభావంగా ఉండటం, తనలో తనే బాధపడటం చూసిన గీత ఏమైందని అడిగింది. అయినా, ఏమీ చెప్పలేకపోయింది సంధ్య. కానీ, గీత గట్టిగా అడిగేసరికి ‘చచ్చిపోతాను’ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సమస్య ఏంటని సముదాయిస్తూ అడిగేసరికి తన ఫోన్ చూపించింది గీత. సంధ్య స్నానం చేస్తుండగా ఎవరో తీసిన వీడియో అది. ఆ వీడియో ఏదో వెబ్సైట్లో ఉందని, స్నేహితురాలు తనకు షేర్ చేసిందని ఏడుస్తూ చెప్పింది సంధ్య. గీతకు ఏం చేయాలో అర్థం కాలేదు. విషయాన్ని భర్తతో చెప్పింది. ఎటువైపు నుంచి ఏ దుండగుడు ఆ వీడియోను తీశాడో తెలియలేదు. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. సంధ్య స్నానం చేస్తుండగా కిశోర్ తీసిన వీడియో అది అని తేలి, ఇంట్లో అంతా ఉలిక్కిపడ్డారు. ఇలాగే, వారి ఇంటి పక్కనే ఉంటున్న అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ల నుంచీ వీడియోలు తీస్తున్నాడనే విషయాన్ని రాబట్టారు. కిశోర్ ఫోన్లో ఉన్న వీడియోలు చూస్తే ఇలాంటి వీడియోలు పదికి పైగానే ఉన్నాయి. ఇంత దారుణాన్ని పన్నెండేళ్ల పిల్లవాడు చేశాడంటే ఎవ రికీ నమ్మబుద్ధికాలేదు. ఆడుకోవడానికని ఇస్తే.. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పనివేళలూ ఎక్కువే. పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని స్మార్ట్‌ఫోన్, గేమ్స్ ఆడుకోవడానికి ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశారు. కిశోర్ స్కూల్ టైమ్ అయిపోగానే వాటిని ముందేసుకునేవాడు. పెద్దవాళ్లు కూడా పిల్లవాడు తమను విసిగించుకుండా ఖాళీ సమయంలో సద్వినియోగం చేసుకుంటున్నాడని అనుకున్నారు. డిజిటల్ గేమ్స్ వల్ల మెదడు కూడా చురుకుగా మారుతుందని భావించారు. అయితే, గేమ్‌లో భాగంగా ఆన్లైన్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో భాగస్థుడయ్యాడు కిశోర్. ‘ట్రూత్ అండ్ డేర్’ గేమ్‌లో భాగంగా టీనేజర్లు ఒక్కో సాహసక్రియకు పూనుకోవాలనేది ఛాలెంజ్. అందులో ఎవరికి ఏ ఛాలెంజ్ వస్తే దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో భాగంగా టీనేజర్లు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి, వీడియోలను షేర్ చేసుకుంటూ వస్తున్నారని తెలిసింది. కిందటేడాది... 2020 క్రైమ్ గణాంకాల ప్రకారం విజయవాడతో సహా కృష్ణాజిల్లాలో 220 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఎక్కువమంది నిందితులు మైనర్లే. పోర్న్ వీడియోలు చూసి, తాము ఈ నేరం చేశారని అంగీకరించారు. కృష్ణా జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఎనిమిదేళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడన్న విషయమై అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తే స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ చూసేవాడినని, అవే తనను ఈ దారుణానికి ప్రోత్సహించేలా చేశాయనే వాస్తవాన్ని బయటపెట్టాడు. టీనేజర్లు, యువకులు అశ్లీల చిత్రాలకు బానిసలైన వారు ఈ తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో టీనేజర్లు కోపం, క్రూరత్వం, వక్రబుద్ధి, లైంగిక దాడి వంటి అసాధారణ లక్షణాలను కూడా చూపుతున్నారని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. శారీరక శ్రమ లేకుండా డిజిటల్ మీడియాతో ఎక్కువ కాలక్షేపం చేసే టీనేజర్లలో విపరీత చర్యలు చూడాల్సి వస్తోందని, టీనేజర్ల మనసును క్రీడల వంటి శారీరక శ్రమ వైపు మళ్లిం^è గలగాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి పిల్లలు డిజిటల్ వాతావరణంలో ఎంతవరకు సురక్షితంగా ఉన్నారనేది ఎలా తెలుసుకోవాలన్నది ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పెద్ద సమస్య. పిల్లలు ఎదిగే క్రమంలో వారికి కొన్ని హద్దులను నిర్ణయంచడంతో పాటు కొంత బ్యాలెన్సింగ్ విధానాన్ని కూడా నేర్పాలి. మీరు తమకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారనే విషయం పిల్లలు తెలుసుకోగలగాలి. ఆన్లైన్ సమస్యలను పరిష్కరించడంలో పెద్దలు తమకున్న అనుభవాన్ని పిల్లలకు చెప్పాలి. పిల్లల భావాలను అర్ధం చేసుకోవడానికి ముఖ్యంగా వారు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నామన్నది వారికి తెలియాలి. వారి ఆన్లైన్ ప్రపంచాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, సరైన భద్రత తీసుకుంటూ వారు సురక్షితంగా ఉన్నారని పెద్దలు నిర్ధారించుకోవాలి. మీ పిల్లల మాట వినడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. దీనిద్వారా వారు ఏం చేస్తున్నారో గమనించవచ్చు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాద్ తల్లితండ్రుల పర్యవేక్షణే రక్షా కవచం పిల్లలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కానీ, అనవసర చెత్తనంతా మెదళ్లకు చేర్చుకుంటున్నారు. ఆన్లైన్ క్లాసులు, వీడియో గేమ్స్ దృష్ట్యా పిల్లలందరూ ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే, డిజిటల్ విధానంలో జరిగే క్రైమ్‌ను అరికట్టాలంటే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. ఈ విషయంగా వచ్చే కేసుల విషయంలో మేం కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం. పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చినప్పటికీ అందులో కొన్ని సెక్యూరిటీ సేఫ్టీ యాప్స్ ఉన్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసి తాము పర్యవేక్షణ చేయవచ్చు. వీటితోపాటు పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి. ఏ మార్గమైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగించని, కుటుంబానికి హాని తలపెట్టని విధంగా ఉండేందుకు ఎప్పుడూ గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి. పిల్లలను వారి మానాన వారిని వదిలేయకుండా, ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావారణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – దీపికా పాటిల్,స్పెషల్ ఆఫీసర్, (దిశా చట్టం అమలు విభాగం), ఆంధ్రప్రదేశ్ చదవండి: నగ్న ఫొటోలు పంపాడు.. నాకేమీ తెలియదంటూ బోరుమంది -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్‌ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్‌బాస్-14లో రుబీనా దిలైక్‌తో తలపడి రాహుల్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్‌ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్‌పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్‌బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
Mansukh Mandaviya: తండ్రికి తగ్గ కూతురు
పాసింగ్ అవుట్ పరేడ్‌లో కూతుర్ని పైలట్‌గా చూసిన తల్లిదండ్రుల హృదయం ఉప్పొంగడం సహజమే. పైలట్ అనే ఏముందీ.. దేశ భద్రత కోసం ఆర్మీ యూనిఫామ్‌లో బయల్దేరిన కూతుర్ని, దేశ రక్షణకు సముద్రంపై గస్తీకి నేవీ కెప్టెన్‌గా విధుల్లో చేరబోతున్న కూతుర్ని చూసినప్పుడు ఎంతో గర్వపడతారు. ఇప్పుడదే గర్వాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మండవియ వ్యక్తం చేస్తున్నారు! ‘‘నా కూతురు, నా ప్రతిష్ట.. మా అమ్మాయి దిశ.. నేను ఏమవ్వాలని ఇంతకాలం ఎదురు చూశానో అదే అయింది’’ అంటూ ట్విట్టర్లో తన కూతురి ఫొటో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించడం కోసం కొద్దిరోజుల క్రితమే ఆమె ట్రైనీగా చేరింది. అప్పటిదే ఆ ఫొటో. మన్సుఖ్ మండవియ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి. రాజ్యసభ సభ్యులు. కరోనాతో దేశం ఎంత కుదేలైపోతున్నదీ కళ్లారా చూస్తూనే ఉండి ఉంటారు. అందుకే కూతురు వైద్యలు సేవలు అందించడానికి ట్రైనీగా చేరగానే ఆయనకెంతో గర్వంగా అనిపించింది. ‘నా కూతురు కరోనా యోధురాలు’ అయింది అని ఎంతో సంతోషంగా ట్వీట్ చేశారు ఆయన. ‘‘ఈ కీలకమైన సమయంలో దేశానికి నీ సేవలు అవసరం దిశా. నువ్వు చేయగలవు. ఒక యోధురాలిగా నువ్వు చేస్తున్న పని నాకెంతో శక్తినిస్తోంది’’ అని అభినందించారు. ఆ అభినందనలో సగానికి పైగా ఉన్నది కృతజ్ఞతే! ఒక సాధారణ పౌరుడిగా ఈ మంత్రిగారు తన కూతురికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం కూడా ఇది. ఆయన అలా ట్వీట్ పెట్టిన వెంటనే ఇలా 18 వేల లైక్‌లు వచ్చాయి. జై బంగాల్ అనే పేరు మీద ఉన్న యూజర్ ఒకరు ‘‘డాటర్స్ ఆర్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశారు. మరొక యూజర్.. ‘‘యుద్ధ సమయంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంత ఒత్తిడితో పని చేస్తుంటారో ఇప్పుడూ అలానే చేస్తున్నారు. సాహసవంతులైన కరోనా యోధులందరికీ సెల్యూట్’’ అని స్పందించారు. My Daughter, My Pride! Disha, I have waited so long to see you in this role. I am filled with pride that you are rendering your duty as an Intern in this critical time. The nation needs your service and I'm sure you will prove yourself. More power to you my warrior! pic.twitter.com/Kjm4MtKyaT — Mansukh Mandaviya (@mansukhmandviya) April 26, 2021 ఇంత చిన్నవయసులో అంత సేవాభావం దిశకు తన తండ్రి నుంచే సంక్రమించి ఉండాలి. మన్సుఖ్ లక్ష్మీబాయి మండవియ నిరాడంబరమైన మనిషి. పార్లమెంటు సమావేశాలకు ఎప్పుడూ ఆయన సైకిల్ మీదే వెళ్లొస్తుంటారు! ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం కోసం తరచు మైళ్ల దూరం గ్రామాల గుండా పాదయాత్రలు చేస్తుంటారు. ‘ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన’ కార్యక్రమంలో మంత్రిలా కాక ఒక కార్యకర్తలా పాల్గొంటారు. మహిళల రుతుక్రమ పరిశుభ్రత కోసం ఆయన నిర్వహించిన అవగాహన సదస్సులు యునిసెఫ్ గుర్తింపు పొందాయి. కేంద్ర మంత్రులలో తెలివైన, ఆలోచనాపరుడైన నాయకులలో ఒకరిగా ఆయనకు పేరు. ‘అభివృద్ధి ని నిరంతరంగా కొనసాగించడానికి అవసరమైన 2030 నాటి అజెండా’ అనే అంశంపై ప్రసంగించేందుకు 2015లో మండవియ ప్రత్యేక ఆహ్వానంపై ఐక్యరాజ్య సమితికి వెళ్లి వచ్చారు. మండవియకు దిశ తర్వాత పవన్ అనే కుమారుడు ఉన్నాడు. భార్య నీతాబెన్ గృహిణి. 1995లో వాళ్ల వివాహం జరిగింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా పలితాన తాలూకాలోని హనోల్ అనే గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు మండవియ. నలుగురు మగపిల్లల్లో చివరివాడు. ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. సంగధ్ గురుకులంలో హైస్కూల్ విద్యను అభ్యసించాడు. మంత్రి అయినప్పటికీ ఆయన ఎప్పటిలానే సాధారణంగా జీవిస్తున్నారు. మంత్రి కూతురు అయినప్పటికీ దిశ తండ్రి బాటలోనే నలుగురికి సహాయం చేసేందుకు వైద్యసేవల్ని ఎంచుకుంది. -
టూల్‌కిట్ కేసు: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టూల్‌కిట్ కేసుకు సంబంధించి దిశ రవి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘టూల్‌కిట్ కేసు దర్యాప్తులో భాగంగా.. ఢిల్లీ పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్ చేయలేదు’’ అనే అంశానికి కట్టుబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ‘‘టూల్‌కిట్ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, మీడియా హౌస్‌లు తన వ్యక్తిగత వాట్సాప్ చాట్లను బహిర్గతం చేశారు. ఇక మీదట ఇలా జరగకుండా పోలీసులను ఆదేశించండి’’ అంటూ దిశ రవి ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు, మీడియా అత్యుత్సాహం వల్ల పిటిషనర్ గోప్యత హక్కు, కీర్తి హక్కు, న్యాయమైన విచారణ హక్కులకు తీవ్రమైన భంగం వాటిల్లినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక జర్నలిస్టును వారి సోర్స్ గురించి వెల్లడించమని ఎలా ఒత్తిడి చేయలేమో.. దర్యాప్తు కొనసాగుతున్న కేసు విషయంలో కూడా ఇలాగే ఉండాలి. టూల్‌కిట్ కేసులో పోలీసులు తాము ఎలాంటి సమాచారం లీక్ చేయలేదని చెబుతుండగా.. మీడియాలో ఇందుకు విరుద్ధమైన కథనాలు ప్రసారం అవుతున్నాయి’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టూల్‌కిట్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున.. దీనికి సంబంధించి పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్ చేయవద్దని ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే.. దాని గురించి సగంసగం, ఊహాజనిత సమాచారం ప్రచారం చేయబడుతోంది అని దిశ రవి తరఫు న్యాయవాది అఖిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. "గోప్యత హక్కు, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, వాక్ స్వాతంత్ర హక్కుల మధ్య సమతుల్యత అవసరం. ఇటీవలి టూల్కేట్ కేసుకు సంబంధించి ప్రసారమైన కథనాలు చూస్తే.. ఖచ్చితంగా మీడియా సంచలనాత్మక రిపోర్టింగ్ చేసిందని అర్థం అవుతోంది. ఏదైనా అంశం గురించి మీడియా సమావేశాలు జరగడం సాధారంణం. అలాంటి సమయంలో మీడియా సంచలనాత్మమైన పద్దతిలో సమాచారాన్ని వ్యాప్తి చేయడం తగదు’’ అని కోర్టు అభిప్రాయ పడింది. "దర్యాప్తుకు ఆటంకం కలగకుండా సమాచారాన్ని ప్రసారం చేసే సమయంలో సరైన సంపాదకీయ నియంత్రణ ఉండేలా చూసుకోండి" అని కోర్టు న్యూస్ ఛానెల్స్‌కు సూచించింది. "ప్రతివాదులు అందరికీ వివరణాత్మక సమాధానాలు దాఖలు చేయడానికి సమయం అవసరం" అని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఎ.ఎస్.జి) సూర్యప్రకాష్ వీ రాజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘దిశ రవి పోలీసులపై ఒత్తిడి తెవడమే కాక వారిని అపఖ్యాతి పాలు చేస్తున్నారు.. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటువంటి పిటిషన్ దాఖలు చేశారు’’ అని ఆరోపించారు. చదవండి: అణచేస్తే అణగని జనగళం -
దిశ రవికి మద్దతుగా యువత వినూత్న నిరసన
ముంబై: ప్రస్తుతం దేశంలో టూల్‌కిట్ వివాదం నడుస్తోంది. రైతుల ఉద్యమానికి సంబంధించిన ఈ టూల్‌కిట్‌ని గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేశారు. అయితే దీన్ని బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఎడిట్ చేశారని.. ఫలితంగా జనవరి 26న ఎర్రకోట వద్ద హింస చెలరేగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దిశ రవితో పాటు శాంతను ములుక్, నికితా జాకోబ్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై నాన్ బెయిల్‌బెల్ వారెంట్ జారీ చేశారు. అయితే ప్రభుత్వ చర్యలపై దేశ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం డిజిటల్ మీడియా వేదికగా యువత ‘‘ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో ఆందోళనను అణచివేస్తోంది’’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది యువత. ఈ మేరకు ‘‘ఫింగర్ఆన్యువర్లిప్స్’’, ‘‘ఫ్రీదిశారవి’’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నోటిపై వేలు ఉంచిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్నారు నెటిజనులు. ఫోటోలతో పాటు మరికొందరు ‘‘మీకిది తెలుసా.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వ చర్యల గురించి అస్సలు మాట్లాడొద్దు’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫోటోలు, కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా పర్యావరణ కార్యకార్త ఒకరు మాట్లాడుతూ.. ‘‘పెదవులపై వేలు ఉంచుకోవడం అనేది ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడానికే కాక దిశ రవితో పాటు అరెస్ట్ అయిన మిగతా వారికి సంఘీభావం తెలపడానికి ప్రతీక. వీరిని ప్రభుత్వం కఠినమైన యూఏపీఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసింది. వారికి సంఘీభావంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవుల మీద వేలు ఉంచుకుని నిరసన తెలపుతున్నాం. మన దేశంలో ఎవరైనా నిరసన తెలిపితే.. ఉద్యమం చేస్తే.. వారిని సంఘ విద్రోహక శక్తులుగా ముద్రిస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. నిరసన తెలుపుతున్న వారంతా ప్రజల స్థితిగతులు మార్చాలని.. అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్న వారు’’ అన్నారు. ‘‘దేశంలో మిడతల దాడి, గత పదేళ్లుగా రైతుల ఆత్మహత్యలు, ఒక్క రోజులోనే ఉల్లి ధర మూడు సార్లు పెరగడం వంటి విషయాల గురించి మీకు తెలిసినప్పుడు.. మీరు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. జస్ట్ మీ పెదవుల మీద వేలు ఉంచుకోండి.. కామ్‌గా ఉండండి. నియమ్‌గిరి పర్వతాల్లో, గోవాలో అక్రమ మైనింగ్ గురించి తెలిసినా.. మొలెం అడవుల్లో కార్చిచ్చు రగిలిందని తెలిసినా.. వచ్చే ఆరేళ్లలో మన భవిష్యత్తు ఒకేలా ఉండదని తెలిసినా మీరు కామ్‌గా ఉండండి.. ఏం మాట్లడకుండా.. మీ పెదవుల మీద వేలు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే దేశంలోని ఏ అంశం మీదనైనా మీరు స్పందిస్తే.. మీ మాటల్ని వక్రీకరించి.. మిమ్మల్ని చట్ట ప్రకారం దోషులుగా ప్రకటించి కోర్టులో నిలబెడతారు. కనుక ఏం జరిగినా కామ్‌గా ఉండండి.. ప్రశ్నించొద్దు’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు నెటజనులు. ‘‘ఫింగర్స్ఆన్యువర్లిప్స్’’ అనేది శాంతియుతమైన డిజిటల్ నిరసన ప్రదర్శన. ‘‘సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా యువత తమ స్వరాన్ని వినిపిస్తుంది. మౌనంగా ఉండమని వారిని భయపెట్టలేం. అలా చేసిన కొద్ది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలు పెరుగుతాయి’’ అని తెలియజేయడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశం. చదవండి: దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
వైఎస్ జగన్‌కు ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డు
సాక్షి, అమరావతి: పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు స్కోచ్ గ్రూపు ఎంపిక చేసింది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. మంగళవారం క్యాంపు క్యార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఆయన అందజేశారు. ఆదర్శంగా ఆర్బీకేలు.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ముందుగానే ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం ఆసక్తికర నమూనాగా నిలిచిందని వెల్లడించారు. దీనివల్ల రైతులకు భారీ ప్రయోజనం కలగడంతో పాటు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్ధిక సాధికారతకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు జీవనోపాధికి చేయూ త, అనుసంధాన రుణాలు ఇవ్వడం ద్వారా మహిళ ల ఆర్ధిక సాధికారతకు దోహదం చేశారన్నా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుం దని తెలిపారు. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకున్నారని, తద్వారా శాంతి భద్రతలు వెల్లివిరియడంతోపాటు మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. కోవిడ్ నియంత్రణలో సమర్థంగా.. కోవిడ్–19 నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా స్పందించిన తీరు, తీసుకున్న చర్యలతో పాటు 123 ప్రాజెక్టులపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో మెరుగైన ఫలితాలు స్పష్టంగా కనిపించాయని స్కోచ్ గ్రూప్ చైర్మన్ వివరించారు. పాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వివిధ రంగాల్లో వినూత్న చర్యలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కు దక్కుతుందన్నారు. చదవండి: పల్లెపల్లెన 540 సేవలు ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్ -
‘టూల్‌కిట్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కొందరు ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కూడా ఉన్నారు. రైతు ఉద్యమానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో గ్రెటా థన్‌బర్గ్ ఒక టూల్‌కిట్‌ని షేర్ చేశారు. ఇది రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్‌బర్గ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ఇక జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ వివాదం కారణంగా బెంగుళూరుకు చెందిన 22 ఏళ్ల దిశ రవి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కూడా పై సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నిటింకి మూల కారణం టూల్‌కిట్. అసలు ఏంటీ టూల్‌కిట్.. దీనిపై అంతర్జాతీయంగా వివాదం తలెత్తడానికి గల కారణాలేమిటి.. అందులో దిశ రవి పాత్ర ఏమిటి.. అనే విషయాలు తెలుసుకుందాం.. టూల్‌కిట్.. ‘టూల్‌కిట్’ అంటే ఓ డాక్యుమెంట్. దేని గురించి అయినా వివరించే ఓ పత్రం, బ్లూ ప్రింట్ లాంటిది అని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. కొన్ని ప్రపంచ గతినే మార్చేశాయి. తాజాగా గతేడాది అమెరికాలో ‘‘బ్లాక్ లైవ్స్ మాటర్’’, పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ స్ట్రైక్ క్యాంపెయిన్ లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరిగితే అందుకు సంబందించిన కార్యాచరణ, వ్యూహాలకు సంబంధించిన ప్రణాళికను కాగితాల మీద ముద్రించేవారు. దానిని ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే వారికి చేరేలా చూసేవారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆ స్థానంలోకి టూల్కిట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఉద్యమం అయినా సరే దానికి సంబందించిన ఒక డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తారు. దీనినే టూల్‌కిట్ అంటారు. ఆ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, దానిపై ఆసక్తి ఉన్నా వారు ఎవరైనా సరే ఈ టూల్‌కిట్‌ని చదివితే ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఉద్యమంలో ఏ రోజున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది.. ఎక్కడెక్కడ ర్యాలీలు, దీక్షలు ఉంటాయి.. ఉద్యమం ఎలా ముందుకు వెళ్తోంది అనే సమాచారం టూల్‌కిట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి.. ఉద్యమానికి మద్దతు పెంచడానికి ఈ టూల్‌కిట్‌ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మద్దతుదారులను ఏకం చేయడంలో ఈ టూల్‌కిట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. గ్రేటా థన్‌బర్గ్ పాత్ర ఇలాంటి టూల్కిట్నే గ్రేటా థన్‌బర్గ్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో దేశరాజధానిలో జరుగుతున్న ఉద్యమం ఏంటి.. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు ఏంటి అనే వివరాలు ఉన్నాయి. ఈ టూల్కిట్లో ‘‘రైతులు సంపన్నలుగా, స్వాలంభన సాధించడానికి ఉద్దేశించిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. వ్యవసాయం కార్పొరేట్, అంతర్జాతీయ సంస్థల గుప్పిట్లోకి వెళ్తుంది. వాటి ప్రధాన లక్ష్యం లాభాలు. దాని కోసం ప్రకృతిని దోచుకుంటారు’’ అని దీనిలో ఉంది. దిశ పాత్ర ఏంటి అయితే రైతులకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ని దిశ రవి ఎడిట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని దిశ రవి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. టూల్‌కిట్‌లోని రెండు మూడు లైన్లను ఎడిట్ చేసిన దిశ రవి ఆ తర్వాత అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయంటూ తిరిగి గ్రేటాకు ట్వీట్ చేసింది. రైతులకు మద్దతివ్వడం కోసం ఇలా చేసానని ఆమె విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా జనవరి 11న దిశ రవి, శాంతాను, నికితా అంతా జూమ్ యాప్‌ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. చదవండి: టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి -
స్కాచ్ ‘సీఎం ఆఫ్ ది ఇయర్’గా వైఎస్ జగన్
-
టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమకారిణి దిశ అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. అంతర్జాతీయ పర్యవరణ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్‌తో ముడిపడి ఉన్న టూల్‌కిట్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు దిశరవిని ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇదే కేసుకు సంబంధించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిశ అరెస్ట్‌ను దేశ వ్యాప్తంగా ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పౌరుల భావప్రకటన స్వేచ్ఛను పాలకులు హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిశ అరెస్ట్ వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షలకు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ఓ టూల్‌కిట్‌ను షేర్ చేశారు. అయితే ఈ టూల్‌కిట్ వెనుక తజకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారనేది ఢిల్లీ పోలీసులు అనుమానం. ఈ క్రమంలోనే గ్రెటా టూల్‌కిట్‌తో సంబంధముందని ఆరోపణలు ఎందుర్కొంటున్న పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవి (22)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దిశరవికి పాకిస్తాన్ మద్దతు.. ఈ క్రమంలో భారత్‌లో సామాజిక కార్యకర్తల అరెస్ట్‌పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సామాజిక ఉద్యమకారిణి దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రంలోని మోదీ, ఆర్ఎస్ఎస్ సర్కార్ పౌరులు హక్కులను కాలరాస్తోంది. కశ్మీర్ విభజనతో మైనార్టీలను తన గుప్పిట్లోకి తీసుకుంది. దేశంలో క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది.’ అంటూ ట్వీట్ చేసింది. ఇండియా హైజాక్ ట్విటర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జతచేసింది. దిశరవికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని పాక్ తెలిపింది. కాగా భారత్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ తల దూర్చడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేసి వివాదాన్ని మరింత రాజేసింది. India under Modi/RSS regime believes in silencing all voices against them as they did in IIOJK. Using cricketers & Bollywood celebrities narrative building was shameful enough, but now they have also taken Disha Ravi for custody over Twitter toolkit case. #IndiaHijackTwitter https://t.co/4kn6Cg0shh — PTI (@PTIofficial) February 15, 2021 . -
త్వరలో రైతు భరోసా పోలీసు స్టేషన్లు : సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘దిశ’ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రత, రక్షణ కోసం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని పటిష్టం చేయడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు నివేదించారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్) వాహనంపై ప్రధాని ప్రశంసలు కురిపించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు సీఎంకు వివరించిన అంశాలు: దిశ చట్టం కింద 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లో, 1080కేసులకు సంబంధించి 15 రోజుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశామని, అందులో 103 కేసుల్లో శిక్షలు ఖరారు చేశామని అధికారులు వివరించారు. సైబర్ బుల్లీయింగ్‌పై 1531 కేసులు పెట్టామని, లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసుల్లో 823 కేసులు నమోదు చేశామని, గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 1,40,415 మంది డేటాను క్రోడీకరించామని వెల్లడించారు. సైబర్ మిత్ర ద్వారా 2750 పిటిషన్లు స్వీకరించామని, 374 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని తెలిపారు. దిశ యాప్‌ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని, 154 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని పేర్కన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దిశ తరహా కార్యక్రమాలను చేపట్టాయని వెల్లడించారు. సమీక్షలో సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై పూర్తి స్థాయి దృష్టిపెట్టాలని సూచించారు. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైబర్ కియోస్క్‌లు: మొబైల్ ఫోన్ల సెక్యూరిటీ కోసం ప్రారంభించిన సైబర్ కియోస్క్ మంచి ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు పేర్కొనగా, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సూచిక బోర్డులను కియోస్క్ వద్ద పెట్టాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్దే కాకుండా విద్యా సంస్థల వద్ద కూడా కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కియోస్క్‌లకు ‘దిశ’ పేరు పెట్టాలని ఆదేశించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లు: తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దిశ యాప్ – ప్రచారం: దిశ పోలీస్ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్ పెట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని నిర్దేశించారు. గ్రామ సచివాలయాల్లో దిశ చట్టం కింద చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, హోర్డింగ్స్ ఉండాలని ఆదేశించారు. దిశ ఎస్ఓఎస్: దిశ ఎస్ఓఎస్ నుంచి కాల్ వచ్చిన వెంటనే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అక్కడ ఉంటున్నారా.. లేదా అని సీఎం ప్రశ్నించగా.. సగటున 6 నిమిషాల్లోగా చేసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన మహిళలకు క్రమం తప్పకుండా కాల్స్ వెళ్లాలని, వారి సమస్య తీరిందా.. లేదా.. అన్న దానిపై తప్పని సరిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ ఫాలో అప్ కార్యక్రమం క్రమం తప్పకుండా చేయాలని స్పష్టం చేశారు. సచివాలయాలు, సిబ్బంది: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి యూనిఫామ్స్ నిర్దేశించాలని ఆదేశించారు. ప్రతి రోజూ 2 గంటల పాటు కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లా రైతు భరోసా పోలీసు స్టేషన్ల యోచన: రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని ఆదేశించిన సీఎం.. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిల్చి, వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని యెచిస్తున్నట్లు సీఎం తెలిపారు. వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతుకు భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల కోసం ఒక డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై మేథోమథనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారలను ఆదేశించారు. -
ఫోన్ కాల్‌తో పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో మహిళలకు చట్టబద్ధమైన పరిష్కారం లభిస్తోంది. ఏ మహిళకు కష్టమొచ్చినా వెంటనే పోలీస్ సహాయాన్ని కోరే స్థాయికి చైతన్యం పెరిగింది. రాష్ట్రంలో డయల్ 100, డయల్ 112, దిశ కాల్ సెంటర్లకు లభిస్తున్న స్పందనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న ఏపీ పోలీస్ శాఖ.. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపడుతోంది. ప్రధానంగా అత్తమామలు, ఆడపడుచు, భర్త పెట్టే గృహహింస కేసులపై పోలీసులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. గడచిన ఏడాది కాలంలో గృహహింస కాల్స్ అధికంగా వస్తుండగా.. వాటిపై పోలీసు శాఖ తక్షణ చర్యలు చేపడుతుండటం విశేషం. మహిళలు, విద్యార్థినులు డయల్ 100, 112, దిశ కాల్ సెంటర్‌ను పెద్ద సంఖ్యలోనే వినియోగించుకుంటున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. మహిళలపై వేధింపులు, దాడులు వంటి తదితర అంశాలకు సంబంధించి 100, 112, దిశ కాల్ సెంటర్లలో దేనికైనా ఫోన్‌కాల్ వచ్చిన క్షణం నుంచే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. కాల్ సెంటర్లో ఫిర్యాదు ఆటోమేటిక్‌గా వాయిస్ రికార్డు అవుతుండగా.. కాల్ సెంటర్ సిబ్బంది బాధితురాలు ఉండే ప్రాంతానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తక్షణమే సమాచారం అందిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్న పోలీస్ టీమ్ బాధిత మహిళలకు తక్షణ సాయం అందించే చర్యలు చేపడుతోంది. గృహహింస వంటి కేసుల్లో సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వేధింపులు తదితర నేరాలపై గట్టి చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. బాధిత మహిళల సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. కౌన్సెలింగ్, హెచ్చరికలు, బైండోవర్ వంటి పద్ధతుల్లో నిందితులను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కేసుల్లో బాధిత మహిళ కోరితేనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. -
మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్ చిట్‌చాట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డీజీపీ గౌతం సవాంగ్ మంగళవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పలు అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గత సంవత్సరంలో కష్టపడి పనిచేసిన ఏపీఎస్పీ సిబ్బందిని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇచ్చాము. డీజీపీ డిస్క్ అనేది కొత్త అవార్డు. విధుల నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డు. ఏపీఎస్పీ అనేది ఒక పారామిలటరీ ఫోర్స్‌లాగా ఏర్పాటయ్యింది. ఈ ఫోర్స్ స్వాతంత్ర్యం ముందు నుంచీ ఉన్నది. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీఎస్పీ పనిచేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా సేవలందించిన చరిత్ర ఏపీఎస్పీకి ఉంది. పోలీసులకు, సెక్యూరిటీలకు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీఎస్పీ సేవలు ఉన్నచోట పరిస్ధితులు త్వరగా అదుపులోకి వస్తాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్స్‌కు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీ సెక్యూరిటి వింగ్ దేశానికే ప్రామాణికం. ఎస్డీఆర్ఎఫ్ కూడా ఏపీఎస్పీలో ఒక భాగమే. ఏపీ పోలీస్ దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్‌గా గుర్తించబడింది. అవసరమైన అన్ని వనరులు లేకపోయినా ఏపీ పోలీస్ పనిచేస్తోంది. బాధ్యత, పారదర్శకత, ప్రతిభ ప్రదర్శిస్తూ ఏపీ పోలీస్ ప్రతి నిత్యం పనిచేస్తున్నారు’ అని తెలిపారు. (చదవండి: సవాంగ్ స్ఫూర్తితోనే అవార్డు) ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీస్ సర్వీసులను ఉత్తమంగా తయారు చేయడానికి అవసరమైన వనరులు ఇస్తున్నారు. పోలీసు వ్యవస్ధలో వచ్చిన మార్పులతో సామాన్య ప్రజలకు సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. సామాన్య మానవుడికి పోలీసుల ప్రాధాన్యత తెలియాలి. స్పందన ద్వారా ప్రజలు పోలీసులకు నేరుగా పిటిషన్లు పెట్టుకోవచ్చు.. వీటికి సీఎం కార్యాలయం వరకూ పర్యవేక్షణ ఉంటుంది. స్పందనలో వచ్చే పిటిషన్లలో 52 శాతం మహిళలు ఉన్నారు.. వారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దిశ పోలీసులు చాలా బాధ్యతగా పని చేస్తున్నారు. దిశా ఎస్ ఓ ఎస్ యాప్‌ని ప్రతి మహిళా డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఆన్‌లో ఉంచి మూడుసార్లు ఫోన్ షేక్ చేస్తే వీడియోతో సహా దగ్గరలోని పోలీస్ స్టేషనుకు వెళుతుంది. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.05లక్షలకు పైగా ఎఫ్ఐఆర్లు డౌన్లోడ్ చేశారు. ఏపీ పోలీసులకు గత సంవత్సర కాలంలో 108 అవార్డులు వచ్చాయి. ఐసీజేఎస్‌లో దేశంలోనే రెండవ స్ధానం ఏపీ పోలీస్ సాధించింది. రాబోయే రోజుల్లో పోలీసులు మేం ఉన్నాం, మీకోసమే ఉన్నాం అనే నమ్మకం బలహీనవర్గాలకు ఇవ్వాలి. వ్యక్తిగతంగా, అందరం దేశానికే గర్వకారణం అయ్యేలా పనిచేయాలి’ అన్నారు. (34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ ) మైక్రోఫైనాన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతాం అన్నారు డీజీపీ గౌతం సవాంగ్. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. మొబైల్ లోన్ యాప్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలి. నోయిడా, ఢిల్లీ, గురుగావ్‌ల నుంచి ఎక్కువగా ఈ యాప్‌లనిర్వహణ జరుగుతున్నట్టు గుర్తించాం. మొబైల్ లోన్‌యాప్‌ల మూలాలను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. -
భర్త బాధితులకు ‘దిశ’ భరోసా
పోలీసుల స్పందనతో నిలిచిన ప్రాణం.. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత అర్ధరాత్రి 1:59 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసు సాయం కోరింది. తన భర్త వేధింపుల కారణంగా తాను నిద్రమాత్రలు మింగినట్టు తెలిపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఐదు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, ఆమె భర్తను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని భర్త చెప్పడంతో వారి కాపురాన్ని పోలీసులు నిలబెట్టినట్లయింది. బెదిరించిన యువకుడి అరెస్ట్.. కర్నూలు జిల్లాలోని ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని ఒక యువతిని వేధించాడు. అందుకు అంగీకరించని ఆమె పెళ్లి చెడగొట్టేందుకు లెటర్ రాస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాలికను వేధించినందుకు కేసు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక (12)ను ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పొరుగింటి యువకుడు చొరబడి వేధించాడు. ఇది గమనించిన స్థానికులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి బాలికను కాపాడటంతోపాటు ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు... ఇలా భర్త చేతిలో దెబ్బలు తిని కాపాడమని కోరిన గృహిణులతోపాటు ఆకతాయిల వేధింపులకు గురైన విద్యార్థినులు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో అపరిచితుల అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన యువతులకు దిశ యాప్ వరంలా మారింది. సాక్షి, అమరావతి: భర్త బాధితులైన పలువురు గృహిణులు దిశ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. దిశ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కౌన్సెలింగ్ ద్వారా కాపురాలు చక్కదిద్దుతున్నారు. దిశ కాల్ సెంటర్‌కు వచ్చిన కాల్స్‌ను పోలీసులు విశ్లేషించగా.. భర్త బాధితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తెచ్చిన సంగతి తెల్సిందే. దిశ బిల్లులో భాగంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 8న దిశ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను దాదాపు 12 లక్షలమంది డౌన్లోడ్ చేసుకోగా, ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దిశ యాప్‌లో వస్తున్న ఫిర్యాదుల్లో భర్త బాధితలు సైతం ఉండటం గమనార్హం. అనేకమంది గృహిణులు ‘భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నాం కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. గడిచిన పదినెలల కాలంలో 675 మంది మహిళలు, బాలికలు దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. వీరిలో భర్త వేధింపులు తాళలేకపోతున్నామంటూ 267 మంది కాల్ చేశారు. ఈ ఘటనల్లో మద్యం తాగి వచ్చి భార్యను కొట్టిన ప్రబుద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు అధిక కట్నం కోసం వేధిస్తున్న వారున్నారు. రాత్రివేళ 10.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య ఈ తరహా వేధింపులు జరిగినట్టు దిశ కాల్స్‌లో రికార్డయ్యాయి. భర్త కొడుతున్న సమయంలో తమ మొబైల్స్‌లోని దిశ యాప్‌ను ఓపెన్ చేసి ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే అవకాశం లేకపోవడంతో తమ చేతిలోని సెల్ ఫోన్‌ను అటు ఇటు ఊపి (షెక్ చేయడం) ఆపదలో ఉన్నాం ఆదుకోండి.. అని సమాచారం అందించడం విశేషం. దిశ కాల్ సెంటర్‌కు సమాచారం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో భర్త బాధితులను కాపాడుతున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలు చక్కదిద్దుతున్నారు. పదినెలల్లో దిశ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు భర్త వేధింపులు: 267 బయటివారి వేధింపులు: 115 గుర్తుతెలియనివారి వేధింపులు: 69 పనిచోసేచోట వేధింపులు: 67 బంధువుల వేధింపులు: 68 తప్పుడు ఫిర్యాదులు: 22 అసభ్య ప్రవర్తన: 19 మహిళ అదృశ్యం: 13 బాలికలపై అకృత్యాలు: 9 సివిల్ వివాదాలు: 8 బాలికల అదృశ్యం: 8 ప్రమాదాలు: 6 పురుషుల అదృశ్యం: 3 వెంటపడి వేధింపులు: 1 మొత్తం: 675 తక్షణం స్పందిస్తున్నాం దిశ యాప్ ద్వారా కాల్ సెంటర్‌కు వస్తున్న సమాచారంపై తక్షణం స్పందించి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తున్నాం. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు 5 నుంచి 12 నిమిషాల్లోనే ఘటన ప్రాంతానికి చేరుకుని సహాయం అందిస్తున్నారు. చాలావరకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్‌లతో సరిపెడుతున్నాం. తీవ్రత ఉన్న వాటిపై గృహహింస, పోక్సో, నిర్భయ కేసులు నమోదు చేస్తున్నాం. భర్తల వేధింపులపై 267 మంది ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ అనంతరం అనేక కాపురాలు చక్కబడ్డాయి. అప్పటికీ మాటవినని 20 మంది పురుషులపై కేసులు నమోదు చేశాం. - దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
ప్రియాంక ఆరోగ్యంపై ‘దిశ’ పోలీసులు ఆరా
సాక్షి, విశాఖపట్నం: ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై ‘దిశ’ పోలీసులు ఆరా తీశారు. ప్రియాంక ఆరోగ్యం కొంత క్షీణించింది. దీంతో కేజీహెచ్ వైద్యులు అత్యవసర వైద్యం అందించారు. విశాఖలోని థామ్సన్ స్ట్రీట్‌లో ఉంటున్న ప్రియాంక పక్కింట్లో ఉంటున్న శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమ పేరిట వేధించడమే కాకుండా.. నిరాకరించిందని గొంతుకోశాడు. ఈ ఘటనలో గొంతులో లోతుగా గాయం కావడంతో ఆమెకు కింగ్‌జార్జ్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. అయితే నిన్న రాత్రి గొంతులో కొంత అసౌకర్యం ఏర్పడటంతో ప్రత్యేకంగా వైద్యులు మంగళవారం చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని.. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత కాలం పడుతుందని కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మైథిలి పేర్కొన్నారు. (చదవండి: భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!) -
మహిళల రక్షణలో 'దిశ' మారదు
సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలకు రక్షణ కవచంలా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌లో దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ 13న అసెంబ్లీలో, డిసెంబర్ 16న మండలిలో దిశ బిల్లును ఆమోదించి 2020 జనవరి 2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ బిల్లుపై కేంద్రం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చేందుకు రాజీలేని వైఖరితో ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం–2019 (పాత బిల్లు)ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2020 (కొత్త బిల్లు)ని శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు, బాలలపై జరిగే నేరాలపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు)చట్టం–2020కి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. అసెంబ్లీ, మండలి ఆమోద ప్రక్రియ పూర్తి కావడంతో ఈ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం గవర్నర్ పరిశీలన అనంతరం వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ► దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్ఐఆర్ కచ్చితంగా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడానికి ముందు నుంచే ఏపీలో ఈ విధానం అమల్లో ఉండటం విశేషం. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ► రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్ స్టేషన్లలో 18 కస్టమైజ్డ్ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లోని ప్రత్యేక పరికరాలతో సాంకేతిక సిబ్బంది నేర స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. ► ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సత్వర సహాయం అందించేలా ఆవిష్కరించిన దిశ యాప్‌ను ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98,380 మంది ఎస్ఓఎస్ ద్వారా పోలీసుల సహాయం కోరారు. ► దిశ యాప్ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7 రోజుల్లోపే చార్జిషీట్ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడింది. ► దిశ కేసుల దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ► రాష్ట్రంలో 11 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 700 పోలీస్స్టేషన్లలో ఉమెన్ స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు. దిశ బిల్లులో ప్రస్తావించిన అనేక విషయాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు వచ్చాయి. దిశ బిల్లులో ప్రధానాంశాలు.. ► మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం–2012, పోక్సో చట్టం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)–1860, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(సీపీసీ)–1973లను ఉపయోగిస్తారు. ► ఐపీసీ సెక్షన్ 326ఎ, 326బి, 354, 354ఎ, 354బి, 354సి, 354డి, 376, 376ఎ, 376బి, 376ఎబి, 376సి, 376డి, 376డిఎ, 376డిబి,376ఈ, 509లతో పాటు పోక్సో యాక్ట్, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు. ► 18 ఏళ్ల లోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్ 14న కేంద్రం పోక్సో యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫ్‌న్సెస్ యాక్ట్ – పీఓసీఎస్ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది. ► జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. ► కేసుల నమోదుకు ఆన్లైన్ విధానం అమలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారి వివరాలు అపరాధుల రిజిష్టర్ (ఆన్లైన్ విధానం)లో నమోదు చేస్తారు. ► వేగంగా దర్యాప్తు పూర్తి చేసేలా ప్రతి జిల్లా స్థాయిలో ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. ► బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా, దోషులకు వేగంగా శిక్షలు అమలు చేసేలా ఈ కేసుల కోసం ప్రతి జిల్లాలో ఒకటి, అంతకంటే ఎక్కువగా ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటిలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)ను కూడా నియమించనున్నారు. -
ఎన్‌కౌంటర్‌కు ఏడాది
-
వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్ విడుదల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ‘వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్’ను విడుదల చేశారు. ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్లపై ...మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నారు. వంద రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్ నేరాలపై మహిళా కమిషన్ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్ సుయజ్ పాల్గొన్నారు. -
కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది
సాక్షి, షాద్‌నగర్ : ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది... ఓ అమ్మాయి పట్ల జరిగిన దారుణ మారణ కాండ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది.. దిశ ఉదంతం.. మహిళ రక్షణ దిశగా పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులలో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికి ఏడాది అయ్యింది. ప్రతి ఒక్కరినీ కదిలించి కన్నీటితో ముంచిన ఈ ఘటన తరువాత జరిగిన పరిణామాలను ఓసారి నెమరేసుకుంటే.. 2019 నవంబర్ 27న సుమారు 8.30 గంటల ప్రాంతంలో అత్యవసర పరిస్దితుల్లో స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్ళిన దిశ నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చిన దిశ తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. ఆ సమయంలో ఆ నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఓ పాడు పడిన ప్రహరి పక్కకు తీసుకెళ్ళి దారుణంగా సామూహిక అత్యాచారం జరిపారు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రాణాలను సైతం బలితీసుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్‌నగర్ శివారులోని చటాన్‌పల్లి బైపాస్ వంతెన కింద దహనం చేశారు. డిసెంబర్ 28న తెల్లవారే సరికి దిశ పట్ల జరిగిన దారుణం నలుదిశలా పాకింది. ఈ దారుణం ప్రతి గుండెను కదిలించింది. ఆ రోజు రాత్రే నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (దిశ.. కొత్త దశ) ఎన్నో మలుపులు దిశ హత్యోదంతం తర్వాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. నిందితులను పోలీసులు నవంబర్ 29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకరావడంతో ఇక్కడే వారిని ఎన్కౌంటర్ చేయాలని వేలాది మంది జనం పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాను నిర్వహించారు. పోలీసుల పైకి ఆందోళన కారులు రాళ్లురువ్వడం, చెప్పులు విసరడంతో లాఠీ చార్జీ జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదేరోజు నిందితులను తహిసీల్దార్ ఎదుట హాజరు పర్చారు. దీంతో 14రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు నిందితులను భారీ బందోబస్తు మధ్య షాద్‌నగర్ నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. డిసెంబర్ 2న నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు షాద్‌నగర్ కోర్టులో ఫిటీషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 3న కోర్టు పదిరోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. హంతకులు ఉపయోగించిన లారీలో కీలమైన ఆధారాలను డిసెంబర్ 5న సేకరించారు. షాద్‌నగర్ డిపో ఆవరణలో ఉంచిన లారీలో క్లూస్‌టీం బృందం ఆధారాలను సేకరించింది. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. దీంతో నిందితులు పోలీసుల పైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. నలుగురు నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. డిసెంబర్ 7న ఢిల్లీ నుండి మానవహక్కుల కమీషన్ బృందం దిశను ఆహుతి చేసిన ప్రాంతాన్ని, నిందితులు ఎన్కౌంటర్ జరిగిన స్ధలాన్ని పరిశీలించారు. డిసెంబర్ 9న దిశనను హతమార్చిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని క్లూస్‌టీం 3డీ స్కానర్‌తో చిత్రీకరించింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన క్లూస్‌టీం బృందం చటాన్‌పల్లి బ్రిడ్డి వద్దకు చేరుకొని పరిశీలించారు. దిశను దహనం చేసిన ప్రదేశంతో పాటుగా, హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని పూర్తిగా 3డీ స్కానర్‌తో చిత్రీకరించారు డిసెంబర్ 11,15 తేదీల్లో క్లూంటీం బృంందాలు ఎన్కౌంటర్ ఘటనా స్ధలానికి వచ్చి మరిన్ని ఆధారాల కోసం వెతుకులాడాడు. డిసెంబర్ 23న ఎన్‌కౌంటర్‌కు గురైన మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ నిమిత్తం గత జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు. (వారిని ఏ తుపాకీతో కాల్చారు?) చట్టాలకు దిశ జాతీయ రహదారి పై టోల్ గేట్‌కు కూత వేటు దూరంలో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాలుగా మారింది. పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ నేపధ్యంలోనే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ మహిళ రక్షణ దిశగా పోలీసులు కొత్త అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగ రిత్యా బయటికి వెళ్లే మహిళల స్వీయ రక్షణ కోసం యాప్‌లు ఏర్పాటు చేయడం, కళాశాలల్లో మహిళా రక్షణ దిశగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకరావడం మహిళల నుండి పిర్యాదులు వస్తే వెంటనే స్వీకరించడం, వెంటనే దర్యాప్తు ప్రారంభించడం వంటి కార్యక్రమాలను విసృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. మరో వైపు పోలీసుల అప్రమత్తత దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా ఏడాది కాలంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అయితే మహిళలు కూడ ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర పరిస్ధితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్ధించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు -
ఆపరేషన్ బ్లూస్టార్ హీరో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’దుర్ఘటనకు నేటి(గురువారం)తో ఏడాది పూర్తయింది. వైద్యురాలైన దిశను శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి గేటు వద్ద లారీ డ్రైవర్లు, క్లీనర్లు అపహరించి, లైంగికదాడి జరిపి దారుణంగా హతమార్చి, దహనం చేసిన ఘటనపై దేశం భగ్గుమంది. తర్వాత దిశను దహనం చేసిన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దనే పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించిన సంగతి తెలిసిందే. దిశ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆమె జీవితంలో జరిగిన అత్యంత విషాద క్షణాలను సినిమాగా తీయడంపై ఆమె తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చట్టపరంగా ఆపేందుకు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. రిజర్వ్ ఫోర్స్‌లో సేవలు! న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో దిశ తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డితో ‘సాక్షి’మాట్లాడింది. 1981 నుంచి 1987 వరకు శ్రీధర్‌రెడ్డి సైన్యంలో పనిచేశారు. పంజాబ్ కపుర్తలాలోని 12 ఆర్మ్డ్ రెజిమెంట్‌లో ఆయన విధులు నిర్వహించారు. 1984లో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ఈ పోరులో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే రిజర్వ్ ఫోర్స్ కింద 12వ ఆర్మ్డ్ రెజిమెంట్ పనిచేసింది. నేరుగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లకపోయినా ఆ క్షణంలో అవసరమైతే ప్రాణాలర్పించేందుకు ఈ రెజిమెంట్ సిద్ధమైంది. అలాంటి తనకు ఈ సమాజం ఏమిచ్చిందని శ్రీధర్‌రెడ్డి వాపోయారు. ఇలాంటి మృగాల కోసమా తాను సరిహద్దులో గుండెలడ్డుపెట్టి పహారా కాసింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని ఎన్నో మృగాలకు వైద్యం చేసి ప్రాణం పోసిన తన కూతురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు కోల్పోతుందని ఎన్నడూ ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. -
రామ్ గోపాల్ వర్మకు షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజు నోటీసులు అందించింది. దిశ ఎన్కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘దిశ ఎన్కౌంటర్’ చిత్రాన్ని నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని, ఇలాంటి సమయంలో వర్మ ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండన్వికుండా చేస్తున్నారని పిటిషినర్ తరపు న్యాయవాది కృష్ణ మూర్తి హైకోర్టుకు వివరించారు. ఈ చిత్రంలో వారిని దోషులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడిషినల్ కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా ఎలా తీస్తారని కోర్టుకు వివరించారు. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. పిటిషినర్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు దిశ ఎన్కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఆధారంగా తీసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేశారు. -
రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమా ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దిశ తండ్రి దాఖలు చేసిన అప్పీలుపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోక ముందే కోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు.. రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అలానే అనుమతులున్నాయో లేదో తెలుసుకొని చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ‘ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’) మరోవైపు దిశ ఎన్కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఆధారంగా తీసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేశారు. -
హైకోర్టుకు చేరిన రామ్‌గోపాల్ వర్మ 'దిశ'
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం దిశ మళ్లీ హైకోర్టుకు చేరింది. చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో రిట్ అప్పీల్ పిటీషన్ దాఖలు చేశారు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్కౌంటర్ చిత్రాన్ని వెంటనే ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. కాగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారని.. వాటిని తొలగించాలంటూ దిశ తండ్రి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌లో అసభ్యంగా మెసేజ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ నెల 26న సినిమా విడుదల కాకుండా ఆపాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే ఎన్కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు జ్యుడీషియల్ కమిషన్‌ను కలిశారు. (ఆర్జీవీ దిశకు వరుస ఎదురుదెబ్బలు) -
జాతీయ స్థాయిలో నం.1గా ఏపీ పోలీసు శాఖ
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగాలపై స్కొచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో భాగంగా జాతీయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 84 అవార్డులను ప్రకటించిగా రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 48 అవార్డులను దక్కించికుంది. కేరళ-9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్-4, తెలంగాణ-1, తమిళనాడు-1 అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఏపీ పోలీసు శాఖ వరుసగా రెండవ సారి టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులు సాధించిన ఏపీ పోలీస్ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులు కైవసం చేసుకోని మొత్తం 85 అవార్డుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అత్యధిక అవార్డులు దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను అభినందించారు. మహిళా రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన దిశ, దాని సంభందిత విభాగంలో అందిస్తున్న టెక్నాలజీ సేవలకుగాను 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల ప్రజల కోసం 87 సేవలతో అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్‌కు గాను అవార్డు లభించింది. ఇక కోవిడ్ సమయంలో అందించిన, అందిస్తున్న మెరుగైన సంక్షేమానికి గాను 3 అవార్డులు, టెక్నికల్ విభాగంలో -13 అవార్డులు, సీఐడీ- 4, కమ్యూనికేషన్-3, విజయవాడ, కర్నూల్ జిల్లాకు -3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాకు-2, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు,గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణ జిల్లాకు- 1 అవార్డులు లభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిలో రికార్డ్ స్థాయిలో 85 అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగంగా ఏపీ పోలీసు శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో, త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, సీఎం జగన్ తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించారు. ఇక సీఎం పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామన్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. -
వర్మ కార్యాలయం వద్ద దిశ తండ్రి ఆందోళన
-
దిశ తండ్రి ఆవేదన
-
‘వర్మ మరింత ఆవేదనకు గురిచేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ‘దిశ..ఎన్కౌంటర్’ సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఆదివారం ఉదయం రాంగోపాల్ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. ఆయన వెంట పలువురు మహిళలు, స్నేహితులు ఉన్నారు. వారంతా దిశ సినిమాను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దిశ కుటుంబాన్ని వర్మ తన సినిమాతో మరింత ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎమోషన్లని డబ్బు చేసుకోవాలనుకుంటున్న ఆర్జీవీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని ఈమేరకు శ్రీధర్‌రెడ్డి తరఫు న్యాయవాది నివేదించారు. అయితే ఈ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు నివేదించారు. స్పందించిన న్యాయమూర్తి.. కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. (చదవండి: ‘ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’)