
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచారం, హత్య నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. దిశ ఘటనపై సుప్రీం కోర్టు వేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో విచారణను జాప్యం చేసిన జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు శనివారం దిశ సంఘటనపై వర్చ్యువల్ మీటింగ్ నిర్వహించారు.మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ సమావేశం సాగింది.
సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. దిశ కేసులో తాము భాగస్వామ్యం అవుతామని పిటీషన్ వేసిన న్యాయవాది వసుదా నాగరాజు తెలిపారు.పిటీషన్‌పై పూర్తి అఫిడవిట్ వేయాలని కమిషన్ సూచించింది. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాల తరపు సమావేశంలో న్యాయవాది కృష్ణమాచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment