judicial commission
-
ఎస్సీ వర్గీకరణకు వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ ప్రక్రియను అధ్యయనం చేసేందుకు వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) నిర్ణయించింది. చట్ట సంబంధ చిక్కుల్లేకుండా అత్యంత పారదర్శ కంగా కమిషన్ అధ్యయనం చేయాలని కమిటీ తీర్మానించింది. కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఏర్పాటుకు ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ముసా యిదా సైతం అందింది. ఈ నేపథ్యంలో పలు సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కావడం తెలిసిందే. ఈ కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, పార్లమెంటు సభ్యులు మల్లు రవితోపాటు సీఎస్ శాంతికుమారి, ఏజీ సుదర్శన్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ నుంచి 30%సమాచారం: ఉత్తమ్ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియను 2011 జనగణన ఆధారంగా చేపట్టాలని కమిటీ దాదాపు నిర్ణయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రంలోని ఉద్యోగ నియామక బోర్డుల నుంచి ఎస్సీ ఉపకులాలవారీగా నియామకాల సమాచారాన్ని స్వీకరించామని, ఆర్థిక శాఖ నుంచి 30 శాతం సమాచారం వచ్చిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. గత నెల 30 నుంచి విజ్ఞాపనల స్వీకరణ ప్రారంభించగా ఇప్పటివరకు 1,082 సూచనలు వచ్చినట్లు చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల్లో వన్‌మెన్ కమిషన్.. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న పంజాబ్, తమిళనాడులలో అధికారుల బృందం అధ్యయనం చేసిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో హరియాణాలో అధ్యయనం చేయలేదన్నారు. పంజాబ్‌లో ఎస్సీ కేటగిరీలో రెండు గ్రూపులుగా వర్గీకరణ చేశారని, తమిళనాడులో విద్య, ఉపాధిలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఆ రాష్ట్రంలో 76 ఎస్సీ ఉపకులాలు ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు. ఆ రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రక్రియ చట్టపరమైన చిక్కుల్లేకుండా అమలు చేసేందుకు వన్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వర్గీకరణ అధ్యయనాన్ని సకాలంలో పూర్తి చేయడానికి కమిషన్‌కు కాలపరిమితి విధించాలని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా పర్యటించి ఎస్సీ వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. దీంతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ వర్గీకరణపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఉపసంఘం సభ్యులు త్వరలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. వర్గీకరణ ప్రక్రియలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) వంటి ప్రసిద్ధ ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. -
తెలంగాణలో కొనసాగుతోన్న కాళేశ్వరం కమిషన్ విచారణ
-
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో వేగం పెంచిన కమిషన్
-
‘కాళేశ్వరం’ విచారణ.. నేడు కమిషన్ ముందుకు 18 మంది మాజీలు
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో తాజా మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా.. కాళేశ్వరం కమిషన్ ముందుకు 18 మంది తాజా మాజీ అధికారులు హాజరు కానున్నారు. ఈ ఇరిగేషన్ అధికారులు మధ్యాహ్నాంలోపే నేరుగా కమిషన్ కార్యాలయానికి వెళ్తారని, కమిషన్ అడిగిన వివరాలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరంపై ఇంజినీర్లు, రిటైర్డ్ఇంజినీర్లకు నోటీసులు ఇస్తూ వివరాలు రాబడుతున్నారు. ఇంకో నాలుగైదు రోజులు జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్రంలోనే ఉండి, విచారణ చేయనున్నారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి, ఎంక్వైరీకి పిలువనున్నారు.నిన్నటి విచారణకు..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఈ అఫిడవిట్లన్నీ రహస్యంగా ఉంటాయని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజికి గల కారణాలతోపాటు డిజైన్లు, నిర్వహణ, ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయాలు, అంచనాల పెంపు తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా సోమవారం పలువురు ఇంజినీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మాజీ ఈఎన్సీలు మురళీధర్ (జనరల్), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్‌రెడ్డి (డిజైన్స్)తో పాటు డిజైన్స్ విభాగంలో ఎస్ఈలుగా పనిచేసిన చంద్రశేఖర్, బసవరాజు, సుందిళ్ల, అన్నారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఓంకార్‌సింగ్, యాదగిరి తదితరులు హాజరయ్యారు. మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరినట్లు తెలిసింది. బ్యారేజీలకు సంబంధించి మీ అనుభవాలను, అభిప్రాయాలను నిజాయతీగా, స్వేచ్ఛగా వెల్లడించాలని వారిని కమిషన్ కోరినట్లు తెలిసింది.జూన్‌లోపు పూర్తి కాదుకాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో ఇంజినీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికాదని విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు. ‘మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విచారణలో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం ఏడుగురిని విచారణకు పిలిపించాం. ఆనకట్టల బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి ఈ రోజు వివరాలు సేకరించాం. త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తాం. మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసులిచ్చాం. సాంకేతికాంశాలపై విచారణ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక, ఆర్థికాంశాలు, అవకతవకలపై విచారణ మొదలు పెడతాం. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది’ అని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల భేటీజస్టిస్ పీసీ ఘోష్‌తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమయ్యారు. బ్యారేజీలపై విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు, ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. 54 ఫిర్యాదులు:జస్టిస్ పీసీ ఘోష్కాళేశ్వరం విచారణ వేగంగా సాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ‘ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించాను. విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజినీర్లకు నోటీసులిస్తున్నాం. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. విజిలెన్స్ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసింది. వాటిని కూడా పరిశీలిస్తాం. కమిషన్‌కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కమిషన్‌కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. బ్యారేజీల రక్షణ చర్యలు, మరమ్మతులనేవి నా పని కాకపోయినా.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రత చర్యలు చేపట్టాలని సూచించాను. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయి’ అని ఆయన వివరించారు. -
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్ఆర్ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్ఆర్ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్ఆర్ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్ నెంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. -
వారికే చెప్పుకోండి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని.. ప్రాజెక్టును నిర్మించిన అధికారులు, ఇంజనీర్లు ఏం చెప్తారో కమిషన్‌కే చెప్పుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కొత్తగూడెం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావు తదితరులతో సీఎం ఆదివారం రాత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్ బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోగా.. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యతతమదేనని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మరుసటి రోజే ప్రకటించిందని, ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం ఏమిటని ఈ సందర్భంగా రేవంత్ నిలదీసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో సొంత ఖర్చుతో మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా అంగీకరించిన ఎల్అండ్టీ.. ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ అంశంలో జ్యుడిషియల్ కమిషన్‌కు వివరణ ఇచ్చుకోవాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు ఎల్‌అండ్‌టీపై చర్యలకు ఉపక్రమించాలని, అందుకు ఉన్న అవకాశాలను నివేదించాలని ఆదేశించినట్టు సమాచారం. కొత్త ప్రాజెక్టుల ఖర్చు వివరాలివ్వండి గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులపై పూర్తి వివరాలు అందజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఇక యాసంగి పంటలకు నీళ్లిచ్చే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోయాయని, ఈ రెండు ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని సీఎంకు ఈఎన్సీలు నివేదించారు. దీంతో హైదరాబాద్ జంట నగరాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాకు వేసవిలో తాగునీటి సమస్య ఎదురవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎగువన ఉన్న నారాయణపూర్ జలాశయం నుంచి కృష్ణానదిలో ఊట నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి ఇబ్బందులు ఉండవని ఈఎన్సీలు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఎండాకాలంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌లోని నిల్వలను పరిరక్షించాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. శాసనసభలో ప్రకటించి.. ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నీటిపారుదల శాఖపై కీలక ప్రకటన చేస్తానని.. అన్ని వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో నీరు ఇవ్వలేని పరిస్థితి, దీనికి కారణాలు, బాధ్యులు ఎవరన్న అంశంపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లోనే జ్యుడిషియల్ కమిషన్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. సాగర్ కింద క్రాప్ హాలిడే! నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు యాసంగిలో సాగునీటి సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రమే అధికారులతో సమీక్షించారు. సాగర్‌లో నిల్వలు అడుగంటిన నేపథ్యంలో యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలని ఈఎన్సీలు సూచించినట్టు తెలిసింది. -
మళ్లీ తెరపైకి దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. దిశ సామూహిక హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు వేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో కమిషన్ విచారణలో జాప్యం చోటుచేసుకుంది. కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో జ్యుడీషియల్ కమిషన్ మళ్లీ విచారణ ప్రారంభించింది. నేడు(బుధవారం) ఎన్కౌంటర్ గురైన కుటుంబాల కమిషన్ సభ్యులు కలవనున్నారు. దిశ కమిషన్ సభ్యులు గుడిగండ్ల, జట్లేరు గ్రామానికి బయలుదేరారు. ఎన్కౌంటర్ గురైన కుటుంబాలకు కమిషన్ నోటీసులు ఇవ్వనుంది. ఎన్కౌంటర్ గురైన కుటుంబాల నుండి పలు కీలకమైన వివరాలు సేకరించనున్నట్లు తెలస్తోంది. -
దిశ ఘటనపై సుప్రీంకోర్టు వేసిన జ్యుడిషియల్ విచారణ మళ్లీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచారం, హత్య నిందితుల ఎన్కౌంటర్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. దిశ ఘటనపై సుప్రీం కోర్టు వేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో విచారణను జాప్యం చేసిన జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు శనివారం దిశ సంఘటనపై వర్చ్యువల్ మీటింగ్ నిర్వహించారు.మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ సమావేశం సాగింది. సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. దిశ కేసులో తాము భాగస్వామ్యం అవుతామని పిటీషన్ వేసిన న్యాయవాది వసుదా నాగరాజు తెలిపారు.పిటీషన్‌పై పూర్తి అఫిడవిట్ వేయాలని కమిషన్ సూచించింది. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాల తరపు సమావేశంలో న్యాయవాది కృష్ణమాచారి పాల్గొన్నారు. -
మరోసారి తెరపైకి ‘దిశ’ కేసు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య- నిందితుల ఎన్కౌంటర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దిశ నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అని.. అందులో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జ్యూడిషియల్ కమిషన్‌ను కలిసేందుకు వారు హైకోర్టుకు చేరుకున్నారు. పరిహారంపై కమిషన్ ముందు ప్రస్తావించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం కమిషన్ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్యూడిషియల్ కమిషన్‌కు నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్ దాఖలు చేశారు.(దిశ నిందితుల ఎన్కౌంటర్లో నేరం జరిగిందా?) కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో గతేడాది నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఎన్కౌంటర్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో... మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుర్కర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసింది. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ) -
దిశ కేసు : ఎన్కౌంటర్ జరిగి నెలరోజులు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ హత్య కేసుకు సంబంధించి నిందితుల ఎన్కౌంటర్ జరిగి డిసెంబర్7తో నెల రోజులు పూర్తి కావొస్తుంది. ఎన్కౌంటర్లో చనిపోయిన నిందితులకు సంబంధించిన రీ పోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ బృందం షీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి సత్వర విచారణ చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 16న హైదరాబాద్‌కు రానుంది. కాగా షాద్‌నగర్ పోలీసులు వారం రోజుల్లో దిశ కేసులో ఫైనల్ రిపోర్ట్‌ను మహబూబ్‌నగర్ ఫాస్ట్రాక్ కోర్టుకు సమర్పించనుంది. దిశ నిందితులు ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే అనేక సాక్ష్యాలను సేకరించిన సిట్ త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్‌ను కలిసి సేకరించిన సాక్ష్యాలను సమర్పించనుంది. కాగా గతేడాది దిశపై అత్యాచారం, ఆపై హత్య చేసిన సంఘటన దేశ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ కేసులో మహ్మద్ ఆరిఫ్, శివ,నవీన్, చెన్నకేశవులు ప్రధాన నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఘటన జరిగిన చటాన్‌పల్లి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నం చేశారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే హతమయ్యారు. -
ట్రిబ్యునల్స్‌పై నిబంధనల కొట్టివేత
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్‌పై కేంద్రం రూపొందిం చిన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేంద్రానికి ఎదురుదెబ్బలాంటి ఈ తీర్పు వివరాల్లోకి వెళితే... జుడీషియల్ ట్రిబ్యునల్స్ కూర్పు, విధివిధానాలపై ‘ఫైనాన్స్ యాక్ట్ 2017’ మనీ బిల్లు కింద కేంద్రం కొన్ని కీలక నిబంధనలను తెచ్చింది. వివిధ ట్రిబ్యునళ్ల సభ్యుల నియామకాలు, సర్వీస్ నిబంధనలకు సంబంధించిన ఈ నిబంధనావళి పట్ల ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నియమాలను తోసిపుచ్చుతూ, వీటి అమలు ప్రభావాలను అధ్యయనం చేసి, అత్యున్నత న్యాయస్థానానికి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మనీ బిల్లుగా ఫైనాన్స్ యాక్ట్ 2017 ఆమోదించడంలో చట్టబద్దతను పరిశీలించడానికి ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సైతం ఐదుగురు సభ్యుల ధర్మాసనం నివేదించింది. 2017 ఫైనాన్స్ చట్టం 184వ సెక్షన్ కింద ఈ నిబంధనలను కేంద్రం రూపొందించిన అంశాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ, అయితే ఈ నియామకపు ప్రక్రియ ప్రస్తుతం అమల్లో ఉన్న విధి విధానాలకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంది. -
ప్రక్షాళన దిశగా..
-
అవినీతి రహిత పాలన దిశగా..
సాక్షి, అమరావతి: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. అవినీతితో కునారిల్లిపోయిన టెండరింగ్ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవినీతి జరిగిందని న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్న స్థితిని మార్చి, అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా న్యాయ వ్యవస్థ చేతికే టెండరింగ్ విధాన నిర్ణయాన్ని అప్పగించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గొప్ప పారదర్శక విధానానికి శ్రీకారం చుడుతూ అడుగు వేశారు. సీఎం పదవి స్వీకరిస్తూ, మే 30న తాను ప్రకటించిన విధంగా టెండర్ విధానంలో సంస్కరణలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌ను వైఎస్ జగన్ కలిశారు. సాయంత్రం 6 గంటలకు ఏసీజే ఇంటికి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు అక్కడ గడిపారు. సీఎం వెంట ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, అడ్వొకేట్ జనరల్‌గా నియమితులైన సుబ్రహ్మణ్యం శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులు కానున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఏసీజేను జగన్మోహన్రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం టెండర్లలో అవినీతికి ఆస్కారమే లేని పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఏసీజేకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం ప్రత్యేకించి ఒక హైకోర్టు జడ్జిని కేటాయించాలని కోరారు. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలోని కమిషన్‌కు, సిబ్బందికి అయ్యే వ్యయం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కమిషన్ సూచన మేరకు టెండర్ల ప్రక్రియలో మార్పులు వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచే టెండర్లను ముందుగానే హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిషన్‌కు పంపుతామని, టెండర్‌కు సంబంధించిన అంశాలపై జుడిషియల్ కమిషన్ సంబంధిత ప్రభుత్వ అధికారులతో చర్చించి మార్పు, చేర్పుల్ని సూచిస్తే ఆ ప్రకారంగానే టెండర్లు పిలుస్తామని ముఖ్యమంత్రి జగన్.. ఏసీజేకు విన్నవించారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టైలర్ మేడ్‌గా, అంటే.. కమీషన్ల కోసం తాను ముందుగానే నిర్ణయించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న అనుభవం, అర్హతల ప్రకారం టెండర్ నిబంధనలు తయారు చేసి, వారికే టెండర్ దక్కేలా చేసిన విధానం వల్ల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్న సమయంలోనే ప్రజలకు వివరించిన విషయం తెలిసిందే. ప్రతి టెండర్లోనూ 20 నుంచి 25 శాతం మేర అవినీతి జరిగిందని, ఆమేరకు ప్రజాధనాన్ని మిగిల్చే విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు. తద్వారా ఇరిగేషన్ కాంట్రాక్టులంటేనే అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారిన పరిస్థితి నుంచి పూర్తి పాదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ముందడుగు వేశారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా సంస్కరణలు తీసుకురానున్నారు. -
అవినీతి రహిత పాలన కోసం వైఎస్ జగన్ మరో అడుగు
-
ఏసీజేతో సీఎం వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరాతి : ప్రజలకిచ్చిన ఒక్కో మాటను నిలబెట్టుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన కోసం నేడు మరో కీలకమైన అడుగు వేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌ను సీఎం వైఎస్ జగన్ కలిశారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. సీఎం వైఎస్ జగన్ వెంట ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం చేసిన అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి అవినీతి రహిత పాలన అందించే దిశగా కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తానని ప్రకటించారు. దాని కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేను కలిసి కోరతానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సీఎం జగన్ ఏసీజేను కలిశారు. కమిషన్ ఏర్పాటు కోసం ఓ సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరారు. న్యాయమూర్తిని కేటాయిస్తే ఇకపై జరగబోయే టెండర్ల ప్రక్రియ మొత్తం ఈ న్యాయమూర్తి ఇచ్చే సూచనలు, సలహాలు, మార్గదర్శకాల ఆధారంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ జ్యుడీషియల్ కమిషన్‌తో ప్రజా ప్రయోజనాలు రక్షించవచ్చని నూత సీఎం ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. -
ఖరీదైపోయిన ‘న్యాయం’..
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థ పేదలకు అందనంత ఖరీదైన వస్తువుగా మారిందని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) బీఎస్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను కూడా పెద్ద లాయర్లను నియమించుకునే స్థితిలో లేనన్నారు. ఖైదీల హక్కులపై తీహార్ జైలు శనివారం ఇక్కడ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. బెయిల్ షరతులు సంక్లిష్టం కావడంతో పేదలు జైలులోనే ఉండిపోయి శిక్షాకాలాన్ని పూర్తిచేస్తుండగా, ధనికులు ముందస్తు బెయిల్ పొందుతున్నారన్నారు. ‘మన న్యాయ వ్యవస్థ, బెయిల్ షరతులు ఎందుకింత క్లిష్టమయ్యాయన్నదే అతి పెద్ద ప్రశ్న. పేదలకు కోర్టులను ఆశ్రయించే స్తోమత లేదు’ అని అన్నారు. న్యాయ వ్యవస్థను పేదలు, ధనికులకు చేరువ చేయడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్న పెద్ద లాయర్లను తప్పుపట్టారు. -
రోహిత్ మృతి పై జ్యుడీషియల్ విచారణ
-
రతన్‌గడ్ ఘటనలో కలెక్టర్, ఎస్పీ సహా 19 మంది సస్పెన్షన్
రతన్‌గడ్ దేవాలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగి 117 మంది మరణించిన ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కఠిన చర్యలు చేపట్టింది. అ ఘటనకు బాధ్యులు భావిస్తూ దతియా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లతోపాటు మరో 19 మంది ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వచ్చే నెల 25 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతితో వారందరిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సస్పెన్షన్ చేశారు. అలాగే ఆ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేపట్టిన విచారణ మంగళవారం నుండి ప్రారంభం అవుతుందని సోమవారం సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక అందజేస్తారని తెలిపారు. తొక్కిసలాటకు ముందు భక్తులతో, ఘటన అనంతరం మృతదేహలతో పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అన్ని అంశాలపై జడ్జి విచారణ జరిపి నివేదిక అందజేస్తారని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌గడ్ దేవాలయం సమీపంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 117 మంది మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.