సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ హత్య కేసుకు సంబంధించి నిందితుల ఎన్‌కౌంటర్ జరిగి డిసెంబర్7తో నెల రోజులు పూర్తి కావొస్తుంది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితులకు సంబంధించిన రీ పోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ బృందం షీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి సత్వర విచారణ చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 16న హైదరాబాద్‌కు రానుంది. కాగా షాద్‌నగర్ పోలీసులు వారం రోజుల్లో దిశ కేసులో ఫైనల్ రిపోర్ట్‌ను మహబూబ్‌నగర్ ఫాస్ట్రాక్ కోర్టుకు సమర్పించనుంది. దిశ నిందితులు ఎన్‌కౌంటర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే అనేక సాక్ష్యాలను సేకరించిన సిట్ త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్‌ను కలిసి సేకరించిన సాక్ష్యాలను సమర్పించనుంది.
కాగా గతేడాది దిశపై అత్యాచారం, ఆపై హత్య చేసిన సంఘటన దేశ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ కేసులో మహ్మద్ ఆరిఫ్, శివ,నవీన్, చెన్నకేశవులు ప్రధాన నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఘటన జరిగిన చటాన్‌పల్లి వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నం చేశారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే హతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment