Re-post mortem
-
దిశ కేసు : ఎన్కౌంటర్ జరిగి నెలరోజులు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ హత్య కేసుకు సంబంధించి నిందితుల ఎన్కౌంటర్ జరిగి డిసెంబర్7తో నెల రోజులు పూర్తి కావొస్తుంది. ఎన్కౌంటర్లో చనిపోయిన నిందితులకు సంబంధించిన రీ పోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ బృందం షీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి సత్వర విచారణ చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 16న హైదరాబాద్‌కు రానుంది. కాగా షాద్‌నగర్ పోలీసులు వారం రోజుల్లో దిశ కేసులో ఫైనల్ రిపోర్ట్‌ను మహబూబ్‌నగర్ ఫాస్ట్రాక్ కోర్టుకు సమర్పించనుంది. దిశ నిందితులు ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే అనేక సాక్ష్యాలను సేకరించిన సిట్ త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్‌ను కలిసి సేకరించిన సాక్ష్యాలను సమర్పించనుంది. కాగా గతేడాది దిశపై అత్యాచారం, ఆపై హత్య చేసిన సంఘటన దేశ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ కేసులో మహ్మద్ ఆరిఫ్, శివ,నవీన్, చెన్నకేశవులు ప్రధాన నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఘటన జరిగిన చటాన్‌పల్లి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నం చేశారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే హతమయ్యారు. -
హైకోర్టుకు ‘మిస్టరీ’ రిపోర్ట్..!
-
హైకోర్టుకు ‘మిస్టరీ’ రిపోర్ట్..!
- సీల్డ్ కవర్లో హైకోర్టుకు మధుకర్ రీ పోస్టుమార్టం నివేదిక - పోలీసుల దర్యాప్తు నివేదిక కూడా సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహం రీ పోస్టుమార్టం నివేదిక సీల్డ్కవర్లో హైకోర్టుకు చేరింది. ఫోరెన్సిక్ రిపోర్ట్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ నివేదిక కూడా హైకోర్టుకు చేరింది. మార్చి 14న అనుమానాస్పదరీతిలో ఖానాపూర్ శివారులో మృతిచెందిన మధుకర్ మృతిపై సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారమైంది. మధుకర్ మృతిపై రీ పోస్టుమార్టం జరపాలని అతడి తల్లి లక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు గత నెల 10న ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు న్యాయమూర్తి, పోలీసు విచారణాధికారి, మంథని తహసీల్దార్, మధుకర్ తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో రీపోస్టుమార్టం జరిపారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలను వైద్య నిపుణులు న్యాయమూర్తికి అందజేశారు. 2.05 గంటల నిడివి గల పోస్టుమార్టం వీడియోను 6 సీడీలలో నిక్షిప్తం చేసిన పోలీసులు న్యాయమూర్తికి అందజేశారు. అక్కడి నుంచి సీల్డ్కవర్లో నివేదికలన్నీ 2 రోజుల క్రితం హైకోర్టుకు చేరాయి. పూర్తయిన పోలీసుల విచారణ మధుకర్ మృతిపై విచారణాధికారిగా నియమితులైన పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ తన దర్యాప్తును పూర్తిచేసినట్టు సమాచారం. మధుకర్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారం తర్వాత వారిని వదిలేశారు. మధుకర్ ప్రేమించిన యువతి తండ్రిని, యువతిని, కుటుంబసభ్యులను విచారించారు. గోదావరిఖని న్యాయమూర్తి సమక్షంలో ఏసీపీ సింధూశర్మ ఆ యువతి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ కేసులో దాదాపు 70మందిని ఆమె విచారించారు. దర్యాప్తు చేస్తున్నంత సేపు వీడియో రికార్డింగ్ చేయించినట్టు సమాచారం. పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికనూ కోర్టుకే అందజేసినట్టు తెలిసింది. జూన్‌లో వీడనున్న మిస్టరీ వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో మధుకర్ కేసును హైకోర్టు విచారించనుంది. మధుకర్ మృతదేహం రీపోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలను, పోలీసుల దర్యాప్తు నివేదికలను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించి, మధుకర్ మృతి మిస్టరీని వెల్లడించనున్నారు. -
మధుకర్ మృతదేహానికి నేడు రీపోస్టుమార్టం
సాక్షి,పెద్దపల్లి: మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహానికి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనేక మలుపుల తర్వాత జరగనున్న ఈ రీపోస్టుమార్టంపై అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు మర్మంగాలు కోసేశారా?, కళ్లు పీకేశారా?, పోలీసులు చెప్పినట్టు అవేమీ తొలగించబడలేదా? అవి మార్ఫింగ్ ఫొటోలేనా? అనే ఉత్కఠకు తెరపడనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుశాఖ కరీంనగర్ జిల్లా జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరగనుంది. ఈమేరకు ఖానాపూర్‌లో ఏర్పాట్లు చేశారు. రీపోస్టుమార్టం నివేదికను కరీంనగర్ జిల్లా జడ్జి సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపనున్నారు. -
రీ పోస్టుమార్టం చేయండి
-
‘హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటాం’
సాక్షి, పెద్దపల్లి/మంథని: అనుమానాస్పదరీతిలో మృతిచెందిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ రీ–పోస్టుమార్టమ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. పెద్దపల్లిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సిట్టింగ్ జడ్జి, ఫోరె న్సిక్ నిపుణుల సమక్షంలో రీ–పోస్టుమార్టమ్ జరపాలని మధుకర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారని, వారికి ఎక్కడా అడ్డు చెప్పలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉస్మానియా మెడికల్ కళాశాలకు లేఖ రాసి రీ–పోస్టుమార్టమ్‌కు ప్రాసెస్‌ను మళ్లీ మొదలు పెడతామని చెప్పారు. మధుకర్ మృతి కేసును నిష్పాక్షికంగా ఐపీఎస్ అధికారి సింధూశర్మ దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. పోలీసులపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు విశ్వాసం ఉంచి సహకరిం చాలని కోరారు. మధుకర్ కేసులో పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ గ్రామస్తులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అభిప్రా యాలను వీడియో కవరేజ్ మధ్య వివరాలు రాబట్టారు. సుమారు రెండు గంటల పాటు గ్రామంలోనే విచారణ కొనసాగింది. -
రీ పోస్టుమార్టం చేయండి
♦ మధుకర్ కేసులో పోలీసులకు ఉమ్మడి హైకోర్టు ఆదేశం ♦ మధుకర్‌ది హత్యేనంటూ హైకోర్టులో అతడి తల్లి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన మధుకర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేప థ్యంలో అతడి మృతదేహానికి మరోసారి శవ పరీక్ష (రీపోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది. కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమ క్షంలో ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలంది. రీ పోస్టుమార్టం వేళ మధుకర్ కుటుంబ సభ్యులను అనుమతించడంతోపాటు మొత్తం ప్రక్రియను వీడియో తీయా లని పోలీసులకు స్పష్టం చేసింది. అనంతరం దీనిపై ఓ నివే దికను సీల్డ్ కవర్లో తమ ముం దుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను వచ్చే వారానికి వాయిదా వేసింది. గురు వారం ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలిం గేశ్వరరావు ఉత్తర్వు లు జారీ చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ తన కుమారుడి మృతి కేసును హత్య కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మధుకర్ తల్లి లక్ష్మి హైకోర్టులో గురువారం లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించారు. మార్చి 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ 14వ తేదీన శవమై కనిపించాడని, దీన్ని పోలీసులు అనుమానస్పద మృతిగా పరిగణించారని, ఇది సరికాదని ముమ్మాటీకి హత్యేనని వివ రించారు. అగ్ర కులానికి చెందిన అమ్మా యిని ప్రేమించినందుకు సదరు యువతి బంధువులు మధుకర్‌ను హత్య చేశారని తెలి పారు. మధుకర్ మృతికి కారణమైన వారిపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేసినా పోలీ సులు కనీసం ప్రశ్నించలేదని, ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తుపై తమకు అనుమానాలు న్నాయన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావా లంటే మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణుల చేత రీపోస్టుమార్టం చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ నిపుణులున్నారని వివరించారు. రీ పోస్టుమార్టంపై ఇప్పటికే నిర్ణయం.. ప్రభుత్వ న్యాయవాది (హోం) హెచ్.వేణు గోపాల్ స్పందిస్తూ, రీ పోస్టుమార్టంపై ఇప్ప టికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాకతీయ వైద్య కళాశాల వైద్యులు రీ పోస్టు మార్టం చేయనున్నారని కోర్టుకు నివేదిం చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉస్మా నియా, కాకతీయ వైద్య కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిం చాలని పోలీసులను ఆదేశించారు. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని, మధుకర్ కుటుంబ సభ్యులను అనుమతించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.