ప్రజలకిచ్చిన ఒక్కో మాటను నిలబెట్టుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన కోసం నేడు మరో కీలకమైన అడుగు వేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌ను సీఎం వైఎస్ జగన్ కలిశారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. సీఎం వైఎస్ జగన్ వెంట న్యాయనిపుణులు, ఇతర నేతలు ఉన్నారు.