
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. దిశ సామూహిక హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్‌కర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు వేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో కమిషన్ విచారణలో జాప్యం చోటుచేసుకుంది. కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో జ్యుడీషియల్ కమిషన్ మళ్లీ విచారణ ప్రారంభించింది.
నేడు(బుధవారం) ఎన్‌కౌంటర్ గురైన కుటుంబాల కమిషన్ సభ్యులు కలవనున్నారు. దిశ కమిషన్ సభ్యులు గుడిగండ్ల, జట్లేరు గ్రామానికి బయలుదేరారు. ఎన్‌కౌంటర్ గురైన కుటుంబాలకు కమిషన్ నోటీసులు ఇవ్వనుంది. ఎన్‌కౌంటర్ గురైన కుటుంబాల నుండి పలు కీలకమైన వివరాలు సేకరించనున్నట్లు తెలస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment