గతేడాది రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శనివారం రిలీజ్ అయిన ‘దిశ ఎన్‌కౌంటర్’ ట్రైలర్ నాటి ఘటనను కళ్లకు కడుతుంది. దర్శకుడు రాం గోపాల్ వర్మ తన ట్విటర్ ద్వారా ట్రైలర్‌ని విడుదల చేశారు. సుమారు 02:44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ నవంబర్ 26 ఉదయం 6:10 గంటలకు ప్రారంభం అవుతుంది. రోడ్డు పక్కన స్కూటీని పార్క్ చేసిన దిశపై అక్కడే ఉన్న నలుగురు లారీ డ్రైవర్ల కన్ను పడుతుంది. ఆ నిమిషమే వారి బుర్రలో విష బీజం నాటుకుంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో స్కూటీని పంచర్ చేస్తారు. సాయం కోసం రోడ్డు మీద నిల్చున్న దిశను కిడ్నాప్ చేసి లారీలో తీసుకెళ్తారు. ఆమెను దారుణంగా రేప్ చేసి.. అనంతరం మృతదేహాన్ని తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెడతారు. ఇది జరుగుతున్న సమయంలో ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనం అక్కడి నుంచి వెళ్లడంతో ముగుస్తుంది. (చదవండి: మొదలైన వర్మ బయోపిక్ షూటింగ్)
Here is the trailer of DISHA ENCOUNTER based on the 2019 horrific gang rape, killing and burning of a young woman in Hyderabad #DishaEncounter @anuragkancharla @karuna_Natti https://t.co/eEdoCf1Yhl
— Ram Gopal Varma (@RGVzoomin) September 26, 2020
ఈ రోజు ఉదయం 9:08 గంటలకు విడుదలైన ఈ ట్రైలర్‌ని ఇప్పటికే 20 వేల మందికి పైగా చూశారు. నవంబర్ 26న చిత్రం విడుదల కానుంది. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల ప్రవీణ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. అనురాగ్ కాసర్ల నిర్మతగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment