త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్‌.. బుల్లితెర జంట కుప్పిగంతులు, ట్రోలింగ్‌ | Sakshi
Sakshi News home page

Disha Parmar: బుల్లితెర జంట మెటర్నటీ వీడియోపై నెట్టింట ట్రోలింగ్‌

Published Sat, May 27 2023 7:00 PM

Trolling On Disha Parmar, Rahul Vaidya Maternity Photoshoot BTS Video - Sakshi

బిగ్‌బాస్‌ జోడీ సింగర్‌ రాహుల్‌.. నటి దిశా పార్మర్‌ త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే మెటర్నటీ ఫోటోషూట్‌ కూడా చేసి ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అయితే మెటర్నటీ షూట్‌ సందర్భంలో చేసిన చిలిపి పనులను, కుప్పి గంతులను తాజాగా వీడియో రూపంలో రిలీజ్‌ చేశారు. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న రాహుల్‌- దిశా సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు.

దిశా బేబీ బంప్‌ను ఆప్యాయంగా తడుముతూ ముద్దు పెట్టాడు రాహుల్‌. అభిమానులు వీరి ఆనందాన్ని చూసి మురిసిపోతుంటే మరికొందరు మాత్రం ఇంత ఓవరాక్షన్‌ అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని కూడా అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేస్తున్నారు, ప్రపంచంలో పిల్లలను కంటున్న మొదటి జంట మీదే అన్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నారే అని ట్రోల్‌ చేస్తున్నారు.

అలా మొదలైంది..
సింగర్‌ రాహుల్‌ హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో పాల్గొన్నాడు. వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌లో దిశా బిగ్‌బాస్‌ ఇంట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె బర్త్‌డే రోజు తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాడు రాహుల్‌. మోకాళ్ల మీద కూర్చుని పెళ్లి చేసుకోమని అడిగాడు. అందుకు ఆమె పచ్చజెండా ఊపడంతో 2021 జూలై 16న పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2023 మే 18న అమ్మానాన్న కాబోతున్నామంటూ రాహుల్‌, దిశ గుడ్‌న్యూస్‌ చెప్పారు.

చదవండి: మళ్లీ పెళ్లి ఏ ఓటీటీలోకి రానుందంటే?

Advertisement
 
Advertisement
 
Advertisement