సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం దిశ మళ్లీ హైకోర్టుకు చేరింది. చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో రిట్ అప్పీల్ పిటీషన్ దాఖలు చేశారు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్‌కౌంటర్ చిత్రాన్ని వెంటనే ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు.
కాగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారని.. వాటిని తొలగించాలంటూ దిశ తండ్రి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌లో అసభ్యంగా మెసేజ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ నెల 26న సినిమా విడుదల కాకుండా ఆపాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే ఎన్‌కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు జ్యుడీషియల్ కమిషన్‌ను కలిశారు. (ఆర్‌జీవీ దిశకు వరుస ఎదురుదెబ్బలు)
Comments
Please login to add a commentAdd a comment