
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై నిందితుల కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొ న్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభు త్వం, పోలీసులను ఆదేశించాలని కోరారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, షాద్‌నగర్ ఏసీపీ వి.సురేందర్, షాద్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీధర్‌కుమార్‌లను ప్రతివాదులుగా చేర్చా రు.