
సాక్షి, విజయనగరం: పూసపాటిరేగ మండలం తుమ్మయ్యపాలెం గ్రామంలో సర్వే పేరిట కొందరు అనధికార వ్యక్తులు హల్‌చల్ చేశారు. పీఎంజీవై దిశా పేరిట నకిలీ వెబ్‌సైట్ సృష్టించడంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామస్తుల ఆధార్ కార్డు వివరాలను ఆ సిబ్బంది అనధికారికంగా సేకరిస్తున్నారు. దిశా వెబ్‌సైట్ పేరిట మహిళల వేలిముద్రలు సేకరిస్తున్నారు. వారి ప్రవర్తన, చెప్పిన వాటికి ఏ మాత్రం పొంతన లేకపోవడంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో ఆ సర్వేను పోలీసులు నిలిపివేయించారు.
Comments
Please login to add a commentAdd a comment