మాకూ సైబర్‌ ముప్పుంది | 96 percent of senior Indian executives expect higher financial crime risk in 2025: Kroll survey | Sakshi
Sakshi News home page

మాకూ సైబర్‌ ముప్పుంది

Published Mon, Mar 24 2025 2:07 AM | Last Updated on Mon, Mar 24 2025 2:07 AM

96 percent of senior Indian executives expect higher financial crime risk in 2025: Kroll survey

భారతీయ ఎగ్జిక్యూటివ్‌లలో 96 శాతం మంది భయం 

ఏఐ వాడకమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయం 

క్రోల్‌ సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ ముప్పునకు గురవుతున్న వారిలో అన్ని రంగాల్లోని ప్రముఖులు సైతం ఉంటున్నారు. సాధారణ వ్యక్తులను టార్గెట్‌ చేయడం కంటే పెద్ద కంపెనీల్లోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కొట్టేయొచ్చన్న ధోరణిలో ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఉంటున్నారు. దీంతో తమకూ ఆర్థిక నేరాల ముప్పు (ఫైనాన్షియల్‌ క్రైం రిస్క్‌) తప్పదన్న ఆందోళనలో భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఉంటున్నారు.

క్రోల్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 96 శాతం మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ఈ ఏడాది ఫైనాన్షియల్‌ క్రైం రిస్క్‌ తప్పదన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత దాడులకు తాము లక్ష్యంగా ఉన్నామని భారత్‌లోని 76 శాతం మంది, ప్రపంచవ్యాప్తంగా 68 శాతం మంది పేర్కొన్నారు.

భారతీయ ఎగ్జిక్యూటివ్‌లలో 36 శాతం మంది తమ కంపెనీలు సైబర్‌ దాడులను ఎదుర్కొనే పటిష్ట వ్యవస్థలు కలిగి ఉన్నట్టు తెలిపారు. కంపెనీల వద్ద సరైన సాంకేతికత లేకపోవడం సైబర్‌ దాడుల ముప్పు పెరిగేందుకు కారణమని 36 శాతం మంది వెల్లడించారు. అయితే, ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌తో సానుకూల ప్రభావం ఉంటుందని 32 శాతం మంది.. వీటితో ముప్పు పెరిగిందని 52 శాతం మంది చెప్పారు. కంపెనీలు సైబర్‌ భద్రత ముప్పును తప్పించుకునే పటిష్ట వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్న 59 శాతం మంది అభిప్రాయపడ్డారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement