executives
-
పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, హోల్‌టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలురిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్‌ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలునిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు. -
మెటా తొలగింపులు: ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!
సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా భారతీయ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా ఇండియాలో నలుగురు కీలక ఉద్యోగులను తొలగించింది. కాస్ట్ కటింగ్, వ్యాపారాన్ని క్రమబద్ధీకరణ,, ఆదాయ వృద్ధిని స్థిరంగా ఉంచే చర్యల్లో భాగంగా మెటా పలు రౌండ్లలో లేఆఫ్స్ ప్రకటించింది. అయితే తాజా తొలగింపులు చివరిదిగా భావిస్తున్నారు. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) ఇక ఇండియాలో మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం భారత మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్టనర్షిప్ డైరెక్టర్ సౌరభ్,మెటా ఇండియా లీగల్ డైరెక్టర్ అమృతా ముఖర్జీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిజైన్ చేయాల్సిందిగా ఈమెయిల్ ద్వారా వీరిని కోరినట్టు సమాచారం. దీంతోపాటు మలిదశ తొలగింపుల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మరికొంతమందిని తొలగిస్తోంది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్లు వంటి టీమ్‌లలో పనిచేస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులు తమను తొలగించినట్లు లింక్డ్ఇన్లో ప్రకటించారు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్ ) కాగా మైక్రోసాఫ్ట్, గూగుల్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ పేరెంట్ మెటాతో సహా టెక్ దిగ్గజాలు గత ఏడాది చివరి నుంచి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించు కునేందుకు ఉద్యోగుల తొలగింపులను చేపట్టినట్టు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మార్చిలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ప్రారంభంలో 11వేల మందికి, ఏప్రిల్‌లో మరో పదివేల మందికి ఉద్వాసన పలికింది.రెండవ రౌండ్ మాస్ లేఆఫ్‌లను ప్రకటించిన తొలి టెక్ దిగ్గజం మెటా. (Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్) భారీ చెల్లింపులు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న మెటా సంబంధిత ఉద్యోగులకు భారీ చెల్లింపులే చేస్తోంది. తాజా రిపోర్టు ప్రకారం మొత్తం21 వేలమందికి ప్రీ-టాక్స్ సెవెరెన్స్, సంబంధిత ఖర్చులు నిమిత్తం సుమారు 1 బిలియన డాలర్లు అంటే సుమారు రూ. 8,000 కోట్ల కంటే ఎక్కువే చెల్లిస్తోంది. -
మరోసారి సెన్సేషన్‌గా ఈలాన్ మస్క్: అంత పిచ్చా?
న్యూఢిల్లీ: టెస్లా సీఈఓ ఈలాన్ మస్క్‌కు సంబంధించి ఒక న్యూస్ సెన్సేషనల్‌గా మారింది. తన సంస్థలో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటవ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చాడట. 2021 నవంబరులో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ న్యూరాలింక్ టాప్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో కలిసి కవల పిల్లలకు జన్మనిచ్చారనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు కోర్టు పత్రాలను ధృవీకరిస్తూ పలు నివేదికలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో మస్క్ సంతానం తొమ్మది మందికి చేరింది. ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం మస్క్, జిలిస్ జంట తమ కవల పిల్లల ఇంటి పేర్లను మార్చాల్సిందిగా టెక్సాస్‌లో కోర్టులో ఏప్రిల్ 2022లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ఎక్కుమంది పిల్లల్ని కనాలని ఇటీవల వ్యాఖ్యానించిన మస్క్‌కు పిల్లలంటే అంత పిచ్చా అని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. మస్క్‌కు చెందిన స్టార్టప్ న్యూరాలింక్‌లో 2017లో జిలిస్ చేరారు. దీనికితోడు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ డీల్ విజయవంతమైన తరువాత ట్విటర్ బాధ్యతలను ఆమెకు అప్పగించాలని మస్క్ ఆలోచిస్తున్నాడట. మొదటి భార్య జస్టిన్, మస్క్ జంటకు ఆరుగురు పిల్లలు. అయితే ఈ ఆరుగురిలో, 10 నెలల కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. మస్క్‌కు కెనెడియన్ సింగర్ గ్రిమ్స్ (క్లైర్ బౌచర్)తో కలిసి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో రెండో బిడ్డను సరోగసీ ద్వారా పొందారు. కాగా గతంలో మస్క్ ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలన్న కోరిక వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది పిల్లలు లేకపోతే, నాగరికత కూలిపోతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫాదర్స్ డే సందర్భంగా, మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె (అలెగ్జాండర్ జేవియర్ మస్క్) తన పేరును మార్చుకునేందుకు పిటిషన్ దాఖలు చేసింది. 2008లో మస్క్‌కి విడాకులు ఇచ్చిన విల్సన్‌ను తల్లిగా పేర్కొంది. -
తగ్గదేలే: పురుషులకు సమానంగా,రూ.100లో రూ.85 మహిళలే సంపాదిస్తున్నారు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అధ్యయనం ప్రకారం మనదేశంలోని మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి...అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు..ఇంటా మేమే,బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మనదేశంలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ►ఇక్రా చైర్పర్సన్ అరుణ్ దుగ్గల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) హెచ్ ఆర్ అసోసియేట్ప్రొఫెసర్ ప్రొమిలా అగర్వాల్ 'ది గ్లాస్ సీలింగ్- లీడర్షిప్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ ఎన్ఎస్ఈ 200 కంపెనీస్ పేరిట సర్వే నిర్వహించారు. ►గతేడాది నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో నమోదు చేసుకున్న 200 కంపెనీల్లోని 109కంపెనీలకు చెందిన సుమారు 4వేల కంటే ఎక్కువ మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయం ఆధారంగా నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో దేశంలోని కంపెనీల టాప్, సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం డైరెక్టర్ల బోర్డులలో ఉండాల్సిన మహిళల శాతం కంటే గణనీయంగా తక్కువగా ఉందని తేలింది. ►సంస్థల సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7 శాతం మాత్రమేనని, ఇది టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో కేవలం 5 శాతానికి దిగజారింది. అయితే, సర్వే ప్రకారం.. నియంత్రణ అవసరాల కారణంగా ఎన్ఎస్ఈలో నమోదైన 500 కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డైరెక్టర్ల సంఖ్య 2014లో 4.5 శాతం నుండి 2022 నాటికి 16 శాతానికి పెరిగింది. ►200 సంస్థలలో 21 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక మహిళ మాత్రమే ఉండగా, 76 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక్క మహిళ కూడా లేరని కూడా ఇది హైలైట్ చేసింది. ►మహిళా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా ఉన్న పరిశ్రమలు వినియోగదారుల సేవలు, వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు, ఔషధాలు, సమాచార సాంకేతికత విభాగాలు ఉన్నాయని సర్వేలో తేలింది. ►నివేదికలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లకు తీసుకునే జీతాలు రూ.1.91 కోట్లుగా ఉండగా.. అదే స్థాయి హోదాలో ఉన్న వారి పురుష సహచరులు ఆర్జిస్తున్న జీతం రూ. 2.24 కోట్లుగా ఉంది. -
ఐపీఓకు ముందే పేటీఎం కీలక నిర్ణయం: వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది. మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న తరుణంలో పేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించనప్పటికీ, అండర్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలవారీ వేతనంగా 35 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. తద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) మే నాటి డేటా ప్రకారం ప్రస్తుత యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉండగా, 45 శాతం మార్కెట్ వాటాతో ఫోన్ పే మొదటి స్థానంలో, గూగుల్ పే 35 శాతం రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే సహా పలు ఫిన్ టెక్ కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రూ.16,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం అక్టోబర్ నాటికి స్టాక్ మార్కెట్లోకి రానుంది. జూలై 15 న మార్కెట్ రెగ్యులేటర్ సెబీవద్ద ఇప్పటికే ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది పేటీఎం. -
కరోనా : మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు మహీంద్రా షాక్
సాక్షి,ముంబై: దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా వందలమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ మూడు వందలమంది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. ముఖ్యంగా మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ అధ్యక్షుడు గ్రూప్ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు వీఎస్ పార్థసారధి సహా పలువురు సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో ఉన్నారు. మహీంద్రా వ్యాపార ప్రణాళిక విభాగాధిపతి ప్రహ్లాద రావు ,ఇతర సీనియర్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఎంఅండ్ఎం అధికారిక ధృవీకరణ ఏదీ ప్రస్తుతానికి లేదు. వాహనాల విక్రయాల్లో క్షీణత నేపథ్యంలో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమలో మందగమనానికి తోడు కరోనా వైరస్, లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి ఆటో, వ్యవసాయ విభాగానికి మాత్రమే పరిమితమైన ఈ కోతలు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి కూడా పాకనుందనే ఆందోళన నెలకొంది. మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అమ్మకాలలో 27.52 శాతం క్షీణించింది. పరిశ్రమల పరిమాణం 13.2 శాతం తగ్గింది. అయితే ఫిబ్రవరిలో ప్రయాణీకుల వాహన రిటైల్ అమ్మకాలు 10.6శాతం పెరగగా, ద్విచక్ర వాహన విక్రయాలు 16.08 శాతం తగ్గాయి. టాటా యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశంలో మూడింట ఒకవంతు సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే. -
లావెక్కుతున్న కార్పొరేట్ ప్రపంచం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ‘ఫిట్నెస్’ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరో పక్క కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు బొజ్జలు పెంచుతూ లావెక్కుతున్నారు. కనుక వీరికి మధుమేహం, గుండెపోటు లాంటి ప్రాణాంతక జబ్బులు అనివార్యమవుతున్నాయి. దేశంలో మూడింట రెండు వంతుల మంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు ‘బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)’ సగటున 25 ఉందని ‘హెల్దీఫైమీ’ అనే యాప్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. వారందరి మాస్, అంటే ద్రవ్యరాశి 24.9 ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మనిషి ఎత్తు, బరువును బట్టి బీఎంఐని నిర్ధారిస్తారు. ఎత్తును మీటర్లలో, బరువును కిలోల్లో లెక్కించి ద్రవ్యరాశిని లెక్కిస్తారు. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారి బీఎంఐ 25కు పైనే ఉంటుంది. ఎత్తుకు తగ్గ బరువుకన్నా తక్కువ బరువు ఉన్నవారే బీఎంఐకి 25లోపు వస్తారు. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువ వరకు కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం, మానసిక ఒత్తిడికి గురవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆర్థిక సర్వీసుల్లో, ఉత్పత్తిరంగాల్లో పనిచేస్తున్న వారి జీవన శైలి దాదాపు ఇలాగే ఉంటుంది కనుక వారు లావెక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వినిమయ సరుకులు, అతి వేగంగా అమ్ముడుపోయే వినిమయ సరకులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే వారి ఆరోగ్యం ఆర్థిక, ఉత్పత్తి రంగాల్లో పనిచేసే వారికన్నా మెరుగ్గానే ఉంటుంది. ఎందుకంటే భారతీయ ప్రమాణాల ప్రకారం వారు రోజు ఆఫీసు విధుల్లో వెయ్యి మెట్లు ఎక్కడానికయ్యేంత శ్రమను శారీరకంగా అనుభవిస్తారు. అందుకని వారు కాస్త ఫిట్‌గానే ఉంటారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లే కాకుండా గుమాస్తా గిరి చేసే ఉద్యోగులంతా లావెక్కడానికి మరొక ముఖ్య కారణం ఉంది. అదే ‘ఛాయ్... సమోసా’ కల్చర్. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసే వీరి సాయంత్రం వేళల్లో సరదాకు అన్నట్లు సమోసాల్లాంటి ఆయిల్లో మరిగించే పిండి పదార్థాలు తినడం బొజ్జ పెరగడానికి, లావెక్కడానికి ప్రధాన కారణమని ‘హెల్దీఫైమీ’ యాప్ ‘కార్పొరేట్ ఇండియా ఫిట్నెస్ రిపోర్ట్’లో వెల్లడించింది. ప్రొటీన్లు తక్కువ తిని, కొవ్వు పదార్థాలున్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్లనే సహజంగా స్థూలకాయం వస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. (చదవండి: ఈ ‘టీ’ తాగితే బరువు తగ్గొచ్చు!!) -
కాగ్నిజెంట్ ‘కీ’ ఎగ్జిక్యూటివ్‌ల వేతన పెంపు కేవలం...
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కీలక ఎగ్జిక్యూటివ్‌లకు వేతన పెంపును కేవలం సింగిల్-డిజిట్‌లోనే చేపట్టింది. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో డి సౌజాతో పాటు మిగతా ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు - అధ్యక్షుడు రాజీవ్ మెహతా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కరేన్ మెక్లౌగ్లిన్ వేతనాలను 2017లో కేవలం 3 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే పెంచినట్టు వెల్లడైంది. మార్కెట్ ట్రెండ్లను పరిగణలోకి తీసుకున్న కాగ్నిజెంట్ ఈ మేరకు మాత్రమే వేతన పెంపును చేపట్టింది. ప్రత్యక్ష పరిహారాల్లో డి సౌజా పరిహారాలు మొత్తంగా 3 శాతం పెరిగాయి. 2017లో ఈయన పరిహారాలు 12.23 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 3 శాతం మాత్రమే పెరిగాయి. ఇక మెహతా పరంగా చూసుకుంటే, ఆయన 2016 సెప్టెంబర్‌లో అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందినప్పుడు 14 శాతం పెంపు చేపట్టారు. అనంతరం 2017లో మొత్తంగా ప్రత్యక్ష పరిహారాల్లో కేవలం 3 శాతం పెంపును మాత్రమే ఆయన పొందినట్టు తెలిసింది. ఆయన వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 2016 నుంచి 3 శాతం, 4 శాతం చొప్పున పెరిగాయి. మెక్లౌగ్లిన్ కూడా మొత్తంగా 2017లో తన ప్రత్యక్ష పరిహారాల్లో 8 శాతం పెంపును పొందారు. అయితే 2016లో ఆమెకు బేస్ శాలరీ, వార్షిక నగదు ప్రోత్సహాకాల్లో 17 శాతం పెంపు ఉంది. ఆమె పీఎస్‌యూ, ఆర్ఎస్యూ గ్రాంట్లు 5 శాతం, 6 శాతం చొప్పున ఉన్నాయి. 2017, 2016లలో కంపెనీ పనితీరు పరంగా ఎగ్జిక్యూటివ్‌ల పరిహారాల పెంపును చేపట్టామని కంపెనీ చెప్పింది. పరిశ్రమ అంచనాలు, కంపెనీ లక్ష్యాలు, ఎగ్జిక్యూటివ్‌ల పనితీరు, బాధ్యత, ఎగ్జిక్యూటివ్ టాలెంట్ మార్కెట్ వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు పేర్కొంది. -
200-250 ఎగ్జిక్యూటివ్‌లపై వేటు
న్యూఢిల్లీ : గ్లోబల్ బెవరేజ్ దిగ్గజం కోకా-కోలా చరిత్రలోనే అతిపెద్ద మేనేజ్మెంట్ పునరుద్దరణ జరుగబోతుంది. భారత్‌లో 200 నుంచి 250 మంది సీనియర్, మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌లపై ఈ కంపెనీ వేటు వేయాలని చూస్తోంది. హిందూస్తాన్ కోకా-కోలా బెవరేజస్‌కు చెందిన పలువురు టాప్-ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయాన్ని ధృవీకరించారు. వీరిలో కొందరు తక్కువ సీనియర్ బాధ్యతలకు, మరికొందరు వేరే ప్రదేశాలకు మారతామని అడిగినట్టు హెచ్‌సీసీబీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. హెచ్‌సీసీబీ ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్న ఐదు జోన్ల మాదిరిగా కాకుండా ఏడు జోన్లను ఆపరేట్ చేయాలనుకుంటోంది. జోన్స్, ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి వీలుగా కంపెనీ తన కార్పొరేట్ సెంటర్ రిసోర్సస్‌ను పునర్వ్యస్థీకరిస్తోంది. ఈ క్రమంలోనే వందల కొద్దీ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించబోతుంది. ప్రస్తుతం రెడడెంట్‌గా ఉన్న ఉద్యోగాలను తొలగించడానికి ఈ పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. ఈ ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా హెచ్ఆర్, స్పెషల్ ప్రాజెక్టులు, రూట్-టూ-మార్కెట్, ప్రత్యామ్నాయ బెవరేజ్ వంటి కీలక పోస్టులపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఐటీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల ఎగ్జిక్యూటివ్‌లపై కూడా ప్రభావం చూపనుంది. గత రెండేళ్లుగా జోర్హట్(అస్సాం), బైరనిహాట్ (మేఘాలయ), కలేదారా (జైపూర్), విశాఖపట్నం(ఏపీ), మౌలా అలీ(తెలంగాణ), హాస్పెట్(కర్నాటక) ప్లాంట్లను హెచ్‌సీసీబీ మూసివేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెచ్‌సీసీబీ 21 ఫ్యాక్టరీలను కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2017 మార్చి ముగింపు వరకు కంపెనీ రూ.9,472 కోట్ల రెవెన్యూలను కలిగి ఉంది. -
ఇన్ఫోసిస్ పై మండిపడుతున్న ఉద్యోగులు
బెంగళూరు : దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ అవలంభిస్తున్న విధానాలపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లకు భారీగా పరిహారాలు పెంచుతూ ఉద్యోగులపై వేటు వేస్తుందని ఐటీ ఉద్యోగ గ్రూప్ లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఉద్యోగాల కోతతో తీవ్ర సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ పరిహారాల పెంపు మరింత ఆందోళనకరంగా మారిందని పేర్కొంటున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన 2017 వార్షిక రిపోర్టులో గత ఆర్థిక సంవత్సరం నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 50 శాతానికి పైగా పరిహారాలు పెంచినట్టు తెలిసింది. ప్రతేడాది ఐటీ కంపెనీలు నిపుణులపై వేటు వేస్తూ.. అదేసమయంలో టాప్ ఎగ్జిక్యూటివ్ లకు వేరియబుల్ పే, స్టాక్ ప్రత్సహకాలు పేరుతో భారీగా వేతనాలను పెంచుతున్నాయని ఎఫ్ఐటీఈ జనరల్ మేనేజర్ ఏజే వినోద్ మండిపడ్డారు. వారు అచ్చం రాజకీయ నాయకుల ప్రవర్తిస్తున్నారని, ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టి, వారు వేతనాలను మాత్రం పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఇది చాలా బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నై, పుణే, బెంగళూరులతో పాటు తొమ్మిది ఐటీ హబ్స్ లో ఐటీ ఉద్యోగుల కోసం ఎఫ్ఐటీఈ ఫోరమ్ గా ఏర్పడింది. ఇన్ఫోసిస్ వార్షిక రిపోర్టు ప్రకారం అధ్యక్షులు రాజేష్ మూర్తి, సందీప్ డాడ్లాని, మోహిత్ జోషి, డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవి కుమార్ లు మొత్తం పరిహారాల కింద 14 కోట్లకు పైగా అందుకున్నారు. పనితీరు ఆధారంగా స్టాక్ ప్రోత్సహాకాల కింద ఈ పెంపును చేపట్టినట్టు కంపెనీ పేర్కొంది. టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 10 లేదా 20 శాతం పరిహారాలు పెంచితే, కంపెనీ అకౌంట్ లో నుంచి భారీ ఎత్తున్న నగదు తరలివెళ్తుందని, ఈ ప్రభావంతో వెంటనే ప్రొఫిషనల్స్ పై కంపెనీ వేటువేస్తుందని ఎఫ్ఐటీఈ చెప్పింది. -
కర్నూలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
-నేడు, రేపు నిర్వహణ - ఏర్పాట్లు పూర్తి చేసిన నాయకులు కర్నూలు (టౌన్): నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక వెంకటరమణ కాలనీలోని తానీష్ కన్వెన్షన్ హాలులో ఈనెల 24, 25 తేదీల్లో వీటిని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు హారీష్‌బాబు తెలిపారు. సోమవారం..ఏర్పాట్లును ఆయన పరిశీలించారు. సమావేశాలకు రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాల రావు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కర్నూలు నగరంలో కాషాయ జెండాలు వెలిశాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకోవడం, రాయలసీమలో కరువు నేపథ్యంలో ప్రభుత్వం రైతాంగాన్ని అదుకోవాలన్న పలు డిమాండ్లపై తీర్మానాలు చేయనున్నట్లు హరీష్ బాబు తెలిపారు. -
డీజీసీఏ, శాంసంగ్ సమావేశం
న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ప్రమాదాల నేపథ్యంలో శాంసంగ్ సీనియర్ అధికారులు డీజీసీఏ అధికారులను కలిశారు. రెండురోజుల క్రితం ఇండిగో విమానంలో పొగలువ్యాపించిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)అధికారులను శాంసంగ్ ప్రతినిధులు సోమవారం కలుసుకున్నారు. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో ఏవియేషన్ రెగ్యులేటరీ గెలాక్సీ ఫోన్ల బ్యాటరీ పేలుళ్లు, ప్రమాదాలపై సాంకేతిక అంశాలు అడిగి తెలుసుకుంది. అలాగే 'గెలాక్సీ నోట్ 7' సెప్టెంబర్ 15 వరకూ తయారైన ఫోన్లను బ్యాటరీ సమస్యలు పరిష్కరించే చర్యల్లో భాగంగా దేశంలో ఈ మొబైల్స్ ను విక్రయించబోమని శామ్సంగ్ అధికారులు డీజీసీఏకు తెలిపినట్టు సమాచారం. కాగా సింగపూర్ వస్తున్న ఇండిగో విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సందర్భంగా సెప్టెంబర్ 23 న ఒక శాంసంగ్ గెలాక్సీ నోట్ 2 స్మార్ట్ ఫోన్ ప్రమాదంతో పొగలు వచ్చిన ఘటన ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలు నమోదవుతున్నప్పటికీ , దేశంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం మొదటిసారి. దీంతోఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ విమానాల్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల వాడకంపై మరోసారి నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీంతోపాటుఈ రోజు సమావేశానికి హాజరు కావాల్సిందిగా శాంసంగ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సమావేశం గురించి వ్యాఖ్యానించడానికి , డీజీసీఏ అధికారులు అందుబాటులో లేరు. మరోవైపు శాంసంగ్ ప్రతినిధులు దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
కార్పొరేట్ కంపెనీల్లోనూ లంచాలు
లండన్ : కార్పొరేట్, ప్రముఖ కంపెనీల్లో లంచగొండితనం, అవినీతి పెరుగుతున్నాయి. ఈ నిజాన్ని ఆ కంపెనీల్లో పనిచేసే 80శాతం మంది ఎగ్జిక్యూటివ్ లే ఒప్పుకున్నారని యూకే న్యాయసంస్థ ఎవర్ సెడ్స్ సర్వే వెల్లడించింది. కంపెనీల్లో అవినీతి నిరోధక విధానాల అమలును పట్టించుకునే దిక్కే లేదని ఈ సర్వే పేర్కొంది. మొత్తం 12 దేశాల్లో 500 మంది బోర్డు లెవల్ ఎగ్జిక్యూటివ్ లపై జరిపిన సర్వేలో కంపెనీల్లో అవినీతికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైయ్యాయి. కంపెనీల్లో ఏర్పాటు చేసిన లంచం వ్యతిరేక విధానాలు సరిగ్గా పనిచేయడం లేదని 59శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కంపెనీలో మరో కంపెనీ విలీనం చేసేటప్పుడు, ఒక కంపెనీని మరో కంపెనీ స్వాధీనం చేసుకునేప్పుడు అవినీతి వ్యతిరేక విధానాలపై అసలు శ్రద్ధ వహించడం లేదని 33శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు చెప్పినట్టు సర్వే వెల్లడించింది. లంచం తీసుకోవడం, అవినీతికి పాల్పడటం వంటివి యూకేలో రాజకీయ సమస్యగా మారాయి. ఇవి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చట్టసభ సభ్యులు గుర్తించారు. ఈ సమస్యను రూపుమాపడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న స్పందనలపై చర్చించడానికి ఆ దేశ ప్రధాని డేవిడ్ కెమెరూన్ వచ్చే వారంలో అవినీతి వ్యతిరేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా పేరొందిన ప్రముఖులు, వ్యాపారస్తులు ప్రభుత్వాలకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులు ఎగొట్టి, మనీ లాండరింగ్ కు పాల్పడుతూ బిలియన్ ధనాన్ని దొంగ ఖాతాల్లో దాచుకున్నారని పనామా పేపర్ల కుంభకోణంతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిపిన సర్వేలో అసలు కంపెనీల్లో ఈ లంచగొండి వ్యతిరేక విధానాలు అమలుకావడం లేదని వెల్లడైంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు యూకే, ఇటలీ, బ్రెజిల్, హాంగ్ కాంగ్, చైనా కంపెనీల్లో 500 ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టారు. -
కో అంటే జీతం కోటిపైనే..
కో అంటే కోటి రూపాయలే. ఏడాది జీతం ఎనిమిదంకెల్లోనే. ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో మరేఇతర దేశంలోనో కాదు. భారత్‌లోనే చాలా కంపెనీల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటీవ్‌లు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్నారు. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో ఓ విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్న శ్రీరూప్ మిత్రా (33) గతేడాది జీతం కోటి రూపాయలకు పైనే తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హెచ్‌యూఎల్‌లో మిత్రా మాదిరిగా గతేడాది కోటి రూపాయలకు పైగా జీతం తీసుకున్న ఎగ్జిక్యూటీవ్‌ల సంఖ్య 169. వీరిలో 50 శాతం మంది 40 ఏళ్ల లోపు వయసు వారు కావడం విశేషం. హెచ్‌యూఎల్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరు ఒక శాతం. కాగా ఈ 169 మేనేజర్లు ఏడాది జీతం మొత్తం 310 కోట్లు. హెచ్‌యూఎల్ వార్షిక నివేదికలో ఈ విషయలు వెల్లడించారు. ఇక ఐటీసీలో 23 మంది ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్లో ఉన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌లో 123 మంది ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం పొందుతున్నారు. ఇలా ఉద్యోగులకు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం ఇస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, అత్యుత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం ఉన్న బిజినెస్ అడ్మిస్ట్రేషన్, ఇంజినీరింగ్, ఐటీ నిపుణులకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్, స్నాప్‌డీల్, ఓలా, ఉబెర్, కామన్‌ఫ్లోర్, బుక్‌మైషో,జబాంగ్, హంగామా, ఫ్యాఫన్అండ్యు వంటి కంపెనీలు వన్ క్రోర్ ప్లస్ జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఈకామర్స్ కంపెనీలు కోటిరూపాయలకు పైగా జీతం ఇవ్వగల 500 ఉద్యోగాలను ఆఫర్ చేశాయి.