ఇన్ఫోసిస్ పై మండిపడుతున్న ఉద్యోగులు
ఇన్ఫోసిస్ పై మండిపడుతున్న ఉద్యోగులు
Published Wed, May 24 2017 3:57 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
బెంగళూరు : దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ అవలంభిస్తున్న విధానాలపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లకు భారీగా పరిహారాలు పెంచుతూ ఉద్యోగులపై వేటు వేస్తుందని ఐటీ ఉద్యోగ గ్రూప్ లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఉద్యోగాల కోతతో తీవ్ర సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ పరిహారాల పెంపు మరింత ఆందోళనకరంగా మారిందని పేర్కొంటున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన 2017 వార్షిక రిపోర్టులో గత ఆర్థిక సంవత్సరం నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 50 శాతానికి పైగా పరిహారాలు పెంచినట్టు తెలిసింది.
ప్రతేడాది ఐటీ కంపెనీలు నిపుణులపై వేటు వేస్తూ.. అదేసమయంలో టాప్ ఎగ్జిక్యూటివ్ లకు వేరియబుల్ పే, స్టాక్ ప్రత్సహకాలు పేరుతో భారీగా వేతనాలను పెంచుతున్నాయని ఎఫ్ఐటీఈ జనరల్ మేనేజర్ ఏజే వినోద్ మండిపడ్డారు. వారు అచ్చం రాజకీయ నాయకుల ప్రవర్తిస్తున్నారని, ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టి, వారు వేతనాలను మాత్రం పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఇది చాలా బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నై, పుణే, బెంగళూరులతో పాటు తొమ్మిది ఐటీ హబ్స్ లో ఐటీ ఉద్యోగుల కోసం ఎఫ్ఐటీఈ ఫోరమ్ గా ఏర్పడింది.
ఇన్ఫోసిస్ వార్షిక రిపోర్టు ప్రకారం అధ్యక్షులు రాజేష్ మూర్తి, సందీప్ డాడ్లాని, మోహిత్ జోషి, డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవి కుమార్ లు మొత్తం పరిహారాల కింద 14 కోట్లకు పైగా అందుకున్నారు. పనితీరు ఆధారంగా స్టాక్ ప్రోత్సహాకాల కింద ఈ పెంపును చేపట్టినట్టు కంపెనీ పేర్కొంది. టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 10 లేదా 20 శాతం పరిహారాలు పెంచితే, కంపెనీ అకౌంట్ లో నుంచి భారీ ఎత్తున్న నగదు తరలివెళ్తుందని, ఈ ప్రభావంతో వెంటనే ప్రొఫిషనల్స్ పై కంపెనీ వేటువేస్తుందని ఎఫ్ఐటీఈ చెప్పింది.
Advertisement
Advertisement