సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా భారతీయ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా ఇండియాలో నలుగురు కీలక ఉద్యోగులను తొలగించింది. కాస్ట్ కటింగ్, వ్యాపారాన్ని క్రమబద్ధీకరణ,, ఆదాయ వృద్ధిని స్థిరంగా ఉంచే చర్యల్లో భాగంగా మెటా పలు రౌండ్లలో లేఆఫ్స్ ప్రకటించింది. అయితే తాజా తొలగింపులు చివరిదిగా భావిస్తున్నారు. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే)
ఇక ఇండియాలో మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం భారత మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్టనర్‌షిప్ డైరెక్టర్ సౌరభ్,మెటా ఇండియా లీగల్ డైరెక్టర్ అమృతా ముఖర్జీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిజైన్ చేయాల్సిందిగా ఈమెయిల్ ద్వారా వీరిని కోరినట్టు సమాచారం. దీంతోపాటు మలిదశ తొలగింపుల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మరికొంతమందిని తొలగిస్తోంది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్‌లు వంటి టీమ్‌లలో పనిచేస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులు తమను తొలగించినట్లు లింక్డ్‌ఇన్‌లో ప్రకటించారు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్ )
కాగా మైక్రోసాఫ్ట్, గూగుల్, లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్ పేరెంట్ మెటాతో సహా టెక్ దిగ్గజాలు గత ఏడాది చివరి నుంచి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించు కునేందుకు ఉద్యోగుల తొలగింపులను చేపట్టినట్టు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మార్చిలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ప్రారంభంలో 11వేల మందికి, ఏప్రిల్‌లో మరో పదివేల మందికి ఉద్వాసన పలికింది.రెండవ రౌండ్ మాస్ లేఆఫ్‌లను ప్రకటించిన తొలి టెక్ దిగ్గజం మెటా. (Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్)
భారీ చెల్లింపులు
ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న మెటా సంబంధిత ఉద్యోగులకు భారీ చెల్లింపులే చేస్తోంది. తాజా రిపోర్టు ప్రకారం మొత్తం21 వేలమందికి ప్రీ-టాక్స్ సెవెరెన్స్, సంబంధిత ఖర్చులు నిమిత్తం సుమారు 1 బిలియన డాలర్లు అంటే సుమారు రూ. 8,000 కోట్ల కంటే ఎక్కువే చెల్లిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment