కర్నూలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు | bjp state executives meet in kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

Published Mon, Jan 23 2017 11:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

bjp state executives meet in kurnool

-నేడు, రేపు నిర్వహణ
- ఏర్పాట్లు పూర్తి చేసిన నాయకులు
 
కర్నూలు (టౌన్‌): నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక వెంకటరమణ కాలనీలోని తానీష్‌  కన్వెన్షన్‌ హాలులో ఈనెల 24, 25 తేదీల్లో వీటిని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు హారీష్‌బాబు తెలిపారు. సోమవారం..ఏర్పాట్లును ఆయన పరిశీలించారు. సమావేశాలకు రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాల రావు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కర్నూలు నగరంలో కాషాయ జెండాలు వెలిశాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకోవడం, రాయలసీమలో కరువు నేపథ్యంలో ప్రభుత్వం రైతాంగాన్ని అదుకోవాలన్న పలు డిమాండ్లపై తీర్మానాలు చేయనున్నట్లు హరీష్‌ బాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement