కో అంటే జీతం కోటిపైనే.. | draw 8-digit salaries per year | Sakshi
Sakshi News home page

కో అంటే జీతం కోటిపైనే..

Published Tue, Jul 21 2015 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

కో అంటే జీతం కోటిపైనే..

కో అంటే జీతం కోటిపైనే..

కో అంటే కోటి రూపాయలే. ఏడాది జీతం ఎనిమిదంకెల్లోనే. ఏ అమెరికాలోనో,  బ్రిటన్లోనో మరేఇతర దేశంలోనో కాదు. భారత్లోనే చాలా కంపెనీల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటీవ్లు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్నారు.

హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్లో ఓ విభాగానికి హెడ్గా పనిచేస్తున్న శ్రీరూప్ మిత్రా (33) గతేడాది జీతం కోటి రూపాయలకు పైనే తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హెచ్యూఎల్లో మిత్రా మాదిరిగా గతేడాది కోటి రూపాయలకు పైగా జీతం తీసుకున్న ఎగ్జిక్యూటీవ్ల సంఖ్య 169. వీరిలో 50 శాతం మంది 40 ఏళ్ల లోపు వయసు వారు కావడం విశేషం. హెచ్యూఎల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరు ఒక శాతం. కాగా ఈ 169 మేనేజర్లు ఏడాది జీతం మొత్తం 310 కోట్లు. హెచ్యూఎల్ వార్షిక నివేదికలో ఈ విషయలు వెల్లడించారు.

ఇక ఐటీసీలో 23 మంది ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్లో ఉన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్లో 123 మంది ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం పొందుతున్నారు. ఇలా ఉద్యోగులకు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం ఇస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రతిభ,  నాయకత్వ లక్షణాలు, అత్యుత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం ఉన్న బిజినెస్ అడ్మిస్ట్రేషన్, ఇంజినీరింగ్, ఐటీ నిపుణులకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి.

ఫ్లిప్కార్ట్, అమేజాన్, స్నాప్డీల్,  ఓలా, ఉబెర్, కామన్ఫ్లోర్, బుక్మైషో,జబాంగ్, హంగామా, ఫ్యాఫన్అండ్యు వంటి కంపెనీలు వన్ క్రోర్ ప్లస్ జీతాలను ఆఫర్ చేస్తున్నాయి.  ఈ ఏడాది ఈకామర్స్ కంపెనీలు కోటిరూపాయలకు పైగా జీతం ఇవ్వగల 500 ఉద్యోగాలను ఆఫర్ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement