చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ మినిమలిస్ట్‌పై (Minimalist) ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ (Hindustan Unilever) దృష్టి పెట్టింది. 2020లో ప్రారంభమైన కంపెనీ తాజాగా సిరీస్ ఏలో భాగంగా యూనిలీవర్ వెంచర్స్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా నుంచి పెట్టుబడులు సమీకరించింది.
కాగా.. డైరెక్ట్ టు కన్జూమర్ స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్ కొనుగోలుకి హెచ్‌యూఎల్ చేపట్టిన చర్చలు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. రూ. 3,000 కోట్ల విలువలో ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మినిమలిస్ట్‌లో మెజారిటీ వాటాను హెచ్‌యూఎల్ సొంతం చేసుకోనున్నట్లు అభిప్రాయపడ్డాయి. బిజినెస్ వృద్ధి, విస్తరణకు వీలుగా వివిధ వ్యూహాల అమలుతోపాటు, అవకాశాలను అన్వేషిస్తుంటామని హెచ్‌యూఎల్ ఈ సందర్భంగా తెలియజేసింది.
మెటీరియల్ డెవలప్‌మెంట్ ఉంటే చట్టప్రకారం తగినవిధంగా సమాచారాన్ని వెల్లడిస్తామని తెలియజేసింది. గతేడాది(2023–24) మినిమలిస్ట్ రూ. 347 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం రెట్టింపై రూ. 11 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment