Hindustan Unilever
-
రూ. 3,000 కోట్ల డీల్.. హెచ్‌యూఎల్ చేతికి మినిమలిస్ట్!
చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ మినిమలిస్ట్పై (Minimalist) ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ (Hindustan Unilever) దృష్టి పెట్టింది. 2020లో ప్రారంభమైన కంపెనీ తాజాగా సిరీస్ ఏలో భాగంగా యూనిలీవర్ వెంచర్స్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా నుంచి పెట్టుబడులు సమీకరించింది.కాగా.. డైరెక్ట్ టు కన్జూమర్ స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్ కొనుగోలుకి హెచ్‌యూఎల్ చేపట్టిన చర్చలు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. రూ. 3,000 కోట్ల విలువలో ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.మినిమలిస్ట్‌లో మెజారిటీ వాటాను హెచ్‌యూఎల్ సొంతం చేసుకోనున్నట్లు అభిప్రాయపడ్డాయి. బిజినెస్ వృద్ధి, విస్తరణకు వీలుగా వివిధ వ్యూహాల అమలుతోపాటు, అవకాశాలను అన్వేషిస్తుంటామని హెచ్‌యూఎల్ ఈ సందర్భంగా తెలియజేసింది.మెటీరియల్ డెవలప్మెంట్ ఉంటే చట్టప్రకారం తగినవిధంగా సమాచారాన్ని వెల్లడిస్తామని తెలియజేసింది. గతేడాది(2023–24) మినిమలిస్ట్ రూ. 347 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం రెట్టింపై రూ. 11 కోట్లకు చేరింది. -
హెచ్‌యూఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతంపైగా క్షీణించి రూ. 2,595 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,657 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జతగా మరో రూ. 10 ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు అనుమతించింది. దీంతో మొత్తం రూ. 29 (రూ.6,814 కోట్లు) డివిడెండ్ చెల్లించనుంది.ఆదాయం ప్లస్...తాజా క్యూ2లో హెచ్‌యూఎల్ మొత్తం టర్నోవర్ 2%పైగా బలపడి రూ. 16,145 కోట్లను తాకింది. దీనిలో ప్రొడక్టుల విక్రయాలు 2 శాతం వృద్ధితో రూ. 15,703 కోట్లకు చేరాయి. పట్టణాల్లో డిమాండ్ తగ్గినా గ్రామీణ ప్రాంతాలలో క్రమంగా పుంజుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ రోహిత్ జావా పేర్కొన్నారు.ఐస్‌క్రీమ్ బిజినెస్ విడదీత..: క్వాలిటీ వాల్స్, కార్నెటో, మ్యాగ్నమ్ బ్రాండ్లను కలిగిన ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. స్వతంత్ర కమిటీ సలహామేరకు ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు నిర్ణయించినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ చెప్పారు.ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 2,658 వద్ద ముగిసింది. -
స్పీడ్ తగ్గిన హెచ్‌యూఎల్
న్యూఢిల్లీ: నాలుగో త్రైమాసికంలో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం స్వల్పంగా తగ్గి (1.53%) రూ. 2,561 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఆదాయం రూ. 15,375 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 15,441 కోట్ల కు పెరిగింది. వ్యయా లు రూ. 11,962 కోట్ల నుంచి రూ. 12,100 కోట్లకు చేరా యి.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 61,092 కోట్ల నుంచి రూ. 62,707 కోట్లకు చేరింది. లాభం రూ. 10,143 కోట్లుగా నమోదైంది. బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు.. రూ.1 ముఖ విలువ చేసే షేరు ఒక్కింటికి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. తాత్కాలిక డివిడెండ్ రూ. 18 కూడా కలిపితే పూర్తి సంవత్సరానికి మొత్తం మీద ఒక్కో షేరుకి రూ. 42 డివిడెండ్ ఇచి్చనట్లవుతుందని సంస్థ తెలిపింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 2,259.15 వద్ద క్లోజయ్యింది. -
హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..
హిందుస్థాన్ యూనిలీవర్ హార్లిక్స్ లేబుల్‌ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’గా పిలిచే హార్లిక్స్‌ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరీలోకి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది.ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో వచ్చిన సూచనల మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మార్పులు చేయాలని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌ను ఆదేశించింది. దాంతో కంపెనీ తన ప్రతిష్టాత్మక ఉత్పత్తి అయిన హార్లిక్స్ ప్రస్తుత కేటగిరీ ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ నుంచి ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్ఎన్డీ)’లోకి మారుస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రితేష్ తివారీ మాట్లాడుతూ..హార్లిక్స్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్ఎన్డీ) లేబుల్‌కు మారడం వల్ల స్పష్టమైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో ‘హెల్త్ డ్రింక్స్’కు కచ్చితమైన నిర్వచనం లేకపోవడం వల్ల రెగ్యులేటరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలిసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో డైరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడదని తెలిపింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్, లైమ్ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానీయాల కేటగిరీలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపింది.బోర్న్‌విటా వివాదంబోర్న్విటా వంటి పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ అని లేబుల్ చేయరాదని ప్రభుత్వం ఇటీవల ఈ-కామర్స్ వెబ్సైట్లకు సూచించింది. దేశ ఆహార చట్టాల్లో ఆ వర్గానికి సరైన నిర్వచనం లేదని తెలిపింది. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్యాడ్బరీ బోర్న్‌విటాలో అధిక చక్కెర కంటెంట్ ఉందని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు వీడియో ద్వారా ఆరోపించిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.. ఎక్కడో తెలుసా..బోర్న్‌విటా మాతృ సంస్థ మాండలిజ్ ఇండియా ఆ వీడియోను తొలగించాలని సదరు వ్యక్తికి లీగల్ నోటీసు జారీ చేసింది. అయితే వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్యాకేజింగ్, ప్రకటనలు, లేబుల్‌లను తొలగించాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఆదేశించింది. -
కార్పొరేట్ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వర్గాల్లో పరపతి పెంచుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలు మాజీ బ్యూరోక్రాట్లపై దృష్టి పెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వారిని తమ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్‌ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించుకుంది. తద్వారా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా ఒక మాజీ బ్యూరోక్రాట్‌ను నియమించుకున్న నిఫ్టీ 50 కంపెనీల్లో రెండోదిగాను, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో మూడోదిగాను నిలి్చంది. నిఫ్టీ కంపెనీ అయిన లార్సన్ అండ్ టూబ్రో అక్టోబర్‌లో ఇలా ఒకరిని తీసుకోగా, హెచ్‌యూఎల్ పోటీ సంస్థలైన డాబర్, కోల్గేట్–పామోలివ్ కూడా అదే బాటలో నడిచాయి. హెచ్‌యూఎల్‌లో ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్ అయిన సంజీవ్ మిశ్రా, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ వర్గాలతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తమ పనులు జరిపించుకునే ఉద్దేశంతో కంపెనీలు ఇలా వారిని నియమించుకుంటూ ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని లిస్టెడ్ కంపెనీల్లో 6 శాతం.. తగినంత స్థాయిలో స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకోనందుకు గాను ప్రభుత్వ రంగ కంపెనీలకు ఒకవైపు అక్షింతలు పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు మాత్రం రిటైరైన బ్యూరోక్రాట్లను జోరుగా నియమించుకుంటున్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని లిస్టెడ్ కంపెనీల్లోని స్వతంత్ర డైరెక్టర్లలో మాజీ బ్యూరోక్రాట్ల వాటా 6 శాతంగా ఉంది. అదే మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్ 200 కంపెనీలను మాత్రమే తీసుకుంటే ఇది మరింత అధికంగా 13 శాతంగా ఉంది. నిఫ్టీ 50లో 26 పైచిలుకు సంస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లను నియమించుకున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్‌యూఎల్ మొదలైన సంస్థల్లో అత్యధిక సంఖ్యలో మాజీ బ్యూరోక్రాట్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యక్తులవారీగా చూస్తే ఏఎన్ రాయ్ 7 సంస్థల్లో స్వతంత్ర డైరెక్టరుగా ఉండగా అమిత్ కిరణ్ దేవ్ (6 సంస్థల్లో), దీపా గోపాలన్ వాధ్వా.. దినేష్ కుమార్ మిట్టల్.. యూకే సిన్హా ..సుమిత్ బోస్ .. వీరయ్య చౌదరి కొసరాజు తలో అయిదు సంస్థల్లో, సుధా పిళ్లయ్ .. మీరా శంకర్ .. నిరుపమా రావు తలో 4 సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక, అత్యధికంగా మాజీ బ్యూరోక్రాట్లు ఉన్న ప్రభుత్వ రంగయేతర సంస్థలను చూస్తే డాబర్ ఇండియాలో ఆరుగురు ఉన్నారు. ఐటీసీ, భారత్ రోడ్ నెట్వర్క్, అపోలో టైర్స్, సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా)లో నలుగురు చొప్పున .. సెంచరీ ప్లైబోర్డ్స్ (ఐ), వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, లార్సన్ అండ్ టూబ్రో, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో ముగ్గురు చొప్పున ఉన్నారు. -
‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’కి భారీ ఊరట
ప్రముఖ దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ సంస్థకు భారీ ఊరట లభించింది. ‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ హెచ్‌యూఎల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఆ కేసును కోల్‌కతా హైకోర్టు కొట్టిపారేసింది. సంస్థ యాజమాన్యం నిర్ధోషులని తీర్పిచ్చింది. కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)కు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హిందుస్థాన్ యూనిలివర్ సంస్థపై, ఆ కంపెనీ (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు) యాజమాన్యం రెడ్ లేబుల్ టీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ క్రిమినల్ కేసు నమోదు చేశారు. హెచ్‌యూఎల్ సంస్థ ఆహార కల్తీ నిరోధక చట్టం సెక్షన్ 38, సెక్షన్ 39ని ఉల్లంఘించందని ఆరోపించారు. దీంతో తప్పుగా బ్రాండింగ్ చేస్తున్నందుకు హెచ్‌యూఎల్ ఉన్నతాధికారులు దోషులని మునిసిపల్ మేజిస్ట్రేట్ నిర్ధారించింది. రూ. 5,000 జరిమానాతో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ శిక్షను కోల్‌కతా జిల్లా కోర్టు (సెషన్స్ కోర్టు) కొట్టివేసింది. అయితే, తీర్పును మళ్లీ పరిశీలించాలని మున్సిపల్ మేజిస్ట్రేట్‌కు తిరిగి పంపించింది. సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీపై తప్పుడు ప్రచారం చేసిందనే మున్సిపల్ కార్పొరేషన్ అభిప్రాయంపై స్పందించింది. తప్పుడు ప్రచారం అంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నిరూపించడానికి ట్రయల్ కోర్టు (అప్పీలేట్ కోర్టు) ముందు కేఎంసీ విభాగం ఎప్పుడూ హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తిని ఎందుకు తప్పుగా బ్రాండ్ చేసిందనే కారణాల్ని వివరించలేదని కోర్టు తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్, ఆ సంస్థ అధికారులపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని జస్టిస్ సుభేందు సమంతా గుర్తించారు. కేసును కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ తరఫున న్యాయవాదులు సబ్యసాచి బెనర్జీ, అనిర్బన్ దత్తా, అభిజిత్ చౌదరి, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ తరపున న్యాయవాదులు గౌతమ్ దిన్హా ,అనింద్యసుందర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇమ్రాన్ అలీ, దేబ్జానీ సాహులు తమ వాదనల్ని వినిపించారు. -
ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు?
Surf Excel Success Story : ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్, దాగ్ అచ్చీ హై’ వంటి టీవీ ప్రకటనలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సర్ఫ్ ఎక్సెల్. చిన్న ప్యాకెట్‌తో మొదలైన సర్ఫ్ ఎక్సెల్ ప్రస్థానం నేడు అమ్మకాల్లో మాతృసంస్థ హెచ్‌యూఎల్‌కు చెందిన 50 రకాల ఉత్పత్తులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. అందుకు కారణాలేంటి? మనందరి ఇళ్లలో విస్తృతంగా వినియోగించే సర్ఫ్ ఎక్సెల్ భారతదేశపు మొట్టమొదటి డిటర్జెంట్ పౌడర్. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) 1957లో పెట్రోకెమికల్స్‌తో తయారు చేసిన ఎన్ఎస్డీ (నాన్-సోప్ డిటర్జెంట్) పౌడర్‌గా సర్ఫ్‌ను ప్రారంభించింది. గృహిణులు సౌకర్యంగా వినియోగించుకునేలా 1959లో హెచ్‌యూఎల్ సర్ఫ్ ఎక్సెల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సర్ఫ్ అని పిలిచే ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ‘డిటర్జెంట్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. అందుకు అనేక కారణాలున్నాయి. నురగ రావడం లేదని వాషింగ్ మెషీన్లు రాకముందు భారతీయులు బట్టల్ని ఉతకేందుకు సర్ఫ్ వినియోగం వల్ల పొందే ప్రయోజనాలు తెలిసినప్పటికీ సబ్బుల్ని మాత్రమే వాడే వారు. ఎందుకంటే అప్పట్లో సర్ఫ్ ఉపయోగిస్తే ట్యాప్ వాటర్‌తో బట్టల్ని ఉతికితే నురగ వచ్చేది కాదు. నురగవస్తే బట్టలకున్న మురికి పోతుందని నమ్మేవారు. ఆ నమ్మకమే సర్ఫ్ ఎక్సెల్ వినియోగంలో గృహిణులు విముఖత వ్యక్తం చేసేవారు. ప్రజల్ని నమ్మించి.. ఈ సమస్యనే ఛాలెంజింగ్ తీసుకున్న హెచ్‌యూఎల్ తమ ఉత్పత్తి సర్ఫ్ ఎక్సెల్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీసింది. బట్టల సోప్‌తో బట్టలు ఎలా శుభ్రం అవుతాయో.. ట్యాప్ వాటర్‌లో సర్ఫ్ ఎక్సెల్‌ను వినియోగిస్తే నురగ రావడమే కాదు, బట్టలు శుభ్రమవుతాయని ప్రజల్ని నమ్మించింది. బహిరంగంగా చేసి చూపించింది. ఫలితాలు రావడంతో ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం, వ్యాపార ప్రకటనలతో సర్ఫ్ ఎక్సెల్ సేల్స్ అమాంతం పెరిగాయి. సర్ఫ్ ఎక్సెల్‌కు పోటీగా నిర్మా అయితే డిటర్జెంట్ ప్రొడక్ట్‌లలో సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు, దాని మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోవడంతో.. పోటీగా 1969లలో ‘నిర్మా’ వంటి ఇతర సంస్థలు సైతం డిటర్జెంట్ ఉత్పత్తుల్ని పోటా పోటీగా మార్కెట్లో విడుదల చేశాయి. అలా పోటీకి దిగిన నిర్మా..సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలకు చెక్ పెట్టింది. చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నంలో పుట్టుకొచ్చిన నిర్మా తక్కువ ధరలోనే ఆ కంపెనీకి చెందిన నిర్మా వాషింగ్ ఫౌడర్ కేజీ ప్యాకెట్ ధర రూ.3.50లకు అమ్మగా.. అదే సమయంలో హెచ్ యూఎల్ కంపెనీకి చెందిన సర్ఫ్ ఎక్సెల్ కేజీ సర్ఫ్ ఫౌడర్ ప్యాకెట్ ధర రూ.15కి అమ్మింది. అంతలోనే నష్టాలు దీంతో అప్పటి వరకు డిటర్జెంట్ విభాగంలో రారాజుగా వెలుగొందిన సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. ధర ఎక్కువ కావడంతో సేల్స్ తగ్గాయి. హెచ్‌యూఎల్‌కు ఊహించని నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు నిర్మాను ఢీ కొట్టి, నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సర్ఫ్ ఎక్సెల్ యాడ్ కోసం కవిత చౌదరీ (లలితాజీ) ని రంగంలోకి దించింది హెచ్ యూఎల్ బ్రాండ్. ట్రెండ్ సెట్టర్‌గా లలితాజీ కవితా చౌదరితో వినియోగదారులకు సర్ఫ్ ఎక్సెల్ ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్’ (చౌక - మంచిది) యాడ్ క్యాంపెయిన్‌ను తయారు చేయించింది. నిర్మా సర్ఫ్ తక్కువ ధరలకు ప్రతి స్పందనగా ఇంటి పేరుగా మారితే.. సర్ఫ్ ఎక్సెల్ లలితాజీ యాడ్ డబ్బు విలువను వివరించేలా తీయడం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతే సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ దశ తిరిగింది. డబ్బు విలువ చెబుతూ తీసిన యాడ్‌కు కొనుగోలు దారులు ఫిదా అయ్యారు. మళ్లీ సర్ఫ్ ఎక్సెల్స్ను వాడటం మొదలు పెట్టారు. ఇలా సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ విభాగంలో దేశంలోనే తొలి బ్రాండ్ గా చరిత్ర సుష్టించడమే కాదు.. టీవీ చానల్స్‌లో యాడ్స్‌ను ప్రసారం చేయించిన బ్రాండ్లలలో సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ తొలిస్థానంలో నిలిచింది. 30ఏళ్ల పాటు చక్రం తిప్పి 30 ఏళ్ల పాటు డిటర్జెంట్ విభాగంలో చక్రం తిప్పిన సర్ఫ్ ఎక్సెల్‌కు నిర్మా తర్వాత 1991లో భారతీయ స్త్రీల అవసరాల్ని, ఆర్ధిక స్థాయిల్ని అర్ధం చేసుకున్న పీ అండ్ జీ సంస్థ ఎరియల్ను పరిచయం చేసింది. ఎయిరియల్ సైతం ధర తక్కువ కావడం, బకెట్ నీరు, వాషింగ్ మెషీన్లో వినియోగించుకొని బట్టల్ని శుభ్రం చేస్తుంది. మొండి మరకల్ని తరిమికొడుతుందంటూ చేసిన ఏరియల్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటి వరకు సర్ఫ్ ఎక్సెల్, నిర్మాను వాడిని సామాన్యులు ఏరియల్‌ను వినియోగించుందుకు మొగ్గు చూపారు. ఈ సారి చిన్నపిల్లలతో దీంతో మళ్లీ పునారలోచనలో పడ్డ సర్ఫ్ ఎక్సెల్ ‘దాగ్ అచ్చే హై’ అంటూ మరో యాడ్‌ను రూపొందించింది. మరక మంచిదే నంటూ చిన్నపిల్లల తీసిన యాడ్‌లో..మీరే ఏదైనా మంచి పనిచేసినప్పుడు మరక అంటుకుంటే అది మంచిదే అని చెప్పడం మా ఉద్దేశం’ అని చెప్పడంలో మరో మారు తన మార్క్ సేల్ స్ట్రాటజీని అప్లయి చేయడం అది కాస్తా వర్కౌట్ అయ్యింది. ఇలా పదికి పైగా అడ్వటైజ్మెంట్స్తో పాటు ప్రజాదరణతో ఇండస్ట్రీలో సర్ఫ్ బ్రాండ్లలో సర్ఫ్ ఎక్సెల్ ప్రముఖ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తుంది. రూ.70,000 కోట్ల అమ్మకాల దిశగా ఇటీవల,హెచ్‌యుఎల్ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,282 కోట్లు) టర్నోవర్ మార్కును దాటేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఈ మైలురాయిని దాటిన మొదటి బ్రాండ్‌గా ఎదిగింది. సబ్బులు, వాషింగ్ పౌడర్లు, పేస్టుల వంటి ప్యాక్డ్ కన్జూమర్ గూడ్స్ మార్కెట్లో హెచ్‌యూఎల్ ఆధిపత్యం కొనసాగుతోందనడానికి సర్ఫ్ ఎక్సెల్ సక్సెస్ నిదర్శనంగా నిలుస్తోంది. ఆ బ్రాండే హెచ్‌యూఎల్ సైతం ప్రీమియం ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు ఊతం ఇచ్చింది. వెరసీ బ్రాండ్ దేశం మొత్తం డిటర్జెంట్ల మార్కెట్లో అధిక షేర్ వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సర్ఫ్ ఎక్స్‌ల్ డిమాండ్‌ను బట్టి 2027 నాటికి రూ.70,000 కోట్ల అమ్మకాలను అధిగమిస్తుందని అంచనా. చదవండి👉 వచ్చేస్తోంది..ఇండియన్ రోడ్ల రారాజు..అంబాసీడర్ ఎలక్ట్రిక్ కార్ -
దిగిపోతున్న ఈ సీఈవో అందుకున్న పరిహారం రూ. 22 కోట్లు!
త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) వ్యాపార దిగ్గజం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) సీఈవో, ఎండీ భారీ పరిహారాన్ని అందుకున్నారు. వచ్చే నెలలో దిగిపోతున్న సంజీవ్ మెహతా 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 22 కోట్లకు పైగా పరిహారాన్ని అందుకున్నారు. ఇందులో రూ. 6.3 కోట్ల బోనస్‌కూడా ఉంది. బోనస్ దాదాపు 50 శాతం పెరగడంతో సరాసరిగా మొత్తం పరిహారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే భారీగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం అంతర్గత వ్యాల్యూమ్ వృద్ధిని సాధించిన హెచ్‌యూఎల్ 16 శాతం వృద్ధితో రూ. 58,154 కోట్ల టర్నోవర్ సాధించింది. దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన సంజీవ్ మెహతా పదవీకాలంలో జూన్ నెలలో ముగియనుంది. ఇన్పుట్ కాస్ట్ ద్రవ్యోల్బణం కారణంగా తలెత్తిన కఠినమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని కంపెనీ పోర్ట్‌ఫోలియో అత్యధిక మార్కెట్ వాటా పొందేలా చేసిన ఘనత సంజీవ్ మెహతాకు దక్కుతుంది. జూన్ 27న పదవి నుంచి దిగిపోతున్న సంజీవ్ మెహతా కొత్త సీఈవో రోహిత్ జావాకు బాధ్యతలు అప్పగించనున్నారు. సింగపూర్ పౌరుడైన రోహిత్ జావా కూడా రూ. 21 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇందులో రూ. 7 కోట్ల టార్గెట్ బోనస్‌కూడా ఉంటుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
హెచ్‌యూఎల్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13% బలపడి రూ. 2,601 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,307 కోట్లు ఆర్జించింది. అమ్మకాల పరిమాణం, మార్జిన్లు మెరుగుపడటం లాభాల వృద్ధికి దోహదపడింది. నికర అమ్మకాలు 11 శాతం పుంజుకుని రూ. 14,926 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 13,468 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సర్వీసులతో కలిపి మొత్తం రూ. 15,375 కోట్ల నిర్వహణ ఆదాయం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 10,782 కోట్ల నుంచి రూ. 11,961 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. విభాగాలవారీగా: క్యూ4లో హెచ్‌యూఎల్ హోమ్ కేర్ విభాగం ఆదాయం 19% వృద్ధితో రూ. 5,637 కోట్లను తాకింది. సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ ఆదాయం 11% పుంజుకుని రూ. 5,257 కోట్లకు చేరింది. ఇక ఫుడ్స్, రిఫ్రెష్మెంట్ నుంచి 3 శాతం అధికంగా రూ. 3,794 కోట్లు నమోదైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌యూఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 14% ఎగసి రూ.10,143 కోట్లను తాకింది. 2021–22లో రూ. 8,892 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 15%పైగా జంప్‌చేసి రూ.59,443 కోట్లయ్యింది. అంతక్రితం రూ.51,472 కోట్ల టర్నోవర్ సాధించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు 1.7 శాతం క్షీణించి రూ. 2,469 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ సీఎండీగా రోహిత్ జావా
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) నూతన ఎండీ, సీఈవోగా రోహిత్ జావా నియమితులయ్యారు. దశాబ్ద కాలంపాటు నాయకత్వం వహించి పదవీ విరమణ చెందుతున్న సంజీవ్ మెహతా స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం లండన్‌లో యూనిలీవర్ ట్రాన్స్ఫర్మేషన్ చీఫ్‌గా జావా ఉన్నారు. అయిదేళ్ల కాలానికిగాను ఎండీ, సీఈవోగా 2023 జూన్ 27న బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 1న కంపెనీ శాశ్వత డైరెక్టర్‌గా హెచ్‌యూఎల్ బోర్డులో చేరనున్నారు. యూనిలీవర్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్‌గానూ ఆశీనులు కానున్నారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కి షాకిచ్చిన టెక్ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా? -
హెచ్‌యూఎల్ గూటికి ఒజైవా
న్యూఢిల్లీ: ఒజైవా బ్రాండు సంస్థ జైవీ వెంచర్స్ ప్రయివేట్‌లో 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 335 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో వెల్బీయింగ్ న్యూట్రిషన్ సంస్థ న్యూట్రిషన్ల్యాబ్ ప్రయివేట్‌లో 19.8 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు నగదు రూపేణా రూ. 70 కోట్లు వెచ్చించనున్నట్లు హెచ్‌యూఎల్ తెలియజేసింది. తద్వారా ఆరోగ్యం, సంక్షేమ విభాగాలలో ప్రవేశించనుంది. దేశీయంగా హెల్త్, వెల్బీయింగ్ విభాగం అత్యంత వేగంగా పురోగమిస్తున్నట్లు యూరోమోనిటర్ డేటా పేర్కొంది. రూ. 30,000 కోట్ల మార్కెట్ పరిమాణానికి వీలున్నట్లు అంచనా వేసింది. కాగా.. ఒజైవాలో మిగిలిన 49 శాతం వాటాను ముందస్తు అంచనా విలువ ప్రకారం మూడేళ్ల(36 నెలలు) తదుపరి కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌యూఎల్ వివరించింది. గతేడాది(2021–22) జైవీ రూ. 124 కోట్లు, వెల్బీయింగ్ రూ. 19.4 కోట్లు చొప్పున టర్నోవర్ సాధించినట్లు వెల్లడించింది. -
హెచ్‌యూఎల్ ఫలితాలు బాగు..
న్యూఢిల్లీ: దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో బలమైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 22 శాతం వృద్ధితో రూ.2,670 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 16 శాతానికి పైగా పెరిగి రూ.15,253 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి లాభం రూ.2,185 కోట్లు, ఆదాయం రూ.13,099 కోట్ల చొప్పున ఉన్నాయి. విక్రయాల సంఖ్యా పరంగా 4 శాతం వృద్ధిని చూసినట్టు కంపెనీ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో 75 శాతం విలువ పరంగా, పరిమాణం పరంగా మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు పేర్కొంది. కంపెనీ వ్యయాలు 18 శాతం పెరిగి రూ.11,965 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని రకాలుగా బలమైన ప్రదర్శన చూపించాం. 2022–23లో మొదటి ఆరు నెలల్లో రూ.4,000 కోట్ల అధిక టర్నోవర్ నమోదు చేయగలిగాం. మా ఉత్పత్తులకు ఉన్న బలం, నిర్వహణ సామర్థ్యాలు, వివేకవంతమైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనుకూలించాయి’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఒక్కో షేరుకు రూ.17 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ‡ బోర్డు నిర్ణయించింది. -
15 శాతం తగ్గిన సబ్బుల ధరలు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పెరిగిపోయిన సబ్బుల ధరలు కొంత దిగొచ్చాయి. సామాన్యుడికి కొంత ఊరట దక్కింది. ముడి పదార్థాల ధరలు క్షీణించడంతో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీలు సబ్బుల ధరలను 15 శాతం వరకు తగ్గించాయి. సబ్బుల్లో ప్రధానంగా వినియోగించే పామాయిల్ ధరలు ఇటీవల గణనీయంగా తగ్గడం తెలిసిందే. లైఫ్‌బోయ్, లక్స్ సబ్బులను 5–11 శాతం మధ్య పశ్చిమాది ప్రాంతంలో తగ్గించినట్టు హెచ్‌యూఎల్ ప్రకటించింది. గోద్రేజ్ నంబర్ 1, సింథాల్ తదితర బ్రాండ్లపై సబ్బులను విక్రయించే గోద్రేజ్ కన్జ్యూమర్ 13–15 శాతం మధ్య ధరలను తగ్గించింది. ధరలు తగ్గించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అధిక విక్రయాలు నమోదు కావచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. తొలి కంపెనీ మాదే..: గోద్రేజ్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఎఫ్‌వో సమీర్ షా మాట్లాడుతూ.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసిన మొదటి ఎఫ్ఎంసీజీ కంపెనీ గోద్రేజ్ కన్జ్యూమరే. గోద్రేజ్ నంబర్ 1 బండిల్ ప్యాక్ (100 గ్రాముల ఐదు సబ్బులు) ధరను రూ.140 నుంచి రూ.120కు తగ్గించాం’’అని వివరించారు. హెచ్‌యూఎల్ అధికార ప్రతినిధి లైఫ్‌బోయ్, లక్స్ ధరల తగ్గింపును ధ్రువీకరించారు. అదే సమయంలో సర్ఫ్, రిన్, వీల్, డవ్ తదితర ఉత్పత్తుల ధరలపై స్పందించలేదు. ‘‘గడిచిన ఏడాది కాలంలో హెచ్‌యూఎల్ సబ్బుల గ్రాములను తగ్గించి, ధరలను పెంచడంతో విక్రయాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ధరలు తగ్గించడం కలిసొస్తుంది’’అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ పేర్కొన్నారు. -
సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్!
దేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఉత్పత్తులలో.. ప్రొడక్ట్‌ని బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ముడిసరుకు ఖర్చుల మధ్య గత రెంవత్సరాలుగా ధరలను పెంచిన హెచ్‌యూఎల్ సంస్థ.. ఇటీవల ముడి సరుకు ధరలు అదుపులోకి రావడంతో పలు ప్రాడెక్ట్లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సామాన్యడికి కాస్త ఊరటనిస్తుంది. కాగా కరోనా మొదలుకొని అన్నీ రంగాలు డీలా పడడంతో దాని ప్రభావం చాలా వరకు సామాన్యలపై పడింది. ఈ క్రమంలో ఉద్యోగాల కోత, నిత్యవసరాలు, ఇంధన ధరలు ఇలా అన్ని పెరుగుతూ ప్రజలకు భారంగా మారిన సంగతి తెలిసిందే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ముడిసరుకు ధరలు గరిష్ట స్థాయిలో పెరిగాయి. దీంతో గత నాలుగు త్రైమాసికాల్లో, ఎఫ్ఎంసీజీ కంపెనీలు 8-15 శాతం మేర ధరలను పెంచాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తాజా ప్రకటనతో.. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, రిన్ డిటర్జెంట్ పౌడర్, లైఫ్‌బోయ్ సబ్బు, డోవ్ సోప్ వంటివి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. అయితే, కొందరి డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం, అన్ని ధర తగ్గించిన వస్తువులు ఇంకా మార్కెట్లోకి అందుబాటులో లేదని తెలిపారు. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం: 12వేల మంది ఉద్యోగులు ఇంటికి! -
హెచ్‌యూఎల్ లాభాలు భళా!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) 2022–23 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం (క్యూ1)లో మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ముడిపదార్థాల ధరలు పెరిగినప్పటికీ, వ్యయాలను సమర్థవంతంగా అధిగమించింది. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,391 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ.14,757 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో నికర లాభం రూ.2,100 కోట్లు, ఆదాయం రూ.12,260 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 21% పెరిగి రూ.11,531 కోట్లకు చేరాయి. హోమ్‌కేర్ విభాగం 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్యాబ్రిక్ వాష్, గృహ సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. రెండంకెల విక్రయాలు జరిగాయి. బలమైన పనితీరు.. ‘‘సవాళ్లతో కూడిన వాతావరణం, అసాధారణ స్థాయిలో ద్రవ్యోల్బణం ప్రభావం వినియోగంపై ఉన్నప్పటికీ.. ఆదాయం, నికర లాభంలో బలమైన వృద్ధిని నమోదు చేశాం. వ్యాపారాన్ని కాపాడుకుంటూనే, మార్జిన్లను ఆరోగ్యకర స్థాయిలో కొనసాగించాం. ద్రవ్యోల్బణానికి సంబంధించి సమీప కాలంలో ఆందోళన ఉంది. అయితే, కమోడిటీల ధరలు కొంత దిగిరావడం, ప్రభుత్వం తీసుకున్న ద్రవ్య, పరపతి చర్యలు, మంచి వర్షాలు పరిశ్రమకు సానుకూలిస్తాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత ఎఫ్ఎంసీజీ రంగం వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నాం. స్థిరమైన, పోటీతో కూడిన, లాభదాయక, బాధ్యతాయుత వృద్ధిని నమోదు చేయడంపై దృష్టి కొనసాగుతుంది’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. -
హిందుస్తాన్ యూనిలీవర్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ సరికొత్త రికార్డు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో తొలిసారి రూ. 50,000 కోట్ల టర్నోవర్ సాధించింది. తద్వారా ఈ మైలురాయి అందుకున్న తొలి ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలిచింది. ఇక గతేడాది చివరి త్రైమాసికంలో నికర లాభం 5 శాతంపైగా పుంజుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 2,307 కోట్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,190 కోట్ల లాభం నమోదైంది. కాగా.. కంపెనీకి చెందిన 16 బ్రాండ్లు ఒక్కొక్కటీ రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తున్నట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ పేర్కొన్నారు. ఇక డవ్, విమ్, రిన్ బ్రాండ్లయితే విడిగా రూ. 2,000 కోట్ల చొప్పున ఆదాయాన్ని సాధిస్తున్నట్లు వెల్లడించారు. 10 శాతం ప్లస్ ప్రస్తుత క్యూ4లో మొత్తం ఆదాయం 10 శాతంపైగా ఎగసి రూ. 13,468 కోట్లను తాకింది. నిర్వహణలాభ(ఇబిటా) మార్జిన్లు 0.2 శాతం నీరసించి 24.6 శాతానికి చేరాయి. గరిష్ట ద్రవ్యోల్బణంలోనూ పటిష్ట మార్జిన్లు సాధించినట్లు తివారీ పేర్కొన్నారు. వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 10,782 కోట్లకు చేరాయి. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ఇంతక్రితం 2021 నవంబర్‌లో రూ. 15 చెల్లించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 8,892 కోట్లను తాకింది. 2020–21లో రూ. 7,999 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని రూ. 51,472 కోట్లకు చేరింది. విభాగాల వారీగా క్యూ4లో హెచ్‌యూఎల్ హోమ్ కేర్ విభాగం ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 4,743 కోట్లకు చేరగా.. సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాలు 4 శాతం పెరిగి రూ. 4,743 కోట్లను తాకాయి. ఫుడ్, రిఫ్రెష్మెంట్ టర్నోవర్ 5 శాతం బలపడి రూ. 3,698 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 2,144 వద్ద ముగిసింది. -
హిందూస్థాన్ యూనీలీవర్ చేతికి దిగ్గజ మసాలా కంపెనీ..! అదే జరిగితే పెనుమార్పులు..!
ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎండీహెచ్)లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలు లావాదేవీలో భాగంగా ఎండీహెచ్ మార్కెట్ విలువను రూ.10,000-15,000 కోట్లకు లెక్కగట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పెను మార్పులు..! దేశవ్యాప్తంగా ఎండీహెచ్ మసాలా ఉత్పత్తులు అత్యంత ఆదరణను పొందాయి. ఈ కంపెనీలో హెచ్‌యూఎల్ వాటాలను కొనుగోలు చేయడంతో మసాలా ఉత్పత్తుల సెగ్మెంట్లో పెనుమార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వాటాల విక్రయంపై హోచ్‌యూఎల్‌తో పాటుగా మరిన్ని కంపెనీలు ఎండీహెచ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 2020 చివర్లో ఎండీహెచ్ వ్యవస్థాపకులు, పద్మ భూషన్ అవార్డు గ్రహీత ధరమ్ పాల్ గులాటీ మరణించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ యాజమాన్యం వాటా విక్రయ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా ఎండీహెచ్ 60కి పైగా మసాలా ఉత్పత్తులు విక్రయిస్తోంది. కనీసం 1,000 మంది హోల్‌సేలర్లు, లక్షల కొద్ది రిటైల్ కేంద్రాలతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు!
ముంబై: దేశంలోని అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. గత నెలలో సబ్బులు & డిటర్జెంట్ల ధరలను పెంచిన కంపెనీ ఫిబ్రవరిలో మళ్లీ ధరలను పెంచినట్లు ఒక సంస్థ నివేదిక పేర్కొంది. మార్కెట్ ఎనలిస్ట్ సంస్థ ఎడెల్వీస్ ప్రకారం.. ఈ నెలలో సబ్బులు, డిటర్జెంట్లు & డిష్ వాష్ ఉత్పత్తుల ధరలను 3 నుండి 10 శాతం వరకు పెంచింది. "సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్, సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్, విమ్ బార్ & లిక్విడ్, లక్స్ & రెక్సోనా సబ్బులు, పాండ్స్ టాల్కమ్ పౌడర్, ఇతరులతో సహా అనేక ఉత్పత్తుల ధరలను పెంచినట్లు మా కంపెనీ తనిఖీలలో తేలింది" అని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్నీష్ రాయ్ చెప్పారు. దేశంలోని అతి పెద్ద కన్సుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ అక్టోబర్ నుంచి దాదాపు ప్రతి నెలా ఈ ఉత్పత్తుల ధరలను పెంచుతూ వస్తుంది. నవంబర్ నెలలో వీల్ డిటర్జెంట్ 1 కి.గ్రా ప్యాక్ ధరను 3.4 శాతం పెంచితే, డిసెంబర్ నెలలో లైఫ్ బోయి సబ్బులు, మీడ్-సెగ్మెంట్ లక్స్, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ కేక్, రిన్ డిటర్జెంట్ బార్ ధరలను 7 నుంచి 13 శాతం వరకు పెంచింది. గత నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది. ఎడెల్వీస్ అంచనాల ప్రకారం.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌యుఎల్ వివిద కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను సంవత్సరానికి 8 శాతం పెంచింది. ఈ ధరలు పెరగడటానికి ప్రధాన కారణం ముడిసరుకుల ధరల పెరగడమే అని కంపెనీ చెబుతూ వస్తుంది. (చదవండి: ఉబర్ రైడ్ చేసే కస్టమర్లకు గుడ్ న్యూస్..!) -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!
ముంబై: దేశంలోని అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఈ నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే సరుకుల ధరలను పెంచినట్లు సంస్థ తెలిపింది. గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచింది. ఈసారి అత్యధికంగా సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర పెరిగింది. దీని ధరను 20 శాతం పెంచడంతో సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. పెరిగిన సరుకుల ధరలు: లైఫ్ బోయ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.31కు పెరిగింది. పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి రూ.83కు పెరిగింది. రిన్ బండిల్ ప్యాక్(నాలుగు 250 గ్రాముల బార్ల) ధరను రూ.72 నుంచి రూ.76కు పెంచింది. అలాగే, సింగిల్ రిన్ 250 గ్రాముల బార్ ను రూ.18 నుంచి రూ.19కు పెంచింది. వీల్ డిటర్జెంట్ పౌడర్ అర కిలో ప్యాక్ ధరను రూ.30 నుంచి రూ.31కి, 1 కిలో ప్యాక్ ధరలను రూ.60 నుంచి రూ.62కు పెంచింది. హెచ్‌యుఎల్ భాటలో ఇతర కంపెనీలు.. లక్స్ సబ్బుల ధరలను కంపెనీ పెంచ లేదు. ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరగడంతో జనవరిలో తన ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5-8 శాతం, బాస్మతి బియ్యం ధరలను 8-10 శాతం పెంచనున్నట్లు అదానీ విల్మార్ గత నెలలో పేర్కొంది. పార్లే ప్రొడక్ట్స్ మార్చి నెలలో 4-5 శాతం ధరలను పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ధరలను పెంచింది. ఈ ఏడాది క్యూ4లో ధరలను పెంచవచ్చని డాబర్ ఇండియా డిసెంబర్ నెలలో తెలిపింది. కావింకేర్ తన షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను కూడా ఈ నెలలో 2-3 శాతం వరకు పెంచనుంది. ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరగడంతోనే ధరలను పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి. (చదవండి: నాలుగు రోజుల్లో రూ.6.08 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..!) -
కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ విజృంభన, కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, ప్రభుత్వాల ఆంక్షలు మొదలుకావడం వంటి అంశాల నేపథ్యంలో పారిశ్రామిక మండలి-ఫిక్కీ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఆంక్షలు విధించడానికి మొత్తం కేసుల సంఖ్య పెరుగుదలను, పాజిటివ్ రేటును కాకుండా, ఆసుపత్రుల్లో చేరికల సంఖ్యేనే ప్రాతిపదికగా తీసుకోవాలని కోరింది. ప్రత్యేకించి క్రిటికల్ కేర్ బెడ్స్, ఆక్సిజన్ లభ్యత వంటి అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాని కోరింది. ఫిక్కీ ప్రెసిడెంట్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ హెడ్ సంజయ్ మెహతా ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఒక లేఖ రాశారు. లేఖలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని చెప్పడం నుంచి సినిమా హాళ్లను మూసివేయడం-రెస్టారెంట్లలో భోజనం చేయడం వరకు పలు ఆంక్షలను స్థానికంగా అధికారులు విధిస్తున్నారు. దీని ప్రభావంపై భారత్ కార్పొరేట్ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలే బలహీనంగా ఉన్న ఆర్థిక రికవరీపై ఈ ఆంక్షలు తదుపరి మరింత ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం దాదాపు 14 రోజుల వరకూ ఉన్న హోమ్ క్వారంటైన్ కాల పరిమితిని 5 రోజులకు తగ్గించండి. మొత్తం జనాభాకు బూస్టర్ డోస్ తప్పనిసరి చేయండి. 12 సంవత్సరాల పిల్లలనూ వ్యాక్సినేషన్ పరిధిలోనికి తీసుకుని రావాలి. అందుతున్న డేటా ప్రకారం చాలా మంది రోగులు 3-5 రోజులలోపు కోలుకునే పరిస్థితి ఉంది. అందువల్ల వ్యక్తిగత క్వారంటైన్ కాలపరిమితిని ఐదు రోజులకు పరిమితం చేయాలి. ఆరోగ్య సంరక్షణ కార్మికుల విషయంలో ఈ నిర్ణయం ఎంతో కీలకం. ఎందుకంటే ఎక్కువ కాలం క్వారంటైన్లో ఉండే పరిస్థితి ఉంటే, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికుల కొరత వంటి క్లిష్ట సమస్యలు ఎదురుకావచ్చు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తక్కువ క్వారంటైన్ సమయం పాటిస్తుండడం గమనార్హం. సవాళ్లను ఎదుర్కొనగలిగే స్థాయిలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక వ్యవస్థ పెంచాలి. హాస్పిటలైజేషన్, క్రిటకల్ కేర్ బెడ్స్, ఆక్సిజన్ లభ్యత ప్రాతిపదికన ఆంక్షలు దాదాపు స్థానికంగా పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవాలి. జీవితాలు-జీవనోపాధిని సమతుల్యం చేసే ప్రధాన ధ్యేయంతో జాతీయ స్థాయిలో తగిన సమన్వయ వ్యూహం ఉండాలి. రాష్ట్రం, నగరం, మునిసిపాలిటీ.. అన్నిచోట్లా ఒకేవిధమైన ఆంక్షలు మహమ్మారిని వ్యాప్తిని అరికట్టడానికి దోహదపడవు. పైగా ఆర్థిక రికవరీకి ఇబ్బందిగా మారతాయి. మహమ్మారి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే ప్రత్యేక దృష్టి అవసరం. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా ఇటీవలి కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అయితే శాస్త్రీయ హేతుబద్ధత, తగిన డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ విస్తృతి వంటి చర్యలతో భారతదేశం కోవిడ్–19కి వ్యతిరేక పోరాటంలో మరోసారి విజయం సాధించగలదని పరిశ్రమ విశ్వసిస్తోంది. అంతా ఒకే గాటన కట్టవద్దు: సీఐఐ మహమ్మారిని అరికట్టడానికి అన్ని ప్రాంతాలనూ ఒకే గాటన కట్టరాదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఒక ప్రత్యేక ప్రకటనలో రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. అంటువ్యాధిని అరికట్టడానికి ‘మైక్రో-కంటైన్మెంట్ వ్యూహాన్ని’ అవలంభించాలని, మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. (చదవండి: రుణాలు తీర్చాల్సిన బాధ్యత టెల్కోలదే: కేంద్ర మంత్రి వైష్ణవ్) -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ల ధరలు
దేశంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద కూడా కనిపిస్తుంది. సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్), ఐటీసీ లిమిటెడ్ పేర్కొన్నాయి. దేశంలోని రెండు ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు ఇన్ పుట్ ఖర్చుల గణనీయంగా పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచినట్లు తెలిపాయి. హెచ్‌యుఎల్ తన 1 కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను 3.4 శాతం(రూ.2) పెంచింది. అలాగే, వీల్ పౌడర్ 500 గ్రాముల ప్యాక్ ధరను 2 రూపాయలు పెంచడంతో అంతిమ ధర రూ.28 నుంచి రూ.30కి పెరిగింది. ఇంకా, రిన్ బార్ 250 గ్రాముల ప్యాక్ ధరలను 5.8 శాతం పెంచింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం(రూ.25) పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ 100 గ్రాముల ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ వారి ప్యాక్ ధరలను 9 శాతం పెంచినట్లు సమాచారం. 150 మిలీ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 మిలీ బాటిల్ కు ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను కంపెనీ 7.1 శాతం పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. "ఇన్ పుట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో పరిశ్రమ ధరలను పెంచినట్లు" పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను మాత్రమే కంపెనీ పెంచినట్లు ఆయన తెలిపారు. మొత్తం ధరల పెంపును వినియోగదారుల మీద వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?) -
HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు సిద్ధంగా ఉంది. పామాయిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటగదిని దాటి బాత్రూమ్ని చేరాయి. ఇప్పటికే వంట నూనెల ధరతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు సబ్బులు మరో షాక్ ఇవ్వనున్నాయి. పామ్ ఆయిల్ ఎఫెక్ట్ సబ్బు తయారీలో పామ్ ఆయిల్ ఉత్పత్తులు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా పామ్ ఆయిల్ దిగుబడి తగ్గిపోయింది. దీంతో పామ్ ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఈ కారణాన్ని చూపుతూ స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. యూనీలీవర్ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తులపై రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు సీఎన్‌బీసీ పేర్కొంది. స్నానపు సబ్బులు, డిటర్జెంట్ సబ్బులు, పౌడర్ల ధరలను కనీసం 3.5 శాతం నుంచి 14 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. గ్రాముల్లో తగ్గింపు ప్రీమియం కేటగిరి, ఎక్కుడ డిమాండ్ ఉన్న ఐటమ్స్ విషయంలో ధరలు పెంచేందుకు హిందూస్థాన్ యూనిలీవర్ మొగ్గుచూపుతుండగా సాచెట్స్, తక్కువ ధరకు లభించే ఐటమ్స్ విషయంలో ధరల పెంపుకు సుముఖంగా లేదు. అయితే ధరల పెంపుకు బదులు ఆయా వస్తువుల సైజు తగ్గించాలని నిర్ణయించింది. అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారుడిపై నేరుగా భారం పడకుండా గ్రాముల్లో కోత విధించనుంది. చదవండి: ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!! -
హెచ్‌యూఎల్ లాభం రూ. 1,974 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిమాండ్ పుంజుకుంటోందనడానికి సూచనగా కంపెనీ లాభాలు, ఆదాయాలు పెరిగాయి. క్యూ2లో హెచ్‌యూఎల్ రూ. 1,974 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,818 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 9 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో అమ్మకాలు రూ. 9,931 కోట్ల నుంచి సుమారు 16 శాతం పెరిగి రూ. 11,510 కోట్లకు పెరిగాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ మొత్తం వ్యయాలు రూ. 7,885 కోట్ల నుంచి రూ. 9,054 కోట్లకు చేరాయి. రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 14 మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. ‘సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ మేం లాభదాయక వృద్ధి నమోదు చేశాం. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేయడం కొనసాగిస్తాం‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. గడ్డు పరిస్థితులు గట్టెక్కినట్లేనని వ్యాఖ్యానించారు. తమ కార్యకలాపాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఓ మోస్తరుగానే ఉందని మెహతా చెప్పారు. విభాగాలవారీగా చూస్తే.. ఫుడ్, రిఫ్రెష్మెంట్ వ్యాపార విభాగం అమ్మకాలు క్యూ2లో దాదాపు 83 శాతం ఎగిశాయి. హోమ్‌కేర్, సౌందర్య .. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరాయి. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్‌కి చెందిన హెల్త్ డ్రింక్స్ (హార్లిక్స్ మొదలైనవి) కూడా పోర్ట్‌ఫోలియోలో చేరడం సంస్థ ఆదాయాలకు ఊతమిచి్చంది. హార్లిక్స్‌తో కలిపితే ఆరోగ్య పానీయాల విభాగం 16 శాతం వృద్ధి నమోదు చేసింది. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు స్వల్ప నష్టంతో రూ. 2,172 వద్ద ముగిసింది. -
పల్లె ఆర్థికంగా బలపడితేనే.. మహిళా సాధికారత
సాక్షి, అమరావతి: మహిళల స్వయం సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వారి జీవితాలను మార్చే క్రమంలో ఇటీవలే గుజరాత్‌కు చెందిన అమూల్‌తో ఒప్పందం చేసుకోగా.. తాజాగా సోమవారం మరో నాలుగు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను సర్కారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. – అణగారిన వర్గాల వారికి చేయూతనివ్వకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయకుండా ఎలాంటి మార్పులను తీసుకురాలేం. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయకుండా ఎలాంటి ఫలితాలు సాధించలేం. – అందుకే మా ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టిపెట్టింది. వారి జీవితాలను మార్చేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభిస్తున్నాం. – దీని ద్వారా రూ.4,500 కోట్లను మహిళలకు అందజేస్తాం. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత ఉన్న మహిళలకు ఈ ‘చేయూత’ను అందిస్తున్నాం. – దీనికింద ఎంపికైన మహిళలకు ఏటా రూ.18,750లు చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తాం. – చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలామందికి ‘వైఎస్సార్ ఆసరా’ కూడా వర్తిస్తుంది. – ఏటా దాదాపు రూ.6,700 కోట్లను ‘ఆసరా’ కింద ఇస్తాం. సెప్టెంబరులో దీనిని కూడా అమలుచేస్తాం. – ఇలా ఈ రెండు పథకాలకు ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్లను దాదాపుగా కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నాం. – ఈ సహాయం.. వారికి స్థిరమైన ఉపాధి, ఆదాయం ఇచ్చేదిగా ఉండాలి. – ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుంది. – ప్రభుత్వం చేయూతనిస్తుంది.. బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుంది. – మహిళల స్వయం సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. – ఈ కంపెనీలన్నీ ముందుకు వచ్చి మహిళలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా సహకారం అందించాలి. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎం అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం మహిళలు సాధికారిత సాధించడం అంటే.. కుటుంబం వృద్ధిలోకి వస్తున్నట్లే. ముఖ్యమంత్రి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ముఖ్యమైనది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషకరం. మహిళలకు చేయూతనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేయూత పథకం మైలురాయిగా నిలిచిపోతుంది. సమగ్రాభివృద్ధి కోసం సీఎం చేస్తున్న ప్రయత్నాలు ముందుకుసాగాలని ఆకాంక్షిస్తున్నాం. – సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏడాదిలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు ఏడాది కాలంగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు. ఆర్థిక సామాజిక రంగాల్లో ఈ సంస్కరణలు పెనుమార్పులు తీసుకువస్తాయి. మహిళల సాధికారత ద్వారా అభివృద్ధి సాధించాలన్న సీఎం ఆలోచన మంచి మార్పులకు నాంది. వైఎస్సార్ చేయూత కార్యక్రమం పేదరికాన్ని నిర్మూలించడంలో కీలకమైనది. సామాజిక రంగంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. మేం కూడా ఆ దిశగా కార్యకలాపాలు చేస్తున్నాం. – సంజీవ్ పూరి, ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎం దార్శినికత బాగుంది ముఖ్యమంత్రి దార్శినికత బాగుంది. శిక్షణ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు మా కంపెనీ సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ చేయూత పథకం గొప్ప అవకాశాలను కల్పిస్తోంది. మేం భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మా అనుభవాలను పంచుతాం. మీతో కలిసి ముందుకు సాగుతాం. – మధుసూదన్ గోపాలన్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ సీఈఓ, ఎండీ సీఎం జగన్ సమక్షంలో ఒప్పందాలు అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సెర్ప్ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్ మేనేజర్ జోసెఫ్ వక్కీ, ఐటీసీ డివిజనల్ సీఈఓ రజనీకాంత్ కాయ్, హెచ్‌యూఎల్ జీఎస్ఎం చట్ల రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐటీసీ గ్రూప్ హెడ్ సంజీవ్ రాంగ్రాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌లో మహ్మద్ అన్సారి, క్లస్టర్ సీఈఓ, ఏపీ–తెలంగాణ.. జెబాఖాన్, వైస్‌ప్రెసిడెంట్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ పాల్గొన్నారు. -
‘ఫెయిర్’ పోయి.. ‘గ్లో’ వచ్చింది..
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల ఆదరణ చూరగొన్న ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మార్చినట్టు హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) గురువారం ప్రకటించింది. ఉత్పత్తి పేరు నుంచి ఫెయిర్ అన్న పదాన్ని తొలగించింది. అందానికి సంబంధించి సానుకూల దృక్పథాన్ని దృష్టిలో తీసుకుని నూతన పేరును నిర్ణయించినట్టు వివరించింది. వచ్చే కొన్ని నెలల్లో గ్లో అండ్ లవ్లీ పేరుతో ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని, భవిష్యత్తు ఆవిష్కరణలు సైతం ఈ దిశగానే ఉంటాయని పేర్కొంది. పురుషులకు సంబంధించిన సౌందర్య సాధనాలను గ్లో అండ్ హ్యాండ్సమ్గా పిలవనున్నట్టు హెచ్‌యూఎల్ తెలిపింది. అందానికి సంబంధించి సంపూర్ణ అర్థాన్నిచ్చే దృష్టితో ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ పదాన్ని తొలగిస్తున్నట్టు హెచ్‌యూఎల్ గత నెల 25న ప్రకటించింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఎఫ్ఎంసీజీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను ఇప్పటికే నిలిపివేయగా, ఫ్రెంచ్ కంపెనీ ఎల్ఓరియల్ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వైటెనింగ్ పదాలను తొలగించనున్నట్టు గత వారం ప్రకటించింది. ఆగ్రహించిన ఇమామీ! హెచ్‌యూఎల్ తాజా చర్యలపై పోటీ సంస్థ ఇమామీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త పేరు తమ ఉత్పత్తి పేరును పోలి ఉండడంతో న్యాయ నిపుణులను సంప్రదించనున్నట్టు ప్రకటన చేసింది. ‘‘షాక్‌కు గురైనప్పటికీ.. హెచ్‌యూఎల్ అనుచిత వ్యాపార విధానాల పట్ల ఆశ్చర్యమేమీ కలగలేదు. మా బ్రాండ్ ‘ఇమామీ గ్లో అండ్ హ్యాండ్సమ్’ను వారం క్రితమే డిజిటల్‌గా ఆవిష్కరించాం. ఇందుకు సంబంధించి అనుమతులకు దరఖాస్తు కూడా చేసుకున్నాం’’ అని ఇమామీ తెలిపింది. ఇమామీ పురుషుల సౌందర్య సాధనం పేరు ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్’గా ఇప్పటి వరకు మార్కెట్లో ఉంది. -
ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’
సాక్షి, న్యూఢిల్లీ: ‘హిందుస్థాన్ యూనిలివర్’ కంపెనీ నుంచి వెలువడుతున్న ‘ఫేర్ అండ్ లవ్లీ’ అనే ఉత్పత్తి బ్రాండ్ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ బ్రాండ్ ప్రచారం కోసం కంపెనీ మొదటి నుంచి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ వస్తోంది. తాజాగా ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరును మారుస్తూ హిందూస్తాన్ యూనిలివర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరు స్థానంలో ‘గ్లో అండ్ లవ్లీ’తో ఫేర్నెస్ క్రీమ్‌ను మార్కెట్ చేయనున్నట్లు ఆ సంస్థ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చోటు చేసుక్ను వర్ణవివక్ష హత్య ఉదంతం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ పేర్కొంది. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..) ఇక ‘ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ అనే పదం మాయం కానుంది. ఫేర్ అనే పదం మనిషి చర్మం తెలుపు రంగును సూచిస్తున్న విషయం తెల్సిందే. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండ్ పేర్ల నుంచి, వాణిజ్య ప్రకటనల నుంచి ఫేర్, ఫేర్నెస్ పదాలతోపాటు ‘వైటెనింగ్, లైటనింగ్’ అనే పదాలను కూడా తొలగించాలని నిర్ణయించింది. ’ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ పదాన్ని తొలగిస్తానని చెప్పిన కంపెనీ ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్కడా తెలియజేయలేదు. చర్మ రంగును తెలుపు చేస్తుందన్న ప్రచారంతోని ఆ కంపెనీ ఆ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ ఉత్పత్తి అలాగే కొనసాగించాలనుకుంటే ‘చర్మ సౌందర్యం కోసం’అని మార్చుకోవచ్చు. అదే విధంగా ‘స్కిన్ వైటెనింగ్’ ఉత్పత్తులను ఉపసంహరించుకొంటున్నామని ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రామాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ ‘చర్మ సౌందర్యం కోసం’ అంటుందా, మరో పేరు పెడుతుందా ? చూడాలి. ఈ రెండు కంపెనీల తరహాలోనే ‘వైటెనింగ్’ పేరిట లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఇతర కొస్మోటెక్ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నింటిని తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి ‘స్కిన్ కేర్’ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి. వాస్తవానికి ఆ ఉత్పత్తులేవీ కూడా స్కిన్ కేర్ కిందకు రావు. ‘బ్లాక్ ఈజ్ బ్యూటీ (నలుపే అందం)’ అన్న ప్రచారం భారత్‌లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎన్నడూ స్పందించని ఈ కంపెనీలు ఇప్పుడు స్పందించడానికి అమెరికాలో కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే ఉద్యమమే కారణం. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేత జాతీయుడైన అమెరికా పోలీసు అన్యాయంగా చెప్పడంతో అక్కడ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఉధృతమైంది. పుట్టుకతో వచ్చే మనిషుల చర్మం రంగు మధ్యలో మారదని, మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకు మరినప్పుడు అక్కడి ఉష్ణ లేదా శీతల పరిస్థితుల్లో చర్మం రంగులో కొంత మార్పు వస్తుందిగానీ, మందులతో మార్పు రాదని వైద్య విజ్ఞానం మొదటి నుంచి చెబుతున్నా నలుపును తెలుపు చేస్తామంటున్న వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూ వస్తోంది. -
యూనిలీవర్ బాటలోనే లోరియల్ కూడా..
న్యూఢిల్లీ: పోలీసుల కస్టడీలో చనిపోయిన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రారంభమైన నిరసనల సెగ ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థలకు తగిలింది. ఈ నేపథ్యంలో హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ తన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఫెయిర్‌నెస్ క్రీం పేరులో నుంచి ‘ఫెయిర్’ పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్ కూడా యూనిలీవర్ బాటలోనే పయనిస్తుంది. ఈ క్రమంలో చర్మ సౌందర్యాన్ని పెంచే తమ ఉత్పత్తుల ప్యాక్‌ల మీద ‘వైట్, ఫెయిర్, లైట్’ పదాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..) ఆసియా, ఆఫ్రికన్, కరేబియన్ దేశాలలో తెల్లని మేనిఛాయే సౌందర్యానికి ప్రామాణికమనే భావన ఏన్నో ఏళ్లుగా పాతుకు పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనిలీవర్, లోరియల్ కంపెనీలు స్కిన్ వైట్నింగ్ క్రీములను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషయంలో గ్లోబల్ మార్కెట్లో ఈ కంపెనీల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నది. లోరియల్ ఉత్పత్తులలో గార్నియర్ స్కిన్ నేచురల్స్ వైట్, కంప్లీట్ మల్టీ యాక్షన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉన్నాయి. మరో కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో విక్రయించే తన స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ న్యూట్రోజెనా, క్లీన్ అండ్ క్లియర్ ఉత్పత్తులను అమ్మడం మానేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..
న్యూఢిల్లీ: తెల్లని మేనిఛాయే సౌందర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రామాణికమనే విధంగా అనేక సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ తాజాగా కొత్త మార్పులకు లోను కానుంది. రీబ్రాండింగ్ కసరత్తులో భాగంగా ఉత్పత్తి పేరు మార్చనున్నట్లు ఫెయిర్ అండ్ లవ్లీ తయారీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హెచ్‌యూఎల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని వర్ణాలకు ప్రాధాన్యమిచ్చేలా ఇకపై తమ చర్మ సౌందర్య సాధనాల పోర్ట్‌ఫోలియో ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘ఇకపై ఫెయిర్ అండ్ లవ్లీతో పాటు హెచ్యూఎల్కి చెందిన మిగతా స్కిన్‌కేర్ సాధనాల పోర్ట్‌ఫోలియో కూడా సౌందర్యానికి సంబంధించి కొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించే విధంగా ఉంటుంది‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీకి సంబంధించి కొత్త పేరు గురించి దరఖాస్తు చేసుకున్నట్లు, నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాక త్వరలోనే దీన్ని ప్రకటించనున్నట్లు మెహతా తెలిపారు. మరికొద్ది నెలల్లో మారిన పేరుతో ఈ ఉత్పత్తి మార్కెట్లో లభ్యమవుతుందని వివరించారు. అలాగే మహిళల విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు ఇచ్చేందుకు 2003లో ఏర్పాటు చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్‌కు కూడా త్వరలో కొత్త పేరు ప్రకటించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. ఫెయిర్, ఫెయిర్‌నెస్, వైట్, వైటెనింగ్, లైట్, లైటెనింగ్ వంటి పదాలన్నింటినీ తమ ఉత్పత్తుల ప్యాక్‌లు, ప్రకటనల నుంచి తొలగించనున్నట్లు హెచ్‌యూఎల్ మాతృసంస్థ యూనిలీవర్ వెల్లడించింది. బ్రాండ్ పేరు మార్చాలంటూ చేంజ్డాట్ఆర్గ్ ద్వారా సంతకాల ఉద్యమం చేస్తున్న కార్యకర్తలు హెచ్‌యూఎల్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఫెయిర్ అండ్ లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: జాతి వివక్ష, సౌందర్య ప్రామాణికతపై ప్రపంచవ్యాప్త చర్చ నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రధాన బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నుండి ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు దీన్ని రీబ్రాండ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఫెయిర్ అండ్ లవ్లీకి చేసిన మార్పులతో పాటు, మిగిలిన చర్మ సంరక్షణ పోర్ట్‌ఫోలియో కూడా ‘పాజిటివ్ బ్యూటీ, సమగ్ర దృష్టిని’ ప్రతిబింబిస్తుందని పేర్కొంది. రెగ్యులేటరీ ఆమోదం తరువాత రాబోయే కొద్ది నెలల్లో పేరును ప్రకటిస్తామని కంపెనీ భావిస్తోంది.(ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్ నుంచి జేజే ఔట్!) ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకేజీమీద ‘ఫెయిర్/ఫెయిర్‌నెస్’, ‘వైట్ వైట్నింగ్’ ‘లైట్ / మెరుపు’ వంటి పదాలను కూడా తొలగించినట్లు హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా వెల్లడించారు. ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ పై ఉండే రెండు ముఖాలతో పాటు ఉండే మరో (నల్ల)ముఖాన్ని తొలగించామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం అనంతరం కొత్త పేరుతో మరికొద్ది నెలల్లో వినియోగదారుల ముందుకు రానున్నామని వెల్లడించారు. గత దశాబ్దంలో మహిళల సాధికారత సందేశంతో ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీనికి ప్రజలనుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా వివిధ స్కిన్ టోన్ల మహిళలను గౌరవిస్తూ, వారి ప్రాతినిధ్యంతో విభిన్నంగా ఇవి ఉండబోతున్నాయన్నారు. భారతదేశంలో విక్రయించే రెండు ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ మల్టీనేషనల్ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన వారం తరువాత హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. అయితే ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే సౌందర్య ఉత్పత్తులను నిలిపివేయడం కాకుండా..కేవలం పేరు మార్చేందుకు నిర్ణయించడం గమనార్హం. కాగా కంపెనీకి సంబంధించి ప్రధాన ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ. వార్షిక అమ్మకాల విలువ 560 మిలియన్ల డాలర్లు. భారతీయ స్కిన్ వైట్నింగ్ మార్కెట్ లో 50-70శాతం ఫెయిర్ అండ్ లవ్లీ సొంతం. -
కరోనా : 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత
సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) కోవిడ్ -19 (కరోనా వైరస్) వ్యతిరేక పోరాటంలో తన వంతుగా ముందుకు వచ్చింది. భారతదేశంలో కరోనా వైరస్‌తో పోరాడటానికి రూ .100 కోట్లను సాయం అందిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది. వ్యక్తిగత, గృహ పరిశుభ్రతకు ఉపయోగించే ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించనున్నామని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్ధం ముఖ్యంగా లైఫ్‌బాయ్ శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్ వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరలను 15 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. తగ్గించిన ఈ ధరల ఉత్పత్తుల ఉత్పత్తిని వెంటనే ప్రారంభిస్తున్నామనీ, ఇవి రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లో లభిస్తాయని మీడియా ప్రకటనలో తెలిపింది. అంతేకాదు రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బులను ఉచితంగా పంపిణీ చేస్తామని హెచ్‌యుఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా తెలిపారు. లైఫ్‌బాయ్ శానిటైజర్స్, లైఫ్‌బాయ్ హ్యాండ్ వాష్ లిక్విడ్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ఉత్పత్తిని కూడా వేగవంతం చేశామనీ, రాబోయే వారాల్లో దీనిని మరింత పెంచడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తమలాంటి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందనీ, ప్రపంచ ఆరోగ్య విపత్తును అధిగమించేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. మరోవైపు సబ్బుల తయారీకి అవసరం అయ్యే ముడిసరుకుల ధరలు పెరిగినా సబ్బుల ధరలను తగ్గిస్తున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి. పతంజలి, గోద్రెజ్ తదితర సంస్థలు కూడా తమ సబ్బుల ధరలను 12.5 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపాయి. కాగా సరఫరా కంటే డిమాండ్ ఎక్కువ కాడంతో హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఈ ధరలపై నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం వీటి కొరత నేపథ్యంలో అక్రమాలను నిరోధించేందుకు వీటి ధరలపై ఆంక్షలు విధిస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. 200 మి.లీ బాటిల్ హ్యాండ్ శానిటైజర్ ధర రూ.100 మించరాదని, అలాగే సర్జికల్‌మాస్క్‌ల ధరలు, రూ. 8 రూ.10 మించకూడదని ఆయన వెల్లడించారు. 2020 జూన్ 30 వరకు ఈ ధరలను కట్టుబడి ఉండాలని,లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,848 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,848 కోట్ల నికర లాభం(స్టాండ్అలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో ఆర్జించిన నికర లాభం(రూ.1,525 కోట్లు)తో పోలి్చతే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. గృహ సంరక్షణ, సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగాల ఉత్పత్తుల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్ మెహతా చెప్పారు. గత క్యూ2లో రూ.9,138 కోట్లుగా ఉన్న మొత్తం అమ్మకాలు ఈ క్యూ2లో రూ.9,708 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఆరి్థక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.11 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. డిమాండ్ సమస్యలు కొనసాగుతాయ్.... ఈ క్యూ2లో నిర్వహణ లాభం 21 శాతం వృద్ధితో రూ.2,443 కోట్లకు పెరిగిందని మెహతా పేర్కొన్నారు. గత క్యూ2లో 23.7 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ2లో 24.8 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆరి్థక మందగమన కాలంలోనూ మంచి వృద్ధి సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. మార్జిన్లు నిలకడగా మెరుగుపడుతున్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో డిమాండ్ పరంగా సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గృహ సంరక్షణ విభాగం ఆదాయం గత క్యూ2లో రూ.3,080 కోట్లు ఉండగా, ఈ క్యూ2లో రూ.3,371 కోట్లకు పెరిగిందని మెహతా చెప్పారు. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగం ఆదాయం రూ.4,316 కోట్ల నుంచి రూ.4,543 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆహార, రిఫ్రెష్మెంట్ విభాగం ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.1,847 కోట్లకు చేరిందన్నారు. విల్లెమ్ ఉజేన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ–సప్లై చెయిన్)గా నియమించామని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆయన కంపెనీ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతారని పేర్కొన్నారు. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. సానుకూల అంచనాల కారణంగా బీఎస్ఈలో హిందుస్తాన్ యూని లివర్ షేర్ 0.5 శాతం లాభంతో రూ.2,015 వద్ద ముగిసింది. -
వాళ్లని ఉతికితే.. మరకలు పోతాయి!
‘మరక మంచిదే’ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్ యూనీలివర్ రూపొందించిన సరికొత్త యాడ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న హెచ్‌యూఎల్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ #boycottSurfexcel పేరిట నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘హిందుత్వాన్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచేలా యాడ్ రూపొందించిన సర్ఫ్ ఎక్సెల్‌ను నిషేధించాలి. హిందూ బాలికను, ముస్లిం బాలుడిని ఎంచుకుని లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే హోలి రంగులను మరకలు అని ఎలా అంటారు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇంత అందమైన ఫిల్మ్‌ను రూపొందించిన వారికి ధన్యవాదాలు. ఈ యాడ్‌ను వ్యతిరేకించడమంటే భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం భావనకు విరుద్ధంగా వ్యవహరించినట్లే’ అని ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి.. ‘నాదొక మంచి సలహా. భక్తులను సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతకాలి. ఎందుకంటే మరకలు పోగొట్టడమే కదా సర్ఫ్ పని’ అని వ్యంగంగా ట్వీట్ చేసి సర్ఫ్ ఎక్సెల్‌కు అండగా నిలిచారు. ఆ యాడ్‌లో ఏముందంటే... హోలి పండుగ రోజు ముస్లిం బాలుడు, హిందూ బాలిక కలిసి సైకిల్‌పై వెళ్తూంటారు. వైట్ డ్రెస్ ధరించిన ఆ బాలిక హోలి రంగులు పడకుండా తన వెనుక ఉన్న స్నేహితుడిని రక్షిస్తుంది. ఆ తర్వాత అతడిని దగ్గర్లో ఉన్న మసీదులో దిగబెట్టగా అతడు నమాజ్ చేసేందుకు పరిగెడతాడు. నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ మరక మంచిదే అనే ట్యాగ్‌లైన్‌తో ముగుస్తుంది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ యాడ్ ఇప్పటికే దాదాపు 85 లక్షల వ్యూస్ సాధించింది. అయితే హిందుత్వ వాదులు మాత్రం తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు హిందూస్థాన్ యూనీలివర్ చవకబారు చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శిస్తున్నారు. కాగా రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రమోషన్ కోసం హెచ్‌యూఎల్ ఇటీవల రూపొందించిన యాడ్ వివాదాస్పమైన సంగతి తెలిసిందే. ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు మండిపడ్డారు. I have a better suggestion. Bhakts should be washed properly with Surf Excel. Kyunki Surf ki dhulai daag ko karain saaf. https://t.co/YiYrW4AM2j — Mehbooba Mufti (@MehboobaMufti) March 10, 2019 -
చుక్కలు చూపిస్తోన్న చాయ్ యాడ్..
-
చుక్కలు చూపిస్తోన్న చాయ్ యాడ్..
న్యూఢిల్లీ : ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్ యూనీలివర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విటర్లో "#BoycottHindustanUnilever" అనే హాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. సదరు కంపెనీ భారతీయుల మనోభావాలను ముఖ్యంగా హిందువులను, వారి సంప్రదాయలను కించపరుస్తోంది.. కాబట్టి ఆ కంపెనీ ఉత్పత్తులను బ్యాన్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రమోషన్ కోసం రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణం అయ్యింది. ఈ యాడ్‌లో ఓ వ్యక్తి తన ముసలి తండ్రిని వదిలించుకోవడం కోసం కుంభమేళాకు తీసుకువస్తాడు. జన సమూహంలో తన తండ్రిని వదిలేసి ముందుకు వెళ్తాడు. అంతలోనే ఓ తండ్రి తన కుమారుడు జన సమూహంలో తప్పిపోకుండా ఉండటానికి కొడుకు చేతిని తన చేతికి కట్టేసుకుంటాడు. అది చూసి ఆ యువకుడిలో మార్పు వస్తుంది. తండ్రిని వెతుక్కుంటు వెనక్కి వెళ్తాడు. తర్వాత ఇద్దరు కూర్చుని టీ తాగుతారు. ఈ యాడ్‌తో పాటు ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు కొత్త సంప్రదాయాలను తీసుకురాకండి. ఇది కుంభమేళాను, హిందువుల సంప్రదాయాలను అవమానించడమే’ అంటూ మండి పడుతున్నారు. ‘హిందుస్థాన్ యూనీలివర్ ఉత్పత్తులను నిషేధించండి’ అంటూ #BoycottHindustanUnilever" హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా విమర్శించిన వారిలో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ కూడా ఉన్నారు. ‘ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నిజస్వరూపానికి నిదర్శనం ఈ యాడ్. మన దేశాన్ని ఆర్థికంగా, సిద్ధాంతపరంగా తక్కువ చేసి చూపించడమే వారి ప్రధాన అజెండా. వారి వరకూ ప్రతీది చివరకూ ఎమోషన్స్‌ను కూడా వస్తువుగానే పరిగణిస్తారు. ఇలాంటి కంపెనీ ఉత్పత్తులను మనం ఎందుకు నిషేధించకూడదం’టూ రాందేవ్ బాబా ట్వీట్ చేశారు. From East India Co to @HUL_News that’s their true character. Their only agenda is to make the country poor economically & ideologically. Why shld we not boycott them? For them everything, every emotion is just a commodity. For us parents are next to Gods #BoycottHindustanUnilever https://t.co/suozbymLBI — Swami Ramdev (@yogrishiramdev) March 7, 2019 -
ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల గణాంకాలు .. సూచీలకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అంతక్రితం రెండు వారాలు నష్టాల్లో ముగిసిన ప్రధాన సూచీలు.. ఫలితాల నేపథ్యంలో గతవారం పాజిటివ్ ముగింపును నమోదుచేశాయి. ఇక ఈ వారంలో.. ఫలితాలు ప్రకటించే దిగ్గజాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యునిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటు ద్రవ్యోల్బణ సమాచారం, అంతర్జాతీయ అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. 80 కంపెనీల ఫలితాలు.. బీఎస్ఈలో లిస్టైన 80 కంపెనీలు ఈవారంలో (జనవరి 14–19) క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి. సోమవారం ఇండియా బుల్స్ వెంచర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఫలితాలను వెల్లడించనుండగా.. మంగళవారం జీ ఎంటర్టైన్మెంట్, డెన్ నెట్వర్క్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ట్రైడెంట్.. బుధవారం డీసీబీ బ్యాంక్, హెచ్‌టీ మీడియా, మైండ్‌ట్రీ ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్, ఫెడరల్ బ్యాంక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ర్యాలీస్ ఇండియా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫలితాలు ఉండగా.. శుక్రవారం విప్రో, ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్బీఐ లైఫ్, అతుల్, ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఫలితాలను ప్రకటించనున్నాయి. శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలో వెల్లడికానున్న ఫలితాలు, ద్రవ్యోల్బణ డేటా వెల్లడి మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి .. డిసెంబర్ నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. వాణిజ్య శేషాన్ని ప్రభుత్వం మంగళవారం వెల్లడించనుండగా.. జనవరి 11 నాటికి ఉన్నటువంటి విదేశీ మారక నిల్వల సమాచారాన్ని శుక్రవారం ఆర్బీఐ తెలియజేయనుంది. ఇదే రోజున జనవరి 4 నాటికి మొత్తం డిపాజిట్లు, బ్యాంక్ రుణా ల వృద్ధి సమాచారాన్ని ఆర్బీఐ వెల్లడించనుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 6 శాతం ర్యాలీ చేశాయి. గతేడాది డిసెంబర్లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే.. 20 శాతం పెరిగాయి. శుక్రవారం 60.55 వద్ద ముగియగా.. క్రూడ్ ధరల్లో ర్యాలీ కొనసాగితే దేశీ సూచీలకు ప్రతికూల అంశంకానున్నట్లు ఎక్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. ఇక ముడిచమురు ధర పెరుగుదల కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 70.49 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ అంశాలు ఏంచేస్తాయో.. అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ ముగింపు ఎప్పుడనే విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు యురోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలిగే ప్రక్రియకు సంబంధించి మంగళవారం కీలక సమాచారం వెల్లడికానుంది. యూకే ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ ఉపసంహరణ డీల్‌పై బ్రిటిష్ పార్లమెంట్ ఓటు వేయనుంది. ఇక గతవారంలో అమెరికా–చైనాల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఈ చర్చల సారాంశం ఏంటనే విషయంపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. ఈనెలలోని గడిచిన తొమ్మిది సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.3,600 కోట్లను ఉపసంహరించుకున్నారు. జనవరి 1–12 కాలంలో రూ.3,677 కోట్లను వీరు వెనక్కుతీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
హిందుస్తాన్ యూనిలీవర్ లాభం 1,525 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ. 1,525 కోట్ల నికర లాభం(స్టాండలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.1,276 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. వివిధ కేటగిరీల్లో రెండంకెల వృద్ధి సాధించడం, నిర్వహణ పనితీరు బాగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్ మెహతా చెప్పారు. గత క్యూ2లో రూ.8,199 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో 11 శాతం వృద్దితో రూ.9,138 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.9 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఎబిటా 20 శాతం వృద్ధితో రూ.2,019 కోట్లకు, ఎబిటా మార్జిన్ 1.7 శాతం పెరిగి 21.9 శాతానికి పెరిగాయని వివరించారు. డిమాండ్ నిలకడగానే.. కీలకమైన సెగ్మెంట్లను పటిష్టం చేయడంపై దృష్టి సారించడం, వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మంచి లాభాల వృద్ధిని సాధించామని సంజీవ్ వ్యాఖ్యానించారు. వ్యయాల నియంత్రణ వల్ల ముడి పదార్ధాల ధరల పెరుగుదల సమస్యను తట్టుకోగలిగామని, మార్జిన్లను పెంచుకోగలిగామని వివరించారు. సమీప భవిష్యత్తులో డిమాండ్ నిలకడగానే ఉండగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు పెరగడం, కరెన్సీ పతనం వల్ల ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. డొమెక్స్, విమ్, సర్ఫ్ ఎక్సెల్ తదితర బ్రాండ్లతో కూడిన హోమ్ కేర్ కేటగిరీలో కొన్ని ఉత్పత్తుల ధరలను 2–3 శాతం రేంజ్లో పెంచామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాఠక్ తెలిపారు. గత క్యూ2లో రూ.3,910 కోట్లుగా ఉన్న పర్సనల్ కేర్ సెగ్మెంట్ ఆదాయం ఈ క్యూ2లో 10 శాతం వృద్ధితో రూ.4,316 కోట్లకు పెరిగిందని పేర్కొ న్నారు. హోమ్‌కేర్ ఉత్పత్తుల విభాగం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.3,080 కోట్లకు, ఫుడ్, రిఫ్రెష్మెంట్ కేటగిరీ విభాగం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.1,704 కోట్లకు పెరిగాయని వివరిం చారు. ఇక ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా లియో పురిని నియమించామని, ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇక ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.2,559 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలానికి 19 శాతం వృద్ధితో రూ.3,054 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక నికర అమ్మకాలు రూ.17,293 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.18,494 కోట్లకు పెరిగిందని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత హెచ్‌యూఎల్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ 2.6 శాతం లాభంతో రూ.1,569 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
హిందుస్తాన్ యూనిలీవర్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్‌ప్రస్తుత ధర: రూ.1,621 టార్గెట్ ధర: రూ.2,025 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో మంచి వృద్ధినే కనబరిచింది. అదే జోరు రెండో క్వార్టర్లో కూడా కొనసాగవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కంపెనీ వృద్ధి అధికంగా ఉండనున్నది. పట్టణ అమ్మకాల కంటే గ్రామీణ అమ్మకాలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంటాయని అంచనా. విలువ పరంగా చూస్తే 1.3 రెట్లు అధికంగా ఉండొచ్చు. ఈ క్యూ2లో చోటు చేసుకున్న రవాణా సమ్మె, కేరళ వరదలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవచ్చు. ఈ రెండు సమస్యల కారణంగా సరఫరా చైన్‌లో తలెత్తిన సమస్యలు పూర్తిగా సమసిపోయాయని చెప్పవచ్చు. రెండేళ్లలో అమ్మకాలు 6–8% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని కంపెనీ ధీమాగా ఉంది. ప్రకటనల కోసం అధికంగా వ్యయం చేస్తోంది. ఉత్పత్తుల ధరల పెంపు, వ్యయ నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ అధిక ప్రకటనల వ్యయ భారాన్ని తట్టుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్యూ2లో కొన్ని ఉత్పత్తుల ధరలను ఈ కంపెనీ 3–4% రేంజ్లో పెంచింది. ఆ ప్రభావం క్యూ2 ఆర్థిక ఫలితాల్లో కనిపించవచ్చు. ఆయుష్, ఇందులేఖలతో పాటు లక్స్, హమామ్, లైఫ్‌బాయ్ బ్రాండ్లలో అందుబాటులోకి తెచ్చిన నేచురల్ వేరియంట్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ‘విన్నింగ్ మెనీ ఇండియాస్’ వ్యూహంలో వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఉత్పత్తులను అందిస్తోంది. అవసరమైన టెక్నాలజీని అవసరమైన స్థాయిలో వినియోగిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే, అసంఘటిత రంగం నుంచి మార్కెట్ సంఘటిత రంగానికి మళ్లుతుందనే భావన ఉండేది. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అసంఘటిత రంగం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో మార్కెట్ సంఘటిత రంగానికి మళ్లలేదని చెప్పవచ్చు. దీనికి తోడు పోటీ తీవ్రత కొనసాగుతుండటం, అధిక ప్రకటనల వ్యయాల కారణంగా నిర్వహణ మార్జిన్లపై ప్రభావం పడనుండటం.. ప్రతికూలాంశాలు. హీరో మోటొకార్ప్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: సెంట్రమ్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.3,166 టార్గెట్ ధర: రూ.4,009 ఎందుకంటే: ఈ కంపెనీ ఇటీవలనే 200 సీసీ కేటగిరిలో ఎక్స్ట్రీమ్ 200ఆర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియమ్ బైక్ సెగ్మెంట్లోకి ఈ బైక్ ద్వారా ఈ కంపెనీ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. రూ. 89,900(ఎక్స్ షోరూమ్) ధర గల ఈ బైక్ కారణంగా ఈ షేర్ ధర రీరేట్ కాగలదని భావిస్తున్నాం. ఈ సెగ్మెంట్లో అత్యంత చౌక అయిన బైక్ ఇదే. ఈ బైక్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. కంపెనీ బ్రాండ్ పటిష్టంగా ఉండటం, ధర చౌకగా ఉండటం వంటి కారణాల వల్ల మార్జిన్లు అధికంగా ఉండే ప్రీమియమ్ బైక్ సెగ్మెంట్లో ఈ బైక్‌తో కొంత మార్కెట్ వాటాను ఈ కంపెనీ కొల్లగొట్టగలదని భావిస్తున్నాం. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ఆపాచీ ఆర్టీఆర్ 300, ఎన్వీ బైక్‌ల ధరలతో పోల్చితే ఈ ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్ ధర 20–40% తక్కువగా ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ఇక ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్ ధర లభించే స్థాయిల్లోనే ఉన్న ఇతర కంపెనీల 150సీసీ–180 సీసీ బైక్‌లతో పోల్చితే సౌకర్యాలు, ఫీచర్లు ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్‌లోనే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 100–125 సీసీ బైక్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు తదుపరి అప్‌గ్రేడ్ కోసం ఈ బైక్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇటీవలే తన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి క్రికెటర్ విరాట్ కోహ్లితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కోహ్లితో బ్రాండింగ్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకుంటుండటం... సానుకూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
కేరళకు వరుసకట్టిన మ్యాగీ, బిస్కెట్లు, చాక్లెట్లు
న్యూఢిల్లీ : ప్రకృతి విలయతాండవానికి కేరళ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలకు కనీస అవసరాలు కరువయ్యాయి. వీరిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న విరాళాలు తరలివస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారంగా ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను కేరళకు తరలిస్తున్నాయి. ఐటీసీ, కోకా కోలా, పెప్సీ, హిందూస్తాన్ యూనిలివర్ వంటి 12కు పైగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే రెండు రోజుల్లో మరింత ఆహారాన్ని, మంచినీటిని, కనీస వస్తువులను సరఫరా చేస్తామని వాగ్దానం చేసినట్టు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. దిగ్గజ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల అధికారులతో నిన్న జరిగిన భేటీ అనంతరం, ఈ విషయాన్ని ప్రకటించారు. కేరళకు సహాయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఒక్కొక్కరూ సాయం చేయడం కంటే.. అందరూ కలిసి చేయడం ఎంతో మంచిదని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు మంత్రి సూచించారు. హిదూస్తాన్ యూనిలివర్ ఇప్పటికే 9500 కేసుల ఉప్పు, 29వేల కేసుల గోధుమలు, 1000 కేసుల కెచప్, 250 కేసుల స్పైసస్ మిక్స్ మసాలా ఇతర ఉత్పత్తులను సరఫరా చేసింది. నెస్లే ఇండియా 90వేల ప్యాకెట్ల మ్యాగీ, 2 లక్షల ప్యాకెట్ల మచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీ మిల్క్‌ను అందించింది. అదనంగా మరో 40వేల ప్యాకెట్ల మ్యాగీ, లక్షల ప్యాకెట్ల మంచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీలను సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 30వేల ప్యాకెట్ల రెడీ-టూ-డ్రింక్ మిలో, 10వేల ప్యాక్‌ల సెరిగోలను సరఫరా చేయనుంది. ఐటీసీ కూడా 3.30 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను, 2000 బాటిళ్ల సావ్లాన్, 3000 ప్యాకెట్ల డైరీ వైటర్న్, 9000 ప్యాకెట్ల లిక్విడ్ హ్యాండ్ వాష్, 7000 సోపులను పంపనున్నట్టు తెలిపింది. కోకా కోలా ఇప్పటికే 1.4 లక్షల లీటర్ల మంచినీటిని పంపింది. అదనంగా మరో లక్ష లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, దానిలోనే 20వేల బాటిళ్లను కేరళకు తరలించనున్నట్టు వెల్లడించింది. పెప్సీకో కూడా 6.78 లక్షల లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, 10వేల కేజీల క్వాకర్ ఓట్స్‌ను సరఫరా చేసింది. బ్రిటానియా కూడా ఇప్పటికే 2.10 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లనును కొచ్చికి అందించింది. 1.25 లక్షల ప్యాకెట్లను మలప్పురం, వయనాడ్‌కు తరలించింది. వచ్చే రెండు రోజుల్లో మరో 1.25 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను కేరళ ప్రజలకు పంపించనున్నట్టు పేర్కొంది. 3000 బన్స్, 10000 ప్యాకెట్ల బిస్కెట్లను మధురైకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఎంటీఆర్ ఫుడ్ 35వేల ప్యాకెట్ల రెడీ టూ ఈట్‌ను వయనాడ్‌కు పంపించింది. డాబర్ కూడా 30 వేల నుంచి 40వేల వరకు టెట్రా-ప్యాక్ జ్యూస్‌లను, జీఎస్కే ఇండియా రూ.10 లక్షల విలువైన రిలీఫ్ మెటీరియల్స్‌ను, 10 లక్షల హార్లిక్స్ ప్యాకెట్లను, 10 లక్షల క్రోసిన్ టాబ్లెట్లను.. మెరికో 30 టన్నుల ఓట్స్‌ను కేరళ ప్రజలకు పంపించాయి. -
హెచ్‌యూఎల్ లాభం 1,529 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.1,529 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.1,283 కోట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్ యూనిలీవర్ తెలిపింది. అమ్మకాలు మంచి వృద్ధిని సాధించడం, నిర్వహణ పనితీరు బాగుండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం సాధించినట్లు కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్ మెహతా తెలిపారు. మొత్తం ఆదాయం రూ.9,335 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.9,622 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం రూ.1,866 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.2,251 కోట్లకు చేరుకుంది. మార్జిన్ 1.8 శాతం పెరిగి 23.73 శాతానికి ఎగసింది. అంచనాలను మించిన లాభం కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ క్వార్టర్లో రూ.1,525 కోట్ల నికర లాభం సాధించగలదని, నిర్వహణ లాభం రూ.2,192 కోట్లుగా, నిర్వహణ లాభ మార్జిన్ 22.9% ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. లాభం, నిర్వహణ లాభం, లాభ మార్జిన్లు అంచనాలను మించగా, ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ‘చమురు’ ప్రభావం: సమీప భవిష్యత్తులో డిమాండ్ మెల్లమెల్లగా పుంజుకోగలదనే ఆశాభావాన్ని సంజీవ్ మెహతా వ్యక్తం చేశారు. కొత్త ఉత్పత్తులు, మార్కెట్‌ను మరింతగా అభివృద్ధి చేసుకునే అంశాలపై దృష్టిని కొనసాగిస్తామన్నారు. ‘‘ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, కరెన్సీ ఆధారిత ద్రవ్యోల్బణ సమస్యలు తీవ్రంగానే ప్రభావం చూపిస్తాయనేది మా అంచనా. నిర్వహణ సామర్థ్యం మరింతగా మెరుగుపరచుకోవడం ద్వారా ఈ సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలం. నిలకడైన, లాభదాయకమైన, బాధ్యతాయుతమైన వృద్ధిని సాధించడమే మా లక్ష్యం. ఈ క్యూ1లో ఆహార పదార్థాలు, రిఫ్రెష్మెంట్ విభాగాలను విలీనం చేశాం’’ అని మెహతా వివరించారు. హోమ్ కేర్ వ్యాపారం 3% వృద్ధితో రూ.3,146 కోట్లకు, నిర్వహణ లాభం 34 శాతం వృద్ధితో రూ.602 కోట్లకు పెరిగాయని చెప్పారాయన. ‘‘అలాగే బ్యూటీ, పర్సనల్ కేర్ సెగ్మెంట్ 0.9 శాతం వృద్ధితో రూ.4,407 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 7.7 శాతం వృద్ధి చెందింది. ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ వ్యాపారం 8 శాతం వృద్ధితో రూ.1,785 కోట్లకు చేరుకుంది’’ అని వివరించారు. ఈ ఏడాది 30 శాతం పెరిగిన షేర్.. హెచ్‌యూఎల్ ఫలితాలు సోమవారం మార్కెట్ ముగిశాక వెలువడ్డాయి. ఫలితాలు బాగుంటాయనే అంచనాలతో ఈ షేర్ బీఎస్ఈ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,779 ను తాకింది. చివరకు 0.7 శాతం లాభంతో రూ.1,754 వద్ద ముగిసింది. గత ఏడాది 65 శాతం లాభపడిన ఈ షేర్ ఈ ఏడాది ఇప్పటికే 30 శాతం వరకూ పెరిగింది. -
హెచ్‌యూఎల్ నికర లాభం రూ. 1,351 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.1,351 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. హోమ్ కేర్ బిజినెస్ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌యూఎల్ వివరించింది. 2016–17లో ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.1,183 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించామని సంస్థ చైర్మన్ హరీశ్ మన్వాని చెప్పారు. నికర అమ్మకాలు రూ.8,773 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.9,003 కోట్లకు, ఇబిటా 24 శాతం వృద్ధితో రూ.2,048 కోట్లకు పెరిగాయన్నారు. మొత్తం వ్యయాలు రూ.7,349 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.7,181 కోట్లకు చేరాయి. తాజా క్యూ4లో దేశీయ వృద్ధి 16 శాతంగా ఉందని, అమ్మకాలు 11 శాతం పెరిగాయని చెప్పారాయన. ఇబిటా మార్జిన్ 1.6 శాతం వృద్ధితో 22.5 శాతానికి ఎగిసింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.12 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నికర లాభం, అమ్మకాల విషయంలో విశ్లేషకుల అంచనాలను మించిన ఫలితాలను ఈ కంపెనీ ప్రకటించింది. ధరలు పెంచాక కంపెనీ పూర్తి క్వార్టర్‌కు ప్రకటించిన తొలి ఫలితాలివి. పోటీ తీవ్రంగా ఉన్నా, మంచి ఫలితాలు... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.4,490 కోట్లుగా ఉన్న నికర లాభం 16 శాతం లాభంతో రూ.5,227 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు రూ.34,964 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ.35,474 కోట్లకు పెరిగాయి. దేశీయ కన్సూమర్ బిజినెస్ 12 శాతం వృద్ధి చెందిందని, నగదు నిల్వలు 20 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు ఎగిశాయని మన్వానీ తెలిపారు. పోటీ తీవ్రంగా ఉన్నా 2017–18 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించామంటూ ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.ఫలితాలు అంచనాలను మించడం, రూ.12 డివిడెండ్‌ను ఇవ్వనుండడం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్ఈ ఇంట్రాడేలో ఈ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,522ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.1,505 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
ఫెడరల్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.103 టార్గెట్ ధర: రూ.152 ఎందుకంటే: ఈ మిడ్‌సైజ్ ప్రైవేట్ రంగ బ్యాంక్ కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, ఢీల్లీ, ఎన్సీఆర్లతో పాటు 4 కేంద్ర పాలిత రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. ఐడీబీఐతో కలిసి జాయింట్‌వెంచర్‌గా బీమా, ఎన్బీఎఫ్సీ వ్యాపారాలను కూడా నిర్వహిస్తోంది. 1,252 బ్రాంచ్‌లు, 1,679 ఏటీఎమ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఎస్ఎంఈ, రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాంక్ రుణాల్లో ఎస్ఎంఈ రుణాలు 22 శాతంగా, రిటైల్ రుణాలు 38 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ3లో రుణాలు 22 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్) 3.3 శాతంగా ఉంది. నిర్వహణ లాభం 35 శాతానికి ఎగసింది. ఈ జోరు కొనసాగుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది. 18 నెలల కాలంలో 50 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. టైర్–1 మూలధనం 13.8 శాతంగా ఉండడం, స్థూల నికరర్థ రుణాలు, రీస్ట్రక్చరింగ్, తదితర రుణాలన్నీ 5 శాతంలోపే ఉండటం, డిజిటల్ బ్యాంకింగ్ జోరు పెంచుకోవడానికి తీసుకున్న చర్యల ఫలాలు భవిష్యత్తులో అందనుండటం, సానూకూల అంశాలు. 2019–20 కల్లా రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1 శాతంగానూ, ఆర్ఓఈ(రిటర్న్ ఆన్ ఈక్విటీ) 12.3 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 27 శాతం, ఆర్ఈఓ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఈ బ్యాంక్ డిపాజిట్లు అధికంగా ప్రవాస భారతీయుల నుంచే వస్తున్నాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో ఎన్నారైల వాటా 48 శాతంగా ఉంది. హిందుస్తాన్ యూనిలీవర్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రిలయన్స్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.1,363 టార్గెట్ ధర: రూ.1,514 ఎందుకంటే: ఈ ఎఫ్ఎమ్సీజీ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత క్యూ3లో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తక్కువగా ఉండడం వల్ల వృద్ధి కాస్త మందగించింది. ఈ లో–బేస్ ఎఫెక్ట్‌కు పెరుగుతున్న వృద్ధి జోరు జత కావడంతో ఈ క్యూ3లో మంచి ఫలితాలను ఈ కంపెనీ సాధించింది. నికర అమ్మకాలు రూ.8,320 కోట్లకు, ఇబిటా 24% వృద్ధితో రూ.1,680 కోట్లకు పెరిగాయి. అనుబంధ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్ కారణంగా ఇతర ఆదాయం రూ.150 కోట్లు పెరిగి, నికర లాభం 83% ఎగసింది. హోమ్‌కేర్ సెగ్మెంట్ 20 శాతం, పర్సనల్ కేర్ సెగ్మెంట్ 17% చొప్పున వృద్ధి చెందాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తొలగిపోయి డిమాండ్ పుంజుకుంటుండటంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండటంతో స్థూల మార్జిన్లు 3 శాతం పెరిగి 53.1 శాతానికి చేరాయి. జీఎస్టీ సంబంధిత సమస్యలు సమసిపోతుండటంతో రానున్న క్వార్టర్లలో వృద్ధి జోరుగా పెరగగలదని భావిస్తున్నాం. కంపెనీ ఆదాయంలో దాదాపు 40% వరకూ గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. గత రెండేళ్లుగా వర్షాలు విస్తారంగా కురియడం, కీలక పంటల మద్దతు ధరలు పెరగడం, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కారణంగా గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్ బాగా వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆయుర్వేద విభాగంలో మరింతగా విస్తరిస్తోంది. ప్రీమియమ్ ఉత్పత్తుల జోరు పెంచుతోంది. ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 12%, నికర లాభం 18% చొప్పున చక్రగతిన వృద్ధి చెందనున్నాయని అంచనా వేస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
హిందుస్తాన్ యూనిలీవర్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. రూ.1,240 టార్గెట్ ధర: రూ. 1400 ఎందుకంటే: జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నామని, అయితే పూర్తి ప్రతికూల ప్రభావం ఇంకా తొలగిపోలేదని యాజమాన్యం భావిస్తోంది. దక్షిణాది, పశ్చిమ భారత ప్రాంతాల్లో హోల్‌సేల్ అమ్మకాలు సాధారణ స్థాయికి వచ్చాయని, ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకోలేదని పేర్కొంది. కంపెనీ డిస్ట్రిబ్యూటర్లలో అధిక భాగం జీఎస్టీ విధానానికి ఇప్పడిప్పుడే అలవాటు పడుతున్నారు. జీఎస్టీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో మారడానికి కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చు. మొత్తం మీద జీఎస్టీ కారణంగా వ్యవస్థీకృత రంగంలోని ఈ తరహా పెద్ద కంపెనీలకు ప్రయోజనకరమే. జీఎస్టీ పూర్తి ప్రభావం ఈ ఏడాది రెండో క్వార్టర్లో కనిపించవచ్చు. జీఎస్టీ ప్రయోజనాల బదిలీతో టర్నోవర్ ఒకింత తగ్గవచ్చు. జీఎస్టీ అకౌంటింగ్ కారణంగా మార్జిన్లు పెరిగే అవకాశాలు అధికం. వస్తువుల ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయి మార్పులు, చేర్పులు లేవు. గత మూడేళ్లలో నికర లాభం 6%, గత ఐదేళ్లలో 11%, గత పదేళ్లలో 11% చొప్పున చక్రగతిన వృద్ది చెందగా, రానున్న రెండేళ్లలో నికర లాభం 18% చొప్పున చక్రగతిన వృద్ధి చెందవచ్చు. వేదాంత లిమిటెడ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ. రూ.308 టార్గెట్ ధర: రూ. 362 ఎందుకంటే: లండన్‌లో లిస్టైన వేదాంత రిసోర్సెస్‌కు భారత్‌లో అనుబంధ కంపెనీ ఇది. ఇనుము కాకుండా ఇతర లోహాలకు సంబంధించి భారత్‌లో అతి పెద్ద కంపెనీ ఇదే. ఆయిల్, గ్యాస్, జింక్, లెడ్, సిల్వర్, రాగి, ఖనిజాల సంబంధిత ఉత్పత్తితో పాటు విద్యుదుత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి హిందుస్తాన్ జింక్‌లో 64.9 శాతం, చమురు రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెయిర్న్ ఇండియాలో 38.8 శాతం చొప్పున వాటాలున్నాయి. ఒడిశాలోని జర్సుగూడలోని వేదాంత కంపెనీకి చెందిన మూడు విద్యుత్‌ప్లాంట్లపై నిషేధాన్ని ఒడిశా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తొలగించింది. ఈ ప్లాంట్లపై నిషేధం తొలగడంతో ఉత్పత్తి కార్యకలాపాల కోసం అదనంగా విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన భారం వేదాంత కంపెనీకి తప్పింది. మంచి నాణ్యత గల జింక్ గనుల కారణంగా ప్రపంచంలోనే అతి తక్కువ వ్యయాలతో జింక్‌ను ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కెయిర్న్ చమురు అన్వేషణ విజయవంతం, బాల్కో, హిందుస్తాన్ జింక్ల్లో మిగిలిన ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసే అవకాశం, బాక్సైట్, డోలమైట్ మైనింగ్ లైసెన్స్‌ల పొందడం... ఇవన్నీ భవిష్యత్తులో షేర్ ధరను పెంచే ట్రిగ్గర్లు కానున్నాయి. -
హెచ్‌యూఎల్‌లో ఉద్యోగాల కోత
ముంబై: దేశీయ వినియోగ వస్తువుల సంస్థ, మల్టీ నేషనల్ కంపెనీ హిందూస్థాన్ యునిలివర్ ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఏప్రిల్ చివరికనాటికి 10-15శాతం ఉద్యోగాలు తొలగించేందుకు యోచిస్తోంది. డచ్‌కు చెందిన పేరెంటల్ కంపెనీ మాండేటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా మొత్తం మార్కెట్లలో ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో కన్జూమర్ గూడ్స్ కంపెనీ హెచ్ యూఎల్ ఉద్యోగులను ఇంటికి పంపనుంది. దీంతోపాటు కొత్త నియామకాల్లో కూడా కోత పెట్టనుంది. అయితే ఈ వార్తలపై స్పందించడానికి హెచ్‌యూఎల్ నిరాకరించింది. మరోవైపు హెచ్‌యూఎల్ కంపెనీలనుంచి దరఖాస్తులను అందినట్టుగా కొన్ని మల్టీ నేషనల్ కంపనీలు దృవీకరించాయి. మార్జిన్ టార్గెట్లను పెంచుతున్నట్టు హెచ్‌యూఎల్ పేరెంటల్ కంపెనీ గురువారం ప్రకటించింది. యూకే, నెదర్లాండ్స్‌లో రెండు విడి కంపెనీలుగా ఆంగ్లో డచ్ కంపెనీ నిర్మాణాన్ని సమీక్షిస్తున్నట్టు తెలిపింది. కాగా 2015-16 వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా కంపెనీలోమొత్తం 18వేలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 15వందల మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులు -
ఎఫ్ఎంసీజీ దిగ్గజం లాభాలు పెంచేసింది!
ముంబై : ఓ వైపు నుంచి పతంజలి నుంచి గట్టి పోటీ, మరోవైపు నుంచి ఎకానమీలో నగదు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనీలివర్ మెరుగైన లాభాలనే ఆర్జించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 7 శాతం పెంచుకుని, రూ.1038 కోట్లగా నమోదుచేసింది. గత ఆర్థికసంవత్సరంలో ఈ కంపెనీ లాభాలు రూ.971.66 కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ అమ్మకాలు రూ.8,124.48 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం కంటే 1 శాతం తగ్గాయి. అయితే ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఈ క్వార్టర్లో నికర లాభాలు 0.5 శాతం కోల్పోతుందని విశ్లేషకులు అంచనావేశారు. మొత్తం ఆదాయం, లాభాలు పడిపోతాయనుకున్నారు. నికర లాభాల్లో మెరుగైన ప్రదర్శన చూపిన హిందూస్తాన్ యూనీలివర్, ఆదాయాల్లో కొంత పడిపోయింది. ఇన్పుట్ కాస్ట్‌లు పెరగడంతో ఉత్పత్తుల ధరలు 60 బేసిస్ పాయింట్లు పెరిగినట్టు కంపెనీ పేర్కొంది. ఈబీఐటీడీఏలు 5 శాతం తగ్గినట్టు హెచ్‌యూఎల్ తెలిపింది. నగదు కొరత పరిస్థితులు మార్కెట్‌పై తాత్కాలిక ప్రభావం చూపిందని కంపెనీ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులకు సంకేతాలు వెలువడుతున్నాయని, తమ వాల్యుమ్ గ్రోత్, మార్జిన్లను మెరుగుపరుచుకోవడం కోసం నూతనావిష్కరణలపై ఎక్కువగా ఫోకస్ చేస్తామన్నారు. హోమ్ కేర్ సెగ్మెంట్ మెరుగైన ప్రదర్శన చూపిందని, సర్ఫ్‌లో రెండింతలు వృద్ధి సాధించామన్నారు. -
పతంజలికి హిందూస్తాన్ యూనిలివర్ కౌంటర్
ముంబాయి : ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో మరో యుద్ధానికి తెరలేవబోతుంది. 1980లో నెలకొన్న వీల్ వర్సెస్ నిర్మా యుద్ధానికి సీక్వెల్‌గా దేశీయ దిగ్గజ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ హిందూస్తాన్ యూనిలివర్, ఆయుర్వేదిక్ ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న పతంజలితో పోటీకి సిద్ధమైంది. పతంజలికి కౌంటర్‌గా తను కూడా ఆయుర్వేద పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను లాంచ్ చేయాలని హిందూస్తాన్ యూనిలివర్ నిర్ణయించింది. టూత్‌పేస్ట్, స్కిన్ కేర్ నుంచి సోప్స్, షాంపుల వరకు దాదాపు 20 ఉత్పత్తులను ప్రస్తుత ఆయుర్వేద బ్రాండు ఆయుష్‌లో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ప్రీమియం బ్రాండుగా ఆయుష్‌ను హెచ్‌యూఎల్ 2001లో ప్రారంభించింది. కానీ 2007లో దాన్ని ప్రాబల్యం కోల్పోయింది. ప్రస్తుతం ఆయుష్కు తన స్థానాన్ని తిరిగి తీసుకురావాలని హిందూస్తాన్ యూనిలివర్ నిర్ణయించింది. ఈ బ్రాండుపై విడుదల చేసే ఆయుర్వేద ఉత్పత్తులను ధరలు రూ.30 నుంచి రూ.130 పరిధిలో ఉండేలా కంపెనీ ప్లాన్ చేసింది. దశాబ్ద కాలంలోనే మార్కెట్లోకి దూసుకుపోయిన పతంజలి రూ.5000 కోట్ల కంపెనీగా అవతరించింది. అయితే హెచ్‌యూఎల్‌కు రూ.30,000కు పైగా రెవెన్యూలు వస్తుంటాయి. ఎఫ్ఎమ్సీజీ దిగ్గజాలను పడగొట్టి మార్కెట్లో దూసుకుపోవాలని పతంజలి ప్లాన్స్ వేయడంతో, దానికి కౌంటర్ ఇచ్చేందుకు హెచ్‌యూఎల్ సిద్ధమైంది. దీంతో 2017లో ఎఫ్ఎమ్సీజీ విభాగంలో మరో క్లాసిక్ కార్పొరేట్ యుద్ధానికి తెరలేవబోతుందని తెలుస్తోంది. హెచ్‌యూల్ పర్సనల్ కేర్ బిజినెస్‌లు దాన్ని విక్రయాల్లో దాదాపు సగం శాతం ఉంటాయి. వాటినుంచే 60 శాతం లాభాలను కంపెనీ ఆర్జిస్తోంది. పతంజలి, హెచ్‌యూఎల్‌కు గట్టి పోటీని ఇస్తుండటంతో, ఆ కంపెనీ సైతం ప్రణాళికలు రచిస్తోంది. -
బహుళజాతి కంపెనీలకు దేశీ దెబ్బ!
న్యూఢిల్లీ: హిందుస్థాన్ యూనీలీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, పెప్సీకో వంటి విదేశీ దిగ్గజాలకు దేశంలో ఎదురు దెబ్బ తగులుతోంది. వేగంగా విస్త రిస్తున్న దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు వీటికి గట్టిపోటీనిస్తున్నాయి. మెరుగ్గా రాణించి వాటి కంటే ఎక్కువ ఆదాయాలను రాబట్టుకుంటున్నాయి. 2015-16 సంవత్సరంలో దేశీయ ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆదాయాలు ఎంఎన్సీల కంటే ఎక్కువగా ఉన్నట్టు అసోచామ్ నివేదిక పేర్కొంది. దేశంలో ఎంపిక చేసిన 7 ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆదాయాలు గతేడాది 1,104.59 కోట్ల డాలర్లు (రూ.73,835 కోట్లు) కంటే అధికంగా ఉండగా.. అదే సమయంలో ఎంపిక చేసిన 7 ఎంఎన్సీల ఆదాయాలు 943.26 కోట్ల డాలర్లుగా (రూ.62,961 కోట్లు) ఉన్నాయి. దేశీ లిస్టెడ్ కంపెనీలివీ... దేశీయ ఎఫ్‌ఎంసీజీలలో ఐటీసీ లిమిటెడ్ 594.47 కోట్ల డాలర్ల మేర ఆదాయాలను నమోదు చేసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 122.27 కోట్ల డాలర్లు, డాబర్ ఇండియా 88.46 కోట్లడాలర్లు, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 74 కోట్ల డాలర్లు, మారికో 76.11 కోట్ల డాలర్లు, అమూల్ 74.36 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇక, పతంజలి ఆయుర్వేద్ మిగిలిన అన్ని కంపెనీల కంటే వేగవంతమైన వృద్ధి (146 శాతం)తో 76.92 కోట్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక ఎంఎన్సీల విషయానికొస్తే... హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఆదాయం 492 కోట్ల డాలర్లుగా ఉంటే, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్ 38.2 కోట్ల డాలర్లు, గ్లాక్సోస్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ 66.2 కోట్ల డాలర్లు, కోల్గేట్ పామోలివ్ ఇండియా 64 కోట్ల డాలర్లు, గిల్లెట్ 32.16 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. నెస్లే ఆదాయం 125.7 కోట్ల డాలర్లు, పెప్సికో ఇండియా ఆదాయం 125 కోట్ల డాలర్లుగా ఉంది. -
లాభాల్లో దూసుకెళ్లిన హెచ్ యూఎల్
ముంబై : దేశ అతిపెద్ద వినియోగ వస్తువుల సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్ యూఎల్) లాభాల్లో దూసుకెళ్లింది. గడిచిన ఆర్థికసంవత్సర నాలుగో త్రైమాసిక పలితాల్లో హెచ్ యూఎల్ లాభాలు 7శాతం జంప్ అయ్యాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి,నికర లాభాలను రూ.1,090 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.1,018 కోట్లగా ఉన్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, నిల్వవుంచే ఆహార ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో కంపెనీ లాభాలు పెరిగినట్టు హెచ్ యూఎల్ వెల్లడించింది. ఈ లాభాలతో కంపెనీ ఆదాయం 3.5శాతం వృద్ధితో రూ.7,675 కోట్ల నుంచి రూ.7,946 కోట్లకు ఎగబాకింది. అయితే ఈ త్రైమాసికంలో వాల్యుమ్ పెరుగుదల కొంత నిరాశపరిచింది. గతేడాది 6శాతంగా ఉన్న వాల్యుమ్ వృద్ధి ఈ ఏడాది 4 శాతం మాత్రమే నమోదుచేశాయి. -
స్టాక్స్ వ్యూ
ఎన్బీసీసీ బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,017 టార్గెట్ ధర: రూ.1,145 ఎందుకంటే: నేషనల్ బిల్డింగ్స్ కన్స్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1960 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. 2014లో నవరత్న హోదా సాధించింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ), రియల్ ఎస్టేట్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.843గా ఉన్న నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 36 శాతం వృద్ధి చెంది రూ.1,149 కోట్లకు పెరిగాయి. నికర లాభం రూ.32 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. జౌళి మంత్రిత్వ శాఖ నుంచి వారణాసిలో ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసే రూ.197 కోట్ల ప్రాజెక్ట్‌ను ఇటీవలనే సాధించింది. వివిధ క్లయింట్ల నుంచి ఈ సంస్థ సాధించిన వ్యాపారం ఈ ఏడాది ఆగస్టులో రూ.387 కోట్లుగానూ, గత నెల్లో రూ.277 కోట్లుగానూ ఉంది. ఈ కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. 132 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ ఉన్న ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయి వ్యాపారాన్ని సాధిస్తుందని భావిస్తున్నాం. రెండేళ్లలో ఈ కంపెనీ నికర అమ్మకాలు 16 శాతం, నికర లాభం 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.1,145 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను రికమెండ్ చేస్తున్నాం. కోల్గేట్ పామోలివ్ బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.904 టార్గెట్ ధర: రూ.811 ఎందుకంటే: గత పదేళ్లలో భారత టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ఈ కంపెనీకి పోటీ అంతకంతకూ తీవ్రమవుతోంది. హిందుస్తాన్ యూనిలీవర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి కేటగరీలో అగ్రస్థానంలో ఉండగా, కోల్గేట్-పామోలివ్ కంపెనీ మాత్రం ఒక్క కేటగిరీ(టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల)పై మాత్రమే దృష్టిసారిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అనిశ్చితిగా ఉండటంతో అమ్మకాల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండగలదని భావిస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్‌లోని కంపెనీ ప్లాంట్లకు లభించే ద్రవ్య ప్రోత్సాహకాల కాలపరిమితి ముగింపునకు వచ్చింది. గత ఐదేళ్లలో 13% చొప్పున వృద్ధి సాధించిన టూత్‌బ్రష్, టూత్ పేస్టుల మార్కెట్ రానున్న ఐదేళ్లలో 10% లోపే చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యూరోమానిటర్ సంస్థ అంచనా వేస్తోంది. కంపెనీ ఆదాయంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో 18%గా ఉన్న టూత్‌పేస్ట్‌ల ఆదాయం 2014-15లో 12%కి తగ్గింది. టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌ల మార్కెట్ సంతృప్త స్థాయికి చేరడంతో కంపెనీలు తమ తమ మార్కెట్ వాటా పెంచుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. పోటీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ పెప్పొడెంట్, క్లోజప్ల్లో కొత్త కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే కాకుండా ప్రచారం భారీగా చేస్తోంది. ఈ విషయంలో కోల్గేట్ పామోలివ్ వెనకబడి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. హిందుస్తాన్ యూనిలివర్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.785 టార్గెట్ ధర: రూ.1,017 ఎందుకంటే: సోప్స్ అండ్ డిటర్జెంట్స్ మార్కెట్లో సర్ఫ్, లైఫ్‌బాయ్, లక్స్, లిరిల్, రెక్సోనా, డవ్, పియర్స్, హమామ్, వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ వంటి బ్రాండ్లతో, సన్‌సిల్క్, లిప్టన్ గ్రీన్ టీ, బ్రూ గోల్డ్, ఫ్లేవర్డ్ టీ బ్యాగ్స్ వంటి బ్రాండ్లతోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్, లాక్మే, క్లినిక్ ప్లస్, క్లోజప్, తదితర బ్రాండ్లతో ఓరల్, హెయిర్, స్కిన్ కేర్ సెగ్మెంట్లతో తన మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంటోంది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. నికర అమ్మకాలు 5 శాతమే పెరగ్గా, నికర లాభం 2.6 శాతం క్షీణించింది. పన్ను ప్రయోజనాలు తొలగిపోవడం, ఆర్థిక వృద్ధి మందగమనం ఫలితాలపై ప్రభావం చూపా యి. అయితే అమ్మకాలు 7%, నిర్వహణ మార్జిన్లు 41 బేసిస్ పాయింట్లు పెరిగి 17 శాతానికి చేరాయి. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో ఉత్పత్తుల ధరలను కొంత మేర తగ్గించింది. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే ఎఫ్ఎంసీజీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీకే అధిక ప్రయోజనమని భావిస్తున్నాం. మూడేళ్లలో అమ్మకాలు 14%. నికర లాభం 12% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో నిర్వహణ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 18%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18.5% మెరుగుపడతాయని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
హెచ్‌యూఎల్ లాభం రూ. 962 కోట్లు
క్యూ2లో 3% తగ్గుదల ఒక్కో షేర్‌కు రూ. 6.5 డివిడెండ్ న్యూఢిల్లీ: హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) కంపెనీ నికర లాభం(స్టాండ్ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 3 శాతం తగ్గింది. ఎక్సైజ్ సుంకం రాయితీల కాలపరిమితి తీరిపోవడం, ధరల తగ్గింపు కారణాల వల్ల నికర లాభం తగ్గిందని హిందూస్తాన్ యూనిలీవర్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.988 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ2లో రూ.962 కోట్లకు తగ్గిందని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. నికర అమ్మకాలు మాత్రం రూ.7,466 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.7,820 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. వ్యయాలు రూ.6,474 కోట్ల నుంచి 4 శాతం పెరిగి రూ.6,706 కోట్లకు. పన్ను వ్యయాలు 7 శాతం పెరిగి రూ.446 కోట్లకు చేరాయని చెప్పారు. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు ధరలు తగ్గించామని వివరించారు. తక్కువ ధరల్లో ముడి పదార్థాలు లభించడం కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని, హెచ్‌యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిబి. బాలాజి చెప్పారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్లలో తమ నికరలాభం(స్టాండ్ఎలోన్) 1 శాతం తగ్గి రూ.2,021 కోట్లకు పడిపోగా, నికర అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధితో రూ.15,793 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేర్ బీఎస్ఈలో 1.8 శాతం క్షీణించి రూ.797 వద్ద ముగిసింది. -
‘మోడర్న్’ బ్రెడ్ వ్యాపారాన్ని విక్రయించిన హెచ్‌యూఎల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్).. ‘మోడర్న్’ బ్రాండ్‌పై నిర్వహించే బ్రెడ్, బేకరీ వ్యాపారాన్ని విక్రయించింది. ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు చెందిన నిమన్ ఫుడ్స్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ వెల్లడి కాలేదు. రాబోయే రోజుల్లో లావాదేవీ పూర్తికి అవసరమైన అనుమతులు లభిస్తాయని హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. 2000లో కొనుగోలు చేసిన మోడర్న్ బ్రాండ్ వ్యాపారాన్ని లాభసాటిగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్‌ను అప్పట్లో హెచ్‌యూఎల్ కొన్నది. కేంద్రం జరిపిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇదే. కేక్‌లు, బన్లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి తయారు చేసే మోడర్న్ బ్రాండ్‌కి ఆరు ప్లాంట్లు ఉన్నాయి. -
హెచ్‌యూఎల్‌కు గ్రామీణ మార్కెట్ల దెబ్బ
♦ నికర లాభంలో స్వల్ప వృద్ధి ♦ 5 శాతం పెరిగిన అమ్మకాలు న్యూఢిల్లీ : ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ నికర లాభంపై గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ లేకపోవడం ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.1,059 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,057 కోట్ల నికర లాభం సాధించామని వివరించింది. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండడం వల్ల నికర లాభంలో పెద్ద మార్పు లేదని పేర్కొంది. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే 4 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. గత క్యూ1లో రూ.7,571 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.7,973 కోట్లకు పెరిగాయని వివరించింది. మందగమనంగా ఉన్న పరిస్థితుల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ చైర్మన్ హరీష్ మన్వాని చెప్పారు. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడ్డాయని తెలిపారు. గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, కమోడిటీ ధరలు ప్రస్తుతమున్న స్థాయిల్లోనే ఉండడం వంటి అంశాలపై భవిష్యత్ అమ్మకాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. లాభదాయకతను కొనసాగించడానికి వ్యయాలను నియంత్రించడం, మార్కెట్ అభివృద్ధి వంటి అంశాలపై దృష్టిసారిస్తున్నామని కంపెనీ సీఎఫ్ఓ పి. బి. బాలాజీ పేర్కొన్నారు. తమ మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు 35 శాతమని వివరించారు. గత నెలలో మార్కెట్ల నుంచి ఉపసంహరించిన నోర్ బ్రాండ్ ఇన్స్టంట్ నూడుల్స్‌ను తగిన ఆమోదాలు పొందిన తర్వాత మళ్లీ మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 2.3 శాతం క్షీణించి రూ.891 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.1,252 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,062 కోట్లతో పోలిస్తే లాభం 17.87 శాతం పెరిగింది. ప్రధానంగా క్యూ3లో కంపెనీ కొన్ని ఆస్తులను విక్రయించడం, ఉత్పాదక వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి లాభాల జోరుకు దోహదం చేశాయి. ఆస్తుల అమ్మకం రూపంలో రూ.407 కోట్ల అసాధారణ ఆదాయం లభించినట్లు బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. హెచ్‌యూఎల్ మొత్తం ఆదాయం క్యూ3లో 7.69 శాతం ఎగసి రూ.7,037 కోట్ల నుంచి రూ.7,579 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంత అమ్మకాల్లో మందగమనం... దేశీ మార్కెట్లో డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్న నేపథ్యంలో మూడో తైమాసికంలో అమ్మకాల వృద్ధి కాస్త తగ్గిందని.. అయితే, ముడి చమురు ధరల భారీ పతనం కారణంగా ఉత్పాదక వ్యయాలు దిగొచ్చినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ చెప్పారు. పట్టణ ప్రాంత అమ్మకాలతో పోలిస్తే.. గ్రామీణ విక్రయాలు జోరందుకున్నాయన్నారు. మరోపక్క, ఈసారి చలికాలం ఆరంభం జాప్యం కావడం కూడా చర్మసంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు ఆయన తెలిపారు. * క్యూ3లో సబ్బులు, డిటర్జెంట్ల విభాగ ఆదాయం 5.95% వృద్ధితో రూ.3,398 కోట్లకు చేరింది. * పర్సనల్ ప్రొడక్టుల విభాగం నుంచి రూ.2,455 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం క్యూ3తో పోలిస్తే 6.53 శాతం పెరిగింది. * పానీయాల విభాగం ఆదాయం 8.19 శాతం పెరిగి రూ.920 కోట్లకు చేరింది. * ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల విభాగం 12.64 శాతం వృద్ధిచెంది రూ.420 కోట్లుగా నమోదైంది. * డిసెంబర్ క్వార్టర్లో పన్ను చెల్లింపుల వ్యయాలు రెట్టింపై రూ.519 కోట్లకు ఎగబాకాయి. 5% పైగా పడిన షేరు.. మందకొడి అమ్మకాలు, ఫలితాలు మార్కెట్వర్గాల అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 5.27 శాతం క్షీణించి రూ.892.80 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజులోనే హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో రూ. 10,740 కోట్లు ఆవిరైంది. రూ.1,93,133 కోట్లకు పడిపోయింది. మరోపక్క, ఈ నెలలో ఇప్పటిదాకా 24% షేరు ఎగబా కడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కూడా షేరు పతనానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. -
అవరోధ శ్రేణి 28,500 -28,600
మార్కెట్ పంచాంగం భారత్ సూచీల్లో భాగమైన రెండు ప్రధాన షేర్లు హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు కొత్త రికార్డును సృష్టించడంవల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుందని, తద్వారా సమీప భవిష్యత్తులో మార్కెట్ భారీగా పతనమయ్యే ప్రమాదం తప్పుతుందని గత మార్కెట్ పంచాంగంలో సూచించాం. ఈ రెండు షేర్లూ గతవారం కూడా ర్యాలీ జరిపి మరో కొత్త రికార్డును సృష్టించడంతో పాటు ఎన్ఎస్ఈ నిఫ్టీలో అధిక వెయిటేజీ కలిగిన బ్యాంక్ నిఫ్టీ నూతన గరిష్టస్థాయికి చేరింది. బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ కొనసాగితే ప్రధాన సూచీలు సైతం వచ్చే కొద్దిరోజుల్లో నూతన శిఖరాలను అధిరోహిస్తాయి. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ వెనుతిరిగితే సాంకేతికంగా మార్కెట్ డేంజర్‌జోన్‌లో ప్రవేశించినట్లే. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 16తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్క ఉదుటన ర్యాలీ జరిపి 28,194 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 664 పాయింట్ల భారీ లాభంతో 28,122 వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా సూచీల పెరిగిన ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో మొదలైతే 28,380 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన ముగిస్తే వేగంగా 28,570 స్థాయిని అందుకోవొచ్చు. ఇక అటుపై కీలక అవరోధం 28,822 పాయింట్ల స్థాయి (నవంబర్ 28నాటి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి ఇది). ఇదే స్థాయి నుంచి గతంలో భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ క్షీణించినందున.. ఈ నెలలో 29,000 శిఖరాన్ని అందుకోవాలంటే ఈ స్థాయిని ఛేదించి, స్థిరపడాల్సివుంటుంది. అంతకుముందు 28,500-600 అవరోధ శ్రేణిని సెన్సెక్స్ దాటాల్సివుంటుంది. ఈ శ్రేణిని అధిగమించలేకపోతే 27,940 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున క్రమేపీ 27,700 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 27,500-27,600 పాయింట్ల శ్రేణి వద్ద కీలకమైన మద్దతు వుంది. ఈ మద్దతును కోల్పోతే సూచీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశించే ప్రమాదం వుంటుంది. నిఫ్టీ 8,545పైన స్థిరపడితే ర్యాలీ నవంబర్ చివరివారం-డిసెంబర్ తొలివారం మధ్య జరిగిన ర్యాలీతో పోలిస్తే ఈ దఫా అప్‌ట్రెండ్‌లో సెన్సెక్స్‌కంటే ఎన్ఎస్ఈ నిఫ్టీ వేగం ఎక్కువగా వున్నందున ఈ సూచీయే తొలుత కొత్త రికార్డు నెలకొల్పే ఛాన్స్ వుంది. జనవరి 16తో ముగిసినవారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 8,514 వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్ ట్రేడింగ్ జరిగితే 8,545 పాయింట్ల సమీపంలో నిఫ్టీ ప్రారంభం కావొచ్చు. ఆపైన స్థిరపడితే 8,590 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ డిసెంబర్ 4నాటి రికార్డుస్థాయి 8,627 పాయింట్లను అందుకోవచ్చు. మరింత ర్యాలీ కొనసాగితే 8,700-8,750 పాయింట్ల శ్రేణిని చేరవచ్చు. ఈ వారం 8,545 స్థాయిపైన స్థిరపడలేకపోతే 8,450 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 8,380 స్థాయి వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 8,300-8,330 శ్రేణి వద్ద లభించే మద్దతు కీలకం. ఈ మద్దతు శ్రేణిని కోల్పోతే తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి నిఫ్టీ మళ్లవచ్చు. -
సెన్సెక్స్ మద్దతు 27,100 పాయింట్లు
మార్కెట్ పంచాంగం కారణం ఏదైనా, సాధారణంగా జనవరి నెలలో కన్పించే ఒడిదుడుకులు ఈ ఏడాది కూడా ప్రస్ఫుటమయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ సూచీలు గతవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే భారీ పతనం జరిగిన తర్వాత మార్కెట్లో రికవరీ సందర్భంగా రెండు ప్రధాన షేర్లు హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరడం శుభసూచకం. ఇలా సూచీల్లో భాగస్వాములైన షేర్లు కొత్త రికార్డును సృష్టించడంవల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుంది. తద్వారా సమీప భవిష్యత్తులో మార్కెట్ భారీగా పతనమయ్యే ప్రమాదం తప్పుతుంది. కానీ ఈ ప్రమాదంలో పడకుండా వుండాలంటే వచ్చే కొద్దివారాల్లో మరిన్ని షేర్లు కొత్త గరిష్టస్థాయిల్ని సాధించాల్సివుంటుంది. అలా కాకుండా హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ఈ వారం భారీగా క్షీణిస్తే సాంకేతికంగా మార్కెట్ డేంజర్‌జోన్‌లో ప్రవేశించినట్లే. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 9తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 28,064 పాయింట్ల గరిష్టస్థాయి-26,776 పాయింట్ల కనిష్టస్థాయిల మధ్య 1,300 పాయింట్ల మేర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 430 పాయింట్ల నష్టంతో 27,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సైతం ఒడిదుడుకులు కొనసాగితే సెన్సెక్స్‌కు 27,100 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే 26,900 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని కూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే తిరిగి 26,770 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం ప్రారంభంలో 27,100 మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 27,700 పాయింట్ల అవరోధస్థాయి వరకూ ర్యాలీ జరపవచ్చు. ఆపైన ముగిస్తే 28,050 స్థాయికి పెరగవచ్చు. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే క్రమేపీ 28,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 8,170 గతవారం మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 8,450 పాయింట్ల వద్ద క్రితం సోమవారం అవరోధాన్ని ఎదుర్కొన్న ఎన్ఎస్ఈ నిఫ్టీ వేగంగా 8,065 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. వారాంతానికల్లా కొంతమేర నష్టాల్ని పూడ్చుకొని, చివరకు 110 పాయింట్ల నష్టంతో 8,285 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 8,170 స్థాయి వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఆ లోపున ముగిస్తే నేరుగా 8,100 స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా వదులుకుంటే తిరిగి 8,060 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ ర్యాలీ సాగించాలంటే 8,330 పాయింట్ల సమీపంలో వున్న అవరోధాన్ని తొలుత దాటాల్సివుంటుంది. ఆపైన ముగిస్తే తిరిగి 8,450-8,500 అవరోధ శ్రేణివరకూ పెరగవచ్చు. సూచీ కొత్త రికార్డును నెలకొల్పాలంటే 8,545 పాయింట్ల స్థాయిని దాటాల్సివుంటుంది. -
మార్కెట్ మరింత ముందుకే
వివిధ సానుకూల అంశాల నేపథ్యంలో ఈ వారం కూడా మార్కెట్లు మరింత ముందుకు సాగే అవకాశమున్నదని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్) ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఇకపై ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని తెలిపారు. అయితే సెలవుల కారణంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. మంగళవారం(4న) మొహర్రం సందర్భంగా, గురువారం(6న) గురునానక్ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు. జపాన్ సహాయ ప్యాకేజీ పెంపు, అంచనాలను మించిన అమెరికా జీడీపీ వృద్ధి, మోదీ ప్రభుత్వ సంస్కరణలు వంటి అంశాలతో గత వారం మార్కెట్లు కొత్త రికార్డులను నెలకొల్పడం తెలిసిందే. సెన్సెక్స్ 1,015 పాయింట్లు(3.5%) ఎగసి 27,866 వద్ద నిలవగా, నిఫ్టీ 8,322 వద్ద స్థిరపడింది. అక్టోబర్ నెలకు వెల్లడవుతున్న సిమెంట్, ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలు మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటితోపాటు ఈ వారంలో హెచ్ఎస్బీసీ పీఎంఐ తయారీ రంగం, సర్వీసుల రంగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. బ్యాంకింగ్, ఆటో హవా మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న అప్‌ట్రెండ్ మరింత విస్తరిస్తుందని నమ్ముతున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించే అవకాశముందని పేర్కొన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ఢకన్ సైతం వెల్లడించారు. సమీప కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 7,900-7,950 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుందని హీరేన్ అంచనా వేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టినిలుపుతారని కొటక్ సెక్యూరిటీస్ ప్రయివేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, జీఎస్టీ, భూసంస్కరణలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనున్నాయి. ఎల్అండ్టీ ఫలితాలు ఈ వారం క్యూ2 ఫలితాలు ప్రకటించనున్న బ్లూచిప్, మిడ్ క్యాప్ కంపెనీలలో ఎల్అండ్టీ, ఇంజనీర్స్ ఇండియా, అరబిందో ఫార్మా, కెనరా బ్యాంక్, జెట్ ఎయిర్వేస్, జిందాల్ స్టీల్, థెర్మాక్స్, డాబర్, మ్యారికో, సిండికేట్ బ్యాంక్, హెక్సావేర్, ఎంఎంటీసీ, నోవర్టిస్, సన్ టీవీ, యూకో బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు ఎఫ్ఐఐల పెట్టుబడులు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల ధోరణి, చమురు ధరలు వంటి అంశాలు కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు. ఎల్ఐసీ రూ. 7,700 కోట్ల షేర్ల అమ్మకాలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలంలో రూ. 7,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించింది. ఈ వాటాలు 14 బ్లూచిప్ కంపెనీలకు చెందినవి. మరోవైపు ఇదే కాలంలో సెన్సెక్స్ కంపెనీలలో రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. విప్రో, గెయిల్, భెల్, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్లోగల వాటాలను మాత్రం యథాతథంగా కొనసాగించింది. గత కొన్ని క్వార్టర్లుగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌లో ఎలాంటి వాటానూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. సెన్సెక్స్లోకెల్లా ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీలో అత్యధికంగా 16.97% వాటా ఎల్ఐసీకి ఉంది. కాగా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్‌లతోపాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కోలలో వాటాలను కొంతమేర విక్రయించింది. ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ఆటోలో వాటాను పెంచుకుంది. -
సృజనాత్మక సంస్థల్లో హెచ్‌యూఎల్, టీసీఎస్
న్యూయార్క్: అభివృద్ధికి వినూత్న ఆలోచనలు సృష్టించేవిగా ఇన్వెస్టర్లు భావిస్తున్న ప్రపంచంలోని 100 అత్యంత సృజనాత్మక కంపెనీలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఐదు భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. హిందుస్థాన్ యూనిలీవర్ 14, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 57వ ర్యాంకుల్లో నిలిచాయి. లార్సెన్ అండ్ టూబ్రో 58, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 65, బజాజ్ ఆటో 96వ స్థానాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియా కేంద్రంగా గల క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఓ కంపెనీ భవిష్యత్తులో ఎలాంటి వినూత్న ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెస్తుంది, ఆ కంపెనీ ప్రస్తుత వ్యాపార విలువ కంటే మున్ముందు ఎంత అధిక ఆదాయాన్ని ఆర్జిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారనే అంశాల ఆధారంగా ఇన్నోవేషన్ ప్రీమియంను లెక్కించామని ఫోర్బ్స్ తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్‌కు 54.7 శాతం, ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు 39.58 శాతం, లార్సెన్ అండ్ టూబ్రోకు 39.4 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని పేర్కొంది. సన్ ఫార్మాకు 38.34 శాతం, బజాజ్ ఆటోకు 31.73 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని వివరించింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించిన వాటిలో 41 కంపెనీలు అమెరికాకు చెందినవి కాగా మరో 29 కంపెనీలు యూరప్‌నకు చెందినవి. -
చిన్న షేర్లు విలవిల
ఇటీవల నెమ్మదించిన చిన్న, మధ్యతరహా షేర్లలో బుధవారం ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% పతనంకాగా, స్మాల్ క్యాప్ మరింత అధికంగా 2.5% జారింది. వెరసి ట్రేడైన షేర్లలో ఏకంగా 2049 నష్టపోగా, కేవలం 871 బలపడ్డాయి. మరోవైపు రోజంతా లాభనష్టాల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 25,919 వద్ద ముగియగా, 13 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 7,740 వద్ద స్థిరపడింది. ఇది 2 వారాల గరిష్టం. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగం 2.2% పుంజుకోవడం మార్కెట్లకు అండగా నిలిచింది. దిగ్గజాలు ఐటీసీ, హెచ్‌యూఎల్ 2.5% స్థాయిలో జంప్‌చేయగా, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా 2% లాభపడటం ద్వారా మద్దతు అందించాయి. బ్లూచిప్స్ డీలా, రియల్టీ బోర్లా సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్ఈఎల్ 6.5% పతనమైంది. క్యూ1 ఫలితాలు నిరుత్సాహపరచడం ఇందుకు కారణమైంది. ఈ బాటలో కోల్ ఇండియా, హిందాల్కో, టాటా పవర్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ 3-2% మధ్య నీరసించాయి. ఇక మరోవైపు అమ్మకాలు పెరగడంతో రియల్టీ ఇండెక్స్ సైతం 5%పైగా తిరోగమించింది. యూనిటెక్ 17% కుప్పకూలగా, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, డీబీ, డీఎల్ఎఫ్ 8-4% మధ్య దిగజారాయి. -
హెచ్‌యూఎల్ లాభం రూ. 1,057 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 1,057 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,019 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 4% వృద్ధి. ఈ కాలంలో లభించిన రూ. 106 కోట్ల అదనపు ఆదాయం ఇందుకు దోహదపడింది. ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 13% పుంజుకుని రూ. 7,571 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,687 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. మరోసారి పరిశ్రమ వృద్ధిని మించిన పనితీరును చూపినట్లు కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని చెప్పారు. ఈ బాటలో అటు అమ్మకాలు, ఇటు లాభాల్లో మంచి పురోగతిని సాధించినట్లు తెలిపారు. అయితే మార్కెట్లు మందగమనంలో ఉన్నాయని, ఇకపై మరింతగా నెమ్మదించే అవకాశముందని కంపెనీ సీఎఫ్‌వో పీబీ బాలాజీ చెప్పారు. ప్రీమియం విభాగంలో చూస్తే కస్టమర్లు చిన్న తరహా ప్యాకెట్లు కొనేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. సబ్బుల అమ్మకాలు ఓకే సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకాలు 13% పుంజుకుని రూ. 3,848 కోట్లకు చేరగా, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు దాదాపు 15% పెరిగి రూ. 2,160 కోట్లయ్యాయి. పానీయాల విభాగం నుంచి 10% అధికంగా రూ. 837 కోట్ల ఆదాయం లభించగా, ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల అమ్మకాలు 19% ఎగసి రూ. 544 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో దాదాపు 4% జంప్‌చేసి రూ. 686 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం 872 కోట్లు
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 872 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 787 కోట్లతో పోలిస్తే ఇది 11% అధికం. ఇదే కాలానికి అమ్మకాలు కూడా 9% ఎగసి రూ. 6,936 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,367 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 7.50 చొప్పున తుది డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ. 5,555 కోట్ల నుంచి రూ. 6,082 కోట్లకు పెరిగాయి. సమస్యాత్మక వాతావరణంలోనూ పోటీతో కూడిన లాభదాయక వృద్ధిని సాధించగలిగామని కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని వ్యాఖ్యానించారు. సబ్బుల అమ్మకాల జోరు క్యూ4లో సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకాలు దాదాపు 10% పుంజుకుని రూ. 3,497 కోట్లను తాకగా, వ్యక్తిగత ఉత్పత్తుల విభాగం ఆదాయం 8%పైగా పెరిగి రూ. 1,983 కోట్లయ్యింది. ఇక బెవరేజెస్ విభాగం నుంచి 7.5% అధికంగా రూ. 869 కోట్ల ఆదాయం సమకూరగా, ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు దాదాపు 13% వృద్ధితో రూ. 420 కోట్లకు చేరాయి. 9% ఎగసిన దేశీ క న్జూమర్ బిజినెస్ కారణంగా మార్కెట్లను మించుతూ పటిష్ట పనితీరును చూపగలిగామని కంపెనీ సీఎఫ్‌వో ఆర్.శ్రీధర్ పేర్కొన్నారు. వరుసగా 8వ క్వార్టర్లోనూ డిమాండ్ మందగించినట్లు తెలిపారు. కాగా, బ్రాండ్లు, కొత్త ఉత్పత్తులపై పెట్టుబడులు పెంచినట్లు మన్వని చెప్పారు. వ్యయాల అదుపుతోపాటు, కార్యకలాపాల మెరుగుకు తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. తద్వారా దీర్ఘకాలంపాటు వృద్ధిని నిలుపుకోవడమేకాకుండా, మార్జిన్లను పెంచుకోగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. పూర్తి ఏడాదికి గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో హెచ్‌యూఎల్ నికర లాభం రూ. 3,839 కోట్ల నుంచి రూ. 3,955 కోట్లకు పెరిగింది. మొత్తం అమ్మకాలు కూడా రూ. 26,317 కోట్ల నుంచి రూ. 28,539 కోట్లకు ఎగ శాయి. ఇది దాదాపు 9% వృద్ధి. ఇకపై కూడా పరిశ్రమ సగటును మించి వృద్ధిని సాధించగలమని భావిస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు. డవ్, లక్స్ వంటి సబ్బుల అమ్మకాల ద్వారా మార్జిన్లు 30 బేసిస్ పాయింట్లు బలపడ్డాయని పేర్కొన్నారు. వీటితోపాటు చర్మ రక్షణ, ఆహార, పానీయాల విభాగాలు సైతం పుంజుకున్నట్లు తెలిపారు. పానీయాల విభాగంలో తాజ్ మహల్, రెడ్ లేబుల్, 3రోజెస్, బ్రూ గోల్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో కిసాన్, క్వాలిటీ వాల్స్, మాగ్నమ్, లాండ్రీ విభాగంలో సర్ఫ్, రిన్ వంటి బ్రాండ్లు అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు యథాతథంగా రూ. 581 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 22% ఎగసి రూ. 1,062 కోట్లను తాకగా, గతంలో ఇదే కాలానికి రూ. 871 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇక అమ్మకాలు సైతం దాదాపు 10% పెరిగి రూ. 7,038 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,434 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి పనితీరును సాధించగలిగినట్లు కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని పేర్కొన్నారు. పటిష్ట నిర్వహణ ద్వారా లాభదాయకతను పెంచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లు నెమ్మదించినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలపై సానుకూలంగా ఉన్నట్లు కంపెనీ సీఎఫ్‌వో ఆర్. శ్రీధర్ వ్యాఖ్యానించారు. వ్యయాల అదుపు ముడిసరుకుల ధరలు పెరగడం, వృద్ధి మందగించడం, రూపాయి విలువ క్షీణించడం వంటి ప్రతికూలతలున్నప్పటికీ వ్యయాల అదుపు, పెట్టుబడుల కొనసాగింపు వంటి చర్యల ద్వారా మెరుగైన పనితీరును చూపగలిగినట్లు ఆంగ్లోడచ్ దిగ్గజం యూనిలీవర్‌కు అనుబంధ సంస్థ అయిన హెచ్‌యూఎల్ పేర్కొంది. కాగా, ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్లపై రూ. 929.5 కోట్లను ఖర్చు చేసింది. -
మాజీ ఉద్యోగులకు పిలుపులు
ముంబై: నైపుణ్యమున్న ఉద్యోగులకు పాత కంపెనీల నుంచి మళ్లీ పిలుపులు వస్తున్నాయి. ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, గోద్రేజ్ , ఐటీసీ, బ్రిటానియా, టాటా, తదితర కంపెనీలు తమ మాజీ ఉద్యోగుల తలుపులు తడుతున్నాయి. తమను వదలి వెళ్లిన ప్రతిభ గల ఉద్యోగులను పిలిచీ మరీ ఆఫర్లిస్తున్నాయి. వాళ్లు కాదు అని చెప్పలేనంత ఆకర్షణీయమైన ప్యాకేజీని అందిస్తూ వారికి మళ్లీ ఉద్యోగాలిస్తున్నాయి. ఇరువురికీ ప్రయోజనమే ప్రస్తుతమున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో వ్యయ నియంత్రణ లక్ష్యంగా ప్రతిభ గల ఉద్యోగులకే కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ విషయాన్ని టాటా కెమికల్స్ హెచ్ఆర్ హెడ్ ఆర్. నంద ధ్రువీకరించారు. నైపుణ్యమున్న ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలివ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక ఈ రీ హైరింగ్ కారణంగా కంపెనీలకు, మాజీ ఉద్యోగులకు ఇరువురికీ ప్రయోజనాలుంటున్నాయి. రీ హైరింగ్ కారణంగా కంపెనీల ఉద్యోగ వ్యయాలు కూడా తగ్గుతున్నాయి. అంతే కాకుండా పాత ఉద్యోగికి కంపెనీ కార్యకలాపాలు, పని సంస్కృతి వంటివి ఇదివరికే తెలిసి ఉంటాయి. కాబట్టి కొత్త ఉద్యోగులతో పోల్చితే మాజీ ఉద్యోగుల ఉత్పాదకతే బావుంటుందని కూడా కంపెనీలు భావిస్తున్నాయి. కొత్త వాళ్లకు ఉద్యోగాలివ్వడం ఎక్కువ కాలహరణంతో కూడిన పని అని అంతర్జాతీయ ఐటీ సర్వీసుల సంస్థ కంప్యూటర్ సెన్సైస్ కార్పొ భారత విభాగం వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) శ్రీకాంత్ కె. అరిమంత్య పేర్కొన్నారు. మాజీ ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలివ్వడంతో చాలా సమయం ఆదా అవుతుందన్నారు. వార్షిక ఉద్యోగ వ్యయాల్లో మూడో వంతు ఆదా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక మాజీ ఉద్యోగులు కూడా పాత కంపెనీలకే జై కొడుతున్నారు. గతంలో కంటే మంచి స్థానం, ఎక్కువ జీత భత్యాలు లభిస్తుండడం, ఇత్యాది కారణాల వల్ల మాజీ ఉద్యోగులు మళ్లీ పాత గూటికే చేరుతున్నా రు. ఇక కంపెనీలు అన్ని స్థాయి ఉద్యోగాల్లో మాజీ ఉద్యోగులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. గ్రీన్ హైరింగ్ చానెల్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులకు మళ్లీ కొలువులివ్వడాన్ని ‘గ్రీన్ చానెల్’ హైరింగ్‌గా వ్యవహరిస్తోంది. ఈ రీ హైరింగ్ ద్వారా తాము బాగా ప్రయోజనం పొందామని, భవిష్యత్తులో కూడా దీనిని అమలు చేయడం కొనసాగిస్తామని కంపెనీ అంటోంది. తమ గ్లోబల్ అలుమ్ని నెట్వర్క్ ద్వారా మాజీ ఉద్యోగులను సంప్రదిస్తున్నామని ఇన్ఫోసిస్ హెచ్ఆర్. గ్లోబల్ హెడ్ శ్రీకాంతన్ మూర్తి తెలిపారు. ఫేస్బుక్, లింక్డెన్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తమ మాజీ ఉద్యోగులను కంపెనీలు సంప్రదిస్తున్నాయి. -
ఐఐఎం లక్నోలో 100 శాతం ప్లేస్మెంట్
లక్నో: కేవలం ఐదున్నర రోజుల్లో 475 మందికి క్యాంపస్‌లోనే ఉద్యోగాలు దొరికాయని లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్(ఐఐఎం) ప్రకటించింది. దీంతో నూరుశాతం విద్యార్థులకు ప్లేస్మెంట్ దొరికినట్లయిందని ఫ్యాకల్టీ సభ్యుడొకర చెప్పారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ మేళాలో మొత్తం 159 కంపెనీలు పాల్గొన్నాయి. సేల్స్-మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ రంగాలు ప్రధాన రంగాలుగా నిలిచినట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చిన కంపెనీల్లో ప్రధానంగా ఆదిత్య బిర్లా, యాక్సెం చర్, అమెజాన్, హెచ్ఎస్బీసీ, హెచ్‌యూఎల్, మెకిన్సే, పీఅండ్‌జీ, ఎయిర్టెల్, డాబర్, ఐటీసీ, వొడాఫోన్ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. -
హెచ్‌యూఎల్ లాభం 13% అప్
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ నికర లాభం రెండో త్రైమాసికంలో 13 శాతం పెరిగి రూ. 914 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 807 కోట్లు. మరోవైపు, ఆదాయాలు రూ. 6,155 కోట్ల నుంచి రూ. 6,747 కోట్లకు పెరిగినట్లు సంస్థ బీఎస్ఈకి శనివారం తెలిపింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరుపై రూ. 5.50 మధ్యంతర డివిడెండ్‌ను హెచ్‌యూఎల్ ప్రకటించింది. అలాగే, భవిష్య అలయన్స్ చైల్డ్ న్యూట్రిషన్ ఇనీషియేటివ్స్ సంస్థను పూర్తి అనుబంధ సంస్థగా మార్చుకునేందుకు అదనంగా మరిన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సంస్థ నిర్ణయించింది. -
రిటైల్‌లో ప్రైవేట్ లేబుల్స్
హైదరాబాద్: ప్రైవేట్ లేబుల్స్ దిగ్గజ కంపెనీల ఫుడ్ బిజినెస్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. హిందూస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీ వంటి కంపెనీల ఆహార ఉత్పత్తులకు ప్రైవేట్ లేబుల్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. బిగ్‌బజార్ రిటైల్ చెయిన్లను నిర్వహించే ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ సంస్థల ఆహార ఉత్పత్తుల అమ్మకాల్లో ప్రైవేట్ లేబుల్స్ హవా పెరుగుతోంది. ఈ రిటైల్ చెయిన్ షాపుల్లో ఆహార పదార్ధాల అమ్మకాల్లో 75 శాతం ప్రైవేట్ లేబుల్స్వే ఉండడం విశేషం. ప్రైవేట్ లేబుల్స్ ఎందుకంటే..., పెద్ద కంపెనీ బ్రాండ్ల ఉత్పత్తులు ఖరీదెక్కువనే కారణంతో వినియోగదారులు తక్కువ ధరలకు లభించే ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని నీల్సన్ తాజా సర్వేలో వెల్లడైంది. నాణ్యతతో రాజీపడకుండానే తక్కువ ధరకే ఆహార ఉత్పత్తులను ప్రైవేట్ లేబుల్స్ అందిస్తున్నాయని నీల్సన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆడ్రియన్ టెర్రాన్ చెప్పారు. కొత్త బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేద్దామనుకుంటున్న వినియోగదారులు పెరిగిపోతున్నారని వివరించారు. ఈ పోకడ హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీల వంటి కంపెనీలపై దీర్ఘకాలంలో ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తుల ధరలు అందరికీ అందుబాటులో ఉండడం వాటి అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. మార్కెటింగ్, పంపిణీ వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులు చౌక ధరల్లో లభ్యమవుతున్నాయి. ఫ్యామిలీ బడ్జెట్లో కోత... ఇప్పుడు వీకెండ్ సరదాల్లో షాపింగ్ కూడా ఒక భాగమైపోయింది. ఫ్యామిలీలు శని, ఆది వారాల్లో షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఎంచుకోవడానికి అధిక ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, ఊరిస్తున్న ఆఫర్లు వంటి కారణాల వల్ల షాపింగ్ ఖర్చు ఇబ్బడి ముబ్బడి అవుతోంది. దీంతో బడ్జెట్ కోతలో భాగంగా అధిక ధరలున్న పెద్ద కంపెనీల బ్రాండ్ల ఆహార ఉత్పత్తులకు బదులు తక్కువ ధర ఉన్న ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తుల వినియోగం వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. పెద్దస్థాయి కాదు కాగా ప్రస్తుతం పెద్ద కంపెనీలను సవాల్ చేసే స్థాయిల్లో ప్రైవేట్ లేబుల్స్ లేవని కొందరు నిపుణులంటున్నారు. భారత ఆహార, కిరాణా మార్కెట్లో ప్రైవేట్ లేబుల్స్ వాటా 0.3 శాతం మాత్రమేనని రాబొబ్యాంక్ ఇంటర్నేషనల్ అంచనా వేస్తోంది. ఫలానా బ్రాండ్ వస్తువే కొనాలనుకునే వినియోగదారులు బాగా ఉన్నారని, ఇది పెద్ద కంపెనీలకు ప్రయోజనకరమని విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి వారి సంఖ్య పెంచుకోవడం ద్వారా ప్రైవేట్ లేబుల్స్ పోటీని తట్టుకోవడం కోసం పెద్ద కంపెనీలు బ్రాండ్ బిల్డింగ్‌పై బాగానే వ్యయం చేస్తున్నాయి. ఐదు రెట్ల వృద్ధి.. దేశంలోని ప్రైవేట్ లేబుల్స్ అన్నీ ఒక గొడుగు కిందకు వస్తే, అది దేశంలోనే మూడవ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సరఫరా సంస్థ అవుతుందని నీల్సన్ సంస్థ అంచనా. ఈ సంస్థ అంచనా ప్రకారం, ప్రైవేట్ లేబుల్స్ వ్యాపారం 2015 కల్లా ఐదు రెట్ల వృద్ధితో రూ.3,000 కోట్లకు పెరగనున్నది. భారత్‌లోని మోడ్రన్ ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఇప్పటికే ప్రైవేట్ లేబుల్స్ వాటా 5 శాతంగా ఉంది. ఇది చైనాలో 1 శాతమే ఉంది. మొత్తం ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో మోడ్రన్ ఎఫ్ఎంసీజీ అమ్మకాలు భారత్‌లో 10 శాతంగా ఉండగా, చైనాలో మాత్రం 70 శాతంగా ఉన్నాయి. భారత్‌లో ప్రైవేట్ లేబుల్స్‌కు భారీగా అవకాశాలున్నాయని రిటైలర్లు అంటున్నారు. చాలా కేటగిరిల్లో పెద్ద పెద్ద కంపెనీల ఉత్పత్తులు లేవని, ఇది ప్రైవేట్ లేబుల్స్ విజృంభణకు మంచి అవకాశమని వారంటున్నారు. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ సంస్థ నిర్వహించే బిగ్ బజార్‌ల్లో పన్నెండుకు పైగా వివిధ సెగ్మెంట్లలలో ప్రైవేట్ లేబుల్స్ అమ్మకాలు బాగా ఉన్నాయని ఫుడ్ బజార్ ప్రెసిడెంట్ దేవేంద్ర చావ్లా చెప్పారు. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన మోర్, ఆర్పీజీ గ్రూప్‌కు చెందిన స్పెన్సర్స్ రిటైల్‌లో కూడా వివిధ కేటగిరిల్లో ముఖ్యంగా ఆహార పదార్ధాలు, గృహ సంరక్షణ కేటగిరిల్లో ప్రైవేట్ లేబుల్స్ హవా జోరుగా ఉంది.