ముంబై: దేశీయ వినియోగ వస్తువుల సంస్థ, మల్టీ నేషనల్ కంపెనీ హిందూస్థాన్ యునిలివర్ ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఏప్రిల్ చివరికనాటికి 10-15శాతం ఉద్యోగాలు తొలగించేందుకు యోచిస్తోంది. డచ్‌కు చెందిన పేరెంటల్ కంపెనీ మాండేటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా మొత్తం మార్కెట్లలో ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో కన్జూమర్ గూడ్స్ కంపెనీ హెచ్ యూఎల్ ఉద్యోగులను ఇంటికి పంపనుంది. దీంతోపాటు కొత్త నియామకాల్లో కూడా కోత పెట్టనుంది.
అయితే ఈ వార్తలపై స్పందించడానికి హెచ్‌యూఎల్ నిరాకరించింది. మరోవైపు హెచ్‌యూఎల్ కంపెనీలనుంచి దరఖాస్తులను అందినట్టుగా కొన్ని మల్టీ నేషనల్ కంపనీలు దృవీకరించాయి. మార్జిన్ టార్గెట్లను పెంచుతున్నట్టు హెచ్‌యూఎల్ పేరెంటల్ కంపెనీ గురువారం ప్రకటించింది. యూకే, నెదర్లాండ్స్‌లో రెండు విడి కంపెనీలుగా ఆంగ్లో డచ్ కంపెనీ నిర్మాణాన్ని సమీక్షిస్తున్నట్టు తెలిపింది.
కాగా 2015-16 వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా కంపెనీలోమొత్తం 18వేలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 15వందల మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులు
హెచ్‌యూఎల్‌లో ఉద్యోగాల కోత
Published Fri, Apr 7 2017 10:56 AM | Last Updated on Sat, Aug 25 2018 5:22 PM
Advertisement
Advertisement