లక్నో: కేవలం ఐదున్నర రోజుల్లో 475 మందికి క్యాంపస్‌లోనే ఉద్యోగాలు దొరికాయని లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్(ఐఐఎం) ప్రకటించింది. దీంతో నూరుశాతం విద్యార్థులకు ప్లేస్‌మెంట్ దొరికినట్లయిందని ఫ్యాకల్టీ సభ్యుడొకర చెప్పారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ మేళాలో మొత్తం 159 కంపెనీలు పాల్గొన్నాయి. సేల్స్-మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ రంగాలు ప్రధాన రంగాలుగా నిలిచినట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చిన కంపెనీల్లో ప్రధానంగా ఆదిత్య బిర్లా, యాక్సెం చర్, అమెజాన్, హెచ్‌ఎస్‌బీసీ, హెచ్‌యూఎల్, మెకిన్సే, పీఅండ్‌జీ, ఎయిర్‌టెల్, డాబర్, ఐటీసీ, వొడాఫోన్ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు.