HSBC
-
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
తయారీ రంగం మార్చిలో బలంగా పుంజుకుంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 నెలల కనిష్ట స్థాయికి పడిపోగా.. తిరిగి మార్చిలో ఎనిమిది నెలల గరిష్టానికి పెరిగింది. ఫిబ్రవరిలో హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.3గా ఉంటే, మార్చి నెలలో 58.1కు చేరుకుంది. కొత్త ఆర్డర్లు ఈ స్థాయి రికవరీకి తోడ్పడినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా తెలిపింది.పీఎంఐ సాధారణంగా 50కి పైన నమోదు అయితే తయారీ విస్తరణగాను, ఆలోపు వస్తే క్షీణతగాను పరిగణిస్తుంటారు. ‘మార్చిలో అమ్మకాలు 2024 జులై తర్వాత గణనీయంగా నమోదయ్యాయి. సానుకూల డిమాండ్ పరిస్థితులు, కస్టమర్ల ఆసక్తి, విజయవంతమైన మార్కెటింగ్ చర్యలు దోహదపడ్డాయి’ అని హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే తెలిపింది. ముఖ్యంగా 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో కంపెనీలు తయారీని గణనీయంగా పెంచినట్టు పేర్కొంది. చారిత్రక సగటు కంటే తయారీ అధికంగా నమోదైనట్టు వివరించింది.ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..‘అంతర్జాతీయ ఆర్డర్లు కాస్తంత నిదానించాయి. అయినప్పటికీ డిమాండ్ బలంగా ఉంది. కొత్త ఆర్డర్ల సూచీ ఎనిమిది నెలల గరిష్టం అయిన 61.5కు చేరుకుంది’ అని హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజల్ భండారీ పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్‌ను అందుకునేందుకు కంపెనీలు తమ నిల్వలను వినియోగించుకున్నాయని.. దీంతో ఫినిష్డ్ గూడ్స్ నిల్వలు 2022 జనవరి తర్వాత కనిష్టానికి చేరుకున్నాయని సర్వే నివేదిక వివరించింది. సుమారు 400 తయారీ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ గణాంకాలను ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. -
భారత్ బంగారు కొండ.. HSBC సంచలన రిపోర్ట్
-
జోరందుకున్న తయారీ రంగం
భారత తయారీ రంగం జనవరి నెలకు పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గత డిసెంబర్లో 56.4 శాతంగా ఉంటే, 2025 జనవరి నెలలో 57.7కు దూసుకుకెళ్లింది. ఎగుమతులు 14 ఏళ్లలోనే (2011 తర్వాత) బలమైన వృద్ధిని చూపించడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు ఈ సర్వే అభిప్రాయపడింది. 50 పాయింట్లకు పైన తయారీ పీఎంఐ నమోదు అయితే దాన్ని విస్తరణగా, అంతకు దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తుంటారు.‘భారత తయారీ పీఎంఐ ఆరు నెలల గరిష్ట స్థాయికి జనవరిలో చేరుకుంది. దేశీ, ఎగుమతుల డిమాండ్ బలంగా ఉంది. ఇది వృద్ధికి మద్దతునిచ్చింది’ అని హెచ్ఎస్బీసీ ముఖ్య భారత ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. తయారీదారులకు కొత్త ఆర్డర్లలో వృద్ధి ఉన్నట్టు, దీనికి అనుగుణంగా తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్టు పీఎంఐ సర్వే తెలిపింది. రానున్న కాలంలో 32 శాతం సంస్థలు వృద్ధి పట్ల సానుకూల అంచనాలతో ఉంటే, కేవలం ఒక శాతం సంస్థలు క్షీణతను అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టాప్ టెక్ కంపెనీఐపీవోకు వీడా క్లినికల్ రీసెర్చ్క్లినికల్ రీసెర్చ్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.185 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. ఇంతక్రితం కంపెనీ 2021 సెపె్టంబర్‌లోనూ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. సెబీ నుంచి అనుమతి లభించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఐపీవోను పక్కనపెట్టింది. కంపెనీ ప్రధానంగా వివిధ దశల ఔషధ అభివృద్ధిలో సర్వీసులు అందిస్తోంది. తొలి దశసహా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ తదితర సేవలు సమకూర్చుతోంది. -
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడులు
ఈక్విటీల్లో స్మాల్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగంలో ఆటుపోట్లు కాస్త తక్కువగా ఉంటాయి. స్మాల్‌క్యాప్‌లో రాబడులతోపాటు అస్థిరతలు కూడా ఎక్కువే. అందుకే పెట్టుబడుల్లో కేవలం స్మాల్‌క్యాప్ ఒక్కటే కాకుండా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిస్‌్కను వైవిధ్యం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. మిడ్‌క్యాప్ విభాగంతోపాటు లార్జ్క్యాప్లోనూ పెట్టుబడులకు అవకాశం కలి్పస్తూ, మెరుగైన రాబడుల చరిత్ర కలిగిన పథకాల్లో హెచ్ఎస్బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 44 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. కానీ, ఈక్విటీ మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడి ఇదే కాంలో 31.59 శాతంగానే ఉంది. మూడేళ్లలో 26.67 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని అందించగా, ఇదే కాలంలో మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడి 23.64 శాతంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఇక ఐదేళ్లలో 25.40 శాతం, ఏడేళ్లలో ఏటా 15.33 శాతం, పదేళ్లలో ఏటా 17.69 శాతం వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకానికి ఉంది. మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడుల కంటే అధిక ప్రతిఫలాన్ని అందించింది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక పెట్టుబడుల వృద్ధి 19.90 శాతంగా ఉంది. గతంలో ఎల్అండ్టీ మిడ్క్యాప్ఫండ్గా ఇది కొనసాగింది. హెచ్ఎస్బీసీ కొనుగోలు తర్వాత పథకం పేరు మారింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మిడ్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ తన మొత్తం నిర్వహణ ఆస్తుల్లో అధిక శాతాన్ని లార్జ్‌క్యాప్‌లోనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. రిస్క్ తగ్గించడం, రాబడులను పెంచడం అనే వ్యూహంలో భాగంగా లార్జ్, మిడ్‌క్యాప్ విభాగాల మధ్య పెట్టుబడుల్లో ఫండ్ మేనేజర్లు మార్పులు చేర్పులు చేస్తుంటారు. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌తో పోలి్చతే లార్జ్‌క్యాప్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం 11,912 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 98.31 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 1.7 శాతం నగదు, నగదు సమానాల్లో ఉన్నాయి.ఈక్విటీ పెట్టుబడుల్లో 67 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 32.68 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్మాల్‌క్యాప్‌లో కేవలం 0.46 శాతమే పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 37 శాతం పెట్టుబడులు పెట్టింది. కనీసం రూ.500 మొత్తంతో ఈ పథకంలో సిప్ మొదలు పెట్టుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోని గమనిస్తే.. ఇండ్రస్టియల్స్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచి్చంది. మొత్తం పెట్టుబడుల్లో 34 శాతం ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 18 శాతం, కన్జ్యూమర్ డి్రస్కీíÙనరీ కంపెనీలకు 12.53 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 9.37 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం
న్యూఢిల్లీ: సేవల రంగం సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 57.7 వద్ద ముగిసింది. గడచిన 10 నెలల కాలంలో సూచీ ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. కొత్త వ్యాపారం, అంతర్జాతీయ అమ్మకాలు, ఉత్పత్తిలో వృద్ధి మందగించినట్లు నెలవారీ సర్వే పేర్కొంది.తీవ్ర పోటీ పరిస్థితులు, ద్రవ్యోల్బణ సవాళ్లు, వినియోగదారుల ఎంపికలో మార్పు (ఆన్లైన్ సర్వీసుల్లోకి మారడం), కొత్త ఎగుమతి ఆర్డర్లలో అంతగా పెరుగుదల లేకపోవడం వంటి అంశాలు కూడా సేవల రంగం మందగమనానికి కారణమయ్యాయి. ఆగస్టులో సూచీ 60.9 వద్ద ఉంది. కాగా సూచీ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. అయితే 2024లో సూచీ 60 లో పునకు పడిపోవడం సెపె్టంబర్‌లోనే మొదటిసారి. ఇదీ చదవండి: జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!తయారీ–సేవలు కలిపినా డౌన్...సేవలు–తయారీ రంగం కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.7 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 58.3కు తగ్గింది. అయితే సూచీలో మందగమనం చోటుచేసుకున్నప్పటికీ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన మెరుగ్గానే ఉందని, ఆగస్టు నుంచి వ్యాపార ధోరణి పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఒక్క తయారీ రంగమే సెప్టెంబర్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.5కు తగ్గింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టులో సూచీ 57.5 వద్ద ఉంది. 400 తయారీ సంస్థల ప్యానల్లోని పర్చేజింగ్ మేనేజర్లకు పంపబడిన ప్రశ్నపత్రాల ప్రతిస్పందనలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసి, హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐని రూపొందిస్తుంది. భారత్ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా మెజారిటీ కాగా, పారిశ్రామిక రంగం వాటా దాదాపు 25 శాతం. ఇందులో తయారీ రంగం వాటా దాదాపు 75 శాతం. -
భవిష్యత్తు ప్రణాళిక బహు క్లిష్టం
సాక్షి, హైదరాబాద్: సంస్థలు, కుటుంబాలు, వ్యక్తులు.. ఎవరైనా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కీలకం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్తు ప్రణాళిక క్లిష్టంగా మారుతోంది. భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, స్తబ్ధతలో కూరుకుపోతున్నామనే భా వనలో మెజారిటీ ప్రజలున్నారు. 69 శాతం మంది భారతీయులు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని తేలింది. ఊహించని మార్పులను ఎదుర్కొంటున్నట్టుగా 91 శాతం మంది అంగీకరించారు. పరిస్థితుల ›ప్రభావంతో ఆత్మవిశ్వాసం, నమ్మకం సన్నగిల్లుతుండడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధంగా లేమని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తులుగా.. సరైన వేళకు.. సరైన నిర్ణయాలు తీసుకో లేకపోతున్నామని మధనపడుతున్నట్లు 57 శాతం పేర్కొన్నారు. ఇదీ అధ్యయనం.. హెచ్ఎస్బీసీ సంస్థ ఆధ్వర్యంలో.. భారత్, హాంకాంగ్, సింగపూర్, యూఏఈ, యూకే, యూఎస్‌లలోని వివిధ రంగాలు, మార్కెట్లకు చెందిన దాదాపు 18వేల మంది వ్యక్తులు (దాదాపు 4 వేల బిజినెస్ లీడర్లు)పై జరిపిన గ్లోబల్ స్టడీ ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలపై హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ (వెల్త్ అండ్ పర్సనల్ బ్యాంకింగ్) సందీప్ బాత్రా స్పందిస్తూ.. దైనందిన జీవనంలో సమస్యలు ఎదురైనపుడు వాటిని ఎదుర్కొనేందుకు.. ఏదో ఒక రూపంలో సహాయపడాలని హెచ్ఎస్బీసీ భావిస్తోందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, ఇతర రంగాల్లో ప్రజలకు తగిన సలహాలు, సూచనలిచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జీవితంలో క్లిష్టమైన సవాళ్లు ఎదురైనపుడు అంతర్జాతీయ నెట్వర్క్ సహాయంతో అనిశి్చతిని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. నివేదికలో ఏముందంటే.. » వేగంగా మార్పులు సంభవిస్తున్న యుగంలో తామున్నట్టు 91 శాతం మంది భారతీయుల భావన » భవిష్యత్ ప్రణాళికల రచనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 69 శాతం మంది ఉన్నారు. » తీసుకున్న నిర్ణయాల అమలుకు సిద్ధంగా లేమని భావిస్తున్నవారు, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనుకున్నవారు 62 శాతం మంది ఉన్నారు. » తగిన సమయంలో అవకాశాలు కోల్పోయినందుకు, తగిన నిర్ణయం తీసుకోలేకపోయినందుకు చింతిస్తున్నవారు 57 శాతం మంది ఉన్నారు. » తాము తీసుకున్న నిర్ణయాలు చివరకు సరైనవి కావనే భావనలో 46 శాతం మంది ఉన్నారు. » సరైన నిర్ణయాలు తీసుకోలేక.. వాటిని వీలైనంత వాయిదా వేస్తున్న వారు 42 శాతం మంది ఉన్నారు. » నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 33 శాతం మంది ఉన్నారు.భారత్‌కు యూఎస్ తోడుఈ అధ్యయనానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. భారత్‌లో మాదిరిగానే యూఎస్ఏలోనూ 47 శాతం మంది అ మెరికన్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారు.» అమెరికన్లలో 33 శాతం మంది తాము తీసుకున్న పాత నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. » ఐదేళ్లలో.. ఇతరులతో సంబంధం లేకుండా వేరుగా ఉన్నామనే భావనలో 43 శాతం అమెరికన్ మహిళలున్నారు. అదే పురుషుల విషయానికొస్తే 26 శాతంగా ఉంది.» యూఎస్‌లో బిజినెస్ లీడర్లు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోల్చితే భవిష్యత్ ప్రణాళికలు మరింతగా సవాళ్లతో కూడుకున్నవనే భావనలో 51 శాతం మంది ఉన్నారు. -
Priyanka Chopra : సినీ స్టార్‌తో భోజనం..
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మన అనే భావనను పెంపొందించే లక్ష్యంతో ఓ ప్రచార కార్యక్రమం చేపట్టినట్టు ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని కోసం మన దేశానికి చెందిన గ్లోబల్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్‌ను ప్రచారంలో భాగం చేశామని, ‘సినీ స్టార్‌తో భోజనం’ అంటూ, స్వదేశీ రుచులను గుర్తు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన మిచెలిన్–స్టార్ రెస్టారెంట్ ఎగ్జిక్యూటీవ్ చెఫ్, సిద్ అహుజా కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారన్నారు. -
సేవలకు కొత్త ఆర్డర్ల భరోసా
న్యూఢిల్లీ: సేవల రంగం జూన్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 60.5కు ఎగసింది. మేలో సూచీ ఐదు నెలల కనిష్ట స్థాయి 60.2కు పడిపోయిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్డర్లు పెరగడం, దేశీయ, అంతర్జాతీయ విక్రయాల్లో పురోగతి వంటి అంశాలు జూన్‌లో పటిష్ట ఫలితాలు రావడానికి కారణం. కాగా, సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించే సంగతి తెలిసిందే. సూచీ 50 దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఇదిలావుండగా, సేవలు–తయారీ విభాగాలతో కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా మేలో 60.5 వద్ద ఉంటే, జూన్‌లో 60.9కి ఎగసింది. 400 సంస్థల ప్యానెల్‌కు పంపిన ప్రశ్నపత్రాలకు వచి్చన ప్రతిస్పందనల తో హెచ్ఎస్బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్‌ను ఎస్అండ్పీ గ్లోబల్ రూపొందిస్తుంది. -
భారత్ సేవల రంగం నెమ్మది
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటినెల ఏప్రిల్‌లో నెమ్మదించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మార్చిలో 61.2 వద్ద ఉంటే, ఏప్రిల్‌లో 60.8కి తగ్గింది. అయితే ఈ స్థాయి కూడా 14 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం గమనార్హం. కాగా, ఈ సూచీ 50పై ఉంటే దానిని వృద్ధి బాటగా, దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం గమనార్హం. మరోవైపు తయారీ, సేవలు కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మార్చిలో 61.8 ఉంటే, ఏప్రిల్‌లో 61.5కు తగ్గడం మరో అంశం. అయితే ఇది కూడా 14 సంవత్సరాల గరిష్ట స్థాయే కావడం గమనార్హం. -
తయారీ చక్రం స్పీడ్
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.9కి ఎగసింది. ఇది ఐదు నెలలు గరిష్ట స్థాయి. జనవరిలో సూచీ 56.5గా నమోదయ్యింది. సమీక్షా నెల్లో సూచీకి దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ సహకారం లభించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ద్రవ్యోల్బణం 2023 జూలై కనిష్ట స్థాయికి తగ్గడంతో తయారీ సంస్థల మార్జిన్లు మెరుగుపడినట్లు సర్వే పేర్కొనడం గమనార్హం. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నలు, ప్రతిస్పందనలను ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐని ఆవిష్కరిస్తుంది. -
జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు బంపరాఫర్. భారత్‌లో దేశీయ బ్యాంకుల నుంచి అంతర్జాతీయ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థల వరకు మహిళా ఉద్యోగుల్ని ఆకర్షిస్తూ, వారిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. భారత్‌లోని హెచ్ఎస్బీసీ సంస్థలో ఆరేళ్లకు మించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా బోనస్‌లు అందిస్తుంది. గర్భిణీ సిబ్బంది క్యాబ్ రైడ్లకు అయ్యే ఖర్చును మోర్గాన్ స్టాన్లీ భరిస్తుంది. సిటీ గ్రూప్ సంస్థ కొత్తగా తల్లైన మహిళ ఉద్యోగుల మెటర్నిటీ లీవులు పూర్తయితే మరో ఏడాది పాటు ఇంటి వద్ద నుంచి పనిచేసేలా వెసలు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక నియామకం వరల్డ్ బ్యాంక్ జెండర్ డేటా పోర్టల్ ప్రకారం, భారత్ ఇప్పటికే పూర్తి వేతనంతో మహిళ ఉద్యోగులకు కనీసం 26 వారాల ప్రసూతి సెలవును తప్పనిసరి చేసింది. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సదరు బ్యాంకులు మహిళలకు డేకేర్ (0-5 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యత) సౌకర్యాల్ని కల్పించేలా చట్టాల్ని తెచ్చింది.రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ప్రతిభావంతులైన మహిళల్ని ఎంపిక చేసుకోవడం, ఇప్పటికే బ్యాంకుల్లో పనిచేస్తున్న వారి నిర్ధిష్ట అవసరాల్ని హెచ్ఎస్బీసీ తీరుస్తుంది. దీంతో పాటు మహిళా ఉద్యోగుల 0 నుంచి 6 వయస్సున్న పిల్లల సంరక్షణ కోసం నెలావారీ 216 డాలర్లను అందిస్తుంది. మెటర్నిటీ లీవులు పూర్తయితే మోర్గాన్ స్టాన్లీ ముంబై, బెంగుళూరులలో గర్భిణీ ఉద్యోగులు డెలివరీ ముందు చివరి మూడునెలల్లో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆ కారణంతో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండియా హెచ్ఆర్ హెడ్ రజత్ మాథుర్ అన్నారు. కాబట్టే మెటర్నిటీ లీవులు పూర్తయిన మహిళా ఉద్యోగులు తిరిగి సంస్థల్లో పనిచేసేలా కోచింగ్‌తో పాటు శిక్షణ ఇస్తుంది. తండ్రులకు కనీసం 16 వారాల వరకు సెలవులను అందిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ సెలవుల్ని అందిస్తుంది. అయితే ప్రైవేట్ రంగానికి కనీస నిబంధనలు లేవు. అమెరికాలో అంతంతమాతమ్రే ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో మాత్రం నిబంధనలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. మహిళ ఉద్యోగులు సెలవుల్లో ఉంటే వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే చట్టపరమైన నిబంధనలు లేవు. కాబట్టే జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్లు తల్లదండ్రులిద్దరికి 16 వారాల సెలవును అందిస్తుంది. గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ తల్లిదండ్రులకు 20 వారాల మెటర్నిటీ లీవ్‌ల్ని అందిస్తుంది. -
బ్రాండ్ ఇన్ఫ్లూయెన్సర్గా కోహ్లీ.. ఇక దూసుకెళ్లనున్న హెచ్ఎస్బీసీ బ్యాంక్
హైదరాబాద్: హెచ్ఎస్బీసీ ఇండియా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని తన బ్రాండ్ ఇన్ఫ్లూయెన్సర్గా నియమించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసింది. విరాట్ కోహ్లీతో మీడియా ప్రచారాన్ని నిర్వహించడం వల్ల హెచ్ఎస్బీసీ బ్యాంకింగ్ సేవలకు విలువ తోడవుతుందని పేర్కొంది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఆర్థిక సేవల సంస్థతో భాగస్వామ్యం కావడం పట్ల విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా గత ఫిబ్రవరిలో హెచ్ఎస్బీసీ భారతదేశంలో కార్యకలాపాల నుంచి ప్రీ ట్యాక్స్ ఫ్రాఫిట్‌లో 15.04 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2022 సంవత్సరానికి అది 1.277 బిలియన్ డాలర్లు. ఆ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎస్బీసీ ఉద్యోగుల సంఖ్య 1,000 పెరిగి మొత్తంగా 39,000కి చేరుకుంది. ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు -
జస్ట్..రూ.99కే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన హెచ్ఎస్బీసీ!
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) కుప్ప కూలింది. ఇప్పుడు ఆ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఇతర దిగ్గజ బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా యునైటెడ్ కింగ్డమ్(uk) ప్రధాన కార్యాలయంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రఖ్యాత బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ..యూకేలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే లిమిటెడ్‌ను (Silicon Valley Bank UK Ltd) 1 పౌండ్ (భారత్ కరెన్సీలో రూ.99) కు కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో నోయల్ క్విన్ (Noel Quinn) తెలిపారు. ఈ కొనుగోలు యూకేలో హెచ్ఎస్బీసీ బ్యాంకింగ్ సేవలకు ఊతం ఇస్తుందని, ఎస్వీబీ కస్టమర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకోనున్నట్లు హెచ్ఎస్బీసీ సీఈవో ప్రకటన చేశారు. చదవండి👉 భారత్‌లో కలకలం..మరో బ్యాంక్‌ను మూసివేస్తున్నారంటూ రూమర్స్! యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) మూసి వేస్తున్నట్లు ప్రకటన చేయడం, ఆ తర్వాత సుమారు 175 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కాపాడుతున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే ను 1 ఫౌండ్కు సొంతం చేసుకోనున్నట్లు తెలుపుతూ.. ఓ ప్రకటన చేసింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం..యూకేలో ఎస్‌వీబీకి మార్చి 10 నాటికి మొత్తం 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు, 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు, 1.4 బిలియన్ పౌండ్ల ఈక్విటీ ఉంటుందని అంచనా వేసింది. ఇక తమ కొనుగోలు ప్రకటనతో యూకేలో ఎస్వీబీ లావాదేవీలు కొనసాగుతాయి. ఇప్పటికే తమ బ్యాంకు(hsbc) అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించి.. ఎస్‌వీబీకి నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఎస్వీబీని ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నారనే విషయాల గురించి వివరణ ఇవ్వలేదు. HSBC confirms it bought Silicon Valley Bank UK for £1 HSBC CEO Noel Quinn says: "This acquisition makes excellent strategic sense for our business in the UK. It strengthens our commercial banking franchise and enhances our ability to serve innovative and fast-growing firms" pic.twitter.com/5hs4FSAKK1 — Kalyeena Makortoff (@kalyeena) March 13, 2023 చదవండి👉 ఐటీ ఉద్యోగుల్లో కొత్త భయాలు..ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది? -
రష్యన్ బ్యాంకులతో సంబంధాలు కట్
HSBC-Russia: ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికా మొదలు అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యాతో లావాదేవీలు నిలిపేయాలంటూ పెద్ద బ్యాంకులు సైతం తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇంగ్లండ్‌కి చెందిన హెచ్ఎస్బీసీ బ్యాంకు రష్యాకి చెందిన పెద్ద బ్యాంకయిన వీటీబీతో లావాదేవీలు నిలిపేయాలని కోరింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఉద్యోగులకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుగుణంగా హెచ్‌స్‌బీసీ ఈ నిర్ణయం ప్రకటించింది. హెచ్ఎస్బీసీ బ్యాంకు దారిలోనే మరిన్ని ఆర్థిక సంస్థలు త్వరలో తమ నిర్ణయాలు ప్రకటించనున్నట్టు సమాచారం. -
అయ్యో! అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయిందే
కొన్ని సార్లు కొందరి కథలు వింటే, మనం అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని అనుకుంటాం. అచ్చం అలాంటి కథనే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన శాంటాండర్ క్రిస్మస్ డే రోజున పొరపాటుగా అనుకోకుండా వేలాది మంది వ్యక్తుల ఖాతాలో 130 మిలియన్ల(సుమారు రూ.1000 కోట్లకు పైగా) యూరోలను జమ చేసింది. ఆ ఖాతాదారులు డబ్బులు వచ్చాయి అనే ఖాతాదారులు సంతోషించేలోపు తిరగి వెనక్కి శాంటాండర్ సంస్థ వెనక్కి తీసుకొంది. దీంతో ఆ ఖాతాదారులు అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని భాదపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన శాంటాండర్ క్రిస్మస్ డే రోజున పొరపాటుగా అనుకోకుండా వేలాది మంది వ్యక్తుల ఖాతాలో £130 మిలియన్ల(సుమారు రూ.1000 కోట్లకు పైగా)ను జమ చేసింది. అలా జమ చేసిన నగదును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. డిసెంబర్ 25న శాంటాండర్ "సాంకేతిక సమస్య" కారణంగా 75000 మంది బ్యాంకు ఖాతాల్లో అనుకోకుండా డబ్బులు జమ అయినట్లు బ్యాంకు ప్రతినిధి తెలిపారు. ఈ డబ్బును నేరుగా బ్యాంకు తన స్వంత నిల్వల నుంచి జమ చేసింది. (చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..!) అయితే, ఈ డబ్బు పంపిన ఖాతాలు హెచ్ఎస్బిసి, నాట్ వెస్ట్ మొదలైన వివిధ ఇతర బ్యాంకులకు చెందినవీ. దీంతో ఈ బ్యాంకుల నుంచి రికవరీ చేయడం చాలా కష్టతరం చేసింది. ఈ బ్యాంకు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రహీతల్లో కొందరు ఇప్పటికే డబ్బును ఖర్చు చేశారని భయపడుతున్నారు. యుకెలో ప్రధాన చెల్లింపు వ్యవస్థలను నడుపుతున్న పే యుకె, ఈ సమస్య పట్ల శాంటాండర్తో చర్చిస్తోంది. బ్యాంకు ఈ మొత్తాన్ని తిరిగి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే, నేరుగా నగదు గ్రహీతలతో సంస్థ కమ్యూనికేట్ చేస్తోంది. "సాంకేతిక సమస్య కారణంగా మా కార్పొరేట్ ఖాతాదారుల నుంచి కొంత మొత్తం ఇతరుల ఖాతాలలో జమ చేసినందుకు క్షమించండి" అని బ్యాంకు ప్రతినిధి తెలిపారు. శాంటాండర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో సాంకేతిక లోపం కారణంగా వినియోగదారులు దాదాపు ఒక రోజంతా చెల్లింపులు చేయకుండా నిరోధించడంతో బ్యాంకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆగస్టులో, వేలాది మంది వినియోగదారులు మరొక సమస్య కారణంగా వారి ఆన్ లైన్ ఖాతాలను యాక్సెస్ చేసుకోలేకపోయారు. శాంటాండర్ సంస్థ యుకెలో 14 మిలియన్ల మంది వినియోగదారులు కలిగి ఉండటంతో పాటు, దీనికి 400 భౌతిక శాఖలు ఉన్నాయి. (చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కెవైసీ గడువు పొడిగించిన ఆర్బీఐ!) -
హెచ్ఎస్బీసీ ఏఎంసీ చేతికి ఎల్అండ్టీ ఎంఎఫ్
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎల్అండ్టీ మ్యుచువల్ ఫండ్‌ను (ఎల్అండ్టీ ఎంఎఫ్) హెచ్ఎస్బీసీ అసెట్ మేనేజ్మెంట్ (హెచ్ఎస్బీసీ ఏఎంసీ) కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 425 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,192 కోట్లు) వెచ్చించనుంది. ఎల్అండ్టీ ఎంఎఫ్‌లో ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (ఎల్టీఎఫ్హెచ్) అనుబంధ సంస్థ ఎల్అండ్టీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ (ఎల్టీఐఎం)కు 100 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు హెచ్ఎస్బీసీ ఏఎంసీతో ఎల్టీఎఫ్హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని హెచ్ఎస్బీసీ ఇండియా సీఈవో హితేంద్ర దవే తెలిపారు. అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రుణ వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్టీఎఫ్హెచ్ ఎండీ దీనానాథ్ దుబాషి వివరించారు. హెచ్ఎస్బీసీకి ఇప్పటికే భారత్‌లో అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి దీని నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ సుమారు రూ. 11,700 కోట్లు. దీని పరిమాణం ఎల్టీఎంఎఫ్తో పోలిస్తే ఆరో వంతు ఉంటుంది. డీల్ అనంతరం హెచ్ఎస్బీసీ ఏఎంసీ దాదాపు రూ. 1 లక్ష కోట్ల ఏయూఎంతో దేశంలోనే 12వ అతి పెద్ద ఫండ్ హౌస్‌గా మారుతుంది. -
నియామకాలపై బుల్లిష్
న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల విషయంలో బుల్లిష్ (చాలా సానుకూలం)గా ఉన్నట్టు ‘హెచ్ఎస్బీసీ ఫారŠూచ్యన్ వర్క్ సర్వే’ తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి వ్యాపారాలను తిరిగి పటిష్టం చేసుకునేందుకు వీలుగా మానవ వనరులపై పెట్టబుడులు పెంచే ఉద్దేశ్యంతో ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. అంతర్జాతీయంగా 2,130 మంది వ్యాపార అధినేతల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భారత్ నుంచి 219 మంది పాల్గొన్నారు. ఆర్థిక రికవరీలో నియామకాలు కీలక పాత్ర పోషించనున్నట్టు సర్వే పేర్కొంది. ‘‘భారతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున నియామకాలు ఉండనున్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 80 శాతం వచ్చే 12 నెలల్లో పూర్తి స్థాయి ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపాయి’’ అని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఉద్యోగులకు సంస్థ ఇచ్చే ప్రయోజనాలపై కరోనా ప్రభావం చూపించినట్టు పేర్కొంది. కరోనా సమయంలో సౌకర్యవంతమైన పనివేళలను అమలు చేసినట్టు 52 శాతం సంస్థలు చెప్పగా.. హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అందించినట్టు 49 శాతం సంస్థలు తెలిపాయి. ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన, వనరుల గురించి తెలిపినట్టు 49 శాతం సంస్థలు వెల్లడించాయి. ‘‘కరోనా మమహ్మారి ప్రభావం తగ్గుతుండడంతో ఆర్థిక రికవరీకి అవకాశం ఏర్పడింది. వ్యాపార సంస్థలు వృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. సానుకూల సెంటిమెంట్ అండతో కంపెనీలు నియిమకాలు, నైపుణ్యాలపై పెట్టుబడులను పెంచుతున్నాయి’’ అని హెచ్ఎస్బీసీ ఇండియా కమర్షియల్ బ్యాంకింగ్ హెడ్ రజత్‌వర్మ తెలిపారు. -
హెచ్ఎస్బీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్
ముంబై: భారత దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ది హంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్బీసీ) తమ సంస్థకు స్వతంత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్‌ను నియమించింది. ఆయన గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చైర్మన్‌గా పనిచేశారు. కాగా, రజనీష్ 40 సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. ఆయన గతేడాది అక్టోబరులో రిటైర్ అయ్యారు. ఆయన గ్లోబల్ బిజినెస్, బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఎస్బీఐలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారు. బ్యాంకింగ్‌ను డిజిటలైజేషన్లో వైపు తీసుకురావడంతో తీవ్రంగా కృషిచేశారు. ఎస్బీఐ నుంచి రిటైర్ అవ్వకముందు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కు చైర్మన్‌గా పనిచేశారు. అదేవిధంగా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ ఆసియా ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ సలహదారుగా, సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్‌కు సలహదారుగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఎస్బీసీతో పాటు లార్సెన్ అండ్ టూబ్రో ఇన్షోటెక్ లిమిటెడ్ స్వతంత్ర డైరెక్టర్, బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ, ఆసియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీనియర్ సలహదారుగా పని చేస్తున్నారు. సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ సలహాదారుగా కూడా సేవలందిస్తున్నారు. చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థపై దివాలా పిటిషన్
సింగపూర్: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐటీఎన్‌ఎల్) విదేశీ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్‌పై సింగపూర్ కోర్టులో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్ఎస్బీసీ దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. సంస్థపై ‘వైండింగ్ అప్’ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,000 కోట్లకుపైగా బకాయిలు రాబట్టే క్రమంలో హెచ్ఎస్బీసీ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని ఒక సంస్థపై ఈ తరహా పిటిషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్ జారీచేసిన 1,000 మిలియన్ల చైనా యువాన్ల (రూ.1,050 కోట్లకుపైగా) విలువైన బాండ్లలో హెచ్ఎస్బీసీ పెట్టుబడులు పెట్టింది. నిజానికి ఈ బాండ్లు 2021లో మెచ్యూరిటీకి వస్తాయి. -
దిగ్గజ బ్యాంకులో 35 వేల ఉద్యోగాల కోత
హాంకాంగ్: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ భారీ నష్టాల కారణంగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. గత ఏడాది లాభాలు మూడో వంతు పడిపోవడంతో ఖర్చులకు తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 35 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. కోతలు చాలావరకు యూరోపియన్ , అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాలలో ఉండనున్నాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ కారణంగా అనేక అనిశ్చితులను ఎదుర్కొన్న బ్యాంకు తాజాగా ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకుంది. అలాగే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించడం (బ్రెగ్జిట్), కొత్తగా చైనాలో విస్తరించిన కరోనా వైరస్ కోవిడ్-19 కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో జాన్ ఫ్లింట్కు అనూహ్యంగా ఉద్వాసన పలికిన తర్వాత యాక్టింగ్ సీఈవోగా నోయెల్ క్విన్ బాధ్యతలు స్వీకరించారు. 50కి పైగా దేశాలకు విస్తరించి ఉన్న హెచ్ఎస్బీసీని ఆసియాలో లాభాల బాట పట్టించి, విశాలమైన అంతర్జాతీయ బ్యాంకును మార్చే వ్యూహంలో ఉన్నారు. అయితే తమ వ్యాపారం ఆశించిన రాబడిని ఇవ్వడంలేదనీ, ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులకు రాబడిని పెంచేలా కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నామని క్విన్ చెప్పారు. ఖర్చులు తగ్గించడంతోపాటు, తమ సంక్షిష్ట సంస్థాగత నిర్మాణాన్ని సరళీకృతం చేయనున్నామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో గ్లోబల్ హెడ్‌కౌంట్‌ను 235,000 నుండి 200,000 కు తగ్గించనున్నట్లు వెల్లడించారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తెలిపింది. అమెరికాలో బ్యాంక్ తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను సుమారు 30 శాతం తగ్గించాలని, బ్యాక్ ,మిడిల్ ఆఫీస్ కార్యకలాపాలను ఏకీకృతం చేయాలని, నిర్వహణ ఖర్చులను 10-15 శాతం తగ్గించాలని యోచిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. మెక్సికన్ మనీలాండరింగ్ కుంభకోణంలో చిక్కుకున్న హెచ్ఎస్బిసి 2012నుండి కీలక పునర్నిర్మాణ ప్రణాళికలను చేపట్టింది. 2022 నాటికి 4.5 బిలియన్ డాలర్ల వ్యయ కోతలను లక్ష్యంగా పెట్టుకున్నామని, పునర్నిర్మాణ వ్యయాలు 6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని బ్యాంక్ ఒక తెలిపింది. చైనాలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి 2020 లో ఆసియాలో వృద్ధి అంచనాలను తగ్గించిందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. దీంతో హాంకాంగ్‌లో హెచ్ఎస్బీసీ షేర్లు 2.2 శాతం పడిపోయాయి. -
లక్ష్య సాధనలో జీఎస్టీ వైఫల్యం: హెచ్ఎస్బీసీ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితం, ఏకీకృతం చేయాలన్న ప్రధాన లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆ దిశలో ఇప్పటివరకూ విఫలమయ్యిందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ– హెచ్ఎస్బీసీ పేర్కొంది. అలాగే ఒకే దేశం – ఒకే పన్ను వ్యవస్థలో నగదుకు డిమాండ్ తగ్గకపోగా పెరిగిందని హెచ్ఎస్బీసీ నివేదిక తెలిపింది. అయితే దీర్ఘకాలంలో జీఎస్టీ వల్ల తగిన ఫలితాలు ఒనగూడుతాయన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. 2017 జూలై 1 నుంచీ పరోక్ష పన్నులన్నింటినీ ఒకటిగా చేస్తూ, జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వేర్‌హౌసింగ్ రంగానికి జోష్!! జీఎస్టీ అమలు కారణంగా దేశీ వేర్‌హౌసింగ్ రంగంలో 2018–2020 మధ్యకాలంలో 20 శాతం వార్షిక వృద్ధి నమోదు కావొచ్చని రియల్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ అంచనా వేసింది. హబ్ అండ్ స్పోక్ మోడల్ సహా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ (ఎంఎంఎల్పీ) వృద్ధిలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంది. ‘‘ఆధునిక సాంకేతికత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల, పాలసీల ఆవిష్కరణ రూపంలో ప్రభుత్వ మద్దతు వంటివి సానుకూల పరిస్థితులకు దారితీశాయి. భారత్ ప్రారంభ దశలోనే అభివృద్ధి చెందడానికి అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ అంశాన్ని భారత్ గ్లోబల్ ర్యాంకింగ్స్ పురోగతిలోనూ గమనించొచ్చు’’ అని వివరించింది. వచ్చే కొన్నేళ్లలో దాదాపు 25 కొత్త ఎంఎంఎల్‌పీలు ఏర్పాటు కావొచ్చని పేర్కొంది. 2021 చివరి నాటికి భారత్‌లో వేర్‌హౌసింగ్ 112 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. సంస్థలు భిన్నమైన డిస్ట్రిబ్యూషన్ మోడళ్ల కోసం అన్వేషిస్తాయని తెలిపింది. జీఎస్టీ తర్వాత కంపెనీలు చిన్న వేర్‌హౌస్‌ల ద్వారా పన్ను ఆదా అంశంపై కాకుండా సామర్థ్యంపై దృష్టి కేంద్రీకరిస్తాయని పేర్కొంది. వేర్‌హౌసింగ్ డెవలపర్లు పెద్ద పెద్ద లాజిస్టిక్స్ పార్క్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని, అలాగే వ్యూహాత్మక ప్రాంతాల్లో భూముల కొనుగోలు చేస్తారని పేర్కొంది. -
భారత్‌కు బంగారు భవిష్యత్తు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి 2020 ఆర్థిక సంవత్సరం నుంచి మంచి రోజులేనని, వృద్ధి రేటు వెలిగిపోతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ హెచ్ఎస్బీసీ తెలిపింది. అయితే, వచ్చే రెండేళ్లపాటు వృద్ధి నిదానిస్తుందని, ఆ తర్వాత మధ్య కాలానికి పుంజుకుంటుందని తన నివేదికలో వివరించింది. 2019–20లో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘‘భారత వృద్ధి ప్రయాణం రెండు భాగాలు. మొదటిది వృద్ధి తగ్గడం, తిరిగి స్వల్ప కాలంలో (2017–18, 2018–19 సంవత్సరాల్లో) క్రమంగా రికవరీ అవడం. జీఎస్టీ అమలు కారణంగా ఎదురైన విఘాతాల నుంచి వివిధ రంగాలు తిరిగి గాడినపడతాయి. రెండోది 2019–20 తర్వాత నుంచి మధ్యకాలంలో ఆశాజనక వృద్ధికి అవకాశాలు. 2017–18 నుంచి 2019–20 వరకు వృద్ధి రేటు వరుసగా 6.5 శాతం, 7 శాతం, 7.6 శాతం చొప్పున నమోదు కావచ్చని అంచనా వేస్తున్నాం’’ అని హెచ్ఎస్బీసీ వివరించింది. మధ్య కాలంలో ఒక్క జీఎస్టీయే జీడీపీని 40 బేసిస్ పాయింట్ల మేర పెంచుతుందని అభిప్రాయపడింది. నాణేనికి రెండో వైపు అన్నట్టు... రెండు బ్యాలన్స్ షీట్ల సమస్య, కంపెనీల అధిక రుణ భారం దీర్ఘకాలం పాటు కొనసాగితే పెట్టుబడుల పునరుద్ధరణ, జీడీపీ వృద్ధి రేటు రికవరీపై ప్రభావం పడుతుందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు 2017–18లో 1.7 శాతం, 2018–19లో 1.9 శాతం, 2019–20 నాటికి 2.1 శాతానికి విస్తరిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. వచ్చే 20 ఏళ్లు 8 శాతం తగ్గదు... భారత్ తదుపరి అంచె సంస్కరణలకు తెరతీస్తే వచ్చే రెండు దశాబ్దాల కాలం పాటు 8 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలదని ఐక్యరాజ్యసమితిలో ఆర్థిక వ్యవహారాల అధికారి సెబాస్టియన్ వెర్గర అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా, వృద్ధికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. భారత్ తన పూర్తి సామర్థ్యాలను చేరుకునేందుకు తదుపరి విడత సంస్కరణలను చేపట్టాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు దేశ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచాలని సూచించారు. భారత ఆర్థిక రంగం సానుకూల స్థితిలో ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి రేటు అన్నది గత అంచనాల కంటే కొంచెం తగ్గొచ్చన్నారు. భారతదేశ ద్రవ్య విధానం వివేకంతో ఉందని, ఆర్థిక కార్యకలాపాలకు మద్దతుగా ఉందని వర్గర వివరించారు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, మౌలిక çసదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ప్రశంసించారు. -
పదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
2028 నాటికి సాధ్యమన్న హెచ్ఎస్బీసీ ముంబై: భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 2015–16 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సంస్కరణలపై, సామాజిక రంగంపై స్థిరమైన దృష్టి కొనసాగించాలని సూచించింది. సామాజిక నిధుల వ్యయం తీరు తగినంతగా లేదని, ఆరోగ్యం, విద్యపై వ్యయాలు చాలినంత లేవని స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వం కోసం ఇది అవసరమని సూచించింది. వ్యాపార సులభతర నిర్వహణపై భారత్ ఎంతో దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది. జనాభా, స్థూల ఆర్థిక స్థిరత్వం అన్నవి దేశానికి కీలక బలాలుగా తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాగా, చైనా, జర్మనీ, జపాన్‌లు తర్వాతి స్థానాల్లో వున్నాయి. వచ్చే ఏడాదే ఆర్థిక రికవరీ... జీఎస్టీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం కంటే తక్కువగా ఉంటుందని హెచ్ఎస్బీసీ నివేదికలో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రికవరీ ఉంటుందని అంచనా వేసింది. ఒకే సంస్కరణకు పరిమితం కాకుండా క్రమానుగతంగా మార్పులు జరిగేలా తగిన వ్యవస్థను మార్పు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. జీఎస్టీ కారణంగా అవ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని, సంస్థల మూసివేతను నిదర్శనంగా చూపింది.వచ్చే పదేళ్లలో ఈ కామర్స్ రంగం 1.2 కోట్ల ఉద్యోగాలను కల్పించనుండగా, 2.4 కోట్ల ఉద్యోగాల తగ్గుదలలో ఇది సగమే అని పేర్కొంది. సామాజిక రంగంలో ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని, ఆరోగ్యం, విద్యా రంగాల్లో చేయాల్సింది ఎంతో ఉందని సూచించింది. భారత్ సేవల ఆధారిత ఆర్థిక రంగంగా కొనసాగుతూనే తయారీ, సాగు రంగాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది. -
లిక్విడిటీకి ఆర్బీఐ చెక్!
ప్రారంభమైన ఎంపీసీ భేటీ; నేడు విధాన ప్రకటన ⇒ డీమోనిటైజేషన్‌తో బ్యాంకులవద్ద దండిగా నిధులు; రుణాలకు తగ్గిన డిమాండ్ ⇒ రూ.4 లక్షల కోట్లు అదనపు లిక్విడిటీ ఉందన్న హెచ్ఎస్బీసీ ⇒ సర్దుబాటు చర్యలు ప్రకటించొచ్చన్న అభిప్రాయం ⇒ మొండి బకాయిలపైనా దృష్టి; రేట్ల కోత కష్టమేనని అంచనా... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం గురువారంతో ముగుస్తుంది. ఎంపీసీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఆరో ద్వైమాసిక సమీక్ష ఇది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి వెలువడే చర్యలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మార్కెట్లో, బ్యాంకింగ్ వ్యవస్థలో అధికంగా ఉన్న నగదు లభ్యతను తగ్గించడం, రుణాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో పుంజుకునేందుకు చర్యలు, బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల(ఎన్పీఏ) సమస్యకు పరిష్కారాలపై తాజా సమీక్షా సమావేశంలో ఎంపీసీ దృష్టి పెట్టనుందని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక రేట్లను ఎంపీసీ యథాతథంగా కొనసాగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూ ఉండటం ఆర్బీఐ బెంచ్‌మార్క్ పాలసీ రేటు ఈ స్థాయికి మించి తగ్గదన్న సంకేతాన్నిస్తోందని... దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను బట్టి భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగేందుకూ అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరిగా ఫిబ్రవరిలో సమీక్షా సమావేశం జరిగింది. ఆ సందర్భంగా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయని విషయం తెలిసిందే. రెపో రేటును 6.25 శాతంగానే కొనసాగిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వడ్డీ రేట్ల విషయంలో సర్దుబాటు ధోరణి నుంచి తటస్థ విధానానికి మళ్లుతున్నట్టూ ప్రకటించింది. ద్రవ్య లభ్యత తగ్గించే చర్యలు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రస్తుత భేటీలో ప్రధానంగా అధికంగా ఉన్న ద్రవ్య లభ్యతకు చెక్ పెట్టే చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో డీమోనిటైజేషన్ నిర్ణయం తర్వాత వెనక్కి తీసుకున్న నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం రూ.14 లక్షల కోట్ల వరకు తిరిగి వ్యవస్థలోకి వచ్చాయి. ఈ క్రమంలో వ్యవస్థలో అదనంగా ఉన్న ద్రవ్య లభ్యతను సర్దుబాటు చేసేందుకు వీలుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) వంటి చర్యలను ఆర్బీఐ తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా బ్యాంకుల వద్ద వున్న అధిక నిధుల్ని ఆర్బీఐ డిపాజిట్ చేసుకుంటుంది. ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మార్కెట్లో రూ.4 లక్షల కోట్ల అదనంగా నగదు లభ్యత ఉందని, దాన్ని సర్దుబాటు చేసే నిర్ణయాలను సెంట్రల్ బ్యాంకు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ద్రవ్యపరపతి విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన గల ఓ ప్యానెల్ గతంలో ఎస్డీఎఫ్ను ప్రతిపాదించింది. భిన్నమైన పరిస్థితి.. ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ఎంపీసీ సమావేశం వివరాలను పరిశీలిస్తే... బ్యాంకింగ్ రంగంలో రుణాలకు డిమాండ్ క్షీణించడం, పలు రంగాల్లో పెట్టుబడుల్లోనూ ఇదే ధోరణి ఉండటంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి భారీగా నగదు డిపాజిట్లు వెల్లువలా వచ్చిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్ కార్యక్రమం ముసిగి 3 నెలలు గడిచినా లిక్విడిటీ వ్యవహారం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. రుణాలకు డిమాండ్ పెద్దగా లేకపోవడం బ్యాంకులకు ఇబ్బందికరంగా తయారైంది. బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తంలో తీసుకోనివి ఇంకా రూ.2 లక్షల కోట్ల మేర ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ అంచనా. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి లిక్విడిటీ సర్దుబాటు దిశగా కచ్చితంగా చర్యలు ఉంటాయని అంచనా. -
‘బ్లాక్‌మనీ’పై దర్యాప్తు పూర్తి
♦ హెచ్ఎస్బీసీ, లీక్టెన్‌స్టీన్ జాబితాలపై విచారణ జరిపాం ♦ రూ. 15 వేల కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించాం: జైట్లీ న్యూఢిల్లీ: విదేశాల్లోని భారతీయుల నల్లధనానికి సంబంధించి హెచ్ఎస్బీసీ, లీక్టెన్‌స్టీన్ బ్యాంకుల జాబితాల్లో ఉన్న వారిపై ప్రభుత్వం దర్యాప్తును పూర్తి చేసిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం రూ. 15వేల కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించామని మంగళవారం రాజ్యసభకు తెలిపారు.‘హెచ్‌స్‌బీసీ జాబితాలోని 628 మందిపై దర్యాప్తు పూర్తయింది. 409 కేసుల్లో రూ. 8,437 కోట్ల డబ్బు ఉన్నట్లు అంచనా వేశారు. 190 విచారణలు మొదలయ్యాయి’ అని వెల్లడించారు. లీక్టెన్‌స్టీన్ జాబితాలోని వారిపై జరిపిన దర్యాప్తులో రూ. 6,500 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడిందన్నారు. పనామా పత్రాల్లోని ఖాతాలపై దర్యాప్తు మొదలైందని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగాయి. జైట్లీ అబద్ధాలాడుతున్నారని జెఠ్మలానీ ఆరోపించారు. ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రులు, అధికార పక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు ఎంత డబ్బు చేరిందో ప్రస్తుతానికి చెప్పలేమని జైట్లీ తెలిపారు. జైట్లీకి ఆరోగ్యం బాగుండదా: జైరాం ‘రేపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జబ్బుపడతారా?’ అని రాజ్యసభలో జైరామ్ రమేశ్(కాంగ్రెస్) ఎద్దేవా చేశారు. బుధవారం సభలో చర్చకు రావాల్సిన ఆధార్ అంశాన్ని వాయిదావేయడంతో ఇలా ప్రశ్నించారు. ఆర్థికమంత్రికి ఆరోగ్యం బాగాలేదు కనుక ఆయన బుధవారం చర్చలో పాల్గొనరని తమకు సమాచారం అందిందని జైరామ్ తెలిపారు. సభలో చలాకీగా కనిపిస్తున్న జైట్లీ ఈ అంశం ఎందుకు వాయిదాపడిందో చెప్పాలంటూ.. ‘రేపు ఆయనకు ఆరోగ్యం బాగుండదా? అని అన్నారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా’ వాయిదా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగింపు, దీని కోసం జాతీయ అభివృద్ధి మండలి భేటీ ప్రతిపాదనపై మంగళవారం రాజ్యసభలో జరగాల్సిన చర్చ..ఆర్థిక మంత్రి జైట్లీ లేకపోవడంతో వాయిదాపడింది. దాడుల్లో 21,454 కోట్లు రెండేళ్లలో ఆదాయపు పన్ను అధికారులు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో రూ.21,454 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో చెప్పారు. మొత్తం 992 కంపెనీలు/వ్యక్తుల స్థావరాల్లో అధికారులు సోదాలు చేశారన్నారు. ఆర్మీలో సహాయకులుగా పనిచేస్తున్న వారు కూడా యుద్ధవీరులేననీ, వారిని చిన్న పనులకు వినియోగించ కుండా ఆదేశాలిచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఎయిడ్స్ రోగులు చికిత్స, విద్య, ఉద్యో గాలు తదితరాల్లో ఇతరులతో సమానం గా హక్కులను పొందేందుకు ఉద్దేశించిన ‘హెచ్ఐవీ/ఎయిడ్స్(ప్రివెన్షన్, కంట్రోల్) బిల్లు’ను రాజ్యసభ ఆమోదించింది. -
ఐటీకి చిక్కిన రూ.16,200 కోట్ల బ్లాక్‌మనీ
న్యూఢిల్లీ : భారతీయులు విదేశాల్లో గుట్టగుట్టలుగా నగదు దాచారనే దానిపై అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన లీకేజీలపై ఆదాయపు పన్ను అధికారులు జరిపిన విచారణలో భారీగా బ్లాక్‌మనీ పట్టుబడినట్టు ప్రభుత్వం తెలిపింది. ఐటీ అధికారుల విచారణలో విదేశాల్లో దాగిఉన్న రూ.16,200 కోట్లకు పైగా నల్లధనం వెలికితీశామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పార్లమెంట్‌కు చెప్పారు. ఓ క్రమ పద్ధతిలో జరిపిన దాడుల్లో రూ.8,200 కోట్ల లెక్కలో చూపని నగదు పట్టుబడిందని, హెచ్ఎస్బీసీలో వీటిని దాచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) బయటపెట్టిన రహస్యపత్రాలకు సంబంధించిన దానిలో భారతీయులకు సంబంధించిన పలు విదేశీ అకౌంట్లను వెలికితీశామన్నారు. వీటిలో మరో రూ.8000 కోట్లు పట్టుబడిందని జైట్లీ రాజ్యసభకు తెలిపారు. అయితే ఇంకా ఎంత మొత్తంలో భారతీయుల బ్లాక్‌మనీ విదేశాల్లో దాగివుందో అధికారిక అంచనాకు రాలేదని వివరించారు. విదేశాల్లో దాచిఉంచిన భారతీయుల బ్లాక్‌మనీపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
వచ్చే ఏడాది వృద్ధి 7.1 శాతం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. బడ్జెట్లో పలు ప్రోత్సాహక ఫలితాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుకు దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక విడుదల సందర్భంగా హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారీ తెలిపారు. ఆయన తెలిపిన నివేదిక అంశాలను పరిశీలిస్తే– దేశంలో రానున్న నెలలో వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది పెట్టుబడులకు కొంత రికవరీ అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 6.3 శాతంగా అంచనా వేసినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది గణనీయంగా మెరుగుపడే వీలుంది. -
పన్నుల హేతుబద్దీకరణ, డిజిటలైజేషన్ కీలకం
• బడ్జెట్‌పై హెచ్ఎస్బీసీ నివేదిక • ద్రవ్యలోటు గాడి తప్పరాదని సూచన న్యూఢిల్లీ: పన్నుల హేతుబద్ధీకరణ, డిజిటలైజేషన్ కోసం చర్యలు వచ్చే బడ్జెట్ కీలక అంశాల్లో కొన్నని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక అంచనావేసింది. వీటితోపాటు గ్రామీణాభివృద్ధికి అధిక కేటాయింపులు, సామాజిక వ్యయాల పటిష్టత కూడా బడ్జెట్లో చోటుచేసుకుంటాయని భావిస్తున్నట్లు నివేదిక వివరించింది. ద్రవ్యలోటు బాట తప్పరాదు... అయితే ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు బాట (వచ్చే ఏడాది లక్ష్యం జీడీపీలో 3 శాతం) తప్పరాదని నివేదిక కేంద్రానికి సూచించింది. అలాగే వస్తుసేవల పన్ను వల్ల జరిగే నష్టాన్ని రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో కేంద్రం భర్తీ చేయాలని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు. కంపెనీలకు మినహాయింపులను తగ్గిస్తూ... పన్నులను ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి క్రమంగా తీసుకువస్తారని విశ్వసిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు, రహదారులు, నీటిపారుదల రంగాలపై కేంద్రం దృష్టి సారించే వీలుందని అన్నారు. డిజిటలైజేషన్‌కు తగిన ప్రోత్సాహకాలను బడ్జెట్ కల్పిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కఠిన ప్రతిపాదనలు ఉండకపోవచ్చు: డీఅండ్‌బీ రాబోయే బడ్జెట్లో కఠిన ప్రతిపాదనలేమీ ఉండకపోవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి, మరోవైపు డీమోనిటైజేషన్ వల్ల డిమాండ్‌పరమైన షాక్‌లతో దేశం పెనుసవాళ్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణమని వివరించింది. సంపన్న దేశాల్లో మందగమన ప్రభావం మరిన్ని దేశాలకు విస్తరించే రిస్కులు ఎక్కువగా ఉన్నాయని డీఅండ్‌బీ తెలిపింది. నోట్ల రద్దుతో భారత ఎకానమీ సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని వివరించింది. అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరగడం.. దేశీయంగా వృద్ధి వేగం మందగించడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయని డీఅండ్‌బీ పేర్కొంది. -
సీనియర్ ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ సీనియర్ ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డివిజెన్లో పనిచేస్తున్న దాదాపు 100 మంది సీనియర్ ఉద్యోగులను హెచ్ఎస్బీసీ తొలగిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కోత ప్రభావం గ్లోబల్ బ్యాంకింగ్, మార్కెట్స్ డివిజన్లో పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ మార్కెట్స్‌లో కంపెనీ వార్షిక ప్రదర్శనను సమీక్షిస్తున్నామని బ్యాంకు అధికార ప్రతినిధి ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు. తమ వ్యాపారాలను వృద్ధి పరుచుకుని, బలపడటానికి కొన్ని మార్పులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎస్బీసీ తన పూర్తి ఏడాది రాబడులను ఫిబ్రవరి 21న రిపోర్టు చేయనుంది. ఈ ఏడాది హెచ్ఎస్బీసీ బ్యాంకు షేర్లు 3.3 శాతం పైకి ఎగిశాయి. -
ఫిబ్రవరిలో రెపో పావు శాతం కోత: హెచ్ఎస్బీసీ
ముంబై: బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6.25 శాతం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరిలో పావు శాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– హెచ్ఎస్బీసీ అంచనా వేస్తోంది. అయితే దీని తర్వాత రేట్ల కోతలకు బ్రేక్ పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులో అనిశ్చితి, కూడ్ర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) రేటు పెంపు అవకాశాలు దీనికి కారణంగా వివరించింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని, జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 6 శాతానికి పెరుగుతుందని హెచ్ఎస్బీసీ అంచనావేసింది. అయితే వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటుందనీ, వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ఈ రేటు 7.5–8 శాతం శ్రేణి మధ్య ఉంటుందని పేర్కొంది. -
ఈ ఏడాది చివరికి సెన్సెక్స్ 30,500 పాయింట్లకు..
హెచ్ఎస్బీసీ ముంబై: కేంద్ర ఆర్థిక సంస్కరణలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్స్టీ పన్ను విధానం వల్ల ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 30,500 పాయింట్లకు చేరవచ్చని అంతర్జాతీయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ హెచ్ఎస్బీసీ అంచనావేసింది. భారీగా ప్రభుత్వ పెట్టుబడులు, సబ్సిడీలు నేరుగా బదిలీ చేయడం వంటివి కూడా ఈ పెరుగుదలకు సహయపడతాయని సంస్థ సీఐఓ తుషార్ ప్రధాన్ చెప్పారు. తెలిపారు. పన్ను విధానాల్లో సంస్కరణలు సవాళ్లను స్వీకరించి వ్యాపార కార్యకలపాలకు సహాయకరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ప్రస్తుతం సెన్సెక్స్ 26 వేల నుంచి 27 వేల పాయింట్ల మధ్య కొనసాగుతోంది. బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 240.85 పాయింట్లు పెరిగి 27,140.41 పాయింట్ల వద్ద ముగిసింది. నోట్ల రద్దు స్వల్పకాలం మాత్రమే వుంటుందని, జీఎస్స్టీ అమలు వల్ల స్టాక్‌మార్కెట్ వృద్ధి ధీర్ఘ కాలం కొనసాగవచ్చని ప్రధాన్ చెప్పారు. నోట్ల రద్దు వల్ల రాబోయేకాలంలో ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రతికూలాంశాలు ఎదురుకావచ్చని, జీడీపీలో 61 శాతంగా ఉన్న సేవా రంగం కొంతమేర ఆదాయాన్ని నష్టపోయే అవకాశం ఉందన్నారు. దీని వల్ల 60 శాతం కుటుంబాల మీద భారం పడోచ్చని తెలిపారు. జీఎస్స్టీని విజయవంతంగా అమలు చేసినట్లయితే ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుందన్నారు. ద్రవ్యలోటు కూడా సరైన మార్గంలోనే ఉందని ఆయన అన్నారు. -
ఆర్థికాభివృద్ధి తగ్గుతుంది..తదుపరి సంస్కరణలు కీలకం
న్యూఢల్లీ: డీమోనిటైజేషన్ కారణంగా భారత్ ఆర్థికాభివృద్ధి వచ్చే 12 నెలల్లో 1 శాతం మేర తగ్గుతుందని ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ అంచనావేసింది. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఒనగూడాలంటే..తదుపరి చేపట్టబోయే సంస్కరణలు కీలకమైని హెచ్ఎస్బీసీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదికలో వివరాలు... పెద్ద నోట్లను ఉపసంహరించడం..వాటి స్థానంలో కొత్త పెద్ద నోట్లను ప్రవేశపెట్టడంవల్ల కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని నష్టాలు వున్నాయి. ద్రవ్య సరఫరా తగ్గినందున, ఏడాదికాలంలో జీడీపీ 0.7-1.0 శాతం మేర తగ్గవచ్చు. అధిక ప్రభావం డిసెంబర్, మార్చిలతో ముగిసే త్రైమాసికాల్లో వుంటుంది. నల్లధనంవల్ల సమాంతరంగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ ఇక అధికారికమైపోతున్నందున, ప్రభుత్వం ఇందుకు తగిన సంస్కరణల్ని ప్రవేశపెడితే ప్రయోజనాలు దీర్ఘకాలంలో వుంటాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా డబ్బు చేరినందున..రుణ, డిపాజిట్, ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు పాత పెద్ద నోట్లలో 80 శాతం బ్యాంకుల వద్దకు చేరితే, బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లు రూ.11.3 లక్షల కోట్ల మేర పెరుగుతాయి. దీంతో డిపాజిట్, రుణ రేట్లు బాగా తగ్గుతాయి. ఆర్బీఐ పరపతి విధానానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో పావు శాతం రేటు తగ్గే అవకాశం వుంది. -
ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు కిందికి!
నోట్ల రద్దుపై సిటీ గ్రూప్, హెచ్ఎస్బీసీ, కొటక్ అంచనా న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో అదుపులో ఉంటుందని పలు ఆర్థిక సేవల దిగ్గజ సంస్థలు అంచనా వేస్తున్నారుు. ఈ నేపథ్యంలో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్ప కాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గే అవకాశం ఉందని సిటీగ్రూప్, కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, హెచ్ఎస్బీసీ సంస్థలు అభిప్రాయపడుతున్నారుు. డిసెంబర్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో మూడు సంస్థల నివేదికలు... వాటి అంచనాలను చూస్తే... ద్రవ్యోల్బణం 4 శాతం లోపే..: సిటీ గ్రూప్ నవంబర్ - డిసెంబర్లో వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 4 శాతం దిగువనే ఉంటుంది. అరుుతే మార్చి నాటికి 4.5 శాతానికి చేరే వీలుంటుంది. ఈ నేపథ్యంలో పరపతి విధాన తదుపరి సరళీకరణ ఉండే వీలుంది. ‘‘డిసెంబర్లో రేటు కోత ఉంటుందన్న మా అంచనాలను కొనసాగిస్తున్నాం. అరుుతే ఇక్కడ ఆయా అంచనాలు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వంటి అంశాలపైనా ఆధారపడి ఉంటుంది. ద్రవ్యలభ్యత, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం’’అని సిటీగ్రూప్ నివేదిక తెలిపింది. నోట్ల రద్దుతో డిమాండ్ డౌన్: కొటక్ పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలంలో వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు దోహదం చేసే అంశం. ఇది ద్రవ్యోల్బణం అదుపునకు, ఆర్బీఐ రేటు కోతకు దోహదపడే వీలుంది. డిసెంబర్లో 25 బేసిస్ పారుుంట్ల రెపో రేటు తగ్గే వీలుంది. డిమాండ్ భారీగా పడిపోతే రేటు కోత 50 బేసిస్ పారుుంట్ల వరకూ సైతం తగ్గవచ్చు. పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం రియల్టీ సంబంధిత రంగాలు, రిటైల్ వ్యాపారం, ఇతర వినియోగ వస్తువుల విభాగాలపై ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం 5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. హెచ్ఎస్బీసీదీ అదే మాట పెద్దనోట్ల రద్దు కారణంగా వ్యవస్థలో డిమాండ్ తగ్గుతుందని హెచ్ఎస్బీసీ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రోపో రేటు పావుశాతం తగ్గే వీలుందని తెలిపింది ‘ మార్చి నాటికి ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం. పెద్ద నోట్ల రద్దు, క్రూడ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అదుపులో ఉండడం వంటి అంశాలు అటు టోకు ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశాలు. అరుుతే ఆయా అంశాలన్నీ అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల తీవ్రతపై ఆధారపడి ఉంటాయని కూడా నివేదిక పేర్కొంది. -
దీర్ఘకాలంలో మెరిసేది బంగారమే!
ముంబై/న్యూయార్క్: పసిడి ప్రస్తుతం భారీ పతనాన్ని చూస్తున్నా... ఇప్పటికీ పుత్తడిపై అంచనాలు మాత్రం తగ్గటం లేదు. ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- హెచ్ఎస్బీసీ పసిడి విభాగ ప్రధాన విశ్లేషకులు జేమ్స్ స్టీల్... తాజాగా ఈ ఎల్లో మెటల్‌పై పూర్తి సానుకూల అంచనాలను ఆవిష్కరించారు. ప్రపంచ వాణిజ్యం మందగిస్తున్న పరిణామం పసిడి కొనుగోళ్ల అంచనాలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ‘‘దీంతో పాటు పెట్టుబడుల బలహీనత, ప్రపంచ ఆర్థిక విధానాల్లో అస్పష్టత, ఒక దేశంలో ఆర్థిక సమస్యల ప్రభావం మరోదేశంపై పడుతుండడం వంటి అంశాలు పసిడి మెరుపులకు కారణం కానున్నాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పసిడిపై పెట్టుబడులు దీర్ఘకాలంలో అత్యుత్తమమైనవిగా మారతాయి’’ అని ఆయన విశ్లేషించారు. ప్రపంచ వాణిజ్య వృద్ధి ఈ ఏడాది 2.8 శాతంగా ఉంటుందని ఈ ఏడాది ఏప్రిల్‌లో అంచనావేసిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ప్రస్తుతం ఈ అంచనాలను 1.7 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్ధులిరువురి విధానాలూ పసిడి బలోపేతానికి సానుకూలమేననీ జేమ్స్ స్టీల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి మాత్రం పసిడి ఔన్స్‌కు 1,400 డాలర్లు దాటకపోవచ్చని ఆయన విశ్లేషించారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, డాలర్ బలోపేతం, ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తక్కువగా ఉండడం వంటి కారణాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. వారం ధోరణి ఇదీ... ఇక శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వారం వారీగా ఏడు డాలర్లు తగ్గి 1,252 డాలర్లకు పడింది. ఇక దేశీయంగానూ ఇదే ప్రభావం కనబడింది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.95 దిగి రూ.29,900కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పడి రూ.29.750కి చేరింది. పసిడి దిగువబాట ఇది వరుసగా మూడవవారం. ఇక వెండి కేజీకి ధర రూ.295 ఎగసి రూ.42,680 వద్ద ముగిసింది. ఔన్స్ 31.1గ్రాములు - ప్రస్తుత ధర 1,252 డాలర్లు... డాలర్‌కు రూపాయి మారకపు విలువ దాదాపు రూ. 68 -
ఈ-కామర్స్‌లో 120లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో భారత్‌లో ఈ-కామర్స్ రంగానికి ఆదరణ గణనీయంగా పెరుగుతుందట. వచ్చే 10ఏళ్లలో ఈ సెక్టార్, దాదాపు 120 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఈ సెక్టార్ లో ఉద్యోగాలు అందుకుంటున్నారని, సర్వీసు సెక్టార్ రంగంలో ఈ-కామర్స్ ఓ కొత్త మార్గంగా రూపుదిద్దుకోబోతుందని హెచ్ఎస్బీసీ రిపోర్టు వెల్లడించింది. యువ జనాభా పెరగడం, స్మార్ట్ఫోన్లకు డిమాండ్ వేగవంతంగా పెరగడం, డిజిటల్ పేమెంట్ల విప్లవం ఇవన్నీ ఈ-కామర్స్ రంగం గణనీయమైన వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. అయితే, ఇంటర్నెట్ వ్యాప్తికి, ఆన్ లైన్ కొనుగోలుకు చైనా కంటే భారత్ ఏడేళ్లు వెనుకబడి ఉందని రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం భారత్ సృష్టిస్తున్న ఉద్యోగాలతో పోలిస్తే ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంటాయని రిపోర్టు అధ్యయనం కనుగొంది. ఆన్లైన్ కొనుగోలు పెరుగుతున్నా కొద్ది ఈ-కామర్స్ దిగ్గజాలు లాజిస్టిక్స్& డెలివరీ, కస్టమర్ కేర్, ఐటీ అండ్ మేనేజ్ మెంట్లలో 20 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తాయని హెచ్ఎస్బీసీ వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో భారత్ లో క్రియేట్ అయ్యే 24 మిలియన్ ఉద్యోగాల్లో, సగం ఈ-కామర్స్ రంగమే భర్తీ చేస్తుందని ఈ రిపోర్టు తెలిపింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న డిజిటల్ షాపుల మాదిరిగా.. భారత్‌లోనూ 5 మిలియన్ గ్రామీణ వర్తకులతో ఈ రెవల్యూషన్ ప్రారంభంకాబోతుందని వెల్లడించింది. దీంతో వచ్చే పదేళ్లలో మరిన్ని జీవనోపాధి అవకాశాలు గ్రామాల్లో అందుబాటులోకి వస్తాయని హెచ్ఎస్బీసీ రిపోర్టు పేర్కొంది. -
కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!
-
కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!
♦ ఇద్దరు హెచ్ఎస్బీసీ అధికార్లపై కేసులు ♦ లావాదేవీకి ముందే పౌండ్ల కొనుగోలు లండన్: బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం ‘హెచ్ఎస్బీసీ’కి సంబంధించిన 3.5 బిలియన్ డాలర్ల ఫారెక్స్ ట్రేడింగ్ మోసంలో భారతీయ కంపెనీ లింకులు బయటపడ్డాయి. ఫారెక్స్ మోసానికి సంబంధించి బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. ఒక కంపెనీ (క్లయింట్) తన భారతీయ వ్యాపారాన్ని వేరొక కంపెనీకి విక్రయించిన ఘటనలో వీరిద్దరూ ఆ క్లయింట్‌ను మోసం చేశారనేది ప్రధాన అభియోగం. ఆ క్లయింట్ ఎవరన్నది అధికారికంగా బయటపడకపోయినా యూకే మీడియా నివేదికల ప్రకారం అది కెయిర్న్ ఎనర్జీగా వెల్లడవుతోంది. ఇది 2010లో కెయిర్న్ ఇండియాలోని తన వాటాను 3.5 బిలియన్ డాలర్లకు వేదాంతాకు విక్రయించింది. దీంతో ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించి కెయిర్న్ ఎనర్జీ... హెచ్ఎస్బీసీని ఫారెక్స్ కన్వర్టర్గా (3.5 బిలియన్ డాలర్లని పౌండ్లలోకి మార్చడానికి) నియమించుకుంది. దీన్ని గురించి తెలిసిన హెచ్ఎస్బీసీ ఫారెక్స్ ట్రేడింగ్ విభాగం హెడ్ మార్క్ జాన్సన్, హెచ్ఎస్బీసీ మాజీ ఉద్యోగి స్ట్రాట్ స్కాట్ దీనిద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. లావాదేవీ జరగటానికి ముందే భారీగా పౌండ్లను కొనుగోలు చేశారు. -
భారత్ వృద్ధి రేటు వెనక్కే!
♦ హెచ్ఎస్బీసీ నివేదిక రెండేళ్లలో 7.6 శాతం నుంచి ♦ 7.2 శాతానికి పడిపోతుందని అంచనా ♦ గణాంకాల మదింపుపై అస్పష్టతపైనా అస్త్రాలు న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు మందగమనంలోనే ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- హెచ్ఎస్బీసీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ఇది 7.4 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందనీ తన నివేదికలో అంచనావేసింది. 2017-18లో ఇది మరింత తగ్గి 7.2 శాతానికి దిగుతుందనీ విశ్లేషించింది. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, ప్రతికూల పరిణామాలు తన అంచనాకు కారణమని పేర్కొంది. భారత జీడీపీ గణాంకాల మదింపు సందేహాలు అలానే కొనసాగుతుండడం మరో ముఖ్యాంశంగా హెచ్ఎస్బీసీ పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇒ అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య, ప్రైవేటు పెట్టుబడులకు ఊపందుకోకపోవడం, చమురు ధరలు క్రమంగా పెరుగుతున్న ధోరణి వంటి సవాళ్లు భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలు. ⇒ వృద్ధి రేటు వెనకడుగు వేసినా... ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశమే కొనసాగుతుంది. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2016-17 ఏప్రిల్, జూన్) భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతం నమోదుకావడానికి పట్టణ వినియోగ డిమాండ్ పెరగడమే కారణం. ⇒ జీడీపీ గణాంకాల మదింపుపై ఆందోళనలు ఉన్న విషయం గమనార్హం. ఇలాంటి అంశాలకు సంబంధించి కొన్ని సర్దుబాట్లు జరిగితే వాస్తవ వృద్ధి అధికారిక అంచనాలకన్నా దాదాపు 150 బేసిస్ పాయింట్లు తక్కువగా (1.5 శాతం) 6 నుంచి 6.5 శాతం వరకూ ఉండే అవకాశం ఉంది. వృద్ధికి సంబంధించి అధికంగా అంచనావేసిన గణాంకాల విషయమై రానున్న ఆరు త్రైమాసికాల్లో 80 బేసిస్ పాయింట్లు తగ్గే వీలుంది. ⇒ ప్రభుత్వ వేతన పెంపు, దీనితో పట్టణ వినియోగ డిమాండ్‌లో వృద్ధి, సాధారణ వర్షపాతం అవకాశాలు తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత పాలసీ రేట్ల కోత ప్రయోజనం కస్టమర్‌కు బదలాయింపు, దీనితో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెరుగుదల, ప్రభుత్వ సంస్కరణల అమలు వంటి అంశాలు భారత్ వృద్ధికి సానుకూల అంశాలు. ⇒ అంచనాలకు అనుగుణంగా తగిన వర్షపాతం నమోదై, వినియోగ ద్రవ్యోల్బణం తగ్గితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో(ప్రస్తుతం 6.5 శాతం) పావుశాతం తగ్గే అవకాశం ఉంది. -
మరింత బ్లాక్‌మనీ బయటికొస్తుంది
♦ వేగంగా దర్యాప్తు నిర్వహిస్తాం: జయంత్ సిన్హా ♦ నల్లధనం వెల్లడిపై నేడు వివిధ వర్గాలతో జైట్లీ భేటీ న్యూఢిల్లీ: విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు పనామా పత్రాలతో సహా వివిధ మార్గాల్లో తెలిసిన సమాచారం ఆధారంగా వేగవంతమైన దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, మరిన్ని నల్లధనం కలుగుల సమాచారం బయటకు వస్తుందని చెప్పారాయన. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సిన్హా ఈ అంశంపై మాట్లాడుతూ... ‘‘హెచ్ఎస్బీసీ, ఐసీఐజే పత్రాల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా విదేశీ బ్యాంకుల్లో దాచి ఉంచిన రూ.13వేల కోట్ల రూపాయల నల్లధనం వివరాలను ఐటీ శాఖ ఇప్పటికే సేకరించింది. ఇక దేశీయంగా దాచి పెట్టుకున్న నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ తర్వాత జరిమానాలు విధిస్తాం’’ అని చెప్పారు. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధాని మోదీ సైతం సూచించారు. ఇదే చివరి అవకాశమని, దీన్ని కోల్పోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా. ⇒ బ్రెగ్జిత్తో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు: బ్రెగ్జిట్‌పై ఓ ప్రశ్నకు సిన్హా స్పందిస్తూ... ‘‘ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి రెండు మూడేళ్ల సమయం పడుతుంది. తగిన సర్దుబాటు చేసుకునేందుకు, మార్పులను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఉంది’’ అన్నారు. మరోవైపు, దేశీయంగా దాగి ఉన్న నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంపై (ఐడీఎస్) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం వివిధ వాణిజ్య సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏ), ఇతర వృత్తి నిపుణులతో సమావేశమవుతారు. నిబంధనల గురించి వారికున్న సందేహాలు తీరుస్తారు. ⇒ సెప్టెంబర్ 30 వరకూ అవకాశం: స్వచ్చందంగా నల్లధనం వివరాలు వెల్లడించేందుకు వీలుగా ‘ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) 2016’ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టింది. జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇందులో భాగంగా తమ రహస్య ఆస్తులు, నిధుల వివరాలు స్వచ్చందంగా వెల్లడించి వాటి మొత్తం విలువపై పన్ను, జరిమానా రూపంలో 45 శాతం మేర చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలకూ ఐడీఎస్.. పాన్ తప్పనిసరి నల్లధనం వెల్లడికి ప్రభుత్వం కల్పించిన ఏకైక అవకాశం ‘ఐడీఎస్’ విషయంలో తలెత్తే పలు సందేహాలకు స్పష్టతనిస్తూ ఆదాయపన్ను శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో 14 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా... తాజాగా మరో 11 సందేహాలకు స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం... స్వచ్చందంగా నల్లధనం గురించి సమాచారం బయటకు వెల్లడించే వారు తమ పాన్ నంబర్ ను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారు నిబంధనల మేరకు పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యక్ష పన్నులకు పాన్ నంబర్ ప్రత్యేక గుర్తింపు అని, ప్రయోజనాలు, మినహాయింపులు పొందాలన్నా ఇది తప్పనిసరి అని పేర్కొంది. దేశంలో నివసించే వారితోపాటు ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ)లు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, ఐటీ శాఖ ఎవరి విషయంలోనైనా దాడులు నిర్వహించి, సెక్షన్ 153ఏ కింద నోటీసులు జారీ చేస్తే అటువంటి వారు ఈ పథకానికి అర్హులు కారు. పన్ను వర్తించే ఆదాయ శ్లాబ్‌లో ఉండి రిటర్నులు దాఖలు చేయనందుకు సమన్లు అందుకుని, తదుపరి చర్యల విషయంలో ఎలాంటి నోటీసులు జారీ కాకుండా ఉంటే అటువంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైనా లేదా పరిమిత బాధ్యతతో కూడిన భాగస్వామ్యం కుదుర్చుకున్నా (ఎల్ఎల్పీ)... విలీనం చేసుకున్న కంపెనీ పేరుమీద లేదా ఎల్ఎల్పీ పేరు మీద అయినా ఆస్తులు వెల్లడించవచ్చు. -
ప్రపంచ వృద్ధికి భారత్ బాట
ముంబై: ప్రపంచ ఆర్థిక చోదకశక్తిగా వ్యవహరించే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని హెచ్ఎస్బీసీ ఒక నివేదికలో పేర్కొంది. 2025 నాటికి ఈ దిశలో కీలక స్థానానికి చేరుతుందని విశ్లేషించింది. నివేదిక ప్రకారం.. ప్రపంచం మొత్తం మందగమనంలో ఉన్నా భారత్ ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి చోదకశక్తిగా ఆవిర్భవించే అవకాశాలు భారత్‌కు ఏర్పడ్డాయి. 2029 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక వాటాను సంపాదించుకుంటుంది.7% వృద్ధి నమోదైతే.. దేశం 2029 నాటికి ‘చైనా 2005 నాటి’ ప్రపంచ కీలక స్థాయిని చేరుతుంది. ఇంకా ఎక్కువ వృద్ధి నమోదయితే 2023కే ఈ ఫలితాన్ని అందుకునే వీలుంది. -
7న ఆర్ బీఐ రేట్ల కోత ఉండదు
ఇండియా రేటింగ్స్, హెచ్ఎస్బీసీ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్ 7వ తేదీన జరిపే ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించకపోవచ్చని ఇండియా రేటింగ్స్, హెచ్‌ఎస్‌బీసీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఇప్పటికే జరిగిన రేటు కోత ప్రయోజనం కస్టమర్‌కు బ్యాంకింగ్ అందించడం, అలాగే ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ రేటు కోత, యూరోజోన్‌లో (కొనసాగడంపై) బ్రిటన్ భవితవ్యం వంటి అంశాలు సమీక్షలో ప్రధానాంశాలు అవుతాయన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్ వ్యక్తం చేసింది. కాగా 7న రేటు కోత అవకాశాలను తోసిపుచ్చిన హెచ్ఎస్బీసీ,ఆగస్టులో పావుశాతం కోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని అంచనావేస్తున్న రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్‌స్టాన్లీ, జూన్ 7 ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా మాత్రం రేటు కోతకు అవకాశం ఉండదని తన అభిప్రాయపడుతోంది. -
భారత్ వృద్ధి పటిష్టం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: సమీప కాలానికి భారత్ వృద్ధి తీరు మెరుగుపడుతోందని బ్యాంకింగ్ సేవల దిగ్గజం హెచ్ఎస్బీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. వస్తు సేవల పన్ను బిల్లు ఈ ఏడాది చివర్లో ఆమోదం పొందే వీలుందని, ఆ తర్వాత వృద్ధికి సంబంధించిన అంశాలు మరింత పటిష్టమయ్యే వీలుందని అంచనావేసింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన దివాలాబిల్లుసహా ఆధార్ బిల్లు, మానిటరీ పాలసీ కమిటీ బిల్లు, జీఎస్టీ బిల్లు వృద్ధి బాటలో కీలకమని విశ్లేషించింది. బీజేపీకి ప్రజాదరణ తగ్గలేదని తాజా ఎన్నికలు పేర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వానికి కీలక బిల్లుల విషయంలో పెద్దల సభలో ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనావేసింది. -
హెచ్ఎస్బీసీ విశాఖ బ్రాంచ్ మూసివేత
ముంబై: బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా ఇండియాలో కొన్ని శాఖల్ని మూసివేయనుంది. ప్రస్తుతం 29 పట్టణాల్లో 50 శాఖలను కలిగిన హెచ్ఎస్బీసీ.. తన బ్రాంచ్‌ల సంఖ్యను 26కి (14 పట్టణాల్లో) తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంక్ మూసివేయనున్న బ్రాంచ్‌ల్లో విశాఖపట్నం శాఖ కూడా వున్నట్లు తెలిపింది. గువాహటి, ఇండోర్, లక్నో, జోద్పూర్, థానే, మైసూర్, నాగ్‌పూర్, నాసిక్, పాట్నా, త్రివేండ్రం, సూరత్ వంటి తదితర ప్రాంతాల్లోని బ్రాంచ్‌లను మూసివేయనున్నట్లు పేర్కొంది. ఇక హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లోని బ్రాంచులను అలాగే కొనసాగించనుంది. బ్రాంచ్‌ల సంఖ్య తగ్గినా.. రిటైల్ కార్యకలాపాల్లో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తామని పేర్కొంది. -
భారత్ లో ఆర్థిక అసమానతలు అధికం
♦ ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి ♦ ఆసియా పసిఫిక్‌లో భారత్, చైనాల్లోనే అత్యంత దుర్భరమని విశ్లేషణ సింగపూర్: భారత్, చైనాల్లో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో- ఈ రెండుదేశాల్లోనే ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలయినప్పటికీ ఈ దేశాల్లో ఆర్థిక సమతౌల్యతలు తగిన విధంగా లేవని పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. ♦ భారత్, చైనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పేదరికమూ తగ్గుతోంది. అయితే ధనిక, పేద మధ్య వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ♦ గతంలో ఆసియాలో వృద్ధి పంపిణి తగిన స్థాయిలో ఉండేది. అయితే భారత్, చైనాలు ఇటీవల పేదరికం తగ్గుతున్నా.... సమానత్వ సాధన ద్వారా వృద్ధి చెందడంలో వెనకబడుతున్నాయి. ♦ పట్టణ ప్రాంతాల్లో మధ్య తరగతి ఆదాయాల పెరుగుదలలో చైనా, థాయ్‌లాండ్‌లు కొంత విజయం సాధించగలిగాయి. అయితే భారత్, ఇండోనేసియాలు అధిక ఆదాయ స్థాయిలవైపు ఈ వర్గాన్ని తీసుకువెళ్లడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ♦ భారత్, చైనాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆదాయాల్లో సైతం వ్యత్యాసం తీవ్రంగా పెరిగింది. చైనాలో వేగవంతమైన పారిశ్రామికీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోస్తా ప్రాంతాలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు మారుమూల ప్రాంతాల వృద్ధికి విఘాతంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు కూడా పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వ్యత్యాసానికి కారణం. ♦ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు కూడా బలహీనంగా ఉన్నాయి. ♦ కాగా ఆదాయ వ్యత్యాసాలను తొలగించడానికి, ఆర్థిక పారదర్శకతను నెలకొల్పడానికి రెండు దేశాలు తగిన ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఇవి రానున్న కాలంలో కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. భారత్‌లో అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రారంభించిన జన్‌ధన్ యోజన ప్రశంసనీయమైనది. దీనితోపాటు, ఆధార్, మొబైల్ ఆధారిత సేవలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద కార్యకలాపాలు ఆర్థిక స్వావలంభన దిశలో ముఖ్యమైనవి. భారత్ వృద్ధి 7.4 శాతం: హెచ్ఎస్బీసీ న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది(2016-17) 7.4% వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- హెచ్ఎస్బీసీ తన పరిశోధనా నివేదికలో అంచనావేసింది. వచ్చే ఆరు త్రైమాసికాల్లో తయారీ రంగం పేలవంగా ఉండే అవకాశం ఉందనీ, అయితే అదే సమయంలో తగిన వర్షపాతం వల్ల వ్యవసాయ రంగం మంచి ఫలితాలను అందించే అవకాశం ఉందని వివరించింది. మొత్తం జీడీపీలో ఈ రంగాల వాటా వరుసగా 17, 15 శాతాలుగా ఉండే వీలుందని నివేదిక పేర్కొంది. ఇక బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య కొనసాగుతుందని పేర్కొంది. తగిన వర్షపాతం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6%గా నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. ఆర్థికశాఖకు సంబంధించి ఈ అంచనాలు 7-7.75%గా ఉన్నాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంచనాలు కూడా హెచ్ఎస్బీసీ అంచనాల స్థాయిలోనే 7.4%గా ఉన్నాయి. వృద్ధికి సంస్కరణలు కీలకం: కొటక్: కాగా భారత్ సత్వర వృద్ధికి సంస్కరణలు కీలకమని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. చైనాలో మందగమన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని భారత్ దిశగా మళ్లించడానికి భారత్‌లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా వస్తు సేవల పన్ను, దివాలా కోడ్ అమలు, కార్మిక చట్ట సంస్కరణల అవసరాన్ని ఉద్ఘాటించింది. విద్యా, ఉపాధి రంగాల్లో మెరుగుదల, సామాన్యునికి సత్వర న్యాయం దిశలో చర్యలు అవసరమని సూచించింది. -
2016-17లో వృద్ధి 7.4 శాతం: హెచ్ఎస్ బీసీ
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.4% నమోదవుతుం దని ఆర్థిక సేవల దిగ్గజం హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. దేశంలో వినియోగ డిమాండ్ వృద్ధికి దోహదపడే ప్రధాన అంశంగా నివేదిక పేర్కొంది. పెట్టుబడుల రికవరీ వేగవంతం అవుతుందని భావించనప్పటికీ, ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ బలంగా మారనుం దని వివరించింది. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఇంకా ఊపందుకోని పరిస్థితి వల్ల ఇన్వెస్టమెంట్ల క్రియాశీలతపై అనిశ్చితి నెలకొంటున్నట్లు విశ్లేషించింది. -
కార్పొరేట్ మొబైల్ బ్యాంకింగ్ జోరు: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ : కార్పొరేటర్ల మొబైల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫామ్ వినియోగంలో గణనీయమైన వృద్ధి నమోదౌతోందని హెచ్ఎస్బీసీ తెలిపింది. వచ్చే 18 నెలలో మొబైల్ బ్యాకింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా జరిగే గ్లోబల్ పేమెంట్స్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. డ్రాఫ్ట్స్, చెక్స్ వంటి సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ట్రెజరర్స్ వంటి కార్పొరేటర్లు వారి ఆర్థిక లావాదేవీలకు మొబైల్ బ్యాంకింగ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని పేర్కొంది. అకౌంట్ బ్యాలెన్స్‌ను చూసుకోవడానికి, పేమెంట్ అలర్ట్స్ తదితర వాటికి మొబైల్ బ్యాంకింగ్ అనువుగా ఉంటుందని అభిప్రాయపడింది. అలాగే ఇంటర్నేషనల్ లావాదేవీలను మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా నిర్వహించవచ్చని పేర్కొంది. -
మార్కెట్‌పై వర్షాభావం ఎఫెక్ట్...
27,000 దిగువకు సెన్సెక్స్ 351 పాయింట్ల నష్టంతో 26,837కు 101 పాయింట్ల నష్టంతో 8,135కు నిఫ్టీ ముంబై: కరువు భయాలకు, నిరాశజనకమైన హెచ్ఎస్బీసీ సేవల రంగం గణాంకాలు తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ కుదేలైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 27,000 పాయింట్ల దిగువకు పతనమైంది. నిఫ్టీ ఇంట్రాడేలో 8,100 దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలో ముఖ్యంగా వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, ఆర్థిక సంస్థల, ఫ్రంట్‌లైన్ ఎఫ్ఎంసీజీ షేర్ల కంపెనీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు క్షీణించి 26,837 పాయింట్ల వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 8,135 వద్ద ముగిశాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,012 పాయింట్లు క్షీణించింది. మే 7 తర్వాత ఇదే సెన్సెక్స్ కనిష్ట స్థాయి ముగింపు. నెస్లే భారీ పతనం..: మ్యాగీ వివాదం కారణంగా నెస్లే షేర్ 9.21 శాతం పతనమై రూ.6,187కు పడిపోయింది. రూ.5,942 కోట్ల మార్కెట్ క్యాప్ కరిగిపోయింది. పునర్వ్యస్థీకరణ కారణంగా అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ షేర్ 80 శాతం క్షీణించి రూ.110 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,501 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.18,913 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,26,233 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.728 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.413 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. వంద లక్ష కోట్ల దిగువకు.. ఇన్వెస్టర్ల సంపద బుధవారం వంద లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,012 పాయింట్లు క్షీణించడంతో రూ.3 లక్షల కోట్ల మార్కెట్ విలువ అవిరైంది. బుధవారం నాడు బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.98,83,222 కోట్లకు తగ్గింది. -
‘సేవల’పై నీలినీడలు: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 60 శాతం ఉన్న సేవల రంగం మే నెలలో అసలు వృద్ధి లేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఇలాంటి పరిస్థితి గడిచిన 13 నెలల్లో ఇదే తొలిసారి. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజి నెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఏప్రిల్‌లో 52.4 పాయింట్ల వద్ద ఉంటే మేలో ఈ పాయింట్లు 49.6కు పడిపోయాయి. ఆర్డర్లు తగ్గడం, పెరిగిన ధరలు వంటివి దీనికి కారణమని హెచ్ఎస్బీసీ పేర్కొంది. తాజా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫలితం క్షేత్ర స్థాయిలో వాస్తవ ఆర్థిక అభివృద్ధిపై సందేహాలను లేవనెత్తుతోంది. కాగా తయారీ, సేవల రంగాలు రెండింటికీ సంబంధించి కాంపోజిట్ హెచ్ఎస్బీసీ ఇండెక్స్ కూడా మేలో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడింది. ఏప్రిల్‌లో ఈ పాయింట్లు 52.5 వద్ద ఉండగా, మేలో 51.2కు తగ్గింది. 50 పాయింట్ల పైన హెచ్ఎస్బీసీ సూచీ ఉంటే, అది సానుకూలంగానే భావించడం జరుగుతుంది. 50 పాయింట్ల లోపునకు పడిపోతే అది క్షీణతకు ప్రతిబింబం. -
మేలో ‘తయారీ’భేష్: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పనితీరును కనబరచిందని హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ ఏప్రిల్‌లో 51.3 పాయింట్ల వద్ద ఉంటే.. మేలో 52.6కు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. దేశీయ డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణమని కూడా హెచ్ఎస్బీసీ వివరించింది. ముడి వస్తువుల ధరలు తీవ్రంగానే ఉన్నాయని, ఉపాధి కల్పన విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని నివేదిక పేర్కొంటూ... అయినా దేశీయ డిమాండ్ పటిష్టతతో తయారీ రంగం మేలో కొంత మెరుగుపడినట్లు తెలిపింది. హెచ్ఎస్బీసీ సూచీ కూర్పు ప్రకారం... ఇది 50 పాయింట్ల పైన ఉంటే.. సంబంధిత రంగం వృద్ధిలో ఉన్నట్లే భావించడం జరుగుతుంది. దిగువన ఉంటే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన తయారీ రంగం వరుసగా 19 నెలల నుంచీ వృద్ధి స్థాయిలోనే కొనసాగుతోంది. -
వచ్చే ఏడాది 8% వృద్ధి: ఫిచ్
భారత జీడీపీపై అంచనాలు 7.8% ఉండొచ్చంటున్న హెచ్ఎస్బీసీ ముంబై: భారత ఆర్థిక వృద్ధి అంచనాల పట్ల వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. భారత జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 శాతంగానూ, 2016-17లో 8.3 శాతంగానూ ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేస్తోంది. బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని ‘గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదికలో ఫిచ్ పేర్కొంది. జీడీపీ గణనకు ఆధార సంవత్సరాన్ని 2004-05కు బదులుగా కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ) 2011-12కు మార్చిన విషయం తెలిసిందే. వృద్ధి వేగవంతంగా ఉండే అవకాశాలున్నప్పటికీ, బ్యాంక్‌ల మొండి బకాయిలు పెరుగుతున్నాయని, కంపెనీల ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, పెట్టుబడుల స్థాయిలు కనిష్ట స్థాయిలో ఉన్నాయని ఫిచ్ ఆందోళన వెలిబుచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి విధానాల్లో ఉదారత్వం భారత వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడింది. కాలం కలసివస్తోంది: హెచ్ఎస్బీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. భారత్‌కు కాలం కలసివస్తోందని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి వ్యాఖ్యానించారు. సంస్కరణల జోరు, స్తంభించిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, పెట్టుబడుల జోరు పెంచడం, ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. ఈ అంశాలన్నీ భారత వృద్ధికి చోదక శక్తులుగా పనిచేస్తాయన్నారు. -
నల్లఖాతాలు రెట్టింపు
హెచ్ఎస్బీసీ స్విస్ బ్యాంకులో ఖాతాలున్న భారతీయులు 1,195 మంది.. వెలుగుచూసిన మొత్తం జాబితా.. ఆ ఖాతాల్లో సొమ్ము రూ. 25,420 కోట్లు జాబితాలో అంబానీలు సహా వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నేతలు న్యూఢిల్లీ: నల్ల ఖాతాల తాజా జాబితా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో భారతీయుల నల్లఖాతాలు కుప్పలుతెప్పలుగా పెరుగుతూపోతున్నాయి. జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు మాజీ ఉద్యోగి హెర్వె ఫాల్కియాని లీక్ చేసిన జాబితాలో 1195మంది ఖాతాదారులు ఉన్నట్లు జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడి చేయటంతో రాజకీయ వ్యాపార వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశ వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, ఆనంద్ చాంద్ బర్మన్, రాజన్ నందా, యశోవర్ధన్ బిర్లా, చంద్రు లచ్మన్దాస్ రహేజా, భద్రష్యాం కొఠారి, శ్రావణ్‌గుప్తా, మను ఛాబ్రియా తదితర వాణిజ్యవేత్తలతో పాటు.. నారాయణ్‌రాణే, స్మితా ఠాక్రే తదితర రాజకీయవేత్తల కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరిలో చాలా మందికి రెండు అంతకన్నా ఎక్కువ ఖాతాలు ఉండటం విశేషం. 2007 నాటికి జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు శాఖలో మొత్తం 1195 మంది భారతీయుల పేర్లతో ఉన్న ఖాతాల్లో సుమారు 4.1 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 25,420 కోట్లు) నిధులు ఉన్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. కొత్త జాబితాలోని పేర్లన్నిటిపైనా దర్యాప్తు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేవలం పేర్లు మాత్రమే సరిపోవని.. కోర్టులో విచారణ జరగాలంటే బలమైన ఆధారాలూ ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, ఆధారాల కోసం ఆ జాబితాను బయటపెట్టిన కార్యకర్త (హెర్వె ఫాల్కియాని)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సర్కారు తెలిపింది. మరోవైపు.. నల్లధనంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం సమావేశమై తాజాగా వెలుగుచూసిన నల్లఖాతాల జాబితాపై చర్చించింది. ఇందులో నల్లధనం ఉన్నట్లు ఆధారాలున్న ఖాతాలన్నిటిపైనా దర్యాప్తు చేపడతామని సిట్ వైస్ చైర్మన్ అరిజిత్ పసాయత్ మీడియాతో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. తాజా జాబితాలో తమ పేర్లు ఉండటంతో.. అనిల్ అంబానీ, ముఖేశ్ అంబానీ వంటి పలువురు వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయ వాణిజ్యవేత్త నరేశ్‌గోయల్, రాజకీయవేత్త నారాయణ్‌రాణె వంటి వారు తమకు విదేశాల్లో అక్రమంగా ఎటువంటి బ్యాంకు ఖాతాలూ లేవని పేర్కొన్నారు. 428 మంది ఖాతాల్లో రూ. 4,500 కోట్లు... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఇంతకుముందు తమకు అందిన హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాల జాబితాలో 628 మంది పేర్లు ఉండగా.. అందులో 200 మంది భారత్‌లో నివసించటం లేదని, లేదా వారి వివరాలు తెలియటం లేదని పేర్కొంది. మిగిలిన 428 మందిపై చర్యలు తీసుకోవచ్చని గుర్తించామని.. ఈ ఖాతాల్లో మొత్తం రూ. 4,500 కోట్ల మేర నిధులు ఉన్నట్లు చెప్పింది. స్విస్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో రహస్య ఖాతాలున్న వారి పేర్లు బయటపెట్టిన కార్యకర్తతో భారత ఆదాయ పన్ను శాఖ సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. భారతీయుల రహస్య ఖాతాలకు సంబంధించి ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాల్సిందిగా కోరామని.. ఆయన స్పందన కోసం వేచిచూస్తున్నామని వివరించింది. తొలి జాబితాకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 31 వరకూ 128 కేసుల్లో పన్ను మదింపు (అసెస్మెంట్) పూర్తిచేశామని.. మిగతా కేసుల్లోనూ ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, మార్చి 31 నాటికి దర్యాప్తును పూర్తిచేస్తామని పేర్కొంది. బహిర్గతపరచని విదేశీ బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. 3,150 కోట్ల మేర అప్రకటిత ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తెచ్చినట్లు చెప్పింది. పన్ను మదింపు పూర్తయిన 128 కేసుల్లో ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 271(1)(సి) కింద జరిమానా చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు ప్రయత్నించటం, ఖాతాలు, పత్రాలు సమర్పించటంలో వైఫల్యం తదితర అంశాలపై ఇప్పటివరకూ 60 విచారణలు ప్రారంభించినట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో ఇతర కేసుల్లోనూ విచారణ ప్రారంభించటానికి ముందు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు చెప్పింది. ఇక తాజాగా వెల్లడైన జాబితాలో ఉన్న పేర్లలో కొన్ని ప్రభుత్వం వద్ద ఉన్న తొలి జాబితాలో కూడా ఉన్నాయని పేర్కొంది. కొత్త కేసులన్నిటిలోనూ చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన దర్యాప్తు చేపడతామని చెప్పింది. జెనీవా శాఖలోనే రూ.ఆరు లక్షల కోట్లు..! 2006-07 సంవత్సరం నాటికి హెచ్ఎస్బీసీ స్విట్జర్లాండ్ శాఖలో ఉన్న మొత్తం ఖాతాదారుల జాబితాను తాజాగా బయటపెట్టారు. ఇందులో భారత్‌తో సహా 200 పైగా దేశాల వ్యక్తుల ఖాతాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 10,000 కోట్ల డాలర్లకు (రూ. 6,00,000 కోట్లు) పైగా నిధులు ఉన్నాయి. ((ఇది అదే ఆర్థిక సంవత్సరం 2006-07లో భారతదేశ వార్షిక బడ్జెట్ రూ. 5,63,000 కోట్ల కన్నా అధికం)) ఇందులో స్విట్జర్లాండ్ దేశీయుల ఖాతాల్లోనే అత్యధిక నగదు (3,120 కోట్ల డాలర్లు) ఉంటే.. రెండో స్థానంలో బ్రిటన్ (2,170 కోట్ల డాలర్లు), మూడో స్థానంలో వెనిజువెలా (1,480 కోట్ల డాలర్లు), నాలుగో స్థానంలో అమెరికా (1,340 కోట్ల డాలర్లు), ఐదో స్థానంలో ఫ్రాన్స్ (1,250 కోట్ల డాలర్లు) ఉన్నాయి. భారతీయుల ఖాతాల్లో 410 కోట్ల డాలర్లు (రూ. 25,420 కోట్లు) ఉన్నాయని తాజా జాబితా చెప్తోంది. దొంగిలించిన సమాచారం: స్విస్ తాజాగా ప్రచురితమైన హెచ్ఎస్బీసీ ఖాతాదారుల జాబితా.. దొంగిలించిన సమాచారమని, 2007 అంతకుముందలి సంవత్సరాలకు చెందినదని స్విట్జర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే.. 2009 నుంచి తమ ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాయని.. వాటి ప్రకారం నల్లధనం సమస్యపై పోరాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. పేర్లు సరిపోవు.. ‘‘ఆ ఖాతాదారుల్లో అందరూ అక్రమం కాకపోవచ్చు. వారిలో కొందరు తమ విదేశీ వ్యాపార వ్యవహారాలను పన్ను అధికారులకు వెల్లడించారు. మరికొందరు ప్రవాస భారతీయులు. పటిష్టమైన కేసు నమోదు చేయాలంటే సాక్ష్యాధారాలు అవసరం. కోర్టులో విచారణ ప్రారంభించటానికి కేవలం పేర్లు మాత్రమే సరిపోవు. వాటికి బలమైన ఆధారాలు కావాలి. ఆధారం విశ్వసనీయంగా ఉంటేనే అది కోర్టులో నిలుస్తుంది. నేను గత నెలలో దావోస్‌లో స్విట్జర్లాండ్ ఆర్థికమంత్రితో సహా ఆ దేశ ఉన్నతాధికారులను కలిశాను. రహస్య ఖాతాలకు సంబంధించిన వివరాలను భారత్ కోరేందుకు.. సంబంధిత ఖాతాదారుల ఆదాయపన్ను మదింపును అదనపు సాక్ష్యంగా పరిగణించేందుకు ఆ సందర్భంగా అంగీకారం కుదరింది.’’ - అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థికమంత్రి విదేశాల్లో అక్రమ ఖాతాలేవీ లేవు: అంబానీ సోదరులు న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులో అక్రమ ఖాతాలున్న భారతీయులంటూ వెలుగుచూసిన తాజా జాబితాలో తమ పేర్లు ఉండటంపై అంబానీ సోదరులు సహా పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు స్పందించారు. తమకు విదేశాల్లో అక్రమ ఖాతాలేవీ లేవని పేర్కొన్నారు. ‘‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కానీ, ముకేశ్ అంబానీకి కానీ ప్రపంచంలో ఎక్కడా అక్రమ బ్యాంకు ఖాతాలు లేవు’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు. అలాగే.. అనిల్ అంబానీకి కూడా విదేశాల్లో హెచ్ఎస్బీసీ ఖాతా ఏదీ లేదని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘అక్కడ నల్లనిది (ధనం) ఏమీ లేదు.. దాచటానికి ఏమీ లేదు.. ఆందోళన చెందటానికి ఏమీ లేదు.. నేను నియమ, నిబంధనలన్నిటినీ పాటిస్తున్నా’’ అని జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. తనకు స్విస్ బ్యాంకుల్లో ఎలాంటి ఖాతాలూ లేవని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌రాణే చెప్పారు. -
3 నెలల కనిష్టానికి తయారీ రంగం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వృద్ధి జనవరిలో మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గినట్లు హెచ్ఎస్బీఐ మార్కెట్ సర్వే ఒకటి వెల్లడించింది. సోమవారం ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆర్డర్లు తగ్గడం దీనికి కారణమని సర్వే తెలిపింది. డిసెంబర్లో రెండేళ్ల గరిష్టాన్ని తాకిన ఈ పాయింట్లు మరుసటి నెలలోనే మూడు నెలల కనిష్టానికి తగ్గడం గమనార్హం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, తయారీ రంగానికి సంబంధించి సూచీ పాయింట్లు డిసెంబర్లో 54.5 వద్ద ఉండగా, ఇది 52.9కి పడిపోయింది. అయితే ఈ పాయింట్లు 50కి పైనుంటే వృద్ధికి సంకేతంగా, 50 దిగువకు పడిపోతే, క్షీణతకు చిహ్నంగా భావిస్తారు. ఫిబ్రవరి 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తాజా సర్వే వివరాలు విడుదల చేసింది. -
ప్రభుత్వ వ్యయంతోనే వృద్ధికి జోష్: హెచ్ఎస్బీసీ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యయాల పెంపు, ఆగిపోయిన ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించడం ఒక్కటే మార్గమని హెచ్ఎస్బీసీ ఒక నివేదికలో పేర్కొంది. భారీ అప్పులతో అటు కార్పొరేట్లు, మొండి బాకాయిల పెరుగుదలతో ఇటు బ్యాంకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణం వృద్ధి రేటు గాడిలో పడేందుకు ప్రభుత్వమే మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆర్థిక శాఖ తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వ, కార్పొరేట్ రంగం నుంచి పెట్టుబడుల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం స్పష్టంగా కనబడుతోందని నివేదిక వివరించింది. ప్రైవేటు రంగ పెట్టుబడులకు ఊతమిచ్చేలా కీలక పాత్ర పోషించే విషయంలో... నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేలా చొరవ, ప్రభుత్వ వ్యయాల పెంపు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల్లో కొత్త ఆచరణాత్మక విధానాన్ని ప్రవేశపెట్టడం.. ఈ మూడు మార్గాలున్నాయని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ (క్యాపిటల్ మార్కెట్స్ విభాగం) ప్రాంజుల్ భండారీ పేర్కొన్నారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం... ఆగిపోయిన 100 ప్రధాన ప్రాజెక్టుల్లో 66 శాతం ప్రైవేటు రంగంలోనివి కాగా, మిగతావి ప్రభుత్వ రంగానికి చెందినవి. భూసేకరణ, పర్యావరణ ఇతరత్రా అనుమతుల్లో జాప్యం, ముడివస్తువుల సరఫరారో అడ్డంకులు వంటివే ప్రాజెక్టులు నిలిచిపోయేందుకు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
రెండేళ్ల గరిష్టానికి తయారీ రంగం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో మంచి పనితీరును ప్రదర్శించిందని హెచ్ఎస్బీసీ సర్వే శుక్రవారం పేర్కొంది. దేశం నుంచి అలాగే విదేశాల నుంచి పటిష్టమైన ఆర్డర్లతో రెండేళ్ల గరిష్టానికి తయారీ రంగం ఉత్పత్తి పెరిగిందని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రన్జుల్ భండారీ పేర్కొన్నారు. డిసెంబర్లో తయారీ రంగం ఉత్పత్తికి సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 54.5 వద్ద ఉంది. ఈ సూచీ పాయింట్లు నవంబర్‌లో 53.3. గత 14 నెలలుగా తయారీ రంగం ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. హెచ్ఎస్బీసీ పీఎంఐ 50 పైన ఉంటే దానిని వృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు. ఆ దిగువన నమోదయితే క్షీణతగా ఆ సంస్థ పరిగణిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గుదల సానుకూల ధోరణి సైతం తయారీ రంగానికి దోహదపడిందని హెచ్ఎస్బీసీ వర్గాలు వివరించాయి. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో కొనసాగుతున్న పక్షంలో 2015లో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని భండారీ అన్నారు. -
విదేశీ ఉద్యోగులకు ఫేవరెట్ దేశాల్లో భారత్‌కు రెండో స్థానం
న్యూఢిల్లీ: ఉద్యోగం చేసేందుకు, నివసించేందుకు అనువైనవిగా విదేశీయులు భావిస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానం దక్కించుకుంది. హెచ్ఎస్బీసీ నిర్వహించిన ఈ సర్వేలో చైనా అగ్రస్థానంలో నిల్చింది. సర్వే ప్రకారం సవాళ్లతో కూడుకున్న, సాహసోపేతమైన ప్రాజెక్టులు చేపట్టాలని ఉవ్విళ్లూరే విదేశీ ఉద్యోగులు వర్ధమాన ఆసియా దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో ఇన్ఫ్రా, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి విదేశీ నిధుల సహకారం అవసరమవుతున్నందున, సహజంగానే విదేశీ నిపుణులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్ ఎస్బీసీ ఇండియా హెడ్ (రిటైల్ బ్యాంకింగ్ విభాగం) సంజీవ్ సూద్ తెలిపారు. చైనా, భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్న విదేశీ ఉద్యోగుఉల స్థానిక ఎకానమీ వృద్ధిపై సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము ఉంటున్న దేశాలు ఇటు ఉద్యోగపరంగా అటు నివాసించేందుకు మరింత మెరుగ్గా మారుతోందని భావిస్తున్న విదేశీ ఉద్యోగుల సగటు అంతర్జాతీయంగా 32 శాతంగా ఉండగా.. చైనా, ఇండియాలో ఈ సగటు 60 శాతంగా ఉంది. విదేశీ నిపుణులు ఎక్కువగా టెలికం, ఐటీ (21 శాతం), నిర్మాణ, ఇంజినీరింగ్ (19 శాతం), ఆర్థిక సేవలు (10 శాతం) రంగాల్లో ఉన్నారు. ఇక, కంపెనీలు అసైన్మెంట్లపై ఉద్యోగులను అధికంగా పంపుతున్న విదేశాల జాబితాలో బ్రెజిల్, టర్కీల తర్వాత భారత్ ఉంది. వర్ధమాన మార్కెట్లకు ప్రాధాన్యం పెరుగుతుండటమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,300 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. -
Q1 ఫలితాలు కీలకం
న్యూఢిల్లీ: దేశీ కంపెనీల తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్’14) ఫలితాలు, విదేశీ సంకేతాలే సమీప కాలంలో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. గడచిన వారం ఉక్రెయిన్-రష్యా సరిహద్దులో మలేసియా విమానం కూల్చివేతపై చెలరేగిన ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని నిపుణులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకోనున్న పరిణామాలపై మార్కెట్లు దృష్టిపెడతాయని విశ్లేషకులు వివరించారు. ఇవికాకుండా విదేశీ స్టాక్ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు కూడా కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. వీటికితోడు దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపైనా ఇన్వెస్టర్లు కన్నేస్తారని వ్యాఖ్యానించారు. నిఫ్టీ 7,700 దాటితే...: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీకి ఈ వారం 7,700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ తెలిపారు. అంచనా వేశారు. ఈ స్థాయి వద్ద ఎదురయ్యే అమ్మకాలను తట్టుకుని ముందుకుసాగితే కొనుగోళ్లు పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. గడచిన వారం కనిపించిన సానుకూల సంకేతాలతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 617 పాయింట్లు(2.5%) ఎగసిన విషయం విదితమే. రూపాయి ఎఫెక్ట్... దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపనుండగా, అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు సైతం కీలకంగా నిలుస్తాయని స్టాక్ నిపుణులు విశ్లేషించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ ఆందోళనకర స్థాయిలో మందగించిన రుతుపవనాలు వేగం పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవలి వరకూ కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వర్షాలు ఆశలు రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంతోపాటు పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ర్ట, కచ్ ప్రాంతాలకు విస్తరించడం గమనార్హం. దిగ్గజాల ఫలితాలు... ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, ఐడియా సెల్యులర్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ ఉత్తమ ఫలితాలతో జోష్‌నివ్వడంతో సెంటిమెంట్ సానుకూలంగా మారిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. అయితే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ఇజ్రాయెల్, పాలస్తీనా ఆందోళనల కారణంగా ఈ వారం మార్కెట్లు దిద్దుబాటు(కరెక్షన్)కు లోనయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిపెడతారని చెప్పారు. విదేశీ గణాంకాలు.. అంతర్జాతీయంగా ఈ వారం పలు గణాంకాలు వెలువడనున్నాయి. చైనా తయారీ గణాంకాలు(హెచ్ఎస్బీసీ పీఎంఐ), అమెరికాకు చెందిన రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ), గృహాల అమ్మకాలు, మన్నికైన వస్తువుల ఆర్డర్లు వంటి అంశాలు వెల్లడికానున్నాయి. కాగా, దేశీయంగా కీలక గణాంకాలేవీ విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో విదేశీ అంశాలే కీలకంగా నిలవనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ తెలిపారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లను నడిపిస్తాయని చెప్పారు. ఈ నెలలో పెట్టుబడి రూ. 22,000 కోట్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 22,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. జూలై 19 వరకూ నికరంగా 367 కోట్ల డాలర్లను(రూ. 22,023 కోట్లు) ఇన్వెస్ట్చే యగా, ఈక్విటీలకు 180 కోట్ల డాలర్లను(రూ. 10,755 కోట్లు) కేటాయించారు. దీనికి అదనంగా 189 కోట్ల డాలర్ల(రూ. 11,268 కోట్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. కేంద్రంలో ఏర్పడ్డ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఎజెండా ఎఫ్ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. -
చక్కెర ఎగుమతులు వద్దు
న్యూఢిల్లీ: దేశంలో పంచదార ఉత్పత్తి, డిమాండు సమీప భవిష్యత్తులోనే సమాన స్థాయికి చేరతాయనీ, కనుక చక్కెర ఎగుమతులకు భారత్ స్వస్తి చెప్పాలనీ హెచ్ఎస్బీసీ వ్యాఖ్యానించింది. ‘ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులు’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను సంస్థ వెల్లడించింది. ‘భారత్‌లో పంచదార ఉత్పత్తి వ్యయం ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటికే ఎక్కువగా ఉంది. ఇండియా కంటే బ్రెజిల్లో ఉత్పత్తి వ్యయం 40 శాతం తక్కువ. అందుకే గత రెండు దశాబ్దాల్లో బ్రెజిల్ నుంచి చక్కెర ఎగుమతులు భారీగా పెరిగాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇండియాలో ఉత్పత్తయ్యే పంచదార దేశీయ వినియోగానికే సరిపోతుంది. ఒకప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరల విషయంలో ఇండియా నిర్ణయాత్మక పాత్ర పోషించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు...’ అని హెచ్ఎస్బీసీ తెలిపింది. ‘పంచదార ధరలు పెరగ్గానే భారతీయ రైతులు చెరకు పంట వేస్తారు. దాంతో అప్పటిదాకా చక్కెర దిగుమతులపై ఆధారపడే భారత్, ఆ వెంటనే ఎగుమతిదారుగా ఆవిర్భవిస్తుంది. ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గగానే మిల్లర్ల మార్జిన్లు తగ్గడమే కాకుండా రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతాయి. దీంతో రైతులు ఇతర పంటలవైపు మళ్లుతారు. ఫలితంగా ఇండియా మళ్లీ పంచదారను దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో ఇప్పటికే అనేక చక్కెర మిల్లులు అతి తక్కువ మార్జిన్లతో, లేదంటే నష్టాలతో నడుస్తున్నాయి. చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా రికార్డు స్థాయిలకు చేరాయి...’ అని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. 8.5 శాతం తగ్గిన ఉత్పత్తి ... చెరకు అధికంగా సాగుచేసే రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడంతో ఈ ఏడాది మార్చి 15 నాటికి దేశంలో పంచదార ఉత్పత్తి 8.5 శాతం క్షీణించి 19.38 మిలియన్ టన్నులకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో ఉత్పత్తి 21.10 మిలియన్ టన్నులుగా ఉందని భారతీయ చక్కెర మిల్లుల సంఘం (ఇస్మా) తెలిపింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం (అక్టోబర్ - సెప్టెంబర్) మొత్తమ్మీద ఉత్పత్తి అంచనాను 5 శాతం తగ్గించినట్లు సంఘం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గిపోతోంది. చెరకును అత్యధికంగా పండించే మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఇప్పటి వరకు పంచదార ఉత్పత్తి తక్కువ స్థాయిలో ఉంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నెల 15 నాటికి మహారాష్ట్రలో 6.41 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. 2013 మార్చి 15 నాటికి ఆ రాష్ట్రంలో 7.33 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఉత్పత్తి 5.89 మిలియన్ టన్నుల నుంచి 5.07 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్పత్తి 4% క్షీణించి 8.80 లక్షట టన్నులకు చేరింది. గత అక్టోబర్ - ఫిబ్రవరి మధ్యకాలంలో దేశంలో 11 లక్షల టన్నుల ముడి పంచదార ఉత్పత్తి కాగా ఆరు లక్షల టన్నులు ఎగుమతి అయింది..’ అని ఇస్మా వివరించింది. -
ఐఐఎం లక్నోలో 100 శాతం ప్లేస్మెంట్
లక్నో: కేవలం ఐదున్నర రోజుల్లో 475 మందికి క్యాంపస్‌లోనే ఉద్యోగాలు దొరికాయని లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్(ఐఐఎం) ప్రకటించింది. దీంతో నూరుశాతం విద్యార్థులకు ప్లేస్మెంట్ దొరికినట్లయిందని ఫ్యాకల్టీ సభ్యుడొకర చెప్పారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ మేళాలో మొత్తం 159 కంపెనీలు పాల్గొన్నాయి. సేల్స్-మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ రంగాలు ప్రధాన రంగాలుగా నిలిచినట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చిన కంపెనీల్లో ప్రధానంగా ఆదిత్య బిర్లా, యాక్సెం చర్, అమెజాన్, హెచ్ఎస్బీసీ, హెచ్‌యూఎల్, మెకిన్సే, పీఅండ్‌జీ, ఎయిర్టెల్, డాబర్, ఐటీసీ, వొడాఫోన్ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. -
బ్రోకింగ్ సంస్థలకు గడ్డుకాలం.. !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు ఇండియాలో ట్రేడర్లు స్టాక్ మార్కెట్ పేరు చెపితేనే.. ఆమడ దూరం పరుగులు పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయికి కూతవేటు దూరంలో ఉన్నా రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం దూరంగానే ఉంటున్నారు. దీంతో వ్యాపారం లేక కొన్ని బ్రోకింగ్ సంస్థలు దుకాణాలను మూసుకుంటుంటే మరికొన్ని సంస్థలు ఇతర ఆదాయాలపై దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే హెచ్ఎస్బీసీ, బ్రిక్ సెక్యూరిటీస్ రిటైల్ బ్రోకింగ్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించగా క్యాపిటల్ ఫస్ట్ కూడా అదే దారిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని పెద్ద సంస్థలు మాత్రం వ్యాపార విస్తరణకు పూర్తిగా స్వస్తి చెప్పడమే కాకుండా సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రోకింగ్ వ్యాపారం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని కార్వీ గ్రూపు చైర్మన్ సి.పార్థసారథి తెలిపారు. దీంతో గత కొంతకాలంగా సిబ్బంది సంఖ్యను కుదించినట్లు తెలిపారు. ‘‘2000 సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య రెండు కోట్లపైన ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 75 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థేనని, ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే తిరిగి పుంజుకుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆచితూచి అడుగులు వేస్తున్నామని’’ జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. మార్జిన్లపై ఒత్తిడి..: స్టాక్ మార్కెట్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటుండటంతో బ్రోకింగ్ కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. ఇండియా ఇన్ఫోలైన్ ఈ ఏడాది తొలి త్రైమాసికం బ్రోకింగ్ ఆదాయం.. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15% క్షీణించి రూ.128 కోట్లకు పడిపోయింది. బ్రోకింగ్ సంస్థలకు అధికాదాయం వచ్చే క్యాష్ సెగ్మెంట్లో లావాదేవీలు తగ్గి ట్రేడింగ్ పరిమాణం బాగా పెరగడం కూడా మార్జిన్లపై ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న టర్నోవర్‌లో 90% ట్రేడింగ్ వాటా ఉంటే క్యాష్ సెగ్మెంట్ 10%కి పడిపోయింది. అలాగే కంపెనీల మధ్య పోటీ పెరగడంతో సగటు ట్రేడింగ్ మార్జిన్ విలువ గత మూడేల్లో 17 బేసిస్ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్లకు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో సగటు లావాదేవీపై బ్రోకింగ్ సంస్థకు 7-8 డాలర్లు ఆదాయంగా వస్తుంటే, ఇక్కడ ఇది అర డాలర్‌కు మించకపోవడం కూడా హెచ్ఎస్బీసీ వంటి విదేశీ సంస్థలు ఈ వ్యాపారం నుంచి వైదొలగడానికి ఒక కారణమనేది మార్కెట్ వర్గాల వాదన. ఎన్బీఎఫ్సీలవైపు చూపు బ్రోకింగ్ వ్యాపారం దెబ్బతినడంతో ఆదాయం కోసం ఇతర వ్యాపారాలపై బ్రోకింగ్ సంస్థలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. 2007లో మొత్తం వ్యాపారంలో 80% బ్రోకింగ్ నుంచే వస్తే ఇప్పుడది 20-30%కి పడిపోయినట్లు ఈ కంపెనీల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ సంస్థలన్నీ రుణాలు, ఫీజు ఆధారిత ఇతర వ్యాపారాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇండియా ఇన్ఫోలైన్ ఇచ్చిన రుణాల విలువ 29% పెరిగి రూ.9,463 కోట్లకు చేరుకుంటే, ఎడల్వీస్ రుణాలు 30% పెరిగి రూ.6,623 కోట్లకు పెరిగాయి. మన రాష్ట్రానికి చెందిన కార్వీ సంస్థ ఎన్‌బీఎఫ్‌సీతో పాటు ఈ మధ్యనే బీమా రిపాజిటరీ సర్వీసుల్లోకి ప్రవేశించగా, జెన్ సెక్యూరిటీస్ కూడా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది.