7న ఆర్ బీఐ రేట్ల కోత ఉండదు
ఇండియా రేటింగ్స్, హెచ్‌ఎస్‌బీసీ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూన్ 7వ తేదీన జరిపే ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించకపోవచ్చని ఇండియా రేటింగ్స్, హెచ్‌ఎస్‌బీసీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి.
ఇప్పటికే జరిగిన రేటు కోత ప్రయోజనం కస్టమర్‌కు బ్యాంకింగ్ అందించడం, అలాగే ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ రేటు కోత, యూరోజోన్‌లో (కొనసాగడంపై) బ్రిటన్ భవితవ్యం వంటి అంశాలు సమీక్షలో ప్రధానాంశాలు అవుతాయన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్ వ్యక్తం చేసింది. కాగా 7న రేటు కోత అవకాశాలను తోసిపుచ్చిన హెచ్‌ఎస్‌బీసీ,ఆగస్టులో పావుశాతం కోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని అంచనావేస్తున్న రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్‌స్టాన్లీ, జూన్ 7 ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా మాత్రం రేటు కోతకు అవకాశం ఉండదని తన అభిప్రాయపడుతోంది.