India Ratings
-
ఫార్మా అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: దేశీ ఫార్మా రంగం గత నెల(మార్చి)లో పటిష్ట వృద్ధిని సాధించింది. 2022 మార్చితో పోలిస్తే 13 శాతం పురోగతిని అందుకుంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ రెండంకెల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా మూడు రకాల చికిత్సలు దోహదపడ్డాయి. నిజానికి గతేడాది మార్చిలో ఫార్మా అమ్మకాలు 2 శాతం నీరసించాయి. కాగా.. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఈ ఫిబ్రవరిలో 20 శాతంపైగా జంప్‌చేశాయి. దీంతో 2022–23లో మొత్తం ఫార్మా విక్రయాల్లో 9.3 శాతం పురోభివృద్ధి నమోదైంది. అంతక్రితం ఏడాది 14.6 శాతం పుంజుకోగా.. 2020–21లో అమ్మకాలు 2.1 శాతమే బలపడ్డాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రయివేట్ వెల్లడించిన వివరాలివి. యాంటీఇన్ఫెక్టివ్స్, శ్వాససంబంధ(రెస్పిరేటరీ), నొప్పి నివారణ(పెయిన్ మేనేజ్మెంట్) విభాగాల నుంచి 30% ఆదాయం నమోదైనట్లు ఇండియా రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణనాథ్ ముండే పేర్కొన్నారు. ఇతర విభాగాలు అంతంతమాత్ర అమ్మకాలు మాత్రమే సాధించినప్పటికీ టాప్–10 థెరపీల నుంచి పరిశ్రమ ఆదాయంలో 87 శాతం లభించినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలోనూ 10–11 శాతం వృద్ధికి వీలున్నట్లు ఈ సందర్భంగా అంచనా వేశారు. జూన్ నుంచీ స్పీడ్ గతేడాది(2022) జూన్ నుంచి ఫార్మా రంగంలో రికవరీ ఊపందుకున్నట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రతికూల అమ్మకాలు నమోదుకాగా.. 2022 జూన్ నుంచి 2023 మార్చి కాలంలో 12.6 శాతం పురోగతిని సాధించాయి. అక్టోబర్, జనవరిల్లో అమ్మకాలు కొంతమేర మందగించినప్పటికీ పటిష్ట వృద్ధి నమోదైంది. పరిమాణంరీత్యా అమ్మకాలు 4.5 శాతం పుంజుకోగా.. ధరలు 5.6 శాతం మెరుగుపడ్డాయి. కొత్త ప్రొడక్టుల విడుదల 2.9 శాతం మెరుగుపడింది. విభాగాలవారీగా ఏఐవోసీడీ గణాంకాల ప్రకారం 2023 మార్చిలో రెస్పిరేటరీ విభాగం 50 శాతం జంప్‌చేయగా.. యాంటీఇన్ఫెక్టివ్స్ అమ్మకాలు 32 శాతం ఎగశాయి. పెయిన్ మేనేజ్మెంట్ 18 శాతం వృద్ధి చూపింది. ఈ బాటలో గ్యాస్ట్రోఎంటరాలజీ, విటమిన్ల విభాగాలు 8 శాతం చొప్పున బలపడ్డాయి. గుండెసంబంధ(కార్డియాలజీ), మెదడు, నాడీసంబంధ(సీఎన్ఎస్) థెరపీ అమ్మకాలు 6 శాతం, చర్మవ్యాధులు 4 శాతం, స్త్రీసంబంధ ప్రొడక్టుల విక్రయాలు 3 శాతం చొప్పున పెరిగాయి. అయితే యాంటీడయాబెటిక్ విక్రయాలు 2 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. కంపెనీల జోరిలా ఏఐవోసీడీ వివరాల ప్రకారం మార్చిలో కొన్ని ఫార్మా కంపెనీలు మార్కెట్‌ను మించి వృద్ధిని చూపాయి. ఇండొకొ రెమిడీస్ 28 శాతం, సిప్లా, ఎఫ్డీసీ 27 శాతం, అలెంబిక్ ఫార్మా 24 శాతం, గ్లెన్‌మార్క్ 22 శాతం చొప్పున పురోగతిని సాధించాయి. ఇక అబాట్ ఇండియా, ఆల్కెమ్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జీఎస్కే ఫార్మా అమ్మకాల్లో 14–18 శాతం మధ్య వృద్ధి నమోదైంది. ఇతర సంస్థలలో ఇప్కా ల్యాబ్ 13 శాతం, టొరెంట్ ఫార్మా, లుపిన్ 9 శాతం, ఎరిస్ లైఫ్‌సైన్సెస్ 7 శాతం, అజంతా ఫార్మా, జేబీ కెమ్, జైడస్ లైఫ్‌సైన్సెస్ అమ్మకాలు 4–5 శాతం స్థాయిలో బలపడ్డాయి. సన్ ఫార్మా, ఫైజర్ అమ్మకాలు 3–2 శాతం పుంజుకోగా, గతేడాది మార్చితో పోలిస్తే సనోఫీ ఇండియా అమ్మకాలు వార్షికంగా 9 శాతం నీరసించాయి. -
ఇక బ్యాంకుల బాదుడు షురూ?.. భారం కానున్న లోన్ ఈఎంఐలు
ఇదిలాఉండగా, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ సమీకరణ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్) మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటును బ్యాంకులు వ్యవస్థపై 100 నుంచి 150 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) బదలాయించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇదే జరిగితే వాహన, వ్యక్తిగత, ఆటో, వాణిజ్య రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. గత నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. వచ్చే నెల్లో జరిగే సమావేశాల్లోనూ పావుశాతం రేటు పెంపు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రుణ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తంగా డిపాజిట్ రేట్లు కూడా 1.5 శాతం నుంచి 2 శాతం పెరిగాయి. వ్యవస్థలో డిపాజిట్లు కూడా 75 బేసిస్ పాయింట్లు పెరిగాయి. -
తయారీ రంగంపై పెరిగిన రుణ వ్యయ భారం
న్యూఢిల్లీ: తయారీదారులు చెల్లించే వార్షిక సగటు వడ్డీ రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 9.38 శాతానికి పెరిగింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఈ రేటు 8.37 శాతంగా ఉంది. సగటు కాకుండా చూస్తే, ఈ రేటు కొన్ని సంస్థల విషయంలో అత్యధికంగా 15 శాతంగా నమోదయ్యింది. చాలా కంపెనీలు తమ రుణాల వ్యయం పెరిగినట్లు తెలిపాయని తాజాగా విడుదలైన పారిశ్రామిక వేదిక– ఫిక్కీ సర్వే తెలిపింది. అయితే భారత ఎకానమీ పరిస్థితుల పట్ల సర్వేలో ఆశావహ దృక్పధం నెలకొంది. సర్వే ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦ కరోనా సవాళ్ల అనంతరం, 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ రికవరీ బాట పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరపు తదుపరి త్రైమాసికాల్లో వృద్ధి ఊపందుకోవడం కొనసాగింది. ♦ ప్రపంచ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ప్రభావం భారత తయారీ రంగంపై తాత్కాలికంగానే ఉంటుంది. గడచిన కొన్ని నెలలుగా ఈ రంగంలో నెలకొన్న వ్యయ భారాలు తగ్గుముఖం పడతాయన్న విశ్వాసం నెలకొంది. ♦ నియామకాలకు సంబంధించి అవుట్‌లుక్ సానుకూలంగా ఉన్నప్పటికీ, రాబోయే మూడు నెలల్లో అదనపు వర్క్‌ఫోర్స్‌ను నియమించుకోవాలని కేవలం 32 శాతం మంది ప్రతినిధులు మాత్రమే పేర్కొంటున్నారు. ♦ గత కొన్ని నెలల్లో రెపో రేట్లను పెంచడం వల్ల పర్యవసానంగా తమ బ్యాంకులు ఈ భారాన్ని తమకు బదలాయించాయని, ఇది రుణ వ్యయాల పెరుగుదలకు ప్రధాన కారణమని 71 శాతం మంది ప్రతినిధులు తెలిపారు. ♦ తయారీలో ప్రస్తుతం ఉన్న సగటు సామర్థ్య వినియోగం 75%. ఇది ఈ రంగంలో స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. క్రితం సర్వే లో ఈ సామర్థ్య వినియోగం 70%గా ఉంది. ♦ భవిష్యత్ పెట్టుబడి ఆశావహ దృక్పథం కూడా మునుపటి త్రైమాసికంతో పోలిస్తే మెరుగుపడింది. రాబోయే ఆరు నెలల్లో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికల్లో ఉన్నట్లు 47 శాతం మంది ప్రతివాదులు తెలిపారు. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది 40 శాతంగా ఉంది. ♦ అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అనిశి్చతి, ద్రవ్యోల్బణం సవాళ్లు ఇతర దేశాలలో కోవిడ్ వైరస్ వేరియంట్ల పెరుగుదల, ఆందోళనల వంటి సవాళ్లు తయారీ రంగాన్ని వెంటాడుతున్నాయి. సరఫరాల చైన్, డిమాండ్‌లో అస్థిరతలను పెంచుతున్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు. ♦ పెరుగుతున్న ఫైనాన్స్ రుణ భారాలు, నిబంధనలు–అనుమతుల్లో గందరగోళ పరిస్థితులు, అధిక ఇంధన ధరలు, మందగమన ప్రపంచ డిమాండ్, భారతదేశంలోకి అధిక చౌక దిగుమతులు, నైపుణ్యం కలిగిన కార్మీకుల కొరత, కొన్ని లోహాల అధిక అస్థిర ధరలు, సరఫరాల చైన్‌లో అనిశ్చితి, లాజిస్టిక్స్ వ్యయాల పెరుగుదల వంటి అంశాలూ సవాళ్లలో ఉన్నాయి. ఇవి తమ విస్తరణ ప్రణాళికకు అవరోధంగా మారే అవకాశం ఉందని తయారీ రంగ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సర్వే సాగింది ఇలా... 11 ప్రధాన రంగాలకు సంబంధించి క్యూ4లో తయారీదారుల అభిప్రాయాలను సర్వే మదింపు చేసింది. మొత్తంగా రూ. 10 లక్షల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ను కలిగిన భారీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ)ల విభాగాలలోని 400 తయారీ యూనిట్ల నుండి స్పందనలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఆటోమోటివ్, ఆటో కంపోనెంట్స్, భారీ పెట్టుబడులు–డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, రసాయనాలు, ఔషధాలు, ఎల్రక్టానిక్స్, మిషీన్ టూల్స్, మెటల్ అండ్ మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, ఎరువులు, జౌళి, దుస్తులు తదితర రంగాలు వీటిలో ఉన్నాయి. -
ఏడు శాతం కంటే తక్కువే.. మరింత తగ్గే అవకాశం
ముంబై: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా అంచనా 7 శాతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధి రేటు దాదాపు 4 శాతంగా ఉంటుందని కూడా పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13.2 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. మూడవ తైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం నమోదవుతుందని రెండవ ముందస్తు అంచనాల్లో ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావాలంటే నాల్గవ త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2022–23లో వృద్ధి రేటు 6.8 శాతంగానే అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ విశ్లేషకులు పరాస్ జస్రాయ్ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► వృద్ధి పురోగతికి పలు అవరోధాలు ఉన్నాయి. డిమాండ్ ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎగుమతుల్లో పురోగతి లేదు. రుణ వృద్ధి కఠిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ► ఇక ఉత్తరాదిలో వేసవి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఉంది. ఇది గోధుమ ఉత్పత్తిపై ఆందోళనలను సృష్టిస్తోంది. మార్చి– మే మధ్య వేసవి తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ► నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కనీసం 4.3 శాతం నమోదవుతుందన్న అంచనాలను వేసవి తీవ్రత విఘాతం కలిగించవచ్చు. ► ఇక ద్రవ్యోల్బణం తీవ్రత గ్రామీణ వినియోగ డిమాండ్‌పై ప్రభావితం చూపే వీలుంది. మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్ ఇంకా నత్తనడకనే సాగుతోంది. ► మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగుల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ లిక్విడిటీ తగ్గుతుండడం మరో ఆందోళకరమైన అంశం. జనవరిలో బలమైన క్రెడిట్ డిమాండ్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నాలుగు నెలల కనిష్టం 0.43 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్లో ఇది 0.53 శాతంగా ఉంది. -
మైక్రోఫైనాన్స్ రంగానికి మంచి రోజులు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి క్రెడిట్ వ్యయాలు తక్కువ స్థాయికి చేరుకుంటాయని, ప్రస్తుతం ఇవి మంచి వృద్ధిని చూస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తన తాజా నివేదికలో తెలిపింది. మైక్రోఫైనాన్స్ రంగానికి అవుట్‌లుక్‌ను తటస్థం నుంచి ‘మెరుగుపడుతున్నట్టు’గా మార్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) స్థిరమైన రేటింగ్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ రుణ పరిశ్రమ 20–30 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమసిపోవడంతో మరింత మంది రుణాల కోసం ముందుకు వస్తున్నట్టు తెలిపింది. రుణ వసూళ్లు మెరుగుపడడం, రుణ వితరణలు పెరగడం, క్రెడిట్ వ్యయాలు 15–5 శాతం నుంచి 1–3 శాతానికి దిగి రావడం అనుకూలించే అంశాలుగా పేర్కొంది. సూక్ష్మ రుణ సంస్థలు కరోనా మహమ్మారికి సంబంధించి ప్రతికూలతలను దాదాపుగా డిసెంబర్ త్రైమాసికానికి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. రుణ వితరణలు పెరుగుతుండడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది. రెండు రిస్క్‌లు వచ్చే 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం, ఎన్నికలను ప్రస్తావించింది. ఈ రెండు అంశాలు 2023–24తోపాటు, 2024–25 మొదటి ఆరు నెలలు రుణ గ్రహీతల ఆదాయంపై ప్రభావం చూపించొచ్చని అంచనా వేసింది. రుణాల ఎగవేతలు, క్రెడిట్ వ్యయాలు సాధారణ స్థాయికి వస్తా యని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థల రుణాల్లో అధిక శాతం కరోనా మహమ్మారి తర్వాత జారీ అయినవేనని, వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద క్రెడిట్ వ్యయాలు 2022– 23లో 1.5–5 శాతం మధ్య ఉంటే, 2023–24లో 1–3 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. ముఖ్యంగా ఎంఎఫ్‌ఐల రుణ గ్రహీతల్లో 65 శాతం నిత్యావసర వస్తువులు, సేవల్లోనే ఉపాధి పొందుతున్నందున, వీరిపై ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా పడుతుందని, వారి ఆదాయం, వ్యయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. -
ఎకానమీకి కరెంట్ అకౌంట్ సవాళ్లు!
ముంబై: భారత్ ఎకానమీకి కరెంట్ అకౌంట్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో తీవ్ర లోటు (క్యాడ్) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్ అకౌంట్లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం. ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు... భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సీఏడీ– క్యాడ్ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా (120 బిలియన్ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది. ఫారెక్స్ దన్ను... అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్ విలువ దన్ను పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. కరెంట్ అకౌంట్... అంటే! ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
అంతంతమాత్రం వేతన పెంపు తీవ్ర ఆందోళనకరం!
ముంబై: ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకున్నప్పటికీ, వేతన పెంపు క్షీణించడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని ఇండియా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు ఇది దారితీస్తుందని, దీనివల్ల పరశ్రమలో సామర్థ్యం వినియోగం తగ్గుతుందని పేర్కొంది. వస్తు ఉత్పత్తి– వినియోగం అంతరాన్ని ఈ పరిస్థితి మరింత పెంచుతుందని విశ్లేషించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2012–16 ఆర్థిక సంవత్సరం మధ్య ఉద్యోగుల వేతన వృద్ధి సగటున 8.2 శాతంగా నమోదయితే, 2017–21 మధ్య ఇది 5.7 శాతానికి క్షీణించింది. ► వేతన పెంపు భారీగా లేకపోవడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (20 22–23 ఏప్రిల్–జూన్) అంచనాలకన్నా తక్కువగా 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ కొనుగోలు శక్తి బలహీనంగా నమోదవుతోంది. ► జూన్ 2022ను తీసుకుంటే సంవత్సరం ప్రాతిపదికన పట్టణాల్లో వేతన పెంపు సగటు 2.8 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 5.5 శాతంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటుచేస్తే, వేతనంలో వృద్ధిలేకపోగా ఈ రేట్లు వరుసగా 3.7 శాతం, 1.6 శాతం మేర క్షీణించాయి. ► ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. తృణధాన్యాలు, సేవల రంగాల్లో ధరల తీవ్రత దీనికి కారణం. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 2022–23లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (మే నుంచి 1.4 శాతం మేర పెంపుతో ప్రస్తుతం 5.4 శాతం) 25 నుంచి 50 బేసిస్ పాయింట్లమేర పెంచే వీలుంది. -
జాతీయ ఆదాయంలో 20%.. వేతనాల్లో 40%
ముంబై: భారత్ మొత్తం జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) వాటా 20 శాతం అయితే, మొత్తం వేతనాల్లో వాటా 40 శాతంగా ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రైవేటు రంగం విషయంలో ఈ రేట్లు ‘దాదాపు సమతౌల్యంగా’ వరుసగా 36.3 శాతం, 35.2 శాతాలుగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)కు సంబంధించి 2020–21కి ముందు గడచిన పదేళ్ల కాలంలో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రాతిపదికన ఈ విశ్లేషణ చేసినట్లు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలకు సంబంధించి ప్రభుత్వం పాత్రను తగ్గించాలని ఒత్తిడి చేస్తూ, ప్రభుత్వ రంగంలోని సమర్థత లోపాన్ని తరచుగా ఎత్తి చూపే విమర్శకులకు తాజా నివేదిక మద్దతునిస్తోంది. నివేదిక ప్రకారం, 2011–2021 మధ్య వేతనాల సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 10.4 శాతంగా ఉంటే, మూలధనంపై రాబడి 8.8 శాతం వృద్ధిని (సీఏజీఆర్) నమోదుచేసుకుంది. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే..
ముంబై: ‘‘ద్రవ్య స్థిరీకరణ ఆలస్యమైనా ఫర్వాలేదు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు, వినియోగ డిమాండ్‌కు మద్దతుగా ఆదాయపన్ను, ఇంధన పన్ను భారం తగ్గించడంపై దృష్టి సారించాలి’’ అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ సూచించింది. ‘ప్రీ బడ్జెట్ డిమాండ్స్’ పేరుతో ఈ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఫిబ్రవరి 1న 2022–23 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. కొత్తవి కాకుండా, గత బడ్జెట్లో ప్రకటించిన వాటి స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించొచ్చని అంచనా వేసింది. డిమాండ్ పెంచేందుకు, కరోనాతో ఎక్కువ ప్రభావితమైన రంగాల్లో ఉపాధి కల్పన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ద్రవ్యలోటు స్థిరీకరణ విషయంలో నిదానంగా వ్యవహరించాలని.. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు కావాల్సినంత వ ుద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇతర సూచనలు - వ్యక్తుల ఆర్థిక పరిస్థితులపై కరోనా ప్రతికూల ప్రభావం చూపించింది. కనుక ఆదాయపన్ను ఉపశమనాలు, ఇంధనాలపై పన్నుల తగ్గింపు రూపంలో మద్దతుగా నిలవాలి. - అధిక ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికీ కారణమవుతున్నాయి. - ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల మేర వ్యయాలను పెంచినా కానీ, ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్ష డిమాండ్ ఎందుకు పెరగలేదన్నది ఆర్థిక శాఖ విశ్లేషించుకోవాలి. అవసరమైన రంగాలకు ప్రభుత్వ మద్దతు ఇప్పటికీ అవసరం ఉందని ఇది తెలియజేస్తోంది. - 2022–23లో రెవెన్యూ వ్యయం.. 2021–22కు సవరించిన అంచనాలకంటే ఎక్కువే ఉండొచ్చు. - పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు మరింత ఆచరణాత్మకంగా ఉండాలి. - జీసెక్ ఈల్డ్స్‌ను కట్టడి చేయాలి. బడ్జెట్లో పేర్కొన్నదాని కంటే ప్రభుత్వం రుణ సమీకరణ ఎక్కువే ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. చదవండి: నిర్మలమ్మా.. వీరి ఆశలన్నీ మీ పైనే! -
ఎకానమీపై ‘థర్డ్‌వేవ్’ ఎఫెక్ట్.. వృద్ధికి గొడ్డలిపెట్టు
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటులో 10 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఒమిక్రాన్ వల్ల హరించుకునిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. జనవరి–మార్చి మధ్య ఈ ప్రతికూలత 0.40 శాతం మేర ఉండే వీలుందని పేర్కొంది. క్యూ4కు సంబంధించి ఇక్రా రేటింగ్స్ అంచనాలకు అనుగుణంగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనాలు ఉండడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనాలు ఈ విషయంలో 0.3 శాతంగా ఉంది. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - మార్కెట్, మార్కెట్ కాంప్లెక్స్‌ల సామర్థ్యాన్ని తగ్గించడం, రవాణా, ప్రయాణ ఆంక్షలు, రాత్రి–వారాంతపు కర్ఫ్యూలు వంటి వివిధ రూపాల్లో నియంత్రణలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇవి ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. - క్యూ4లో తొలి అంచనాలు 6.1 శాతంకాగా, దీనిని 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నాం. దీనితో జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ది 5.7 శాతానికి పరిమితం కానుంది. ఇక 2 0 2 1–22 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 9.4 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నాం. - కొత్త కేసుల్లో ఎక్కువ భాగం కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌గా అనుమానాలు ఉన్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. - అయితే ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాల నేపథ్యంలో మొదటి రెండు వేవ్‌లంత తీవ్రత మూడవ వేవ్‌లో ఉండదని భావిస్తున్నాం. బ్యాంకుల రుణ నాణ్యతకు దెబ్బ! - రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషణ - పునర్ వ్యవస్థీకరించిన రుణాలపై ప్రభావం తీవ్రమని అంచనా బ్యాంకుల రుణ నాణ్యతపై కోవిడ్–19 థర్డ్‌వేవ్ ప్రతికూల ప్రభావం పడనుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రత్యేకించి ఇప్పటికే పునర్వ్యవస్థీకరించిన రుణాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషించింది. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మొండిబకాయిలతోపాటు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ఇబ్బందుల కారణంగా రుణదాతలు లాభదాయకత, దివాలా సంబంధిత సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రుణ పునర్ వ్యవస్థీకరణలకు దరఖాస్తులు తక్షణం పరిణామాల ప్రాతిపదిక చూస్తే, 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు 12 నెలల వరకు మారటోరియంతో చాలా వరకూ రుణాలను పునర్వ్యవస్థీకరించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత మారటోరియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) నుంచి 2022–23 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వరకూ కొనసాగే వీలుంది. మహమ్మారి రెండు వేవ్‌ల సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు, బ్యాంకులకు ఉపశమనం కలిగించడానికి రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 1.0, 2.0లను ప్రకటించింది. కోవిడ్ 2.0 పథకం కింద పెరిగిన రుణ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ అడ్వాన్స్‌లో (రుణాల్లో) 2.9 శాతానికి పెరిగింది. 2021 జూన్ 30 నాటికి ఇది కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. తాజా పునర్వ్యవస్థీకరణల అవకాశాల నేపథ్యంలో మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ రుణాల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధానం మరికొంత కాలం ఇంతే.! - సాధారణ స్థితికి వెంటనే తీసుకురాకపోవచ్చు - కరోనా ఒమిక్రాన్‌తో ఆంక్షల వల్ల అనిశ్చితి - ఆర్థికవేత్తల అంచనా కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ఎంతో సులభతరం చేసి, వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకుంది. వృద్ధికి మద్దతే తమ మొదటి ప్రాధాన్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. గత ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు పుంజకుంటూ ఉండడం, అంతర్జాతీయంగానూ ఫెడ్, యూరోపియన్ బ్యాంకు తదితర సెంట్రల్ బ్యాంకులు సులభ ద్రవ్య విధానాలను కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా తన విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, కరోనా ఒమిక్రాన్ రూపంలో మరో విడత విజృంభిస్తుండడం, లాక్డౌన్లు, పలు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ఆర్బీఐ పాలసీ సాధారణీకరణను ఇప్పుడప్పుడే చేపట్టకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50,000ను దాటిపోవడం తెలిసిందే. ఆర్బీఐ సమీప కాలంలో ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురాకపోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త అభిషేక్ బారువా అన్నారు. కనీసం ఫిబ్రవరి సమీక్ష వరకైనా ఇది ఉండకపోవచ్చన్నారు. వృద్ధిపై ప్రభావం పడుతుంది కనుక కీలక రేట్ల పెంపుపై అనిశ్చితి నెలకొందన్నారు. ‘‘ఒమిక్రాన్ కారణంగా ఏర్పడే రిస్క్‌ల నేపథ్యంలో సమీప కాలానికి అనిశ్చితి కొనసాగుతుంది. కనుక ఆర్బీఐ ఎంపీసీ వేచి చూసే విధానాన్ని అనుసరించొచ్చు’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తాజైన్ పేర్కొన్నారు. పెరిగే రిస్క్‌లు వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తాయని, దీంతో ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని ఇక్రా రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ధి అంచనాలను 0.40 శాతం తగ్గిస్తున్నట్టు (4.5–5శాతం) చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటునే ఇక్రా కొనసాగించింది. కేంద్రం, రాష్ట్రాల సమన్వయ చర్యలు అవసరం - సీఐఐ సూచన కరోనా ఒమిక్రాన్ రకంతో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీఐఐ కేంద్రానికి సూచించింది. ‘‘ఒమిక్రాన్‌పై కచ్చితంగానే ఆందోళన ఉంది. అయితే, ఇది వేగంగా విస్తరిస్తున్నా కానీ, ఆరోగ్యంపై ప్రభావం స్వల్పంగానే ఉంటున్న అభిప్రాయం ఉంది’’అని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి చర్యలతో కరోనా వైరస్ మూడో విడత ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 2021లో చాలా రంగాలు కోలుకున్నట్టు ఆయన చెప్పారు. ఆతిథ్యం, ప్రయాణం, ఎంఎస్ఎంఈ, కొన్ని సేవల రంగాలు వైరస్ రెండు విడతలతో తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నమోదు కావచ్చన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఎదురైన ప్రశ్నకు నరేంద్రన్ స్పందిస్తూ.. కొన్ని సమయాల్లో కొద్ది కాలం పాటు విరామం ప్రకటించాల్సి రావచ్చని, ప్రభుత్వ చర్య కూడా ఇదే అయి ఉండొచ్చన్నారు. మొత్తం మీద సంస్కరణల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. చదవండి:ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..? -
బ్యాంకింగ్ అవుట్‌లుక్... స్టేబుల్
ముంబై: భారత బ్యాంకింగ్ రంగానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ ప్రకటించింది. అయితే రిటైల్, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా పేర్కొంది. బ్యాంకింగ్‌పై దేశీయ రేటింగ్ సంస్థ విడుదల చేసిన అర్థవార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది. - కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్ పటిష్టంగా ఉండడం అవుట్‌లుక్ యథాతథ కొనసాగింపునకు కారణం. - బ్యాంకులకు తగిన మూలధనం అందే అవకాశం ఉంది. అందువల్ల వాటి ఫైనాన్షియల్ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. - మొండిబకాయిలకు సంబంధించి కూడా గత నాలుగు సంవత్సరంల్లో తగిన ప్రొవిజన్స్ (కేటాయింపులు) జరుగుతున్నాయి. - రుణాలు, డిపాజిట్ల విషయంలో ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ షేర్ పెరుగుతుందని వాటికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్‌లుక్ సూచిస్తోంది. దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) గట్టి పోటీని ఇవ్వగలుగుతాయి. ఆయా బ్యాంకులు మూలధన నిల్వలను పెంచుకోగలుగుతున్నాయి. తమ పోర్ట్‌ఫోలియోను సానుకూలంగా, క్రియాశీలంగా నిర్వహించుకోగలుగుతున్నాయి. - భారీ మూలధన కేటాయింపుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నాం. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.2.8 లక్షల కోట్ల మూలధనం అందించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 0.2 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. - బ్యాంకింగ్ వ్యవస్థ డిపాజిట్లలో 6.5 శాతం వాటా కలిగిన ఐదు బ్యాంకుల విషయంలో ఇండియా రేటింగ్స్ ‘నెగిటివ్ అవుట్‌లుక్’ను కలిగిఉంది. బలహీన మూలధనం, ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల విషయంలో బలహీనతలు దీనికి కారణం. - రిటైల్ రంగంలో రుణ నాణ్యత విషయానికి వస్తే, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఈ విలువ 2020–21తో పోల్చితే 2021–22లో 100 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇది 45 శాతానికి పరిమితం కావచ్చు. - గృహ రుణాలుసహా రిటైల్ రుణాల విషయంలో బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల తక్షణం డిఫాల్డ్లకు అవకాశం ఉండదు. ఈ విభాగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు, పునర్వ్యవస్థీకరణలో ఉన్న రుణాలు కలిపి 2021–22 ముగిసే నాటికి 5.8 శాతానికి (మొత్తం రుణాల్లో) చేరవచ్చు. - ఎంఎస్ఎంఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెద్ద నోట్ల రద్దు నుంచీ ఈ సమస్య తలెత్తింది. దీనికితోడు జీఎస్టీ, ఆర్ఈఆర్ఏలూ ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఇప్పడు కోవిడ్–19తో సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. అయితే సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అందుతోంది. ఇందులో అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద తగిన లిక్విడిటీ లభ్యం అవుతుండడం గమనార్హం. రుణ పునర్వ్యవస్థీకరణ కూడా ఆయా రంగాలకు ప్రయోజనం కలిగిస్తోంది. - ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ) 2021–22 ముగిసేనాటికి 13.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2020–21 ముగిసే నాటికి ఈ రేటు 9.9 శాతం. ఇక ఇదే సమయంలో ఒత్తిడిలో ఉన్న రుణాల శాతం 11.7 శాతం నుంచి 15.6 శాతానికి చేరవచ్చు. కార్పొరేట్ రుణాల విషయంలో ఇది జీఎన్‌పీఏ 10.2 శాతానికి, ఒత్తిడి ఉన్న రుణాలు 11.3 శాతానికి ఎగసే వీలుంది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణ వృద్ధి 8.9 శాతం 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. స్టేబుల్ టూ ఇంప్రూవింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి 2021–22 అవుట్‌లుక్‌ను గత వారమే ఇండియా రేటింగ్స్ ‘‘స్టేబుల్’’ నుంచి ‘‘ఇంప్రూవింగ్’’కు మార్చింది. నిర్వహణా పరమైన, తక్కువ వడ్డీరేటు చర్యల వల్ల నాన్ బ్యాంకింగ్ తగిన లిక్విడిటీ, మూలధన నిల్వలు, స్థిర మార్జిన్లు కలిగి ఉందని కూడా ఇండియా రేటింగ్స్ తెలిపింది. సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిన స్థాయిలో నాన్స్ బ్యాంక్ ఉన్నాయని విశ్లేషించింది. చదవండి : టీప్లస్1 సెటిల్మెంట్కు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఎకానమీ వృద్ధిరేటు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) ఇటీవలే 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. -
18 ఏళ్లు పైబడిన వారికి టీకా : ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: మే 1 తేదీనుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ కరోనా వైరస్ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ కీలక విషయాలను వెల్లడించింది. జీడీపీలో ఒక శాతానికంటే తక్కువేనని తాజా అధ్యయనంలో తెలిపింది. 133.26 కోట్ల జనాభాలో దేశంలో 18 సంవత్సరాలు పైబడిన మొత్తం జనాభా 84.19 కోట్లు ఉంటుందని, వీరికి టీకా వేసేందుకు అయ్యే ఖర్చు 67,193 కోట్ల రూపాయలని వెల్లడించింది. ఇంటులో రాష్ట్రాలు వాటా రూ .46,323 కోట్లుగా తేల్చింది. కేంద్ర ప్రభుత్వానికి రూ .20,870 కోట్లు, రాష్ట్రాలకు కలిసి రూ .46,323 కోట్లు ఖర్చవుతాయని లెక్కించింది. కరోనావైరస్ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చ నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజిస్తే, అప్పుడు యూనియన్ బడ్జెట్‌పై ఆర్థిక ప్రభావం జీడీపీలో 0.12 శాతం మాత్రమేనని, రాష్ట్ర బడ్జెట్లపై లో 0.24 శాతం ఉంటుందని చెప్పింది. .గరిష్ట ప్రభావం బీహార్ (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 0.60 శాతం , ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ (0.47 శాతం), జార్ఖండ్ (0.37 శాతం), మణిపూర్ (0.36 శాతం), అస్సాం (0.35 శాతం) శాతం), మధ్యప్రదేశ్ (0.30 శాతం), ఒడిశా (0.30 శాతం)గా ఉంటుందని తేల్చి చెప్పింది. కేరళ, ఛత్తీస్‌గఢ్, బిహార్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు టీకా ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఇప్పటికే ప్రకటించినవిషయాన్ని గుర్తు చేసింది. టీకా ద్వారా వచ్చిన యాంటిబాడీస్ జీవితకాలం 12-18 నెలల వరకు ప రిమితం కాబట్టి ఈ వ్యయాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు భారత వృద్ధి రేటును 2021-22కు 10.1 శాతానికి తగ్గించింది. గతంలో వృద్ధి రేటును 10.4 శాతంగా ఇండియా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. సెకండ్ వేవ్‌లో కరోనా ఉధృతి, టీకా పంపిణీ వేగంగా లేకపోవడమే వృద్ధి అంచనాను తగ్గించడానికి కారణంగా రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశంలోని కీలక ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, అయితే మే మధ్య నాటికి సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ 5 శాతం, టోకు ద్రవ్యోల్బణ 5.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. -
18 ఏళ్లు పైబడినవారి వ్యాక్సినేషన్‌కు 67,193 కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రభుత్వాలకు రూ.67,193 కోట్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) గురువారంనాటి తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.46,323 కోట్లుగా ఉంటుందని, కేంద్రం వ్యయం రూ.20,870 కోట్లని విశ్లేషించింది. ఈ మొత్తం కలుపుకుంటే స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) వ్యాక్సినేషన్ వ్యయ భారం కేవలం 0.36 శాతంగా ఉంటుందని పేర్కొంది. 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కిందకు (మొత్తం దేశ జనాభా 133.26 కోట్ల మందిలో) 84.19 కోట్ల మంది వస్తారని తన తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొంది. -
ఎన్ఐఐటీ- ఎవరెడీ.. జోరు
ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 425 పాయింట్లు జంప్‌చేసి 38,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్, ఐటీ శిక్షణా సంస్థ ఎన్ఐఐటీ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎవరెడీ ఇండస్ట్రీస్ కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్స్‌ను ఇండియా రేటింగ్స్.. అప్‌గ్రేడ్ చేసిన వార్తలతో ఎవరెడీ ఇండస్ట్రీస్ కౌంటర్ జోరందుకుంది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 140 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్ధంలో రుణ భారాన్ని తగ్గించుకోవడం, లాభదాయకతను నిలుపుకోవడం వంటి అంశాలు ఎవరెడీ ఇండస్ట్రీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు దోహదం చేసినట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. దీంతో BB- రేటింగ్‌ను తాజాగా BB+కు పెంచినట్లు తెలియజేసింది. ఎన్ఐఐటీ లిమిటెడ్ ఇప్పటికే కంపెనీలో 1.87 శాతం వాటాను కలిగిన మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్(ఎంఐఐటీ) తాజాగా 2.12 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఎన్ఐఐటీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 102కు చేరింది. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. షేరుకి 96.75 ధరలో 30 లక్షల నిట్ షేర్లను ఎంఐఐటీ కొనుగోలు చేసింది. -
జీడీపీ వృద్ధి రేటు కోత!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మంగళవారం తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ►పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ, విద్యుత్ రంగాల పనితీరు పేలవంగా ఉంది. ►దివాలా చట్టం 2016 కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదిస్తున్న కేసుల విచారణ మందగమనంలో ఉంది. ఒకచోటు నిరర్థకంగా ఉండిపోయిన మూలధనాన్ని తిరిగి ఉత్పత్తి ప్రక్రియలోకి తీసుకురావడం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ అంశం కూడా వృద్ధితీరుపై ప్రభావం చూపే వీలుంది. ►పెట్టుబడుల వ్యయ వృద్ధి రేటు అంచనాలను 10.3% నుంచి 9.2%కి తగ్గించింది. ►వ్యవసాయ రంగం వృద్ధి అంచనాను 3 శాతం నుంచి 2.5 శాతానికి కుదించింది. 2018–19లో ఈ రేటు 2.7 శాతం. ►సేవల రంగం కొంత మెరుగైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. -
30 బిలియన్ డాలర్లు కావాలి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీకి ఇండియా రేటింగ్స్ గురువారం కీలక సూచనలు చేసింది. ఇందుకుగాను ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కనీసం 30 బిలియన్ డాలర్లను సమీకరించాలన్నది ఇండియా రేటింగ్స్ విశ్లేషణ. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో రూపాయి విలువను సగటున 69.79కి తీసుకుని రావచ్చని పేర్కొంది. 2013లో ఇలాంటి చర్యలే తీసుకున్న విషయాన్ని కూడా తన తాజా నివేదికలో ప్రస్తావించింది. రూపాయి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దాదాపు 8.3% పతనమైన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, రూపాయి విలువ 15 శాతం పతనమయింది. గడచిన ఆరు నెలల్లో పతనం 8.3 శాతంగా ఉంది. ఆరు నెలల్లో డాలర్ మారకంలో సగటు విలువ 68.57గా ఉంది. ఇతర దేశాల కరెన్సీలూ బలహీనమయినా, రూపాయి అంతకుమించి పతనమవడం గమనార్హం. ♦ దువ్వూరి సుబ్బారావు నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రఘురామ్ రాజన్ 2013లో అప్పట్లో రూపాయిని నిలబెట్టడానికి ఎన్ఆర్ఐల నుంచి 25 బిలియన్ డాలర్ల సమీకరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ♦ 2015–2019 మధ్య రూపాయి పతనం 3 శాతమే. 20 ఏళ్ల సగటు చూసినా (1999–2018) వార్షిక పతనం దాదాపు 3 శాతంగానే ఉంది. ♦ డాలర్ బలోపేతం, కమోడిటీ ధరలు ప్రత్యేకించి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, దీనితో దేశం నుంచి తరలుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ద్రవ్యలోటుపై ఆందోళనలు వంటి పలు అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. ♦ ఒక దేశ కరెన్సీ బలహీనపడితే, ఆ దేశ ఎగుమతులు పెరిగే అవకాశం ఉండటం సహజమే. అయితే రూపాయికన్నా ఎక్కువగా ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతుండటం వల్ల తాజా పరిస్థితి (రూపాయి పతనం) నుంచి భారత్ ప్రయోజనం పొందలేకపోతోంది. పైగా ముడి చమురు సహా కొన్ని ఉత్పత్తులను భారత్ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ♦ ఐదు నెలల తర్వాత మొదటిసారి సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా, –2.15 శాతం క్షీణత నమోదుకావడం మరో అంశం. ఇదే సమయంలో దిగుమతులు 10.45 శాతం (41.9 బిలియన్ డాలర్లు) పెరిగాయి. 73.27 వద్ద రూపాయి... డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 11 పైసలు బలహీనపడింది. 73.27 వద్ద ముగిసింది. విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్ వంటి అంశాలు ఫారెక్స్ మార్కెట్ల రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని డీలర్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత ఒడిదుడుకులతోసాగి బుధవారం 41పైసలు లాభంతో మూడు వారాల గరిష్టం 73.16కు చేరింది. ఆరేళ్ల గరిష్టానికి పసిడి పండుగలు, రూపాయి బలహీనత నేపథ్యం న్యూఢిల్లీ: పసిడి ధర ఇక్కడి స్పాట్ మార్కెట్లో ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. 99.99, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు రూ.125 చొప్పున పెరిగి, వరుసగా రూ. 32,625, రూ.32,475కు చేరాయి. 2012 నవంబర్ 29 తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. అప్పట్లో 99.99 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32.940ని తాకింది. మూడు రోజుల్లో న్యూఢిల్లీలో పసిడి దాదాపు రూ.405 పెరిగింది. ఒకపక్క పండుగల సీజన్, మరోవైపు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడి ధరను పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్‌కు (31.1గ్రా) 1,250 డాలర్లలోపు ఉన్నా, రూపాయి బలహీనతలు బంగారం దిగుమతులపై మరింత భారాన్ని పెంచుతోంది. ఈక్విటీల బలహీనతలు, డాలర్ ఇండెక్స్ బలోపేతంపై అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం ప్రారంభించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్తరాసే రాత్రి 10 గంటల సమాయానికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ ధర 1,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.31,911 వద్ద ట్రేడవుతోంది. -
మరో ఏడాది పాటు అధిక కేటాయింపులే
ముంబై: మొండిబాకీలకు 2019–20 ఆర్థిక సంవత్సరం దాకా బ్యాంకులు అధిక కేటాయింపులు కొనసాగించాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు 3 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది అర్ధ సంవత్సర అంచనాల నివేదికలో ఇండియా రేటింగ్స్ వివరించింది. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన మొండిబాకీలు, 2016 ఆర్థిక సంవత్సరంలో అసెట్ క్వాలిటీ సమీక్ష అనంతరం నాన్ కార్పొరేట్ ఖాతాల్లో పెరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల పరిస్థితి స్థిరంగా కొనసాగనుండగా.. మిగతా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా ఉండనుందని పేర్కొంది. కార్పొరేట్ రుణాల విభాగంలో ఒత్తిడి దాదాపు గరిష్ట స్థాయికి చేరగా .. నాన్–కార్పొరేట్ రుణాల్లో అసెట్ క్వాలిటీపరమైన ఒత్తిళ్లు క్రమంగా ఎగుస్తున్నాయని వివరించింది. -
పడిపోతున్న పొదుపు రేటు
ముంబై: పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమలు తదితర అంశాలతో దేశీయంగా పొదుపు రేటు గణనీయంగా తగ్గింది. ఇదే ధోరణి కొనసాగితే మొత్తం ఎకానమీ వృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి పెను సవాలుగా మారనుంది. రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2012–2017 మధ్య కాలంలో పొదుపు రేటు 23.6% నుంచి 16.3 శాతానికి పడిపోయింది. 2017 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు రేటు 153 బేసిస్ పాయింట్లు, ప్రైవేట్ కార్పొరేషన్లది 12 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. పొదుపులో సింహభాగం వాటా కుటుంబాలదే ఉంటున్నట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. లాభాపేక్ష లేని సంస్థలు, క్వాసీ–కార్పొరేట్ సంస్థల పొదుపు కూడా కుటుంబాల పొదుపులో భాగంగా పరిగణిస్తారు. -
భారత రేటింగ్ పెంచాల్సిందే
న్యూఢిల్లీ: భారత్ ఎన్నో నిర్మాణాత్మక, ప్రధాన ఆర్థిక సంస్కరణలు చేపట్టినందున రేటింగ్ పెంపునకు అర్హత ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ అన్నారు. వరుసగా 12వ ఏడాదీ భారత సార్వభౌమ రేటింగ్‌ను పెంచేందుకు ఫిచ్ నిరాకరిస్తూ బీబీబీను కొనసాగించిన నేపథ్యంలో గార్గ్ స్పందించారు. ఫిచ్ చర్య తమకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ విషయలో ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ రుణ భారం స్థాయిపైనే తాము దృష్టి సారించినట్టు ఫిచ్ పేర్కొనట్టు చెప్పారు. అయితే, ప్రభుత్వం రేటింగ్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలు, పనితీరు విషయంలో వాటికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగుతుందని గార్గ్ స్పష్టం చేశారు. జీఎస్టీ, ఐబీసీ, రెరా చట్టాలతోపాటు ఆర్థిక నేరస్థులకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాన్ని ఆయన గుర్తు చేశారు. -
బాగుంది... కానీ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–7.5 శాతం మేర ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను కార్పొరేట్లు స్వాగతించారు. నిలకడైన ఆర్థిక వృద్ధి సాధనకోసం మానవ వనరుల్ని, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. ‘రాబోయే సంవత్సరంలో వృద్ధి వేగం మెరుగుపడటానికి, ఆ తర్వాత నుంచి మరింతగా పుంజుకోవడానికి అవసరమైన కొత్త ఐడియాలను సర్వే ప్రస్తావించింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళల ఉపాధితో పాటు విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన మానవ వనరులను, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చడంపై మధ్య కాలికంగా మరింత దృష్టి సారించాలని సర్వేలో చేసిన సిఫార్సులు సహేతుకమైనవేనని ఆయన చెప్పారు. వీటిలో కొన్నింటినైనా బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోగలరని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్పీఏల పరిష్కారం కీలకం: అసోచామ్ మొండిబాకీల సమస్య పరిష్కారమయ్యే దాకా అధిక వృద్ధి సాధ్యపడకపోవచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ సందీప్ జజోడియా అభిప్రాయపడ్డారు. నిరర్ధక ఆస్తులపై పర్యవేక్షణ పెంచడం, బ్యాంకులకు సాధ్యమైనంత త్వరగా అదనపు మూలధనం సమకూర్చడం చేయాలన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు పెరుగుతుండటం వంటి ఆందోళనకర అంశాలను సర్వే ప్రస్తావించింది. ఉపాధి కల్పన, వ్యవసాయం, విద్యపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచించింది‘ అని సందీప్ తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ కట్టడిపై మరింతగా దృష్టి సారించాలని, సంస్కరణల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పారాయన. సేవల రంగంలో ఉద్యోగాలు పెరగాలి: డెలాయిట్ ఆటోమేషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో కాయకష్టం అవసరమయ్యే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతోందని డెలాయిట్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ అనీస్ చక్రవర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో సేవల రంగంలో మరిన్ని ఉద్యోగావకాశాల కల్పన జరగాల్సి ఉంటుందన్నారు. తయారీ రంగం వృద్ధి చెందుతుండటం సానుకూలాంశమని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్ (ఇన్ఫ్రా విభాగం) మనీష్ అగర్వాల్ పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్ పెరగడంతో పాటు సిమెంటు, ఉక్కు మొదలైన వాటి వినియోగం పెరుగుదలతో పారిశ్రామికోత్పత్తి మరింతగా మెరుగుపడగలదన్నారు. 2018–19లో వృద్ధి మెరుగుపడటం ఖాయమే అయినప్పటికీ.. ఇది సర్వేలో అంచనా వేస్తున్న శ్రేణిలో దిగువ స్థాయిలోనే ఉండొచ్చని (7 శాతం) ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. దేశ, విదేశీ పరిస్థితుల కారణంగా వృద్ధి ఎటువైపైనా మొగ్గు చూపవచ్చన్నారు. -
బ్యాంకులపై రూ.18,000 కోట్ల భారం
♦ 12 భారీ ఎన్పీఏలకే పక్కన పెట్టాల్సిన అవసరం ♦ 25 శాతం లాభాలకు గండి: ఇండియా రేటింగ్స్ ముంబై: ఆర్బీఐ గుర్తించిన భారీ రుణ ఎగవేత కేసుల రూపంలో దేశీయ బ్యాంకుల లాభదాయకత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం తగ్గిపోనుందని ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ పేర్కొంది. ఇటీవల ఆర్బీఐ 12 భారీ రుణ ఎగవేత కేసుల్లో ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. వీటి కోసం బ్యాంకులు అదనంగా రూ.18,000 కోట్ల నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుందని ఇండియా రేటింగ్స్ వివరించింది. ఈ 12 కేసుల్లో ఒకటైన ఎస్సార్ స్టీల్ ఆర్బీఐ ఆదేశాలను గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయగా... కోర్టు బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఖాతాలకు సగటు కేటాయింపులు 42 శాతంగా ఉండగా, ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో 50 శాతం చేయాల్సి ఉంటుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. అది ఈ ఆర్థిక సంవత్సరంలోనే నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. ఈ అదనపు కేటాయింపుల వల్ల నేరుగా బ్యాంకుల లాభంపై 25 శాతం మేర ప్రభావం పడుతుందని వివరించింది. ఆస్తుల రాబడులపైనా 0.12 శాతం ప్రభావం చూపిస్తుందని తెలిపింది. కొన్ని మధ్య స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకుల లాభ, నష్టాల ఖాతాలపై ఈ ఒత్తిడి అసాధారణంగా ఉంటుందని అంచనా వేసింది. పెద్ద స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులకు మెరుగైన మార్కెట్ విలువ, నిధులు పొందే సౌలభ్యం ఉందని, నాన్ కోర్ ఆస్తులను విక్రయించగలవని... చిన్న స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకులకు బెయిలవుట్ ప్యాకేజీ (ప్రభుత్వం నుంచి నిధుల సాయం) అవసరమవుతుందని నివేదికలో ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ప్రభుత్వరంగ ఎస్బీఐ ఎన్పీఏలకు అధిక కేటాయింపులు చేయాల్సి ఉంటుందని, అయినా లాభాలపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేయగా... ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంకు మాత్రం భారీ రుణ ఎగవేత కేసులకు సంబంధించి తగినంత నిధులు కేటాయింపులు చేయాల్సి ఉందని ప్రకటించింది. రుణాలపై అదనపు వివరాలు వెల్లడించాల్సిందే: సెబీ ఆస్తుల వర్గీకరణ మధ్య తేడా, నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్)కు సంబంధించి అదనపు వివరాలు వెల్ల డించాలని లిస్టెడ్ బ్యాంకులను సెబీ కోరింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా చేసే కేటాయింపులు లాభాల్లో 15 శాతం దాటితే బ్యాంకులు స్టాక్ ఎక్సేంజ్‌లకు ప్రత్యేకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెరిగిన స్థూల ఎన్‌పీఏల్లో ఆర్బీఐ గుర్తించిన స్థూల ఎన్పీఏలు 15 శాతం మించినాగానీ ఆ వివరాలను ఆర్థిక ఫలితాలతో పాటు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
బడ్జెట్లో ఉద్దీపనలకు అవకాశం
ఇండియా రేటింగ్స్ అంచనా • పెద్దనోట్ల రద్దుతో వృద్ధి పునరుద్ధరణకు సహాయక చర్యలు తప్పవని విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి మందగమనం, రికవరీ చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరం నేపథ్యంలో ఫిబ్రవరి1 బడ్జెట్లో సహాయక చర్యలు ప్రకటించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ బుధవారంనాడు అంచనావేసింది. ఒకపక్క ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండగా, మరోపక్క పెద్ద నోట్ల రద్దు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఈ ఫిచ్ గ్రూప్ అనుబంధ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. బడ్జెట్లో ఉద్దీపన చర్యలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. జీడీపీ 6.8 శాతమే! నివేదిక అంచనాల ప్రకారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 6.8 శాతానికి పడిపోతుంది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. ప్రస్తుత పరిస్థితి ప్రాతిపదికన చూస్తే– 2017–18 ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్థిక వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావం ఉండే వీలుంది. ముఖ్యంగా అసంఘటత రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. ఆర్థిక క్రియాశీలత తగ్గింది. ఉపాధి అవకాశాలపై ఈ ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్రాల వ్యయాలపైన సైతం స్వల్పకాలంలో డీమోనిటైజేషన్ ప్రభావం ఉంది. ఆయా అంశాలు బడ్జెట్లో ఉద్దీపన చర్యలకు దారితీస్తామని భావిస్తున్నాం. అయితే ఈ ఉద్దీపనలు వినియోగంవైపునగానీ లేదా పెట్టుబడుల రూపంలోగానీ ఉండే వీలుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలపై (2017–18లో జీడీపీలో 3 శాతం) కొంత రాజీపడాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అక్టోబర్–డిసెంబర్లలో వృద్ధి 6 శాతం: నోమురా కాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6%గా ఉంటుందని జపాన్ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ– నోమురా అంచనావేసింది. తదుపరి త్రైమాసికంలో ఇది మరింతగా 5.7 శాతానికి పడిపోతుందనీ విశ్లేషించింది. నోట్ల రద్దు కీలకమైన వినియోగం, సేవల రంగాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొంది. -
7న ఆర్ బీఐ రేట్ల కోత ఉండదు
ఇండియా రేటింగ్స్, హెచ్ఎస్బీసీ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్ 7వ తేదీన జరిపే ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించకపోవచ్చని ఇండియా రేటింగ్స్, హెచ్‌ఎస్‌బీసీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఇప్పటికే జరిగిన రేటు కోత ప్రయోజనం కస్టమర్‌కు బ్యాంకింగ్ అందించడం, అలాగే ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ రేటు కోత, యూరోజోన్‌లో (కొనసాగడంపై) బ్రిటన్ భవితవ్యం వంటి అంశాలు సమీక్షలో ప్రధానాంశాలు అవుతాయన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్ వ్యక్తం చేసింది. కాగా 7న రేటు కోత అవకాశాలను తోసిపుచ్చిన హెచ్ఎస్బీసీ,ఆగస్టులో పావుశాతం కోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని అంచనావేస్తున్న రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్‌స్టాన్లీ, జూన్ 7 ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా మాత్రం రేటు కోతకు అవకాశం ఉండదని తన అభిప్రాయపడుతోంది. -
ఖాతాదారులకంటే బ్యాంకులకే లాభం
వడ్డీ రేట్ల తగ్గింపు తీరుపై ఇండియా రేటింగ్స్ వ్యాఖ్య న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల కోత ప్రయోజనాలను ఖాతాదారులకు పూర్తి స్థాయిలో బదలాయించడానికి బ్యాంకులు ఇష్టపడటం లేదని, తమ సొంత ప్రయోజనాలకే దీన్ని ఉపయోగించుకుంటున్నాయని ఇండియా రేటింగ్స్ ఆక్షేపించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆర్బీఐ మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల మేర పాలసీ రేట్లను తగ్గించగా.. బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీ రేట్లను సగటున 50 బేసిస్ పాయింట్లే తగ్గించాయి. కానీ ఏడాది కాల వ్యవధి ఉండే డిపాజిట్ల రేట్లలో మాత్రం ఏకంగా 130 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టాయి. గృహ రుణాలపై ‘స్ప్రెడ్’ పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు: కాగా ఎస్బీఐ తరహాలోనే ఐసీఐసీఐ బ్యాంకు గృహ రుణాల రేట్లపై ‘స్ప్రెడ్’ను 0.10 శాతం మేర పెంచింది. ఇప్పటిదాకా 0.15 శాతంగా ఉన్న స్ప్రెడ్ .. ఇకపై 0.25 శాతంగా ఉండనుంది. దీని ప్రకారం బ్యాంకు బేస్ రేటు 9.35 శాతంగా ఉండగా.. రూ. 5 కోట్ల కన్నా తక్కువ రుణం తీసుకునే మహిళలు 9.60 శాతం, ఇతర వేతన జీవులు 9.65 శాతం వడ్డీ రేటు కట్టాల్సి ఉంటుంది. గతంలో ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటు 9.70 శాతంగా ఉన్నప్పుడు మహిళలకు 9.85 శాతానికి రుణం లభించేది. అంటే బేస్ రేటుపై 0.15 శాతం మాత్రమే అధికంగా వడ్డీ రేటు కట్టాల్సి వచ్చేది. తాజా మార్పు ప్రకారం బేస్ రేటుపై 25 శాతం ఎక్కువ కట్టాల్సి రానుంది. బ్యాంకు బేస్ రేటు, కొన్ని విభాగాల్లో అది వసూలు చేసే కనిష్ట వడ్డీ రేటు మధ్య వ్యత్యాసాన్ని స్ప్రెడ్‌గా వ్యవహరిస్తారు. సదరు విభాగంలోని రిస్కును బట్టి బ్యాంకు నిర్ణయిస్తుంది. స్ప్రెడ్‌ను పెంచడం వల్ల బ్యాంకులు తమ నికర వడ్డీ మార్జినల్ను కాపాడుకోవచ్చు. -
‘ఇంద్రధనుష్’ మంచి ప్రయత్నం
ఇండియా రేటింగ్స్ కితాబు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఇంద్రధనుష్’ సంస్కరణ అభినందనీయమని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ సంస్థ పేర్కొంది. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీలకు ఇచ్చిన రుణాల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆందోళనలు తప్పవని తెలిపింది. ఇంద్రధనుష్ కార్యక్రమం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం అందుతుందని, దీంతో పాలనా సంబంధిత అంశాలు మెరుగుపడతాయని, తద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని వివరించింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల గురించి వివరిస్తూ.. పెరిగిపోతున్న మొండిబకాయిల సమస్యల గురించి ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన నాణ్యత సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని పేర్కొంది. కార్పొరేట్లకు ఇచ్చిన రుణాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి బ్యాంకులకు రూ.లక్ష కోట్ల కావాల్సి ఉందని తెలిపింది.